ఖాకీ వలలో విద్యార్థిని విలవిల | - | Sakshi
Sakshi News home page

ఖాకీ వలలో విద్యార్థిని విలవిల

Published Mon, Jan 22 2024 12:18 AM | Last Updated on Mon, Jan 22 2024 1:21 PM

- - Sakshi

అనంతపురం క్రైం: పోలీసు లైబ్రరీలో చదువుకునేందుకు వచ్చిన ఓ విద్యార్థినిని మాయమాటలతో లోబర్చుకున్న ఆర్‌ఎస్‌ఐ ఉదంతం ఆదివారం వెలుగుచూసింది. అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని మారుతీనగర్‌కు చెందిన ఓ యువతి ఉద్యోగాల అన్వేషణలో భాగంగా పోలీసు లైబ్రరీలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది.

ఈ క్రమంలో అక్కడున్న ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలతో లోబర్చుకుని పెళ్లి పేరుతో శారీరక అవసరాలు తీర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆమె పెళ్లి ఊసెత్తగానే మొహం చాటేశాడు. పలుమార్లు ఆమె ప్రాధేయపడినా వినలేదు. చివరకు విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు.

పంచాయితీ నిర్వహించి తన గుట్టును రట్టు చేయడంతో ఆగ్రహించిన ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ బాధితురాలిని హతమారుస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోన్‌ సంభాషణ దాచుకున్న ఆమె ఆదివారం నేరుగా నాల్గో పట్టణ పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. యువతిని మోసం చేసిన ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ ను బదిలీ చేసిన ఎస్పీ అన్భురాజన్, ఘటనపై సమగ్ర విచారణ కు ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement