Top Stories
ప్రధాన వార్తలు

గుండె గు‘బిల్లు’
‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం..! పైగా తగ్గిస్తాం..! నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసి ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పా?’ అంటూ మాట మార్చేశారు. ఎడాపెడా విద్యుత్ షాక్‌లిస్తున్నారు. ఎండలకు తాళలేక ఇంట్లో ఫ్యాన్ కింద సేదతీరుదామనుకుంటున్నారా..?కూలర్ దగ్గర కాసేపు చల్లగా గడుపుదామనుకుంటున్నారా..? కరెంట్ కోతలు.. ఉక్కపోత భరించలేక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నారా? కానీ మీరు ఏం చేసినా కరెంట్ షాక్‌లు మాత్రం ఖాయం..!!ఎందుకంటే.. అసలు కరెంట్ వాడకున్నా.. ఇళ్లకు తాళాలు వేసినా సరే.. కరెంట్ చార్జీలు మాత్రం చుర్రుమంటున్నాయి! మండుతున్న ఎండలతోపాటే బిల్లులూ భగ్గుమంటున్నాయి! టీడీపీ కూటమి సర్కారు కరెంట్ చార్జీల బాదుడే బాదుడు కొనసాగుతోంది!!సాక్షి, అమరావతి: ‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం..! పైగా తగ్గిస్తాం..! నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసి ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పా?’ అంటూ మాట మార్చేశారు. ఎడాపెడా విద్యుత్ షాక్‌లిస్తున్నారు. ఏడాది వ్యవధిలో పెరిగిపోయి భగ్గుమంటున్న బిల్లులే ఇందుకు నిదర్శనం. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.15,485.36 కోట్ల విద్యుత్తు భారాన్ని ప్రజలపై మోపారు. గతేడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల చార్జీల భారాన్ని వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్ల బాదుడు మొదలైంది. గతేడాదితో పోలిస్తే రెట్టింపు చార్జీలతో బిల్లులు జారీ అవుతున్నాయి. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండగా దానికి తోడు విద్యుత్ చార్జీలు పెంచడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాడుకున్న విద్యుత్తుకు, వస్తున్న బిల్లులకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఇదెక్కడి దారుణమని మండిపడుతున్నారు. చార్జీల భారం మోపని గత ప్రభుత్వం..వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలకు ఊరట కల్పించింది. వ్యవసాయ అవసరాలకు పెద్ద పీట వేస్తూ 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసింది. 6,663 వ్యవసాయ విద్యుత్తు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు వ్యయం చేసింది. గతంలో టీడీపీ సర్కారు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. వివిధ వర్గాల పేదలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందచేసింది. రాష్ట్రంలోని 2 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించేలా నాడు వైఎస్ జగన్ టారిఫ్ భారాలను సైతం భరించారు.పొంతన లేని బిల్లులుకర్నూలు జిల్లా కల్లూరు సెక్షన్ పరిధిలో నివసించే ఎస్.శిరీష ఈ ఏడాది ఫిబ్రవరిలో 125 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. ఈ లెక్కన ఆమెకు రావాల్సిన బిల్లు రూ.489.50 మాత్రమే. కానీ వచ్చిన బిల్లు మాత్రం ఏకంగా రూ.850. అంటే రూ.361 మేర కరెంట్ చార్జీ పెరిగింది.చిత్తూరుకి చెందిన జేజులరెడ్డి (సర్వీసు నంబర్ 3457) ఇంట్లో రెండు ఫ్యాన్లు, మూడు ట్యూబ్‌లైట్లు, టీవీ, కూలర్ ఉన్నాయి. కరెంట్ బిల్లులను పరిశీలిస్తే గతేడాదికి, ఇప్పటికి భారీ వ్యత్యాసం ఉంది. గతేడాది మార్చిలో 177 యూనిట్లకుగానూ ఆయనకు రూ.1,015 బిల్లు వచ్చింది. యూనిట్‌కు రూ.5.74 చార్జీ పడింది. ఈ ఏడాది మార్చిలో 563 యూనిట్లకు రూ.4,584 బిల్లు వేశారు. యూనిట్‌కు ఏకంగా రూ.8.14 వసూలు చేశారు. రూ.1,335.49 అదనంగా బిల్లు రావడంతో వినియోగదారుడు 39 శాతం అధిక భారం భరించాల్సి వచ్చింది.‘ఈ ఏడాది కరెంటు బిల్లులు భారీగా పెరిగాయి. గతేడాది జనవరిలో 124 యూనిట్లు వాడినందుకు రూ.657 బిల్లు వచ్చింది. అంటే యూనిట్ రూ.5.29 పడింది. అదే ఈ ఏడాది జనవరిలో 165 యూనిట్లు వాడినందుకు ఏకంగా రూ.1,271 బిల్లు కట్టమంటున్నారు. యూనిట్‌కు రూ.7.70 వసూలు చేస్తున్నారు. కరెంట్ చార్జీ ఏకంగా రూ.614 పెరిగింది.’ – ఎం.సిలార్, మచిలీపట్నం‘‘పదేళ్లుగా పిండి మిల్లు నిర్వహిస్తూ బతుకుతున్నాం. గత ఏడాది నవంబర్‌లో నెలకు రూ.4,881 మాత్రమే ఉన్న కరెంటు బిల్లు ఈ ఏడాది మార్చిలో ఒక్కసారిగా రూ.13,440 కు పెరిగింది. మేం అప్పుడు ఇప్పుడూ ఒకేలా వాడుతున్నాం. అయినా ఎందుకు అంతంత బిల్లు వస్తోందో అంతుబట్టడం లేదు. ఇలాగైతే పిండి మిల్లు మూతపడి మా కుటుంబం రోడ్డు పాలవుతుంది’’ –రేలంగి వెంకటలక్ష్మి, వికేరాయపురం, కాకినాడ జిల్లా.వాడకం తగ్గినా.. బిల్లు పెరిగిందిశ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉంటున్న సువ్వారి జగదీష్ ఇంటికి 2024 మార్చిలో 216 యూనిట్లకు గానూ రూ.1,108 బిల్లు వచ్చింది. అంటే యూనిట్‌కు రూ.5.12 పడింది. ఇదే వినియోగదారుడు ఈ ఏడాది మార్చిలో 171 యూనిట్లు వినియోగించారు. దాని ప్రకారం రూ.875.52 మాత్రమే బిల్లు రావాలి. వినియోగం తగ్గినప్పుడు సాధారణంగా బిల్లు కూడా తగ్గాలి. కానీ అందుకు భిన్నంగా బిల్లు పెరిగి రూ.1,286 వచ్చింది. గతేడాది ధర (టారిఫ్)ల్లో ఏ మార్పూ జరగలేదని, చార్జీలు పెంచలేదని కూటమి ప్రభుత్వం చెబుతున్నా కరెంటు బిల్లు మాత్రం భారీగా పెరిగింది.వాడకున్నా వాతలే..!‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న మసీదు జిలానీ గుంటూరు జిల్లా మేడికొండూరులోని ఇంటిలో కొద్ది నెలలుగా నివసించడం లేదు. కానీ 2 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ.182 చార్జీ పడింది. తాను అసలు విద్యుత్ వాడనే లేదని జిలానీ మొత్తుకుంటున్నారు.కొందరు సొంత ఇంటిని వదిలి కుటుంబంతో దూర ప్రాంతాల్లో గడుపుతుంటారు. ఖాళీగా ఉన్న ఇళ్లలో విద్యుత్ వినియోగం ఉండదు. అయినా సరే అలాంటి నివాసాలకు జీరో యూనిట్ కింద రూ.91 బిల్లు పంపుతున్నారు. విద్యుత్‌కు సైతం వడ్డన తప్పడం లేదు.మాట మార్చారు.. మాట తప్పారువిద్యుత్ చార్జీలపై ఎన్నికల ముందు ప్రతి చోటా మైకు పట్టుకుని చంద్రబాబు మాట్లాడిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన చేస్తున్న పనులకు పొంతన లేదు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదని,అవసరమైతే వినియోగదారులే విద్యుత్‌ను అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలకు అర్ధమే లేదు. అధికారం చేపట్టి ఐదు నెలలు కాకుండానే విద్యుత్ చార్జీలపై ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన రోజే ‘చార్జీలు పెంచమని నేనెప్పుడు చెప్పాను’ అంటూ మాట మార్చేశారు. తాజాగా దీపావళి కానుకగా రాష్ట్ర ప్రజలపై రూ.6072.86 కోట్ల భారం వేశారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు గతంలో విద్యుత్ చార్జీలపై మాట్లాడిన మాటల్లో మచ్చుక్కి కొన్ని..16 ఫిబ్రవరి 2023, పెద్దాపురం తమ్ముళ్లూ..ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారా లేదా. ఏవమ్మా ఆడబిడ్డలూ మీరు చెప్పండి. నేనున్నప్పుడు కరెంటు చార్జీలు పెంచానా? లోటు బడ్జెట్ ఉన్నా కరెంటు చార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 27 మే 2020,టీడీపీ మహానాడుకరెంటు చార్జీలు ఎవరూ కట్టే పరిస్థితిలేకపోతే కరెంటు చార్జీలు పెంచమని చెప్పాం. ఐదు సంవత్సరాలు కరెంటు చార్జీలు పెంచలేదు.టెక్నాలజీ ఉపయోగించాం. సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం.దానివల్ల రాబోయే రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందకు వెళితే మీరు(జగన్) పవర్ రేట్లు పెంచారు. రైతులకు కూడా కరెంటు చార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరం.19 మార్చి 2019, కడపకరెంటు కొరత 2004లో లేదు. 2014లో అది 22.5 మిలియన్ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. రెండు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు చార్జీలు పెంచమన్నాం. వ్యవసాయానికి 9 గంటలు కరెంటు ఇస్తున్నాం. ఇళ్లకు 24 గంటలు ఇస్తున్నాం. భవిష్యత్తులో ఎంత కావాలంటే అంత కరెంటు ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నా. 2 ఆగష్ట్ 2023, పులివెందులకరెంటు పెంచను, తగ్గిస్తా. ఇప్పటికి ఎనిమిది సార్లు కరెంటు చార్జీలను జగన్ పెంచారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో కరెంటు చార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీరే వినియోగించుకునే పరిస్థితి తీసుకువస్తా. గ్రిడ్‌కు కనెక్ట్ చేసి మిగులు విద్యుత్‌ను వినియోగదారులే అమ్ముకునేలా చేస్తా.

‘కంచ’లోనే లోపలేస్తాం!
సాక్షి, న్యూఢిల్లీ: ‘అభివృద్ధి పేరుతో మూడు రోజుల్లోనే వందల బుల్డోజర్లను ఉపయోగించి 100 ఎకరాల్లో చెట్లను తొలగించారు. చెట్ల నరికివేతను ఏ రకంగానూ సమర్ధించుకోవాలని చూడొద్దు. చెట్ల నరికివేతకు అసలు అనుమతులు తీసుకున్నారా లేదా? ఈ ప్రశ్నకు మాకు సూటిగా సమాధానం చెప్పండి. ఒకవేళ అనుమతులు తీసుకోకపోయి ఉంటే మాత్రం అందుకు బాధ్యులైన అధికారులందరినీ జైలుకు పంపుతాం. వారి కోసం అదే ప్రాంతంలో తాత్కాలిక జైలు నిర్మించి మరీ ఊచలు లెక్కబెట్టిస్తాం’అంటూ కంచ గచ్చిబౌలి భూముల కేసులో రాష్ట్ర ప్రభుత్వంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జ్ అగస్టీన్ మసీలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో 1996లో తామిచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులే బాధ్యులవుతారనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించింది. వంద ఎకరాల్లో అటవీ సంరక్షణ కోసం చట్టప్రకారం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ఆదేశించింది. తాము చేపట్టబోయే తీవ్ర చర్యల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఇతర కార్యదర్శులను కాపాడాలనుకుంటే 100 ఎకరాల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తేల్చిచెప్పింది. పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికతోనే మా ముందుకు రావాలని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సుమారు అరగంటపాటు సాగిన వాదనల అనంతరం కేసు విచారణను మే 15కు వాయిదా వేసింది. అప్పటివరకు స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపింది. చెట్ల తొలగింపుపై తమ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) సమర్పించిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల గడువు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, ‘బీ ద ఛేంజ్ వెల్ఫేర్ సొసైటీ’పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు, మరో పిటిషన్ తరఫున ఎస్.నిరంజన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అభివృద్ధి చేసేందుకే.. అంతకుముందు అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు ప్రారంభిస్తూ అన్ని అనుమతులతోనే ఆ భూముల్లో చెట్లను (పొదలు) తొలగించామన్నారు. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా అని ఈ సందర్భంగా ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది. తెలంగాణలో వాటర్ అండ్ ట్రీ (వాల్టా) యాక్ట్ ఉందంటూ అమికస్ క్యూరీ పరమేశ్వర్ జోక్యం చేసుకొని ధర్మాసనానికి వివరించగా ఈ చట్టం కింద అనుమతులు తీసుకోకుంటే అందరిపై చర్యలు తీసుకుంటామని ధర్మాసనం బదులిచ్చింది. ఆ భూములను రూ. 10 వేల కోట్లకు తనఖాపెట్టి ప్రభుత్వం అప్పు తెచ్చుకుందని అమికస్ క్యూరీ పేర్కొనగా ఆయన వ్యాఖ్యలను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘ఆ భూములను మార్టిగేజ్ చేశారా లేదా అమ్ముకున్నారా అనేది మాకు అనవసరం. అక్కడ చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా? లేదా అనేది మాత్రమే మాకు సూటిగా జవాబు చెప్పండి’అంటూ సింఘ్వీని ప్రశ్నించింది. ఆ ప్రాంతంలో కొన్ని షెడ్యూల్డ్ జంతువులు ఉన్నాయని.. అక్కడ పనులు జరిగేటప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని ‘బీ ద ఛేంజ్ వెల్ఫేర్ సొసైటీ ’తరుఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, మోహిత్‌రావులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో జేసీబీలు ఉన్నాయని చెప్పారు. హెచ్సీయూకు 25 వేల ఎకరాల భూమి ఉందని.. అందులో 400 ఎకరాల భూవివాదం 2004 నుంచి కొనసాగుతోందని సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. దీనికి సంబంధించి కోర్టు తీర్పులు, 20 ఏళ్లలో ఆ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. ఈ స్థలంలో ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మందికి జీవనోపాధి, ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు చెప్పారు. సీఎస్ ఒక మహిళ అని, ఆమె నెల రోజుల్లో రిటైరవనున్నారని సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. జేసీబీలు వచ్చిన విషయం సీఎస్‌కు తెలియదా? ఈ సందర్భంగా ధర్మాసనం మళ్లీ స్పందిస్తూ ‘మేం పదేపదే చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అని అడుగుతున్నాం. ఈ ప్రశ్నకు మాకు సూటిగా మీ సమాధానం కావాలి’అంటూ వ్యాఖ్యానించింది. ‘సీఎస్ నెల రోజుల్లో రిటైరవుతున్నారంటే ఎలా సింఘ్వీజీ? ఆ ప్రాంతంలో జేసీబీలు వచ్చిన విషయం సీఎస్‌కు తెలియదా? రాష్ట్రంలో జరుగుతున్న విషయాలకు సీఎస్ బాధ్యత వహించాలి కదా?’అంటూ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘అడవి అనే పదానికి నిర్వచనం ఇస్తూ 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా చెట్ల నరికివేత జరిగి ఉంటే మాత్రం మేం ఊపేక్షించం. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకోవాలనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అంటూ ధర్మాసనం నిలదీసింది. మహానగరాల్లో అటవీభూముల్లో కాపాడుకోకపోతే ఎలా? ‘చార్ధామ్ యాత్ర కోసం రోడ్డు నిర్మాణానికి చెట్లు తొలగిస్తామంటేనే మేం అనుమతించలేదు. మహారాష్ట్రలో సచివాలయ నిర్మాణం కోసం పర్యావరణానికి నష్టం కలిగించిన కేసు రెండు దశబ్దాలుగా సుప్రీంకోర్టులోనే పెండింగ్‌లో ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాల్లోని అటవీ భూముల్ని కూడా కాపాడుకోలేకపోతే ఎలా? అంటూ ప్రశ్నలు సంధించింది. మంత్రులు ఏది చెబితే అధికారులు అది చేసేస్తున్నారంటూ అమికస్ క్యూరీ పరమేశ్వర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా ‘పర్యావరణానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను జైళ్లకు పంపించాల్సి వస్తుంది జాగ్రత్త. చెట్లను కొట్టేసిన దగ్గరే తాత్కాలిక జైలు నిర్మిస్తాం. సంబంధిత అధికారులను అదే జైలులో 6 నెలలపాటు ఊచలు లెక్కబెట్టిస్తాం’అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారు? చెట్లు కొట్టేసిన ప్రాంతంలో పర్యావరణ పునరుద్ధరణ కోసం తీసుకున్న చర్యలేంటి? ఆ భూముల్లో వన్యప్రాణుల్ని ఎలా రక్షిస్తారు? అక్కడి నష్టాన్ని ఎలా పూడుస్తారు?’అంటూ సింఘ్వీపై ధర్మాసనం ప్రశ్నలవర్షం కురిపించింది. విధ్వంసం చేస్తే ప్రేక్షక పాత్ర పోషించాలా? ఆ ప్రాంతంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు సిద్ధపడిందని.. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నందునే ఆ ప్రాంతమంతా దట్టమైన పొదలతో అడవిలా తయారైందని సింఘ్వీ వాదించారు. ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసి ఎందరో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనుందని ధర్మాసనానికి చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘అభివృద్ధి, ఉద్యోగాల కల్పన పేరుతో మీరు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంటే మేం ప్రేక్షకపాత్ర పోషించాలా?. మీకు మీరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏమిటి? మూడు రోజుల్లో 100 ఎకరాలు ధ్వంసం చేశారంటే ఎన్ని బుల్డోజర్లు అక్కడ ఉన్నట్లు? మీరు సృష్టించిన రణరంగానికి అక్కడి జంతువులు ప్రాణభయంతో పరుగులు తీయగా వాటిని కుక్కలు కరిచాయి. ఆ వీడియోలను చూసి చలించిపోయాం’అని పేర్కొంది. అయితే ఆ భూముల్లో జంతువులు లేవని.. కావాలనే కొందరు నకిలీ వీడియోలు సర్క్యులేట్ చేశారని సింఘ్వీ బుదులివ్వగా ధర్మాసనం ఆక్షేపించింది. అక్కడ జంతువులు పరుగులు తీసిన వీడియోలను తాము చూసి చలించిపోయమని తెలిపింది. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని సింఘ్వీ ధర్మాసనానికి బదులిచ్చారు. దీనిపై తదుపరి విచారణను ధర్మాసనం మే 15కు వాయిదా వేసింది.

ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు సజావుగా సాగుతాయి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.చవితి ప.12.01 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: జ్యేష్ఠ తె.5.12 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి మూల, వర్జ్యం: ఉ.9.14 నుండి 10.58 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.45 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు,అమృత ఘడియలు: రా.7.30 నుండి 9.15 వరకు.సూర్యోదయం : 5.48సూర్యాస్తమయం : 6.11రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం... శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.వృషభం... కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.మిథునం.... మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.కర్కాటకం.... నిరుద్యోగులకు కీలక సమాచారం. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాల పరిష్కారం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు.సింహం.... పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు.కన్య.... బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. అనారోగ్య సూచనలు. దూరప్రయాణాలు. విచిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.తుల.... వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తిలాభం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు. ప్రముఖులతో పరిచయాలు..వృశ్చికం.... పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. అనారోగ్యం. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఆలయ దర్శనాలు.ధనుస్సు... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వస్తులాభాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. విందువినోదాలు.మకరం... చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువర్గంతో వివాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు కొంత గందరగోళం.కుంభం... పనులు చకచకా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.మీనం... భూవివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. కళాకారులకు పురస్కారాలు అందుతాయి.

గనులకై యుద్ధం
మధ్యభారత అరణ్యాలలో ఆదివాసుల మీద, ఆదివాసుల జల్, జంగల్, జమీన్, ఇజ్జత్ పోరాటానికి మద్దతు ఇస్తున్న మావోయిస్టుల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి గట్టడం, ఆ ప్రాంతంలోని అపారమైన, సంపన్నమైన ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే వ్యూహంలో భాగమే అని దాదాపు ఇరవై సంవత్సరాలుగా పరిశీలకులు, విమర్శకులు ఎందరో రాస్తున్నారు. సల్వా జుడుం పేరుతో 2005లో పాలకులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిన ఆదివాసుల మధ్య అంతర్యుద్ధం నుంచి, ఇప్పుడు 2026 మార్చ్ 31 నాటికి మావోయిస్టు రహిత ఛత్తీస్‌గఢ్ తయారు చేస్తామని ముహూర్తం నిర్ణయించి మరీ సాగిస్తున్న ఆపరేషన్ కగార్ దాకా మధ్య భారత అరణ్యాలలో చాలా నెత్తురు ప్రవహించింది. చివరి యుద్ధం అని చెప్పుకొంటున్న ప్రస్తుత దశ మొదలైన 2024 జనవరి 1 నుంచి గడచిన పద హారు నెలల్లో 400 మందికి పైగా ఆదివాసులను, మావోయిస్టులను భద్రతా బలగాలు చంపివేశాయి.ఖనిజ వనరుల కోసమే!ఈ మారణకాండ అంతా ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేసి, స్వస్థలాల నుంచి వారిని నిర్వాసితులను చేసి, వారి కాళ్లకింది నేలలో నిక్షిప్తమైన సంపన్న ఖనిజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టడానికే అని విమర్శకులు చేస్తున్న అభియోగం నిజమేనని చూపే పరిణామాలు జరుగు తున్నాయి. కార్పొరేట్ సంస్థల రక్షణ కోసం లెక్కలేనన్ని భద్రతా బలగాల క్యాంపులు నిర్మాణమవుతున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర్ సీమా బల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి సరిహద్దులను రక్షించవలసిన బలగాలు ఇప్పుడు మధ్య భారతంలో ఉన్నాయి. ఆ బలగాలను తీసుకుపోవడానికీ, తవ్విన ఖనిజాన్ని బైటికి తీసుకురావడానికీ నాలుగు లైన్ల, ఆరు లైన్ల రహదారుల నిర్మాణం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వేగంగా జరిగిపోతున్నది. ఈ ‘అభివృద్ధి’ కార్యక్ర మానికి అడ్డు వస్తారనే అనుమానం ఉన్నవాళ్ల మీదికి డ్రోన్లతో నిఘా, వైమానిక బాంబు దాడులు, వేలాది కాల్బలాలతో జల్లెడ పట్టి, చుట్టుముట్టి, ఎటువంటి ప్రతిఘటన లేకపోయినా కాల్చి చంపి ఎదురుకాల్పుల కథనాలు విడుదల చేయడం జరుగు తున్నది.ఆ వరుసలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న అత్యుత్తమ స్థాయి ఇనుప ఖనిజం (హెమటైట్) గనులను వేలం వేయడానికి శరవేగంతో ప్రయత్నిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖనిజ వనరుల శాఖ 2025 జనవరి 15న సరిగ్గా ఈ హత్యాకాండల వార్తలు వస్తున్న దంతెవాడ, కాంకేర్ జిల్లాలలోని ఇనుప ఖనిజం గనుల బ్లాకులు నాలుగింటిని వేలం వేసే ప్రక్రియ ప్రారంభించింది. వీటిలో బైలదిల్లా గనులుగా ప్రఖ్యాతమైన ఖనిజ వనరుల కొండలు దంతెవాడ జిల్లా కిరండుల్ నుంచి బీజాపూర్ జిల్లా గంగలూరు దాకా వ్యాపించి ఉన్నాయి. బైలదిల్లా డిపాజిట్ 1ఎ, 1బి, 1సి, కాంకేర్ జిల్లాలోని హాహాలొద్ది అనే ఈ నాలుగు బ్లాకుల వేలం ప్రక్రియ ఫిబ్రవరి 28 దాకా సాగి, 58 ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీ పడ్డాయి. చివరికి మూడు గనులను ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియా, ఒక గనిని రూంగ్టా స్టీల్ దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు కూడా ప్రభుత్వ వేలంపాటలో ప్రతిపాదించిన కనీస ధర కన్నా 154 శాతం, 160 శాతం ఎక్కువకు పాడు కున్నాయంటే, అక్కడ వారికి ఎంత లాభం చేకూరే అవకాశం ఉందో ఊహించవచ్చు. ఈ గనుల లీజు యాభై సంవత్సరాల పాటు ఉంటుంది గనుక ఇది రేపో మాపో వట్టిపోయే ఆవు కూడా కాదు, కామధేనువు! ఇప్పటివరకూ బైలదిల్లా గనుల్లోకి ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) తప్ప ప్రైవేటు కంపెనీలు ప్రవేశించలేదు. ఇప్పటివరకూ ఆర్సెలార్ మిత్తల్ తనకు అవసరమైన ఖనిజాన్ని ఎన్ఎండీసీ నుంచి తీసుకుని పైప్ లైన్ ద్వారా విశాఖపట్నం పంపుతుండేది. ఇప్పుడీ వేలంతో ఆ కంపెనీకి సొంత గనులు వచ్చాయి. వీటిలో బైలదిల్లా 1ఎ, 1బి ఒక్కొక్కటీ 2,100 ఎకరాలు, 1సి 1,976 ఎకరాలు, హాహాలొద్ది 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ నాలుగు బ్లాకులతోనే దట్టమైన దండకారణ్యంలో దాదాపు ఏడు వేల ఎకరాల అడవి నేలమట్టమైపోయి ‘అభివృద్ధి’ జరగబోతున్నది. ఈ నాలుగు బ్లాకులూ కలిసి దాదాపు ముపై్ఫ కోట్ల టన్నుల ఉత్తమశ్రేణి ఖనిజం తవ్వబోతున్నారు. ఇటువంటి లెక్కలలో తాము కాగితాల మీద పొందినదానికన్న ఎక్కువ విస్తీర్ణపు గనులు తవ్వి, మరింత ఎక్కువ ఖనిజాన్ని దోచుకుపోవడం అందరికీ తెలిసిందే. వేలం ప్రక్రియలో చెప్పిన మేరకే తవ్వుతారని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారమే ఈ నాలుగు గనుల ఖనిజం విలువ ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు. కాగా, ప్రభుత్వానికి దక్కే ఆదాయం ఇరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే! ఈ రాష్ట్రంలో ఇంతకుముందే ఎన్ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వ ఛత్తీస్‌గఢ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సీఎండీసీ)తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పరచి, గనులకు పర్యావరణ అనుమతులు సంపాదించి, ఆ గనులను తవ్వకం, ఖనిజాభివృద్ధి కార్యకలాపాలకు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు ఇచ్చింది. ఖనిజ సంపన్నమైన ఈ రాష్ట్రంలో ఇప్పటికే అంబుజా, బిర్లా, ఎస్సార్, జిందాల్, జె కె లక్ష్మి, లఫార్జ్, ఎల్ అండ్ టి, వేదాంత వంటి కార్పొరేట్ దిగ్గజాలన్నీ ఉన్నాయి. ఇది పలు రకాల సమస్యఇది ఆదివాసులకో, మావోయిస్టులకో సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది ముహూర్తాలు నిర్ణయించి మనుషులను చంపవచ్చునా అనే మానవతా సమస్య, నాగరికతా సమస్య. పర్యావరణ సమస్య, దేశ సంపద ఎవరికి చెందాలనే సమస్య, అటవీ హక్కుల చట్టం, పంచాయత్ రాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం వంటి చట్టాల ఉల్లంఘన సమస్య. రాజ్యాంగ ఆదర్శాలు, ప్రజల హక్కులు అమలవుతున్నాయా అనే సమస్య. మనందరి సమస్య!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్

హార్వర్డ్ ప్రతిఘటనా స్వరం!
అంతటా ఒక అనిశ్చితి, దాన్ని మించిన సందిగ్ధత అలముకున్నవేళ నిశ్చయంగా, నిర్భయంగా వినబడిన గొంతు ఇప్పుడు అమెరికాలో సర్వత్రా ప్రతిధ్వనిస్తోంది. ఆ గొంతు ప్రపంచంలోనే అత్యుత్తమశ్రేణి విద్యాసంస్థల్లో ఒకటైన హార్వర్డ్ విశ్వవిద్యాలయానిది. ఆ విశ్వవిద్యాలయం ఇంతవరకూ లక్షలాది విద్యార్థులకు పాఠం చెప్పివుండొచ్చు. కానీ తనతో ఏకీభవించనివారిని ససేమిరా సహించని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వంటి నేతకు పాఠం నేర్పాలని చూస్తే భారీ మూల్యం చెల్లించాల్సివుంటుంది. అది తెలిసి కూడా హార్వర్డ్ దృఢంగా నిలబడటం ఈ కాలంలో అతి పెద్ద వార్త. పాలస్తీనా అనుకూల ఉద్యమకారుల్ని పట్టించి ఇవ్వాలనీ... వైవిధ్యత, సమానత, సమ్మిళిత (డీఈఐ) విధానాల ద్వారా ‘అందరికీ అవకాశాలిచ్చే’ పేరిట ప్రతిభపై వివక్ష ప్రదర్శిస్తున్న వైఖరి విడనాడాలనీ ట్రంప్ కొంతకాలంగా హెచ్చరిస్తున్నారు. ఒప్పుకోకుంటే నిధులు ఆపేస్తామని హుకుం జారీచేశారు. దేశంలోని 60 ప్రధాన విశ్వవిద్యాలయాల్లో చాలా భాగం ఆయన ఆదేశాలకు తలొంచాయి. కానీ హార్వర్డ్ నిర్భయంగా నిలబడింది. ‘మా వ్యవహారాల్లో మీకేం పన’ని ఎదురు ప్రశ్నించింది. వర్త మాన పరిస్థితుల్లో ఈ చర్య చిన్నదేం కాదు. మొన్న జనవరిలో అధికార పగ్గాలు చేపట్టింది మొదలు ట్రంప్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కోర్టులనే ధిక్కరిస్తున్నారు. అక్రమ వలసదారుగా పొర బడి, ఒక పౌరుడిని ఎల్‌సాల్వెడార్ జైలుకు పంపిన వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. పొరబడ్డా మని ఒప్పుకుంటూనే అతన్ని వెనక్కితేలేమని కోర్టులో ప్రభుత్వం మొండికేసింది. ఆరు నూరైనా తేవాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించగా మౌనమే జవాబైంది. మర్నాడు అమెరికా సందర్శించిన ఎల్‌సాల్వెడార్ అధ్యక్షుడు ‘అతన్ని అప్పగించేది లేద’ంటూ సాక్షాత్తూ వైట్‌హౌస్‌లో ప్రకటించారు.విశ్వవిద్యాలయాలు కళాశాలల కన్నా భిన్నమైనవి. అవి ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తాయి. కొత్త ఆలోచనల్ని స్వాగతిస్తాయి. భిన్న ధోరణులపై పరిశోధనకు అవకాశమిస్తాయి. అందుకే అవి జ్ఞానకేంద్రాలు. ఎంతమందికి పట్టాలు పంపిణీ చేశామన్నది కాక, ఎటువంటి విశిష్ట వ్యక్తులను సమాజానికి అందించగలిగామన్నది లెక్కేస్తాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా సర్కారు విశ్వ విద్యాలయ పరిశోధనలకూ, సృజనాత్మక ఆవిష్కరణలకూ భారీయెత్తున ఖర్చుచేసింది. ఫలితంగా అపారసంఖ్యలో ఆవిష్కరణలు సాధ్యమయ్యాయి. అనేక కొత్త ఉపకరణాలు అందుబాటులో కొచ్చాయి. చికిత్సకు లొంగని ఎన్నో వ్యాధులు చిత్తగించాయి. ఆయుఃప్రమాణం పెరిగింది. కంప్యూ టర్లు మొదలుకొని రోబోటిక్స్, కృత్రిమ మేధ వరకూ అన్నిటికన్నీ కేవలం ఈ పరిశోధనల పర్యవసానమే. లైబ్రరీలు, లేబొరేటరీలు దాటుకుని పరిశ్రమల్లో పురుడు పోసుకున్న ఉత్పత్తులు ఎన్నెన్నో! వాటివల్ల అసంఖ్యాకంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. పర్యవసానంగా ఇదంతా సమాజ ఆధునికతకు తోడ్పడింది. గత నెలలో విడుదలైన ఒక నివేదిక ప్రకారం జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ఐహెచ్) నిరుడు పరిశోధనలకు వ్యయం చేసిన 3,690 కోట్ల డాలర్ల సొమ్ము 9,450 కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పడింది. సరుకుల తయారీ, పంపిణీ, వినియోగం, ఇతర అనుబంధ సర్వీసులు ఈ కార్యకలాపాల్లో భాగం. 4,08,000 ఉద్యోగాల కల్పన సాధ్యమైంది.కానీ ట్రంప్ సర్కారు దీన్ని అంగీకరించటం లేదు. అవి ఏం చేయాలో, చేయకూడదో నిర్దేశిస్తున్నారు. సాష్టాంగపడమంటున్నారు. అందుకు సిద్ధపడినా కనికరించటంలేదు. పేరుప్రఖ్యాతులున్న కొలంబియా విశ్వవిద్యాలయ దుఃస్థితే అందుకు ఉదాహరణ. ఆ క్యాంపస్‌లో కొంతకాలం క్రితం జరిగిన పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులను గుర్తించి, వారి అరెస్టుకు సహకరించాలనటంతో మొదలుపెట్టి ప్రభుత్వం అనేక డిమాండ్లు పెట్టింది. మూడు డజన్లమంది ‘ప్రత్యేక అధికారుల’ను తక్షణం నియమించడం అందులో ఒకటి. ఆ ప్రత్యేకాధికారులకు పాలస్తీనా అను కూల విద్యార్థులను గుర్తించి అవసరమైనప్పుడు అరెస్టుచేసే అధికారాలున్నాయి. విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ అధ్యయనాల విభాగాన్ని పర్యవేక్షించే అధిపతిని నియమించాలన్న ప్రభుత్వ తాఖీ దును సైతం ఆమోదించింది. ఆ విభాగం సిలబస్‌ను నిశితంగా పరిశీలించి మార్పులు చేర్పులూ సూచిస్తుంది. ఇన్ని చేసినా ఆ విశ్వవిద్యాలయానికి విడుదల చేయాల్సిన 40 కోట్ల డాలర్ల నిధులనూ నిలిపివేసింది. విశ్వవిద్యాలయ తాత్కాలిక అధ్యక్షురాలు కత్రినా ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. తాను తీసుకుంటున్న చర్యలను నిరసించిన విశ్వ విద్యాలయ ఆచార్యులకు ఇవి చిన్న చిన్న సర్దుబాట్లు మాత్రమేనని కత్రినా వివరించారు. అయినా నిధుల విడుదల జాడ లేకపోవటంతో కొలంబియా యాజమాన్యం ఆమెకు ఉద్వాసన పలికింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం సంగతికే వస్తే, తిరుగుబాటుకు తక్షణ మూల్యం 220 కోట్ల డాలర్ల గ్రాంటు, 6 కోట్ల డాలర్ల కాంట్రాక్టులు నిలిచిపోవటం. ఇవిగాక పన్ను మినహాయింపులు కూడా ఆపేస్తామని సర్కారు బెదిరిస్తోంది. నిజానికి మొదటే ప్రధాన యూనివర్సిటీలన్నీ ప్రభుత్వ బెదిరింపులను ముక్తకంఠంతో నిరసించాల్సింది. కానీ ఇప్పటికి కూడా ఎవరికి వారు ట్రంప్ కంట్లో పడకుంటే చాలన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ చాలా సంస్థలు గోడమీది పిల్లివాటంగా ఉంటున్నాయి. విశ్వవిద్యాలయాలపై సర్కారువారి సంపూర్ణ పెత్తనాన్ని అంగీకరించాలన్నది ట్రంప్ ఆంతర్యం. యూదు వ్యతిరేకత, వివక్ష విధానాల అమలు వంటి ఆరోపణలన్నీ పైకి చెబుతున్న కారణాలు. దీన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అమెరికా విశ్వవిద్యాలయాలకు అంత మంచిది. ఇన్నాళ్లూ తాము బోధించిన విలువల కోసం నిలబడితేనే వాటి గౌరవమర్యాదలు కాస్తయినా నిలబడతాయి.

ఆ వ్యాపారవేత్తతో జాగ్రత్త!
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై మరోసారి నీలినీడలు కమ్ముకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లుగా సాగుతున్న లీగ్ 18వ సీజన్లో ఫిక్సింగ్ జరిగే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఐపీఎల్ ఆడుతున్న ప్లేయర్లు, జట్ల యజమానులు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లకు బీసీసీఐ కీలక సూచనలు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్లో ఫిక్సింగ్ జరిగే ఆస్కారముందని లీగ్ తో సంబంధం ఉన్న వారందరికీ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ బడా వ్యాపార వేత్త దీనికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. అలాంటి ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని బీసీసీఐ అవినీతి నిరోధక భద్రతా విభాగం (ఏసీఎస్‌యూ) సూచించింది. ఆటగా ళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, జట్టు యజమానులు, వ్యాఖ్యాతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్లేయర్లతో పాటు వారి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతూ వారికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం ద్వారా వారిని ఆకర్షించుకునే ప్రయత్నాలు జరగొచ్చని ఏసీఎస్‌యూ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వ్యా పారవేత్తకు బుకీలు, పంటర్లతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని కూడా సమాచారం. అతడు గతంలోనూ ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడని... ఈనేపథ్యంలో ఐపీఎల్‌తో ప్రత్య క్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ఏసీఎస్‌యూ హెచ్చరించింది. ఎవరైనా ఖరీదైన బహుమతులు, నగలు ఇవ్వజూపితే తమకు తెలియ పరచాలని స్పష్టం చేసింది. అభిమానిగా నటిస్తూ తరచూ ఆటగాళ్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం అతడికి అలవాటని... అది వీలు పడకపోతే ప్లేయర్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువుల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తాడని బీసీసీఐ హెచ్చరించింది. విదేశాల్లో ఉండే వారిని సైతం దీనికోసం సంప్రదిస్తాడని.. సామాజిక మాధ్యమాల్లోనో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కూల్చే కుట్ర కేసీఆర్‌దే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ఆలోచన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌దేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి నోటి వెంట వచ్చినవి కేసీఆర్ మనసులోని మాటలేనని ఆరోపించారు. రూ.5–6 వేల కోట్లు ఖర్చు చేసైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా ఆ చట్టం తీరుతెన్నులు, రెవెన్యూ శాఖలో చేపడుతున్న సంస్కరణలు, రాష్ట్ర రాజకీయాలపై బుధవారం ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భూభారతి చట్టంపై బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు వారికి ఉరితాడు అయింది ధరణినే. అది గ్రహించకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. వారికి గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు కూడా ఈసారి రావు. 15 నెలలకే ప్రభుత్వాన్ని కూలుస్తామని కొందరి ఆత్మలు మాట్లాడుతున్నాయి. కేసీఆర్ మనసులోని మాటలనే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. రూ.5–6 వేల కోట్లు ఖర్చుపెట్టి అయినా ఎమ్మెల్యేలను కొనాలని అనుకుంటున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు తనకు కావాల్సిన బిల్డర్లకు వేలాది ఎకరాలు కట్టబెట్టారు. ఇప్పుడు వారంతా భయభ్రాంతులకు గురై, ఫామ్‌హౌస్‌కు వెళ్లి మాజీ సీఎంకు మొరపెట్టుకున్న మాటలను ప్రభాకర్‌రెడ్డితో చెప్పించారు. ప్రభుత్వ భూములను చెరపట్టిన వారు ఏడేడు లోకాల ఆవల ఉన్నా వదిలిపెట్టం. ప్రతి ఇంచు భూమిని బరాబర్ తీసుకుని పేదలకిస్తాం. మాజీ సీఎం, ఆయన కొడుకు, అల్లుడు, కూతురు వేసే స్కెచ్‌లు, కుట్రలకు ఎలా చెక్‌పెట్టాలో కాంగ్రెస్ పార్టీ పులులకు తెలుసు. సమయం వచ్చినప్పుడు ఆ పులులు స్పందిస్తాయి’ అని స్పష్టంచేశారు.కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని, కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపారు. ‘పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు వేస్తారు. మేం మంచిగా పనిచేస్తున్నందుకే కంచ గచ్చిబౌలిపై మోదీ కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. నేటి నుంచే భూ సమస్యల పరిష్కారంరాష్ట్ర ప్రజల కోరిక మేరకే ధరణిని బంగాళాఖాతంలో కలిపేశా మని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. జూన్ 2వ తేదీ నాటికి వ్యవసాయ భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో వీలైనన్ని పరిష్కరిస్తా మని వెల్లడించారు. భూభారతి చట్టం ద్వారా వ్యవసాయ భూముల సమస్యలను పరిష్కరించే పనిని గురువారం నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ‘పైలెట్ ప్రాజెక్టుగా లింగంపేట, నేలకొండపల్లి, మద్దూరు, వెంకటాపూర్ మండలాలను ఎంచుకున్నాం. ఈ మండలాల్లోని అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తాం. ఈ సదస్సుల్లో రైతుల నుంచి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తాం. ఈ దరఖాస్తు ఫార్మాట్‌ను ఇప్పటికే క్షేత్రస్థాయికి పంపాం. ప్రతి గ్రామంలో తహసీల్దార్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం పర్యటించి, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సదస్సులు నిర్వహిస్తుంది. స్వీకరించిన దరఖాస్తులను వెంటనే కంప్యూటరైజ్ చేస్తాం. ఈ నెలాఖరుకల్లా ఆ 4 మండలాల్లోని అన్ని గ్రామాల్లో సదస్సులు పూర్తవుతాయి. ఆ 4 మండలాలతోపాటు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు రైతులతో సదస్సులు నిర్వహిస్తారు. అక్కడ కూడా దరఖాస్తులు తీసుకుంటాం. మే మొదటివారంలో 28 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని మోడల్‌గా తీసుకుని, ఆయా మండలాల్లోని అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహించి, రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. జూన్ 2వ తేదీకల్లా అన్ని జిల్లాల్లో వీలైనన్ని ఎక్కువ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం. ఈ సదస్సుల ద్వారా పెండింగ్‌లో ఉన్న 9.6 లక్షల సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం కూడా జరుగుతుంది. ప్రభుత్వ భూములను ఆక్రమించిన పేదలను గుర్తించి వారికి పట్టాలిస్తాం. జూన్ 2న సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఈ పట్టాల పంపిణీ జరుగుతుంది. జూన్ 2 తర్వాత రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది’ అని మంత్రి పొంగులేటి వెల్లడించారు.జీపీఓలు వచ్చాకే సర్వేమ్యాప్లురాష్ట్రంలో గ్రామ పాలనాధికారులను నియమించిన తర్వాతే సర్వే మ్యాప్‌లను అమల్లోకి తెస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆ భూమి హద్దులతో కూడిన సర్వేమ్యాప్ కూడా అందించాలన్న నిబంధనను ఇప్పటికిప్పుడు అమల్లోకి తెచ్చే ఉద్దేశం లేదు. రాష్ట్రంలోని 10,956 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలనాధికారులు (జీపీఓ) వస్తారు. 6 వేల మంది లైసెన్సుడ్ సర్వేయర్లు కూడా వస్తారు. ఆ తర్వాత సర్వే మ్యాప్ నిబంధన ప్రారంభమవుతుంది. ఈలోపు రైతులు ఎవరైనా స్వచ్ఛందంగా కోరుకుంటే వారి పాస్‌పుస్తకంలో సర్వే మ్యాప్ ముద్రిస్తాం. కర్ణాటకలో 9 ఏళ్లుగా ఈ సర్వే మ్యాప్ నిబంధన అమలవుతోంది. ఇప్పటివరకు 75 శాతం భూములకు మ్యాప్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలో అంతకంటే తక్కువ సమయంలో ఎక్కువ భూములకు సర్వే మ్యాప్‌లు వస్తాయి. జీపీఓల నియామకం విషయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు. ఏం చేసినా ప్రజల సౌలభ్యం కోసమే. వ్యవస్థ కోసం అందరూ సహకరించాలి. పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు గూగుల్ ఫామ్ ద్వారా ఆప్షన్లు ఇచ్చే గడువును పొడిగిస్తున్నాం’ అని ప్రకటించారు.కొత్త పోర్టల్ తెస్తాంఇప్పుడు తెచ్చిన భూభారతి పోర్టల్ తాత్కాలికమేనని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘భూ సమస్యల శాశ్వత పరిష్కారం ఈ పోర్టల్‌తో కాదు. అందుకే శాశ్వత పోర్టల్‌ను తీసుకురాబోతున్నాం. మరో వందేళ్ల పాటు భూభారతి పోర్టల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. త్వరలోనే టెండర్లు పిలుస్తాం. కొత్త పోర్టల్ తయారీకి 7–9 నెలలు పడుతుంది. ఈ ఏడాది చివరికి లేదంటే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది’ అని తెలిపారు.

ఢిల్లీ ‘సూపర్’ విక్టరీ
న్యూఢిల్లీ: ఉత్కంఠ ఊపేసిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఆధిక్యం చేతులు మారుతూ చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్... ఆఖరికి ‘సూపర్ ఓవర్’కు వెళ్లగా... అందులోనూ ఆకట్టుకున్న క్యాపిటల్స్ ఐపీఎల్ 18వ సీజన్లో ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై తొలి విజయం సాధించిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకుంది. బుధవారం జరిగిన ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ (37 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... కేఎల్ రాహుల్ (38; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు సరిగ్గా 188 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), నితీశ్ రాణా (28 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించగా... సామ్సన్ (19 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఆఖర్లో తీవ్ర ఒత్తిడిలో ధ్రువ్ జురెల్ (17 బంతుల్లో 26; 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (15 నాటౌట్; 1 ఫోర్) మెరుగైన ప్రదర్శన కనబర్చారు. స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు. స్కోరు వివరాలు: ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెక్‌గుర్క్ (సి) జైస్వాల్ (బి) ఆర్చర్ 9; పొరెల్ (సి) పరాగ్ (బి) హసరంగ 49; కరుణ్ (రనౌట్) 0; రాహుల్ (సి) హెట్‌మైర్ (బి) ఆర్చర్ 38; స్టబ్స్ (నాటౌట్) 34; అక్షర్ (సి) జురెల్ (బి) తీక్షణ 34; అశుతోష్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–34, 2–34, 3–97, 4–105, 5–146. బౌలింగ్: ఆర్చర్ 4–0–32–2; తుషార్ 3–0–38–0; సందీప్ 4–0–33–0; తీక్షణ 4–0–40–1; హసరంగ 4–0–38–1; పరాగ్ 1–0–6–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్టార్క్ (బి) కుల్దీప్ 51; సామ్సన్ (రిటైర్డ్ హర్ట్) 31; పరాగ్ (బి) అక్షర్ 8; నితీశ్ రాణా (ఎల్బీ) స్టార్క్ 51; జురేల్ (రనౌట్) 26; హెట్‌మైర్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–76, 2–112, 3–161, 4–188. బౌలింగ్: స్టార్క్ 4–0–36–1; ముకేశ్ 3–0–31–0; మోహిత్ 4–0– 38–0; విప్రాజ్ 1–0–13–0; అక్షర్ 3–0–23–1; కుల్దీప్ 4–0–33–1; స్టబ్స్ 1–0–12–0. సూపర్ ఓవర్ సాగిందిలా...సూపర్ ఓవర్లో ఢిల్లీ తరఫున బౌలింగ్ చేసిన స్టార్క్... తన యార్కర్లతో ప్రత్యర్థిని కట్టిపడేశాడు. తొలి బంతికి పరుగులేమీ రాకపోగా... రెండో బంతికి హెట్‌మైర్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి సింగిల్ రాగా... నాలుగో బంతికి పరాగ్ ఫోర్ కొట్టాడు. ఆ బంతి నోబాల్ అని తేలగా... మరుసటి బంతికి పరాగ్ రనౌటయ్యాడు. ఐదో బంతికి రెండో పరుగు తీసే క్రమంలో జైస్వాల్ రనౌటవడంతో రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. ఛేదనలో తొలి బంతికి రెండు పరుగులు తీసిన రాహుల్... రెండో బంతిని బౌండరీకి తరలించాడు. మూడో బంతికి సింగిల్ రాగా... నాలుగో బంతికి స్టబ్స్ సిక్స్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఐపీఎల్లో నేడుముంబై X హైదరాబాద్‌వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

రూ.4,689 కోట్లతో సచివాలయానికి ‘టెండర్’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రూ.1,151 కోట్ల వ్యయంతో 2015లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ప్రభుత్వం.. ఇప్పుడు రూ.4,689.82 కోట్ల అంచనా వ్యయంతో సచివాలయ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. తాత్కాలిక సచివాలయాన్ని వెలగపూడి వద్ద 42.5 ఎకరాల్లో జీ+1 పద్ధతిలో ఐదు బ్లాక్‌లలో ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పడు శాశ్వత సచివాలయాన్ని రాయపూడి వద్ద 32 ఎకరాల్లో బీ+జీ+39 పద్ధతిలో నాలుగు టవర్లు, బీ+జీ+49 పద్ధతిలో ఒక టవర్.. మొత్తం ఐదు టవర్లను 4,85,000 చదరపు మీటర్ల (52,20,496 చదరపు అడుగులు)లో చేపట్టనుంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ తాత్కాలిక సచివాలయం.. శాశ్వత సచివాలయం పేరుతో రెండుసార్లు భవనాలు నిర్మించిన దాఖలాలు లేవని అధికార వర్గాలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాల మేరకు శాశ్వత సచివాలయంలో ఐదు టవర్లను మూడు ప్యాకేజీలుగా విభజించి.. వాటి నిర్మాణానికి బుధవారం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) లంప్సమ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండేళ్లలో పూర్తి చేయాలని గడువు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి 2018లో పోస్టర్ అండ్ పార్టనర్స్– జెనిసిస్ ప్లానర్స్–డిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు డిజైన్లు (ఆకృతులు) రూపొందించాయి. ఆ డిజైన్ల మేరకు ఇటీవల శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇప్పుడు శాశ్వత సచివాలయంలో 1, 2 టవర్లను ఒక ప్యాకేజీ కింద.. 3, 4 టవర్లను రెండో ప్యాకేజీ కింద.. జీఏడీ (సాధారణ పరిపాలన విభాగం) టవర్‌ను మూడో ప్యాకేజీ కింద విభజించి సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనులను 24 నెలల్లో పూర్తి చేసేలా.. నిర్మాణం పూర్తయ్యాక 36 నెలలపాటు నిర్వహించాలని షరతు పెట్టింది. ఈ టెండర్లో బిడ్ల దాఖలుకు వచ్చే నెల ఒకటో తేదీని తుది గడువుగా నిర్దేశించింది. అదే రోజున టెక్నికల్ బిడ్‌ను తెరుస్తారు. టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించిన సంస్థల ఆర్థిక బిడ్లను మే 3న తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు కాంట్రాక్టు పనులు అప్పగించాలని సీఆర్డీఏ అథారిటీకి అధికారులు ప్రతిపాదించనున్నారు. సచివాలయం నిర్మాణం ఇలా.. » రాయపూడి వద్ద పాలవాగుకు ఇరు వైపులా శాశ్వత సచివాలయాన్ని నిర్మించనున్నారు. పాలవాగుకు ఉత్తరాన జీఏడీ టవర్‌తోపాటు 1, 2 టవర్లు.. దక్షిణాన 3, 4 టవర్లను నిర్మించేలా డిజైన్‌ను రూపొందించారు. మొత్తంగా 1, 2 టవర్ల పనుల కాంట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లు. 3, 4 టవర్ల పనుల కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లు. జీఏడీ టవర్ కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లు. ఐదు టవర్లలో ఒక్కో అంతస్తు 47 మీటర్ల వెడల్పు, 47 మీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. » శాశ్వత సచివాలయం నిర్మాణ పనులను ఇప్పటి తరహాలోనే మూడు ప్యాకేజీల కింద 2018 ఏప్రిల్ 26న అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. జీఏడీ టవర్ నిర్మాణ పనులను రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు.. 1, 2 టవర్ల నిర్మాణ పనులను రూ.932.46 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ సంస్థకు.. 3, 4 టవర్ల నిర్మాణ పనులను 784.62 కోట్లకు ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించింది. అంటే.. ఐదు టవర్ల నిర్మాణ పనుల విలువ రూ.2,271.14 కోట్లు. » ఈ ఐదు టవర్ల పునాదుల పనులను 2019 నాటికే కాంట్రాక్టు సంస్థలు పూర్తి చేశాయి. మిగిలిన పనులకు ఇప్పుడు టెండర్లు పిలిచింది. 2018 ఏప్రిల్ నాటితో పోల్చి చూస్తే.. స్టీలు, సిమెంటు, భవనాల నిర్మాణానికి ఉపయోగించే వస్తువుల ధరల్లో పెద్దగా మార్పు లేదు. పైగా ఈ టవర్ల నిర్మాణానికి సమీపంలోనే కృష్ణా నదిలో పుష్కలంగా.. అదీ ఉచితంగా ఇసుక లభ్యమవుతోంది. కానీ.. ఈ ఐదు టవర్లలో మిగిలిన పనుల నిర్మాణానికి రూ.4,195.51 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ టెండర్లు పిలవడం గమనార్హం. » ఈ లెక్కన అంచనా వ్యయాన్ని రూ.1,924.37 కోట్లు పెంచేసిందన్నది స్పష్టమవుతోంది. యధావిధిగా సిండికేట్ కాంట్రాక్టర్లకు ఈ ఐదు టవర్ల పనులను కట్టబెట్టి.. కమీషన్లు వసూలు చేసుకోవడానికే ప్రభుత్వ ముఖ్యనేత చక్రం తిప్పారన్న చర్చ సాగుతోంది. » ఇక తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను అప్పట్లో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున చెల్లించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన రూ.1,151 కోట్లు వ్యయం చేసి కమీషన్లు దండుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పుడు, ఇప్పుడు వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తెచ్చిన సొమ్మును ఇలా దుబారా చేయడం తగదని అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

విప్రో లాభం రూ. 3,570 కోట్లు
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో గతేడాది(2024–25) చివరి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 26 శాతం జంప్‌చేసి రూ. 3,570 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,835 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 22,504 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 22,208 కోట్ల టర్నోవర్ సాధించింది. త్రైమాసిక(క్యూ3)వారీగా చూస్తే నికర లాభం 6% పుంజుకోగా.. ఆదాయం 1% బలపడింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి వి ప్రో నికర లాభం 19% ఎగసి రూ. 13,135 కోట్లను అధిగమించగా.. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర క్షీణతతో రూ. 89,088 కోట్లను తాకింది. అనిశ్చితుల ఎఫెక్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి త్రైమాసికంలో ఆదాయం 1.5–3.5% క్షీణించవచ్చని విప్రో తాజాగా అంచనా వేసింది. వెరసి ఏప్రిల్–జూన్ (క్యూ1)లో ఐటీ సర్వీసుల బిజినెస్ నుంచి 250.5–255.7 కోట్ల డాలర్ల మధ్య నమోదుకావచ్చని గైడెన్స్ ప్రకటించింది. త్రైమాసికవారీగా వేసిన అంచనాలివి. ప్రపంచ అనిశ్చితుల నేపథ్యంలో ఐటీ అదాయం మందగించవచ్చని అభిప్రాయపడింది. ప్రణాళికల ప్రకారం గతేడాది 10,000 మందికి ఉపాధి కల్పించింది.మెగా డీల్స్‌తో...స్థూలఆర్థిక అనిశ్చితుల కారణంగా క్లయింట్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియా పేర్కొన్నారు. అయితే నిలకడ, లాభాల్లో వృద్ధిని కొనసాగించే బాటలో క్లయింట్ల అవసరాలపై దృష్టిపెట్టి సాగుతున్నట్లు తెలియజేశారు. ఇటీవలి టారిఫ్ ప్రకటనలు ప్రపంచ అనిశ్చితులను మరింత పెంచుతున్నట్లు అభిప్రాయపడ్డారు. గతేడాది కుదుర్చుకున్న రెండు మెగా డీల్స్‌తో భారీ కాంట్రాక్ట్ బుకింగ్స్ మెరుగుపడినట్లు తెలియజేశారు. కన్సల్టింగ్, ఏఐ సామర్థ్యాలను పటిష్టపరచుకోవడంతోపాటు గ్లోబల్ టాలెంట్‌పై పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. అంతకుముందు విప్రో షేరు బీఎస్ఈలో 1.4 శాతం లాభంతో రూ. 248 వద్ద ముగిసింది. ఇతర విశేషాలు...→ విప్రో మొత్తం సిబ్బంది సంఖ్య 2,32,614 నుంచి 2,33,346కు బలపడింది. → క్యూ4లో 13% అధికంగా 395.5 కోట్ల డాలర్ల బుకింగ్స్ సాధించింది. → భారీ డీల్స్ బుకింగ్స్ 49% ఎగసి 176.3 కోట్ల డాలర్లకు చేరాయి. → క్యూ4లో ఐటీ సర్వీసుల నిర్వహణ మార్జిన్ 17.5%గా నమోదైంది. → పూర్తి ఏడాదికి 5.4 బిలియన్ డాలర్ల భారీ డీల్ బుకింగ్స్‌తో కలిపి 14.3 బిలియన్ డాలర్లను తాకాయి. → నిర్వహణ మార్జిన్లు క్యూ4లో 1.1%, పూర్తి ఏడాదికి 0.9% చొప్పున పుంజుకున్నాయి.
ఊరే ప్రేరణ
అమరావతికి రూ.77 వేల కోట్లు అవసరం
చిత్తూరులో పరువు హత్య?
రొయ్య సాగుపై ‘సమ్మె’ట
రూ.4,689 కోట్లతో సచివాలయానికి ‘టెండర్’
మార్కెట్ లీడర్ ‘ఇ-లైఫ్ స్టైల్‘
కలవరపెడుతున్న మధుమేహం
ప్చ్.. ఇంటర్నెట్ సేవలు బాగోలేదు..!
గంగపుత్రులకు తీరని అన్యాయం
హంపి, హారిక తొలి గెలుపు
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు.. ఐపీఎల్ టీమ్స్‌కు బీసీసీఐ అలెర్ట్?
టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
అమెరికా వీసాలు.. కొందరి అదృష్టం
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు
నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
బంగ్లాతో వన్డే సిరీస్.. భారత కెప్టెన్‌గా గిల్! యువ సంచలనం రీ ఎంట్రీ?
వర్క్ ఫ్రమ్ హోమ్‌తో సైడ్ జాబ్.. ఏఐతో పట్టుకున్న సీఈవో
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
మూవీ ప్రమోషన్లలో అలేఖ్య చిట్టి పికిల్స్.. ప్రియదర్శి ఏమన్నారంటే?
రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్యపై దాడి.. ఎవరు చేశారంటే?
వక్ఫ్ పిటిషన్లపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
అమెరికాకు చైనా షాక్.. అరుదైన లోహాల ఎగుమతులు నిలిపివేత
‘పన్ను’ పాతదే కావాలంటే త్వరపడాల్సిందే..
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
జనాలు థియేటర్లకు రావట్లేదు.. భయంగా ఉంది: మజాకా డైరెక్టర్
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్‌లైన్
గంటాతో కూటమికి తలనొప్పులు.. పిలిచి మరీ క్లాస్ పీకిన అధిష్టానం
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
‘రేపు గోశాలలో కలుద్దాం’.. పల్లా సవాల్‌ను స్వీకరించిన భూమన
UI మూవీ మీకర్థం కాదని తెలుసు.. ఐదారేళ్లయ్యాక మీకే..: ఉపేంద్ర
చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలు
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
అపుడు స్టార్ యాక్టర్.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!
'ఎలాంటి సైకోలు ఉన్నారురా సమాజంలో'.. బిగ్‌బాస్ ఆదిరెడ్డి ఆవేదన!
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
ఆదోని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన వైఎస్సార్సీపీ
మన మీద అనుమానపడటం ఇదేం కొత్తకాదుగా.. లైట్ తీస్కోండి!
మంత్రి గారి ‘ఇగో’ హర్టయ్యింది.. అడవికి డాక్టర్ ట్రాన్స్ఫర్?!
RR vs DC: కెప్టెన్‌గా నేను కాదు!.. అతడే సరైనోడు..
ట్రైన్ రిజర్వేషన్: టికెట్‌పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
Smita Sabharwal: చిక్కుల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు మూవీ
దక్షిణాది సినిమాలు అందుకే హిట్.. అదుర్స్ నటుడు ఆసక్తికర కామెంట్స్
ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
అన్నయ్య సారీ రా...
బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలో...
సొరంగం జిందాబాద్..!
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
‘కంచ’లోనే లోపలేస్తాం!
రాజ్ తరుణ్-లావణ్య వివాదం.. నడవలేని స్థితిలో ఇంటి బయటే నిరసన!
హిట్ 3 ట్రైలర్.. 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ గల్లంతు!
‘సంస్థ నన్ను వాడుకొని, వదిలేసింది’.. టాయిలెట్ పేపర్‌పై ఉద్యోగి రాజీనామా లేఖ
KKR Vs PBKS: తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు: రహానే
నేషనల్ హెరాల్డ్ కేసు- ఈడీ చార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లు
గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
శిక్షణతో.. భవిష్యత్తుకు పునాది
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!
ఇక బంగారం కొనడం కష్టమే! తులం ఎంతంటే..
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధన,వస్తులాభాలు
లేఆఫ్స్‌పై డా.రెడ్డీస్ ల్యాబ్ స్పష్టత
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
'జేమ్స్‌బాండ్‌కు కూడా ఫ్యూజులు ఎగిరిపోవాలి'.. నవ్వులు తెప్పిస్తోన్న ట్రైలర్
IPL 2025: ఉత్కంఠ పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ 'సూపర్' విక్టరీ
New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
IPL: చెక్కుచెదరని రికార్డులు.. భవిష్యత్తులోనూ ఎవరూ బద్దలు కొట్టలేరేమో!
Hyderabad: ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్.. కొలీజియం సిఫార్సు
కష్టం వేరొకరిది! కాసులు ఏఐవి!!
మంత్రి జూపల్లి Vs ఎమ్మెల్యే వేముల: కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రచ్చ రచ్చ
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
గుడ్ న్యూస్ చెప్పిన చైనా, ఏకంగా 85వేల వీసాలు
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !
9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త
ఆ తెలుగు హీరోతో కలిసి పని చేయాలని ఉంది: తమన్నా ఆసక్తికర కామెంట్స్
స్కామర్కే చుక్కలు చూపించిన యువతి - వీడియో వైరల్
హార్వర్డ్ ప్రతిఘటనా స్వరం!
నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్..178కే : హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్
IPL 2025: రియాన్ పరాగ్ అరుదైన ఫీట్.. తొలి రాజస్తాన్ ప్లేయర్‌గా
Aarthi Subramanian: ఐటీలో ఆమెకు అగ్రపీఠం
నీట్ రూల్స్ వెరీ టఫ్
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
ముగిసిన యువవికాసం దరఖాస్తు గడువు
సీఎన్జీ ఆటోలపై నిషేధం!.. ఢిల్లీ మంత్రి క్లారిటీ
KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. పైసా వసూల్ ప్రదర్శన!.. చహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటా
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. సూపర్ హిట్ మూవీ రికార్డ్ బ్రేక్
ఫేట్ మార్చిన సినిమా.. ఇన్నాళ్లకు మళ్లీ గుర్తింపు
'ప్రియదర్శి సారంగపాణి జాతకం'.. బోల్డ్ డైలాగ్‌తో రిలీజైన ట్రైలర్
రామ్ చరణ్ పెద్ది మూవీ.. తొలిసారి తెలుగులో డైలాగ్ చెప్పా: శివరాజ్ కుమార్
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
కొత్త లుక్‌లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్.. కౌంటరిచ్చిన నటి
ప్రతి నెలా కొత్త బీమా ప్లాన్
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
రూ.10,980కే గానుగ నూనె యంత్రం
మన రొయ్య...మళ్లీ వెళ్తుందయ్యా
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో కొత్త ఫీచర్..
'బెస్ట్ డెసీషన్': భారత్‌పై డెన్మార్క్ మహిళ ప్రశంసల జల్లు..
హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్ లాంచ్..
ఊరే ప్రేరణ
అమరావతికి రూ.77 వేల కోట్లు అవసరం
చిత్తూరులో పరువు హత్య?
రొయ్య సాగుపై ‘సమ్మె’ట
రూ.4,689 కోట్లతో సచివాలయానికి ‘టెండర్’
మార్కెట్ లీడర్ ‘ఇ-లైఫ్ స్టైల్‘
కలవరపెడుతున్న మధుమేహం
ప్చ్.. ఇంటర్నెట్ సేవలు బాగోలేదు..!
గంగపుత్రులకు తీరని అన్యాయం
హంపి, హారిక తొలి గెలుపు
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
సారీ..నీ ఉద్యోగానికి మా అమ్మాయిని ఇవ్వలేం..!
మ్యాచ్ ఫిక్సింగ్ ముప్పు.. ఐపీఎల్ టీమ్స్‌కు బీసీసీఐ అలెర్ట్?
టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
అమెరికా వీసాలు.. కొందరి అదృష్టం
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు
నాన్నా..! నా పిల్లలను నువ్వే చూసుకో.. నేను చనిపోతున్నా..
బంగ్లాతో వన్డే సిరీస్.. భారత కెప్టెన్‌గా గిల్! యువ సంచలనం రీ ఎంట్రీ?
వర్క్ ఫ్రమ్ హోమ్‌తో సైడ్ జాబ్.. ఏఐతో పట్టుకున్న సీఈవో
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
మూవీ ప్రమోషన్లలో అలేఖ్య చిట్టి పికిల్స్.. ప్రియదర్శి ఏమన్నారంటే?
రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్యపై దాడి.. ఎవరు చేశారంటే?
వక్ఫ్ పిటిషన్లపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
అమెరికాకు చైనా షాక్.. అరుదైన లోహాల ఎగుమతులు నిలిపివేత
‘పన్ను’ పాతదే కావాలంటే త్వరపడాల్సిందే..
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
జనాలు థియేటర్లకు రావట్లేదు.. భయంగా ఉంది: మజాకా డైరెక్టర్
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్‌లైన్
గంటాతో కూటమికి తలనొప్పులు.. పిలిచి మరీ క్లాస్ పీకిన అధిష్టానం
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
‘రేపు గోశాలలో కలుద్దాం’.. పల్లా సవాల్‌ను స్వీకరించిన భూమన
UI మూవీ మీకర్థం కాదని తెలుసు.. ఐదారేళ్లయ్యాక మీకే..: ఉపేంద్ర
చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలు
ఎస్ఆర్హెచ్ జట్టులోకి విధ్వంసకర వీరుడు..
అపుడు స్టార్ యాక్టర్.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!
'ఎలాంటి సైకోలు ఉన్నారురా సమాజంలో'.. బిగ్‌బాస్ ఆదిరెడ్డి ఆవేదన!
‘రారండోయ్..వేడుక చేద్దాం’..! మంచి ముహూర్తాల తేదీలు ఇవే..!
ఆదోని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన వైఎస్సార్సీపీ
మన మీద అనుమానపడటం ఇదేం కొత్తకాదుగా.. లైట్ తీస్కోండి!
మంత్రి గారి ‘ఇగో’ హర్టయ్యింది.. అడవికి డాక్టర్ ట్రాన్స్ఫర్?!
RR vs DC: కెప్టెన్‌గా నేను కాదు!.. అతడే సరైనోడు..
ట్రైన్ రిజర్వేషన్: టికెట్‌పై ఈ పదాలు కనిపిస్తే బెర్త్ కన్ఫర్మ్!
విద్యార్థికి రూ.2 కోట్ల అప్పు.. వడ్డీ 40 రూపాయలు!
Smita Sabharwal: చిక్కుల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్
కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు మూవీ
దక్షిణాది సినిమాలు అందుకే హిట్.. అదుర్స్ నటుడు ఆసక్తికర కామెంట్స్
ఐపీఎల్లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
అన్నయ్య సారీ రా...
బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలో...
సొరంగం జిందాబాద్..!
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
‘కంచ’లోనే లోపలేస్తాం!
రాజ్ తరుణ్-లావణ్య వివాదం.. నడవలేని స్థితిలో ఇంటి బయటే నిరసన!
హిట్ 3 ట్రైలర్.. 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ గల్లంతు!
‘సంస్థ నన్ను వాడుకొని, వదిలేసింది’.. టాయిలెట్ పేపర్‌పై ఉద్యోగి రాజీనామా లేఖ
KKR Vs PBKS: తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు: రహానే
నేషనల్ హెరాల్డ్ కేసు- ఈడీ చార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లు
గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలో తెలుగు విద్యార్థిని దీప్తి
శిక్షణతో.. భవిష్యత్తుకు పునాది
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!
ఇక బంగారం కొనడం కష్టమే! తులం ఎంతంటే..
ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి ధన,వస్తులాభాలు
లేఆఫ్స్‌పై డా.రెడ్డీస్ ల్యాబ్ స్పష్టత
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
'జేమ్స్‌బాండ్‌కు కూడా ఫ్యూజులు ఎగిరిపోవాలి'.. నవ్వులు తెప్పిస్తోన్న ట్రైలర్
IPL 2025: ఉత్కంఠ పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ 'సూపర్' విక్టరీ
New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
IPL: చెక్కుచెదరని రికార్డులు.. భవిష్యత్తులోనూ ఎవరూ బద్దలు కొట్టలేరేమో!
Hyderabad: ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్.. కొలీజియం సిఫార్సు
కష్టం వేరొకరిది! కాసులు ఏఐవి!!
మంత్రి జూపల్లి Vs ఎమ్మెల్యే వేముల: కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రచ్చ రచ్చ
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
గుడ్ న్యూస్ చెప్పిన చైనా, ఏకంగా 85వేల వీసాలు
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !
9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త
ఆ తెలుగు హీరోతో కలిసి పని చేయాలని ఉంది: తమన్నా ఆసక్తికర కామెంట్స్
స్కామర్కే చుక్కలు చూపించిన యువతి - వీడియో వైరల్
హార్వర్డ్ ప్రతిఘటనా స్వరం!
నీతా అంబానీ రూ.500 కోట్ల నెక్లెస్..178కే : హర్ష్ గోయెంకా ఫన్నీ ట్వీట్
IPL 2025: రియాన్ పరాగ్ అరుదైన ఫీట్.. తొలి రాజస్తాన్ ప్లేయర్‌గా
Aarthi Subramanian: ఐటీలో ఆమెకు అగ్రపీఠం
నీట్ రూల్స్ వెరీ టఫ్
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
ముగిసిన యువవికాసం దరఖాస్తు గడువు
సీఎన్జీ ఆటోలపై నిషేధం!.. ఢిల్లీ మంత్రి క్లారిటీ
KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. పైసా వసూల్ ప్రదర్శన!.. చహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటా
ఏపీని ఏం చేయాలనుకుంటున్నావ్ బాబూ: వడ్డే శోభనాద్రీశ్వరరావు
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. సూపర్ హిట్ మూవీ రికార్డ్ బ్రేక్
ఫేట్ మార్చిన సినిమా.. ఇన్నాళ్లకు మళ్లీ గుర్తింపు
'ప్రియదర్శి సారంగపాణి జాతకం'.. బోల్డ్ డైలాగ్‌తో రిలీజైన ట్రైలర్
రామ్ చరణ్ పెద్ది మూవీ.. తొలిసారి తెలుగులో డైలాగ్ చెప్పా: శివరాజ్ కుమార్
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
కొత్త లుక్‌లో ఖుష్బూ.. ఇంజక్షన్స్ తీసుకుందని ట్రోలింగ్.. కౌంటరిచ్చిన నటి
ప్రతి నెలా కొత్త బీమా ప్లాన్
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
రూ.10,980కే గానుగ నూనె యంత్రం
మన రొయ్య...మళ్లీ వెళ్తుందయ్యా
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో కొత్త ఫీచర్..
'బెస్ట్ డెసీషన్': భారత్‌పై డెన్మార్క్ మహిళ ప్రశంసల జల్లు..
హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్ లాంచ్..
సినిమా

'జేమ్స్‌బాండ్‌కు కూడా ఫ్యూజులు ఎగిరిపోవాలి'.. నవ్వులు తెప్పిస్తోన్న ట్రైలర్
ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన తాజా చిత్రం చౌర్యపాఠం(Chaurya Paatam Movie). ఈ సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు, చూడామణి సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలి.. మాకు ఆ డబ్బులు రావాలి అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. మనీ హైయిస్ట్ నేపథ్యంలో వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. 'మనం ఆయుధాలు దాచే విధానం చూస్తే జేమ్స్‌బాండ్‌కు కూడా ఫ్యూజులు ఎగిరిపోవాలి' అనే డైలాగ్ వింటే థియేటర్లో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: జనాలు థియేటర్లకు రావట్లేదు.. భయంగా ఉంది: మజాకా డైరెక్టర్)ఇక ట్రైలర్ చివర్లో నీకు సమంత ఇష్టమా? రష్మిక ఇష్టమా? అంటే.. ఇద్దరు కాదు అనుష్క అనే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. మొత్తానికి ట్రైలర్లోనే చౌర్యపాఠం ఒక కామెడీ ఎంటర్టైనర్గానే రూపొందించినట్లు క్లూ ఇచ్చేశారు. కాగా.. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు దావ్జాంద్ దర్శకత్వం వహించారు.

నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు
పది భాషల్లో వేలకొద్దీ పాటలకు కొరియోగ్రఫీ చేశారు శివశంకర్ మాస్టర్ (Shiva Shankar Master). మగధీరతో జాతీయ పురస్కారం అందుకున్నారు. బెంగళూర్ అంతర్జాతీయ గ్లోబల్ ట్రస్ట్ ఈయన్ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈయన పుట్టిపెరిగింది తమిళనాడులో అయినా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది మాత్రం తెలుగునేలపైనే! 2021 నవంబర్ 28న ఆయన కన్నుమూశారు.వెన్నెముక విరిగి 12 ఏళ్లపాటు..తాజాగా ఇతడి పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. మా తాతవాళ్లది రాజమండ్రి. 70-80 ఎకరాలుండేది. తర్వాత చెన్నై షిఫ్ట్ అయ్యారు. నాన్నకు చిన్నప్పుడు జరిగిన ఓ ప్రమాదంలో వెన్నెముక విరిగింది. కదల్లేని స్థితిలో నరకం అనుభవించాడు. 12 ఏళ్ల తర్వాత కోలుకున్నాడు.కరోనా సమయంలో కన్నుమూతఆ సమయంలోనే థియేటర్ ఆర్టిస్టుల హావభావాలు చూసి తాను అలా పలికించాలనుకునేవాడు. అలా మొదట్లో సలీం మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. తర్వాత కొరియోగ్రాఫర్‌గా ఎదిగాడు. కరోనా సమయంలో నాకు, నాన్నకు ఒకేసారి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. పరిస్థితి సీరియస్‌గా మారడంతో ఆస్పత్రిలో చేరాం. ప్రతి రోజు రూ.7 లక్షల దాకా ఖర్చయింది. అప్పుడు మా ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే! సరిగ్గా అదే సమయంలో ఇండస్ట్రీనుంచి సాయం అందింది. నాన్నకు కరోనా తగ్గిపోయాక ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి మరణించాడు. కోవిడ్ వల్ల ఇండస్ట్రీ నుంచి ఓంకార్, అశ్విన్.. తప్ప ఎవరూ నాన్న పాడె మోసేందుకు రాలేదు.(చదవండి: అమ్మతోడు.. జైలర్‌లో ఏం చేశానో నాకే తెలీదు: శివరాజ్‌కుమార్)ఆ ఒక్క ఘటనతో..మా నాన్నకు జీవితంలో చేదు అనుభవం ఏదైనా ఉందా? అంటే అది నా భార్య చేసిన నిర్వాకం వల్లే..! మాది పెద్దలు కుదిర్చిన వివాహం. బెంళూరుకు చెందిన అమ్మాయి. పెళ్లయిన నాలుగు నెలలకే ప్రెగ్నెంట్ అయింది. పాప పుట్టాక తను మారిపోయింది. నిజానికి తను మంచి అమ్మాయే.. కాకపోతే, మా నాన్నకు చాలా ఆస్తి ఉంది, ఒక్క కంప్లైంట్ చేస్తే చాలు ఆస్తంతా కొట్టేయొచ్చు అని కొందరు తనకు నూరిపోశారు. ఆ చెప్పుడు మాటలు విని ఆమె రూ.10 కోట్లు, నాన్న కట్టిన ఇల్లు కావాలని ఇంటి ముందు ధర్నా చేసింది.కోడలు హింసిస్తోందని..మా కుటుంబం మొత్తానిపై పలు కేసులు పెట్టించింది. ఆమెను చంపడానికి కూడా ప్రయత్నించామంది. దాంతో నాన్న.. మా కోడలు హింసిస్తోందని అప్పటి సీఎం జయలలితకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఆమె మహిళా కమిషన్‌ను సంప్రదించింది. ఈ గొడవ సద్దుమణిగేలా లేదని చెన్నైలో ఇల్లు వదిలేసి హైదరాబాద్‌కు వచ్చేశాం. తర్వాత విడాకులు తీసుకున్నాం. ఆమెకు కొంత భరణం ఇచ్చాను అని పేర్కొన్నాడు. విజయ్ శివ శంకర్.. మహాత్మ (నీలపురి గాజుల ఓ నీలవేణి), రాజన్న, లయన్ వంటి పలు సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేశాడు. మగధీరలో తండ్రి దగ్గరే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్నూ వ్యవహరించాడు.

జనాలు థియేటర్లకు రావట్లేదు.. భయంగా ఉంది: మజాకా డైరెక్టర్
'ధమాకా' డైరెక్టర్ నక్కిన త్రినాథరావు (Trinadha Rao Nakkina) నిర్మించిన తాజా చిత్రం చౌర్య పాఠం (Chaurya Paatam Movie). ఇంద్రరామ్ హీరోగా, పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటించిన ఈ సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించాడు. కొత్తవాళ్లతో త్రినాథరావు ఈ మూవీ ప్రయోగం చేస్తున్నాడు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో జనాలు థియేటర్లకు రావడం లేదు. షూటింగ్స్ కోసం ఆంధ్రప్రదేశ్‌లో బాగా తిరిగాను.జనాలు లేరుఅప్పుడు కొన్ని థియేటర్లకు వెళ్లి చూస్తే జనాలు కనిపించలేదు. ఏ స్టార్ హీరో సినిమా రిలీజైనా సరే థియేటర్దాకా రావడం లేదు. సెకండ్ షోలు క్యాన్సిల్ చేశారు. సినిమా పరిస్థితి దారుణంగా ఉంది. అది స్వయంగా నా కళ్లతో చూశాను. ఇలాంటి పరిస్థితిలో ఇంతమంది కొత్తవాళ్లతో తీసిన సినిమా రిలీజ్ చేయాలంటే భయమేస్తోంది. స్టార్ హీరోల సినిమాలు చూసేందుకే ఎవరూ ముందుకు రావట్లేదు.. ఇక మన సినిమా ఎవరు చూస్తారని భయంగా ఉంది. భయంగా ఉందిఏప్రిల్ 18న చౌర్యపాఠం తీసుకురావాలనుకున్నాం. ఆరోజు ఆరు సినిమాలు వస్తున్నాయి. అందుకే భయంతో దాన్ని ఈ నెల 25కు వాయిదా వేశాం. సాయంత్రమైతే జనాలు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. కేవలం క్రికెటే కారణమని చెప్పడం లేదు కానీ జనాలు థియేటర్లకు రావడం లేదు. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నామా? ఏంటనేది అర్థం కావడం లేదు. అంత డబ్బు లేదునిర్మాతగా మారాక వాళ్ల కష్టాలన్నీ అర్థమవుతున్నాయి. అందుకే నిర్మాతలపై విపరీతమైన గౌరవం పెరిగింది. ఇప్పటికే ఉన్నదంతా పెట్టేశాను. మిగతావారిలా భారీగా ఖర్చుపెట్టి పబ్లిసిటీ చేయలేను. అంత డబ్బు లేదు. థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి అని నక్కిన త్రినాథరావు అభ్యర్థించాడు. ఈయన చివరగా డైరెక్ట్ చేసిన మజాకా మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన సంగతి తెలిసిందే! చదవండి: నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు

అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ... ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే తొలిరోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కు దాటేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ.. రెండొందల మార్క్ దిశగా దూసుకెళ్తోంది.ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ తమిళ సూపర్ హిట్ మూవీ డ్రాగన్ సాధించిన లైఫ్ టైమ్ వసూళ్లను అధగమించిన గుడ్ బ్యాడ్ అగ్లీ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా గుడ్ బ్యాడ్ అగ్లీ నిలిచింది. దేశవ్యాప్తంగా కలెక్షన్స్ చూస్తే ఆరు రోజుల్లో రూ.108.30 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. ఇండియన్ బాక్సా ఫీస్ వద్ద రూ.127.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో మెప్పించారు.గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష హీరోయిన్గా నటించగా.. అర్జున్ దాస్ విలన్ పాత్రలో అలరించారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, ప్రసన్న, టిన్ను ఆనంద్, రఘు రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు
క్రీడలు

సురుచి ధమాకా
లిమా (పెరూ): గతవారం అర్జెంటీనాలో అదరగొట్టిన భారత టీనేజ్ పిస్టల్ షూటర్ సురుచి ఇందర్ సింగ్ అదే జోరును పెరూలో పునరావృతం చేసింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ రెండో టోర్నమెంట్లో హరియాణాకు చెందిన 18 ఏళ్ల సురుచి 24 గంటల వ్యవధిలో రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో సురుచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి 243.6 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకాన్ని దక్కించుకుంది. సురుచి ధాటికి గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన భారత స్టార్ మనూ భాకర్ రజత పతకంతో సంతృప్తి పడింది. మనూ భాకర్ 242.3 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. 34 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో సురుచి 582 పాయింట్లతో రెండో స్థానంలో, మనూ భాకర్ 578 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లోనూ సురుచి గరి అదిరింది. ఈ ఈవెంట్ ఫైనల్లో సురుచి–సౌరభ్ చౌధరీ (భారత్) ద్వయం విజేతగా నిలిచి పసిడి పతకాన్ని సాధించింది. ఫైనల్లో సురుచి–సౌరభ్ జోడీ 17–9తో కియాన్జున్ యావో–కాయ్ హు (చైనా) జంటను ఓడించింది. కాంస్య పతక మ్యాచ్‌లో మనూ భాకర్–రవీందర్ సింగ్ (భారత్) జోడీ 6–16తో కియాన్కె మా–యిఫాన్ జాంగ్ (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయింది.

ఢిల్లీ ‘సూపర్’ విక్టరీ
న్యూఢిల్లీ: ఉత్కంఠ ఊపేసిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఆధిక్యం చేతులు మారుతూ చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్... ఆఖరికి ‘సూపర్ ఓవర్’కు వెళ్లగా... అందులోనూ ఆకట్టుకున్న క్యాపిటల్స్ ఐపీఎల్ 18వ సీజన్లో ఐదో విజయం ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై తొలి విజయం సాధించిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకుంది. బుధవారం జరిగిన ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ (37 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... కేఎల్ రాహుల్ (38; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (14 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు సరిగ్గా 188 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), నితీశ్ రాణా (28 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలు సాధించగా... సామ్సన్ (19 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఆఖర్లో తీవ్ర ఒత్తిడిలో ధ్రువ్ జురెల్ (17 బంతుల్లో 26; 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (15 నాటౌట్; 1 ఫోర్) మెరుగైన ప్రదర్శన కనబర్చారు. స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు. స్కోరు వివరాలు: ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెక్‌గుర్క్ (సి) జైస్వాల్ (బి) ఆర్చర్ 9; పొరెల్ (సి) పరాగ్ (బి) హసరంగ 49; కరుణ్ (రనౌట్) 0; రాహుల్ (సి) హెట్‌మైర్ (బి) ఆర్చర్ 38; స్టబ్స్ (నాటౌట్) 34; అక్షర్ (సి) జురెల్ (బి) తీక్షణ 34; అశుతోష్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–34, 2–34, 3–97, 4–105, 5–146. బౌలింగ్: ఆర్చర్ 4–0–32–2; తుషార్ 3–0–38–0; సందీప్ 4–0–33–0; తీక్షణ 4–0–40–1; హసరంగ 4–0–38–1; పరాగ్ 1–0–6–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్టార్క్ (బి) కుల్దీప్ 51; సామ్సన్ (రిటైర్డ్ హర్ట్) 31; పరాగ్ (బి) అక్షర్ 8; నితీశ్ రాణా (ఎల్బీ) స్టార్క్ 51; జురేల్ (రనౌట్) 26; హెట్‌మైర్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–76, 2–112, 3–161, 4–188. బౌలింగ్: స్టార్క్ 4–0–36–1; ముకేశ్ 3–0–31–0; మోహిత్ 4–0– 38–0; విప్రాజ్ 1–0–13–0; అక్షర్ 3–0–23–1; కుల్దీప్ 4–0–33–1; స్టబ్స్ 1–0–12–0. సూపర్ ఓవర్ సాగిందిలా...సూపర్ ఓవర్లో ఢిల్లీ తరఫున బౌలింగ్ చేసిన స్టార్క్... తన యార్కర్లతో ప్రత్యర్థిని కట్టిపడేశాడు. తొలి బంతికి పరుగులేమీ రాకపోగా... రెండో బంతికి హెట్‌మైర్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి సింగిల్ రాగా... నాలుగో బంతికి పరాగ్ ఫోర్ కొట్టాడు. ఆ బంతి నోబాల్ అని తేలగా... మరుసటి బంతికి పరాగ్ రనౌటయ్యాడు. ఐదో బంతికి రెండో పరుగు తీసే క్రమంలో జైస్వాల్ రనౌటవడంతో రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. ఛేదనలో తొలి బంతికి రెండు పరుగులు తీసిన రాహుల్... రెండో బంతిని బౌండరీకి తరలించాడు. మూడో బంతికి సింగిల్ రాగా... నాలుగో బంతికి స్టబ్స్ సిక్స్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఐపీఎల్లో నేడుముంబై X హైదరాబాద్‌వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

IPL 2025: ఉత్కంఠ పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్ 'సూపర్' విక్టరీ
ఐపీఎల్-2025లో వరుసగా రెండో మ్యాచ్ అభిమానులను ఆఖరి వరకు మునివేళ్లపై నిలబెట్టింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. ఈ ఉత్కంఠపోరులో ఢిల్లీ విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది.మిచిల్ స్టార్క్ బౌలింగ్ చేసిన సూపర్ ఓవర్లో హెట్‌మైర్(5), రియాన్ పరాగ్(4) రాణించారు. అనంతరం 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం మూడు బంతుల్లోనే చేధించి విజయాన్ని అందుకుంది. రాజస్తాన్ తరపున సూపర్ ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్లోకేఎల్ రాహుల్ 7 పరుగులు చేయగా.. స్టబ్స్ సిక్సర్ కొట్టి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్(49) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్(38), స్టబ్స్(34), అక్షర్ పటేల్(34) రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో రాజస్తాన్ కూడా 4 వికెట్లు కోల్పోయి సరిగ్గా 188 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. మిచిల్ స్టార్క్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులిచ్చాడు. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి అంపైర్లు సూపర్ ఓవర్‌ను నిర్వహించనున్నారు. ఈ సూపర్ ఓవర్లో ఢిల్లీనే పై చేయి సాధించింది.

IPL 2025: రియాన్ పరాగ్ అరుదైన ఫీట్.. తొలి రాజస్తాన్ ప్లేయర్‌గా
టీమిండియా ఆల్‌రౌండర్, రాజస్తాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరపున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్‌గా పరాగ్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్-2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్ పోరెల్ క్యాచ్‌ను అందుకున్న పరాగ్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.రియాన్ పరాగ్ ఇప్పటివరకు ఐపీఎల్లో రాజస్తాన్ తరపున 41 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ అజింక్య రహానే పేరిట ఉండేది. రహానే రాయల్స్ తరపున 40 క్యాచ్‌లు అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో రహానే రికార్డును పరాగ్ బ్రేక్ చేశాడు. కాగా రియాన్ అతి తక్కువ సమయంలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్యాట్‌తోనే కాకుండా బౌలింగ్, ఫీల్డింగ్‌లో కూడా తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్(49) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రాహుల్(38), స్టబ్స్(34), అక్షర్ పటేల్(34) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టగా.. తీక్షణ, హసరంగ తలా వికెట్ సాధించారు.
బిజినెస్

ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో కొత్త ఫీచర్..
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో సరికొత్త సేఫ్టీ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. ఫోన్ వరుసగా మూడు రోజులు (72 గంటలు) పాటు తెరవకుండా లాక్ అయి ఉంటే స్వయంచాలకంగా రీబూట్ అవుతుంది. ఈ కొత్త భద్రతా ఫీచర్ గూగుల్ ప్లే సర్వీసెస్ (Google Play) తాజా అప్డేట్ (వెర్షన్ 25.14)లో అందుబాటులోకి రానుంది.ఫోన్ పోయినప్పుడు లేదా చోరీ జరిగినప్పుడు యూజర్ డేటా దుర్వినియోగం కాకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా గూగుల్ ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది. "వరుసగా మూడు రోజులు లాక్ అయి ఉంటే ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవుతుంది" అని గూగుల్ ప్లే సర్వీసెస్ తాజా అప్డేట్ పేర్కొంటోంది. ఫోన్ యాక్సెస్‌ను తిరిగి పొందాలంటే వినియోగదారులు వారి పాస్‌కోడ్‌ను రీఎంటర్ చేయాల్సి ఉంటుంది.9to5Google నివేదిక ప్రకారం.. ఈ అప్డేట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లలో అందుబాటులోకి వస్తోంది. అయితే ఆండ్రాయిడ్ ఆటో, వేర్ ఓఎస్‌పై పనిచేసే డివైజ్‌లు, ఆండ్రాయిడ్ టీవీలకు ఈ అప్డేట్ వర్తించదని తెలుస్తోంది. రీబూట్ చేసిన తర్వాత ఫోన్‌ను 'బిఫోర్ ఫస్ట్ అన్‌లాక్' స్థితికి తిరిగి తీసుకురావడం ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుందని జీఎస్ఎంఅరేనా నివేదిక పేర్కొంది. ఈ స్థితిలో ఫోన్ మరింత సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే పాస్‌కోడ్ మాన్యువల్‌గా ఎంటర్ చేసే వరకు ఫింగర్ ప్రింట్ లేదా ఫేసియల్ రికగ్నిషన్ వంటి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఆప్షన్లు అందుబాటులో ఉండవు.తాజా వెర్షన్ 25.14 విడుదలకు దాదాపు ఒక వారం సమయం పట్టవచ్చని అంచనా వేయగా, అర్హత ఉన్న అన్ని పరికరాల్లో ఆటో-రీస్టార్ట్ ఫంక్షన్ పూర్తిగా అందుబాటులోకి రావటానికి కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈ ఫీచర్‌కు ఏ ఆండ్రాయిడ్ వెర్షన్లు అనుకూలంగా ఉంటాయి.. ఈ సెట్టింగ్‌ను డిజేబుల్ లేదా అడ్జెస్ట్ చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉంటుందా అనే దానిపై గూగుల్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.యాపిల్ iOS 18.1 లో ఇలాంటి భద్రతా ఫీచర్ 'ఇనాక్టివిటీ రీబూట్'ను ప్రవేశపెట్టింది. ఇది నాలుగు రోజులపాటు ఇనాక్టివ్‌గా లాక్ ఉండి లాక్ అయిన ఐఫోన్లను రీస్టార్ట్ చేస్తుంది. కొత్త భద్రతా ఫీచర్‌తో పాటు తాజా గూగుల్ ప్లే సర్వేసెస్ అప్డేట్ మరికొన్ని మెరుగుదలలను తీసుకువస్తోంది. వినియోగదారులు ఇప్పుడు వారి ఫోన్లో క్విక్ షేర్ ట్రాన్స్ఫర్ను అంగీకరించే ముందు కంటెంట్‌ను ప్రివ్యూ చేయవచ్చు. కొత్త ఫోన్‌ను సెటప్ చేయడం, పాత ఫోన్ నుండి డేటాను ట్రాన్స్ఫర్ చేయడం మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండనుంది.

‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో ఇరుక్కున్న భారతీయ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీకి సంబంధించిన హై ప్రొఫైల్ వివాదంలో హంగేరి మహిళ బార్బరా జబారికా పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. 2018లో భారత్ నుంచి పారిపోయిన ఛోక్సీని 2021లో జబారికా కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిందని, హనీ ట్రాప్, అపహరణ కుట్రలో బార్బరా కీలకంగా వ్యవహరించిందని ఛోక్సీ తెలిపారు.చోక్సీ ఆరోపణలు..హంగేరి మహిళ బార్బరా జబారికా తనను ఫ్రెండ్‌గా పరిచయం చేసుకుందని చెప్పారు. కొంతకాలం తనను నమ్మించి స్నేహం చేసిందని చోక్సీ తెలిపారు. ఒకనొక సమయంలో ఆమె తనను డిన్నర్‌కు ఆహ్వానించిందని, అక్కడ తనను లొంగదీసుకుని బలవంతంగా డొమినికాకు తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు. తనను భారత్‌కు రప్పించేందుకు జరుగుతున్న భారీ కుట్రలో ఇది భాగమని ఛోక్సీ తెలిపారు. ఈ ఆరోపణలను బార్బరా తీవ్రంగా ఖండించారు. ఛోక్సీకి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఛోక్సీ తప్పుడు గుర్తింపుతో తనను పరిచయం చేసుకున్నాడని తెలిపారు. తాను హంగేరిలో రియల్ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలుఇటీవల అరెస్ట్భారత సీబీఐ అధికారుల కోరిక మేరకు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని ఇటీవల బెల్జియం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలున్నాయి. దాంతో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే తనను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు గతంలో విశ్వప్రయత్నాలు చేసినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ఈమేరకు భారత్‌లోని ఉన్నతాధికారులకు లంచాలు కూడా ఇచ్చినట్లు గతంలో ఆరోపణలున్నాయి.

వచ్చే ఐదేళ్లలో కొలువులు కోకొల్లలు
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాల తీరుతెన్నులు మారుతున్నాయి. సాంకేతికత, సస్టెయినబిలిటీ, ఆటోమేషన్తో పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన మానవ వనరులకు భవిష్యత్తులో ఎక్కువ డిమాండ్ ఉంటుందని నివేదికలు తెలియజేస్తున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సిద్ధం చేసిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025’లో 2030 నాటికి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే కొన్ని ఉద్యోగాల జాబితాను విడుదల చేసింది.బిగ్ డేటా స్పెషలిస్టులుప్రస్తుత కాలంలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ప్రామాణికంగా మారింది. భవిష్యత్తులోనూ ఈ విభాగంలో ఉద్యోగులకు డిమాండ్ నెలకొంటుంది. ముఖ్యంగా డేటా అనాలిసిస్, డేటా మేనేజ్మెంట్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ నిపుణులకు కొలువులు ఎక్కువగా ఉంటాయి.ఫిన్ టెక్ ఇంజినీర్లుడిజిటల్ ఫైనాన్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత ఫైనాన్షియల్ టూల్స్ వినియోగం పెరిగింది. దాంతో ఆయా విభాగాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఇతర లావాదేవీలను మెరుగ్గా నిర్వహించేందుకు ఫైనాన్షియల్ టెక్నాలజీ నిపుణులు అవసరం.ఏఐ, మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్టులుఆటోమేషన్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్‌వర్క్‌లు అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇవి రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఏఐ డెవలప్మెంట్, అల్గారిథమ్ ఆప్టిమైజేషన్లో నిపుణులు ఈ పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తారు.సాఫ్ట్వేర్, అప్లికేషన్స్ డెవలపర్లుకస్టమైజ్డ్ డిజిటల్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు, క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫామ్‌లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇది సాఫ్ట్వేర్ విభాగంలో మరింత మందికి ఉపాధిని కల్పిస్తుంది.సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్లుడేటా ప్రొటెక్షన్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్ మిటిగేషన్, ఏఐ ఆధారిత సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రస్తుత టెక్ వ్యాపారాలకు ఎంతో కీలకం. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. దీన్ని సమర్థవంతంగా అదుపు చేస్తున్నప్పటికీ మరిన్ని ఆవిష్కరణలు రావాల్సి ఉందనే అభిప్రాయాలున్నాయి. భవిష్యత్తులో ఈ రంగం అధికంగా ఉద్యోగాలకు నెలవుగా మారుతుంది.డేటా వేర్‌హౌసింగ్ నిపుణులుటెక్ కంపెనీలు భారీ డేటాసెట్లను నిర్వహిస్తున్నాయి. డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ స్టోరేజ్, డేటా వేర్‌హౌసింగ్ సొల్యూషన్లలో నిపుణులకు విలువ పెరుగుతోంది.ఎలక్ట్రిక్ వెహికల్ స్పెషలిస్టులుప్రపంచవ్యాప్తంగా వాతావరణంలోని కాలుష్య కారకాలను తగ్గించాలనే లక్ష్యంతో దాదాపు చాలా ఆటోమొబైల్ కంపెనీ సుస్థిర రవాణా వైపు అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఈవీ టెక్నాలజీ, బ్యాటరీ ఆవిష్కరణలు, సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థల్లో నైపుణ్యం కలిగిన ఇంజినీర్లకు గిరాకీ ఏర్పడుతుంది.యూజర్ ఇంటర్ఫేజ్ డిజైనర్లుటెక్ కంపెనీల్లో పోటీ తీవ్రతరం అవుతుండడంతో యూజర్ సెంట్రిక్ ప్రొడక్ట్ డిజైన్, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, మొబైల్ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో రాణించే డిజైనర్లకు బాగా డిమాండ్ ఉంటుంది.ఇదీ చదవండి: చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలుఅభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్లో ముందుండాలంటే ఉద్యోగార్థులు తమ నైపుణ్యాలు పెంచుకోవడం, క్రాస్ డిసిప్లినరీ లెర్నింగ్, టెక్ పోకడలపై దృష్టి సారించాలి. ఆటోమేషన్, కృత్రిమ మేధ రంగాలు వృద్ధి పథంలో దూసుకుపోతున్న క్రమంలో మానవ నైపుణ్యం అనివార్యంగా అవసరం అవుతుంది. భవిష్యత్తు సృజనాత్మకతతోనే ముడిపడి ఉందనే విషయాన్ని నిత్యం గుర్తు చేసుకోవాలి.

చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలు
చైనా దిగుమతులపై 245 శాతం వరకు కొత్త సుంకాలను విధిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధాన్ని మరింత పెంచినట్లయింది. ఇప్పటివరకు అమెరికా చైనాపై 145 శాతం సుంకాలు అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. కానీ ఇటీవల ఆ టారిఫ్‌లకు ప్రతిస్పందనగా 125 శాతం సుంకాలతో చైనా పావులు కదపడంతో అమెరికా తీవ్రంగా స్పందించింది. దాంతోపాటు చైనా ఎగుమతి చేసే అరుదైనా ఖనిజాలు, ఇతర వస్తువులపై ఆంక్షలు విధించడం యూఎస్ జీర్ణించుకోలేకపోతుంది. బీజింగ్ ఎగుమతి ఆంక్షలు, ప్రతీకార సుంకాలకు సమాధానం చెబుతూ వైట్‌హౌజ్ తాజాగా విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్లో 245 శాతం సుంకాలు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది.చైనా తాజా చర్యలు..చైనా నుంచి అమెరికా వెళ్లే అరుదైన ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. దాంతో అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70 శాతం వాటా చైనాదే! అమెరికా వాటా 11.4 శాతమే ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో పసిడిఆర్థిక పరిణామాలుఅమెరికా సుంకాలు చైనా ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. లాభాల మార్జిన్లను గణనీయంగా తగ్గించాయి. కొన్ని సంస్థలు పూర్తిగా ఎగుమతులను నిలిపేశాయి. టెక్స్టైల్ కంపెనీలు యూఎస్‌కు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. సుంకాల ప్రభావం వల్ల లాభాలు భారీగా క్షీణించాయని పేర్కొన్నాయి. మరోవైపు వియత్నాం వంటి దేశాలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ఎగుమతి ఆదాయాలు చైనా ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన తయారీ రంగాన్ని బలహీనపరుస్తాయి. ఇప్పటికే ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో కుదేలైన పారిశ్రామికోత్పత్తి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆర్డర్లు తగ్గడంతో కొన్ని కర్మాగారాలు పరికరాలను విక్రయిస్తున్నాయి.
ఫ్యామిలీ

ఆ గ్రామం స్వచ్ఛతకు క్రికెటర్ సచిన్ ఫిదా..!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన మనసుకి హత్తుకున్న వంటకాలు, ప్రదేశాల గురించి షేర్చే స్తుంటారు. అలానే ఈసారి తన మేఘాలయ పర్యటనలో తనను ఎంతో ఇంప్రెస్ చేసిన గ్రామం గురించి తన అభిమానులతో పంచుకున్నారు. అంతేగాదు అందుకు సంబధించిన వీడియోని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.సచిన్‌ని అంతలా ఆకర్షించిన గ్రామమే మేఘాలయలోని మావ్లిన్నాంగ్. ఇది ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేరుతెచ్చుకుంది. ఆ వీడియోలో సచిన్ మావ్లిన్నాంగ్ గ్రామంలో తిరుగుతూ..స్థానికులతో కాసేపు ముచ్చటించారు. అలాగే ఆ ప్రదేశం గురించి మరింత తెలుసుకునే యత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది కూడా. అక్కడ కలియ తిరుగుతుంటే..పచ్చదనంతో నిండిన పరిసరాల్లో తిరుగుతున్నట్లు ఉందని మెచ్చుకున్నారు. అక్కడ చుట్టు పక్కల పరిసరాలు నన్నుఎంతాగనో కట్టిపడేశాయని అన్నారు. అంతేగాక అక్కడ ఉండే స్థానిక పిలల్లతో ఫోటోలకి ఫోజులు కూడా ఇచ్చారు సచిన్. అలాగే పోస్ట్‌లో ఏ గ్రామం అయినా మావ్లిన్నాంగ్ లాగా అందంగా ఉంటే ఫ్లిల్టర్లతో పనేంముంటుంది. పరిసరాలు ఇంత స్వచ్ఛంగా ఉంటే..అంతరంగంలో కూడా ఆటోమేటిగ్గా ప్రశాంతతతో కూడిన ఆనందం సొంత అవుతుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. మావ్లిన్నాంగ్ గ్రామం ప్రత్యేకత..ఇది దేవుని స్వంత తోటగా పిలిచి అందమైన ప్రదేశం. అంతేగాదు డిస్కవర్ ఇండియా మ్యాగజైన్ దీనిని ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేర్కొంది. ఇది తూర్పు ఖాసీ కొండలలో ఉంది. ఆ అందమైన ప్రాంతం ఖాసీ ప్రజలకు నిలయం. అక్కడ ప్రజల తమ సాంప్రదాయ జీవనశైలికి కట్టుబడి ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని ఇంతలా పరిశుభ్రంగా ఉంచడంలో సఫలమయ్యారని చెప్పొచ్చు. ఇక్కడ ఉండే వివిధ పండ్ల తోటలు, ప్రవహించే వాగులు, సతత హరిత వృక్షసంపద సమతుల్యతకు పెద్దపీట వేసినట్లుగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఉండే దట్టమైన అడువులు సుందరమైన ప్రకృతి దృశ్యాన్ని అందించేలా కొండలతో పెనవేసుకుని ఉంటాయి. ముఖ్యంగా టూరిస్టులను అత్యంత ఆకర్షించే పర్యాటక ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇక్కడ అత్యంత ఫేమస్ నోహ్వెట్ లివింగ్ రూట్ బ్రిడ్జి. ఇది ఫికస్ ఎలాస్టికా చెట్టు వేళ్లతో ఏర్పరిచి సంక్లిష్టమైన బ్రిడ్జి. దీని వల్లే అక్కడ ప్రజలు వివిధ భూభాగాలకు సులభంగా ప్రయాణించగలుగుతున్నారు. పైగా ఈబ్రిడ్జ్ పొడవు, నిర్మాణం కూడా ఆశ్చర్యానికిలోను చేస్తుందట. View this post on Instagram A post shared by Sachin Tendulkar (@sachintendulkar) (చదవండి:

Vanajeevi Ramayya వనజీవికి వినూత్న నివాళి!
సాక్షి, సిటీబ్యూరో: జీవితాంతం హరిత విప్లవానికి అంకితమై విశేష కృషి చేసిన ‘వనజీవి’ పద్మశ్రీ దరిపల్లి రామయ్య స్మరణార్థం నగర శివారులోని ప్రముఖ ఏఐ ఆధారిత సర్వైలెన్సెస్ ఈ–సెక్యూరిటీ సిస్టమ్స్ సంస్థ బృహస్పతి టెక్నాలజీస్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. జీవితాంతం మొక్కలు పెంచుతూ, పర్యావరణ సంరక్షణ కోసం పాటు పడిన వనజీవి రామయ్యకు నివాళిగా వెల్జెర్ల వేదికగా 100 మందికి పైగా బృహస్పతి టెక్నాలజీస్ ఉద్యోగులు, స్థానిక రైతులు పాల్గొని మొక్కలు నాటుతూ రామయ్యను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఏకకాలంలో 600కు పైగా మొక్కలు నాటుతూ భవిష్యత్ కార్యాచరణను ప్రారంభించామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ పాపోలు తెలిపారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై విజ్ఞానం పెంచేందుకు విశేషంగా పనిచేసిన ఉద్యోగులను ప్రోత్సహించడమే లక్ష్యంగా వారిని ప్రత్యేకంగా సత్కరించి బహుమతులు అందించారు. ప్రతి పౌరుడూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని రామయ్య చెప్పకనే చెప్పారని గుర్తు చేశారు. ఈ మొక్కలు నాటడంలో పద్మశ్రీ దరిపల్లి రామయ్య సేవలు తమకు ప్రేరణ అని, ఈ ప్రయత్నంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కార్పొరేట్ సంస్థగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఉద్యోగుల్లో ప్రకృతి పట్ల ప్రేమను పెంచడమే కాదు, పనితో వచ్చే ఒత్తిడిని కూడా తగ్గించవచ్చన్నారు. సస్టెయినబిలిటీ, సామాజిక బాధ్యతగా ఈ వినూత్న కార్యక్రమం సామాజిక విప్లవంగా మారాలని అన్నారు.

"ది ఓబీసీ జాతి జాగరణ" పుస్తకం విడుదల
"ది ఓబీసీ జాతి జాగరణ" పుస్తకం విడుదల — సామాజిక న్యాయంపై దృష్టి సారించిన మహాగాథా నుండి మరో ప్రబల రచనఅధికారి పి.నరహరి (ఐఏఎస్) మరియు న్యాయవాది ప్రతాప్‌రాజ్ సింగ్ రచయితలు భారత దేశ సామాజిక రాజకీయ చరిత్రలో మైలురాయిగా నిలిచేలా, “ది ఓబీసీ జాతి జాగరణ” పుస్తకం అధికారికంగా విడుదలైంది. ప్రముఖ ఐఏఎస్ అధికారి పి.నరహరి, హైకోర్ట్ న్యాయవాది ప్రతాప్‌రాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఈ గ్రంథాన్ని మహాగాథా ప్రచురించింది. ఇది సంస్కృతిక పునరుజ్జీవనం, వేద మంత్రాలు , ఆధునిక ఆలోచనల సమన్వయానికి నిలయంగా ఎదుగుతోందని ప్రచురణకర్తలు ప్రకటించారు. ఆరేళ్ళ లోతైన పరిశోధన, ఆరు రాష్ట్రాల యాత్ర రచయితలు ఆరు భారతీయ రాష్ట్రాల్లో ఆరేళ్లపాటు జరిపిన ప్రయాణం ద్వారా, అధ్యాపకులు, రాజకీయ నాయకులు, విద్యార్థి నేతలు, సామాజిక చింతకులు వంటి అనేక రంగాల వ్యక్తులతో చర్చలు అనంతరం ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇది ఓబీసీ వర్గాలలో పెరుగుతున్న అసమాధానాన్ని, వాటి ఆధారంగా ఏర్పడుతున్న సామాజిక రాజకీయ ఉద్యమాన్ని విశ్లేషిస్తుంది. తొమ్మిది విభాగాలుగా వచ్చిన పుస్తకంలోని కీలక అంశాలు బ్రిటిష్ పాలనలో కులవృత్తులపై జరిగిన సామాజిక-ఆర్థిక దోపిడీ.కాకా కలేల్కర్ కమిషన్ నుండి మండల్ కమిషన్ వరకు, న్యాయమూర్తి రోహిణి కమిషన్ వరకు జరిగిన చారిత్రక పరిణామాలు. రిజర్వేషన్, క్రీమీ లేయర్, రాజ్యాంగ న్యాయ విభాగాలపై ఉన్నత న్యాయస్థానాల తీర్పుల విశ్లేషణ. ప్రభుత్వ గణాంకాలు, అకడమిక్ అధ్యయనాలు, ఫీల్డ్ రీసెర్చ్ ద్వారా సమకాలీన ఓబీసీ స్థితిగతుల సమగ్ర విశ్లేషణ.ఓబీసీ మేనిఫెస్టో — నూతన రాజకీయం కోసం మార్గసూచికఓబీసీ మేనిఫెస్టో. ఇది దేశవ్యాప్తంగా ఓబీసీ నాయకులతో జరిపిన సమావేశాల ఫలితంగా రూపొందిన ప్రజా డిమాండ్ల సమాహారం. అన్నిరాజకీయ పార్టీలకు సమర్పించిన ఈ మేనిఫెస్టో, ఓబీసీల సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతుంది."ఇది కేవలం పుస్తకమే కాదు, ఒక సంకల్పం — వినే స్పందించే, ఆచరించే భారతదేశాన్ని కలగనిచ్చే పిలుపు." అని రచయితలు పేర్కొన్నారు. మంత్రధ్వని ద్వారా శరీరానికి హీలింగ్ చేస్తున్నట్టే, శబ్దం ద్వారా సమాజానికి జాగృతి కలిగించడమే లక్ష్యమన్నారు.మహాగాథా వ్యవస్థాపకుడు దేవ రుషి ఈ సందర్భంగా ఇలా అన్నారు: ఈ పుస్తకం గణాంకాల గురించి మాత్రమే కాదు — ఇది ఓ శబ్ద యాగం, ఓ న్యాయం కోసం సంచలనం. ఇది మహాగాథా లక్ష్యాన్ని ప్రతిబింబించే రచన.”పుస్తకం వివరాలు:● శీర్షిక: The OBCs Uprising● రచయితలు: పి.నరహరి (ఐఏఎస్), ప్రతాప్‌రాజ్ సింగ్ (న్యాయవాది)● ప్రచురణ సంస్థ: మహాగాథా● భాష: ఇంగ్లీష్● వర్గం: రాజకీయ శాస్త్రం, చరిత్ర, సామాజిక న్యాయం● అందుబాటులో ఉంటుంది: ప్రముఖ ఆన్లైన్ స్టోర్లు ,బుక్‌స్టోర్స్‌లో త్వరలో

భారతీయ ఫేమస్ వంటకాన్ని మెచ్చిన జపాన్ రాయబారి..!
మన భారతీయ వంటకాలు విదేశీయలు మెచ్చుకోవడం కొత్తేం కాదు. కానీ ప్రముఖులు, అత్యున్నత హోదాలో ఉన్నవాళ్లు ఇతర దేశాల ప్రముఖ వంటకాలను రుచి చూస్తే మాత్రం..వెంటనే వాళ్లపై గౌరవం పెరుగుతుంది. అదీగాక ఆ వంటకం టేస్ట్‌ని మెచ్చుకుంటే..ఇక ఆ ఆనందం వేరెలెవెల్. అచ్చం అలాంటి సందర్భమే ఇక్కడ చోటుచేసుకుంది. భారతదేశం పర్యటనలో ఉన్న జపాన్ రాయబారి కైచి ఓనో బిహార్ పేమస్ వంటకమైన 'లిట్టి చోఖా'ని రుచి చూశారు. లిట్టి చోఖా ప్రపంచ వంటకాల్లోని తనదైనముద్ర వేసిన విలక్షణమైన వంటకం ఇది. భూటాన్, భారత్‌లలో సేవలందిస్తున్న జపాన్ రాయబారి కైచి ఓ రెస్టారెంట్లో బిహారి వంటకాలను రుచి చూశారు. టేబుల్‌పై అందంగా ఒక బౌల్లో ఆకర్షణీయంగా అమర్చిన రైస్, పెరుగు, చేపల ఫ్రై, వాటితోపాట ఈ లిట్టి చోఖా రెసిపీ కూడా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.."నమస్తే బిహార్..చివరికి బిహార్ ప్రముఖ వంటకం లిట్టు చోఖాను రుచి చూసే అవకాశం లభించింది." అని పోస్ట్‌పెట్టారు. అంతేగాదు ఆ పోస్ట్‌లో జపాన్ రాయబారి బిహారీ మాండలికాన్ని ప్రదర్శిస్తూ..“గజబ్ స్వాద్ బా” అని కితాబు కూడా ఇచ్చేశారు. ఇక్కడ గజబ్ స్వాద్ బా అంటే గొప్ప రుచి అని అర్థం. ఇది ఆహార ప్రియులను ఎంతగానో ఆకర్షించడమే గాక ఆశ్చర్యపరిచింది కూడా.ఏంటీ 'లిట్టి చోఖా ' :బిహారీ సంప్రదాయ వంటకం ఇది. దీన్ని స్టఫ్డ్ బేక్డ్ హోల్ వీట్ బాల్స్ అని కూడా అంటారు. ఇది చాలా రుచికరమైన, పోషక వంటకం. గోధుమ పిండి బంతిలో సుగంధద్రవ్యాలతో కూడిన మసాల ఉంచి సైడ్ డిష్‌గా కూరగాయలతో చేసిన కర్రీని అందిస్తారు. అలాగే ఇక్కడ జపాన్‌తో బీహార్ చాలా లోతైన ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబంధాన్ని కలిగి ఉంది. అందులోనూ ఇది బుద్ధుని భూమి కావడంతో జపాన్ వాసులకు ఎంతో ఇష్టమైన ప్రదేశంగా పేరుగాంచింది.Namaste, Bihar!Finally had the chance to try the world-famous Litti Chokha—Gajab Swad Ba!👍 pic.twitter.com/DTzqStRsUn— ONO Keiichi, Ambassador of Japan (@JapanAmbIndia) April 14, 2025 (చదవండి: వేసవి తాపం నుంచి రక్షించే సహజ ఆరోగ్య పానీయాలివే..!)
ఫొటోలు


కలర్‌ఫుల్ శారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ హన్సిక (ఫోటోలు)కలర్‌ఫుల్ శారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ హన్సిక (ఫోటోలు)


కూతురితో తొలి తమిళ ఉగాది సెలబ్రేషన్స్ (ఫొటోలు)


తల్లికి తగ్గ వారసురాలు.. హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న స్టార్ నటి కూతురు.. ఫోటోలు చూశారా? (ఫొటోలు)


సతీమణి వితికా శేరుతో హీరో వరుణ్ సందేశ్ వింటేజ్ లుక్ (ఫొటోలు)


‘డియర్ ఉమ’ మూవీ హీరోయిన్ సుమయ రెడ్డి (ఫొటోలు)


MAMI ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ఈవెంట్లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)


విశాఖపట్నం : అంగరంగ వైభవంగా పెదవాల్తేరు పోలమాంబ జాతర (ఫొటోలు)


ఉపేంద్ర, శివరాజ్ కుమార్ ‘45’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)


హైదరాబాద్‌లో పలుచోట్ల వడగండ్ల వర్షం (ఫొటోలు)


పెళ్లిబంధంలోకి టాలీవుడ్ నటి అభియన.. గ్రాండ్‌గా వేడుకలు (ఫొటోలు)
అంతర్జాతీయం

థెరపిస్టు చాట్‌జీపీటీ
లవ్ బ్రేకప్.. ఒంటరితనం.. ఆఫీసులో కోపిష్టి బాస్ వేధింపులు.. సహోద్యోగులతో ఇబ్బందులు.. జీవితంలో ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి, ఓపిగ్గా వినేవారొకరు ఉండాలి. తీరా చెప్పాక జడ్జ్ చేయకుండా ఉంటారా? నిష్పాక్షికంగా పరిష్కార మార్గం సూచిస్తారా? అనుమానమే. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా మానసిక వైద్యులను సంప్రదిస్తారు. కానీ ఇప్పుడు ట్రెండు మారుతోంది. ఈ విషయంలో చాట్‌జీపీటీకే జనం ఓటేస్తున్నారు. సమస్యలను వినే మంచి ఫ్రెండ్‌గానే గాక వాటికి పరిష్కారం చూపే కౌన్సిలర్‌గా కూడా భావిస్తున్నారు. లైఫ్ కౌన్సిలర్ 27 ఏళ్ల మనీశ్ ఇంజనీర్. ప్రియురాలితో గొడవైంది. అపార్థాలతో బంధానికి బ్రేక్ పడింది. మానసికంగా అలసిపోయి ఓ సాయం వేళ చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. సమస్యంతా చెప్పాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదన్నాడు. చాట్‌జీపీటీ సమాధానం మనోన్ని ఆశ్చర్యపరిచింది. ‘‘మీరు చెప్పింది ఆమె వినకపోవడం మిమ్మల్ని బాధిస్తోంది. అదే విషయం ఆమెకు నేరుగా చెప్పారా?’’అని అడిగింది. అంతటితో ఆగకుండా ప్రేయసికి సందేశం పంపడంలో మనీశ్‌కు సాయపడింది. ఆమెను నిందించకుండా కేవలం అతని ఫీలింగ్స్ మాత్రమే వ్యక్తపరిచే ప్రశాంతమైన, నిజాయితీతో కూడిన నోట్ అది. అందుకున్న ఆ అమ్మాయి మనీశ్ తో మాట్లాడింది. ఇంకేముంది వారి మధ్య దూరం తగ్గిపోయింది. వృత్తి సమస్యల్లో సాయం 26 ఏళ్ల అక్షయ్ శ్రీవాస్తవ కంటెంట్ రైటర్, మీడియా ప్రొఫెషనల్. ఆఫీసుకు వెళ్లిరావడానికే నాలుగ్గంటలు పోతోంది. నిద్ర లేదు. కుటుంబంతో గడపడానికి లేదు. ఫిర్యాదులా కాకుండా ఈ విషయాన్ని బాస్‌తో ఎలా చెప్పాలో తేలక చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. వాడాల్సిన పదాలతో సహా చక్కని నిర్మాణాత్మక సలహాలిచ్చింది. అప్పటినుంచి అక్షయ్ క్రమం తప్పకుండా చాట్‌బాట్‌ను ఆశ్రయిస్తున్నాడు. ఆయేషాది మరో సమస్య. ఇన్నాళ్లు సహోద్యోగిగా ఉన్న స్నేహితులకే బాస్ అయింది. సాన్నిహిత్యం కోల్పోకుండా వాళ్లతో ఎలా డీల్ చేయాలని చాట్‌జీపీటీనే అడిగింది. అదిచ్చిన సమాధానం ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌లో క్రాష్ కోర్సులా సాయపడింది. బెటర్ కౌన్సిలర్? ఒక్కోసారి కౌన్సిలర్ కంటే మెరుగ్గా చాట్‌జీపీటీ ఇచ్చే సమాధానాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. జీవితంలో చాలా కోల్పోయానని అపిస్తుందనే ప్రశ్నకు.. ‘మార్పు జరిగినప్పుడు అది మామూలే. అభిరుచులను పెంచుకోండి’అని కౌన్సిలర్ చెప్పారు. చాట్‌జీపీటీ మాత్రం, ‘సంతోషపరిచే పనులు చేయండి. చిన్న లక్ష్యాలు పెట్టుకుని చేరుకునే ప్రయత్నం చేయండి’అని సూచించింది. స్నేహితులు అర్థం చేసుకోవడం లేదంటే వారితో ఓపెన్‌గా మాట్లాడమని థెరపిస్టు చెబితే, ‘స్నేహితుల్లో అపార్థాలు మామూలే. వారితో నిజాయితీగా మాట్లాడండి’అని చాట్‌జీపీటీ సూచించింది. పని నచ్చడం లేదంటే ఒత్తిళ్లను గుర్తించి పరిష్కారానికి కొత్తగా ప్రయతి్నంచమని కౌన్సిలర్ చెప్పాడు. చాట్‌జీపీటీ మాత్రం, ‘పనిలో పరిమితులను పెట్టుకోండి. హెచ్ఆర్ లేదా మెంటార్‌తో మాట్లాడండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’అని సలహా ఇచ్చింది. భాగస్వామితో విభేదాలపై ఓపెన్‌గా మాట్లాడుకుని, సమస్యకు కారణాలేంటో కనిపెట్టి పరిష్కారానికి కలిసి ప్రయతి్నంచండన్న చాట్‌జీపీటీ సూచనే మెరుగ్గా ఉందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.ప్రత్యామ్నాయం కాబోదు: మానసిక వైద్యులు మానసిక వైద్యం మనదేశంలో కాస్త ఖరీదైన విషయం. జనంలో అవగాహన లేమి కూడా ఉంది. ఆ సమస్యలకు చాలామంది క్రమంగా ఏఐపై ఆధారపడుతున్నారు. అది జడ్జ్ చేయదు. చెబుతుంటే మధ్యలో అడ్డుకోదు. ఏం చెప్పినా, ఎంతసేపు చెప్పినా, ఎప్పుడు చెప్పినా శ్రద్ధగా వింటుంది. అంతే ఓపిగ్గా సమాధానమూ ఇస్తుంది. దాంతో వ్యక్తిగతం నుంచి వృత్తిపరమైన సలహాల దాకా యూత్ చాట్‌జీపీటీపై ఆధారపడుతోంది. కానీ ఈ చాట్‌బాట్ మానసిక ఇబ్బందులకు మొత్తంగా పరిష్కారం చూపలేదంటున్నారు వైద్యులు. ‘‘అది తాత్కాలిక ఉపశమనమిచ్చే ఔట్‌లెట్‌లా పనిచేస్తుందంతే. పూర్తిస్థాయి మానసిక చికిత్స ప్రక్రియకు ప్రత్యామ్నాయం కాబోదు. సహానుభూతి, అంతర్దష్టి, అవగాహన వాటికుండవు’’అంటున్నారు. అంతేగాక ఏఐ థెరపీ బాట్లతో ముప్పు కూడా ఉంటుందని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ హెచ్చరించింది. ప్రత్యేకించి వాటిని పిల్లలు వాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. మనుషులను అవి మరింత ఒంటరులను చేస్తాయనీ హెచ్చరించింది. – సాక్షి, నేషనల్ డెస్క్

మనోళ్లపై మరో పిడుగు
ట్రంప్ సర్కారు భారతీయులను నానాటికీ మరింతగా లక్ష్యం చేసుకుంటోంది. వారిని వేధించేలా రోజుకో తరహా నిబంధనలు తీసుకొస్తోంది. హెచ్–1బీ వీసాలు, గ్రీన్‌కార్డులు ఆశావహుల కలలపై నీళ్లు చల్లేలా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ పిఫ్త్ ప్రిఫరెన్స్ (ఈబీ–5) అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద వాటికోసం దరఖాస్తు చేసుకునేందుకు కటాఫ్‌ను ఆర్నెల్ల పాటు తగ్గించింది. దాన్ని 2019 నవంబర్ 1 నుంచి 2019 మే 1కి మార్చింది. ఈబీ–5 కేటగిరీలో భారతీయుల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్న సాకుతో ఈ నిర్ణయం తీసుకుంది. మే నెలకు సంబంధించి విడుదల చేసిన వీసా బులెటిన్‌లో అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఈ మేరకు పేర్కొంది. దాంతో చాలామంది భారతీయులు ఈబీ–5 కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మారారు! నెలవారీ బులెటిన్‌లో విదేశాంగ శాఖ పేర్కొనే ‘తుది కార్యాచరణ తేదీ’లు చాలా కీలకం. వీసా/గ్రీన్‌కార్డు దరఖాస్తును ప్రాసెసింగ్ నిమిత్తం యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సరీ్వసెస్ (యూఎస్సీఐఎస్) పరిగణనలోకి తీసుకోవాలంటే అవి బులెటిన్‌లో పేర్కొన్న తేదీ కంటే ముందువి అయ్యుండాలి. చైనాకు మాత్రం ఈబీ–5 కటాఫ్‌ను మార్చకపోవడం విశేషం. ఏమిటీ ఈబీ–5 కేటగిరీ? అర్హులైన వలస ఇన్వెస్టర్లకు అమెరికాలోని గ్రామీణ, హెచ్చు నిరుద్యోగ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించేందుకు ఈబీ–5 కేటగిరీని అమెరికా తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా అన్ రిజర్వుడ్ విభాగం కింద దరఖాస్తు చేస్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దాంతో అందుబాటులో ఉండే వీసాల తగ్గిపోతోంది. భారతీయులకు ఈబీ–5 కటాఫ్ తగ్గింపు వల్ల అర్హుల జాబితా నుంచి చాలామంది గల్లంతవుతారు. – సాక్షి, నేషనల్ డెస్క్

అమెరికా–ఇరాన్ తదుపరి చర్చా వేదిక రోమ్
రోమ్: ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా–ఇరాన్ మధ్య తదుపరి చర్చలు శనివారం రోమ్‌లో జరగనున్నాయి. ఇరాన్, ఇటలీ అధికారులు ఈ విషయాన్ని సోమవారం ధ్రువీకరించాయి. చర్చలకు మధ్యవర్తిగా ఉన్న ఒమన్ నుంచి అందిన వినతి మేరకు అంగీకరించినట్లు ఇటలీ ప్రధాని ఆంటోనియో టజనీ తెలిపారు. ఒమన్ రాజధాని మస్కట్‌లో శనివారం రెండు దేశాల మధ్య మొదటి రౌండ్ చర్చలు జరగడం తెల్సిందే. కాగా, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) చీఫ్ రఫేల్ మరియానో గ్రాస్సీ సోమవారం ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చించేందుకు బుధవారం టెహ్రాన్ వెళ్తున్నట్లు ప్రకటించారు. తమ పరిశీలకుల బృందాన్ని అణు మౌలిక వసతులను సందర్శించేందుకు వీలు కల్పించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరే అవకాశముందని సమాచారం.

చైనా స్మార్ట్ఫోన్లపై సుంకాలు
వాషింగ్టన్: ప్రతీకార సుంకాలు విధించినా, నేరుగా బెదిరించినా చైనా దారికి రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. ఆ దేశంపై మరింతగా కత్తులు నూరుతున్నారు. చైనా స్మార్ట్ ఫోన్లతో పాటు ఆ దేశ ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాలు విధించనున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. అవి ఎంత శాతమన్నది సోమవారం వెల్లడిస్తానని తెలిపారు. ‘‘ఎలక్ట్రానిక్ వస్తువులకు నేను ప్రకటించిన సుంకాల మినహాయింపు చైనాకు వర్తించబోదు. వాటిపై కేవలం సుంకాల శాతం మార్పుచేర్పులు చేయబోతున్నామంతే’’ అని ఆదివారం ట్రంప్ వెల్లడించారు. ‘‘చైనా ఎలక్ట్రానిక్ వస్తువులకు సెమీ కండక్టర్ టారిఫ్‌లు వర్తించవచ్చని వాణిజ్య మంత్రి హొవార్డ్ లెట్నిక్ చెప్పుకొచ్చారు. అమెరికాకు అవసరమైన ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఔషధాలు.. ఇలా అన్ని వస్తువులూ దేశీయంగానే తయారు కావాలన్నది అధ్యక్షుని ఆలోచన అన్నారు. స్మార్ట్ఫోన్లతో పాటు చైనా నుంచి దిగుమతయ్యే అన్నిరకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులనూ ఆ దేశంపై విధించిన 145 శాతం టారిఫ్ నుంచి మినహాయిస్తున్నట్టు అమెరికా కస్టమ్స్ విభాగం శనివారం నోటీసులో వెల్లడించడం తెలిసిందే. ఈ అంశంపై రెండు రోజుల్లోనే ట్రంప్ పిల్లమొగ్గ వేశారు. ఆ నోటీసు వాస్తవం కాదంటూ సొంత సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌సోషల్‌లో పోస్టు పెట్టారు. అమెరికాకు ఎలక్ట్రానిక్స్ వస్తువుల సరఫరాపై త్వరలో నేషనల్ సెక్యూరిటీ టారిఫ్స్ ఇన్వెస్టిగేషన్స్ భేటీలో కూలంకషంగా చర్చిస్తామని చెప్పుకొచ్చారు.
జాతీయం

హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌పై చార్జిషీట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, ఎంపీలు సోనియా గాందీ, రాహుల్ గాం«దీతోపాటు ఇతర నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషిట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా, సుమన్ దూబే, సునీల్ భండారీతోపాటు యంగ్ ఇండియా, డాటెక్స్ మెర్కండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను చార్జిషిట్‌లో నిందితులుగా చేర్చింది.రూ.2,000 కోట్ల విలువైన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను దోచుకోవడానికి కుట్ర జరిగిందని, ప్రస్తుతం వాటి విలువ రూ.5,000 కోట్లు ఉంటుందని ఈడీ స్పష్టంచేసినట్లు సమాచారం. ఈ కేసులో సోనియా, రాహుల్ గాం«దీలను ఈడీ గతంలో పలుమార్లు విచారించింది. వారిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడం మాత్రం ఇదే మొదటిసారి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)లోని వేర్వేరు సెక్షన్ల కింద ఈ నెల 9వ తేదీన ఈ చార్జిషీట్‌ను ఈడీ దాఖలు చేసింది. ఇందులో నంబర్–1గా సోనియా గాం«దీ, నెంబర్–2గా రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించింది. ఈడీ చార్జిషీట్‌ను పరిశీలించిన ప్రత్యేక జడ్జి విశాల్ గాగ్నే దీనిపై తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని కాంగ్రెస్ ఆరోపించింది. సుబ్రమణ్య స్వామి ఫిర్యాదుతో.. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది. వాటిని స్వాదీనం చేసుకుంటామని చెబుతూ ఆయా ఆస్తుల్లో ఉంటున్నవారికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో 2021లో ఈడీ విచారణ ప్రారంభమైంది. 2014 జూన్ 26న బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ పరిగణనలోకి తీసుకున్నారు.మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈడీ దర్యాప్తు చేపట్టింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు మోతీలావ్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ తదితరులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. నిందితులపై దర్యాప్తు చేపట్టడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని పేర్కొంది. కోర్టులు ఆ పిటిషన్లను కొట్టివేశాయని, దర్యాప్తునకు అనుమతించాయని గుర్తుచేసింది. సత్యమేవ జయతే: జైరామ్ రమేశ్ ఈడీ చార్జిషిట్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ వేధింపులపై తాము మౌనంగా ఉండే ప్రసక్తే లేదని, కచ్చితంగా పోరాడుతామని స్పష్టంచేశారు. సత్యమేవ జయతే అంటూ మంగళవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. హెరాల్డ్ ఆస్తులను స్వా«దీనం చేసు కోవడం ప్రభుత్వ ప్రాయోజిత నేరమని విమర్శించారు. ప్రధాని, హోంమంత్రి బెదిరించాలని చూస్తే బెదిరిపోయే వారు ఎవరూ లేరని తేల్చిచెప్పారు. మరోవైపు సోనియా, రాహుల్‌పై చార్జిషిట్‌కు వ్యతిరేకంగా బుధవారం ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఏమిటీ నేషనల్ హెరాల్డ్ కేసు? నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను 1938లో జవహర్లాల్ నెహ్రూ స్థాపించారు. ఈ పత్రికను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్) ప్రచురించింది. 2008లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పత్రిక మూతపడింది. నేషనల్ హెరాల్డ్‌కు దేశ రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాల్లో విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. 2010లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పాటైంది. ఇందులో సోనియా గాం«దీ, రాహుల్ గాంధీలకు 38 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. రూ.2,000 కోట్లకుపైగా విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను 2012లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేవలం రూ.50 లక్షలకు కొట్టేసిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు.

ఈసీ తీరు పూర్తిగా.. అనుమానాస్పదం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు సంస్థ పూర్తిగా తిలోదకాలిస్తోందంటూ ధ్వజమెత్తాయి. ‘‘ఓటింగ్‌కు సంబంధించి పౌరులందరికీ తెలియాల్సిన గణాంకాలను అడిగినా బయటపెట్టడం లేదు. ఎన్నికల ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఈసీ తీరుతో నానాటికీ బలపడుతున్నాయి’’ అంటూ దుయ్యబట్టాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించిన పూర్తి గణాంకాలను బయట పెట్టాల్సిందిగా అవి చిరకాలంగా డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఈ విషయమై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లకు సంబంధించి 17సీ పార్ట్–1 తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. దీనిపై తొలుత ఈసీని సంప్రదించాల్సిందిగా గత నెల కోర్టు వారికి సూచించింది. దాంతో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఆహ్వానం ఆ మేరకు మంగళవారం సమావేశం జరిగింది. ఏడీఆర్ ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, మొయిత్రా తదితరులు భేటీలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను మరోసారి ఈసీ ప్రతినిధుల ముందుంచారు. అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. ఈసీ తీరుపై పెదవి విరిచారు. తమ డిమాండ్లకు ఎలాంటి సానుకూల స్పందనా రాలేదంటూ ఆక్షేపించారు.సీఈసీ, ఈసీ ఎక్కడ: భూషణ్సీఈసీ గానీ, ఎన్నికల కమిషనర్లు గానీ భేటీలో పాల్గొనకపోవడాన్ని ప్రతినిధులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఏదో అత్యున్నత న్యాయస్థానం సూచించింది గనుక తప్పలేదన్నట్టుగా వ్యవహరించారు. భేటీకి కేవలం ఈసీ ప్రతినిధులను పంపి సరిపెట్టారు. సంస్థ విశ్వసనీయతకు సంబంధించిన అతి కీలకమైన సమస్య విషయంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో దీన్నిబట్టే తేలిపోతోంది. అయినా సుప్రీంకోర్టుపై గౌరవంతో మా అనుమానాలన్నింటినీ ఈసీ ప్రతినిధుల ముందుంచాం. 2019 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ శాతానికి సంబంధించిన డేటాలో చాలా అవకతవకలున్నట్టు వారి దృష్టికి తీసుకెళ్లాం. వాటిపై సమాధానాలు కోరాం. ఫాం 17(సీ), 20 వంటివాటిని వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించాం. ఇది ఈసీ విశ్వసనీయతకే పెనుసవాలు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరాం. కానీ వారినుంచి సానుకూల స్పందనే లేదు’’ అంటూ ప్రశాంత్ భూషణ్ పెదవి విరిచారు. దీనిపై తమ తదుపరి వాదనలను ఇక సుప్రీంకోర్టు ముందే ఉంచుతామని స్పష్టం చేశారు. ఓటింగ్ సంబంధిత డేటాను ఎన్నికల ఏజెంట్లకు అందించడంలో లేని అభ్యంతరం వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ‘‘ఓటింగ్ విషయంలో తప్పిదాలు, అవకతవకలు జరుగుతున్నాయని, ఈవీఎంల టాంపరింగ్ జరుగుతోందని దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా అనుమానాలున్నాయి. అవి వాస్తవమేనంటూ దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు గళమెత్తుతున్నారు. ఈసీ ప్రవర్తన ఆ అనుమానాలకు మరింతగా బలం చేకూరుస్తోంది’’ అంటూ భూషణ్ దుయ్యబట్టారు.2024లోనూ అవకతవకలు: మొయిత్రా2019లోనే గాక 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో కూడా ఓటింగ్‌కు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయని మొయిత్రా ఆరోపించారు. ‘‘గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు పొంతనే లేదు. సాయంత్రం దాకా ఉన్న పోలింగ్ శాతాలు రాత్రికల్లా అనూహ్యంగా భారీగా పెరిగిపోయాయి. చాలాచోట్ల ఈ పెరుగుదల ఏకంగా 20 శాతం దాకా ఉంది’’ అని గుర్తు చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఈసీ విశ్వసనీయత ఎన్నడూ లేనంతగా అడుగంటిందని విమర్శించారు. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈసీ పూర్తిగా అప్రతిష్టపాలైందన్నారు. ‘‘మేం కోరుతున్నది రహస్య వివరాలేమీ కాదు. దేశప్రజలందరికీ వాటిని తెలుసుకునే హక్కుంది. అంతేకాదు, వాటిని తెలుసుకుని తీరాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది’’ అని ఆమె స్పష్టం చేశారు.

ఈసీ తీరు అనుమానాస్పదం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు సంస్థ పూర్తిగా తిలోదకాలిస్తోందంటూ ధ్వజమెత్తాయి. ‘‘ఓటింగ్‌కు సంబంధించి పౌరులందరికీ తెలియాల్సిన గణాంకాలను అడిగినా బయటపెట్టడం లేదు. ఎన్నికల ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఈసీ తీరుతో నానాటికీ బలపడుతున్నాయి’’ అంటూ దుయ్యబట్టాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించిన పూర్తి గణాంకాలను బయట పెట్టాల్సిందిగా అవి డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఈ విషయమై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లకు సంబంధించి 17సీ పార్ట్–1 తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. దీనిపై తొలుత ఈసీని సంప్రదించాల్సిందిగా గత నెల కోర్టు వారికి సూచించింది. దాంతో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఆహ్వానం మేరకు మంగళవారం సమావేశం జరిగింది. ఏడీఆర్ ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, మొయిత్రా తదితరులు భేటీలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈసీ తీరుపై పెదవి విరిచారు. సీఈసీ, ఈసీ ఎక్కడ: భూషణ్ సీఈసీ గానీ, ఎన్నికల కమిషనర్లు గానీ భేటీలో పాల్గొనకపోవడాన్ని ప్రతినిధులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఏదో అత్యున్నత న్యాయస్థానం సూచించింది గనుక తప్పలేదన్నట్టుగా వ్యవహరించారు. భేటీకి కేవలం ఈసీ ప్రతినిధులను పంపి సరిపెట్టారు. సంస్థ విశ్వసనీయతకు సంబంధించిన అతి కీలకమైన సమస్య విషయంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో దీన్నిబట్టే తేలిపోతోంది. అయినా సుప్రీంకోర్టుపై గౌరవంతో మా అనుమానాలన్నింటినీ ఈసీ ప్రతినిధుల ముందుంచాం. 2019 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ శాతానికి సంబంధించిన డేటాలో చాలా అవకతవకలున్నట్టు వారి దృష్టికి తీసుకెళ్లాం. వాటిపై సమాధానాలు కోరాం. ఫాం 17(సీ), 20 వంటివాటిని వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించాం. కానీ వారినుంచి సానుకూల స్పందనే లేదు’’ అంటూ ప్రశాంత్ భూషణ్ పెదవి విరిచారు. దీనిపై తమ తదుపరి వాదనలను ఇక సుప్రీంకోర్టు ముందే ఉంచుతామని స్పష్టం చేశారు. ‘‘ఓటింగ్ విషయంలో తప్పిదాలు, అవకతవకలు జరుగుతున్నాయని, ఈవీఎంల టాంపరింగ్ జరుగుతోందని దేశవ్యాప్తంగా చాలా అనుమానాలున్నాయి. అవి వాస్తవమేనంటూ దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు గళమెత్తుతున్నారు. ఈసీ ప్రవర్తన ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది’’ అంటూ భూషణ్ దుయ్యబట్టారు. 2024లోనూ అవకతవకలు: మొయిత్రా 2019లోనే గాక 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో కూడా ఓటింగ్‌కు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయని మొయిత్రా ఆరోపించారు. ‘‘గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో్లనూ చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు పొంతనే లేదు. సాయంత్రం దాకా ఉన్న పోలింగ్ శాతాలు రాత్రికల్లా భారీగా పెరిగిపోయాయి. చాలాచోట్ల ఈ పెరుగుదల ఏకంగా 20 శాతం దాకా ఉంది’’ అని గుర్తు చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఈసీ విశ్వసనీయత ఎన్నడూ లేనంతగా అడుగంటిందని విమర్శించారు. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈసీ పూర్తిగా అప్రతిష్టపాలైందన్నారు. ‘‘మేం కోరుతున్నది రహస్య వివరాలేమీ కాదు. దేశప్రజలందరికీ వాటిని తెలుసుకునే హక్కుంది’’ అని ఆమె స్పష్టం చేశారు.

వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ
ఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిసి పిటిషన్ పై రేపు(బధవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ ఐటం నెంబర్ 86గా సుప్రీంకోర్టులో లిస్ట్ అయ్యింది. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న వైఎస్సార్సీపీ.. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంతో ముస్లింల మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పిటిషన్ లో పేర్కొంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ లో స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే, వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె వి విశ్వనాథన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది.
ఎన్ఆర్ఐ

డల్లాస్‌లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్‌లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్‌లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్‌ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-

నాట్స్ సంబరాల్లో సరికొత్త సాహిత్య కార్యక్రమాలు
అమెరికాలోని టంపాలో జూలై 4.5,6 తేదీల్లో జరిగే 8 వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఈసారి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు ఉంటాయని ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విజేత చంద్రబోస్ తెలిపారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో తెలుగు భాష కోసం నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. అమెరికా తెలుగు సంబరాల్లో తనతో పాటు వచ్చే తెలుగు రచయితలతో కలిసి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో నాట్స్ సంబరాలకు విచ్చేసే అతిధుల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబోస్ మాట్లాడారు. సంబరాల్లో సాహిత్య పరిమళాలు వెదజల్లడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాట్స్‌తో తనకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని.. గతంలో కూడా నాట్స్ సంబరాలకు వెళ్లానని ప్రముఖ సినీ సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అన్నారు. సంబరాల సాహితీ కార్యక్రమాల్లో కచ్చితంగా పాలుపంచుకుంటానని తెలిపారు.. నాట్స్ సంబరాలకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని ప్రముఖ గేయ రచయిత త్రిపురనేని కల్యాణ్ చక్రవర్తి అన్నారు. సంబరాల్లో తెలుగు సాహిత్య సదస్సుల్లో పాల్గొనే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ 8 వ అమెరికా తెలుగు సంబరాలకు అందరూ కుటుంబసమేతంగా రావాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి పిలుపునిచ్చారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు 300 మంది సంబరాల కార్యవర్గ కమిటీ సభ్యులు ఇప్పటినుంచే ముమ్మరంగా కృషి చేస్తున్నారు. సంబరాల్లో తెలుగు భాష ప్రేమికులను ఆకట్టుకునే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు.

గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ మహిళా దినోత్సవం
గ్రేటర్ ఓర్లాండోలో నాట్స్ క్రమంగా తెలుగు వారికి చేరవయ్యేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రేట్ ఓర్లాండో లోని తెలుగు మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శక్తి పౌండేషన్ మధురిమ, మా దుర్గ సాయి టెంపుల్ చెందిన అనితా దుగ్గల్, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్షియేటివ్కి చెందిన పార్వతీ శ్రీరామ, సృజని గోలి, శుభ, విమెన్ ఫర్ ఛారిటీకి చెందిన రత్న సుజ, నిషితలు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించారు.కాలిఫోర్నియా నుంచి శిరిష ఎల్లా ఈ మహిళ దినోత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చి అందరిలో స్ఫూర్తిని నింపారు. సంతోష్, వేణు మల్ల, రాజశేఖర్ అంగ, లక్ష్మీ, ఎంటర్ ప్రెన్యూర్ వర్ణ, ఫోటోగ్రాఫర్ కార్తీక్‌లు వాలంటీర్లుగా తమ విలువైన సేవలకు అందించారు. మా ఫుడ్స్, నాటు నాటు సంస్థలు ఈ మహిళా దినోత్సవానికి ఫుడ్ స్పాన్సర్లుగా వ్యవహారించాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

‘ఆ టీచర్’ మాకొద్దు..
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో మంగళవారం విద్యార్ధులు దాదాపు నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. వారం రోజుల క్రితం నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఓ విద్యార్థి స్టడీ అవర్స్‌కు ఆలస్యంగా వచ్చిందని ఇంగ్లిష్ టీచర్ మూడు గంటల పాటు నిలబెట్టిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించి విచారణ చేపట్టి టీచర్‌పై చర్యలు తీసుకుంటామని డీఈఓ రమేష్‌కుమార్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. అయి తే వారం రోజులు గడుస్తున్నా ఆ ఉపాధ్యాయురాలిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంగళవారం విద్యార్థులు పాఠశాల ప్రధాన గేటు వద్ద ఎండలో దాదాపు నాలుగు గంటల పాటు భోజనం చేయకుండా ధర్నా చేశారు. సంబంధిత టీచర్‌ను సస్పెండ్ చేసే వరకు మేము భోజనం చేయమని నినదించారు. ఆమె మళ్లీ పాఠశాలకు వస్తే ఎవ్వరం పాఠశాలలో ఉండమని విద్యార్థినులు బీష్మించారు. తను విద్యార్థినులను అసభ్య పదజాలంతో దూషించి, మానసికంగా వేధిస్తోందని, వాష్‌రూంకు వెళితే ఆ ఫొటోలు, వీడియోలు తీసి వాటిని బయట లీక్ చేస్తా నని భయపెడుతుందని విద్యార్థులు వాపోయారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేదిలేదని కూర్చున్నారు. సమాచారం తెలుసుకున్న డీఈఓ రమేష్‌కుమార్ పాఠశా లకు చేరుకొని విద్యార్థులకు నచ్చచెప్పి ఆ టీచర్‌ను ఎట్టి పరిస్థితులలో ఇక్కడ ఉంచబోమని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.బిడ్డల్లాగా చూసుకుంటారనుకుంటే... పాఠశాలలో చదువు చెప్పే ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత బిడ్డల్లాగా చూసుకుంటారని అనుకుంటే.. వీళ్లే ఈ విధంగా ప్రవర్తించడం బాగా లేదు సార్. మా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ టీచర్‌ను సస్పెండ్ చేయాలి. తమ పిల్లలకు మంచి చదువు చెప్పించండి సార్. – సత్యనారాయణ, విద్యార్థిని తండ్రి, మొలచింతపల్లి

బామ్మర్ది మీ అక్క చనిపోయింది..!
శ్రీకాకుళం: మండలంలోని సంతవురిటి గ్రామానికి చెందిన బాలబోమ్మ భవానీ(21) అనే వివాహిత మంగళవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలఖండ్యాం గ్రామానికి చెందిన భవానీకి సంతవురిటి గ్రామానికి చెందిన దినేష్‌తో తొమ్మిది నెలల కిందట వివాహం జరిగింది. దినేష్ సచివాలయ లైన్‌మేన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొన్నాళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పాలఖండ్యాంలోని పుట్టింటికి వెళ్లిన భవానీ ఈ నెల 14న సంతవురిటి వచ్చింది. అదే రోజు రాత్రి మళ్లీ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున 4 గంటల సమయంలో భవానీ సోదరుడు నాగరాజుకు దినేష్ ఫోన్ చేసి భవానీ మృతిచెందినట్లు సమాచారం అందించాడు. సోదరుడు వెళ్లి చూసేసరికి భవానీ విగతజీవిగా కనిపించింది. భవానీ మృతికి అల్లుడు దినేష్ , అత్తింటి వారే కారణమని బంధువులు ఆరోపించారు. భవానీ మెడపై గాయాలు ఉండటంతో దినేష్ హత్య చేశాడని ఆరోపిస్తూ మృతురాలి తండ్రి ధారబోయిన రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జె.ఆర్.పురం సీఐ అవతారం, ఇన్చార్జి ఎస్ఐ లక్ష్మణరావు, క్లూస్‌టీం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా పూర్తి చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త దినేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు.

గుండెపోటుతో భక్తుడి మృతి.. ఆలయం మూసివేత..!
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థాన ఆవరణలో ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం..పెద్దపల్లి జిల్లా ఎలిగేడుకు చెందిన రాంపల్లి కనుకయ్య(72) కుటుంబ సభ్యులతో కలసి కాళేశ్వరం వచ్చారు. కుమారుడు కాలసర్పనివారణ పూజలు చేస్తుండగా.. కనుకయ్య ఆలయ ఆవరణలోని ఓ హోటల్ వద్ద కూర్చోని మాట్లాడుతున్నాడు. ఛాతీలో నొప్పితో కుప్పకూలాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు.గంటన్నర ఆలయం మూసివేతకనుకయ్య ఆలయ ఆవరణలో మృతి చెందిన విషయం ఆలయ అధికారులకు తెలియడంతో ఆలయాన్ని ఉదయం 8.10 గంటల నుంచి సుమారు గంటన్నరపాటు మూసివేశారు. ఆ తర్వాత సంప్రోక్షణ జరిపి యథావిధిగా పూజలు పునఃప్రారంభించారు.గుండెపోటుతో వ్యక్తి..సిరిసిల్లక్రైం: సిరిసిల్లలో ప్రముఖ స్వీట్‌హౌస్ యజమాని అశోక్(42) సోమవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన అశోక్ సిరిసిల్లలో స్వీట్‌షాప్ పెట్టుకొని కుటుంబంతో స్థిరపడ్డాడు. కొన్నిరోజులుగా పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి, అశోక్‌కు మధ్య ఓ కారు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం సదరు ఉద్యోగి కారును అశోక్ తీసుకెళ్లాడని, ఆ కారు కాస్త గంజాయి రవాణాలో కర్ణాటక పోలీసులకు చిక్కింది. దీంతో అక్కడి పోలీసులు కారును సీజ్ చేశారు. తన కారు తనకు కావాలని, లేకుంటే కొత్తది కొనివ్వాలని అశోక్, సదరు ఉద్యోగి మధ్య పలుమార్లు పంచాయితీలు జరిగాయి. సోమవారం రాత్రి సిరిసిల్లలో కారు పంచాయితీ జరుగగా, పెద్దలు చెప్పిన దానిపై ఆలోచన చేస్తానని అశోక్ ఇంటికి వెళ్లాడు. మానసిక ఒత్తిడి అధికమై గుండెపోటుకు గురయినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. దీనిపై సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణను వివరణ కోరగా కారు కేసు వేరే రాష్ట్రంలో జరిగిందని, గొడవలపై, అశోక్ మృతిపై కుటుంబీకులు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

కుమారుడి వివాహేతర సంబంధానికి తండ్రి బలి..!
అచ్చంపేట రూరల్: కుమారుడి వివాహేతర సంబంధానికి ఓ తండ్రి బలయ్యాడు. ప్రత్యర్థులు వెంటాడి వేటాడి దారుణంగా హతమార్చారు. ప్రశాంతంగా ఉండే నల్లమల ప్రాంతం ఈ హత్యతో ఒక్కసారిగా ఉలికిపడింది. గ్రామస్తుల వివరాల మేరకు.. అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన బూరం వీరయ్య (54) చిన్న కుమారుడు పరమేశ్ అదే గ్రామానికి చెందిన భర్త, ఇద్దరు సంతానం ఉన్న ఓ వివాహితతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఆ మహిళను ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి సహజీవనం చేశారు. సదరు మహిళ భర్త, బంధువులు వారున్న ప్రాంతానికి వెళ్లి యువకుడిని చితకబాది.. మహిళను స్వగ్రామానికి తీసుకువచ్చారు. అయితే సదరు యువకుడు, అతడి కుటుంబసభ్యులపై మహిళ కుటుంబ సభ్యులు పగ పెంచుకున్నారు. ప్రతీకారం కోసం ఎదురుచూశారు. మంగళవారం వీరయ్య తన పెద్ద కుమారుడు వెంకటేశ్‌తో కలిసి అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్‌పై వస్తున్న విషయాన్ని గుర్తించారు.హైదరాబాద్–అచ్చంపేట ప్రధాన రహదారిపై నడింపల్లి సమీపంలో బైక్‌పై కొందరు వెంబడించగా.. మరికొందరు కారుతో వీరయ్య బైక్‌ను ఢీకొట్టారు. అనంతరం వారి కళ్లల్లో కారం చల్లి సుత్తి, గొడ్డలితో వీరయ్యపై విరుచుకుపడ్డారు. మెడ భాగంపై గొడ్డలితో వేటు వేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్‌పై దాడికి యత్నంచగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రధాన రహదారిపై ఆందోళన.. వీరయ్య హత్య విషయం తెలుసుకున్న అతడి బంధువులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్– అచ్చంపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. గతంలో వీరయ్య కుటుంబంపై దాడి జరిగిన విషయంపై అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని వీరయ్య కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిందితులకు పోలీసుల సపోర్టు ఉందని ఆరోపిస్తూ.. ఘటనా స్థలానికి వచ్చిన ఓ కానిస్టేబుల్‌పై దాడికి యత్నంచారు . గమనించిన తోటి పోలీసులు ఆర్టీసీ బస్సులో అతడిని అచ్చంపేటకు పంపించారు. ఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాసులు చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవీందర్ తెలిపారు.
వీడియోలు


Bandaru Satyanarayana: విశాఖ కూటమిలో ప్రొటోకాల్ వివాదం


పాస్టర్ ప్రవీణ్ కేసుపై కేఏ పాల్ సంచలన నిజాలు


ఈ ఒక్కరోజే రూ.1650 పెరిగిన బంగారం ధర


స్మితా సబర్వాల్‌కు BNS 179 సెక్షన్ కింద పోలీసుల నోటీసులు


ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ దర్శనానికి వెళ్లి వచ్చేలోపే


తెలుగు రాష్ట్రాల వాతావరణంపై ... IMD షాకింగ్ ప్రకటన


రాప్తాడు హెలికాప్టర్ ఘటనలో పైలెట్ కు నోటీసులు ఉషశ్రీ చరణ్ రియాక్షన్


ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయని కూటమి ప్రభుత్వం


లావణ్యపై దాడి చేయించిన రాజ్ తరుణ్ పేరెంట్స్


Malladi Vishnu: కూటమి హయాంలోనే తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయి