Top Stories
ప్రధాన వార్తలు

మనం రాక్షస రాజ్యంలో ఉన్నాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాక్షస పాలనలో ఉన్నామని.. ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుందంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం వైఎస్సార్సీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు.ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ చర్చించారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ, మండలాల ఉప ఎన్నికల్లో టీడీపీ గూండాల దాడిని ఎదుర్కొన్న వైనంపై కూడా ఆయన చర్చించారు. ‘‘ఇలాంటి రెడ్ బుక్ రాక్షస పాలన చేస్తున్న ఇలాంటి ప్రభుత్వంలో తెగువ చూపించి, నిబద్ధతతో నిలబడి, విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ... చంద్రబాబూ మావి నీ మాదిరి రాజకీయాలు కాదు.. ఎంపీటీసీలమైనా, జడ్పీటీసీలమైనా మమ్నల్ని చూసి నేర్చుకోమని చంద్రబాబుకి కూడా చూపించి.. గొప్ప తెగువ చూపించారు’’ అని వైఎస్ జగన్ ప్రశంసించారు.‘‘మీ అందరి తెగువకు, విలువలు పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ హేట్సాఫ్. మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య ఈ 12 నెలల పాలనలో చాలా తేడా కనిపిస్తోంది. 12 నెలల చంద్రబాబు పాలనలో రాజకీయాలకు, మన రాజకీయాలకు తేడా చాలా ఉంది. ప్రజలు మనకు అధికారం ఇస్తేనే తీసుకున్నాం. దొడ్డిదారిన వెన్నుపోటు పొడిచి రాజకీయం చేయలేదు. చంద్రబాబు రాజకీయ ప్రస్ధానం.. వెన్నుపోటుతో మొదలుపెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను జీవితమంతా వెన్నుపోటు పొడుస్తూనే రాజకీయమంతా కొనసాగిస్తూ వచ్చారు’’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘సత్యసాయి జిల్లా గాండ్ల పెంటలో ఏడు ఎంపీటీసీ స్ధానాలు ఉంటే.. ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఏడింట ఆరు మందిని గెలిపించారు. టీడీపీకి ఒక్కటే ఉంది. అలాంటప్పుడు ఎంపీపీ పదవి వైఎస్సార్సీపీకే రావాలి. కానీ అక్కడ ఏం జరుగుతుందో మనమంతా చూశాం. బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులను వాచ్ మెన్ లకన్నా హీనంగా వాడుకుంటున్నారు. చివరికి మనం గట్టిగా నిలబడి ఎన్నికలను బాయ్ కాట్ చేసి ఎన్నిక వాయిదా వేయించుకోగలిగాం. కానీ రెండు మూడుసార్లు వాయిదా వేసిన తర్వాత కోరం లేకపోయినా వాళ్లంతట వాళ్లే గెలిచినట్లు ప్రకటించుకున్నారు...ప్రకాశం జిల్లా మార్కాపురంలో 15 ఎంటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీ తరపున మన పార్టీ గుర్తు మీద 15కు 15 స్థానాలు మనమే గెలిచాం. అక్కడ ఎంపీపీ మనకే రావాలి. అక్కడ కూడా సూట్ కేసులతో ప్రలోభాలు పెట్టారు. బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మన వాళ్లు అంతా ఒక్కటిగా నిలబడ్డారు. మీ తెగువకు హేట్సాఫ్ చెప్పాలి. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాల్టీలో 30 మంది కౌన్సిలర్లు.. ఇక్కడ వైఎస్సార్సీపీ గుర్తు మీద ఏకంగా 26 మంది గెలిచారు. మరి అక్కడ వైఎస్సార్సీపీ వాళ్లే గెలవాల్సి ఉండగా.. అక్కడ ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మన వాళ్లు గట్టిగా నిలపబడ్డారు...ఇక కుప్పం మున్సిపాల్టీ చూసుకుంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే 25 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 19 గెలిస్తే.. టీడీపీ కేవలం 6 మాత్రమే గెలిచింది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ తరపున మున్సిపల్ చైర్మన్ కావాలి కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు.. ఏ స్థాయిలో అంటే.. మనవాళ్లను బెదిరించి వాళ్ల పార్టీలోకి తీసుుకుంటున్నారు. ఇది నా నియోజకవర్గం.. నా కుప్పం నియోజకవర్గంలో ఎలా రాక్షస పాలన చేయాలో నేర్పుతాను. రాష్ట్రమంతా ఇలానే చేయాలని సంకేతాలు ఇచ్చాడు చంద్రబాబు. అలా సంకేతాలు ఇచ్చి బలవంతగా మున్సిపల్ చైర్మన్ పోస్టును తీసుకున్నారు. ఒక్కో కౌన్సిలర్‌కు రూ.50 లక్షలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు...రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆయనే కుప్పం నియోజకవర్గంలో తప్పుడు సంకేతాలను పంపించారు. ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యాలకు నిదర్శనంగా కుప్పం మున్సిపాల్టీ నిలిచింది. కుప్పాన్ని మున్సిపాల్టీ చేసింది మనమే. చంద్రబాబు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ కూడా చేయలేదు. డివిజన్ మాట అటుంచి తాగడానికి కుప్పానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితులలో తెగువ చూపించిన నిలబడిన వైయస్సార్పీపీ కౌన్సిలర్లకు హేట్సాఫ్ చెప్పాలి. రాజకీయలలో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినా ప్రజల గుండెల్లో ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. మా పాలనలో మేం చెప్పిన ప్రతి మాట నెరవేర్చామని వైఎస్సార్సీపీ ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి గర్వంగా పోగలుగుతాడు. కానీ ఇవాళ చంద్రబాబు, ఆ పార్టీ కార్యకర్తలు తమ పాలనలో ఏ ఇంటికైనా వెళ్లి వాళ్ల దీవెనలు, ఆశీర్వచనాలు పొందగలడా అని ప్రశ్నిస్తున్నాను...ఏ ఇంటికైనా వాళ్ల కార్యకర్తలు వెలితే చిన్న పిల్లాడి దగ్గర నుంచి ప్రశ్నిస్తారు. చిన్న పిల్లవాడు నా రూ.15వేలు ఏమయ్యాయని అడుగుతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి బయటకు వచ్చి నా రూ.18వేలు ఏమైందని అడుగుతారు. ఆ తర్వాత వాళ్ల ఆ తల్లుల అమ్ములు, ఆ ఇంట్లో నుంచి రైతన్నలు, ఉద్యోగం కోసం చూస్తున్న యువకుడు మాకిచ్చిన హామీలు ఏమయ్యాయని అడుగుతారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. చివరికి చిన్న, చిన్న హమీలైన ఉచిత బస్సు లాంటివి కూడా గాలికి ఎగిరిపోయాయి. ప్రజలు ఆ హామీలు ఏమయ్యాయని అఢుగుతున్నారు. ఉచిత బస్సు ఉంటే కడప నుంచి విశాఖపట్నం, కర్నూలు నుంచి అమరావతి వెళ్లి వద్దామనుకున్నాం.. అవి ఏమయ్యాయని అడుగుతున్నారు...చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో ప్రతి మహిళ, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నోటి కాడ కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని రద్దు చేశాడు. అలా రద్దు చేయడమే కాకుండా జగన్ ఇచ్చినవే కాకుండా అధికంగా ఇస్తానని ఎన్నికల్లో చెప్పాడు. చంద్రబాబు చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన బాండ్లు ప్రజలు దగ్గర పెట్టుకున్నారు. ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే అడగాలని ఎదురుచూస్తున్నారు. ఇదీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి.స్కూళ్లలో నాడు-నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాణ్యత లేకుండా పోయింది. ఇంగ్లిషు మీడియం పక్కకు పోయింది. టోఫెల్ పీరియడ్ తీసేశారు. ఎనిమిదో తరగతికి వచ్చే సరికి ప్రతి పిల్లవాడికి ట్యాబులు ఇచ్చే స్కీం కూడా అటకెక్కించేశారు. పిల్లలు ప్రభుత్వ బడులకు పోవాలంటే నో వేకెన్సీ బోర్డుల ఉన్న మన హయాం నుంచి ఇవాళ అమ్మో ప్రభుత్వ బడులకు వద్దు అన్ని స్థితికి తెచ్చేశారు. ఉన్నత విద్య కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చే పరిస్థితి మన హయాంలో ఉండేది. ప్రతి మూడు నెలలకు వారికి ఫీజులు మన హయాంలో చెల్లిస్తే.. నేడు చంద్రబాబు పుణ్యమాని విద్యాదీవెన, వసతి దీవెన గాలికెగిరిపోయింది. పేదవాడు ఏ కార్పోరేట్ ఆసుపత్రికైనా వెళ్లి ఉచితంగా రూ.25 లక్షల వరకు చికిత్స చేయించుకునే పరిస్థితి మన పాలనలో ఉండేది.ఇప్పుడు 11 నెలల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నాశనం అయింది. నెలకి రూ.300 కోట్లు చొప్పున ఏడాదికి దాదాపు రూ.3500 కోట్లు సుమారుగా బకాయిలు పెట్టారు. ఆరోగ్యఆసరా లేదు. పేదవాడు నెట్ వర్క్ ఆసుపత్రులకు వైద్యం కోసం వస్తే నిరాకరిస్తున్నారు. మన ప్రభుత్వంలో రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇస్తూ.. ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా... రైతుల పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ రైతులకు ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేశాడు. ఇ- క్రాప్ కనబడకుండా పోయింది.ఆర్బీకేలు నీరుగార్చాడు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్ధితుల్లో ఉన్నారు. ధాన్యం, అరటి, కంది, చీనీ ఇలా ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేదు. ఇంత దారుణమైన పాలన చేస్తున్నారు.మరోవైపు విచ్చలవిడి స్కాంలు జరుగుతున్నాయి. మన హయాంలో ఇసుకలో ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయి. ఈ ప్రభుత్వంలో మన హయాంలో కన్నా అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఏ గ్రామంలో చూసినా ఇవాళ గుడి చివర, బడి చివర, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే. ఏ నియోజకవర్గంలో మైన్, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకు అంతో ఇంతో ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రికి ఇవ్వాలి. పంచుకో, దోచుకో తినుకో నడుస్తోంది.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ... చంద్రబాబు తన మనుషులకు రూపాయికి ఎకరా కేటాయిస్తున్నాడు. ఊరూ పేరు లేని ఉర్సా, లూలూ, లిల్లీ గ్రూపులకు అడ్డగోలుగా భూములు కేటాయిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేశాడు. జ్యుడీషియల్ రివ్యూ తీసేశారు. కొత్తగా మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. మొబలైజేషన్ అడ్వాన్స్ కింద 10 శాతం ఇచ్చి 8 శాతం తీసుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇంతటి దారుణమైన పాలన సాగిస్తున్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు. ప్రజలు కూడా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు పుట్ బాల్ తన్నినట్లు తంతారు.ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఎన్నో మోసాలు చేసి, అబద్దాలు చెప్పిన ఆయన పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దానికోసం మనం అంతా గట్టిగా శ్రమించాలి...ఇంతకుముందు మన హయాంలో కార్యకర్తల కోసం అనుకున్నవిధంగా మనం చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ లాంటి మహమ్మూరి వల్ల... ఆ తర్వాత రెండు సంవత్సరాలు పాటు ప్రజల ఆరోగ్యం మీద పాలన మీద దృష్టి పెట్టి నడపాల్సి వచ్చింది. కార్యకర్తలు పడుతున్న కష్టాలు మీ జగన్ చూశాడు. మీ అందరికీ మాట ఇస్తున్నాను. వచ్చే జగన్ 2.0లో మీ అందరికీ పెద్ద పీట వేస్తాడు. రాత్రి వచ్చిన తర్వాత పగలు రాకతప్పదు. కష్టాలు వచ్చిన తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి’’ అని వైఎస్ జగన్ చెప్పారు.

ఇది మోదీ సర్కార్.. ఏ ఒక్క ఉగ్రవాదిని వదలం: అమిత్ షా
న్యూఢిల్లీ, సాక్షి: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని.. ఏ ఒక్క ఉగ్రవాదిని వదిలే ప్రసక్తే లేదని అన్నారాయన. గురువారం న్యూఢిల్లీలో బోడో సామాజిక వేత్త ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ప్రసంగిస్తూ.. కొందరు దాడి చేసి విజయం సాధించామని అనుకుంటే అది పొరపాటే. ఇది మోదీ సర్కార్. మోదీ సర్కార్ ఎవరినీ వదిలి పెట్టదు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని శిక్షిస్తాం. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పడం ఖాయం. ఇప్పటికే కశ్మీర్ లో ఉగ్రవాద చర్యలకు గట్టి సమాధానం ఇస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటాం. పహల్గాం అమాయకుల చావులకు కారణమైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే మా ప్రభుత్వ సంకల్పమని, దానిని సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారాయన.

చంద్రబాబు పర్యటనలో తప్పిన పెనుప్రమాదం
నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన జిల్లా పర్యటనలో ప్రజలకు పెను ప్రమాదం తప్పింది. నారంపేటలోని ఎమ్ఎస్ఎమ్ఈ పార్క్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ఆర్చి కుప్పకూలింది. అప్పటికే చంద్రబాబు, ప్రజలు వెళ్లిపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రజావేదిక వద్ద ఉదయమే ఏర్పాటు చేసిన ఆర్చి.. సాయంత్రం కల్లా కుప్పకూలడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆర్చి కూలే సమయంలో అక్కడ ఎవరూ లేరని, లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు చెబుతున్నారు.ఈరోజు(గురువారం) నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ప్రజావేదిక పేరుతో జరిగిన సభకు సీఎం హాజరయ్యారు. ఈ క్రమంలోనే భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లు భాగంగా ఏర్పాటు చేసిన ఒక ఆర్చ్ కుప్పకూలింది. అది జనాలు ఎవరూ లేని సమయంలో కూలడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

సొంత ప్రపంచంలో బతుకుతున్నారు.. బాబా రాందేవ్‌పై కోర్టు అసహనం
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev) పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హమ్దార్డ్ సంస్థకి చెందిన రూ అఫ్జాపై మరో వీడియో విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అలా చేయకూడదని ఆదేశించినప్పటికీ.. అవమానకరమైన వ్యాఖ్యలతో రూ అఫ్జాపై రామ్‌దేవ్ మరో కొత్త వీడియోను రూపొందించారని, ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని పేర్కొంది.ఢిల్లీ: రాందేవ్ బాబా కొత్త వీడియో విషయాన్ని హమ్దార్డ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దానికి జస్టిస్ అమిత్ బన్సాల్ తీవ్రంగా స్పందిస్తూ.. రామ్‌దేవ్ ఎవరి నియంత్రణలో లేరని ఆయన చేష్టలు బట్టి అర్థమవుతోంది. ఆయన తన సొంత ప్రపంచంలో బతుకుతున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే ఆయన తన ఆలోచనలను తనలోనే ఉంచుకోవాలని, వాటిని బయటకు వ్యక్తపరచవలసిన అవసరం లేదని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఆయన ఉల్లంఘించారనేది స్పష్టం అవుతోందని.. కాబట్టి కోర్టు ధిక్కరణ కింద ఆయనకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. తాజా వీడియోలను సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ఫారంల నుంచి తొలగిస్తామని బాబా రాందేవ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీనికి సంబంధించిన వారంలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని.. ఈ పిటిషన్‌పై శుక్రవారం మరోసారి వాదనలు వింటామని జస్టిస్ అమిత్ బన్సాల్ తెలిపారు. పతంజలికి చెందిన గులాబ్ షర్బత్‌ను ప్రచారం చేసే క్రమంలో.. హయ్‌దార్డ్ రూఅఫ్జాను తక్కువ చేస్తూ బాబా రామ్‌దేవ్ తీవ్ర చేష్టకు దిగారు. రూఅఫ్జా ద్వారా వచ్చే ఆదాయాన్ని మదర్సాలు, మసీదుల నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు వినియోగిస్తున్నారని రామ్‌దేవ్ ఆరోపించారు. షర్బత్ జీహాద్ అంటూ రూఅఫ్జాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి టాయిలెట్ క్లీనర్లని, వాటి నుంచి ప్రజలను రక్షించడమే తమ ఉద్దేశమంటూ వ్యాఖ్యానించారు. అలాగే.. అదే ఈ గులాబ్ షర్బత్ (పతంజలి సంస్థకు చెందిన పానీయం) తాగితే.. గురుకులాలను నిర్మించవచ్చు. పతంజలి విశ్వవిద్యాలయాన్ని విస్తరించవచ్చని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై విచారణ చేపట్టాల్సిందిగా హమ్దార్డ్ కోర్టును ఆశ్రయించింది. రామ్‌దేవ్ వ్యాఖ్యలు సమర్థించలేనివని, దిగ్భ్రాంతికి గురిచేశాయని ఏప్రిల్ 22న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కోర్టు వ్యాఖ్యానించింది. ప్రకటనలు, సోషల్‌మీడియా పోస్టులతో సహా ఆన్లైన్ కంటెంట్‌ను వెంటనే తొలగిస్తామని రామ్‌దేవ్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈహామీని ధృవీకరిస్తూ అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయినా కూడా ఆయన మరో వీడియో విడుదల చేయడంతో కోర్టు అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. ఇదిలా ఉంటే.. పతాంజలి ఉత్పత్తుల విషయంలో రామ్‌దేవ్ బాబా కోర్టు మెట్లెక్కడం ఇదేం కొత్త కాదు. గతంలో తప్పుదోవ పట్టించే ప్రకటనల (Misleading Ads Case) వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద్ సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. ఇకపై అలాంటి యాడ్స్ ఇవ్వబోమని వారు కోర్టుకు విన్నవించారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. వారిపై ధిక్కరణ కేసును మూసివేసింది. అయితే, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.

సింహాచలం ఘటన: సంచలన విషయాలు చెప్పిన కాంట్రాక్టర్
విశాఖ: సింహాచలం పుణ్యకేత్రంలో గోడ కూలి ఏడుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే వారం రోజుల వ్యవధిలో గోడ కట్టడం కారణంగానే ఈ దారుణం చోటు చేసుకుంది. దీనిపై గోడ కట్టిన కాంట్రాక్టర్ లక్ష్మణరావు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ విచారణ చేపట్టగా కాంట్రాక్టర్ లక్ష్మణరావు సంచలన నిజాలు బయటకు చెప్పారు. చందనోత్సవానికి సమయం చాలా తక్కువ సమయం ఉందని, తాను గోడ కట్టనని చెబితే బలవంతంగా ఆ గోడను కట్టించారన్నారు. దేవస్థానం, టూరిజం అధికారులు బలవంతంగా తన చేత గోడ కట్టించారని కమిటీ విచారణ సందర్భంగా లక్ష్మణరావు వెల్లడించారు.ఆరు రోజుల వ్యవధిలో ఒక గోడ కట్టడం సాధ్యం కాదని ముందే చెప్పానని, కేవలం నాలుగు రోజుల ముందే గోడ పనులు మొదలు పెట్టాననన్నారు. టెంపరరీ గోడ అని చెప్పడంతోనే గోడ కట్టానన్నారు లక్ష్మణరావు. ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు..?గోడ కట్టే సమయంలో ఇంజినీర్ లేరని కాంట్రాక్టర్ లక్ష్మణరావు చెప్పగా, ఇంజినీర్ అక్కడే ఉన్నారని అధికారులు చెప్పారు. దాంతో కమిటీ సభ్యుల్లో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతకీ ఇంజినీర్ ఉన్నాడా.. లేడా అని నిలదీశారు. ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం అని కమిటీ ప్రశ్నించింది. కాగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది. మృతులను యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు.

RR VS MI: బుమ్రా, బౌల్ట్ లాంటి హేమాహేమీల ముందు కుర్ర వైభవ్ ఆటలు సాగుతాయా..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (మే 1) రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాయల్స్ హోం గ్రౌండ్ సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు అందరి దృష్టి రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ముంబై ఇండియన్స్‌పై వైభవ్ ఎలా ఆడతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పటిష్టమైన ముంబై బౌలింగ్ లైనప్‌ను 14 ఏళ్ల కుర్ర వైభవ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో అని చర్చించుకుంటున్నారు.ప్రపంచంలోనే అరివీర భయంకరులైన బుమ్రా, బౌల్ట్ ముందు నిలబడగలడా అని సందేహిస్తున్నారు. వైభవ్ జోరు చూస్తే బుమ్రా, బౌల్ట్‌కు కూడా బడిత పూజ తప్పదని అనిపిస్తుంది. ఊహకందని శతకంతో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన వైభవ్ దుర్భేధ్యమైన ముంబై ఇండియన్స్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోగలడో చూడాలి మరి.14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రెండు రోజుల కిందట గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ కొట్టి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ విధ్వంసకర ప్రదర్శనతో వైభవ్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. అతడిపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తు పెరిగాయి. ఒక్క ఇన్నింగ్స్‌తోనే క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఈ బేబీ బాస్.. నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్‌లో కూడా సత్తా చాటాలని కోరుకుందాం. వైభవ్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి 215.72 స్ట్రయిక్ రేట్‌తో 151 పరుగులు చేశాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో (లక్నో) కూడా వైభవ్ చిన్నపాటి విధ్వంసమే సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై ఇండియన్స్‌పై రాయల్స్ తప్పక గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. మరోవైపు ముంబై ఇండియన్స్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ఖర్చీఫ్ వేసుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాయల్స్ 10 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. తుది జట్లు (అంచనా)..రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (c), ధృవ్ జురెల్ (wk), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఆకాష్ మధ్వల్/శుభమ్ దూబేముంబై ఇండియన్స్: ర్యాన్ రికిల్టన్ (wk), రోహిత్ శర్మ (c), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

తొమ్మిది గజాల చీరలో మహారాష్ట్ర అమ్మాయిలా స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన సింపుల్, ట్రెడిషనల్ ఫ్యాషన్‌తో అభిమానుల హృదయాలను గెల్చుకుంది. వేవ్స్ సమ్మిట్ 2025 ( WAVES Summit 2025) లో ఉత్సాహభరితమైన మహారాష్ట్ర రాష్ట్రంలో మహిళలు ధరించే ఒక ప్రత్యేకమైన నౌవారీ చీరలో అద్భుతంగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.అలియా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్‌కు హాజరైంది. ఈ సందర్భంగా తనదైన మినిమలిస్టిక్ ఫ్యాషన్, స్టేట్మెంట్ లుక్‌తో 'వావ్' అనిపించిందిముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మే 1న జరిగిన ఈవెంట్లో మహారాష్ట్ర అమ్మాయిగా మారిపోయింది. తొమ్మిది గజాల నౌవారీ చీరలో ట్రెడిషనల్‌గా చాలా అందంగా కనిపించింది. "నౌ" అంటే తొమ్మిది, తొమ్మిది గజాల నౌవారీ చీర స్టైల్ మహారాష్ట్రలో ప్రసిద్ధి. పీచ్, నారింజ రంగుల కలయితో గులాబీ రంగు అంచుతో వచ్చిన ఈ చీరకు, పూల డిజైన్‌తో హైలైట్ చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరైన అలియా భట్, తన నటనా నైపుణ్యాలు, అందం, ఫ్యాషన్ స్టేట్మెంట్లు, అది సాంప్రదాయమైనా లేదా పాశ్చాత్యమైనా ఫ్యాన్స్‌ను ఫిదా చేయాల్సిందే.కాగా 2024లో మెట్ గాలాలో అరంగేట్రం చేసిన ఆలియా భట్, తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. సబ్యసాచి ముఖర్జీ నుండి అందమైన చీరలో బ్యూటిఫుల్‌గా కనిపించింది. నటిగాస్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బాలీవుడ్లో విలక్షణమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2022 ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రి ఇచ్చింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ని పెళ్లాడినా అలియా ఒక ఆడబిడ్డకు తల్లి కూడా. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

భారత జవాన్‌కు భార్యగా పాకిస్తానీ మహిళా?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పౌరుల వీసాలను భారత్ రద్దు చేయడం.. ఆసక్తికర కథనాలను కళ్ల ముందు ఉంచుతోంది. పదిహేడేళ్లుగా భారత్‌లో ఉంటూ ఇక్కడి ఎన్నికల్లో ఓటేసిన వ్యక్తి తిరిగి అక్కడికి వెళ్లిపోవడం లాంటివి మీడియాకు ఎక్కాయి. అయితే భారత జవాన్‌ను వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపోవాలనుకున్న ఓ పాకిస్థానీ మహిళకు హోంశాఖ ఝలక్ ఇవ్వగా.. బార్డర్ దాటే చివరి నిమిషంలో కోర్టు నుంచి ఊరటతో ఆమె ఆగిపోవాల్సి వచ్చింది.పీటీఐ కథనం ప్రకారం.. పాక్ పంజాబ్‌కు చెందిన మినాల్ ఖాన్‌కు జమ్ము కశ్మీర్లో డ్యూటీ చేసే సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ ఖాన్ కు కిందటి ఏడాది మేలో ఆన్లైన్లో వివాహం(నిఖా) జరిగింది. ఈ ఏడాది మార్చిలో షార్ట్ టర్మ్ వీసా మీద ఆమె భారత్‌కు వచ్చింది. మార్చి 22వ తేదీతో ముగిసినప్పటికీ ఇక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఎలా ఉండగలిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదని అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈలోపు పహల్గాం దాడి తర్వాత పాకిస్థానీలు భారత్ ను వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మినాల్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీలోపు పాక్ పౌరులు వెనక్కి వెల్లిపోవాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. ఈ క్రమంలో.. అట్టారీ వాఘా సరిహద్దుకు చేరుకుని బస్సులో కూర్చుందామె. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.ఆమె లాయర్ అంకూర్ శర్మ కోర్టు నుంచి స్టే ఆదేశాలతో అక్కడికి చేరుకున్నారు. తన వీసాను పొడిగించాలని ఆమె కేంద్ర హోం శాఖ వద్ద విజ్ఞప్తి చేసుకుందని.. అది ఇంకా పెండింగ్ లోనే ఉందని.. కాబట్టి కోర్టు ఈఅంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఆమెను తరలించడంపై నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. దీంతో ఆమె బస్సు దిగి వెనక్కి వచ్చేసింది. ఈ ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె తరఫున వాదించిన అంకూర్ శర్మ బీజేపీ అధికార ప్రతినిధిగా గ్రేటర్ కశ్మీర్ ఓ కథనం ఇచ్చింది. అంతేకాదు ప్రధాని మోదీకి మినాల్ చేసిన విజ్ఞప్తిని కూడా ప్రముఖంగా ప్రచురించింది.‘‘మేం రూల్స్ అన్నీ ఫాలో అయ్యాం. సుదీర్ఘ వీసా కోసం నేను ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నా. అది త్వరలోనే వస్తుందని అధికారులు మాకు చెప్పారు కూడా. ఆలోపు దాడి జరిగింది. నా భర్త నుంచి నన్ను విడదీసే ప్రయత్నం జరిగింది. నాలాగే.. ఎంతో మంది తమ తల్లులు, తండ్రుల నుంచి విడిపోవాల్సిన పరిస్థితి. ఇది మానవత్వం అనిపించుకోదు. ప్రధాని మోదీకి మేం చేసే విజ్ఞప్తి ఒక్కటే.. మాలాంటి వాళ్లకు న్యాయం చేయమని అని ఆమె గ్రేటర్ కశ్మీర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.మినాల్‌పై అనుమానాలు?ఇదిలా ఉంటే.. మినాల్ ఖాన్ ఎపిసోడ్ సోషల్ మీడియాకు ఎక్కడం పెద్ద చర్చనీయాంశమైంది. ఒక జవాన్‌ను పాకిస్థాన్ మహిళను, అదీ ఆన్లైన్లో పరిచయంతో వివాహం చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ వీసా ముగిసిన తర్వాత కూడా నెలపైనే ఆమె ఎక్కడ నివసించగలిగిందని ప్రశ్నిస్తున్నారు. బహుశా ఇది ట్రాప్ అయి ఉండొచ్చని.. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. మినాల్‌కు మద్దతుగానూ పలువురు కామెంట్లు చేస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పౌరులను వెనక్కి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకు తొలుత ఏప్రిల్ 29వ తేదీని గడువుగా ప్రకటించి.. ఆ తర్వాత మరొక రోజు పొడిగించింది. ఏప్రిల్ 30వ తేదీతో అట్టారీ వాఘా సరిహద్దును మూసేశారు. గత ఆరో రోజులుగా 786 మంది పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లిపోగా, అందులో 55 మంది దౌత్యవేత్తలు, సహాయ సిబ్బంది ఉన్నారు. అలాగే.. పాకిస్థాన్ నుంచి 1,465 భారతీయులు తిరిగి వచ్చారని కేంద్రం ప్రకటించింది.

పహల్గాం ఉగ్రదాడిపై విచారణ.. పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిపై న్యాయ విచారణ చేపట్టాలన్నా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యలకు భారత సైనికులు సన్నద్ధమవుతున్నారు. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయొద్దని సూచించింది. ఈ సందర్భంగా ఆ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్‌పై సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్,జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇది చాలా సున్నితమైన అంశం. ఈ సమయంలో భద్రతా బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు. దేశం పట్ల బాధ్యతాయుతమైన విధిని నిర్వహించండి. మేము దర్యాప్తు చేసే నిపుణులం కాదు. దేశంలో ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి నడవాల్సిన తరుణమిది’ అంటూ పిటీషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది.SC refuses to hear PIL for judicial probe into #Pahalgam terror attack in which 26 people were killed.SC pulls up petitioners for filing PIL on Pahalgam attack, says judges not experts in probe of terror cases. PIL over Pahalgam attack: In this crucial time, each and every… pic.twitter.com/V262RKO5KE— Press Trust of India (@PTI_News) May 1, 2025అదే సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం పిటిషనర్‌ను హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దని కోరారు. అనంతరం, సుప్రీంకోర్టు ఆదేశాలతో పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దేశం పట్ల మీకు బాధ్యత లేదా?సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్,జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిల్ దాఖలు చేసే ముందు బాధ్యతతో వ్యవహరించండి. మీకు దేశం పట్ల బాధ్యత ఉందా? అని ప్రశ్నించారు. అందుకు పిటిషనర్ మాట్లాడుతూ.. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాశ్మీరీ విద్యార్థుల భద్రతపై ఆందోళనతో ఈ పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు. పహల్గాం దాడి తర్వాత కాశ్మీరీ విద్యార్థులపై దాడులు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.కాశ్మీరీ విద్యార్థుల కోసంఅదే సమయంలో విద్యార్థులకు అండగా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ప్రస్తావించారు. పహల్గాం దాడి తర్వాత సీఎం ఒమర్ అబ్దుల్లా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాశ్మీరీ విద్యార్థుల రక్షణ దిశగా చర్యలు తీసుకున్నారని, జమ్మూ కశ్మీర్ మంత్రులను ఇతర రాష్ట్రాల మంత్రులతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారనే విషయాన్ని గుర్తు చేశారు.అయితే ఆ పిల్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. ఇది సరైన సమయం కాదు. ప్రతి పౌరుడు దేశానికి అండగా నిలుస్తున్న వేళలో ఇలాంటి పిల్లు దాఖలు చేయడం సరైన చర్య కాదు’ అని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

‘హిట్ 3’ మూవీ రివ్యూ
హాలీవుడ్, బాలీవుడ్‌తో పోలిస్తే తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు చాలా తక్కువ. ఎఫ్ 2తోనే ఆ సినిమాలు పరిచయం అయ్యాయి. ఆ తర్వాత ‘హిట్’ కూడా ఫ్రాంచైజీగా వస్తోంది. నాని(Nani) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ఫ్రాంచైజీ తొలి చిత్రం ‘హిట్’లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. రెండో కేసుతో అడివి శేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక మూడో కేసుకి ఏకంగా నానినే రంగంలోకి దిగాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘హిట్ 3’పై మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మే 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ (HIT 3: The Third Case Movie Review )లో చూద్దాం.కథేంటంటే..ఎస్పీ అర్జున్ సర్కార్(నాని) జమ్ము కశ్మీర్ నుంచి ఏపీకి బదిలీపై వస్తారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష(కోమలి ప్రసాద్) అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్ సర్కార్ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తూ.. సీటీకే(కాప్చర్ టార్చర్ కిల్) డార్క్ వెబ్సైట్ గురించి చెబుతాడు. అసలు సీటీకే ఉద్దేశం ఏంటి? ఆ డార్క్ వెబ్సైట్ రన్ చేస్తున్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అర్జున్ సర్కార్ సీటీకే గ్యాంగ్ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? తల్లిలేని అర్జున్ సర్కార్ జీవితంలోకి మృదుల(శ్రీనిధి శెట్టి) ఎలా వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అర్జున్ సర్కార్ ఆపరేషన్‌కి ఆమె ఎలా సహాయపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఓ హత్య జరగడం.. దానిని ఛేదించేందుకు హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్) రంగంలోకి దిగడం.. చిక్కుముడులన్నీ విప్పి చివరకు హంతకులను పట్టుకోవడం.. ‘హిట్’, హిట్ 2.. ఈ రెండు చిత్రాల నేపథ్యం ఇలాగే ఉంటుంది. అదే ప్రాంఛైజీలో వచ్చిన హిట్ 3 మాత్రం ఒక హత్య చుట్టు కాకుండా కొన్ని హత్యలు చుట్టూ తిరుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హీరో ఈ కేసును ఎలా పరిష్కరించాడన్నదే ఈ సినిమా కథ. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల కథలన్నీ దాదాపు ఇదే లైన్లో ఉంటాయి. తెరపై ఎంత ఆసక్తికరంగా, భయంకరంగా చూపించారనే దానిపై విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం దర్శకుడు శైలేష్ కొలనుకు బాగా తెలుసు. అందుకే హిట్ ఫ్రాంచైజీలలో క్రైమ్ సీన్లు అన్ని భయంకరంగా తీర్చిదిద్దాడు. హిట్ 3లో అయితే ఆ భయాన్ని మూడింతలు చేశాడు. సైకో గ్యాంగ్ చేసే అరాచకాలను తెరపై చూస్తున్నప్పుడు రక్తం మరిగిపోతుంది. అసలు వీళ్లు మనుషులేనా అనే అనుమానం కలుగుతుంది. వాళ్ల ప్రవర్తన, హత్యలు చేసే తీరు చూస్తే.. బయట అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు గుర్తుకొస్తాయి. చిత్రబృందం ముందు నుంచి చెబుతున్నట్లుగా ఇందులో యాక్షన్ సీన్లు లిమిట్ దాటి ఉన్నాయి. యానిమల్, మార్కో, కిల్ సినిమాల ప్రభావం దర్శకుడిపై బాగానే పడిందన్న విషయం ఆ యాక్షన్ సన్నివేశాలను చూస్తే అర్థమవుతుంది. (చదవండి: హిట్-4లో హీరో ఫైనల్.. ఏసీపీ వీరప్పన్‌గా ఎంట్రీ)కథ ప్రారంభమే భయంకరమైన సీన్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీతో యాక్షన్ థ్రిల్లర్.. కాస్త లవ్ ఎంటర్టైనర్లోకి వెళ్తుంది. పెళ్లి కోసం మాట్రిమొనీలో అమ్మాయిలను చూడడం.. అర్జున్ వేసే ప్రశ్నలకు ఆ అమ్మాయిలు పారిపోవడం అంతా హిలేరియస్‌గా సాగుతుంది. సీటీకే డార్క్ వెబ్సైట్ గురించి తెలిసిన తర్వాత కథనం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటుంది. ఫస్టాఫ్ అంతా సైకో గ్యాంగ్ చేసే హత్యలు.. ఇన్వెస్టిగేషన్తో ముందుకు వెళ్లిపోతుంది. జమ్ములో జరిగిన హత్య వెనుక సీటీకే గ్యాంగ్ ఉందన్న విషయాన్ని అర్జున్ కనుక్కునే ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం మొత్తం సీటీకే గ్యాంగ్‌తో అర్జున్ సర్కార్ చేసే యుద్ధమే ఉంటుంది. ద్వితీయార్థంలో అక్కడక్కడా ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు ఉంటాయి. చిన్నపిల్ల ఎపిసోడ్‌ని చాలా ఎమోషనల్‌గా రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో నాని యాక్షన్ సీక్వెన్సులు చూస్తే భయమేస్తుంది. అయితే ఈ తరహా పోరాట ఘట్టాలను చాలా హాలీవుడ్ చిత్రాల్లో చూసే ఉంటాం. అలాగే ఈ మధ్య వచ్చిన కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా ఇలాంటి సీన్లు ఉన్నాయి. సైకో గ్యాంగ్ అంతు చూసేందుకు హీరో కూడా సైకోగా మారడం ఇబ్బందికరంగా అనిపించినా.. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలతో పోలిస్తే.. ఇందులో హీరో చేసే పనికి ఓ బలమైన కారణం ఉండడంతో ఆ ప్లేస్‌లో ఏ వ్యక్తి ఉన్నా అలాంటి పనే చేస్తాడనే భావన ఆడియన్స్‌లో కలుగుతుంది. పైగా హీరో చేసే అరాచక పనులకు చాగంటి ప్రవచనాలను ముడిపెట్టి దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నాడు. చివరగా చెప్పేది ఏంటంటే.. చిన్న పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను చూపించొద్దు. క్రైం యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకు హిట్ 3 తెగ నచ్చేస్తుంది. మిగతా వారికి మాత్రం ఇంత హింసాత్మక చిత్రాలు అవసరమా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. అర్జున్ సర్కార్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. నిజమైన పోలీసు ఆఫీసర్‌లాగే తెరపై కనిపించాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. శ్రీనిధి శెట్టి అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ప్రతీక్ బబ్బర్ విలనిజం అంతగా పండించలేకపోయినా..ఉన్నంతలో బాగానే నటించాడు. అర్జున్ సర్కార్ టీమ్ సభ్యురాలు వర్షగా కోమలి ప్రసాద్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
IPL 2025: వైభవ్ ఒక్క మ్యాచ్‌లో చేస్తే, సీఎస్కేకు సీజన్ మొత్తం పట్టింది..!
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. నెల రోజుల్లోపే ఓటీటీకి..!
ఇది మోదీ సర్కార్.. ఏ ఒక్క ఉగ్రవాదిని వదలం: అమిత్ షా
సింహాచలం ఘటన.. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం
లాభాల బ్యాంకులు..
‘ఆ డ్యామ్ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం గాలికొదిలేసింది’
RR VS MI: బుమ్రా, బౌల్ట్ లాంటి హేమాహేమీల ముందు కుర్ర వైభవ్ ఆటలు సాగుతాయా..?
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
అభిమానులకు గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న ఛావా నటుడు
చంద్రబాబు పర్యటనలో తప్పిన పెనుప్రమాదం
మనం రాక్షస రాజ్యంలో ఉన్నాం: వైఎస్ జగన్
‘హిట్ 3’ మూవీ రివ్యూ
పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేత.. నెక్ట్స్ జరిగేది ఇదేనా?
భయపెట్టిన భారత్.. పాక్ సైన్యంలో పెను మార్పులు
భారత్-పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
ఇజ్రాయెల్‌లో భీకర కార్చిచ్చు.. జెరూసలెంను కమ్మేసిన పొగ
'రెట్రో' మూవీ రివ్యూ.. సూర్య హిట్ కొట్టాడా..?
పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా!
ఒక అరటి పండు ధర రూ.565!
పహల్గాం ఉగ్రదాడిపై విచారణ.. పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
వెండింగ్ మెషిన్ల ద్వారా బంగారం కొనుగోలు
HIT3 X Review: ‘హిట్ 3’ ట్విటర్ రివ్యూ
ప్రియురాలితో గొడవ, అమాంతం దూకేశాడు, ట్విస్ట్ ఏంటంటే..!
సింహాచలం ఘటన: సంచలన విషయాలు చెప్పిన కాంట్రాక్టర్
ఐదు ఫుల్ బాటిళ్లు కచ్చా తాగేసి.. విషాదం నింపిన పందెం
IPL 2025: బీసీసీఐకి ఊహించని షాక్!
పహల్గాం ఉగ్రదాడి.. వెలుగులోకి సంచలన విషయాలు
‘వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు ఇదే తేడా..’
బంగారమా..? మాకొద్దు బాబోయ్..!
కార్మిక సోదరులకు వైఎస్ జగన్ మేడే శుభాకాంక్షలు
దూసుకొస్తున్న కాస్మోస్ 482
మంచి తరుణం మించి పోరాదు! పసిడి తులం ఎంతంటే..
రెట్రో మూవీ ట్విటర్ రివ్యూ.. సందడి లేదేంటి?
వాళ్ల వలలో పడొద్దు.. పంతాలకు పోయి సమ్మె చేయొద్దు
‘కుల గణన’ నిర్ణయంపై వైఎస్ జగన్ హర్షం
రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ విఫలం: వైఎస్ అవినాష్‌రెడ్డి
నాని 'హిట్ 3' వచ్చేది ఆ ఓటీటీలోనే..
సింహాచలంలో ప్రమాద స్థలిని పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు
ఆస్తులు తాకట్టు పెట్టి సినిమా తీశాం.. మా బాధ మీకేం తెలుసు?
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
డ్రైవర్ జీతం నెలకు రూ.4 లక్షలు..! అంబానీయా.. మజాకా..
అయ్యో అంబానీ ‘హ్యాపీ’ ఇక లేదు, ఫ్యామిలీలో విషాదం!
పెళ్లికి ముందే చెప్పా.. నాకు లవర్ ఉన్నాడని..
చదివింది 'లా'.. ఫాలోవర్లు తగ్గారని విషాదం.. 'ఇలాంటి రోజు వస్తుందని తెలుసు'
Hyderabad: నగరంలో 144 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
వేలానికి గంటా ఆస్తులు..!
ఫ్రెండ్‌కి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్తూ..
ఐటీఆర్ ఫారంలను నోటిఫై చేసిన కేంద్రం
ప్రియుడి ఇంటి ముందు ట్రాన్స్‌జెండర్ ధర్నా
భారత్-పాకిస్తాన్.. ఎవరి బలమెంత?
కర్రి గుట్టలపై బేస్ క్యాంప్ !
అమ్మకాలు 'అక్షయం'!
దైవ సాక్షిగా.. 'మళ్లీ భక్తులే బలి'
ఒక్కో బనానా రూ.565, బీర్ ధర రూ. 1,697, ఎక్కడో తెలుసా?
అభిమానులకు గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న ఛావా నటుడు
తొమ్మిది గజాల చీరలో మహారాష్ట్ర అమ్మాయిలా స్టార్ హీరోయిన్
కులగణన చేసిన మొదటి సీఎం వైఎస్ జగన్
'షాడో తోలు బొమ్మలాట'ను సజీవంగా నిలిపింది..! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
అజిత్ కుమార్ బర్త్ డే.. భార్య షాలిని పోస్ట్ వైరల్!
IPL 2025: రూ. 10 కోట్లు ఇచ్చి.. బెంచ్ మీద కూర్చోబెడతారా?
Hit And Run: పూటుగా మద్యం సేవించి బాలిక ప్రాణం తీసిన యువతి
బంగ్లాదేశ్ సాయంతో.. భారత్‌లో కుట్రకు పాకిస్తాన్ తెర
టారిఫ్‌ల ఎఫెక్ట్.. టాప్ కార్ల తయారీ కంపెనీ ఔట్!
ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. ఐపీఎల్ నుంచి అతడు అవుట్
ఘనంగా మైక్రోసాప్ట్ ఐడీసీ పినాకిల్ సమ్మిట్-2025
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్ స్టార్.. ఐపీఎల్ హిస్టరీలోనే..
హిట్-4లో హీరో ఫైనల్.. ఏసీపీ వీరప్పన్‌గా ఎంట్రీ
వినోదరంగంలో ‘వేవ్స్’.. ప్రారంభించనున్న మోదీ
చిన్న వాటికి చిన్నవి..
ప్రభుత్వమే చంపేసింది
ఐపీవోతో ప్రభుత్వ షేర్ల జోరు
RR VS MI: బుమ్రా, బౌల్ట్ లాంటి హేమాహేమీల ముందు కుర్ర వైభవ్ ఆటలు సాగుతాయా..?
చంద్రబాబు పర్యటనలో తప్పిన పెనుప్రమాదం
సొంత ప్రపంచంలో బతుకుతున్నారు.. బాబా రాందేవ్‌పై కోర్టు అసహనం
IPL 2025: ధోనికి ఇలా జరగడం ఇదే తొలిసారి..!
‘రాహుల్, కాంగ్రెస్ పార్టీలకు భయపడి మేం నిర్ణయాలు తీసుకోం’
సహజ యోగంతో ఆత్మసాక్షాత్కారం
'కిలిమంజారో డైట్' అంటే..? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
పూర్తి కోడింగ్ పనంతా ఏఐదే!
ఇదేందయ్యా ఇది!.. ఒక్క నిమిషంలోనే ముగించేసింది.. సైంటిస్టులు సైతం ఫిదా
..చాలా కాలాం తర్వాత మీరు పర్యటిస్తున్నారుగా.. జనం మర్చిపోయార్సార్!
గెలుపు జోష్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు షాక్!
ధర్మ దేవతల ఆవాసం ‘ధర్మస్థల’ : ఒక్కసారైనా మంజునాథుని దర్శనం
పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!
శరీరానికి కావాల్సిన పోషకాలు ఇవే..! వయసుల వారీగా డైట్ ఎలా ఉండాలంటే..?
అరెస్ట్ చేసిన బాలుడు ఎక్కడ?
సన్నీ థామస్ కన్నుమూత.. అభినవ్ బింద్రా భావోద్వేగం
థాయ్‌లాండ్‌లో హ్యాండ్లర్!
'శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు
బాబు హయాంలో.. పుణ్యక్షేత్రాలలో మృత్యుఘోష!
ఏడాదిన్నర క్రితమే విడాకులు.. డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ
ఇండస్‌ఇండ్‌లో ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ ఏర్పాటు
TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
మృతదేహాల వెలికితీతలోనూ నిర్లక్ష్యమే
చెన్నై ఖేల్ ఖతం
పాక్ విమానాలకు మన గగనతలం బంద్
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
‘ఆ డ్యామ్ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం గాలికొదిలేసింది’
ఎంత డబ్బు అయినా చెల్లిస్తా!.. నాకు అక్కర్లేదు!
‘హిట్ 3’లోని వయెలెన్స్‌ని ఎంజాయ్ చేస్తారు: నాని
భారత జవాన్‌కు భార్యగా పాకిస్తానీ మహిళా?
వేదాంతా లాభం హైజంప్
ఆసియా తొలి ప్లేయర్‌గా రికార్డు.. చరిత్ర పుటల్లోకి అతడి పేరు!
రెండో కొడుకు... అనాథగా వచ్చి.. సెలబ్రిటీగా ఎవరో తెలుసా?
భూమికపై విచక్షణా రహితంగా దాడి చేసిన భర్త
వాళ్లిద్దరు అద్భుతం.. అతడు గొప్ప ఫీల్డర్.. కానీ అక్కడే వెనుకబడ్డాం: ధోని
టిక్.. టిక్... టిక్
డిప్యూటీ సీఎంకు పంగ‘నామం’
IPL 2025: వైభవ్ ఒక్క మ్యాచ్‌లో చేస్తే, సీఎస్కేకు సీజన్ మొత్తం పట్టింది..!
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. నెల రోజుల్లోపే ఓటీటీకి..!
ఇది మోదీ సర్కార్.. ఏ ఒక్క ఉగ్రవాదిని వదలం: అమిత్ షా
సింహాచలం ఘటన.. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం
లాభాల బ్యాంకులు..
‘ఆ డ్యామ్ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం గాలికొదిలేసింది’
RR VS MI: బుమ్రా, బౌల్ట్ లాంటి హేమాహేమీల ముందు కుర్ర వైభవ్ ఆటలు సాగుతాయా..?
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
అభిమానులకు గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న ఛావా నటుడు
చంద్రబాబు పర్యటనలో తప్పిన పెనుప్రమాదం
మనం రాక్షస రాజ్యంలో ఉన్నాం: వైఎస్ జగన్
‘హిట్ 3’ మూవీ రివ్యూ
పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేత.. నెక్ట్స్ జరిగేది ఇదేనా?
భయపెట్టిన భారత్.. పాక్ సైన్యంలో పెను మార్పులు
భారత్-పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
ఇజ్రాయెల్‌లో భీకర కార్చిచ్చు.. జెరూసలెంను కమ్మేసిన పొగ
'రెట్రో' మూవీ రివ్యూ.. సూర్య హిట్ కొట్టాడా..?
పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా!
ఒక అరటి పండు ధర రూ.565!
పహల్గాం ఉగ్రదాడిపై విచారణ.. పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
వెండింగ్ మెషిన్ల ద్వారా బంగారం కొనుగోలు
HIT3 X Review: ‘హిట్ 3’ ట్విటర్ రివ్యూ
ప్రియురాలితో గొడవ, అమాంతం దూకేశాడు, ట్విస్ట్ ఏంటంటే..!
సింహాచలం ఘటన: సంచలన విషయాలు చెప్పిన కాంట్రాక్టర్
ఐదు ఫుల్ బాటిళ్లు కచ్చా తాగేసి.. విషాదం నింపిన పందెం
IPL 2025: బీసీసీఐకి ఊహించని షాక్!
పహల్గాం ఉగ్రదాడి.. వెలుగులోకి సంచలన విషయాలు
‘వైఎస్ జగన్‌కు, చంద్రబాబుకు ఇదే తేడా..’
బంగారమా..? మాకొద్దు బాబోయ్..!
కార్మిక సోదరులకు వైఎస్ జగన్ మేడే శుభాకాంక్షలు
దూసుకొస్తున్న కాస్మోస్ 482
మంచి తరుణం మించి పోరాదు! పసిడి తులం ఎంతంటే..
రెట్రో మూవీ ట్విటర్ రివ్యూ.. సందడి లేదేంటి?
వాళ్ల వలలో పడొద్దు.. పంతాలకు పోయి సమ్మె చేయొద్దు
‘కుల గణన’ నిర్ణయంపై వైఎస్ జగన్ హర్షం
రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ విఫలం: వైఎస్ అవినాష్‌రెడ్డి
నాని 'హిట్ 3' వచ్చేది ఆ ఓటీటీలోనే..
సింహాచలంలో ప్రమాద స్థలిని పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు
ఆస్తులు తాకట్టు పెట్టి సినిమా తీశాం.. మా బాధ మీకేం తెలుసు?
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
డ్రైవర్ జీతం నెలకు రూ.4 లక్షలు..! అంబానీయా.. మజాకా..
అయ్యో అంబానీ ‘హ్యాపీ’ ఇక లేదు, ఫ్యామిలీలో విషాదం!
పెళ్లికి ముందే చెప్పా.. నాకు లవర్ ఉన్నాడని..
చదివింది 'లా'.. ఫాలోవర్లు తగ్గారని విషాదం.. 'ఇలాంటి రోజు వస్తుందని తెలుసు'
Hyderabad: నగరంలో 144 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
వేలానికి గంటా ఆస్తులు..!
ఫ్రెండ్‌కి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్తూ..
ఐటీఆర్ ఫారంలను నోటిఫై చేసిన కేంద్రం
ప్రియుడి ఇంటి ముందు ట్రాన్స్‌జెండర్ ధర్నా
భారత్-పాకిస్తాన్.. ఎవరి బలమెంత?
కర్రి గుట్టలపై బేస్ క్యాంప్ !
అమ్మకాలు 'అక్షయం'!
దైవ సాక్షిగా.. 'మళ్లీ భక్తులే బలి'
ఒక్కో బనానా రూ.565, బీర్ ధర రూ. 1,697, ఎక్కడో తెలుసా?
అభిమానులకు గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న ఛావా నటుడు
తొమ్మిది గజాల చీరలో మహారాష్ట్ర అమ్మాయిలా స్టార్ హీరోయిన్
కులగణన చేసిన మొదటి సీఎం వైఎస్ జగన్
'షాడో తోలు బొమ్మలాట'ను సజీవంగా నిలిపింది..! రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
అజిత్ కుమార్ బర్త్ డే.. భార్య షాలిని పోస్ట్ వైరల్!
IPL 2025: రూ. 10 కోట్లు ఇచ్చి.. బెంచ్ మీద కూర్చోబెడతారా?
Hit And Run: పూటుగా మద్యం సేవించి బాలిక ప్రాణం తీసిన యువతి
బంగ్లాదేశ్ సాయంతో.. భారత్‌లో కుట్రకు పాకిస్తాన్ తెర
టారిఫ్‌ల ఎఫెక్ట్.. టాప్ కార్ల తయారీ కంపెనీ ఔట్!
ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. ఐపీఎల్ నుంచి అతడు అవుట్
ఘనంగా మైక్రోసాప్ట్ ఐడీసీ పినాకిల్ సమ్మిట్-2025
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్ స్టార్.. ఐపీఎల్ హిస్టరీలోనే..
హిట్-4లో హీరో ఫైనల్.. ఏసీపీ వీరప్పన్‌గా ఎంట్రీ
వినోదరంగంలో ‘వేవ్స్’.. ప్రారంభించనున్న మోదీ
చిన్న వాటికి చిన్నవి..
ప్రభుత్వమే చంపేసింది
ఐపీవోతో ప్రభుత్వ షేర్ల జోరు
RR VS MI: బుమ్రా, బౌల్ట్ లాంటి హేమాహేమీల ముందు కుర్ర వైభవ్ ఆటలు సాగుతాయా..?
చంద్రబాబు పర్యటనలో తప్పిన పెనుప్రమాదం
సొంత ప్రపంచంలో బతుకుతున్నారు.. బాబా రాందేవ్‌పై కోర్టు అసహనం
IPL 2025: ధోనికి ఇలా జరగడం ఇదే తొలిసారి..!
‘రాహుల్, కాంగ్రెస్ పార్టీలకు భయపడి మేం నిర్ణయాలు తీసుకోం’
సహజ యోగంతో ఆత్మసాక్షాత్కారం
'కిలిమంజారో డైట్' అంటే..? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
పూర్తి కోడింగ్ పనంతా ఏఐదే!
ఇదేందయ్యా ఇది!.. ఒక్క నిమిషంలోనే ముగించేసింది.. సైంటిస్టులు సైతం ఫిదా
..చాలా కాలాం తర్వాత మీరు పర్యటిస్తున్నారుగా.. జనం మర్చిపోయార్సార్!
గెలుపు జోష్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు షాక్!
ధర్మ దేవతల ఆవాసం ‘ధర్మస్థల’ : ఒక్కసారైనా మంజునాథుని దర్శనం
పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!
శరీరానికి కావాల్సిన పోషకాలు ఇవే..! వయసుల వారీగా డైట్ ఎలా ఉండాలంటే..?
అరెస్ట్ చేసిన బాలుడు ఎక్కడ?
సన్నీ థామస్ కన్నుమూత.. అభినవ్ బింద్రా భావోద్వేగం
థాయ్‌లాండ్‌లో హ్యాండ్లర్!
'శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు
బాబు హయాంలో.. పుణ్యక్షేత్రాలలో మృత్యుఘోష!
ఏడాదిన్నర క్రితమే విడాకులు.. డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ
ఇండస్‌ఇండ్‌లో ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ ఏర్పాటు
TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
మృతదేహాల వెలికితీతలోనూ నిర్లక్ష్యమే
చెన్నై ఖేల్ ఖతం
పాక్ విమానాలకు మన గగనతలం బంద్
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ
‘ఆ డ్యామ్ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం గాలికొదిలేసింది’
ఎంత డబ్బు అయినా చెల్లిస్తా!.. నాకు అక్కర్లేదు!
‘హిట్ 3’లోని వయెలెన్స్‌ని ఎంజాయ్ చేస్తారు: నాని
భారత జవాన్‌కు భార్యగా పాకిస్తానీ మహిళా?
వేదాంతా లాభం హైజంప్
ఆసియా తొలి ప్లేయర్‌గా రికార్డు.. చరిత్ర పుటల్లోకి అతడి పేరు!
రెండో కొడుకు... అనాథగా వచ్చి.. సెలబ్రిటీగా ఎవరో తెలుసా?
భూమికపై విచక్షణా రహితంగా దాడి చేసిన భర్త
వాళ్లిద్దరు అద్భుతం.. అతడు గొప్ప ఫీల్డర్.. కానీ అక్కడే వెనుకబడ్డాం: ధోని
టిక్.. టిక్... టిక్
డిప్యూటీ సీఎంకు పంగ‘నామం’
సినిమా

ఆస్తులు తాకట్టు పెట్టి సినిమా తీశాం.. మా బాధ మీకేం తెలుసు?
కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఏవో కొన్ని చిత్రాలు మినహా ఏవీ పెద్దగా కలెక్షన్స్ రాబట్టడం లేదు. భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కు రావడం లేదు. అలా ఓ సినిమాను తన కుటుంబ ఆస్తులు తాకట్టు పెట్టి తీశానంటున్నాడు బాలీవుడ్ నిర్మాత, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ (Jackky Bhagnani).సగం కూడా వెనక్కు రాలేదా?ఇతడు గతేడాది అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌తో కలిసి 'బడే మియా చోటే మియా' సినిమా (Bade Miyan Chote Miyan) చేశాడు. ఇది దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిందని బీటౌన్‌లో గుసగుసలు వినిపించాయి. కానీ బాక్సాఫీస్ వద్ద కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అవలేదు. టోటల్ రన్లో కేవలం రూ.111.49 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. భారీ నష్టంతో పూజా ఎంటర్టైన్మెంట్ (Pooja Entertainment) సంస్థ నిర్మాత వాసు భగ్నానీ కుదేలయ్యాడు. ముంబైలోని ఆఫీస్‌ను అమ్మేసి రూ.250 కోట్ల అప్పు తేర్చేసినట్లు ప్రచారం జరిగింది.అనుమానమే నిజమైందితాజాగా వాసు భగ్నానీ కుమారుడు జాకీ భగ్నానీ సదరు సినిమా నష్టంపై స్పందించాడు. ఆ మూవీ కోసం మేము చాలా డబ్బు ఖర్చు చేశామన్నది వాస్తవం. భారీ బడ్జెట్‌తో సినిమా తీశాం కానీ కంటెంట్ ఎక్కడో ప్రేక్షకులకు కనెక్ట్ అవదన్న అనుమానం వచ్చింది. మా అనుమానమే నిజమైంది. జనాలు సినిమాను తిప్పికొట్టారు. వారికి ఎందుకు నచ్చలేదన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఎందుకంటే భవిష్యత్తులో మరోసారి ఆ తప్పును పునరావృతం చేయకూడదుగా.ఇప్పుడు చెప్పి ఏం లాభం?ఆస్తులు తాకట్టు పెట్టి ఈ సినిమా తీశాం. మా బాధ ఎవరికీ అర్థం కాదు. అయినా ఇప్పుడిదంతా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ, ఈ ఒక్క సంఘటనతో నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. జాకీ భగ్నానీ.. కల్ కిస్నే దేఖా, రంగ్రేజ్, అజబ్ గజబ్ లవ్, వెల్కమ్ టు కరాచీ, మిత్రాన్ వంటి చిత్రాల్లో నటించాడు. కూలీ నెం.1, కట్‌పుత్లి, మిషన్ రాణిగంజ్, గణ్పథ్, బడే మియా చోటే మియా చిత్రాలు నిర్మించాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను 2024లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.చదవండి: చదివింది 'లా'.. ఫాలోవర్లు తగ్గారని విషాదం.. 'ఇలాంటి రోజు వస్తుందని తెలుసు

హిట్-4లో హీరో ఫైనల్.. ఏసీపీ వీరప్పన్‌గా ఎంట్రీ
'హిట్ 3'లో అర్జున్ సర్కార్ పాత్రతో స్టార్ హీరో నాని నేడు థియేటర్స్‌లోకి వచ్చేశాడు. తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు. ‘హిట్’ ఫస్ట్, సెకండ్ కేస్లు రెండూ కమర్షియల్‌గా విజయాలు దక్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో హిట్ 3 (HIT 3)పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ’హిట్’ లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’ లో అడివి శేష్, ‘హిట్ 3’ లో నాని హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రతి సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్ హీరోను దర్శకుడు రివీల్ చేయడం విశేషం. ఈ క్రమంలోనే హిట్ ఫోర్త్ కేస్‌ను హీరో కార్తీ పూర్తి చేస్తాడని క్లూ ఇచ్చేశారు. ఇప్పుడు సోషల్‌మీడియాలో కార్తీ పేరు వైరల్ అవుతుంది.ఏసీపీ వీరప్పన్ పాత్రలో కార్తీ ఛార్జ్ తీసుకున్నారని హిట్-3లో ప్రకటించారు. దీంతో హిట్-4లో కార్తీ ఫైనల్ అయినట్లు తెలిసిపోయింది. రానున్న సీక్వెల్లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిగా కార్తీ సందడి చేయనున్నారు. పోలీస్ ఆఫీసర్‌గా గతంలో పలు సినిమాల్లో కార్తీ దుమ్మురేపాడు. ‘హిట్ 4’లో కార్తీ హీరో అని కొద్దిరోజుల క్రితమే సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కార్తీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలని హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారని వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు అదే నిజం అయిందని చెప్పవచ్చు.అయితే ‘హిట్’ సిరీస్ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలోనే సినిమా టీమ్ వెల్లడించింది కాబట్టి ‘హిట్ 4’ ‘హిట్ 5’ ‘హిట్ 6’ ‘హిట్ 7’ ‘హిట్ 8’ కూడా తెరకెక్కనున్నట్టు స్పష్టం అవుతోంది. అయితే హిట్ 8 కోసం ఓ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయాలని టీమ్ యోచిస్తోందని సమాచారం. హిట్ 1 నుంచి ‘హిట్ 7 వరకు నటించిన హీరోలందరూ కలిసి హిట్ 8లో తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. వీరంతా కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్ చేస్తారని అంటున్నారు.Karthi’s cameo as Rathnavel Pandian in #HIT3 was a total show-stealer! 👮♂️🔥 That powerful entry has us hyped for what’s next. Bring on #HIT4! 💥 #Nani #SrinidhiShetty #SaileshKolanu#HIT3TheThirdCase #HIT3 pic.twitter.com/GvThz38uBf— Movie Munch (@dailyaffairs12) May 1, 2025

చదివింది 'లా'.. ఫాలోవర్లు తగ్గారని విషాదం.. 'ఇలాంటి రోజు వస్తుందని తెలుసు'
సోషల్ మీడియా జనాల సమయాన్నే కాదు ప్రాణాల్ని కూడా కబళిస్తుందనడానికి ఇదే నిదర్శనం. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మిషా అగర్వాల్.. తన 25వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు ఏప్రిల్ 24న ప్రాణాలు తీసుకుంది. చిన్న వయసులోనే బలవన్మరణానికి పాల్పడటంపై పలువురూ విచారం వ్యక్తం చేశారు. మిషా ఆత్మహత్యకు గల కారణాన్ని ఆమె కుటుంబసభ్యులు తాజాగా వెల్లడించారు.డిప్రెషన్మిషా.. ఇన్స్టాగ్రామ్.. ఫాలోవర్లే తన ప్రపంచం అనుకుంది. 10 లక్షల మంది ఫాలోవర్లను సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కానీ తను అనుకున్నదానికి భిన్నంగా ఫాలోవర్స్ తగ్గుతూ పోవడంతో తను చాలా బాధపడింది. ఏకంగా డిప్రెషన్లోకి వెళ్లింది. తనకసలు విలువే లేదని కుమిలిపోయింది. నా ఇన్‌స్టా ఫాలోవర్స్ డ్రాప్ అవుతున్నారు, నేనేం చేయను, నా కెరీర్ ముగిసిపోయినట్లే అని నన్ను హగ్ చేసుకుని భయపడుతూ ఏడ్చేది. ఇన్‌స్టాగ్రామే సర్వస్వం కాదని, ఏమీ కాదని ఓదార్చేవాళ్లం. న్యాయవిద్య చదివి..ఎల్ఎల్బీ (న్యాయ విద్య) పూర్తి చేశావ్.. పీసీఎస్జేకు ప్రిపేర్ అవుతున్నావు. త్వరలోనే జడ్జివి అవుతాను. కెరీర్ గురించి భయపడాల్సిన పనిలేదని వెన్నుతట్టాం. కానీ, తనకు మా మాటలు వినిపించలేదు. ఇన్స్టాగ్రామ్ కోసం ప్రాణాలు తీసుకునేవరకు వెళ్తుందని అనుకోలేదు అని ఆమె ఫ్యామిలీ మెంబర్ చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై హీరోయిన్ తాప్సీ పన్ను (Taapsee Pannu) స్పందించింది. ఇలాంటి రోజొకటి వస్తుందని చాలాకాలంగా భయపడుతూ వస్తున్నాను. జీవితాన్ని ప్రేమించడానికి బదులు సోషల్ మీడియాలో కనిపించే ఫాలోవర్లు, వచ్చే లైకుల సంఖ్యే ప్రేమనుకుంటున్నారు.వర్చువల్ ప్రేమ కబళించేసిందిఈ వర్చువల్ లవ్.. నిజమైన ప్రేమను కంటికి కనబడకుండా చేస్తుందన్న భయం ఉండేది. ఇప్పుడదే నిజమైంది. లైక్స్, కామెంట్స్ చూసి తాత్కాలికంగా సంబరపడిపోతున్నారు. మీరు పొందిన డిగ్రీపట్టాలకన్నా కూడా మీకు వచ్చిన లైక్స్, కామెంట్స్ చూసి విలువైనవారిగా పరిగణించడం నిజంగా బాధాకరంగా ఉంది. ఇలాంటివి చూస్తుంటే మనసు ముక్కలవుతోంది అని సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Misha Agrawal (@themishaagrawalshow)ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: 'శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు

శర్వానంద్ కొత్త సినిమా.. 20 ఎకరాల్లో భారీ సెట్
ఇరవై ఎకరాల్లో శర్వానంద్ (Sharwanand) ‘భోగి’ ఆరంభించారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రానికి ‘భోగి’ (Bhogi Movie) టైటిల్ ఖరారైంది. ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్ పీరియాడికల్ యాక్షన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్గా నటిస్తుండగా మరో హీరోయిన్ డింపుల్ హయతి (Dimple Hayathi) ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. కాగా ‘ఫస్ట్ స్పార్క్’ అంటూ ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోను విడుదల చేసి, ఈ సినిమాకు ‘భోగి’ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా, బుధవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలైనట్లుగా యూనిట్ వెల్లడించింది.‘‘1960 నేపథ్యంలో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్రల ప్రాంతంలో వింటేజ్ సెట్టింగ్‌తో ‘భోగి’ సినిమా అద్భుతంగా ఉంటుంది. ప్రొడక్షన్ టీమ్ ఆరు నెలలు కష్టపడి, దాదాపు 20 ఎకరాల్లో భారీ సెట్ వేశారు. విధి, పోరాటం, మార్పు, తిరుగుబాటు అంశాల మేళవింపుతో ఈ సినిమా కథనం ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం. ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా చేస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. చదవండి: శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు
న్యూస్ పాడ్‌కాస్ట్

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన... కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో అంతులేని అవినీతి, అంతా అరాచకమే... చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం
క్రీడలు

IPL 2025: బీసీసీఐకి ఊహించని షాక్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్-2025 (IPL 2025) సందర్భంగా బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో బీసీసీఐకి ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి.అసలు ఏం జరిగిందంటే.. క్యాష్ రిచ్ లీగ్‌తో ప్రతి ఏటా ఏదో ఒక కొత్త హంగుతో నిర్వాహకులు అభిమానులను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. తొలుత అంపైర్ క్యామ్.. తర్వాత స్పైడర్ క్యామ్.. తాజాగా రోబో కుక్క (Robotic Dog).. ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ల టీమ్‌లో చేరిపోయాయి.నడుస్తుంది.. పరిగెడుతుంది.. ఎగురుతుంది..ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్స్- ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా ఈ రొబోటిక్ డాగ్‌ను నిర్వాహకులు పరిచయం చేశారు. ‘‘ఐపీఎల్ కుటుంబంలో కొత్త మెంబర్. ఇది నడుస్తుంది.. పరిగెడుతుంది.. ఎగురుతుంది.. అంతేకాదు మనస్ఫూర్తిగా నవ్వుతుంది కూడా! మా ప్రచార కుటుంబంలోని కొత్త మెంబర్‌కు స్వాగతం పలకండి’’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు.ఇక రిమోట్‌తో ఆపరేట్ చేసే ఈ రోబో కుక్కకు ఏప్రిల్ 20న ‘చంపక్’గా నామకరణం చేశారు. ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ విషయాన్ని నిర్వాహకులు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో రోబో డాగ్‌కు తాము ఎంచుకున్న పేర్లలో ఎక్కువ మంది చంపక్కే ఓటు వేశారని.. అందుకే దానికి ఆ పేరు పెట్టామని వెల్లడించారు.𝗛𝗼𝗹𝗱 𝗼𝗻! 𝗪𝗲'𝘃𝗲 𝗮 𝗻𝗲𝘄 𝗜𝗣𝗟 𝗳𝗮𝗺𝗶𝗹𝘆 𝗺𝗲𝗺𝗯𝗲𝗿 𝗶𝗻 𝘁𝗼𝘄𝗻 👀It can walk, run, jump, and bring you a 'heart(y)' smile 🐩❤️And...A whole new vision 🎥Meet the newest member of the #TATAIPL Broadcast family 👏 - By @jigsactin P.S: Can you help us in… pic.twitter.com/jlPS928MwV— IndianPremierLeague (@IPL) April 13, 2025 ‘చంపక్’ పేరిట పిల్లల కోసం మ్యాగజీన్అయితే, ‘చంపక్’ విషయంలో ఢిల్లీ ప్రెస్ పత్రా ప్రకాశన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 1968 నుంచి తాము ‘చంపక్’ పేరిట పిల్లల కోసం మ్యాగజీన్ ప్రచురిస్తున్నామని.. అయితే, తమ అనుమతి లేకుండానే తమ ట్రేడ్‌మార్క్ వాడుకున్నారని కోర్టుకు విన్నవించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా బుధవారం బీసీసీఐకి నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా సమాధానంతో తమ ముందుకు రావాలని బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 9కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.అనుమతి లేకుండాకాగా తమ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించుకోకుండా బీసీసీఐకి ఆదేశాలు జారీ చేయాలని కక్షిదారు కోరగా.. న్యాయస్థానం మాత్రం ఈ అంశంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ విషయం గురించి పబ్లిషర్ తరఫు న్యాయవాది అమిత్ గుప్తా మాట్లాడుతూ.. రొబోటిక్ డాగ్‌కు చంపక్ అనే పేరును పెట్టడం ట్రేడ్‌మార్క్ వివాదానికి తీసింది. అంతేకాదు సుప్రసిద్ధ బ్రాండ్‌ను.. అనుమతి లేకుండా అదీ వాణిజ్యపరంగా వాడుకోవడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా చంపక్కు ఉన్న పేరును ఇలా తమ వినోద వ్యాపారం కోసం వాడుకోవడం ఎంతమాత్రంసరికాదని పేర్కొన్నారు.ఇక బీసీసీఐ తరఫున న్యాయవాది జై సాయి దీపక్ స్పందిస్తూ.. చంపక్ అనేది ఒక పువ్వు పేరని.. టీవీ సిరీస్‌లోని క్యారెక్టర్‌గా అభిమానులు చంపక్‌ను చూస్తున్నారని పేర్కొన్నారు. అంతేతప్ప మ్యాగజీన్ నుంచి తాము ఎలాంటి పేరును తీసుకోలేదని వెల్లడించారు.చదవండి: గెలుపు జోష్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు షాక్!

ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. ఐపీఎల్ నుంచి అతడు అవుట్
రాజస్తాన్ రాయల్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన చేసింది. తమ యువ స్పిన్నర్ విఘ్నేశ్ పుతూర్ (Vignesh Puthur) ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మొత్తం మ్యాచ్‌లకు దూరమైనట్లు తెలిపింది. అతడి స్థానంలో రఘు శర్మ (Raghu Sharma)ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.చెన్నైతో మ్యాచ్‌లో అరంగేట్రంకాగా ఐపీఎల్ తాజా ఎడిషన్ మార్చి 22న ప్రారంభం కాగా.. ఆ మరుసటి రోజు ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా కేరళకు చెందిన విఘ్నేశ్ పుతూర్ ముంబై తరఫున అరంగేట్రం చేశాడు.రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శివం దూబే, దీపక్ హుడా వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా 24 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మరో నాలుగు మ్యాచ్‌లు ఆడిన విఘ్నేశ్ పుతూర్ మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టాడు.గాయం కారణంగా దూరంఅయితే, ఇటీవల విఘ్నేశ్ గాయపడ్డాడు. అతడి రెండు కాళ్ల ఎముకల్లోనూ నొప్పి రావడంతో ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ రఘు శర్మను తీసుకుంది.ఇక మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ విఘ్నేశ్ పుతూర్ మాత్రం జట్టుతో కలిసి ప్రయాణం చేయనున్నాడు. ముంబై ఇండియన్స్ వైద్య బృందం పర్యవేక్షణలో అతడు చికిత్స తీసుకుంటాడని ఫ్రాంఛైజీ తమ ప్రకటనలో వెల్లడించింది.రఘు శర్మ ధర రూ. 30 లక్షలుకాగా ముంబై నెట్ బౌలర్లలో ఒకడైన రఘు శర్మ కనీస ధర రూ. 30 లక్షలతో విఘ్నేశ్ పుతూర్ స్థానాన్ని భర్తీ చేశాడు. 32 ఏళ్ల రఘు దేశవాళీ క్రికెట్లో పంజాబ్, పుదుచ్చేరి జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటికి 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 57 వికెట్లు తీసిన రఘు శర్మ.. లిస్ట్-ఎ క్రికెట్లో తొమ్మిది మ్యాచ్‌లలో 14 వికెట్లు.. మూడు టీ20లలో మూడు వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌ను పరాజయాలతో ఆరంభించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. వరుసగా గత ఐదు మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటిన హార్దిక్ సేన.. ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మొత్తం ఆరు విజయాలు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: గెలుపు జోష్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు షాక్!

ఆసియా తొలి ప్లేయర్‌గా రికార్డు.. చరిత్ర పుటల్లోకి అతడి పేరు!
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ (Mehidy Hasan Miraz) చరిత్రపుటల్లోకెక్కాడు. ఆసియాలో ఇంత వరకు ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని ఘనత సాధించాడు. టెస్టు మ్యాచ్‌లో ఒకే రోజు శతకం బాదడంతో పాటు ఐదు వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.జింబాబ్వేతో రెండో టెస్టు సందర్భంగా మెహదీ హసన్ మిరాజ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు జింబాబ్వే జట్టు బంగ్లాదేశ్ పర్యటన (Zimbabwe tour of Bangladesh)కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో తొలి టెస్టులో బంగ్లాదేశ్ జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది.ఆల్‌రౌండ్ ప్రదర్శనతోఅయితే, చట్టోగ్రామ్ వేదికగా రెండో టెస్టు (Ban vs Zim 2nd Test)లో మాత్రం ఆతిథ్య జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మూడు రోజుల్లోనే ముగిసిన పోరులో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ (162 బంతులలో 104; 11 ఫోర్లు, 1 సిక్స్; 5/32) బ్యాటింగ్‌లో సెంచరీ బాదడంతో పాటు... జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు.మెహదీ హసన్ దూకుడుగత టెస్టులో బంగ్లాదేశ్‌ను ఓడించి నాలుగేళ్ల తర్వాత ఈ ఫార్మాట్లో తొలి విజయం ఖాతాలో వేసుకున్న జింబాబ్వే దాన్ని కొనసాగించడంలో విఫలమైంది. ఓవర్‌నైట్ స్కోరు 291/7తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్... చివరకు 129.2 ఓవర్లలో 444 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ సహకారంతో మెహదీ హసన్ మిరాజ్ శతకంతో చెలరేగిపోయాడు.చివర్లో అతడికి తైజుల్ ఇస్లామ్ (20), తన్జీమ్ హసన్ (80 బంతుల్లో 41; 2 ఫోర్లు, 1 సిక్స్) సహకరించారు. మెహదీ హసన్ దూకుడుతో ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగుల ఆధిక్యం లభించింది. జింబాబ్వే బౌలర్లలో విన్సెంట్ మసెకెసా 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 46.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది.జింబాబ్వే ఓపెనర్ బెన్ కరన్ (103 బంతుల్లో 46; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (25), వెల్లింగ్టన్ మసకద్జ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదంతొక్కిన మెహదీ హసన్ మిరాజ్... బంతితోనూ విజృంభించి 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇతరుల్లో తైజుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్ములేపిన మిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.టెస్టుల్లో 2068 రన్స్, 205 వికెట్లుకాగా ఖుల్నాకు చెందిన మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్ ఆల్‌రౌండర్. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన అతడు రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్. 2016లో బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మెహదీ హసన్ మిరాజ్.. ఇప్పటి వరకు 53 టెస్టులు, 105 వన్డేలు, 29 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.టెస్టుల్లో 2068 పరుగులు చేయడంతో పాటు 205 వికెట్లు తీశాడు. అదే విధంగా.. వన్డేల్లో 1617 పరుగులు సహా 110 వికెట్లు.. టీ20లలో 354 పరుగులు సహా 14 వికెట్లు మెహదీ హసన్ మిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో రెండు, వన్డేల్లో రెండు శతకాలు సాధించాడు.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. అతడు గొప్ప ఫీల్డర్.. కానీ అక్కడే వెనుకబడ్డాం: ధోని

చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్ స్టార్.. ఐపీఎల్ హిస్టరీలోనే..
పంజాబ్ కింగ్స్ యువ క్రికెటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో బుధవారం నాటి మ్యాచ్ సందర్భంగా ప్రభ్‌సిమ్రన్ ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై- పంజాబ్ తలపడ్డాయి. టాస్ గెలిచిన పంజాబ్ ఆతిథ్య సీఎస్కేను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ధోని సేన 19.2 ఓవర్లలో 190 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సామ్ కరన్ (88), డెవాల్డ్ బ్రెవిస్ (32) మాత్రమే రాణించారు.చెలరేగిన చహల్ఇక పంజాబ్ బౌలర్లలో యజువేంద్ర చహల్ నాలుగు వికెట్ల (4/32)తో చెలరేగగా.. అర్ష్‌దీప్ సింగ్, మార్కో యాన్సెన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మిగతా వారిలో అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఈ క్రమంలో లక్ష్య ఛేదనను ఘనంగా ఆరంభించిన పంజాబ్ కాసేపటికే ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (23) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో కలిసి వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.దంచికొట్టిన ప్రభ్‌సిమ్రన్,శ్రేయస్ప్రభ్సిమ్రన్ 36 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేయగా.. శ్రేయస్ 41 బంతుల్లో 72 రన్స్‌తో అదరగొట్టాడు. వీరిద్దరికి తోడు ఆఖర్లో శశాంక్ సింగ్ (12 బంతుల్లో 23) రాణించడంతో 19.4 ఓవర్లలో పని పూర్తి చేసిన పంజాబ్.. చెన్నైని నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో చెన్నై ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. ప్రస్తుతం టాప్-2లో ఉన్న పంజాబ్ తమ అవకాశాలను మరింత మెరుగుపరచుకుంది.🚁🔥pic.twitter.com/iBABtLlQ4f— Punjab Kings (@PunjabKingsIPL) April 30, 2025ఇక ఈ మ్యాచ్‌లో అర్ధ శతకంతో ఆకట్టుకున్న ప్రభ్‌సిమ్రన్.. ఐపీఎల్లో 1100 పరుగుల మైలురాయిని దాటేశాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా 24 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నిలిచాడు.కాగా 2019లో పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ప్రభ్‌సిమ్రన్.. ఇప్పటి వరకు అదే జట్టుతో కొనసాగుతున్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటికి 44 మ్యాచ్‌లలో కలిపి 1102 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ధ శతకాలతో పాటు ఓ సెంచరీ కూడా ఉంది.ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన అన్క్యాప్డ్ ప్లేయర్లు1. ప్రభ్‌సిమ్రన్ సింగ్ - 1102 పరుగులు2. మనన్ వోహ్రా- 1083 పరుగులు 3. రాహుల్ తెవాటియా- 1063 పరుగులు4. ఆయుశ్ బదోని- 886 పరుగులు5. మన్వీందర్ బిస్లా- 798 పరుగులు.చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. అతడు గొప్ప ఫీల్డర్.. కానీ అక్కడే వెనుకబడ్డాం: ధోనిHat-trick 👌Powerful start with the bat 🔥Captain's knock 🫡The Battle of Kings goes the @PunjabKingsIPL way again this season ❤Scorecard ▶ https://t.co/eXWTTv7Xhd #TATAIPL | #CSKvPBKS pic.twitter.com/Yk1SOZOzip— IndianPremierLeague (@IPL) April 30, 2025
బిజినెస్

బంగారమా..? మాకొద్దు బాబోయ్..!
బంగారం డిమాండ్ ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (మార్చి త్రైమాసికం) 15 శాతం తగ్గి 118.1 టన్నులుగా ఉంది. విలువ పరంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మాత్రం 22 శాతం వృద్ధితో రూ.94,030 కోట్లుగా నమోదైంది. ఈ వివరాలను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) విడుదల చేసింది. 2025-26లో భారత్ నుంచి పసిడి డిమాండ్ 700–800 టన్నుల మేర ఉండొచ్చని అంచనా వేసింది.‘ధరలు పెరగడంతో కొనుగోలు శక్తిపై ప్రభావం పడింది. అయినప్పటికీ సాంస్కృతికంగా ఉన్న ప్రాధాన్యం.. అక్షయ తృతీయకుతోడు వివాహాల సీజన్ కావడంతో కొనుగోళ్లకు డిమాండ్ కొనసాగుతోంది’ అని డబ్ల్యూజీసీ ఇండియా సీఈవో సచిన్ జైన్ మార్చి త్రైమాసిక నివేదికలో తెలిపారు. ధరలు గణనీయంగా పెరిగిపోవడంతో వినియోగదారులు లైట్ వెయిట్ ఆభరణాల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు జ్యుయలర్లు చెబుతున్నారు. ముఖ్యంగా మే చివరి వరకు వివాహాలు ఉండడం, భారతీయ సంస్కృతిలో బంగారం ఆభరణాలకు ఉన్న ప్రాధాన్యంతో కొనుగోళ్లకు డిమాండ్ కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. పసిడిపై జోరుగా పెట్టుబడులుఇక ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో బంగారంపై పెట్టుబడులకు డిమాండ్ కొనసాగింది. క్రితం ఏడాది మొదటి మూడు నెలలతో పోల్చి చూస్తే 7 శాతం అధికంగా 46.7 టన్నులుగా నమోదైంది. క్రితం ఏడాది మొదటి త్రైమాసికంలో పసిడి పెట్టుబడుల డిమాండ్ 43.6 టన్నులుగా ఉంది. అంతర్జాతీయంగా భౌగోళిక, వాణిజ్య ఉద్రిక్తతలతో ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్లను చూస్తున్న తరుణంలో.. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షిత సాధనంగా బంగారాన్ని పరిగణిస్తుండడం ఇందుకు నేపథ్యంగా ఉంది.ఆభరణాల డిమాండ్‌లోనూ క్షీణతే..ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో బంగారం ఆభరణాల డిమాండ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 25 శాతం తగ్గి 71.4 టన్నులుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 95.5 టన్నులుగా ఉంది. 2020 నుంచి చూస్తే ఒక ఏడాది మొదటి త్రైమాసికంలో కనిష్ట ఆభరణాల డిమాండ్ ఇదే కావడం గమనార్హం. క్రితం ఏడాది మొదటి క్వార్టర్‌తో పోలిస్తే ఆభరణాల కొనుగోళ్ల విలువ 3 శాతం పెరిగింది. ఇదీ చదవండి: మంచి తరుణం మించి పోరాదు! పసిడి తులం ఎంతంటే..పెరిగిన దిగుమతులుపసిడి దిగుమతులు 8 శాతం పెరిగి 167.4 టన్నులుగా ఉన్నాయి. రీసైక్లింగ్ పరిమాణం 32 శాతం తగ్గి 26 టన్నులుగా నమోదైంది. అధిక ధరల నేపథ్యంలో వినియోగదారులు పాత ఆభరణాలను తమవద్ద ఉంచుకునేందుకు మొగ్గు చూపించడం ఇందుకు కారణం. ఇక అంతర్జాతీయంగా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్ ఒక శాతం పెరిగి 1,206 టన్నులుగా ఉంది.

మంచి తరుణం మించి పోరాదు! పసిడి తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఈరోజు తగ్గుముఖం పట్టింది. బుధవారంతో పోలిస్తే గురువారం భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,750 (22 క్యారెట్స్), రూ.97,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.2000, రూ.2180 తగ్గింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.2000, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2180 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.2000 దిగి రూ.87,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2160 తగ్గి రూ.95,880 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లుగానే వెండి ధరలు(Silver Price) కూడా గురువారం తగ్గాయి. బుధవారం ముగింపు ధరలతో పోలిస్తే వెండి ధర కేజీ రూ.2,000 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,07,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

చిన్న వాటికి చిన్నవి..
స్వీడిష్ హోమ్ ఫర్నీషింగ్ రిటైలింగ్ దిగ్గజం ఐకియా భారత్‌లో తన కార్యకలాపాల విస్తరణకు సంబంధించి కొత్త వ్యూహాలను పరిశీలిస్తోంది. బడా నగరాల్లో పెద్ద స్టోర్స్‌కే పరిమితం కాకుండా చిన్న పట్టణాలకు అనువుగా చిన్న ఫార్మాట్ స్టోర్స్‌ను కూడా ఏర్పాటు చేయడం ద్వారా కొనుగోలుదారులకు చేరువ కావాలని భావిస్తోంది. సుమారు 10,000 చ.అ. విస్తీర్ణంలో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఐకియా ఇండియా కంట్రీ ఎక్స్పాన్షన్ మేనేజర్ పూజా గ్రోవర్ తెలిపారు.మాల్స్‌లోనూ స్టోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు, వేగంగా విస్తరించేందుకు కూడా ఈ ఫార్మాట్ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు గ్రోవర్ వివరించారు. ఈ కొత్త కాన్సెప్టు విషయంలో రియల్ ఎస్టేట్ డెవలపర్లతో భాగస్వామ్యాలు కుదుర్చుకునే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. చిన్న స్టోర్స్‌లో పరిమిత స్థాయిలోనే ఉత్పత్తులను డిస్ప్లే చేసినా మొత్తం 7,000 ప్రోడక్టుల విస్తృత శ్రేణి నుంచి ఎంచుకునేందుకు డిజిటల్ కేటలాగ్, హోమ్ డెలివరీ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని గ్రోవర్ చెప్పారు.ఇదీ చదవండి: వెండింగ్ మెషిన్ల ద్వారా బంగారం, వెండి కొనుగోలుప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై వంటి ఆరు ప్రాధాన్య నగరాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వివరించారు. పదేళ్ల వ్యవధిలో రూ.10,500 కోట్ల పెట్టుబడులతో 10 స్టోర్స్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనతో 2013లో ఐకియా భారత్‌కి వచ్చింది.

వెండింగ్ మెషిన్ల ద్వారా బంగారం కొనుగోలు
దేశవ్యాప్తంగా వచ్చే 12–18 నెలల్లో 50 వరకు బంగారం, వెండి వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేయనున్నట్టు యాస్పెక్ట్ బులియన్ అండ్ రిఫైనరీ ప్రకటించింది. ఈ వెండింగ్ మెషిన్ల ద్వారా బంగారం, వెండి కాయిన్లను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. వెండింగ్ మెషిన్ వద్దే అప్పటికప్పుడు ధరలను కస్టమర్లు చూసుకోవచ్చని.. రియల్‌టైమ్ మార్కెట్ ధరలు అక్కడ కనిపిస్తాయని పేర్కొంది. వేగంగా, భద్రంగా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఈ వెండింగ్ మెషిన్లు ఉంటాయని.. మూడు నిమిషాల్లోనే కొనుగోలును పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు సహా పలు రకాల పేమెంట్ ఆప్షన్లను వినియోగించుకోవచ్చని తెలిపింది.వెండింగ్ మెషిన్ ఎలా పని చేస్తుందంటే..గోల్డ్ కాయిన్ వెండింగ్ మెషిన్లు సాధారణ వెండింగ్ మెషీన్ల మాదిరిగానే పనిచేస్తాయి. కానీ బంగారం విలువ కారణంగా అదనపు భద్రతను కల్పిస్తారు. అందులో భాగంగా వినియోగదారుల వెరిఫికేషన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.మెషిన్లో ముందుగా వినియోగదారులు తమకు కావాల్సిన బంగారు నాణెం బరువు, రకాన్ని ఎంచుకుంటారు.నగదు, క్రెడిట్/డెబిట్ కార్డు లేదా మొబైల్ బ్యాంకింగ్ (యూపీఐ, క్యూఆర్ కోడ్లు మొదలైనవి) ద్వారా చెల్లింపులు చేయవచ్చు.కొన్ని యంత్రాలకు గుర్తింపు ధ్రువీకరణ అవసరం అవుతుంది. ముఖ్యంగా అధిక మొత్తంలో చేసే లావాదేవీల కోసం ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వంటి కేవైసీ (నో యువర్ కస్టమర్) పద్ధతులను ఉపయోగిస్తారు.చెల్లింపు అయినట్లు ధ్రువీకరించిన తరువాత మెషిన్లోని స్టోరేజ్ కంపార్ట్మెంట్ నుంచి బంగారు నాణేన్ని రిలీజ్ చేస్తుంది.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫారంలను నోటిఫై చేసిన కేంద్రంకొన్ని యంత్రాల ద్వారా బంగారు కడ్డీలు కూడా పొందే వీలుంటుంది. దానికి సంబంధించిన వివరాలను ముందుగానే వినియోగదారులకు తెలియజేస్తుంది.పంపిణీ సమయంలో భద్రతకోసం సీసీటీవీ మానిటరింగ్, ట్యాంపరింగ్ ప్రూఫ్ మెకానిజమ్స్, వెయిట్ సెన్సర్లను అమరుస్తారు.యంత్రాల్లో యాంటీ-థెఫ్ట్ అలారంలు, రియల్-టైమ్ ఇన్వెంటరీ ట్రాకింగ్ విధానం కూడా ఉంటుంది.బంగారం కొనుగోలు రుజువు కోసం ఈ-రశీదులు కూడా పొందవచ్చు.
ఫ్యామిలీ

పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!
పిల్లలకు చెప్పాల్సిన పాఠాలు ‘మీరు ఉద్దండ పండితులేగాని ఉండాల్సిన బుద్ధి మాత్రం లేదయ్యా’ అంటాడు శకుని. ర్యాంకులు వేరు... కామన్సెన్స్ వేరు... ఈ సంగతి పిల్లలకు ఎవరు చెప్పాలి? ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అంటాడు ఇదే శకుని. ఈ చిట్కా చెప్పడానికి పెద్దలకు తీరిక ఎక్కడిది? అస్మదీయులు ఎవరో తస్మదీయులు ఎవరో తెలుసుకోకపోతే పిల్లల అడుగులు పడేదెలా? హాయ్ హాయ్ నాయకా.. హోయ్ హోయ్ నాయకా... నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉంటాయి? తెలుగువారికి మాత్రమే ఉన్న వ్యక్తిత్వ వికాస సర్వస్వం ‘మాయాబజార్’ సినిమా. ఈ సెలవుల్లో పెద్దలు పిల్లలతో ఈ సినిమా చూడాలి. వివరించాలి. ‘మాయాబజార్’1957లో విడుదలైన గొప్ప తెలుగు చిత్రం. భారతంలోని పాత్రలకు కొద్దిపాటి కల్పన జత చేసి మలచిన ఈ సినిమా ఎందుకు ఇంతకాలం ఆదరణ పొందుతూ ఉందంటే అది ఎప్పుడూ ఒకేలా ఉండే మానవ స్వభావాలను చిత్రించింది కనుక. నేడు ఎదురుపడే మనుషులు ఎలా ఉంటారో ఈ సినిమాలో పాత్రలు అలా ఉంటాయి. అందుకే వాటితో తమను తాము ఐడెంటిఫై చేసుకున్న ప్రేక్షకులు ఎన్నో సాఠాలు నేర్చుకుంటారు. అర్థం చేసుకుంటారు. పిల్లలకు ఈ సినిమా గొప్ప వినోదంగా ప్రారంభమవుతుంది. ఐదేళ్ల వయసు పిల్లల నుంచి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. చూసేకొద్దీ ఎదిగే కొద్దీ వారికి సినిమా కొత్తగా అర్థమై మరింతగా నచ్చుతుంది. ఈ సినిమాకు ఫ్యాన్స్ అయిపోతారు. అలా తరతరాలుగా ఫ్యాన్స్ అయ్యేలా చేసుకుందీ సినిమా. గతంలో ప్రతి వేసవిలో ఈ సినిమా రీరిలీజ్ అయ్యేది. ఇప్పుడు ఓటిటీల్లో... యూట్యూబ్‌లో కలర్లో ఉంది. పిల్లలతో ఒకటికి రెండుసార్లు చూసి వారికి చెప్పాల్సిన పాఠాలు చాలానే ఉంటాయి. 1. బాల అభిమన్యు తన విలువిద్య గురించి ఇలా అంటాడు: అత్తయ్యా... నువ్వు జడవకుండా నుంచో... నీ ముక్కుకు తగలకుండా నత్తును కొడతాను. పిల్లలకు చెప్పాలి: నత్తు అంటే ముక్కుకు పెట్టుకునే ఆభరణం. విలువిద్య నేర్చుకుని ఎవరైనా సరే పండునో కాయనో కొట్టగలరు... కాని ముక్కుకు తగలకుండా నత్తును కొడతానంటున్నాడంటే విలువిద్య చాలా గొప్పగా నేర్చుకున్నాడన్న మాట. మనం చదివినా, ఆటల్లో ప్రవేశించినా, కళల్లో ఉన్నా ఆ స్థాయి పరిణితి సాధించాలి. అభిమన్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి. 2. శ్రీకృష్ణుడు ‘సత్యపీఠం’ తీసుకువస్తాడు. అలాగే ‘ప్రియదర్శిని’ కూడా చూపిస్తాడు. పిల్లలకు చెప్పాలి ‘సత్యపీఠం’ ఆనాటి లై డిటెక్టర్. మన పూర్వికులు శాస్త్రపరంగా గొప్ప ప్రయోగాలు చేశారు. ఊహలు చేశారు. శాస్త్రజ్ఞుల ఊహలో లేని కాలంలో ‘సత్యపీఠం’ ఊహ చేయడం మనవారి గొప్పతనం. అలాగే వీడియో కాల్ చేసుకునేలా ల్యాప్‌టాప్‌లాంటి ‘ప్రియదర్శిని’ని చూపించారు. సైన్స్ దృష్టికోణం నుంచి పురాణాలు చూస్తే చాలా ఇంటెరెస్టింగ్ విషయాలు తెలుస్తాయని చె΄్పాలి. 3. శకుని పాచికలు వేస్తూ అంటాడు: ఈ పాచికలతో ఎవరినైనా సర్వనాశనం చేయగలను. పిల్లలకు చె΄్పాలి: జూదం వ్యసనం. అందులో మోసం ఉంటుంది. నష్టం ఉంటుంది. ఒక్కసారి వ్యసనాల్లో దిగితే తిరిగి రావడం కష్టం. నేటి రోజుల్లో ఆన్లైన్ గేమింగ్ కూడా అలాంటి వ్యసనమే. బెట్టింగ్ యాప్‌లు కూడా వ్యసనమే. ఆల్కహాల్, డ్రగ్స్ కూడా వ్యసనాలే. వ్యసనాల వల్ల పాండవులు రాజ్యాలను కోల్పోయారు. అందువల్ల ఎప్పుడూ వ్యసనాల జోలికిపోకూడదు. 4. శర్మ, శాస్త్రి వచ్చి లక్ష్మణ కుమారుణ్ణి పొగుడుతూ ‘పురోగమించుట వారికి తెలుసు... తిరోగమించుట తమకు తెలుసు’ అంటారు. పిల్లలకు చెప్పాలి: గొప్పలు చెప్పుకోవడం, పొగడ్తలకు పడిపోవడం అల్పుల లక్షణం అని, లక్ష్మణ కుమారుడు అలాంటి వాడని చెప్పాలి. మనకు ఎంత ప్రతిభ ఉన్నా గొప్పలు చెప్పుకోకూడదని నేర్పాలి. లేని ప్రతిభ ఉన్నట్టుగా కల్పించి చెప్పి అభాసుపాలు కాకూడదని చెప్పాలి. మన బలహీనతను వాడుకుంటూ కొందరు చుట్టూ చేరి మోసం చేసి పబ్బం గడుపుతారనీ అలాంటి వారిని గుర్తించి దూరం ఉండాలి చెప్పాలి. 5. రాజ్యం పోయాక సుభద్ర వస్తే బలరాముని ఇంట్లో పరాభవం పిల్లలకు చెప్పాలి: కొందరు మనుషులు అభిమానాన్ని బట్టి గాక స్థితిని బట్టి గౌరవిస్తారని, మనం కష్టంలో ఉంటే వారు అసలు రూపు చూపిస్తారని అలాంటి వారిని చూసి జాలి పడాలి తప్ప బాధ పడకూడదని నేర్పాలి. డబ్బుకు అతీతమైన విద్యాబుద్ధులు, వ్యక్తిత్వం శాశ్వతమని, వాటికే లోకంలో విలువ, గౌరవం అని చె΄్పాలి. 6. ఘటోత్కచుడి ప్రవేశం పిల్లలకు చెప్పాలి: మన దేశంలో అడవుల్లో జీవించేవారు ఉంటారని వారిని గిరిజనులు, ఆదివాసీలు అంటారనీ వారి కట్టు, బొట్టు, భాష, యాస, ఆచారాలు వేరని... మనం నాగరికులం అయినంత మాత్రాన వారిని చిన్నచూపు చూడకూడదని. వారెంతో మంచివారని, అడవులు వారి ఆధారం అని వాటిని నరికి లాక్కుని వారికి హాని కలిగించడం తప్పు అని నేర్పాలి. ‘అస్మదీయులు’ అంటే ఫ్రెండ్స్ అనీ, ఆదివాసీలకు మనం అస్మదీయులుగా ఉండాలని చె΄్పాలి. 7. దుష్ట చతుష్టయం పిల్లలకు చెప్పాలి: దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు... వీరు నలుగురిని దుష్ట చతుష్టయం అంటారని చతుష్టయం అంటే నాలుగు అని చెప్పాలి. చెడు ఆలోచనలు చేసేవారితో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవాళ్లం అవుతామని చెడ్డపనులు చేయడం వల్ల ప్రమాదంలో పడతామని హెచ్చరించాలి. 8. గింబళి, గిల్పం కావాలని డిమాండ్ పిల్లలకు చెప్పాలి: స్నేహితులైనా, బంధువులైనా న్యాయమైన సాయం, కోరిక కోరితే నెరవేర్చాలని, అదే మన మంచితనం సాకుగా తీసుకుని గొంతెమ్మ కోరికలు కోరితే వారికి బుద్ధి చె΄్పాలని నేర్పాలి. ‘కంబళి’, ‘తల్పం’ కాదని ‘గింబళి’, ‘గిల్పం’ కోరిన శర్మ, శాస్త్రులకు చిన్నమయ్య బుద్ధి చెప్పే దృశ్యాలు పిల్లలకు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి. 9. శాకంబరీదేవి ప్రసాదం– వివాహ భోజనంబు పిల్లలకు చెప్పాలి: తెలుగువారి భోజనానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ప్రతి ప్రాంతానికీ సమూహాలకు వారివైన ఆహార అలవాట్లు ఉంటాయని, వాటిని గౌరవించాలని మన ఆహారపు అలవాట్లను పాటించాలని నేర్పించాలి. గోంగూరను శాకంబరీ దేవి ప్రసాదం అంటారని తెలుగువారికి గోంగూర ఇష్టమని చెప్పాలి. భక్ష్యాలు, చిత్రాన్నాలు, పానీయాలు, కూరగాయలు అంటే ఏమిటో వాటి తేడాలేమిటో చెప్తే సరదా పడతారు. 10. చినమాయను పెనుమాయ పిల్లలకు చెప్పాలి: ఏ పనైనా నిజాయితీగా చేస్తే ఫలితం ఉంటుందని.. మాయతో కపటంతో శశిరేఖను లక్ష్మణ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని కౌరవులు భావిస్తే శ్రీకృష్ణుడు, ఘటోత్కచుడు పెనుమాయతో ఆ పెళ్లిని పెటాకులు చేశారని... తగిన శాస్తి జరిగిందని... చెడ్డవాళ్లు ఎప్పటికీ ఓడిపోతారని, మంచితనంతో ఉంటేనే గెలుస్తామని బోధించాలి.(చదవండి: అందరికీ కావాల్సిన పోషకాలు ఇవే..! వయసుల వారీగా డైట్ ఎలా ఉండాలంటే..?)

శరీరానికి కావాల్సిన పోషకాలు ఇవే..! వయసుల వారీగా డైట్ ఎలా ఉండాలంటే..?
రోజూ ఉదయం నుంచి వంటింట్లో చెమటలు కక్కుతూ వంటకాలతో కుస్తీ పడుతుంటుంది అమ్మ. ‘నీరసంగా ఉంటోంది.. ఏ పనీ చేయాలనిపించడం లేదు’ అని అంటూనే లేని ఓపికను తెచ్చుకొని పనులు చేస్తూనే ఉంటుంది. ‘కాళ్ల నొప్పులు.. కదలనివ్వడం లేదు’ అంటూ కూర్చున్న చోటు నుంచి లేవలేకపోతుంటుంది బామ్మ. కాలేజీ నుంచి వస్తూనే ‘బ్యాగ్ కూడా మోయలేను.. అలసటగా ఉంది’ అంటూ సోఫాలో కూలబడిపోతుంది కూతురు. రోజూ మూడుపూటలా తింటూనే ఉన్నాం, అయినా ఎందుకిలా?! ఏ ఆరోగ్య సమస్యనో అని వైద్యులను కలిస్తే పోషకాహారం తీసుకోండి’ అని చెబుతుంటారు. మన శరీరానికి ఏయే పోషకాలు అవసరం, సీజన్‌కి తగినట్టు మన ఆహారపు అలవాట్లను ఎలా మార్చుకోవాలి. సింపుల్‌గా హెల్తీ వంటకాలను ఎలా తయారు చేసుకోవచ్చు... ఈ వివరాలతో వరుస కథనాలుమహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించి సమతులాహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పెరిగాయి. కానీ, మన రొటీన్ ఫుడ్ మాత్రం అలాగే ఉంటోంది. హార్మోన్ల సమతుల్యతకు, శక్తికి తినే ఆహారం చాలా ముఖ్యమైనది. సాధారణంగా మహిళలు తీసుకునే ఆహారంలో ఉండాల్సినవి ఐరన్, కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు. శక్తికి ఇనుము... రక్తంలో ఐరన్ శాతం తగ్గితే బలహీనం అవుతారు. త్వరగా అలసిపోతారు. రక్తస్రావం అధికం అవుతుంది. తలనొప్పి, జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బచ్చలి, పాలకూర, తోటకూర. గోంగూర వంటి ఆకుకూరలు, బీట్రూట్, చిక్కుళ్ళు, శెనగ, మటన్, పెసలు, నట్స్, ఎండు ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, తృణధాన్యాలు, గుడ్డు.. వంటివి శరీరంలో ఐరన్ శాతం పెరగడానికి సహాయపడతాయి. ఒక వ్యక్తి రోజువారీగా అవసరమైన ఐరన్ మోతాదు వారి వయసు, జెండర్‌పై ఆధారపడి ఉంటుంది. గర్భిణులు, బాలికలకు రోజూ 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం. దీంతో పాటు విటమిన్ – సి ఉండే నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు, రసాలు తీసుకోవడం వల్ల ఒంట్లో ఇనుము శోషణ పెరుగుతుంది.పాల ఉత్పత్తులతో కాల్షియం... ఎముకల బలానికి,,, ప్రత్యేకంగా మెనోపాజ్ దశలో కాల్షియం అవసరం అధికం. అందుకు పాల ఉత్పత్తులు, బాదం, శనగలు, కాలీఫ్లవర్ .. వంటివి తినాలి. ∙గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ అవసరం ఎక్కువ. ఆకుకూరలు, మాంసం, దాల్చిన చెక్క.. వంటి వాటి నుంచి ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది ఒమేగా–3 ఫ్యాటి యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి, హార్మోన్ల సమతుల్యతకు ఉపయోగ పడతాయి. ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, చేపల నుంచి ఈ ప్యాటీ యాసిడ్స్ లభిస్తాయి శరీర బలానికి, కండరాల పెంపుకు ప్రోటీన్లు చాలా అవసరం. మినపపప్పు, చికెన్, గుడ్లు, నట్స్... నుంచి ప్రోటీన్లు లభిస్తాయి జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి ఫైబర్ చాలా అవసరం. గోధుమ, మొక్కజొన్న, పండ్లు, కూరగాయల నుంచి లభిస్తుంది.వయసుల వారీగా డైట్ చక్రటీనేజ్, యవ్వనం, గర్భధారణ, పిల్లలకు పాలు ఇవ్వడం, మోనోపాజ్, వయసు పైబడటం.. వంటి దశల ఆధారంగా పోషక అవసరాలు మారుతుంటాయి. కానీ, మన ఇళ్లలో సాధారణంగా అందరికీ ఒకేతరహా వంటను వండుతుంటాం. దీనివల్ల వయసుల వారీగా సరైన పోషకాలు శరీరానికి అందక, శక్తి సన్నగిల్లుతుంది. దీంతో చురుకుదనం తగ్గుతుంది. ఫలితం చేసే పనులపై ప్రభావం చూపుతుంది. అందుకని పోషకాహార చక్రం ఎవరికి వారు, వయసుల వారీగా ఆరోగ్యదాయకంగా మార్చుకోవడం ఈ రోజుల్లో తప్పనిసరి. బాల్యం నుంచియవ్వనం (8–18 ఏళ్లు) వరకు శరీరం వృద్ధి చెందడానికి, హార్మోన్ల సమతుల్యతకు, ఎముకల బలానికి ... పాల ఉత్పత్తులు, బాదం, ఆకుకూరలు, గుడ్లు, పప్పులు, మటన్, చికెన్, బచ్చలి, బ్రొకోలి, బీట్రూట్.. మొదలైన ఐరన్ నిచ్చే పదార్థాలు ఈ వయసుకు కీలకం. బ్రేక్‌ఫాస్ట్: ఉప్మా/΄పొంగల్/ ఇడ్లీ.. + ఒక గుడ్డు + గ్లాస్పాలుమధ్యాహ్న భోజనం: బ్రౌన్ రైస్/ రోటీ (2)+ పప్పు, ఆకుకూర, బీన్స్, పెరుగుసాయంత్రం స్నాక్స్: బాదం/జీడిపప్పు/ఇతర డ్రై ఫ్రూట్స్‌తో చేసిన స్నాక్స్ (చిన్న మోతాదులో)+ అరటి పండురాత్రి భోజనం: రోటీ (2) లేదా మినప పిండితో చేసిన అట్టు +ఏదైనా కూరగాయ + నిమ్మరసం కలిపిన వెజ్ సలాడ్యువతులకు (19–30 ఏళ్లు)రుతుక్రమం చురుకుగా ఉండటం, సంతానోత్పత్తి ప్లానింగ్‌కి సరైన సమయం. ఈ దశలో... ఐరన్ – ఫోలేట్ సమృద్ధిగా లభించే ఆకుకూరలు, అరటి మొదలైనవి తినాలి. ఒమేగా–3 యాసిడ్స్ ఉండే ఫ్లాక్స్ సీడ్స్, చేపలు, వాల్‌నట్స్‌ను కూడా చేర్చుకోవాలి.. పీచుపదార్థాలు ఉండే గోధుమ, కూరగాయలు, జామ వంటి పండ్లు తినాలి. కాల్షియం కోసం పాలు, పెరుగు, టోఫు వంటివి తీసుకోవాలి. జింక్ సమృద్ధిగా లభించే చిక్కుళ్లు లాంటివి.. ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.గర్భధారణ సమయంలో...పిండం అభివృద్ధికి, తల్లి శక్తికి తీసుకోవాల్సినవి... డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ + ఆకుకూరలు, నువ్వులు, దాల్చిన చెక్క, ప్రోటీన్ల కోసం గుడ్లు, పప్పులు, చికెన్, కాల్షియం – విటమిన్–ఇ కోసం పాల ఉత్పత్తులు, ఫైబర్‌కి పండ్లు, బ్రౌన్ రైస్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌కి చేపలు, ఫ్లాక్స్ సీడ్స్.. వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.బ్రేక్‌ఫాస్ట్: గోధుమ రవ్వ/ ఓట్స్ ఉ΄్మా+ అరటి పండు + గ్లాసుడు పాలులంచ్: బ్రౌన్ రైస్ /రోటీ (2) / మెంతికూర పప్పు/ పెసరపప్పు+ బెండకాయ కూర, పెరుగు + కారట్/కీరా సలాడ్సాయంత్రం స్నాక్స్: బాదం/వాల్నట్ (4–5) +అరటిపండు / సపోటాడిన్నర్: రొట్టెలు (2) / మినప దోస, బీన్స్ / సొరకాయ కూర + గ్లాస్ మజ్జిగ.పాలిచ్చేతల్లులుతగినంత శక్తిని తిరిగి పొందడానికి, పాల వృద్ధికి తీసుకోవాల్సినవి.. ఆకుకూరలు, బ్రోకలీ, కాలీఫ్లవర్, పండ్లు, లేత మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు, బీన్స్ తల్లులకు ప్రోటీన్ అందిస్తాయి. పాల ఉత్పత్తులు, నువ్వులు, ఆహారం జీర్ణం అవడానికి పల్చని మజ్జిగ మొదలైనవి తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్: పెసరట్లు, అల్లం పచ్చడి+గ్లాసుడు పాలు/రాగి జావలంచ్: బ్రౌన్ రైస్+ మటన్/ చికెన్‌కర్రీ, మెంతికూర పప్పు, పెరుగు, గోంగూర పచ్చడి. సాయంత్రం స్నాక్స్: జీరా రసం + బాదం/మెంతి లడ్డు, ఏదైనా ఒక పండు. డిన్నర్: రోటీ (2)/మినప రొట్టె, పల్లీలు, బచ్చలి కూర రాత్రి పడుకునే ముందు (ఒంటిగంట లోపల) గ్లాస్ నీళ్లు లేదా చిటికెడు పసుపు కలిపిన గోరువెచ్చనిపాలు. బాగా ఆకలిగా అనిపిస్తే అర టేబుల్ స్పూన్ గుమ్మడికాయ గింజలు. మెనోపాజ్ దశ 45 ఏళ్లు పైబడిన మహిళలు ప్లాన్ చేసుకోదగిన పోషకాహారంలో హార్మోన్ల సమతుల్యత, ఎముకల బలం, కోలెస్ట్రాల్ నియంత్రణ పై దృష్టి పెట్టాలి. కాల్షియం – విటమిన్–ఇ కోసం పాల ఉత్పత్తులు, సోయా, టోఫు వంటివి తీసుకోవాలి. చేపలు, ఫ్లాక్స్ సీడ్స్, పీచుపదార్థాలు ఉండే కూరగాయలు, పండ్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే బెర్రీస్, నాటు, తాటి బెల్లం, గ్రీన్ టీలను చేర్చుకొని చక్కెర, ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి... బ్రేక్‌ఫాస్ట్: (ఉదయం 8:00 – 9:00): ఓట్స్ + పాలు + కొద్దిగా వాల్నట్ లేదా బాదం (లేదా) రాగి దోస + పెసరపప్పు చట్నీ, ఒక అరటి పండు + గ్లాస్ నీరు. మధ్యాహ్న భోజనం (లంచ్ – 1:00): బ్రౌన్ రైస్ లేదా గోధుమ/జొన్న/సజ్జ రొట్టెలు, ఆకుకూరల పప్పు (గోంగూర, తోటకూర వంటివి), దుంపలు కాకుండా దోండకాయ/బీన్స్/బెండకాయ, సలాడ్ (కీరా, గాజర్), పెరుగు. సాయంత్రం స్నాక్స్ (5:30 – 6:00): గ్రీన్ టీ లేదా తులసి టీ (షుగర్ లేకుండా) నట్స్ (బాదం, నువ్వులు లేదా ఫ్లాక్స్సీడ్స్) (లేదా) ఆపిల్ / పియర్ / సపోటా రాత్రి భోజనం (డిన్నర్ – 7:30 – 8:00): గోధుమ రొట్టె (1–2). వెజిటబుల్ సూప్ లేదా తేలికగా జీర్ణం అయ్యే కూర (బెండకాయ, సొరకాయ వంటివి), మజ్జిగ (ఉప్పు తక్కువతో) తీసుకోవాలి.సమతుల్యత అవసరంఓవర్ ఈటింగ్/ తక్కువ తినడం రెండూ సమస్యలు తెచ్చిపెట్టేవే. వ్యక్తి శరీర బరువు, శ్రమను బట్టి డైట్ ΄్లాన్ చేసుకోవడం ఈ రోజుల్లో తప్పనిసరి. ప్రతి వ్యక్తికి వారి శరీర బరువు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా డైట్ చార్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఉదాహారణ: 50 ఏళ్ల మహిళ డైట్ చార్ట్. ∙సమతుల్యత, ఎముకల ఆరోగ్యం, శక్తి ఉండేటట్లు డైట్ ప్లాన్ చేయాలి. ప్రత్యేక సూచనలు: రోజూ కనీసం 7,000 – 8,000 అడుగులు నడవాలి / యోగా / లైట్ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. ఉప్పు, స్వీట్స్ తక్కువగా వాడాలి. మెనోపాజ్ దశ కాబట్టి కాల్షియం, విటమిన్–ఇ విషయంలోప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాల ఉత్పత్తులు తప్పనిసరి. 15 నిమిషాలు శరీరానికి సూర్యరశ్మి నేరుగా తాకేలా చూసుకోవాలి. – డా.బి. జానకి, పోషకాహార నిపుణులు (చదవండి: 'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'..! కన్నీళ్లు పెట్టుకున్న యూకే వ్యక్తి..)

May Day శ్రమైక జీవనం
కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలు, దౌర్జన్యాలు... ఒంటి చేత్తో తోసిరాజని....పనిలో తమను తాము నిరూపించుకున్నారు మహిళా కార్మికులు.కార్మికలోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణగా నవీన శక్తిలా ముందుకు వచ్చారు మహిళా కార్మికులు.శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిబింబం అయ్యారు.‘ఈ రంగంలో మహిళలు పనిచేయలేరు’ అనుకునే రంగాలలోకి వచ్చి అ΄ోహలను బద్దలు కొట్టారు.‘పురుషులకు ఎక్కడా తీసిపోము’ అని నిరూపించారు. నిరూపిస్తూనే ఉన్నారు. అయితే... ఇది నాణేనికి ఒక కోణం మాత్రమే. మరో కోణంలో చూస్తే మహిళా ఉద్యోగులు, కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.కోల్‌కత్తాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య మన దేశంలో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించిన చర్చను ముందుకు తెచ్చింది. వివిధ సర్వేల ప్రకారం మూడింట ఒకవంతు మంది మహిళలు పనిప్రాంతంలో ఏదో ఒక రకమైన శారీరక హింసను ఎదుర్కొంటున్నారు.మహిళా సిబ్బందికి వారి పనిప్రాంతంలో ప్రమాదాలు పెరిగాయి. చాలాప్రాంతాల్లో సీసీటీవీ నిఘా లేదు. సరైన నిఘా, రిపోర్టింగ్ యంత్రాంగం లేక΄ోవడంతో అనుచిత ప్రవర్తన, వేధింపులు పెరిగాయి.ప్రాంథమిక భద్రతా చర్యల గురించి చాలా సంస్థలలో మహిళా ఉద్యోగులకు అవగాహన కలిగించడం లేదు.గార్మెంట్ ఫ్యాక్టరీలలో ఎక్కువమంది కార్మికులు మహిళలే. అయితే పురుషులతో ΄ోల్చితే వారికి తక్కువ వేతనం ఇస్తున్నారు. వేతన అసమానతలతో పాటు పనిప్రాంతంలో ప్రమాదాలు, పురుషాధిపత్య వేధింపులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలలో మహిళాకార్మికులకు మౌలిక సదుపాయాల కొరత ఉంది.‘బిజినెస్ అండ్ హ్యూమన్ రైట్స్’ రిపోర్ట్ మన దేశంలో గార్మెంట్ ఫ్యాక్టరీలలో మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చింది. నిజానికి ‘ఇది కేవలం గార్మెంట్ పరిశ్రమలకు సంబంధించిన రిపోర్ట్ మాత్రమే’ అనుకోనక్కర్లేదు. చిన్నా, పెద్ద తేడాలతో ఎన్నో పరిశ్రమలలో వేరు వేరు రూపాల్లో ఇదే పరిస్థితి ఉంది.కోవిడ్ మహమ్మారి ఉమెన్ హెల్త్ వర్కర్లకు ప్రమాదాలు తెచ్చింది. విధి నిర్వహణలో చనిపోయిన వారు కూడా ఉన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు.చదవండి: ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్నిరాశ పడే పరిస్థితులు రావచ్చు, భద్రతాపరమైన సమస్యలు ఉండవచ్చు....ఒకటి, రెండు అని కాదు....సవాలక్ష సమస్యలు ఎదురైనా మహిళా శ్రామిక శక్తి వెనక్కి తగ్గడం లేదు.ఎందుకంటే వారు...చరిత్ర వింటూ వచ్చారు. మరో చరిత్ర నిర్మించాలనుకుంటున్నారు. ఇదీ చదవండి: Red rice పేరుకు తగ్గట్టే వారికి వారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!

'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'..! కన్నీళ్లు పెట్టుకున్న యూకే వ్యక్తి..
మన చిన్నతనంలోని విషయాలు ఎవ్వరికైనా మధురమైన జ్ఞాపకాలే. అవి అంత తేలిగ్గా మర్చిపోం. ఒక్కసారి మన పాత స్కూల్, లేదా చిన్ననాటి స్నేహితుడిని చూస్తే..వెంటనే తన్మయత్వానికి గురవ్వుతాం. నాటి రోజులన్నీ కనుల ముంగిట మెదిలాడుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్లిపోతే ఎంత బాగుండునో అనిపిస్తుంది. ఎవ్వరికైనా అంతే..!. అలాంటి సంతోషంతోనే తడిసి ముద్దవుతున్నాడు ఈ యూకే వ్యక్తి.యూకే(UK)కి చెందిన కంటెంట్ క్రియేటర్ రాల్ఫ్ లెంగ్ భారతదేశంలోని తన చిన్ననాటి ఇంటిని సందర్శించి అలాంటి అనుభూతే పొందాడు. ఇటీవలే ఆ ఇంటిని సందర్శించాడు. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.."నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను" అనే క్యాప్షన్‌ని కూడా జోడించాడు. అంతే ఒక్కసారిగా ఆ వీడియో భారతీయ నెటిజన్లందర్నీ కదలించింది. ఆ వీడియోలో రాల్ఫ్ 16 ఏళ్ల తర్వాత తన బాల్యం(Childhood ) గడిచిన ఇంటిని చూసినప్పడు తనకు ఎలా అనిపించిందో పంచుకున్నాడు. ఇది చూడటాని ఓ పిచ్చిలా అనిపించినా..అవన్నీ చూస్తే నాటి మధుర జ్ఞాపకాలే కళ్లముందు కదలాడుతున్నాయి అంటూ కన్నీళ్లుపెట్టుకున్నాడు. తాను చిన్నప్పుడు ఏనుగుతో ఆడుకుంటున్న దృశ్యంతో సహా అన్ని వరుసగా గుర్తుకొస్తున్నాయి..అంటూ భావ్వోద్వేగానికి గురయ్యాడు. ఆ వీడియోలో తన మధుర స్మృతులకు నిలయమైన ఆ ఇంటికి చేరుకోగానే..ఆ ఇంటి తలుపు తట్టి యజామని పర్మిషన్ తీసుకుని మరీ ఆ ఇల్లంతా కలియతిరిగాడు. అంతేగాదు తన కుటుంబంతో సహా భారతదేశం వదిలి యూకే వెళ్తున్నప్పుడు తనకిష్టమైనవి అన్నింటిని ఎలా వదిలేయాల్సి వచ్చిందో కూడా వివరించాడు ఆ వీడియోలో. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి ఏకంగా రెండు మిలియన్లకు పైగా వ్యూస్, రెండు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు భారతదేశం మీ బాల్యాన్ని చిరస్మరణీయంగా మార్చడమే గాక మీతో మాకు చాలా అనుబంధం ఉందని తెలుస్తోంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ralph Leng (Blue) 💙🇬🇧 (@ralphleng) (చదవండి: ఇంటి వాతావరణాన్ని తలపించేలా కారు లోపల సెటప్..! మెచ్చుకోకుండా ఉండలేరు)
ఫొటోలు


వేవ్స్ సమ్మిట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నాగచైతన్య- శోభిత దూళిపాల (ఫోటోలు)


రామ్ చరణ్ మదర్ ఆవకాయ పచ్చడి.. మరో స్పెషల్ అంటూ మెగా కోడలు ఉపాసన పోస్ట్ (ఫోటోలు)


రెట్రో లుక్‌లో పూజా హెగ్డే.. సింప్లీ సూపర్ (ఫోటోలు)


కృతీ శెట్టిని ఇలా చూస్తే అభిమానులు ఫుల్ ఖుషీ (ఫోటోలు)


CSK vs PBKS : చహల్ హ్యాట్రిక్, చెన్నై ఖేల్ ఖతం (ఫోటోలు)


బాబే అన్నింటికీ దోషి.. సింహాచలం బాధిత కుటుంబానికి వైఎస్ జగన పరామర్శ (ఫొటోలు)


అక్షయ తృతీయ: మీకంతా శుభాలే.. నటి (ఫొటోలు)


శ్రేయాంకతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ (ఫొటోలు)


సింహాచలం దుర్ఘటన.. ఎటు చూసినా ఆర్తనాదాలే


హ్యాపీ బర్త్‌డే హిట్‌మ్యాన్... రోహిత్ శర్మ అరుదైన ఫొటోలు
అంతర్జాతీయం

లిబరల్ పార్టీ విజయం
టొరంటో: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి మార్క్ కార్నీ సారథ్యంలోని అధికార లిబరల్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. జస్టిన్ ట్రూడో హయాంలో ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆక్రమణ హెచ్చరికలు, ఆ దేశంతో వాణిజ్య యుద్ధం వంటివి కలిసొచ్చాయి. దీనికి తోడు ఆర్థిక నిపుణుడిగా పేరున్న కార్నీ అమెరికాకు వ్యతిరేకంగా కెనడా ప్రజలను ఏకం చేయడంలో విజయం సాధించారు. అధికార పార్టీ అనుకూల పవనాలను ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ గట్టిగా ఎదుర్కొనలేక రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ట్రంప్ మాదిరిగా కెనడా ఫస్ట్ అంటూ ఆ పార్టీ నేత పియెర్రె తీసుకువచ్చిన నినాదాన్ని జనం నమ్మలేదు. మొన్నమొన్నటిదాకా ప్రజాదరణలో ముందుండి, కెనడా తదుపరి ప్రధాని, ఫైర్‌బ్రాండ్ అంటూ ప్రచారం జరిగిన పియెర్రె స్వయంగా ఒట్టావా నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. పార్లమెంట్‌లోని మొత్తం 343 స్థానాలకు గాను కన్జర్వేటివ్‌ల కంటే లిబరల్స్‌కే అత్యధికంగా దక్కుతాయనే అంచనాలున్నాయి. ఫలితాలు వెలువడే సమయానికి లిబరల్ పార్టీకి చెందిన అభ్యర్థులు 168 సీట్లలో గెలుపు/ఆధిక్యం సాధించారు. మెజారిటీ మార్కు 172కు మరో నాలుగు సీట్ల దూరంలో ఆ పార్టీ నిలిచింది. ఒకవేళ 168 సీట్లకే పరిమితమైన పక్షంలో అధికారంలో కొనసాగాలన్నా, చట్టాలు చేయాలన్నా ఏదో ఒక చిన్న పార్టీని కలుపుకుని వెళ్లాల్సి ఉంటుంది. కెనడా ఆక్రమణ ట్రంప్ తరంకాదు: మార్క్ కార్నీ లిబరల్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ప్రధాని మార్క్ కార్నీ విజయోత్సవ ప్రసంగం చేశారు అమెరికా నుంచి ముప్పు ఎదురవుతున్న తరుణంలో కెనడా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కెనడా–అమెరికాలు పరస్పరం సహకరించుకుంటూ ప్రయోజనం పొందే విధానం రెండో ప్రపంచ యుద్ధం నుంచి అమలవుతోందని గుర్తుచేశారు. అది ఇటీవలే ముగిసిందని అన్నారు. అమెరికా తమను దగా చేసిందని మండిపడ్డారు.అమెరికా తీరుపట్ల దిగ్భ్రాంతికి గురైనప్పటికీ ఆ పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. కొన్ని నెలలుగా హెచ్చరికలు వస్తున్నాయని, మన భూమి, మన వనరులు, మన నీరు, మన దేశాన్ని ఆక్రమించుకుంటామని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కెనడాను విచి్ఛన్నం చేసి, సొంతం చేసుకోవాలన్నదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నాగమని ధ్వజమెత్తారు. అది ఎప్పటికీ సాధ్యం కాదన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. అయితే, ప్రపంచం మారుతోందన్న నిజాన్ని మనం గుర్తించాలని కెనడా పౌరులకు మార్క్ కార్నీ సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించడంతో ఆయన మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కెనడాతో బంధం బలోపేతం చేసుకుంటాం: మోదీ కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మార్క్ కార్నీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అభినందనలు తెలియజేశారు. కెనడాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. రెండు దేశాల పౌరులకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలనలకు ఇరుదేశాలూ కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. సత్తా చాటిన భారత సంతతి అభ్యర్థులుకెనడా ఎన్నికల్లో పలువురు భారత సంతతి అభ్యర్థులు సత్తా చాటారు. లిబరల్, కన్జర్వేటివ్ పార్టీల నుంచి రికార్డు స్థాయిలో 22 మంది అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం కెనడా పార్లమెంట్ దిగువ సభలో 17 మంది భారత సంతతి ఎంపీలున్నారు. ఈ సంఖ్య 22కు చేరుకుంది. పంజాబ్ నుంచి వలసవెళ్లిన కుటుంబంలో జన్మించిన సుఖ్ దలీవాల్(లిబరల్) ఆరోసారి నెగ్గడం విశేషం. బర్నాబై సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేసిన న్యూ డెమొక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) నేత జగ్మీత్‌సింత్(46) పరాజయం పాలయ్యారు. 18.1 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ లిబరల్ పార్టీ అభ్యర్థి వేడ్ చాంగ్ గెలిచారు. కెనడా జనాభాలో 3 శాతానికిపైగా భారత సంతతి ప్రజలు ఉన్నారు.

చైనా రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం.. 22 మంది మృతి
చైనాలోని లియావోయాంగ్ నగరంలోని ఓ రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. రెండు, మూడు అంతస్తుల భవనాల నుంచి భారీగా మంటలు చెలరేగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మంటలను అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ నెలలో చైనాలో జరిగిన రెండో అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇది.ఏప్రిల్ 9న ఓ నర్సింగ్ హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. చెంగ్డే నగరంలోని లాంగ్హువా కౌంటీలో రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం 20 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు చెలరేగిన సమయంలో ఈ హోమ్‌లో మొత్తం 260 మంది వృద్ధులు ఉన్నారు.#BREAKING 🚨First images from the restaurant fire 🔥22 people dead and 3 injured after a #fire broke out at a restaurant near a resettlement housing complex in Liaoyang, #Liaoning Province. The investigation is ongoing. #China #fire pic.twitter.com/WRelu9T8ov— Nazlı Özdemir (@nazliiozdemr) April 29, 2025

భారత్‌లో పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత
ఢిల్లీ: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ పై పాక్ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఎక్స్ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో పాక్ జర్నలిస్టుల ఎక్స్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టింది.భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడమరోవైపు, భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్థాన్ ఐఎస్ఐ ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు.. భారతీయ సైనిక్ స్కూల్ ఉద్యోగులమంటూ ఐఎస్ఐ ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సరిహద్దు ప్రజలకు కేంద్రం సూచిస్తోంది.కాగా, పహల్గాం దాడి తర్వాత పాక్ రక్షణ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ కోరుకునేది ఎన్నటికీ జరగదు.. విక్టరీ స్పీచ్‌లో మార్క్ కార్నీ
టొరంటో: కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ(Liberal Party of Canada) విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో మార్క్ కార్నీ(Mark Carney) మద్ధతుదారుల్ని ఉద్దేశిస్తూ విజయ ప్రసంగం చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.‘‘కెనడా చరిత్రలో కీలకమైన క్షణం ఇది. అమెరికా(America)తో మన పాత ఏకీకరణ సంబంధం ఇప్పుడు ముగిసింది. ఇకపై అమెరికాను స్థిరమైన మిత్రదేశంగా నమ్మలేం. అమెరికా చేసిన ద్రోహం నుండి మనం తేరుకుంటున్నాం. నెలల తరబడి నుంచి నేను ఈ విషయంలో హెచ్చరిస్తూ వస్తున్నా. అమెరికా మన భూమిని, మన వనరులను, మన నీటిని, మన దేశాన్ని కోరుకుంటోంది. మనల్ని విచ్ఛిన్నం చేసి తద్వారా కెనడాను సొంతం చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. కానీ, అది ఎప్పటికీ జరగదు’’ అని కార్నీ అన్నారు.అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యూఎస్‌లో 51వ రాష్ట్రంగా చేరాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కెనడా పార్లమెంట్లో 343 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు 172 మెజారీటీ అవసరం. ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు. అయితే లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి మార్క్ కార్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా ఆర్థిక వేత్త అయిన మార్క్ కార్నీని ఎన్నుకున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన కార్నీ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.ఇదీ చదవండి: ట్రంప్‌తో కయ్యం.. ఎవరీ మార్క్ కార్నీ?
జాతీయం

భారత్-పాకిస్తాన్.. ఎవరి బలమెంత?
సాక్షి, నేషనల్ డెస్క్: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధాన్ని తలపిస్తున్న నేపథ్యంలో వాటి సైనిక పాటవం గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. సైనిక బలాబలాల విషయంలో భారత్ ముందు పాక్ ఏ మాత్రమూ తూగే పరిస్థితి లేదు. పైగా ఆర్థికంగా దాదాపుగా దివాలా తీసిన నేపథ్యంలో యుద్ధ భారాన్ని తట్టుకునే పరిస్థితుల్లో అసలే లేదు. కాకపోతే భారత్ నిర్ణాయక రీతిలో దాడికి దిగితే పరువు ప్రతిష్టల కోసమైనా పాక్ ఏదో రకంగా ప్రతిచర్యలకు దిగక తప్పకపోవచ్చు! ఈ నేపథ్యంలో ఇరుదేశాల సాయుధ పాటవాన్ని ఓసారి చూస్తే..

టిక్.. టిక్... టిక్
న్యూఢిల్లీ: ఓవైపు పాశవిక దాడి పట్ల దేశ ప్రజల ఆక్రోశం. నానాటికీ పెరిగిపోతున్న ఆగ్రహావేశాలు. అంతకంతా బదులు తీర్చుకోవాల్సిందేనంటూ నానాటికీ పెరుగుతున్న డిమాండ్లు. మరోవైపు ఒక్కో రోజూ గడుస్తున్న కొద్దీ భయంతో వణికిపోతున్న దాయాది. కసితో రగిలిపోతున్న భారత్ ఈసారి ఎలాంటి దెబ్బ కొట్టనుందో పాలుపోక బెంబేలు. ఏ క్షణమైనా తమపై యుద్ధానికి దిగడం ఖాయమని పాక్ మంత్రుల ముచ్చెమట వ్యాఖ్యలు. వ్యూహాత్మక మౌనంతో పాక్‌ను చెప్పలేనంతగా భయపెడుతున్న మోదీ సర్కారు పూర్తి యాక్షన్ మోడ్‌లోకి దిగింది. ప్రతీకారం విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ మంగళవారం నిర్ణయం తీసుకోగా బుధవారం మరిన్ని నిర్ణయాత్మక అడుగులు వేసింది. ఆ దిశగా రోజంతా కీలక పరిణామాలు జరిగాయి. ప్రధాని సారథ్యంలో వరుసగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగాయి. జమ్మూ కశ్మీర్లో తాజా పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై ఉదయం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో మంత్రివర్గ సహచరులతో మోదీ సమీక్షించారు. అనంతరం సూపర్ కేబినెట్‌గా పిలిచే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సమావేశమై పలు అంశాలపై లోతుగా చర్చలు జరిపింది. తర్వాత ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కూడా జరిగింది. అనంతరం సాయంత్రం మోదీ సారథ్యంలో పూర్తిస్థాయి కేబినెట్ సమావేశం జరిగింది. ఉగ్రవాదులకు, దాయాదికి మర్చిపోలేని గుణపాఠం నేర్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాల్లో లోతుగా చర్చించడమే గాక పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం బుధవారం రాత్రి ప్రధాని తన అధికార నివాసంలో అతి కీలకమైన ‘సైనిక సమీక్ష’ జరపడం ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ తదితరులతో రాత్రి పొద్దుపోయేదాకా భేటీ కొనసాగింది. ప్రతీకార చర్యల వ్యూహానికి ఈ సందర్భంగా స్పష్టమైన తుదిరూపు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో సర్వ త్రా ఉత్కంఠ తారస్థాయికి చేరింది. మోదీ రష్యా పర్యటన రద్దు మే 8న రష్యా పర్యటనను మోదీ రద్దు చేసుకున్నారు. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు రష్యా ‘విక్టరీ డే’ పరేడ్‌లో మోదీ పాల్గొనాల్సి ఉంది. ప్రధానికి బదులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ వాటిలో పాల్గొంటారని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. పహల్గాం ఉద్రిక్తతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విపక్షాల పూర్తి మద్దతు: రాహుల్ పహల్గాం ముష్కరులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని విపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. వారికి, దాయాదికి గుణపాఠం చెప్పేందుకు కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా విపక్షాల పూర్తి మద్దతుంటుందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో మోదీ స్పష్టంగా, సమర్థంగా వ్యవహరించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.మన గగనతలం మూత పాక్ పౌర, సైనిక విమానాలకు భారత గగనతలాన్ని పూర్తిగా మూసేస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫై చేసింది. ఇది మే 23 దాకా అమల్లో ఉంటుందని పేర్కొంది. దీని ప్రభావం పాక్ విమానయాన సంస్థలపై తీవ్రంగా ఉండనుంది. భారత్‌కు పాక్ ఇప్పటికే తన గగనతలాన్ని మూసేయడం తెలిసిందే.సూపర్ కేబినెట్ భేటీయే కీలకం!ప్రధాని అధికార నివాసంలో బుధవారం ఉదయం తొలుత సీసీఎస్ భేటీ జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ అందులో పాల్గొన్నట్టు సమాచారం. భేటీ ఎజెండా, చర్చల వివరాలు తదితరాలను గోప్యంగా ఉంచారు. పహల్గాం దాడి అనంతరం ఈ వారం రోజుల్లోనే సీసీఎస్ సమావేశమవడం ఇది రెండోసారి కావడం విశేషం. అయితే అనంతరం జరిగిన సీసీపీఏ సమావేశమే బుధవారం నాటి భేటీల్లో అతి కీలకమని భావిస్తున్నారు. ప్రధాని, రక్షణ, హోం, ఆర్థిక, విదేశాంగ, వాణిజ్య, ఉపరితల రవాణా మంత్రులతో కూడిన ఈ కమిటీ అత్యంత కీలకమైన రాజకీయ, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సీసీపీఏ సమావేశమవడం దాదాపు ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి! చివరిసారి 2019లో ఈ కమిటీ భేటీ అయింది. అప్పుడు కూడా పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల పాశవిక ఆత్మాహుతి దాడి నేపథ్యంలోనే కావడం గమనార్హం. ఆ వెంటనే పాక్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్ర స్థావరాలను వైమానిక దాడులతో నేలమట్టం చేయడమే గాక కనీసం 300 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. పహల్గాం దాడికి ప్రతీకారం చేపట్టాల్సిన చర్యలపై సీసీపీఏ కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. వాటి రాజకీయ, ఆర్థిక పర్యవసానాలను మంత్రివర్గ సహచరులతో మోదీ కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తోంది.

మోహన్‌బాబుకు ‘సుప్రీం’ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: సినీనటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2019 ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులో విచారణ నుంచి తనకు మినహాయింపుతోపాటు స్టే ఇవ్వాలని కోరిన మోహన్‌బాబు పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు విచారణకు హాజరుకాకుండా స్టే ఇవ్వాలని మోహన్‌బాబు తరపు సీనియర్ న్యాయవాది నిఖిల్ గోయల్ కోరారు. అంతేగాక మే 2న ఈ కేసులో విచారణకు హాజరుకావాలని తమకు ఇచ్చిన నోటీసుపై స్టే విధించాలని కోరగా... శుక్రవారం విచారణాధికారి ముందు కచ్చితంగా హాజరు కావాలని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఆదేశించింది. అనుమతి లేకుండా ధర్నా చేయడంతో..2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తమ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి–మదనపల్లె జాతీయ రహదారిపై విద్యార్థులతో కలిసి మోహన్‌బాబు కుటుంబం బైఠాయించింది. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ముందస్తు అనుమతి తీసుకోకుండా ధర్నా చేయడంతో.. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద మోహన్‌బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌కుమార్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఏఓ తులసినాయుడు, పీఆర్వో సతీష్ౖపె చంద్రగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో స్టే కోరుతూ మోహన్‌బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దీనిపై బుధవారం వాదనలు జరిగాయి. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.

కులగణనకు ఓకే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్న కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో భాగంగా కులగణనను సైతం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం ‘గణన’అనేది కేంద్ర జాబితాలో 69వ అంశంగా ఉందని, అందువల్ల జనగణన, కులగణన బాధ్యత పూర్తిగా కేంద్రం పరిధిలోనిదని స్పష్టంచేశారు. కొన్ని రాష్ట్రాలు తమకు అధికారాలు లేకపోయినా సర్వేల పేరుతో కులాల లెక్కలను అశాస్త్రీయంగా సేకరించాయని ఆరోపించారు. ఆ సర్వేల వల్ల గందరగోళం ఏర్పడి సమాజంలో చీలికలు రాకూడదన్న ఉద్దేశంతోనే పక్కా శాస్త్రీయంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కులగణనకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమే కులగణనకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమేనని మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆరోపించారు. గతంలో కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ వచ్చాయని తెలిపారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చాయి. స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి నిర్వహించిన ఏ జనాభా గణనలోనూ కులగణనను చేర్చలేదు. 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కులగణన అంశాన్ని కేబినెట్లో పరిశీలిస్తామని లోక్‌సభకు హామీ ఇచ్చారు. ఈ అంశంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేస్తే చాలా రాజకీయ పార్టీలు కులగణనకు అనుకూలంగా అభిప్రాయాలు తెలిపాయి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు బదులుగా సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సెస్ (ఎస్ఈసీసీ) సర్వే నిర్వహించాలని నిర్ణయించింది’అని మండిపడ్డారు. రాజకీయ సాధనంగా వాడుతున్నారు.. కులగణనను ప్రతిపక్ష ఇండియా కూటమి రాజకీయ సాధనంగా వాడుకుంటోందని అశి్వనీవైష్ణవ్ ఆరోపించారు. ‘కొన్ని రాష్ట్రాలు కుల సర్వేలను బాగానే నిర్వహించాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం పారదర్శకత లేకుండా పూర్తిగా రాజకీయ కోణంలో నిర్వహించాయి. ఇటువంటి సర్వేలు సమాజంలో సందేహాలను లేవనెత్తాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దేశంలోని సున్నితమైన సామాజిక నిర్మాణం రాజకీయాల వల్ల చెదిరిపోకుండా కాపాడటానికే సర్వేలకు బదులుగా కులగణనను పారదర్శకంగా నిర్వహించాలని సీసీపీఏ నిర్ణయించింది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ వర్గానికి ఇబ్బంది కలిగించకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది’అని మంత్రి గుర్తుచేశారు. దేశంలో ఏ కులం జనాభా ఎంత ఉందో తెలుసుకునేందుకు కులగణన నిర్వహించాలని కాంగ్రెస్‌సహా పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌చేస్తూ వస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈ అంశం ప్రధాన ప్రచారాస్త్రాల్లో ఒకటిగా నిలిచింది. తమ ఒత్తిడి కారణంగానే కేంద్రం కులగణనకు నిర్ణయం తీసుకుందని, ఇది సంపూర్ణంగా తమ విజయమని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలు పేర్కొన్నాయి. మొదట్లో అన్ని కులాల డేటా.. మనదేశంలో జనాభా లెక్కల సేకరణ బ్రిటీష్ పాలనాకాలంలో 1881లో మొదలైంది. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా ప్రభుత్వం నియమించే ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. ఈ జనగణనలో ప్రజల సంఖ్యతోపాటు వారి ఆర్థిక స్థితి, జనాభా పెరుగుదల రేటు, మహిళలు– పురుషుల సంఖ్య, లింగ నిష్పత్తి, జనన– మరణాల రేటు వంటి సకల వివరాలను రికార్డు చేస్తున్నారు. నిజానికి మొదటి జనగణనతోపాటే.. అంటే 1881లో తొలిసారి నిర్వహించిన జనగణనలో కులగణన కూడా నిర్వహించారు. 1931 వరకు ఈ విధానం కొనసాగింది. ఆ తర్వాత జనగణన నుంచి కులగణనను తప్పించారు. కానీ, ఎస్సీ, ఎస్టీల సంఖ్యను మాత్రం లెక్కిస్తూ వస్తున్నారు. దీంతో ఓబీసీ, ఓసీల జనాభా ఎంత ఉందన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది. దేశంలో చివరి జనగణన 2011లో జరిగింది. 2020లో నిర్వహించాల్సిన జనగణనను కోవిడ్–19 కారణంగా వాయిదా వేశారు. త్వరలోనే జనగణన నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అందులోనే కులగణనను చేర్చాలని తాజాగా నిర్ణయించింది. మనదేశంలో జనగణన సుదీర్ఘ ప్రక్రియ. ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ మొదలు.. పూర్తి డేటాను ప్రకటించటానికి దాదాపు 18 నెలల సమయం పడుతుంది.
ఎన్ఆర్ఐ

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్రైమ్

భూమికపై విచక్షణా రహితంగా దాడి చేసిన భర్త
గుడివాడరూరల్: అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో భర్త విచక్షణా రహితంగా దాడి చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మట్టా అశోక్, భూమికలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న అశోక్ చెడు అలవాట్లకు బానిసై తరచూ అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు. ఇటీవల జరిగిన గొడవతో భార్య భూమిక పిల్లలను తీసుకుని సమీపంలో నివాసముంటున్న తల్లి రాణి ఇంటికి వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం తన బట్టలు తీసుకునేందుకు చెల్లి అనుష్కతో కలిసి భర్త అశోక్ ఇంటికి వెళ్లిన భూమికపై భర్త కత్తితో విచక్షణా రహితంగా మొఖంపై దాడి చేసి పొట్టలో పొడిచాడు. అడ్డుకోబోయిన చెల్లిపై కూడా దాడి చేయడంతో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. అనంతరం అశోక్ పరారయ్యాడు. గాయపడిన వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. భూమిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడ తరలించారు. బాధితురాలి తల్లి రాణి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వి.దీరజ్ వినీల్, స్థానిక పోలీస్ అధికారులతో కలిసి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఇందిరానగర్ కాలనీలోని సంఘటనా స్థలానికి డీఎస్పీ వెళ్లి పరిశీలించారు.

అరెస్ట్ చేసిన బాలుడు ఎక్కడ?
హైదరాబాద్: ఎలాంటి తప్పు చేయని తన కుమారుడిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌కు బుధవారం ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్..పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ మే 5వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏప్రిల్ 28న మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు తన కమారుడు మేకల కళ్యాణ్‌పై ఎలాంటి కేసు నమోదు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ అలివేలు అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసింది. పోలీసులు అక్రమ కస్టడీకి తీసుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చూడగా అక్కడ తన కుమారుడు కనిపించలేదని పిటిషన్లో పేర్కొన్నారు.తర్వాత మూడు గంటల సమయంలో తన కుమారుడి ఫోన్ నుంచి కాల్ రాగా అతన్ని కోర్టులో హాజరు పరుస్తున్నామని చెప్పిన పోలీసులు కోర్టు ఎదుట కూడా హాజరు పర్చకుండా ఎక్కడికి తీసుకెళ్లారో కూడా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో న్యాయవాది అమర్నాథ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తూ తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కమిషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేసుపై విచారణ జరిపించి మే 5వ తేదీలోపు పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది.

థాయ్‌లాండ్‌లో హ్యాండ్లర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు మంగళవారం అరెస్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. హవాలా నెట్వర్క్ మీద దృష్టి పెట్టిన పోలీసులు సహకరించిన వారి కోసం ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీíÙయల్ రిమాండ్‌లో ఉన్న అభిష్ క్, హర్షవర్థన్, ధావల్, రాహుల్‌లను పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఓజీ కుష్ పండించేదీ అతడేనా..? ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్, మారువానా, హైడ్రాపోనిక్ గాంజా, ఓజీ కుష్ ఇలా వివిధ పేర్లతో పిలిచే గంజాయితో పాటు మ్యాజిక్ మష్రూమ్స్‌ను ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ సరఫరా చేస్తున్నాడు. ఈ గంజాయి థాయ్లాండ్లోనే ఎక్కువగా పండుతుంది. జబల్పూర్కు చెందిన హర్షవర్థన్‌కు ఓడల ద్వారా చేరింది కూడా థాయ్‌లాండ్ నుంచే. దీన్నిబట్టి ఈ ఓజీ కుష్‌ను హ్యాండ్లరే పండించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి ఈ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. హైడ్రోఫోనిక్ టెక్నిక్ విధానంలో కృత్రిమ కాంతితో పండిస్తుంటారు. ఆన్లైన్లో విత్తనాలు ఖరీదు చేసి, ఎల్ఈడీ లైట్లను ఉపయోగించి గంజాయి మొక్కలను పెంచుతారు. ఏమాత్రం మట్టితో అవసరం లేకుండా ప్రత్యేకంగా తయారు చేసిన కుండీలు, ట్రేల్లో ఇసుక, కంకర లేదా నీటిలో అదనపు పోషకాలతో ఉపయోగించి సాగు చేస్తుంటారు. కొందరు మాత్రం కొబ్బరి పొట్టు నారలు, గులకరాళ్లు కూడా వాడతారు. నేలమీద పండే గంజాయి కంటే ఈ ఓజీ నాణ్యత ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఈ మొక్కలు ఓపెన్–రూట్ వ్యవస్థ ద్వారా పోషకాలు, ఆక్సిజన్‌ను నేరుగా తీసుకోవడమే దీనికి కారణం. వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యాపారం... ఈ డ్రగ్స్ క్రమవిక్రయాల దందా మొత్తం పక్కా వ్యవస్థీకృతంగా సాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఎన్‌క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఇండియా నుంచి తనకు వచ్చిన ఆర్డర్ల విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ ఆయా యాప్స్ ద్వారానే హర్షవర్థన్‌కు చేరవేస్తాడు. ఇతడు జబల్పూర్లో ఉన్న హవాలా ఏజెంట్‌కు ఆ కస్టమర్ వివరాలు పంపిస్తాడు. అతగాడు సదరు కస్టమర్ నివసించే ప్రాంతానికి చెందిన మరో హవాలా ఏజెంట్‌కు ఇవి అందిస్తాడు. ఆ వినియోగదారుడిని సంప్రదించే ఈ ఏజెంట్ డబ్బు ముట్టిన తర్వాత జబల్పూర్ ఏజెంట్‌కు బదిలీ చేస్తాడు. అతడి ద్వారా విషయం తెలుసుకునే హర్షవర్థన్ విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’కు చెప్తాడు. ఔన్స్ (28.34 గ్రాములు) డ్రగ్‌కు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో అతడికి పంపిస్తాడు. ఆపై డ్రగ్ హ్యాండ్లర్ నుంచి హర్షవర్థన్‌కు వచి్చ... అక్కడ నుంచి డీటీడీసీ, శ్రీ తిరుపతి, శ్రీ ఆంజనేయులు కొరియర్స్‌లో కస్టమర్‌కు చేరుతుంది. హర్షవర్థన్ కూడా పోలీసుల నిఘాకు చిక్కకుండా ఈ పార్శిల్ బుక్ చేస్తున్నాడు. అక్కడ కస్టమర్ చిరునామా, ఫోన్ నెంబర్ తప్పుగా ఇస్తాడు. దాని ట్రాకింగ్ ఐడీని వినియోగదారుడికి పంపిస్తాడు. దీని ద్వారా ట్రాక్ చేసే కస్టమర్ ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరిందని గుర్తించిన వెంటనే అక్కడకు వెళ్లి తీసుకుంటారు. ఈ హవాలా, కొరియర్ నెట్వర్క్ పైనా హెచ్–న్యూ దృష్టి పెట్టింది. ఈ ముఠాలో కీలక పెడ్లర్‌గా ఉన్న హర్షవర్థన్‌కు చెందిన క్రిప్టో వాలెట్లో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన బిట్కాయిన్లు డిపాజిట్ అవుతున్నట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు.

ఫ్రెండ్‌కి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్తూ..
మక్కువ(విజయనగరం): మండలంలోని తూరుమామిడి గ్రామానికి చెందిన నూకమ్మ అలియాస్ ఉమ మంగళవారం తమ ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమానికి తనతోపాటు డిగ్రీ చదువుతున్న ఫ్రెండ్స్‌ను ఆహ్వానించింది. స్నేహితులంతా కలిసి మంగళవారం ఆటపాటల్లో మునిగితేలారు. బుధవారం తన ఫ్రెండ్ షర్మిలకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై మక్కువ వెళ్తుండగా టాక్టర్ రూపంలో మత్యువు నూకమ్మను కబళించింది. అంతవరకు గ్రామంలో అందరితో కలివిడిగా ఉండి, ఫ్రెండ్‌ను మక్కువలో డ్రాప్ చేసి వస్తానని చెప్పి, తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందంటూ గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. తూరుమామిడి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినికురసాన నూకమ్మ అలియాస్ ఉమ(20) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై హెడ్ కానిస్టేబుల్ ఎస్. శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నూకమ్మ తన ఫ్రెండ్ షర్మిలకు సెండాఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి మక్కువకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మార్గమధ్యంలోని శాంతేశ్వరం గ్రామం సమీపంలో ఎదురుగా ట్రాక్టర్ మితిమీరిన వేగంతో వచ్చింది. టాక్టర్ను తప్పించే ప్రయత్నంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడంతో నూకమ్మ తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లగా అక్కడికక్కడే మృతిచెందింది. నూకమ్మ బొబ్బిలిలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. తండ్రి జనార్దనరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సాలూరు ఆస్పత్రికి తరలించారు.
వీడియోలు


కులగణనపై కేంద్రం నిర్ణయానికి YSRCP సంపూర్ణ మద్దతు


కులగణనపై కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: వైఎస్ జగన్


మంచిది కాదు అని చెప్పా.. బలవంతంగా నాతో గోడ కట్టించారు.. కాంట్రాక్టర్ సంచలన నిజాలు..


హిట్ 3 మూవీ రివ్యూ


భాగ్యశ్రీకి బంపర్ ఆఫర్..


జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలన్న పిటిషనర్ తీరుపై సుప్రీం ఆగ్రహం


Watch Live: మీ తెగువకు హ్యాట్సాఫ్.. మీ అందరికీ మాటిస్తున్నా


విషాదం నింపిన.. సింహాచల దైవదర్శనం


సింహాచలం ఘటన చూస్తుంటే అమరావతి ఆగమైనట్టే


ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది: బొత్స సత్యనారాయణ