
‘బెల్టు’ తీయరేమి?
● జిల్లాలో జోరుగా బెల్టుషాపుల నిర్వహణ ● ‘మహా’ సరిహద్దులో యథేచ్ఛగా దేశీదారు విక్రయాలు ● ‘మామూలు’గా వ్యవహరిస్తున్న ఎకై ్సజ్ శాఖ
ఆదిలాబాద్‌టౌన్: బెల్టు షాపులతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుపుతుండడంతో కూలీనాలి చేసేవారు వాటికి అలవాటుపడి విలు వైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ము ఖ్యంగా యువత మద్యం మత్తులో తూగుతున్నా రు. దీంతో గొడవలకు దారి తీస్తున్నాయి. ఇటీవల పలువురు హత్యలు, దాడులకు పాల్పడిన ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. తెల్లవారుజామునే బెల్టుషాపులు తెరుచుకుంటున్నాయి. అర్ధరాత్రి వరకు కొనసాగుతుండడంతో మద్యం బాబులు నిత్యం కిక్కులోనే ఉంటున్నారు. కొంద రు కిరాణ షాపులు, హోటళ్లు, పాన్‌షాపులు, ఇళ్లలో వీటిని నిర్వహిస్తున్నారు. ఎకై ్సజ్ అధికారులు నామమాత్ర తనిఖీలకే పరిమితమవుతుండడంతో వీరి వ్యాపారం మూడు బాటిళ్లు.. ఆరు బీర్లు అన్న చందంగా సాగుతుందనేవిమర్శలున్నాయి.
పుట్టపుగొడుగుల్లా బెల్టుషాపులు..
జిల్లాలో బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. గల్లీకొకటి చొప్పున దర్శనమిస్తున్నాయి. పల్లెల్లో వీడీసీల ద్వారా వేలం నిర్వహించి అనధికారికంగా విక్రయాలు చేపడుతున్నారు. బాటిల్‌కు రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
ఏరులైపారుతున్న దేశీదారు..
మహారాష్ట్ర సరిహద్దున గల గ్రామాల్లో వెలిసిన బె ల్టుషాపుల్లో దేశీదారు ఏరులై పారుతోంది. ఇటీవ ల ఎకై ్సజ్, పోలీసు అధికారులు వీటిపై దాడులు చేసి వందల సంఖ్యలో బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జైనథ్, బేల,భీంపూర్ తదితర మండలాల్లో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మహారాష్ట్రలో దేశీదారు బాటిల్ ధర రూ.80 ఉండగా, ఇక్కడ రూ.120 నుంచి రూ.140 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ద్విచక్ర వాహనాలు, కాలినడకన వీటిని రవాణా చేస్తున్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం..
నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉన్న వారు మాత్రమే మద్యం విక్రయించాలి. అయితే జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా చాలాచోట్ల బెల్టుషాపులు ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా విక్రయాలు సాగిస్తున్నారు. తక్కువ ధరకు లభించే మద్యంతో పాటు కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు తెలుస్తోంది. వీరికి ఆయా రాజకీయ పార్టీల నాయకుల అండదండలు ఉండడంతో సంబంధిత శాఖ అధికారులు సైతం ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. రాత్రి 10 తర్వాత ఎవరైనా మద్యం విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇటీవల దాబా హోటళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించాం. అలాగే డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం.
– అఖిల్ మహాజన్, ఎస్పీ

‘బెల్టు’ తీయరేమి?