
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం గవర్నర్, సీఎం జగన్‌తో కలిసి పాత, కొత్త మంత్రులు తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదిలా ఉండగా, ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. గతంలోనే గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ని కలిసి చర్చించిన సంగతి తెలిసిందే.