సైబర్‌ నేరాలతో రూ.88.58 లక్షల కోట్లు దోపిడీ | Global Anti Scams Alliance report revealed: India ranks number 9 in cybercrime | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలతో రూ.88.58 లక్షల కోట్లు దోపిడీ

Published Fri, Feb 14 2025 3:37 AM | Last Updated on Fri, Feb 14 2025 3:37 AM

Global Anti Scams Alliance report revealed: India ranks number 9 in cybercrime

ఆసియా దేశాల్లో కొల్లగొట్టింది రూ.6.88 లక్షల కోట్లు

సైబర్‌ నేరాల బాధిత దేశాల్లో తొమ్మిదో స్థానంలో భారత్‌

గ్లోబల్‌ యాంటీ స్కామ్స్‌ అలయన్స్‌ నివేదిక వెల్లడి

సాక్షి, అమరావతి: సైబర్‌ నేరాలు ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ నేరగాళ్లు ఏకంగా రూ.88.58 లక్షల కోట్లు కొల్లగొట్టడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. గ్లోబల్‌ యాంటీ స్కామ్స్‌ అలయన్స్‌ (గాసా) నివేదిక సైబర్‌ నేరాల బాధితులపై సర్వే చేసింది.

నివేదికలోని ప్రధాన అంశాలు..
ఆసియా దేశాల్లో రూ.6.88 లక్షల కోట్లు కొల్లగొట్టారు. 
ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల మంది సైబర్‌ నేరాల బారినపడ్డారు. 
74శాతం మంది బాధితులు వారి తప్పిదం, అవగాహన రాహిత్యంతోనే సైబర్‌ నేరాల బారిన పడుతున్నారు.
67శాతం మంది బాధితులు తమకు వచ్చిన లింకులు సైబర్‌ నేరాలకు సంబంధించినవని సందేహిస్తూనే క్లిక్‌ చేస్తూ మోసపోతున్నారు.

 70శాతం మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడమే లేదు.
25 శాతం మంది తమ బ్యాంకు అధికారులకు సమాచారం ఇస్తున్నారు.
 సైబర్‌ నేరాల్లో 28శాతం ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్, బ్యాంకు ట్రాన్స్‌ఫర్‌ ద్వారానే సాగుతున్నాయి.

 36శాతం సైబర్‌ నేరాలకు ఈ–వాలెట్‌ విధానాన్ని వాడుకుంటున్నారు. 
 ఫిర్యాదు చేస్తున్న వారిలో కేవలం 4శాతం మంది బాధితులే తాము కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పొందుతున్నారు. 
 కేవలం 0.05శాతం మంది సైబర్‌ నేరస్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

 ఆన్‌లైన్‌ మోసాలను ముందుగా గుర్తించడంలో చైనీయులు మొదటిస్థానంలో ఉండగా భారతీయులు రెండోస్థానంలో ఉన్నారు. 
అత్యధికంగా సైబర్‌ నేరాల బాధిత దేశాల్లో భారత్‌ తొమ్మిదో స్థానంలో ఉంది. 
 అమెరికా, డెన్మార్క్, స్లోవేకియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 
 భారత్‌లోని సైబర్‌ బాధితులు సగటున రూ.35వేలు కోల్పోయారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement