
మహారాష్ట్ర ప్రమాదంలో జిల్లా యువకుడు..
తాంసి(బోథ్): మహారాష్ట్రలో జరిగిన ప్రమాదంలో జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భీంపూర్ మండలం జల్ కోరి పంచాయతీ పరిధిలోని లీంగూడకు చెందిన ఆత్రం రాము (18) సోమవారం సాయంత్రం తన మిత్రుడితో మహారాష్ట్రలోని పిప్పల్‌గావ్ బయలుదేరాడు. జరూర్ గ్రామ సమీపంలో కొందరు రోడ్డు పక్కన ఉన్న చెట్లను కొడుతుండగా కొమ్మలు వచ్చి యువకులు వెళ్తున్న బైక్‌పై పడ్డాయి. ఘటనలో రాముకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు రాజుకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రలోని మాండ్వి పోలీసులు కేసు నమోదు చేశారు.