
సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా నెలిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పెద్దకుమారుడి వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. భీమునిపట్నం మండలం దాకమర్రిలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు మణిదీప్- స్నేహలను ఆశీర్వదించారు. జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం జగన్ దీవించారు.
పర్యటనలో సీఎం జగన్ వెంట ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్.. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.