
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ మరోసారి పరారయ్యారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, ఆ గ్రామ సర్పంచ్ భర్త మురళీకృష్ణపై కూన రవికుమార్ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా కూన అక్కడ ఉండగానే జరిగింది. అంతేకాకుండా పోలీసుల విధులకు కూడా ఆయన ఆటంకం కలిగించారు. దీనిపై మురళీకృష్ణ పొందూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో కూన ముందుగానే పారిపోయారు. శనివారం పోలీసులు ఆయన ఇంటికెళ్లి చూడగా.. అప్పటికే ఆయన పరారయ్యారు.
(చదవండి: శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్..)