
సాక్షి, అమలాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో పర్యటించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి అమలాపురంలోని పోలీస్ గ్రౌండ్‌కు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి జనుపల్లి గ్రామానికి చేరుకొని.. బహిరంగ సభలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బును ముఖ్యమంత్రి జగన్ జమ చేస్తారు. కార్యక్రమం అనంతరంఅమలాపురానికి వచ్చి.. అక్కడి నుంచి తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.