
ఈదురు గాలులు... భారీ వర్షం
సాక్షి,పాడేరు: జిల్లాలో రోజూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12గంటల నుంచి గంటన్నర పాటు పాడేరులో భారీ వర్షం కురిసింది. కుండపోత వానతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులతో పాటు పిడుగుల శబ్దాలు మరింత భయపెట్టాయి.
ఇళ్ల పైకప్పు రేకులు ధ్వంసం
పెదబయలు: మండలంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విద్యుత్ వైర్లపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మారుమూల జామిగుడ పంచాయతీ పినరావెలి గ్రామంలో కిల్లో లక్ష్మి, మండి సావిత్రి ఇళ్ల పైకప్పులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మండి ప్రభుదాస్ ఇంటిపై కప్పు పాక్షికంగా దెబ్బతింది. దీంతో ఇంటి లోపల ఉన్న ధాన్యం, రాగులు, బియ్యం, దుస్తులు, ఇతర వంట సామగ్రి తడిసిపోయాయి. ప్రభుత్వం తమకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని బాధితులు కోరారు.

ఈదురు గాలులు... భారీ వర్షం

ఈదురు గాలులు... భారీ వర్షం