
పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు
రంపచోడవరం: పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న జీఎం వలస పంచాయతీ కార్యదర్శి కృష్ణప్రసాద్ తీరుపై మారేడుమిల్లి తహసీల్దార్ బాలాజీ ఫిర్యాదుతో నోటీసులు జారీ చేసినట్టు ఎంపీడీవో తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. ఏప్రిల్ 24న పంచాయతీ రాజ్ దివాస్ గ్రామసభ నిర్వహించలేదన్నారు. సర్పంచ్‌గా తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి ఏకపక్ష నిర్ణయాలతో పంచాయతీ అభివృద్ధి కుంటుపడుతుందని జీఎం వలస పంచాయతీ సర్పంచ్ కారం లక్ష్మి ఫిర్యాదు చేశారన్నారు.గతంలో బొడ్డగండి పంచాయతీ కార్యదర్శిగా నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలిపారు. దీనిపై శాఖ పరంగా చర్యలు తీసుకున్నా కార్యదర్శి ప్రవర్తనలో మార్పు లేదన్నారు. కార్యదర్శి పనితీరుపై పూర్తిస్థాయిలో నివేదికను కలెక్టర్ , పీవో, డీపీవోకు అందజేస్తామన్నారు.