Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Visakha Chandramouli Death In Kashmir Pahalgam1
కశ్మీర్‌ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీవాసులు మృతి

శ్రీనగర్‌/విశాఖపట్నం: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీప బైసరన్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలో విశాఖ వాసి చంద్రమౌళిని ముష్కరులు దారుణంగా హత్య చేసినట్టు తెలిసింది. ఉగ్రవాదులు.. చంద్రమౌళిని వెంటాడి మరీ కాల్చినట్లు సమాచారం.వివరాల ప్రకారం.. పహల్గాంలో మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో విశాఖ వాసి ఉన్నారు. విశాఖ వాసి చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అతడిని వెంటాడి మరీ కాల్చినట్లు సమాచారం. చంపొద్దని వేడుకున్నా.. మోదీకి చెప్పుకోవాలంటూ విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. ఇక, చంద్రమౌళి.. రిటైర్డ్‌ బ్యాంక్‌ ఉద్యోగి అని తెలిసింది. చంద్రమౌళి బంధువు DSP నాగేశ్వర్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. ఈ నెల 18న చంద్రమౌళి కశ్మీర్‌కు బయలుదేరి వెళ్లారు.⁠ ఆరుగురు కలిసి విహారయాత్రకి వెళ్లారు. ఇలాంటి దుర్ఘటన చాలా బాధాకరం. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మధ్య గ్రాండ్‌గా చంద్రమౌళి పుట్టినరోజు వేడుకలు జరిపాం. ఇప్పటికీ మా వదినకి ఆయన చనిపోయిన విషయం తెలియదు. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన చంద్రమౌళి సమీప బంధువు కుమార్ రాజా తాజాగా మాట్లాడుతూ..‘ఈనెల 16న ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కశ్మీర్‌ టూర్‌కి వెళ్లారు. మొత్తం ఆరుగురు వెళ్లారు. ఈనెల 25 నాటికి తిరిగి రావాల్సి ఉంది. చంద్రమౌళి ఫ్యామిలీతో పాటు అప్పన్న, శశిధర్ ఫామిలీలు వెళ్లాయి. చంద్రమౌళి తప్పించుకునే ప్రయత్నం చేశారు.. కానీ, ముష్కరులు హతమార్చారు. మిగిలిన ఐదుగురు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. మృతదేహం ఇవాళ రాత్రి విశాఖకు తరలిస్తారు. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికా ఉన్నారు. వారిద్దరూ రేపు.. విశాఖకు చేరుకుంటారు. ఎల్లుండి అంత్యక్రియలు జరుగుతాయి. నెల్లూరు వాసి మృతి..కశ్మీర్‌లోని పహాల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు మృతిచెందాడు. నిన్న జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్‌ని కాల్చి చంపిన ఉగ్రవాదులు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న మధుసూదన్‌. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఈ విషాదకర ఘటన నెలకొంది. కావలి కుమ్మరి వీధిలో సోమిశెట్టి తిరుపాలు పద్మ దంపతుల కుమారుడుగా గుర్తింపు. మృతుడు మధుసూదనన్‌కు భార్య ఇద్దరు పిల్లలు. నేడు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని చెన్నైకి తరలింపు.. సాయంత్రానికి కావలికి చేరుకోనున్న మధుసూదన్ మృతదేహాం. అతడి తల్లిదండ్రులు హార్ట్ పేషంట్స్ కావడంతో విషయం గోప్యంగా ఉంచిన బంధువులు.

AP SSC Exam Results2
ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థుల్లో 81.14 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. పదో తరగతి ఫలితాలను www.sakshieducation.comతో విద్యార్థులు తెలుసుకోవచ్చు.AP 10th Class Results 2025 Direct Links..Server-1https://results2.sakshieducation.com/Results2025/Andhra-Pradesh/SSC/ap-ssc-10th-class-results-2025.html Server-2https://education.sakshi.com/sites/default/files/exam-result/AP-SSC-10th-Class-Results-2025-Direct-Link.html Server-3http://results1.sakshieducation.com/results/SSC/ap-ssc-10th-class-results-2025.htmlఅలాగే, https:// bse.ap.gov.in, https:// apopenschool.ap.gov.in/లో చూడ­వచ్చు. అలాగే, వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు ‘హాయ్‌’ అని మెసేజ్‌ పంపి, విద్యాసేవల్లో ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను పొందవచ్చు.

Chandrababu TDP Govt and SIT propaganda on Raj Kasireddy alcohol case3
సిట్‌ రిమాండ్‌ నివేదిక సాక్షిగా..బాబు భేతాళ కుట్ర బట్టబయలు

సాక్షి, అమరావతి: చంద్రబాబు భేతాళ కుట్ర బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్‌ నివేదిక సాక్షిగా రెడ్‌బుక్‌ కుతంత్రం బెడిసికొట్టింది. తద్వారా చంద్రబాబు తాను తీసిన గోతిలో తానే పడ్డారు! వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో రాజ్‌ కేసిరెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ నివేదిక ఆ విషయాన్ని బట్టబయలు చేసింది. కానీ ఆయన ఇచ్చినట్లుగా చెబుతున్న వాంగ్మూలంపై సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్‌ వెల్లడించడం అసలు కుట్రను వెల్లడించింది. అంటే రాజ్‌ కసిరెడ్డి చెప్పకుండానే.. తాను అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సిట్‌ అంగీకరించింది. ఇక మద్యం డిస్టిలరీలకు ఆర్డర్లలో వివక్షకు పాల్పడి అవినీతి చేశారని సిట్‌ పేర్కొంది. కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం నాలుగు కంపెనీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని వెల్లడించింది. ఇక టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సి–టెల్‌ సాఫ్ట్‌వేర్‌ను తొలగించడం ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యం ఆర్డర్లు జారీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. మరి సి–టెల్‌ సాఫ్ట్‌వేర్‌ ఉన్నప్పుడు కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు ఎందుకు చేశారనే దానిపై సిట్‌ మౌనం వహించింది. తద్వారా టీడీపీ హయాంలోనే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని అసలు గుట్టు విప్పింది. ఇక నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు చొప్పున రాజ్‌ కేసిరెడ్డి వసూలు చేసి వైఎస్సార్‌ సీపీలోని ముఖ్యులకు ఇచ్చారని ఒకచోట... రాజ్‌ కేసిరెడ్డే ఆ నిధులను దేశంలో వివిధ చోట్ల పెట్టుబడి పెట్టారని మరోచోట పరస్పర విరుద్ధంగా పేర్కొనడం ద్వారా తన దర్యాప్తులో డొల్లతనాన్ని బయటపెట్టింది. తాము బెదిరించి వేధించిన వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌ తదితరులతో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు పేరిట కనికట్టు చేసినట్టు అంగీకరించింది. అంతిమంగా టీడీపీ గత ఐదేళ్లలో చేసిన అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలనే గుదిగుచ్చి దర్యాప్తు నివేదికగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు బరితెగించిందన్నది స్పష్టమైంది. దర్యాప్తు పేరిట తాము సాధించింది శూన్యమని గ్రహించిన సిట్‌ ఏమీ చేయలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరును నివేదికలో ప్రస్తావించడం ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. సిట్‌ నివేదిక సాక్షిగా వెల్లడైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది...డిస్టిలరీలూ బాబు దందానే బట్టబయలు చేసిన సిట్‌ నివేదికవైఎస్సార్‌సీపీ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించారని, వాటికే అత్యధిక మద్యం ఆర్డర్లు ఇచ్చారని సిట్‌ ఆరోపించింది. తద్వారా కొన్ని డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి కమీషన్లు తీసుకున్నారని ఆవాస్తవ అభియోగాలు మోపింది. కానీ స్వామి భక్తి చాటుకునే హడావుడిలో అసలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే వాస్తవాన్ని బయటపెట్టేయడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని సిట్‌ నివేదికలో తెలిపింది. అంటే చంద్రబాబు హయాంలోమద్యం కొనుగోలు ఆర్డర్లలో ఏకంగా 53.21 శాతం కేవలం నాలుగు డిస్టిలరీలకే ఇవ్వడం అంటే అక్రమాలకు పాల్పడినట్టే కదా? తద్వారా మద్యం ఆర్డర్లలో కుంభకోణానికి పాల్పడింది చంద్రబాబు ప్రభుత్వమేనని రూఢీ అయింది. సి–టెల్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని, దాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తొలగించిందని సిట్‌ పేర్కొంది. లోపభూయిష్టమైన ఆ సాఫ్ట్‌వేర్‌ను తొలగించడం ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకున్నట్లే కదా!రాజ్‌ కేసిరెడ్డి వాంగ్మూలం పేరిట కుట్ర..సిట్‌ కుట్రను బయటపెట్టిన రిమాండ్‌ నివేదిక వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగినట్టుగా దుష్ప్రచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో కుట్రకు తెగించింది. అందుకోసమే రాజ్‌ కేసిరెడ్డి విచారణ ప్రక్రియను అడ్డంపెట్టుకుని పన్నాగం రచించింది. ఆయన్ను సోమవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సిట్‌ అధికారులు మంగళవారం సాయంత్రం వరకు విచారణ పేరుతో తతంగం నడిపించారు. అనంతరం ఆయన వాంగ్మూలంగా పేర్కొన్నారంటూ ఓ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అందులో మద్యం కుంభకోణం కుట్ర అంటూ కట్టుకథ అల్లారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరును ప్రస్తావించడం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ట. సంక్షేమ పథకాలను అమలు చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేలా... మరోవైపు వైఎస్సార్‌సీపీకి ఫండింగ్‌ వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించమని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనతో చెప్పినట్టుగా రాజ్‌ కేసిరెడ్డి తెలిపారని ఆ నివేదికలో పేర్కొంది. కానీ వాస్తవం ఏమిటంటే... రాజ్‌ కసిరెడ్డి వాంగ్మూలం అంటూ సమర్పించిన నివేదికపై ఆయన సంతకం చేయడానికి పూర్తిగా నిరాకరించారని సిట్‌ నివేదిక వెల్లడించింది. మరి అలాంటప్పుడు ఇక కుంభకోణం ఎక్కడ...? రిమాండ్‌ నివేదికలో పేర్కొన్న అభియోగాలన్నీ కట్టుకథలేనని సిట్‌ స్వయంగా అంగీకరించినట్లైంది. సంతకం చేసేందుకు రాజ్‌ కేసిరెడ్డి నిరాకరించిన విషయాన్ని కూడా ఎందుకు పేర్కొన్నారంటే..న్యాయస్థానంలో హాజరు పరిచేటప్పుడు ‘మీరే చెప్పారా...? సంతకం చేశారా’ అని ఆయన్ను న్యాయమూర్తి ప్రశ్నించే అవకాశం ఉంది. అప్పుడు తమ బండారం బయటపడుతుందని ముందు జాగ్రత్తగా ఆయన సంతకం చేయలేదని వెల్లడించక సిట్‌ అధికారులకు తప్ప లేదు. కుట్రకు అనుకూలంగా సిట్‌ అధికారులు ఓ రిమాండ్‌ నివేదికను సృష్టించి కనికట్టు చేసేందుకు యత్నించారన్నది దీంతో బట్టబయలైంది. ఆ విషయాలను రాజ్‌ కేసిరెడ్డే వెల్లడించి ఉంటే...ఆయన ఆ వాంగ్మూలం కాపీపై సంతకం చేసేందుకు ఎందుకు నిరాకరిస్తారు?.. అంటే రిమాండ్‌ నివేదిక పేరిట సిట్‌ కుట్రకు పాల్పడిందన్నది స్పష్టమైంది. సిట్‌ అధికారులే న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక దీనికి సాక్ష్యం. నాడు టీడీపీ దుష్ప్రచారమే...నేడు సిట్‌ రిమాండ్‌ నివేదికచంద్రబాబు, లోకేశ్, టీడీపీ అధికార ప్రతినిధులు టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన మాటల్నే సిట్‌ తన రిమాండ్‌ నివేదికగా న్యాయస్థానానికి సమర్పించడం విడ్డూరంగా ఉంది. అందులో పేర్కొన్నవన్నీ అసత్య ఆరోపణలేననడానికి ఇవిగో తార్కాణాలు..అబద్ధపు వాంగ్మూలాలే కుట్రకు ప్రాతిపదికసిట్‌ అధికారులు బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలే ప్రాతిపదికగా రిమాండ్‌ నివేదిక రూపొందించినట్టు వెల్లడైంది. వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితోపాటు అప్పటి ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగానికి తెగబడింది. తాము భయభ్రాంతులకు గురిచేసి బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌తో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాలనే ప్రస్తావించింది. డిస్టిలరీల ఏర్పాటు కోసం విజయసాయిరెడ్డి నివాసంలో ఎంపీ మిథున్‌ రెడ్డి, బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి ఐటీ సలహాదారు రాజ్‌ కేసిరెడ్డి తదితరులు సమావేశమై చర్చించినట్టు సిట్‌ పేర్కొంది. కారు కూతలు... కాకి లెక్కలులేని కుంభకోణం ఉన్నట్టు చూపించే కుట్రటీడీపీ కార్యాలయం చెప్పిన కాకి లెక్కలతో సిట్‌ అధికారులు తమ రిమాండ్‌ నివేదికను రూపొందించడం పోలీసు వ్యవస్థ సర్వభ్రష్టత్వాన్ని వెల్లడిస్తోంది. ఏకంగా నెలకు రూ.50కోట్ల నుంచి రూ.60 కోట్ల చొప్పున వసూలు చేసి ఇచ్చారని దుష్ప్రచారానికి తెగబడింది. మళ్లీ అదే నివేదికలో ఆ నిధులను రాజ్‌ కేసిరెడ్డి దేశంలోనే బంగారం, భూములు, ముడి సరుకు తదితర కొనుగోళ్ల రూపంలో పెట్టుబడి పెట్టారని చెప్పారు. నిధులు వేరే వారికి ఇచ్చారని ఓ చోట... కాదు వివిధ వివిధ స్థిర, చరాస్తులుగా పెట్టుబడి పెట్టారని పరస్పర విరుద్ధంగా పేర్కొనడం సిట్‌ కుట్రకు నిదర్శనం.మద్యం మాఫియా దోపిడీదారు బాబే సీఐడీ నమోదు చేసిన కేసు సంగతేమిటో...!అసలు విషయం ఏమిటంటే...రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే. మద్యం మాఫియాను ఏర్పాటు చేసి... పెంచి పోషించి వేళ్లూనుకునేలా చేసిన వ్యవస్థీకృత దందాకు ఆయనే బ్రాండ్‌ అంబాసిడర్‌. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. అందుకోసం మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలతో మోసానికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. అందుకోసం చీకటి జీవోలు 218, 468 జారీ చేశారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5వేలకోట్లకుపైగా గండి కొట్టారు. ఎంఆర్‌పీ కంటే ఏకంగా 20శాతం వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్‌ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20వేలకోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25వేలకోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌’(కాగ్‌) ఆధ్వర్యంలో స్వతంత్య్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతోసహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్‌ నరేష్, అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్‌ విత్‌ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్‌ విత్‌ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. ప్రస్తుతం సిట్‌ రిమాండ్‌ నివేదిక సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వ మద్యం విధానంలో అక్రమాలు మరోసారి వెల్లడయ్యాయి. ఇప్పటికైనా సీఐడీ ఆ కేసు దర్యాప్తు చేపట్టాలని... లేదా సీబీఐకి అప్పగించాలని నిపుణులు డిమాండ్‌ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబూ...మీరు అందుకు సిద్ధమేనా అని వైఎస్సార్‌సీపీ సవాల్‌ విసురుతోంది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్‌ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్‌ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్‌ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్‌ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్‌సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్‌ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్‌ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్‌ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి.

PM Modi arrives Delhi After Saudi Arabia visit4
ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఎయిర్‌పోర్టులోనే ధోవల్‌తో సమీక్ష!

సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ చేరుకున్నారు. కాశ్మీర్‌లో ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రధాని మోదీ.. సౌదీ అరేబియా పర్యటన అర్థాంతరంగా ముగించుకుని భారత్‌కు పయనమయ్యారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీని కలిసి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రస్తుత పరిస్థితి వివరించారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ చర్చించనున్నారు. ఇక, ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ.. ఎయిర్‌పోర్టులోనే కశ్మీర్ ఉగ్రదాడిపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నేడు పహల్గాంకు అమిత్‌ షాఘటనాస్థలాన్ని సందర్శించాలన్న ప్రధాని మోదీ ఆదేశంతో హోంమంత్రి అమిత్‌ షా హుటాహుటిన మంగళవారం రాత్రి శ్రీనగర్‌కు చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ఆయన వెంట జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా కూడా ఉన్నారు. బుధవారం అమిత్‌ షా పహల్గాంకు వెళ్లనున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యపై భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ. వాన్స్‌ సహా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Prime Minister Narendra Modi arrives in Delhi after cutting short his Saudi Arabia visit in view of the #PahalgamTerroristAttack in Kashmir.NSA Ajit Doval accompanies him. (Source - ANI/DD) pic.twitter.com/PeA7CWRAes— ANI (@ANI) April 23, 2025

IPL 2025, LSG VS DC: KL Rahul Rejects Interaction With Sanjiv Goenka, Walks Off Despite LSG Owners Trying To Stop Him5
LSG VS DC: ఇది కదా ప్రతీకారమంటే.. లక్నో ఓనర్‌కు ఇచ్చి పడేసిన రాహుల్‌

గత ఐపీఎల్‌ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓనర్‌ సంజీవ్‌ గొయెంకా తన పట్ల వ్యవహరించిన తీరుకు నాటి లక్నో కెప్టెన్‌, ప్రస్తుత ఢిల్లీ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ తనదైన శైలిలో బదులిచ్చాడు. నిన్న (ఏప్రిల్‌ 22) ఎల్‌ఎస్‌జీపై విజయానంతరం గొయెంకా కరచాలనం చేస్తూ తనతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. రాహుల్‌ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. రాహుల్‌ చర్యకు గొయెంకా సహా మైదానంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటబ్బా​ రాహుల్‌ ఇలా ప్రవర్తించాడని అనుకున్నారు.THE COMEBACK MAN - KL RAHUL. 🦁 pic.twitter.com/EQ67LvjLVl— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2025అయితే దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమి అనంతరం గొయెంకా రాహుల్‌ను బహిరంగంగా అవమానించాడు. అందరి ముందు నిలదీశాడు. గొయెంకా చర్యకు మనసు నొచ్చుకున్న రాహుల్‌ లక్నోను వీడి ఢిల్లీ పంచన చేరాడు. ఇప్పుడు అవకాశం రావడంతో లక్నో ఓనర్‌కు తన ఆటతీరుతోనే బుద్ది చెప్పాడు. తనను ఘోరంగా అవమానించిన గొయెంకాపై వారి సొంత మైదానంలోనే ప్రతీకారం తీర్చుకున్నాడు. Sanjeev Goenka tried to stop KL Rahul, but Rahul rejected any interaction. pic.twitter.com/1aQ68CIcic— Himanshu Pareek (@Sports_Himanshu) April 22, 2025నిన్న (ఏప్రిల్‌ 22) ఎల్‌ఎస్‌జీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ నాక్‌ ఆడి ఢిల్లీని గెలిపించాడు. సిక్సర్‌తో మ్యాచ్‌ ముగించి గొయెంకాకు తానేమి చేయగలనో నిరూపించాడు. ఈ సీజన్‌లో లక్నోపై ఢిల్లీకి ఇది రెండో విజయం. వైజాగ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది. అయితే తన భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో రాహుల్‌ ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. సీజన్‌ ప్రారంభం నుంచే గొయెంకాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూసిన రాహుల్‌.. నిన్న అవకాశం రావడంతో తన దెబ్బను రుచి చూపించాడు. ఈ సీజన్‌లో రాహుల్‌ మాంచి కసితో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 323 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో రాహుల్‌ ఓ భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ఎల్‌ఎస్‌జీలో రాహుల్‌ ప్రస్తానంలక్నో ఐపీఎల్‌ అరంగేట్రం నుంచి కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్‌.. తొలి రెండు సీజన్లలో (2022, 2023) ఆ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. అయితే గత సీజన్‌లో రాహుల్‌ లక్నోను ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. గత సీజన్‌లో నెమ్మదిగా ఆడుతున్నాడని కూడా రాహుల్‌పై విమర్శలు వచ్చాయి.మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్‌ మార్ష్‌ (45), ఆయుశ్‌ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్‌ (57 నాటౌట్‌), అభిషేక్‌ పోరెల్‌ (51), అక్షర్‌ పటేల్‌ (34 నాటౌట్‌) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.

Special Story On Marriage Invitation To CM Revanth6
రేవంత్ రావాలి.. నా లగ్గం జరగాలి

బాబూ. గణేష్ .. పెళ్లి కుదిరిందట కదా.. మరి ముహుర్తాలు తీసారా.. ఎప్పుడట మరి.. అడిగారు ఊరి జనం.. ఏమో నాకూ తెలీదు.. చెప్పాడు గణేష్.. అదేందిరా అట్లా చెబుతావ్.. ఈనెల.. వచ్చేనెల.. ఆపై వచ్చేనెల ఏదో ఒక రోజు ఉంటుంది కదా.. అది చెప్పు .. రెట్టించి అడిగారు పెద్దలు.. ఏమో.. నాకేం తెలుసు.. ఆయనకు ఎప్పుడు ఖాళీదొరికితే అప్పుడే నా పెళ్లి.. ఓహో.. పురోహితుడు డేట్స్ కుదరలేదా.. అవునులే.. అసలే ఇప్పుడు పంతుళ్ళకు బిజీ ఉంది.. అయన తీరిక దొరికాక ఏదో డేట్ చెబుతాడు.. చేసుకుందువులే.. .. పురోహితుడు కాదు.. వేరే అయన డేట్స్ కుదరాలి.. ఓహో.. అర్థమైందిరా పిల్ల అన్నయ్య అమెరికాలో ఉన్నాడు ఆయనకు సెలవులు.. డేట్స్ దొరకలేదు.. అయన వస్తేగానీ పెళ్లి వద్దన్నారు ఆడపిల్లవాళ్ళు.. అయన వచ్చాకే చేసుకుందువులే.. అన్నారు పెద్దలు.. అది కాదు.. అన్నాడు గణేష్.. మరింకేందిరా.. ఇంకెవరి డేట్స్ కుదరాలి.. రేవంత్ రెడ్డి డేట్స్ కుదరాలి.. చెప్పాడు గణేష్.. వార్నీ.. అదేందిరా అన్నారు పెద్దలు.. అదంతే.. రేవంత్ రెడ్డి వస్తేనే నా పెళ్లి.. లేదంటే లేదు అంటుకుంటూ విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు కుర్రాడు.. పెళ్లీడుకొచ్చిన కుర్రాళ్లను ఎవరైనా ఒరేయ్ అబ్బాయ్ నీ పెళ్లి ఎప్పుడురా అంటే ఇదిగో జాబ్ రాగానే చేసుకుంటాను.. ఇదిగో మా మరదలు ఒకే అనడమే లేటు.. అయ్యో.. ఇల్లు పని మధ్యలో ఉంది.. అది పూర్తయ్యాక బ్యాండ్ వాయించడమే.. జీతం తక్కువ ఉంది పెద్దయ్యా.. వచ్చే ఏడాది జీతం పెరగ్గానే చేస్కుంటా.. నువ్వే పిల్లను చూడు... నేనా అమెరికా వెళ్తున్న రెండేళ్లు అక్కడ ఉండి వస్తాను.. రాగానే చేసేసుకుంటా... లేదు బాబాయ్.. పిల్లలు దొరకడం లేదు.. పోనీ నువ్వైనా చూడు.. చేస్కుంటా.. అంటూ సమాధానాలు వస్తాయి.. కానీ ఈ కుర్రాడు మాత్రం.. నీ పెళ్లి ఎప్పుడురా అంటే షాకిచ్చే సమాధానం ఇచ్చాడు.. ఎవరైనా ఎమ్మెల్యేను కలిసి సార్ నాకు ఉద్యోగం చూడండి.. లేదా మంత్రికి చెప్పి ఏదైనా కాంట్రాక్ట్ ఇప్పించండి.. ఇంకా పెద్దాయనకు చెప్పి నాకు మెడిసిన్ సీట్ ఇప్పించండి అని కోరుకుంటారు.. సదరు నాయకుడు కూడా తన కార్యకర్త మాటను గౌరవించి మున్ముందు తనకు ఉపయోగపడే తీరునుబట్టి రికమెండేషన్ చేస్తారు. కానీ ఇదిగో తెలంగాణలోని వైరా నియోజకవర్గానికి చెందిన భూక్యా గణేష్ అనే యూత్ నాయకుడు మాత్రం విచిత్రమైన కోరిక కోరాడు. తన పెళ్ళికి సీఎం రేవంత్ రెడ్డి రావాల్సిందే అని పట్టుబట్టాడు.. అయన ఎప్పుడు వస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటాను అని.. అప్పుడే ముహూర్తం ఫిక్స్ చేసుకుంటాను అని ఫిక్షయ్యాడు. దీంతో ఏకంగా ఎమ్మెల్యే రామ్ దాస్ మాలోత్ కు ఒక లెటర్ రాసాడు.. ఇదిగో అన్నా.. నేను మీ నియోజకవర్గంలో నాయకుణ్ణి పెళ్ళికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చే బాధ్యత నీదే అంటూ.. ఒక విజ్ఞాపన అందించాడు.. దాన్ని సదరు ఎమ్మెల్యే సీఎం కు ఫార్వార్డ్ చేసాడు.. మా ఊరి కుర్రాడికి పెళ్లి కుదిరింది.. మీరైతే రావాల్సిందే.. రాకుంటే నాకు ఇజ్జత్ పోయేలా ఉంది.. ఏదైనా చేసి రండి సారూ అంటూ ఆ ఎమ్మెల్యే కూడా సీఎం కు ఆ లెటర్ పంపాడు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు డేట్స్ కుదురుతాయో.. భూక్యా గణేష్ పెళ్ళికి.. ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ అవుతుందో చూడాలి.-సిమ్మాదిరప్పన్న

Real Estate Top Recipient of AIF Investments in 20257
రియల్‌ ఎస్టేట్‌లోకి ఏఐఎఫ్‌ పెట్టుబడుల వెల్లువ

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌లు) పెట్టుబడులు 2024 డిసెంబర్‌ నాటికి రూ.73,903 కోట్లకు చేరాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగ కన్సల్టెంట్‌ సంస్థ ‘అనరాక్‌’ ఏఐఎఫ్‌లకు సంబంధించి డేటాను విశ్లేషించి ఒక నివేదిక విడుదల చేసింది. గత డిసెంబర్‌ నాటికి ఏఐఎఫ్‌లు అన్ని రంగాల్లోనూ కలిపి రూ.5,06,196 కోట్లను ఇన్వెస్ట్‌ చేసినట్టు తెలిపింది. ఇందులో 15 శాతం మేర (రూ.73,903 కోట్లు) రియల్‌ ఎస్టేట్‌లోకి వచ్చాయని.. రంగాల వారీగా అత్యధిక పెట్టుబడులు రియల్టీకే దక్కినట్టు ఈ నివేదిక తెలిపింది. ‘‘ఏఐఎఫ్‌లతో దేశ రియల్‌ ఎస్టేట్‌ ఫైనాన్సింగ్‌ (రుణ సదుపాయం) గణీయమైన మార్పునకు గురైంది. నిధుల్లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రాజెక్టులకు ఏఐఎఫ్‌ పెట్టుబడులు జీవాన్నిస్తున్నాయి. డెవలపర్లకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి’’అని అనరాక్‌ తెలిపింది. ఏ రంగంలోకి ఎంత మేర.. రియల్‌ ఎస్టేట్‌ తర్వాత అత్యధికంగా ఐటీ/ఐటీఈఎస్‌ రంగంలోకి రూ.30,279 కోట్ల ఏఐఎఫ్‌ పెట్టుబడులు వెళ్లాయి. ఆ తర్వాత ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రూ.26,807 కోట్లు, ఎన్‌బీఎఫ్‌సీ రూ.21,929 కోట్లు, బ్యాంకులు రూ.21,273 కోట్లు, ఫార్మా రూ.18,309 కోట్లు, ఎఫ్‌ఎంసీజీ రూ.12,743 కోట్లు, రిటైల్‌ రూ.11550 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగం రూ.11,433 కోట్ల చొప్పున ఏఐఎఫ్‌ పెట్టుబడులను 2024 డిసెంబర్‌ నాటికి ఆకర్షించినట్టు అనరాక్‌ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఇతర రంగాల్లోకి రూ.2,77,970 కోట్ల ఏఐఎఫ్‌ పెట్టుబడులు వెళ్లాయి. రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి పరంగా వివిధ దశల్లో ఉన్న నిధుల సమస్యకు ఏఐఎఫ్‌ రూపంలో పరిష్కారం లభించినట్టు అనరాక్‌ గ్రూప్‌ రీజినల్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. సంప్రదాయ నిధుల సమీకరణ మార్గాల్లో ఇబ్బందులకు ఈ రూపంలో పరిష్కారం లభించినట్టు చెప్పారు. ఏఐఎఫ్‌లు ప్రైవేటు ఈక్విటీ, హెడ్జ్‌ ఫండ్స్, రియల్‌ ఎస్టేట్‌ తదితర రంగాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఇవి ఇన్వెస్టర్లకు అధిక రిస్క్‌తో కూడిన రాబడులను ఆఫర్‌ చేస్తుంటాయి. దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించి, తమ ప్రణాళికలకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. గడిచిన దశాబ్ద కాలంలో సెబీ వద్ద నమోదైన ఏఐఎఫ్‌లు 36 రెట్లు పెరిగాయి. 2013 మార్చి నాటికి 42గా ఉన్నవి 2025 మార్చి 5 నాటికి 1,524కు పెరిగినట్టు డేటా తెలియజేస్తోంది.

Padutha Theeyaga Producer Praveena Kadiyala Comments On Pravasthi8
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) గురించి గాయని ప్రవస్తి (Pravasthi) చేసిన ఆరోపణలపై జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాత ప్రవీణ (Praveena Kadiyala) క్లారిటీ ఇచ్చారు. రెండురోజుల క్రితం ప్రవస్తి ఒక వీడియో ద్వారా కీరవాణి(M. M. Keeravani), సునీత, చంద్రబోస్‌ల గురించి సంచలన కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఆపై తనను మెంటల్‌గా హింసించారని, బాడీ షేమింగ్‌ చేశారని ఆమె ఆరోపించారు. ప్రోగ్రాం నిర్వాహకులు కూడా తమకు చీరలు ఇచ్చి బొడ్డు కిందకు కట్టుకో, ఎక్స్‌ఫోజింగ్‌ చేయాలి అన్నట్లుగా చెప్పేవారని ప్రవస్తి చెప్పుకొచ్చింది. అయితే, ఆ ప్రోగ్రాం నిర్మాత ప్రవీణ తాజాగా క్లారిటీ ఇచ్చారు.వారు ఎంచుకున్న పాటకు తగ్గట్టే కంటెస్టెంట్లకు తాను దుస్తులు డిజైన్‌ చేయిస్తానని జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాత ప్రవీణ క్లారిటీ ఇచ్చారు. తమ షోలో ఎక్కడా కూడా బాడీ షేమింగ్‌పై వ్యాఖ్యలు చేయమని చెప్పారు. ప్రవస్తి చెబుతున్నట్లుగా ఫేవరెట్‌ కంటెస్టెంట్లకు సులభమైన పాటలు ఇచ్చి.. ఆమెకు మాత్రమే కష్టమైన పాటలు ఇస్తామని చెప్పడంలో ఎలాంటి నిజం లేదని ఆమె చెప్పారు. పాటల ఎంపిక కోసం ప్రతి షెడ్యూల్‌లో ఓ క్రియేటివిటీ టీమ్‌ నాలుగు రకాల పాటలను ఎంపిక చేస్తుంటుందని నిర్మాత ప్రవీణ అన్నారు. తమ ప్రోగ్రామ్‌ టెలీకాస్ట్‌ అయ్యే ఛానల్‌కు ఏ పాటల రైట్స్‌ ఉన్నాయో వాటిని మాత్రమే సెలెక్ట్‌ చేసుకోవాలని మాత్రం చెబుతామని తెలిపారు. అలా ప్రతి కంటెస్టెంట్‌ ఆరు పాటలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వాటిపై రిహార్సల్స్‌ పూర్తి చేసుకుని, వారు రెడీ అని చెప్పాకే తాము షూటింగ్‌ ప్రారంభిస్తామని ఆమె అన్నారు.అలా అనడం తప్పే: సునీత‘మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు’ అని కాస్ట్యూమర్‌ అన్నారంటూ ప్రవస్తి చేసిన ఆరపణలకు సింగర్‌ సునీత ఇలా సమాధానం ఇచ్చారు. 'కంటెస్టెంట్స్‌ ఎంపిక చేసుకున్న పాటకు తగిన విధంగానే కాస్ట్యూమ్స్‌ని నేను డిజైన్‌ చేయిస్తుంటా. ఇక్కడ పాటది మాత్రమే ఛాయిస్‌ ఉంటుంది. ప్రవస్తితో ఆ కాస్ట్యూమర్‌ అలా ప్రవర్తించి ఉంటే అది ముమ్మాటికే తప్పే. కానీ, జరిగిన విషయం అదే సమయంలో నాతో గానీ, డైరెక్టర్‌తో గానీ చెప్పాల్సింది. డ్రెస్సు విషయంలో అలా వేసుకో, ఇలా వేసుకో అని నేనెప్పుడూ చెప్పలేదు.' అని అన్నారు.Gnapika entertainment producer praveena kadiyala about singer #Pravasthi issue.#ETV #paduthatheeyaga pic.twitter.com/OlhBtBiaNe— Vamsi Kaka (@vamsikaka) April 22, 2025

married Naveen Love Track With Constable Nirmala At UP9
ఇంట్లో ఇల్లాలు.. వీధిలో ప్రియురాలు.. పెళ్లైన 15 రోజులకే..

లక్నో: ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్‌లో​ రకరకాల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధాలు ఎక్కువగా సంఖ్యలో బయటకు వస్తున్నాయి. భర్త, భార్యలను హత్య చేసిన ఘటనలు భయానక వాతావరణాన్ని సృష్టించాయి.తాజాగా మరో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లి జరిగిన రెండు వారాలకే సదరు వ్యక్తి.. మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏమిటంటే.. రెండో పెళ్లి చేసుకున్న ఆమెకి ముగ్గురు పిల్లలు ఉండటం, ఆమె కానిస్టేబుల్‌ కావడం. ఈ నేపథ్యంలో మొదటి భార్య కేసు పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది.వివరాల ‍ప్రకారం.. యూపీలోని రసూల్‌పూర్ గ్రామానికి చెందిన నేహాకు గజల్‌పుర్‌ వాసి నవీన్‌తో ఫిబ్రవరి 16న వివాహం జరిగింది. పెళ్లయిన రెండు రోజులకే ముగ్గురు పిల్లలున్న హెడ్‌ కానిస్టేబుల్‌ నిర్మలతో నవీన్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు భార్యకు తెలిసింది. నిర్మలతో కలిసి ఉండాలని నవీన్‌ భార్యపై ఒత్తిడి తీసుకురాగా, ఆమె ససేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెగేసి చెప్పింది. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. దీంతో, చేసేదేమీ లేక.. అనంతరం మార్చి ఒకటో తేదీన నిర్మలతో నవీన్‌ రెండోపెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 16న రాత్రి మొహల్లా సాకేత్​ కాలనీలోని నవీన్-నిర్మల ఏకాంతంగా ఉన్న సమయంలో వీరిద్దరినీ పట్టుకుంది నేహా. ఈ క్రమంలో నేహా వద్ద నుంచి వారిద్దరూ పారిపోయారు. తర్వాత.. ఏప్రిల్‌ 17న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మలను హఫీజ్‌పుర్‌ పోలీస్‌స్టేషనుకు అటాచ్‌ చేశారు. ప్రస్తుతం నవీన్, నిర్మల పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరిద్దరి ఫొటోలు వైరల్‌గా మారాయి.

Navy Officer Vinay Narwal Married Just 5 Days Ago Pahalgam10
‍కశ్మీర్‌ ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. నవవధువు ఆవేదన

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో ఉగ్ర ఉన్మాదం మరోసారి ఒళ్లువిరుచుకుంది. పర్యాటకులపై తూటాల వర్షం కురిసింది. ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) కూడా మరణించారు. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు ధృవీకరించారు.మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు మృతిచెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులున్నారు. వారిలో ఒకరు నేపాలీ కాగా మరొకరిది యూఏఈ. మరో ఇద్దరు స్థానికులు కాగా మిగతావారు కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, బీహార్‌, హర్యానాకు తదితర రాష్ట్రాలకు చెందినవారు.భర్తను కోల్పోయిన నవవధువుపెళ్లయి కాళ్లకు పారాణి ఆరకముందే ఆ నవవధువు జీవితం తలకిందులైంది. భర్తను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడంతో ఆ నవవధువు తన భర్త మృతదేహాన్ని పట్టుకుని దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది. ఈ మారణకాండలో బలైపోయిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26)గా గుర్తించారు. హర్యానాకు చెందిన వినయ్, కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న ఆయన, హనీమూన్ కోసమో, లేదా సెలవును ఎంజాయ్ చేసేందుకో కశ్మీర్‌కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే, ఆనందంగా గడపాల్సిన సెలవు ఆయన జీవితంలో చివరిది కావడంతో కుటుంబంలోనే కాదు, దేశవ్యాప్తంగా విషాదం అలుముకుంది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు ధృవీకరించారు. ఈ క్రమంలో నవ వధువు రోదిస్తూ..‘మాకు పెళ్లయి కేవలం ఆరు రోజులే అవుతోంది. ఘటన జరిగినప్పుడు మేమిద్దరం పానీపూరీని ఆస్వాదిస్తున్నాం. హఠాత్తుగా ఒక ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అన్నాడు. వెంటనే ఆయన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న నా భర్తను ఎవరైనా కాపాడండి’ అంటూ ఏడుస్తున్న హృదయ విదారక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 🚨Vinay Narwal, a 26-year-old Indian Navy officer from #Karnal, #Haryana📅 16 April – Lieutenant Vinay got married.📅 19 April – The couple traveled to Kashmir for the their honeymoon📅 22 April – Lieutenant Vinay was tragically killed in a terrorist attack in #Pahalgam https://t.co/n8ElIenhaE pic.twitter.com/6w0qprTnm8— Haryana Development Index (@InfrageoHaryana) April 23, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement