
కదిలిన సత్యసాయి ప్రచార రథాలు
ప్రశాంతి నిలయం: సత్యసాయి శతజయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌రాజు తెలిపారు. సత్యసాయి ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని సత్యసాయి ప్రేమ ప్రవాహిని పేరుతో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాలను గురువారం ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి, నాగానంద, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండ్యతో కలసి ఆయన ప్రారంభించి, మాట్లాడా రు. సత్యసాయి అవతార వైభవం, సేవా మార్గాలు, ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రజలకు వివరిస్తూ దేశంలోని 500 జిల్లాల్లో 2.5 లక్షల కిలోమీటర్ల మేర ప్రేమ ప్రవాహిని రథాలు ప్రచార యాత్ర కొనసాగిస్తాయన్నారు. కార్యక్రమం అనంతరం హిల్‌వ్యూ స్టేడియంలో మహానారాయణ సేవ నిర్వహించారు.