
సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో మత్స్యలింగం
సాక్షి, పాడేరు: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వమయకర్తగా రేగం మత్స్యలింగంను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హుకుంపేట జెడ్పీటీసీ పనిచేస్తున్న ఆయన అరకు నియోజకవర్గంలోని బలమైన కొండదొర సామా జిక వర్గానికి చెందిన వారు. గిరిజన సంక్షేమశాఖలో ఉపాధ్యాయుడిగా, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన 2018లో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. గిరిజనుల సేవే లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా మత్స్యలింగం పేర్కొన్నారు.