
దాని వల్ల ప్రయోజనం ఉండదు
పౌరసరఫరాల శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసర వస్తువులను సబ్సిడీపై ఇవ్వడం ముఖ్యం కాదని.. దాని వల్ల ప్రయోజనం ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. ధరలు పెరగకుండా నియంత్రించడమే మేలు అని అన్నారు. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. ‘నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన తర్వాత.. వాటిని తగ్గించే ప్రయత్నం చేయడం, సబ్సిడీలో అందించడం వల్ల ప్రయోజనం ఉండదు.
దాని కంటే 3 శాఖలు నిరంతర పర్యవేక్షణ ద్వారా ధరలు పెరగకుండా ముందే చర్యలు తీసుకోవాలి. ధరల భారం ప్రజలపై పడకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా చర్యలు తీసుకోవాలి. డిమాండ్–సప్లై మధ్య వ్యత్యాసానికి గల కారణాలను విశ్లేíÙంచి తగు చర్యలు చేపట్టాలి. విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ క్రియాశీలకంగా పనిచేయాలి. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఏపీలో పామాయిల్, కూరగాయలు, పప్పుల వంటి ఉత్పత్తులు పెంచేందుకు ప్రణాళిక అమలు చేయాలి. పెద్ద ఎత్తున గిడ్డంగులను అందుబాటులోకి తేస్తే రైతులకు న్యాయం చేయవచ్చు’ అని అన్నారు.