cabinet reshuffle
-
పంజాబ్‌లో ఉనికిలో లేని శాఖకు మంత్రి
చండీగఢ్: ప్రభుత్వంలో శాఖలకు మంత్రులుంటారు. అసలు ఉనికిలోనే లేని శాఖకు మంత్రులుంటారా? ఆమ్ ఆద్మీ పార్టి(ఆప్) ఏలుబడిలో ఉన్న పంజాబ్‌లో ఈ విచిత్రం చోటుచేసుకుంది. కుల్దీప్సింగ్ ధలీవాల్ పంజాబ్ పరిపాలన సంస్కరణల శాఖతోపాటు ప్రవాస భారతీయుల(ఎన్ఆర్ఐ) వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా 21 నెలలు పనిచేశారు. నిజానికి పరిపాలన సంస్కరణల శాఖ అనేది లేనే లేదు. కానీ, ఆయన ఆ శాఖ మంత్రిగా చెలామణి అయ్యారు. కేబినెట్ పునర్వ్యస్థీకరణ సందర్భంగా ధలీవాల్‌కు 2023 మే నెలలో ఈ శాఖ అప్పగించారు. అయితే, పరిపాలన సంస్కరణల శాఖ మంత్రిగా ఆయనకు సిబ్బందిని కేటాయించలేదు. ఈ శాఖపై కనీసం ఒక్కసారి కూడా సమావేశం జరగలేదు. 21 నెలల తర్వాత పంజాబ్ సర్కారు అసలు విషయం గుర్తించింది. పరిపాలన సంస్కరణల శాఖ అనేది ఉనికిలో లేదని చెబుతూ ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం కుల్దీప్సింగ్ ధలీవాల్ వద్ద ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ ఒక్కటే మిగిలి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భగవంత్ మాన్ ప్రభుత్వ పాలన ఎలా ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నాయి. భగవంత్ మాన్కు పరిపాలన రాదని బీజేపీ సీనియర్ నేత సుభాష్ శర్మ, శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ విమర్శించారు. -
డిప్యూటీ సీఎంగా ఉదయనిధి
చెన్నై: తమిళనాట వారసుడికి పట్టాభిషేకం జరిగింది. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి లభించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 46 ఏళ్ల ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని డీఎంకే శ్రేణులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. శనివారం స్టాలిన్ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయనిధి డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు కూడా. పలు చిత్రాల్లో నటించడంతో పాటు సినిమాలు నిర్మించారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని కూడా స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో 471 రోజుల తర్వాత రెండ్రోజుల క్రితమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. బాలాజీతో పాటు గోవి చెజియన్, రాజేంద్రన్, నాజర్‌లను స్టాలిన్ కేబినెట్లోకి తీసుకున్నారు. టి.మనో తంగరాజ్, జింజీ ఎస్.మస్తాన్, కె.రామచంద్రన్‌లను మంత్రివర్గం నుంచి తొలగించారు. -
Andrei Belousov: రష్యా నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్
మాస్కో: రష్యా నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్చేపట్టిన వ్లాదిమిర్ పుతిన్ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. రాజ్యాంగం ప్రకారం శనివారం మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసింది. పాత కేబినెట్లో రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు మాత్రమే అవకాశమివ్వలేదు. రక్షణ శాఖ సహాయ మంత్రి తిమూర్ ఇవనోవ్ అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడంతో షోయిగుకు పదవీ గండం తప్పదని కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఆదివారం అధ్యక్షుడు పుతిన్ నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్(65)ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. షోయిగుకు రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ బాధ్యతలను అప్పగించారు. ఆండ్రీ బెలౌసోవ్ 2020 నుంచి ఫస్ట్ డిప్యూటీ ప్రధానమంత్రిగా కొనసాగు తున్నారు. అంతకుముందు ఏడేళ్లపాటు పుతిన్ సలహాదారుగా ఉన్నారు. కొత్త ఆవిష్కరణలకు, నూతన ఆలోచనలకు అనుగుణంగా రక్షణ శాఖను తీర్చిదిద్దేందుకే బెలౌసోవ్‌ను నియమించినట్లు అధ్యక్ష భవనం తెలిపింది. -
విపక్షాల ఐక్యతకు కౌంటర్‌గా ఎన్డీయే బలప్రదర్శన!
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు దృష్టిలో ఉంచుకునే రాజకీయ పరిణామాలు శరవేగంగా.. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీకి అధికారం దూరం చేసే క్రమంలో.. సాధ్యమైనంత వరకు ఐక్యంగా ఉండాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అవసరమైతే ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిలపాలనే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోపే బీజేపీ మరో ప్లాన్‌తో ముందుకు వచ్చింది. విపక్ష కూటమి సమావేశం కంటే ముందే ఎన్డీయే కూటమి బలప్రదర్శన చేయాలని నిర్ణయించుకంది. ఈ మేరకు జులై 18వ తేదీన ఎన్డీయే విస్తృతస్థాయి సమావేశానికి సిద్ధమవుతున్న బీజేపీ.. మిత్రపక్షాలకు సమాచారం అందించింది. ఎన్డీయే పక్షాలనే కాదు.. ఏ కూటమికి చెందని కొన్ని పార్టీలకు సైతం ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో అకాలీదళ్, చిరాగ్ పాశ్వాన్ కూడా ఉన్నారు. మరోవైపు కర్ణాటకలో జేడీఎస్‌తోనూ పొత్తు కోసం యత్నిస్తున్న బీజేపీ.. ఆ పార్టీకి ఆహ్వానం పంపింది. ఇక తమిళనాడులో గత కొంతకాలంగా విబేధాలతో దూరంగా ఉంటూ వస్తున్న మిత్రపక్షం అన్నాడీఎంకేకు సైతం ఆహ్వానం పంపింది. పార్లమెంట్ సమావేశాలకు ముందరే జరగనున్న ఈ కీలక సమావేశం ద్వారా విపక్షాల ఐక్యతకు కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణపై సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఇవాళ(గురువారం) మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ భేటీ జరిగింది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశంలో.. కేబినెట్ మార్పులు చేర్పులపైనే ప్రధానాంశంగా చర్చ జరిగింది. ఈ శని లేదంటే ఆదివారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల దృష్ట్యానే ఈ కేబినెట్ కూర్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. -
మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని వార్తలు ఊపందుకుంటున్న వేళ జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా, ఎన్సీపీ నుంచి వేరు కుంపటి పెట్టుకుని బీజేపీ–శివసేన ప్రభుత్వంలో అజిత్ పవార్ వర్గం చేరికపైనా చర్చించే అవకాశాలున్నాయి. ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో సమావేశం ఉంటుందని సమాచారం. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితర అగ్రనేతలు ఇటీవలి కాలంలో పలుదఫాలుగా అంతర్గత చర్చలు జరపడంతో మంతివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడతారనే ఊహాగానాలకు బలం చేకూరింది. తాజాగా శరద్ పవార్‌ను వీడి అజిత్ పవార్ వెంట బయటకు వచ్చిన సీనియర్ ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్‌కూ ఇందులో అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే కొన్ని రాష్ట్లాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన సంస్థాగతమైన మార్పులపైనా చర్చిస్తారని తెలుస్తోంది. -
కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?.. భారీ మార్పులు?
సాక్షి, ఢిల్లీ: త్వరలో కేబినెట్ విస్తరణకు కేంద్రం సన్నద్ధమవుతోంది. పునర్వ్యవస్థీకరణ, విస్తరణ చర్చలు జోరందుకున్న క్రమంలో పార్లమెంట్ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశముంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. దీంతో పార్టీ సంస్థాగతంగానూ పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు 2024లో లోక్‌సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంలో, పార్టీలో భారీ మార్పులుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, తెలంగాణపై కమలదళం ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ విస్తరణలో ఇక్కడి నుంచి మరొకరికి మంత్రి పదవి వరించనుందనే ప్రచారం సాగుతోంది. ఆ దిశగా ప్రధాని మోదీ యోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ నుంచి లోక్‌సభకు, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: యూపీ సీఎం కాషాయ దుస్తులపై కాంగ్రెస్ మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు -
పార్థ చటర్జీ ఎఫెక్ట్.. మమత కేబినెట్లో మార్పులు!
కోల్‌కతా: సీఎం మమతా బెనర్జీ తన కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరిస్తారని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో సోమవారం మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ భేటీ జరగనుంది. అయితే కేబినెట్లో స్వల్ప మార్పులే ఉంటాయా లేక మంత్రివర్గం మొత్తాన్ని మారుస్తారా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టు అనంతరం కేబినెట్లో మార్పులు చేస్తామని మమతా బెనర్జీ గతవారమే తెలిపారు. అప్పటివరకు ఆయన శాఖలన్నీ తనవద్దే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం కేబినెట్ భేటీ జరుగుతోంది. పార్థ చటర్జీ శాఖలను పార్టీలోని ఇతర నేతలకు అప్పగిస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే కేబినెట్లో సమూల మార్పులుంటాయా అనే విషయంపై మాత్రం తమకు తెలియదని పేర్కొన్నాయి. పార్టీలో ఒక్కరికి ఒకే పదవి ఉండాలని మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గతంలోనే చెప్పారు. ఆ నిబంధన మేరకు ఇకపై ఒక్క మంత్రికి ఒకే శాఖ కేటాయించాలనే యోచనలో మమత ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పార్థ చటర్జీని ఈడీ ఇటీవలే అరెస్టు చేసింది. ఆయన సన్నిహితురాలు నటి అర్పిత ముఖర్జీ నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.50కోట్ల నగదు, బంగారు ఆభరణాలను జప్తు చేశారు. అనంతరం పార్థ చటర్జీని మంత్రి పదవిని తొలగించమే గాక, పార్టీలోని అన్ని పదవుల నుంచి తప్పించారు సీఎం మమతా బెనర్జీ. ఆ సమయంలో ఆయన వద్ద ఐదు శాఖలు ఉండటం గమనార్హం. చదవండి: ప్రాణాల మీదకు తెచ్చిన డీజే.. కరెంటు షాక్‌తో 10 మంది మృతి.. పలువురికి గాయాలు -
అనితర సాధ్య సామాజిక నమూనా!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన నాలుగు రోజులకే అంబేడ్కర్ జయంతి రావడంతో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం– ‘సామాజిక న్యాయం’ నమూనాను– ‘14 ఏప్రిల్’ చట్రంలో ఉంచి పుటం వేయడానికి, ప్రధాన మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ గట్టి ప్రయత్నమే జరిగింది. ‘ఏ పదవి లేకుండానే చక్రం తిప్పే వాళ్ళది ఏ కులం?’ అంటూ, అందుకు– కారణం మూడేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వమే అన్నట్టుగా... అందుకు జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టే ప్రయత్నమే ఇందులో ప్రధానంగా కనిపించింది. ఈ తరహా ధోరణి కొత్తది. గడచిన పదేళ్లుగా తెలుగునాట ఉద్యమాలు– ‘ఆన్లైన్’లోనే జరగడంతో దానికీ ‘వర్క్ ఫ్రం హోం’ సౌలభ్యం వచ్చేసింది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవంగా జరుగుతున్నది ఏమిటి? అనేది తెలుసుకుని, దాన్ని స్థానిక చూపుతో చూడ్డం, రాయడం, మాట్లాడ్డం, ఎప్పుడా అనేది మాత్రం ఇంకా స్పష్టం కావలసి ఉంది. అయినా ఇప్పుడొచ్చిన నష్టం కూడా పెద్దగా ఏమీ లేదు. కొత్త పార్టీ ప్రభుత్వం అన్నప్పుడు, ‘చెడు’ మాట్లాడ్డం మొదలుపెట్టిన తర్వాతే, అక్కడున్న– ‘మంచి’ ఏమిటో ఆలస్యంగా అయినా వెలుగులోకి వస్తుంది. ఈలోగా శిలాసదృశ్యంగా ఉన్న (ఇమేజ్) రూపానికి బీటలు ఆపాదించడం తప్పనిసరి అవుతుంది; దాని వెనుకే మంచి–చెడుల మదింపు లేదా సమీక్ష మొదలవుతుంది. భజనతో ప్రయోజనం ఉండదు కానీ సమీక్ష ఎవరికైనా చాలా అవసరం. అలా ఈ ప్రభుత్వం తొలి వైఫల్యంగా చలామణిలో ఉన్నది, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్జీవోల– ‘చలో విజయవాడ’ నిరసన ర్యాలీ; దాన్ని ప్రభుత్వం నియంత్రించలేకపోవడం. దీన్ని గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా చూసి ఉంటే– ‘ఉద్యోగులపై పోలీసుల దమనకాండ’, ‘విచక్షణారహితంగా ఉద్యోగులపై పోలీసుల లాఠీచార్జి’ వంటి వార్తలు, లైవ్ దృశ్యాలు, జగన్ ప్రభుత్వం తొలి– ‘బ్లాక్ రిమార్క్’గా ఇప్పటికే నమోదు అయ్యేవి. (క్లిక్: ‘సోషల్ ల్యాబ్’ పని మొదలైంది) మళ్ళీ ఇప్పుడు మంత్రివర్గం మార్పు తర్వాత కూడా– ‘జగన్ మెత్తబడ్డాడు’ అనే వ్యాఖ్యతో అది కూడా మరో వైఫల్యంగా చలామణిలోకి తెచ్చే ప్రయత్నం మొదలయింది. నిజానికి– జిల్లాల జనాభా, వైశాల్యం, వనరులు, ‘డెమోగ్రఫీ’ వంటి ప్రాథమిక అంశాలను బట్టి ముందుగా కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి అయ్యాక, అప్పుడు మంత్రుల మార్పు జరిగింది. అంటే, రెండు దశల్లో పాత సంస్థానాల ప్రభావం తగ్గింపునకు గురైందన్నమాట. కనుక, ఈ మార్పును సరికొత్త– ‘మ్యాపింగ్’ దృష్టితో చూస్తే తప్ప దీని వెనుక ఉన్న– ‘లాజిక్’ అయినా, అస్సలు అటువంటిది ఎప్పుడు మొదలు అయిందనే దాని గత చరిత్ర అయినా స్పష్టం కాదు. దాన్ని– ‘వైఎస్ మ్యాపింగ్ ఫార్ములా’ అనొచ్చు. అందులో రెండు అంశాలు ఉండేవి: ‘నియోజక వర్గం ఎక్కడ?’ ‘కమ్యూనిటీ ఏది?’ (క్లిక్: వివక్షను బయటి నుంచి చూస్తే ఎలా?) అమలులో అది ఇలా ఉండేది: 2009 ఎన్నికల ముందు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగాక, కొత్తగా నియోజకవర్గం అయిన విజయవాడ శివారులోని పెనమలూరుకు కాంగ్రెస్ అభ్యర్ధిగా కె.పార్థసారథి (యాదవ్) ఎన్నికయ్యాక, రాజశేఖరరెడ్డి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటికి రెండవసారి గెలిచినవారిలో బందరు నుంచి పేర్ని నాని కూడా ఉన్నారు. అయినా– ‘జాగ్రఫీ’ ఇక్కడ కీలకం కావడంతో, కృష్ణా జిల్లాకు పార్థసారథి ఏకైక మంత్రి అయ్యారు. రెండవది– అదే 2009 ఎన్నికల్లో వరంగల్ (తూర్పు) కొత్తగా నియోజకవర్గం అయింది. బసవరాజు సారయ్య (రజక) మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ తాను పాటించిన– ‘ఫస్ట్ టైం ఎంఎల్ఏ’కి మంత్రి పదవి లేదు, అనే నిబంధన పక్కన పెట్టి మరీ వైఎస్ ఆయన్ని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక్కడ– ‘కులం’ ప్రాతిపదిక అయింది. అలా సారయ్య భారత దేశంలో రజక కులం నుంచి రాష్ట్ర మంత్రి అయిన రెండవ వ్యక్తి అయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి మొదటివారు. ఇటువంటి– ‘మ్యాపింగ్’ లోకి వచ్చేదే ఉత్తర, పశ్చిమ, తూర్పు భారత రాష్ట్రాలను దక్షణాదితో కలిపే– ‘వై’ జంక్షన్‌గా ప్రసిద్ధమైన విజయవాడను కొత్తగా జిల్లా చేసి, దానికి ‘ఎన్టీఆర్’ పేరు పెట్టడం! నిజానికి ఈ చర్య, ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం కంటే, ఒక ప్రధానమైన– ‘కమ్యూనిటీ’కి ఈ ప్రాంత చరిత్రలో ఇచ్చిన సముచితమైన గౌరవం అవుతుంది. విశ్లేషకులు– ‘ఏ పదవి లేకుండానే చక్రం తిప్పేవాళ్ళది ఏ కులం?’ అంటూ అడగడం, ఇప్పటి సామాజిక మాధ్యమాలు తప్ప గత చరిత్ర తెలియనివారి వరకు వినడానికి బాగుండొచ్చు. కానీ, ఆ ప్రశ్నతో మళ్ళీ పాత తరానికి మర్చిపోయిన విషయాలు గుర్తుచేయడం అవుతుందేమో? ఎందుకంటే– ‘ఏ పదవి లేకుండానే చక్రంతిప్పే వాళ్ళది ఏ కులం?’ అని ఇప్పుడు అంటే– ‘వాళ్ళు గతంలో ఏ పార్టీల్లో ఉంటూ ఏ ప్రాంతాలకు ప్రజాప్రతినిధులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారాల్లో ఉన్నారు? అనే ప్రశ్నకు కూడా ఇక్కడ మనం జవాబు వెతకాలి. (క్లిక్: అభివృద్ధిని అడ్డుకునే ఇంగ్లిష్ వ్యతిరేకత) సుదీర్ఘకాలం కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు ‘ఐపాక్’ ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పనిచేయాలా, వద్దా? అని ఢిల్లీలో సోనియా ఇంట జరిగిన చర్చల ప్రక్రియలో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు ఒక్కరూ ఎందుకు లేరు? వైఎస్ ఇక్కడ 2004లోనే గుర్తించి అమలు చేసిన– ‘మ్యాపింగ్’ కాంగ్రెస్ పార్టీని ఘనవిజయం దరి చేర్చినప్పుడు, 2024లో కూడా అది వారికి ఎందుకు అలిమి కావడం లేదు? ఎందుకంటే, ఒకప్పటి ‘వైఎస్ ఫార్ములా’ను ఇరవై ఏళ్ల తర్వాత, జగన్ ఇప్పుడు– ‘కటింగ్ ఎడ్జ్’ (అంచు మిగలని దశ)కు తీసుకు వెళ్ళారు కనుక! - జాన్సన్ చోరగుడి అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
సీఎం జగన్ ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తా
ఒంగోలు: సీఎం జగన్ మాటే తమకు శాసనమని, ఆయన ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం సోమవారం జిల్లాకు వచ్చిన ఆయనకు అభిమానులు అడుగడుగునా భారీ ర్యాలీలతో స్వాగతం పలికారు. అనంతరం తన నివాసంలో బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ‘మంత్రిగా ఉన్నప్పటి కంటే మంత్రి పదవికి రాజీనామా చేశాక వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు నాపై ఎక్కువ అభిమానాన్ని చాటారు. పెద్దఎత్తున వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీని గెలిపించేందుకు కృషి చేస్తాను’ అని చెప్పారు. ఈనెల 22న సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించేందుకు ఒంగోలుకు వస్తున్నందున ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు మహిళలు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. తొలుత మార్టూరు మండలం బొప్పూడి వద్ద ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలినేని అనంతరం ర్యాలీగా ఒంగోలు బయలుదేరారు. బొప్పూడి వద్ద ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, అన్నా వెంకటరాంబాబు, పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి రావి రామనాథంబాబు, బొల్లాపల్లి టోల్గేట్ వద్ద ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఏపీ శాప్‌నెట్ చైర్మన్ బాచిన కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచు గరటయ్య, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. -
సామాజిక సమతూకానికే పెద్దపీట!
ఏ ప్రభుత్వాధినేతకైనా మంత్రివర్గ కూర్పు, విస్తరణ, పునర్వ్యవస్థీకరణ అనేది కత్తిమీద సాము వంటిది. ఎంతోమంది ఆశావహులు, అర్హులమని భావించేవారు మంత్రిపదవి అనే పల్లకీ ఒక్కసారైనా ఎక్కాలని ఆశించడం సహజం. కానీ, ముఖ్యమంత్రికి మాత్రం ఎన్నో అవరోధాలూ, పరిమితులూ ఉంటాయి. అర్హులని తెలిసీ ఇవ్వలేని పరిస్థితి తలెత్తుతుంది. సామాజిక వర్గ ప్రాధాన్యతలు లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని సహచరులను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇటీవల సీఎం జగన్మోహన్రెడ్డి తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీక రించారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం మంత్రివర్గ సభ్యుల సంఖ్య ఇరవై ఐదుకు మించరాదు. కానీ ఆశావహులు అంతకు కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నారు. జగన్ ఎన్నుకున్న మంత్రి వర్గంలో బడుగు బలహీన వర్గాల వారికి సింహభాగం పదవులు దక్కాయి. సామజిక న్యాయం, సమతూకం పాటించడంలో జగన్ విజయులు అయ్యారని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. 70 శాతం పదవులు బలహీన వర్గాలవారికి దక్కడం స్వతంత్రం వచ్చాక ఇదే ప్రథమం! ఇక మంత్రివర్గ ప్రమాణస్వీకారం అయ్యాక అసంతృప్తులు బయటపడటం సహజమే. వైసీపీ విషయంలోనూ ఇదే జరిగింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు ఇదంతా టీ కప్పులో తుఫాను లాంటిది. వైసీపీ అన్నా, జగన్మోహన్ రెడ్డి అన్నా అడుగడుగునా విషం కక్కే పచ్చ మీడియాకు ఈ అసంతృప్తుల అలజడి విందుభోజనం లాంటిది. ఇలాంటి సంఘటనలేమీ మొదటి సారిగా జరగడం లేదు. అన్ని పార్టీల విషయంలో చాలాసార్లు జరిగినవే. కానీ, జగన్ మీద బురద చల్లడానికీ, పార్టీ నాయకులను రెచ్చగొట్టడానికీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూసే పచ్చమీడియా ఇలాంటి సంఘటనలు చూసి పండుగ చేసుకుంటోంది. ఏ పార్టీ అయినా కష్టపడే నాయకులను గుర్తిస్తుంది. వారికి న్యాయం చెయ్యాలనే ప్రయత్నిస్తుంది. కానీ అన్ని వేళలా అది సాధ్యం కాదు. టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై మందితో జంబో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ బలం నూటా ఎనభై. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు మంత్రి అయ్యారన్న మాట. ఈ మంత్రివర్గాన్ని చూసి అందరూ హేళన చేశారు. అలాంటి సంద ర్భంలో కూడా కొందరు తమకు పదవులు రాలేదని అలిగారు. అసంతృప్త నాయకులను బుజ్జగించడానికీ, సముదాయించడానికీ అధిష్ఠానం ప్రయత్నాలు చేయడమూ సహజమే. మొన్న మంత్రిపదవులు రాని వారిని బుజ్జగించడానికి సీఎం జగన్ కూడా స్వయంగా రంగంలోకి దిగారు. అలకలు పూనిన వారిని సముదాయించారు. దాంతో రెండు రోజుల్లోనే అసంతృప్తి చల్లారింది. అయితే ఎల్లో మీడియా మాత్రం పార్టీ మీద జగన్‌కు పట్టు లేదనీ, తిరుగుబాటు తప్పదనీ ప్రచారం చేసింది. పనిలో పనిగా చంద్రబాబు కూడా మంత్రిపదవులు రాని వారికి గేలం వేస్తున్నారని వార్తలు వినిపించాయి. (క్లిక్: ‘సోషల్ ల్యాబ్’ పని మొదలైంది) ఎవరైనా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. పార్టీకి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. క్రమశిక్షణ లేని రాజకీయ పార్టీలు మనుగడ సాగించలేవు. అధినేత నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీని ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ప్రజల అభీష్టాన్ని, తమ నాయకుడికి జనంలో ఉన్న విశ్వాస్వాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రత్యర్థులకు ఫలహారం కాకుండా పార్టీలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి. అవకాశాలు ఇవాళ కాకపొతే రేపు వస్తాయి. (క్లిక్: సామాజిక న్యాయంలో ఓ విప్లవం!) - ఇలపావులూరి మురళీ మోహనరావు సీనియర్ రాజకీయ విశ్లేషకులు -
జగన్ సీఎం కంటే నాకేదీ ముఖ్యం కాదు: ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, ప్రొద్దుటూరు: పార్టీ కన్నతల్లిలాంటిదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. తల్లి బాగుంటే ఆమె నీడలో పిల్లలందరూ బాగుంటారన్నారు. స్థానిక జిల్లా ఆస్పత్రిలో సోమవారం ఎమ్మెల్యే రాచమల్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మన జిల్లా నుంచి సహోదరుడు అంజద్‌బాషా రెండోసారి మంత్రి వర్గంలో స్థానం పొందడం సంతోషంగా ఉందని తెలిపారు. మంత్రి పదవులు ఆశించిన కొందరు సీనియర్ ఎమ్మెల్యేల్లో కొంత నిరాశ, నిస్పృహలు ఉండటం సహజమేనన్నారు. 151 మంది ఎమ్మెల్యేల్లో 26 మందికి మాత్రమే మంత్రి పదవులు వస్తాయన్నారు. అంత మాత్రాన మిగిలిన వారిలో అసంతృప్తి ఉన్నట్లు కాదని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండటమే తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమన్నారు. జగన్ సీఎంగా ఉండటం కంటే తనకు మరే మంత్రి పదవి ముఖ్యం కాదని అన్నారు. తాను జీవించినంత కాలం వైఎస్ జగనే సీఎంగా ఉండాలన్నదే తన కోరిక అని తెలిపారు. చదవండి: (Balineni Srinivas Reddy: జగనన్న మాటే.. వాసన్న బాట) ప్రస్తుత మంత్రివర్గంలో అనుభవం, మేథస్సు ఆధారంగా సీనియర్లకు తిరిగి మంత్రి పదవులు దక్కాయన్నారు. కేబినెట్ విస్తరణ సందర్భంగా అలకలు అనేవి సాధారణమేనని, అవన్నీ క్రమంగా సర్దుకుపోతాయన్నారు. మంత్రి వర్గంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యత లభించినట్లు ఆయన తెలిపారు. -
చరిత్రలో ఏ ఒక్కరికీ దక్కని ప్రాధాన్యం సీదిరి అప్పలరాజు సొంతం
సాక్షి, శ్రీకాకుళం: మంత్రి సీదిరి అప్పలరాజు చరిత్ర సృష్టించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనను మంత్రిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.సమర్థమైన పనితీరు, చక్కటి వాగ్ధాటి ఆయనకు కలిసొచ్చాయి. పలాస నియోజకవర్గ చరిత్రలో ఇంతవరకు ఏ ఒక్కరికీ దక్కని ప్రాధాన్యత సంతరించకుంది. అంతా అనూహ్యమే సీదిరి రాజకీయ ప్రవేశమే అనుహ్యం. వైద్యవృత్తిలో ఉంటూ 2017లో వైఎస్సార్సీపీ ఆహ్వానం మేరకు రాజకీయ అరంగేట్రం చేశారు. పార్టీలో చేరడమే తరువాయి క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించారు. కిడ్నీ రోగుల బాధలు తెలుసుకునేందుకు కవిటి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి, ఆ తర్వాత పలాస నియోజకవర్గకర్తగా నియమితులై రాజకీయాల్లో దూసుకుపోయారు. దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో పాతుకుపోయి ఉన్న నేతల పునాదులు కదిల్చారు. టీడీపీ సీనియర్ నేత గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శిరీషపై 16,247 ఓట్ల అధిక్యంతో తొలి పర్యాయంలోనే రికార్డు విక్టరీ సాధించారు. నేపథ్యం.. పేరు: డాక్టర్ సీదిరి అప్పలరాజు నియోజకవర్గం: పలాస స్వస్థలం: దేవునల్తాడ తల్లిదండ్రులు: దాలమ్మ, నీలయ్య (లేటు) పుట్టినతేదీ: ఫిబ్రవరి 22, 1980 విద్యార్హతలు: ఎండీ జనరల్, ఎంఈడీ సతీమణి: శ్రీదేవి సంతానం: కుమారులు ఆర్నవ్ వర్మ, ఆరవ్ వర్మ జిల్లా: శ్రీకాకుళం రాజకీయ నేపథ్యం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి చిన్నవయసులో 26 ఏళ్లకే విశాఖపట్నం లోని కేజీహెచ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2007 డిసెంబర్ 14న పలాస–కాశీబుగ్గ పట్టణంలో సేఫ్ హాస్పిటల్ స్థాపించి వైద్యుడిగా కొనసాగుతూ దాదాపు 12 సంవత్సరాల పాటు వైద్యునిగా సేవలు అందించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు 2017 ఏప్రిల్ 19న వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో పలాస నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి 60 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన గౌతు కుటుంబంపై విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. జూలై 22, 2020న మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రెండోసారి అవకాశం దక్కించుకున్నారు. చదవండి: (Dharmana Prasada Rao: ఎట్టకేలకు నెరవేరిన ధర్మాన కోరిక) -
ఏపీ మంత్రి వర్గంలోకి నూతనంగా ఎంపికైనవారు(ఫోటోలు)
-
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..
సాక్షి, అమరావతి: కొత్త, పాత కలయికతో 25 మందితో కొత్త మంత్రి వర్గం కూర్పును ఫైనల్ చేశారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో చోటు దక్కింది. నూతన కేబినెట్లో మొత్తం 25 మంది మంత్రులుండగా.. సీనియారిటీ పరంగా 11 మంది మంత్రులను కొనసాగించారు. కొత్తగా మరో 14 మందికి అవకాశం కల్పించారు. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే.. బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు. పాత, కొత్త మంత్రుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. గత కేబినెట్లో మంత్రులుగా ఉండి నూతన జాబితాలో చోటు దక్కించుకున్నవారు.. అంజాద్ భాషా (మైనార్టీ, కడప నియోజకవర్గం) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి, (పుంగనూరు నియోజకవర్గం) బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (రెడ్డి, ఓసీ) కర్నూలు నియోజకవర్గం పినిపె విశ్వరూప్ (మాల, ఎస్సీ) గుమ్మనూరు జయరాం (బోయ, బీసీ) ఆలూరు నియోజకవర్గం నారాయణస్వామి (మాల, ఎస్సీ) గంగాధర నెల్లూరు నియోజకవర్గం బొత్స సత్యనారాయణ (తూర్పుకాపు, బీసీ) తానేటి వనిత (మాదిగ, ఎస్సీ) సీదిరి అప్పలరాజు (మత్స్యకార, బీసీ) వేణుగోపాలకృష్ణ (శెట్టిబలిజ, బీసీ) ఆదిమూలపు సురేష్ (ఎస్సీ, ఎర్రగొండపాలెం నియోజకవర్గం) మంత్రి వర్గంలోకి నూతనంగా ఎంపికైనవారు.. గుడివాడ అమర్నాథ్ (కాపు, ఓసీ) దాడిశెట్టి రాజా (కాపు, ఓసీ) రాజన్నదొర (జాతాపు, ఎస్టీ) ధర్మాన ప్రసాదరావు పొలినాటి (వెలమ, బీసీ) జోగి రమేష్ (గౌడ, బీసీ) అంబటి రాంబాబు (కాపు, ఓసీ) సత్తెనపల్లి నియోజకవర్గం కొట్టు సత్యనారాయణ కారుమూరి నాగేశ్వరరావు (యాదవ, బీసీ) మేరుగ నాగార్జున (మాల, ఎస్సీ) బూడి ముత్యాలనాయుడు (కొప్పుల వెలమ, బీసీ) విడదల రజని (ముదిరాజ్, బీసీ) చిలకలూరిపేట నియోజకవర్గం కాకాణి గోవర్ధన్‌రెడ్డి (రెడ్డి, ఓసీ) సర్వేపల్లి నియోజకవర్గం ఆర్కే రోజా (రెడ్డి, ఓసీ) నగిరి నియోజకవర్గం ఉషశ్రీ చరణ్ (కురబ, బీసీ) కళ్యాణదుర్గం నియోజకవర్గం -
AP Cabinet Reshuffle: కొడాలి నానికి కీలక పదవి
సాక్షి, అమరావతి: ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించనున్నారు. కేబినెట్ హోదాలో ఆయనకు రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డును త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించనున్నారు. చదవండి: (ఏపీ నూతన కేబినెట్.. కొత్త మంత్రులు వీరే..) -
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై బొత్స కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయనగరం: మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే తుది నిర్ణయమని ఆయన అన్నారు. ప్రభుత్వం, పార్టీ రెండింటి కోసం మంత్రి వర్గ కూర్పు ఉంటుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాక్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో వేదికను సిద్ధం చేశారు. ఏప్రిల్ 11, సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయిస్తారు. కాగా 2019 జూన్ 8న కూడా మంత్రులు ఇదే ప్రదేశంలో ప్రమాణ స్వీకారం చేయటం గమనార్హం. చదవండి: (మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తయింది: సజ్జల) -
మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తయింది: సజ్జల
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తయింది. రాత్రి 7 గంటలకు రాజ్‌భవన్‌కు మంత్రుల జాబితాను పంపుతాం' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ తొలిసారి కేబినెట్ కూర్పులో 56 శాతం బలహీనవర్గాల వారే ఉన్నారు. ఈ సారి బలహీనవర్గాల శాతం మరింత పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
AP: కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు!
సాక్షి, అమరావతి: దాదాపు మూడేళ్ల తరవాత పునర్వ్యవస్థీకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు రాబోతున్నారు. ఇప్పటిదాకా ఉన్న కేబినెట్ నుంచి 10 మంది వరకూ... ఆయా జిల్లాల అవసరాలు, సామాజిక కూర్పు, అనుభవం ఆధారంగా ఇకపైనా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్ర కేబినెట్లో అగ్రవర్ణాలకు చెందిన వారు 44 శాతం ఉండగా... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే మెజారిటీ సంఖ్యలో 56 శాతంగా ఉన్నారు. అయితే తాజా పునర్వ్యవస్థీకరణలో బలహీనవర్గాల శాతం మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో చంద్రబాబు నాయుడి కేబినెట్లో 25 మంది మంత్రులకు గాను మెజారిటీ.. అంటే 13 మంది అగ్రవర్ణాల వారుండగా, బలహీనవర్గాలు 12 మందే ఉండి 48 శాతానికే పరిమితమయ్యారు. దానికి భిన్నంగా బలహీనవర్గాలకు పెద్ద పీట వేసి వారిని రాజ్యాధికారంలో మరింత కీలక భాగస్వాములను చెయ్యాలనే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచీ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే 56 శాతం కేబినెట్ బెర్తులు వారికే కేటాయించారు. ఇపుడు ఆ సంఖ్యను మరింత పెంచబోతున్నారు. గవర్నరుకు రాజీనామాలు మంత్రివర్గంలో మొత్తం 25 మంది సభ్యులుండగా ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి మరణించడం తెలిసిందే. మిగిలిన 24 మంది మంత్రులూ పార్టీ బాధ్యతలు తీసుకోవటానికి స్వచ్ఛందంగా రాజీనామా చేయటంతో... వారి రాజీనామాలను ఆమోదించాలని సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు లేఖ పంపారు. వీటిని గవర్నర్ ఆమోదించాక రాజ్‌భవన్ అధికారికంగా ప్రకటన విడుదల చేస్తుంది. అనంతరం కొత్త మంత్రుల జాబితాను సీఎం జగన్.. గవర్నర్‌కు పంపనున్నారు. మంత్రివర్గం కూర్పుపై సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కసరత్తు ఆదివారం మధ్యాహ్నానికి కొలిక్కి వస్తుందని, ఆ వెంటనే కొత్త మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపుతారని వైఎస్సార్సీపీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటిదాకా ఉన్నవారు 10 మంది కొనసాగుతారని, కొత్తగా 15 మంది చేరుతారని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. వారందరికీ ఆదివారం మధ్యాహ్నం గవర్నర్‌కు జాబితా పంపించిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేసి సమాచారమిస్తారని, సోమవారంనాడు అందుబాటులో ఉండాల్సిందిగా చెబుతారని తెలియవచ్చింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాక్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో వేదికను సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయిస్తారు. కాగా 2019 జూన్ 8న కూడా మంత్రులు ఇదే ప్రదేశంలో ప్రమాణ స్వీకారం చేయటం గమనార్హం. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార ఏర్పాట్లను వివిధ శాఖలకు విధులను అప్పగిస్తూ జీఏడీ (రాజకీయ) కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను కూడా సాధారణ పరిపాలన (ప్రోటోకాల్) విభాగం ఇప్పటికే సిద్ధం చేసింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక కొత్త, పాత మంత్రులు, అతిధులకు మధ్యాహ్నాం 1 గంటకు సచివాలయంలో తేనేటీ విందు (హైటీ) ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాస్ ఉంటేనే అనుమతి నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే వారు ప్రభుత్వం జారీ చేసిన అధికారిక పాస్‌లను వెంట తెచ్చుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ పేర్కొన్నారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే సభా స్థలంలోకి అనుమతిస్తామన్నారు. సోమవారం ఉదయం 10 గంటలలోపు రావాలన్నారు. కేవలం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే లోటస్ జంక్షన్ నుంచి కరకట్ట మీదుగా ప్రయాణించేందుకు నిర్ధేశించారని తెలిపారు. గుంటూరు, మంగళగిరి పరిసర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, అభిమానులు, వాహనదారులు ఎన్ఆర్ఐ ఆసుపత్రి జంక్షన్, మంగళగిరి, డాన్‌బాస్కో స్కూల్, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం మీదుగా సభా స్థలికి చేరుకోవాలన్నారు. విజయవాడ, ఇతర జిల్లాల నుంచి వచ్చే వారు ఉండవల్లి సెంటర్, పెనుమాక, కృష్ణాయపాలెం మీదుగా రావాలని చెప్పారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం దృష్ట్యా తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు తదితర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ మేరకు అందరూ సహకరించాలని కోరుతూ శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. -
AP: గవర్నర్ కార్యాలయానికి మంత్రుల రాజీనామాలు
సాక్షి, విజయవాడ: ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో మంత్రులు చేసిన రాజీనామాలు గవర్నర్ కార్యాలయానికి చేరాయి. కాసేపట్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించనున్నారు. కాసేపట్లో గెజిట్ విడుదల కానుంది. చదవండి: (రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు) -
'ఒక్క మాటతో 24 మంది రాజీనామా చేశారు.. అది మా కమిట్మెంట్'
సాక్షి, తాడేపల్లి: మంత్రి పదవులపై నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రిదేనని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం జగన్ ఎటువంటి పని చెప్పినా చేయడానికి నేను సిద్ధం. ప్రభుత్వంలోకి తీసుకుంటారా.. పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా అనేది సీఎం ఇష్టం. ఆయన మాటకు మేమంతా కట్టుబడి ఉంటాం. ఆయన చెప్పగానే 24 మంది మంత్రుల రాజీనామా చేశారు. అది మా కమిట్మెంట్. నాకు మంత్రి పదవి వస్తుందా లేదా అనేది 11వ తేదీన తెలుస్తుంది. నాకు ఏ బాధ్యత అప్పజెప్పినా జగనన్న సైనికుడిలా పనిచేస్తానని' ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు స్పష్టం చేశారు. చదవండి: (ఏపీ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు) -
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతన కేబినెట్ ఏర్పాటుపై కసరత్తు కొనసాగుతుందని.. అన్ని అంశాలను సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లు సజ్జల తెలిపారు. పాత, కొత్త కలయికతో కేబినెట్ ఉంటుందని స్పష్టం చేశారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నం వరకు కసరత్తు కొనసాగుతుందని తెలిపారు. చదవండి: (పాత, కొత్త మంత్రులతో సీఎం జగన్ తేనీటి విందు) కాబోయే మంత్రులకు ఆదివారం ఫోన్ ద్వారా సమాచారం తెలియజేస్తామన్నారు. కేబినెట్లో బీసీలకు, మహిళలకు సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. రాజీనామాలు అందరివీ గవర్నర్ వద్దకు వెళ్తాయని, మళ్లీ కొత్తగా ప్రమాణ స్వీకారం ఉంటుందని సజ్జల తెలిపారు. ఇదిలా ఉండగా, శుక్రవారం రాత్రి సుమారు రెండు గంటల పాటు సీఎం జగన్తోతో సమావేశమైన సజ్జల.. శనివారం మరోసారి భేటీ అయ్యారు. -
ఏపీ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 11న ఉదయం 11 గంటల 31 నిమిషాలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం గవర్నర్, సీఎం జగన్‌తో కలిసి పాత, కొత్త మంత్రులు తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదిలా ఉండగా, ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గతంలోనే గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ని కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. చదవండి: (పాత, కొత్త మంత్రులతో సీఎం జగన్ తేనీటి విందు) -
మంత్రి పదవులు ఎవరెవరికి ??
-
కేబినెట్ భేటీలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
కొత్త మంత్రి వర్గంపై అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
-
మంత్రి పదవికి రాజీనామా అనంతరం బొత్స కీలక వ్యాఖ్యలు
-
రాజీనామా చేసిన మంత్రులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
మంత్రి పదవికి రాజీనామా: స్పందించిన అనిల్‌కుమార్ యాదవ్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ను ఏప్రిల్ 11న పునర్ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుత కేబినెట్లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. గురువారం మంత్రులంతా తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. 'సీఎం జగన్‌కు సైనికుడిగా పనిచేయడమే తనకు అత్యంత ఇష్టమని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. అందరం సమిష్టిగా పనిచేసి 2024లో మళ్లీ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుదని చెప్పారు. అందులో భాగంగానే నేడు మంత్రులంతా చాలా సంతోషంగా రాజీనామాలు చేశామని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. చదవండి: (మంత్రి పదవికి రాజీనామా అనంతరం బొత్స కీలక వ్యాఖ్యలు) రాజీనామాలపై మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. 'మంత్రులందరూ రాజీనామాలు చేశాం. మరికొందరికి మంత్రులుగా అవకాశం లభిస్తుంది. ఇక పార్టీ కోసం పనిచేసే గొప్ప అవకాశాన్ని సీఎం మాకు కల్పిస్తున్నారు. ఇదో గొప్ప అరుదైన క్షణమని' మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. చదవండి: (మంత్రుల రాజీనామా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు) -
అలా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతారు
-
కేబినెట్ లో చర్చించిన కీలక అంశాలు ఇవే: పేర్ని నాని
-
మంత్రి పదవికి రాజీనామా తర్వాత మీడియాతో తానేటి వనిత
-
మంత్రి పదవికి రాజీనామా అనంతరం బొత్స కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: రెండేళ్ల తర్వాత కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందే చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. 'సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని అందరూ ఆనందంగా ఆమోదించారు. సీఎం జగన్ ఏ బాధ్యత అప్పగించిన సమర్థవంతంగా నిర్వహిస్తాం. 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాం. పార్టీని, ప్రభుత్వాన్ని కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తాం. ఎవరిని కొనసాగించాలన్నది సీఎం జగన్ ఇష్టం. సీఎం వైఎస్ జగన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది. మంత్రిగా ఉన్న.. పార్టీలో ఉన్న ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే దానిపై సీఎం ప్రణాళిక ఇస్తారు. పాత కేబినెట్ మాదిరిగానే కొత్త మంత్రి వర్గంలో సామాజిక సమీకరణాలు ఉంటాయి' అని మంత్రి బొత్స అన్నారు. చదవండి: (మంత్రి పదవికి రాజీనామా అనంతరం కొడాలి నాని స్పందన ఇదే..) 'విశాఖ భూములపై టీడీపీ ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఎన్సీసీ భూములపై 2019లో చంద్రబాబు కేబినెట్లో పెట్టారు. కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు జీవో ఇచ్చారు. విశాఖ భూముల్లో తప్పంతా చంద్రబాబుదే. జీవోలు ఇచ్చిన వారిని మీడియా ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పండని' మంత్రి బొత్స అన్నారు. చదవండి: (మంత్రుల రాజీనామా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు) -
కొత్త మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయి
-
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఏప్రిల్ 11న మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతోపాటు, అనేక నిర్ణయాలను తీసుకున్నారు. కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు ఆంధ్రప్రదేశ్ చివరి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌కి అభినందనలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ను సీఎం జగన్ సహా కేబినెట్ మంత్రులు అభినందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మంత్రుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలి విడత కేబినేట్లో అవకాశం ఇచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు.. ఇప్పుడున్న వారంతా పార్టీ బాధ్యతల్లోకి వెళ్తారని, తమకున్న విశేష అనుభవాన్ని పార్టీ కోసం వినియోగించుకోవాలని సూచించారు. అందరికీ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. ఈ కేబినెట్లో ఉన్న మంత్రులందరూ మంచివాళ్లే. మీలో కొందరు మంత్రులుగా కొనసాగుతారన్నారు. భవిష్యత్‌లో మీకెవ్వరికి గౌరవం తగ్గదు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లు మళ్లీ మంత్రులుగా వస్తారని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా, మూడేళ్లపాటు ప్రభుత్వంలో మా బాధ్యతలను మేం నిర్వహించామని మంత్రులు ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్న సంతృప్తి మాలో ఉందని మంత్రులు తెలియజేశారు. ఇక మిగిలిన రెండేళ్లపాటు పార్టీ కోసం పనిచేసి.. పార్టీని పటిష్టం చేస్తామని మంత్రులు సీఎం జగన్‌తో అన్నారు. చదవండి: (ద్వేషించేవాళ్లను ఏం అంటాం?: సీఎం జగన్) -
ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు
-
ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారు
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాలపాటు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఏర్పాటుపై గవర్నర్‌తో సీఎం జగన్ చర్చించారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటును సీఎం జగన్ గవర్నర్‌కి వివరించారు. ఈ నెల 11న మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు గవర్నర్‌కి తెలిపారు. అదే రోజున నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం వైఎస్ జగన్ గవర్నర్‌ను కోరారు. ఇందుకు సంబంధించి నూతన మంత్రుల జాబితా రెండు రోజుల్లో అందజేయనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు రాజ్ భవన్ వద్ద సీఎం వైఎస్ జగన్‌కు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. కాగా, గత వారం రోజులుగా సొంత రాష్ట్రం ఒరిస్సా, ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ మంగళవారం రాత్రే ఢిల్లీ నుంచి విజయవాడ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మంత్రి వర్గ విస్తరణ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం 3 గంటలకి క్యాబినెట్ సమావేశం కానుంది. చదవండి: (‘మాది సంక్షేమ ప్రభుత్వం.. గర్వంగా చెప్పగలం’) -
AP: కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై స్పందించిన మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: కేబినెట్‌పై నాయకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై ఆయన స్పందిస్తూ.. కూర్పు అంటే ఎన్నో సమీకరణాలు ఉంటాయన్నారు. పార్టీ తల్లి లాంటిదని.. అందరం కలిసికట్టుగా ఉంటామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ మాట చెబితే దానికి కట్టుబడి ఉంటామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చదవండి: ‘బూజు పట్టిన టీడీపీ.. బాబుది మళ్లీ అదే పాట’ -
మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బడ్జెట్ ఆమోదం తర్వాత, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మీద కాసేపు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ‘మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తర్వాత పునర్వ్యవస్థీకరిస్తానని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే చెప్పాను. మంత్రివర్గంలో ఉన్న వారికి వేరే బాధ్యతలు అప్పగిస్తాం. మిగతా వారిని మంత్రివర్గంలోకి తీసుకొస్తాం. పార్టీ బాధ్యతలు చూస్తూ ఎక్కువ మంది ప్రజలను రోజూ కలవడాన్ని రాజకీయాల్లో మంచి అవకాశంగా భావించాలి. పార్టీకి సేవ చేసే అవకాశం వస్తే మరింత పెద్ద నాయకులు అవుతారు. ప్రజాదరణ ఉన్న నేతలుగా ఎదుగుతారు. అది పార్టీకీ ఉపయోగమే. మంచి ఆదరణతో గెలిచి వస్తే మళ్లీ మంత్రివర్గంలో అవకాశాలు ఎదురుచూస్తూ ఉంటాయి’ అన్నట్లు తెలిసింది. చదవండి: (మరో ముందడుగు: రూ.2,56,256.56 కోట్లతో వార్షిక బడ్జెట్) -
మార్చి 10 తరువాత ప్రభుత్వంలో పెనుమార్పులు
సాక్షి, ముంబై: మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంలో త్వరలో ప్రక్షాళన జరిగే అవకాశాలున్నాయని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు నానా పటోలే సంకేతాలిచ్చారు. ఆకస్మాత్తుగా పటోలే చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృíష్టించాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో దశలవారీగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వాటి ఫలితాలు వెలువడగానే మార్చి పదో తేదీ తరువాత పెనుమార్పులు జరుగుతాయని భండార జిల్లాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో నానా పటోలే వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీలతో చర్చలు జరిగాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిస్థితులను బట్టి పార్టీకి మరమ్మతులు (ప్రక్షాళన) చేయాల్సిన సమయం వచ్చిందని వారు వ్యాఖ్యానించినట్లు పటోలే వివరించారు. దీంతో మార్చి పదో తేదీ తరువాత ఏం మార్పులు జరుగుతాయనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా మార్చి పదో తేదీన ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడుతాయి. ఆ తరువాత బీఎంసీతోపాటు రాష్ట్రంలోని సుమారు 13 కార్పొరేషన్ల ఎన్నికల షెడ్యూలు ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. అంతకు ముందే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారుచేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో అందరి దృష్టి ఇటువైపు ఉంది. చదవండి: (వివాహ వేడుకల్లో విషాదం: 11 మంది మృతి.. మోదీ సంతాపం) -
రాజస్థాన్ సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా
జైపూర్: రాజస్థాన్‌లో సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా చేశారు. రేపటి క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రులంతా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అదిష్టానం మంత్రి వర్గ జాబితా పంపనున్నట్లు తెలుస్తోంది. -
కేబినెట్ పొందికపై ఇంత చర్చా?
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయడం తెలిసిందే. కొత్తగా 27 మంది ఓబీసీలు, 12 మంది దళితులు, 8 మంది ఆదివాసీలకు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో మొదటిసారిగా కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. మొత్తం మీద తాజాగా కేంద్ర మంత్రిమండలిలో 47 మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎంపీలకు చోటు లభించింది. ఈ 47 మందిలో ప్రధాని కూడా ఉన్నారో లేదో నాకు తెలీదు. కానీ, కేబినెట్లో కొత్తగా చేరిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రుల గురించి జాతీయ మీడియా పదేపదే ప్రస్తావించింది. మరోవైపున రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, హర్షవర్ధన్‌ల రాజీనామాలపై ఇదే మీడియా తెగ బాధపడిపోయింది. ఈ ముగ్గురినీ కేబినెట్ లోంచి తొలగించడాన్ని మన మీడియా ఏమాత్రం జీర్ణం చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రుల గురించి మాట్లాడుతున్నప్పుడు వీరి కులం తప్పనిసరిగా పరిగణించాల్సిన చిహ్నంగా మారిపోయింది. అయితే మోదీ మంత్రివర్గంలోంచి వైదొలిగిన ముగ్గురు ప్రతిభావంతులైన మంత్రుల కుల నేపథ్యం గురించి ఒక్కసారైనా మన మీడియా పేర్కొనలేదు. ఎన్నటికీ పేర్కొనదు కూడా. రవిశంకర్ ప్రసాద్ కాయస్థుడు, ప్రకాష్ జవదేకర్ బ్రాహ్మణుడు, హర్షవర్ధన్ వైశ్యుడు. రవిశంకర్, జవదేకర్ రాజ్యసభ సభ్యత్వం ద్వారానే మంత్రివర్గంలో ప్రవేశించారు. సాధారణంగా జాతీయ మీడియా జాట్, గుజ్జర్, పటేల్, మరాఠా, రెడ్డి (తెలంగాణ నుంచి జి. కిషన్‌రెడ్డి కేంద్ర కేబినెట్లో స్థానం సంపాదించిన ఏకైక రెడ్డి అని గుర్తుంచుకోవాలి), కమ్మ, కాపు, లింగాయత్, వొక్కలిగ, నాయర్, నాయికర్లు, మహిస్యా (బెంగాల్ నుంచి) తదితర పలు కులాలకు చెందినవారిని ఓబీసీ కేటగిరీలో చేరుస్తుంటుంది. అయితే శూద్ర ఓబీసీలు (రిజర్వుడ్, రిజర్వుడ్ కాని వారు కూడా), ఎస్సీలు, ఎస్టీలు కలిసి భారత జనాభాలో 77 శాతంగా ఉన్నారని మనం మర్చిపోకూడదు. వీరిలో 52.2 శాతం మంది ఓబీసీలు (1980 నాటి మండల్ కమిషన్ నివేదిక ప్రకారం) కాగా, 16.2 శాతం మంది ఎస్సీలు, 8.2 శాతం మంది ఎస్టీలు (2001 జనాభా లెక్కల ప్రకారం) ఉంటున్నారు. వీరినుంచి కేంద్ర మంత్రిమండలిలో సగం కంటే ఎక్కువమందికి మంత్రిపదవులు లభిస్తే.. ఇది కూడా ఎందుకింత ప్రతికూల వార్తగా మారిపోతోంది? రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీలోనూ... విదేశాల్లో చదువుకుని వచ్చి (ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ వాలాలు) చేరినవారు ఎవరూ ఒక ఎన్నికలోనూ నేరుగా గెలవలేదు. రాజ్యసభ ద్వారానే వీరు ప్రభుత్వంలో భాగమవుతూ వచ్చారు. కానీ మన జాతీయ మీడియా మాత్రం ఇలాంటివారిని మాత్రమే నిజమైన ప్రజాస్వామ్య ప్రతినిధులుగా పేర్కొంటూ వచ్చింది. కానీ ప్రజాస్వామ్యం పునాది ఏదంటే క్షేత్ర స్థాయి ఎన్నికలే. వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను 1990లో అమలు చేసినప్పుడు మోదీతోసహా ఓబీసీలు బీజేపీలో భాగంగా ఉండేవారు. వీరు మండల్ కమిషన్ జాతి వ్యతిరేక ఎజెండాను కలిగి ఉన్నదని ఆలోచించారు. కానీ ఇది గ్రామీణ వ్యవసాయ, హస్తకళల కమ్యూనిటీల్లో భారీ స్థాయిలో అధికారిక చైతన్యాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ తన ఓబీసీ కార్డును చక్కగా ఉపయోగించుకుని దేశ ప్రధాని కాగలిగారు. కానీ ఓబీసీ, దళిత, ఆదివాసీలకు చోటు లేనిచోట, రాజ్యసభ ద్వారా అధికారాన్ని సాధించుకోవడం కుతంత్రపు రాజకీయాలకు ఒక మార్గంలా మారిపోయింది. మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా, ప్రధానమంత్రిగా వ్యవహరిస్తూ 20 ఏళ్లపాటు పార్లమెంటులో కొనసాగారు. మేధోవర్గానికి చెందినవారిగా పేరొందిన పి. చిదంబరం (కొన్నిసార్లు ఎన్నికల్లో గెల్చినప్పటికీ), జైరాం రమేష్, తదితరుల చరిత్ర కూడా ఇలాంటిదే. రవి శంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్ రాజ్యసభలో హీరోలుగా వెలిగిపోయారు. కాగా వీరికోవకే చెందిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రస్తుతం మోదీ మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఇంగ్లిష్ ప్రెస్‌కి మిత్రులైన బీజేపీ క్యాంప్‌కి చెందిన అరుణ్ జైట్లీ, ప్రమోద్ మహాజన్, అరుణ్ శౌరీలు కూడా ఎన్నడూ ఎన్నికల్లో గెలవలేదు. కానీ రాజ్యసభ ద్వారానే వీరు అగ్రశ్రేణి మంత్రులై ప్రముఖ నేతలుగా మారిపోయారు. అదే సమయంలో శూద్ర, దళిత, ఆదివాసీ నేతలకు ఇలాంటి భాగ్యం ఎన్నడూ సిద్ధించలేదు. అయితే, కేంద్ర మంత్రివర్గంలో చేరిన ఈ 47 మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు చాలావరకు క్షేత్రస్థాయి ఎన్నికల్లోనే గెలుపొందుతూ వచ్చారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఏ పార్టీ పాలనలో అయినా సరే ప్రచ్ఛన్న మేధోతత్వంతో రాజ్యసభ ద్వారా కేంద్ర ప్రభుత్వంలో భాగం కావడం ప్రజాస్వామిక పద్ధతి కానేకాదు. రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్లను నిర్దాక్షిణ్యంగా మంత్రివర్గం నుంచి తొలగించడం ద్వారానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మంత్రులకు అవకాశం దొరికిందని మీడియా తెగ బాధపడిపోతోంది. ఇది ప్రతిభకు అన్యాయం చేయడమేనని మన జాతీయ మీడియా భావిస్తోంది. మన దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఇంగ్లిష్ మాట్లాడే మేధావితనం అనే కదా. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని వచ్చిన శూద్రులకు, ఎస్సీ, ఎస్టీలకు అలాంటి అవకాశాన్ని తోసిపుచ్చడం కూడా ప్రజాస్వామ్యమే. వీరిలో చాలామంది పిల్లలు ప్రభుత్వ బడుల్లోనే చదువుతుంటారు. అలాంటప్పుడు ఎన్నికల వ్యవస్థనే రద్దు చేస్తే సరిపోతుంది కదా. మనం ఇప్పుడు అస్తిత్వాల యుగంలో నివసిస్తున్నాం. వివిధ ప్రజా బృందాలు తమదైన దార్శనికత, సమర్థతతో ప్రజాస్వామ్య పాలనలో భాగం కావాలనే తమ హక్కును ఇప్పుడు నొక్కి చెబుతూ వస్తున్నాయి. విభిన్న సెక్షన్ల ప్రజానీకం ఇప్పుడు ‘సమర్థత’ను విభిన్న అర్థాలతో చూస్తోంది. కమ్యూనిటీ అస్తిత్వాలు అధికారం కోసం మన పాలనకు సంబంధించిన చర్చల బల్లపైకి నిరంతరం తోసుకువస్తూనే ఉంటున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు చాలా కాలంగా కుల, కమ్యూనిటీ అస్తిత్వాలను తొక్కిపెట్టడానికి ప్రయత్నిస్తూ వచ్చాయి. కానీ భవిష్యత్తులో ఈ వ్యూహం పనిచేయదు. కులాన్ని ఒక అస్తిత్వ చిహ్నంగా గుర్తించని కారణంగానే కమ్యూనిస్టు పార్టీలు మన దేశంలో రానురానూ అడుగంటిపోతున్నాయి. భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఏకైక మార్గం ఏదంటే, ఇన్ని సంవత్సరాలుగా ఢిల్లీ అధికార కేంద్రాల్లో పక్కకు నెట్టివేయబడిన పై కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం కల్పించడమే. కులం కీలకమైన సామాజిక ఆర్గనైజర్‌గా ఉంటున్న దేశంలో, సెక్యులర్ ఉదారవాదం అనేది ద్విజ, ఇంగ్లిష్ విద్యావంతులైన కులీనుల చేతిలో అధికారం దుర్వినియోగం కావడంగానే మిగిలిపోయింది. పీడిత కులాలు తమ ఓట్లకున్న అధికార బలం పట్ల చైతన్యవంతంగా ఉంటున్నారని ఆరెస్సెస్, బీజేపీలు ఇప్పుడు గుర్తిస్తున్నాయి. అధికార చట్రంలో తమ ప్రతినిధులకు చోటు లేకపోతే వీరు మరో దారి చూసుకుంటారు కూడా. కాంగ్రెస్‌లో మాత్రం అధికారమనేది ఎప్పుడూ దిగుమతైన మేథావుల చేతుల్లోనే ఉంటూ వచ్చింది కాబట్టి కుల విశ్లేషణను ఎన్నడూ తీవ్రంగా తీసుకోలేదు. వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైన వ్యక్తులను కుల అస్తిత్వం ప్రాతిపదికన మాత్రమే పాలనా వ్యవస్థల్లోకి తీసుకురావాలని నేను సూచించడం లేదు. దళిత బానిసలను పాలనలో, ప్రభుత్వంలో లాంఛనప్రాయంగా చొప్పించడాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ మండల్ అనంతర కాలం... విద్యావంతులైన దళిత, ఆదివాసీ, ఓబీసీ నేతలను, మేధావులను రూపొందిస్తూ వచ్చింది. గతకాలం మహానేతల ఘనతను మాత్రమే భవిష్యత్తు ఇకపై కీర్తించదు. ఇప్పుడు యువ గళాలు మార్పును నిజంగానే తీసుకురావడానికి కంకణం కట్టుకున్నాయని అందరూ గుర్తించాల్సి ఉంది. ప్రొఫెసర్ కంచ ఐలయ్య, షెపర్డ్ వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
Team Modi: బాధ్యతల్లో కొత్త మంత్రులు
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్లో కొత్తగా చేరిన అశ్వినీ వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్, మన్సుఖ్ మాండవియా తదితరులు తమకు కేటాయించిన శాఖల మంత్రులుగా గురువారం బాధ్యతలు చేపట్టారు. మాజీ ఐఏఎస్ అధికారి అశ్వినీ వైష్ణవ్‌కు అత్యంత కీలకమైన రైల్వే శాఖతోపాటు కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖలను కూడా కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించారని అన్నారు. ప్రధాని ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. రైల్వే, టెక్స్టైల్స్ శాఖల సహాయ మంత్రిగా దర్శనా విక్రమ్ జర్దోష్ చార్జ్ తీసుకున్నారు. అనురాగ్ ఠాకూర్ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీ తనకు పెద్ద బాధ్యత కట్టబెట్టారని, చిత్తశుద్ధితో పనిచేస్తానని ఠాకూర్ అన్నారు. ఇక గుజరాత్‌కు చెందిన మన్సుఖ్ మాండవియా ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ బాధ్యతలు స్వీకరించారు. ఉక్కు శాఖ మంత్రిగా రామచంద్రప్రసాద్ సింగ్, న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్, సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రిగా వీరేంద్ర కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఇదే శాఖలో సహాయ మంత్రులుగా ప్రతిమా భౌమిక్, ఎ.నారాయణస్వామి బాధ్యతలు తీసుకున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా జితేంద్రసింగ్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా జి.కిషన్‌రెడ్డి, ఎంఎస్ఎంఈ మంత్రిగా నారాయణ్ రాణే, మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రిగా పురుషోత్తం రూపాల బాధ్యతలు స్వీకరించారు. విద్యా శాఖ సహాయ మంత్రిగా సుభాష్ సర్కార్, మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ముంజపారా మహేంద్రభాయ్ బాధ్యతలు చేపట్టారు. విద్యుత్ శాఖ మంత్రిగా రాజ్‌కుమార్ సింగ్, టెక్స్టైల్ శాఖ మంత్రిగా పీయూష్ గోయల్, పునరుత్పాదక ఇంధన వనరులు, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రిగా భగవంత్ ఖుబా, ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా భగవత్ కిషన్‌రావు కరాడ్, రక్షణ శాఖ సహాయ మంత్రిగా అజయ్ భట్ బాధ్యతలు స్వీకరించారు. -
Mansukh Mandaviya: కొత్త ఆరోగ్య మంత్రికి ట్రోల్స్ వెల్కమ్
ఈరోజుల్లో చదువుతో సంబంధం ఏముందిలే అని చాలామంది అనుకోవచ్చు. కానీ, ఆ అర్హతనే ఆధారంగా చేసుకుని విమర్శిస్తున్న రోజులివి. ముఖ్యంగా రాజకీయాల్లో నేతల ఎడ్యుకేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంటుంది. అలాంటిది.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆఫీస్‌లో అడుగుపెట్టిన మన్షుక్ లక్ష్మణ్ మాండవీయకు ట్రోల్స్ ఆహ్వానం పలుకుతున్నాయి. అందుకు కారణం.. ఆంగ్ల భాషలో ఆయన పరిజ్ఞానం చర్చకు రావడమే. గతంలో ఆయన చేసిన కొన్ని ట్వీట్లలో ఆంగ్లపు అక్షర దోషాలు ఉన్నాయి. మామూలుగా ఒకటి రెండు స్పెల్లింగ్ మిస్టేక్‌లు ఉంటే ఫర్వాలేదు. కానీ, ఏకంగా అర్థం మారిపోయేట్లుగా ఉండడం, కొన్ని చోట్ల స్పెల్లింగ్‌లు దారుణంగా ఉన్నాయి. Tray and tray will be success . — Mansukh Mandaviya (@mansukhmandviya) January 9, 2014 Mr. Rahul Ji, great grand son of Mahatma Gandhi already wrote you that RSS was not at all responsible for death of Gandhiji — Mansukh Mandaviya (@mansukhmandviya) March 10, 2014 ఇక అందుకు సంబంధించి స్రీ్కన్ షాట్స్ కొన్ని నెట్లో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఎంత వరకు ఫేక్ ఉన్నాయో తెలియదు కానీ.. ఒకటి రెండు మాత్రం ఆయన ఒరిజినల్ అకౌంట్‌కు చెందినవే కావడంతో.. మొత్తం నిజమై ఉంటాయని భావిస్తున్నారు. మరికొన్ని డిలీట్ అయి ఉన్నాయి. ఇక గుజరాత్‌కు చెందిన మన్షుక్ మాండవీయ.. ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసినట్లు ఆయన ప్రొఫైల్‌లో ఉంది. మరోవైపు బీజేపీ నేతలు, అభిమానులు మాత్రం మంత్రికి సపోర్ట్‌గా రీట్వీట్లు చేస్తున్నారు. He is our Health of Minister (#MansukhEnglish)🤦🙄#दर्जासमजूनघ्या #mansukhmandaviya @ShivsenaComms #CabinetReshuffle2021 #CabinetExpansion2021 pic.twitter.com/R8tpbEVd4I — 𝐏𝐫𝐚𝐭𝐢𝐤 𝐑𝐚𝐣𝐞𝐧𝐝𝐫𝐚 𝐊𝐚𝐥𝐚𝐬𝐤𝐚𝐫 (@PratiKkalaskar_) July 8, 2021 Several yers back i applied for a job They canceled me because of my Vary good ingles accent... Today me is halth Minister of the Entire duniya 😌#CabinetReshuffle#MansukhEnglish#MansukhMandviya#englishfans — Mansukh मंद | वाया Parody (@PranavThe2nd) July 7, 2021 Mansukh Mandaviya is our Health of Minister pic.twitter.com/mpYMEgI0DQ — Joy (@Joydas) July 7, 2021 -
77మంది మంత్రులతో మోదీ నూతన కేబినెట్
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణ పూర్తయ్యింది. 43 మంది కొత్తవారి ప్రమాణస్వీకారం అనంతరం మొత్తం 77 మంది మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ నూతన కేబినెట్ కొలువు దీరింది. కేంద్ర కేబినెట్లో కొత్తగా 36 మందికి చోటు దక్కగా.. 30 మందికి కేబినెట్ హోదా దక్కింది. బుధవారం జరిగిన కేబినెట్ విస్తరణలో ఏడుగురు పాతవారికి, కొత్తగా 8 మందికి కేబినెట్ హోదా దక్కింది. పాతవారిలో కిషన్‌రెడ్డి, హర్దీప్సింగ్ పూరి, ఆర్కే సింగ్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజుకు కేబినెట్ హోదా దక్కింది. గతంలో వీరు సహాయ మంత్రులుగా పని చేశారు. ఇక కేబినెట్లో అత్యధికంగా యూపీ నుంచి ఏడుగురికి, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాల్ నుంచి నలుగురు చొప్పున కేంద్ర కేబినెట్లో చోటు దక్కగా.. గుజరాత్ నుంచి ముగ్గురికి, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి ఇద్దరు చొప్పున చోటు దక్కించుకున్నారు. అసోం, రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, త్రిపుర, మణిపూర్, తమిళనాడు నుంచి ఒక్కొక్కరికి చోటు దక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం కిషన్ రెడ్డికి మాత్రమే చోటు దక్కింది. ఆయనకు పదోన్నతి లభించింది. -
నా ముందున్న రెండు వ్యూహాలు అవే: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేబినెట్ విస్తరణలో భాగంగా నరేంద్ర మోదీ బీజేపీ నేత కిషన్ రెడ్డికి పదోన్నతి కల్పించారు. గతంలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఈ సారి కేబినెట్ హోదా కల్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నాపై విశ్వాసం ఉంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి అంచనాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తాను" అని తెలిపారు. "నాకు మార్గదర్శనం చేసి మద్దతుగా నిలిచిన అమిత్ షాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమిత్ షా శిక్షణలో క్రమశిక్షణతోపాటు చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇందుకుగాను వారికి కృతజ్ఞుడనై ఉంటాను. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర బీజేపీ సీనియర్ నేతలకు ధన్యవాదాలు తేలియజేస్తున్నాను’’ అన్నారు కిషన్ రెడ్డి. "నవభారత నిర్మాణం కోసం, నరేంద్రమోదీ స్వప్నం సాకారాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ అమరవీరుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వారి కలలు సాకారమయ్యేలా తెలంగాణ అభివృద్ధి కోసం చురుగ్గా పనిచేయడం అనే రెండు వ్యూహాలు ప్రస్తుతానికి నా ముందున్నాయి. నన్ను ఆదరించి పార్లమెంటుకు పంపించిన సికింద్రాబాద్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అన్నారు కిషన్ రెడ్డి. -
మరో ప్రక్షాళన ఉండబోదని అనుకోవద్దు: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: కేబినెట్ విస్తరణలో భాగంగా రాష్ట్రపతి భవన్లో కొత్త కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో కొత్త మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు చేశారు. తనకు హితులు, సన్నిహితులు లేరని తెలిపారు. పనితీరే పదవికి ప్రామాణికం అన్నారు. కష్టపడి పని చేయండి.. ప్రజల్లోకి వెళ్లండి అని సూచించారు. మరో ప్రక్షాళన ఉండబోదని అనకోవద్దని మోదీ కొత్త మంత్రులకు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటి వరకు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కిరణ్ రిజిజు, కిషన్ రెడ్డి, మన్సుక్ మాండవ్య వంటి వారికి పదోన్నతి లభించగా.. మిగతవారంతా కొత్తవారు. గతంలో సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఈ సారి కేబినెట్ హోదా దక్కింది. దాంతో తెలంగాణ బీజేపీ శ్రేణులు సంబంరాలు జరుపుకుంటున్నారు. -
కేబినెట్ విస్తరణ: ప్రమాణ స్వీకారం చేసిన 43 మంది మంత్రులు వీరే
సాక్షి, న్యూఢిల్లీ: కేబినెట్ విస్తరణ కోసం మోదీ ప్రభుత్వం తీవ్ర కసరత్తే చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు.. గడిచిన ఎన్నికలు, పనితీరు, సామాజిక కూర్పు, మహిళా కోటా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కేబినెట్ విస్తరణ చేశారు. పాత, కొత్త వారిని కలుపుకుని మొత్తం 43 మందికి కేబినెట్లో చోటు కల్పించారు. వీరంతా బుధవాంర ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల జాబితా..... 1. నారాయణ రాణె (మహారాష్ట్ర మాజీ సీఏం) 2.సర్వానంద్ సోనోవాల్ (అసోం మాజీ సీఎం) 3.వీరేంద్రకుమార్ 4.జ్యోతిరాదిత్య సింధియా 5. రామచంద్రప్రసాద్ సింగ్ 6.అశ్వినీ వైష్ణవ్ 7.పశుపతి పారస్ 8.కిరణ్ రిజిజు 9.రాజ్ కుమార్ సింగ్ 10.హర్దీప్ సింగ్ పూరీ 11.మన్సుక్ మాండవ్య 12.భూపేంద్ర యాదవ్ 13.పురుషోత్తం రూపాలా 14.కిషన్ రెడ్డి 15.అనురాగ్ ఠాకూర్ 16.పంకజ్ చౌధురి 17.అనుప్రియా పటేల్ 18.సత్యపాల్‌సింగ్ బాగెల్ 19.రాజీవ్ చంద్ర శేఖర్ 20.శోభా కరంద్లాజే 21.భానుప్రతాప్ సింగ్ వర్మ 22.దర్శన విక్రమ్ జర్దోష్ 23.మీనాక్షి లేఖి 24.అన్నపూర్ణా దేవి యాదవ్ 25.నారాయణ స్వామి 26.కౌశ్ల కిషోర్ 27.అజయ్ భట్ 28.బీఎల్ వర్మ 29.దేవ్‌సింహ్ చౌహాన్ 30.భగవంత్ ఖుబా 31.కపిల్ పాటిల్ 32.ప్రతిమ భౌమిక్ 33.సుభాష్ సర్కార్ 34.కిషన్‌రావు కరాద్ 35.రాజ్‌కుమార్ రంజన్‌సింగ్ 36.భారతీ ప్రవీణ్ పవార్ 37.బిశ్వేశ్వర్ 38.శాంతను ఠాకూర్ 39.మహేంద్ర భాయ్ 40.జాన్ భర్లా 41.ఎల్.మురుగన్ 42.నిశిత్ ప్రామాణిక్ 43. అజయ్ కుమార్ -
‘రాజీనామా చేయమన్నారు.. బాధగా ఉంది’
కోల్‌కతా: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో బాబుల్ సుప్రియో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బాబుల్ సుప్రియోతో పాటు మరో 14 మంది మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజీనామాపై స్పందిస్తూ.. బాబుల్ సుప్రియో ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు. తాను రాజీనామా చేశానని.. ఇన్నాళ్లు తనకు మంత్రిగా పని చేసే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞత తెలియజేశారు. ఈ సందర్భంగా బాబుల్ సుప్రియో తన ఫేస్బుక్లో ‘‘అవును.. పొగ ఉందంటే.. తప్పకుండా ఎక్కడో ఓ చోట మంట ఉన్నట్లే.. విషయం తెలిసిన దగ్గర నుంచి నా మీడియా మిత్రులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు.. కానీ అందరితో మాట్లాడటానికి కుదరడం లేదు. అవును మంత్రుల మండలికి నేను రాజీనామా చేశాను. నేను ముందు చెప్పినట్లుగానే.. నన్ను రాజీనామా చేయమని కోరారు.. చేశాను. మంత్రుల మండలిలో సభ్యుడిగా ఉండి.. దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు గౌరవనీయులైన ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అన్నారు. ‘‘ఈ రోజు నా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. అందుకే వారు 2019లో అత్యధిక మెజారిటీతో తిరిగి నన్ను గెలిపించారు. బెంగాల్ నుంచి మంత్రులగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నా సహచరుల పేర్లు ప్రస్తుతం నేను బయటకు చెప్పలేను.. కానీ వారి గురించి అందరికి తెలుసు. వారందరికి నా అభినందనలు. రాజీనామా విషయంలో నేను బాధపడుతున్నాను.. కానీ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వారి పట్ల చాలా సంతోషిస్తున్నాను’’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని అనూహ్యంగా పునర్వ్యవస్థీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 15 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. డాక్టర్ హర్షవర్ధన్, సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, అశ్విన్ చౌబే, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, బబుల్ సుప్రియో, ప్రతాప్ సారంగి రాజీనామా చేసినవారిలో ఉన్నారు. వచ్చే ఏడాది జరిగే శాసన సభ ఎన్నికలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, సామాజిక వర్గాలు వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. -
జ్యోతిరాదిత్య సింధియాకే కేంద్ర కేబినెట్ బెర్త్ ఖరారు
-
జ్యోతిరాదిత్యకు బెర్త్ ఖరారు.. అనుప్రియకు కూడా
న్యూఢిల్లీ: బీజేపీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాకి కేంద్ర కేబినెట్ బెర్త్ ఖరారైనట్లు సమాచారం. జ్యోతిరాదిత్యతో పాటు అప్నాదళ్ నేత అనుప్రియ పటేల్, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణరాణెకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకుంటున్నారు. ఇక వీరితో పాటు సునీత దగ్గల్, బీఎల్ వర్మ, భూపేంద్ర యాదవ్, అనురాగ్ ఠాకూర్, మీనాక్షి లేఖి, అజయ్ భట్, శోభా కర్లందాజే, ప్రీతం ముండే, శంతను ఠాకూర్, కపిల్ పటేల్ సైతం ప్రస్తుతం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌కు పయనమవుతున్నారు. ముగ్గురు సహాయమంత్రులకు ప్రమోషన్? కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వతంత్ర హోదాతో శాఖ బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర వ్యవసాయ, పంచాయతీరాజ్ సహాయమంత్రి పురుషోత్తం రూపాలకు ప్రమోషన్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. -
జూలై 8న కేంద్ర కేబినెట్ విస్తరణ.. 5 రాష్ట్రాలకే ప్రాధాన్యం?
-
ప్రధాని మోదీ నివాసంలో జరగాల్సిన కీలక భేటీ రద్దు
-
క్లైమాక్స్‌లో కేబినెట్ విస్తరణ.. భేటీ రద్దు?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఈ వారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని పలువురు ఎంపీలకు అధిష్టానం సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అస్సాం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు ఎంపీలు హస్తినకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ తో ఈ సాయంత్రం ప్రధాని చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలు లక్క్ష్యంగా ఈ విస్తరణ ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ సహా మొత్తంగా 54 మందితో ఉన్న మంత్రి మండలిలో మరో 25 మందిని చేర్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్వతంత్ర హోదా, సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ఇప్పుడున్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించనున్నట్టు సమాచారం. మొత్తంగా ఏడుగురిపై వేటు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రుల భేటీ రద్దు? ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం జరగాల్సిన మంత్రుల భేటీ రద్దైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. మంగళ, గురువారం ప్రధాని పాల్గొనబోయే భేటీలు రద్దైనట్లు పీఎంవో నుంచి ఓ ప్రకటన వెలువడిందని ఆ కథనాల సారాంశం. బీజేపీ చీఫ్‌తో పాటు అమిత్ షా సహా మంత్రులు ఈ భేటీకి హాజరవుతారనే ఆశిస్తుండగా.. ఒకవేళ నిజంగా రద్దు అయితే తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇంకోవైపు ప్రధాని నరేంద్ర మోదీ-బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి సంతోష్ భేటీ మాత్రం యథావిధిగా కొనసాగనుందని మరో కథనం వెలువడుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారంలోనే జరగాల్సిన కేబినెట్ విస్తరణ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. -
మంత్రివర్గ విస్తరణ: ముహూర్తం కుదిరేనా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు దాటుతున్నా ఈ వ్యవహారంపై ఇంకా సందిగ్ధత నెలకొనడంతో ఆశావహుల్లో టెన్షన్ అధికమవుతోంది. మంత్రిపదవులు ఆశిస్తున్నవారంతా ముహూర్తపు లెక్కలు చూసుకుంటున్నారు. సంక్రాంతిలోపు మంచి రోజులున్నాయా? ఉంటే ఎప్పుడు? ఒకవేళ సంక్రాంతిలోపు ముహూర్తాలు లేకుంటే తర్వాత ఎప్పుడున్నాయి వంటి వివరాలను ఆరా తీస్తున్నారు. రాజకీయ నేతలతోపాటు అధికార వర్గాల్లో ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ సాగుతోంది. సాధారణంగా సంక్రాంతికి ముందు నెల రోజులు మంచి రోజులు ఉండవనే చర్చ నడుస్తోంది. అయితే, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈసారి సంక్రాంతికి పది రోజుల ముందు వరకు మంచి రోజులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్గశిర అధిక మాసం వచ్చిందని, అందువల్ల జనవరి 4 వరకు మంచి రోజులు ఉన్నాయని వివరిస్తున్నారు. ఆ తర్వాత పుష్యమాసం మొదలై ఫిబ్రవరి 7 వరకు ఉంటుంది. ఆ రోజులలో ముహూర్తాలు ఉండవు. ఈ నేపథ్యంలో జనవరి 4వ తేదీలోపే మంత్రివర్గ విస్తరణ జరపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలోపు జరగకపోతే ఫిబ్రవరి 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వీలుపడదు. కాంగ్రెస్ నుంచి చేరికలున్నాయా? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లను గెలుచుకుని భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన లావుడ్య రాములునాయక్ టీఆర్ఎస్లో చేరడంతో పార్టీ బలం 90కి చేరింది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేరే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి చేరికల తర్వాత ఉండే జిల్లాల సమీకరణాల ఆధారంగా కేబినెట్ కూర్పు ఉంటుందని సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంప్రదాయం ప్రకారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలవాల్సి ఉంటుంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 21న శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హైదరాబాద్‌కు రానున్నారు. మూడు రోజుల బస అనంతరం 24న తిరిగి ఢిల్లీ వెళ్తారు. రాష్ట్రపతి పాల్గొనే కొన్ని కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉంటుంది. ఇలా పలు కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరులో నాలుగు రోజులు, జనవరి మొదటి వారంలో నాలుగు రోజులు మాత్రమే మంత్రివర్గ విస్తరణ చేయడానికి అనువుగా కనిపిస్తున్నాయి. 4న పంచాయతీ నోటిఫికేషన్? హైకోర్టు తీర్పు నేపథ్యంలో జనవరి 10వ తేదీలోపు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం జనవరి 4న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే అప్పటి నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. ఇక అది ముగిసే వరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి వీలుండదు. అంటే ఎలా చూసినా, జనవరి 4లోపు మాత్రమే కేబినెట్ విస్తరణకు అవకాశం కనిపిస్తోంది. కాగా, ఫిబ్రవరిలో ఎలాగూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని, వాటి కోసం అనివార్యంగా కేబినెట్ విస్తరణ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తమ్మీద మరో రెండుసార్లు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ అధిష్టానం వర్గాలు చెబుతున్నాయి. తొలి విడతలో ఆరుగురు లేదా ఎనిమిది మందిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. -
తొలివిడత కేబినెట్.. ఆ అష్ట దిగ్గజాలెవరు?
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : రాష్ట్రంలో నూతన మంత్రివర్గ కూర్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ కేబినెట్లో ఎవరెవరికి బెర్తు లభిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ నెలాఖరులో దాదాపు 8 మందితో తొలివిడత మంత్రివర్గం కొలువుదీరనుందన్న వార్తల నేపథ్యంలో సీనియర్లు, జూనియర్లలో ఎందరిని అదృష్టం వరిస్తుందనే ప్రశ్న రాజకీయ వేడిని పెంచుతోంది. అలాగే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాజా మాజీ మంత్రులు ఎంత మంది ఎంపీలుగా పోటీ చేస్తారన్న అంశంపైనా టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కేసీఆర్ ఒకవేళ తొలి మంత్రివర్గ విస్తరణలో 8 మందికే అవకాశం కల్పిస్తే వారిలో రెడ్డి, వెలమ సామాజికవర్గాల నుంచి ఇద్దరేసి చొప్పున, వెనుకబడిన తరగతుల నుంచి ఇద్దరికి, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి చొప్పున అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. మరోవైపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను కూడా తొలి విస్తరణ సమయంలోనే భర్తీ చేయాలని సీఎం యోచిస్తుండటంతో 11 మందికి ఈ నెలాఖరున లేదా జనవరి మొదటి వారంలో కేబినెట్ పదవులు లభించనున్నాయి. రేసులో ఉన్నది ఎవరు...? తొలి విడత మంత్రివర్గ విస్తరణలో తాజా మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావుకు కచ్చితంగా అవకాశం లభించనుంది. ఎన్నికలకు ముందు పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించగా పార్టీ బాధ్యతలు మోయడంతోపాటు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటేనే హామీల అమలు సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కూడా విశ్వసిస్తున్నారు. అలాగే ఈ సామాజికవర్గం నుంచి మరొకరికి రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని అంటున్నారు. గత మంత్రివర్గంలో ఉన్న జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్) ఈసారి ఎన్నికల్లో ఓడిపోవడంతో అదే సామాజిక వర్గానికి చెందిన వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈసారి మంత్రివర్గంలో తప్పనిసరిగా బెర్త్ దొరుకుతుందని పార్టీ వర్గాల్లోనూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక రెడ్డి సామాజికవర్గం నుంచి ఇద్దరికి తొలి మంత్రివర్గ విస్తరణలోనే స్థానం దక్కే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ నుంచి ఒకరు, దక్షిణ తెలంగాణ నుంచి ఇద్దరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజా మాజీ మంత్రులు జి. జగదీశ్‌రెడ్డి, సీహెచ్ లక్ష్మారెడ్డిలకు మొదటి విస్తరణలో అవకాశం దక్కుతుందని అంచనా. నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి రెండో విడత విస్తరణలో అవకాశం దక్కవచ్చని అంటున్నారు. ‘ఈ టర్మ్‌లో కచ్చితంగా గుత్తాకు అవకాశం లభిస్తుంది. అది తొలి విస్తరణలోనా లేక మలి విస్తరణా అనేది మాత్రం చెప్పలేం’అని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు చెప్పారు. మలి విస్తరణలో రెడ్డి సామాజికవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిలలో ఇద్దరికి అవకాశం రావచ్చు. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వెనుకబడ్డ తరగతుల నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మున్నూరు కాపు వర్గానికి, దక్షిణ తెలంగాణ నుంచి యాదవ వర్గానికి చాన్స్ దక్కవచ్చు. ఈ కోటాలో హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్‌కు చాన్స్ ఉంది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు మిస్ అయినా జోగు రామన్న లేదా బాజిరెడ్డి గోవర్ధన్‌కు మొదటి విడతలో అవకాశం రావచ్చంటున్నారు. ఈ విస్తరణలో అవకాశం లేకపోయినా మలివిడత విస్తరణలో వెనుకబడ్డ తరగతులకు చెందిన ఇతర వర్గాలకు అవకాశం ఇస్తే హైదరాబాద్ నుంచి పద్మారావుగౌడ్, వరంగల్ నుంచి దాస్యం వినయ్ భాస్కర్ పేర్లు కూడా వినపడుతున్నాయి. ఇక ఎస్సీ వర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ కోటాలో మలివిడత విస్తరణలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌తోపాటు చెన్నూరు నుంచి గెలిచిన బాల్క సుమన్ లేదా మానకొండూరు నుంచి రెండోసారి గెలిచిన రసమయి బాలకిషన్‌కు అవకాశం లభించవచ్చని అంటున్నారు. ఎస్టీ వర్గం నుంచి వరంగల్ జిల్లాకు చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేరు వినిపిస్తోంది. మంత్రివర్గంలో మహిళకు అవకాశం కల్పించాలని భావిస్తే ఖానాపూర్ నుంచి రెండోసారి గెలిచిన అజ్మీరా రేఖానాయక్ పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. స్పీకర్ పదవికి పోచారం లేదా పద్మా దేవేందర్‌రెడ్డి... ఈసారి శాసనసభాపతి స్థానానికి సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, పద్మాదేవేందర్‌రెడ్డిల పేర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఏ కారణాల వల్ల అయినా పోచారం, ఈటల పేర్లు స్పీకర్ పదవికి పరిశీలించకపోతే తొలి విస్తరణలో వారికి మంత్రులుగా అవకాశం దక్కుతుందని అంటున్నారు. ‘ప్రభుత్వంలో ఎవరు ఏ పాత్ర పోషించాలన్నది ముఖ్యమంత్రి నిర్ణయం. ఏ అవకాశం వచ్చినా ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తేవడమే నా ముందున్న లక్ష్యం’అని ఈటల తన సన్నిహితులతో పేర్కొన్నారు. పోచారం, ఈటలకు మంత్రివర్గంలో స్థానం దొరికితే మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి స్పీకర్‌గా పదోన్నతి లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. స్పీకర్‌గా మహిళకు అవకాశం ఇస్తే మంత్రివర్గంలో మహిళలు లేకపోయినా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం ఉంది. అలాగే డిప్యూటీ స్పీకర్‌గా కొప్పుల ఈశ్వర్, దాస్యం వినయ్ భాస్కర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు. ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన 30 మంది టీఆర్ఎస్ తరఫున గెలవడంతో వారిలో కొందరికి ఇతర నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్చించవచ్చంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత మలివిడత మంత్రివర్గ విస్తరణతోపాటు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. -
మినీ కేబినెట్.. నెలాఖరుకే!
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈసారి తనదైన శైలిలో ముందుకెళ్లనున్నారు. మంత్రివర్గ కూర్పు, విస్తరణ, ముఖ్య శాఖలకు అధికారుల ఎం పిక, అభివృద్ధి పనుల పురోగతి లాంటి అంశాల్లో కచ్చితత్వంతో ఉండాలని, మొహమాటాలకు పోకుండా నిబద్ధత, పనితీరు ఆధారంగానే నిర్ణ యాలు తీసుకోవాలని ఆయన యోచిస్తున్నారు. అం దులో భాగంగానే మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని ఆచితూచి చేపట్టాలని నిర్ణయించుకున్న కేసీఆర్... ఈ నెలాఖరు నాటికి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతలో 6 నుంచి 8 మందికే మంత్రులుగా అవకాశం కల్పిస్తారని, లోక్‌సభ ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయిలో కేబినెట్‌ను కేసీఆర్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ నెలాఖర్లో అసెంబ్లీ తొలి సెషన్ ఏర్పాటు చేసి అప్పుడే ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని, అంతకు ముందు తొలి విడత మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అలాగే కీలక శాఖలకు అధికారుల నియామకాన్ని కూడా ఆయన చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేరాలంటే ముఖ్యమైన శాఖలకు పాలనాదక్షత ఉన్న అధికారులే ఉండాలనే కోణంలో ఆయన ఆలోచిస్తున్నారు. ఈలోగా సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టడం, మిషన్ భగీరథ పూర్తి, కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల అభివృద్ధి ప్రణాళికలపై ఆయన దృష్టి పెట్టనున్నారు. కేబినెట్‌కు తొందరేం లేదు... మంత్రివర్గ విస్తరణకు తొందరేం లేదనే భావనలో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం వివిధ శాఖల్లో నెలకొన్న పరిస్థితులను, భవిష్యత్తులో చేయాల్సిన పనులను ముఖ్యమంత్రి బేరీజు వేస్తున్నారు. దీనికితోడు రాజకీయంగా జరిగే పరిణమాలను కూడా ఆయన అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన 88 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకుతోడు పార్టీలో చేరిన ఇద్దరు స్వతంత్రులు, ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను కలిపితే మొత్తం 97 మంది శాసనసభ్యులు అధికారపక్షం వైపే ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారిలో దాదాపు 12 మంది సభ్యులు తమతో కలవడానికి ఇప్పటికే రాయబారాలు పంపారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏ క్షణమైనా కనీసం 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ విస్తరణకు తొందర పడాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి సీఎం కేసీఆర్ వచ్చినట్లు తెలిసింది. సీఎం అభిప్రాయం మేరకు ఈ నెలాఖరు నాటికి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. అది కూడా తొలి విడతలో 6 నుంచి 8 మందిని మాత్రమే మంత్రులుగా తీసుకోవచ్చని సమాచారం. పనితీరే ప్రాతిపదిక... ఈసారి మంత్రివర్గ ఏర్పాటును ముఖ్యమంత్రి ఆషామాషీగా తీసుకోవట్లేదని, వివిధ రకాల సమీకరణాల మేరకు కాకుండా ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు ప్రజల అవసరాలు తీర్చే విధంగా పరిపాలన జరిగేలా మంత్రులను నియమించాలనే భావనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది. వ్యక్తుల కోసం కాకుండా పని కోసం మంత్రులను నియమించాలని, నూటికి నూరు శాతం విధేయులనే ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ధృడ నిర్ణయం తీసుకున్నారని సీఎంవో వర్గాల్లో చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాలు, ఆవశ్యకతల జోలికి పోకుండా, మొహమాటాలకు తావు లేకుండా కేవలం పనితీరు ప్రాతిపదికగానే మంత్రివర్గ సహచరులను నియమించుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. కొత్త ఎమ్మెల్యేల పదవీకాలం ప్రారంభం... ఎన్నికల్లో గెలిచినప్పటికీ ప్రమాణం చేసిన తర్వాతే ఎమ్మెల్యే అయినట్లనే విశ్లేషణలు సరైనవి కావని, గెజిట్ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే ఎమ్మెల్యేల పదవీకాలం ప్రారంభమైనట్లేనని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో ఒక సభ్యుడిగా రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహించడానికి మాత్రమే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని అంటున్నాయి. గతంలోనూ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన చాలా రోజుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలున్నాయి. 2014లో ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగి మే 16న ఫలితాలు వెలువడితే జూన్ 9న అంటే 23 రోజుల తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే అది మరింత ఆలస్యమయింది. గతంలో కూడా అనేకసార్లు ఎమ్మెల్యేల ప్రమాణం రోజుల తరబడి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి అంత తొందర పడాల్సిన అవసరం లేదనే భావనలో ప్రభుత్వ వర్గాలున్నాయి. ప్రస్తుత హడావుడి ముగిశాక ఈ నెలాఖరు నాటికి అసెంబ్లీని సమావేశపరచి సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలూ అప్పుడే నిర్వహించాలని కేసీఆర్నిర్ణయించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పెండింగ్ కార్యక్రమాలపై దృష్టి... మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక కార్యక్రమాలు నిర్వహించేలోగా గత మూడు నెలలుగా అవాంతరం కలిగిన అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ గాడినపెట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా సమీక్షలు ప్రారంభించిన ఆయన... మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. దీంతోపాటు మిషన్ భగీరథ పూర్తి, కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల అభివృద్ధి ప్రణాళికలపై ఆయన దృష్టి పెట్టనున్నారు. వీటన్నింటితోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. అలాగే ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 21న శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ వస్తుండటంతో ఆయన పాల్గొనే కార్యక్రమాల్లో సీఎం పాల్గొనున్నారు. ఈ హడావుడి ముగిశాక నెలాఖరులో అసెంబ్లీ తొలి సెషన్ నిర్వహించాలని, అప్పుడే మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. -
ఐబీ నుంచి స్మృతి ఇరానీ ఔట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. సమాచార ప్రసార (ఐ అండ్ బీ) శాఖ నుంచి స్మృతి ఇరానీని తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ శాఖను అదే శాఖలో సహాయమంత్రిగా ఉన్న రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు స్వతంత్ర హోదాతో అప్పగించారు. దాంతో, ఇక ఇరానీ టెక్స్టైల్ శాఖ మంత్రిగా మాత్రమే కొనసాగనున్నారు. స్మృతి ఇరానీని కీలక మంత్రిత్వ శాఖ నుంచి తొలగించడం ఇది రెండోసారి. గతంలో మానవ వనరుల అభివృద్ధి (హెచ్చార్డీ) శాఖ నుంచి కూడా ఆమెను తొలగించి, టెక్స్టైల్ శాఖను ఇచ్చిన విషయం తెలిసిందే. పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. రైల్వే మంత్రి పియూష్ గోయల్‌కు తాత్కాలికంగా ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి సోమవారం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జైట్లీ కోలుకునేంత వరకూ గోయల్ ఆ పదవిలో కొనసాగుతారు. ఎస్ఎస్ అహ్లూవాలియాకు తాగునీరు, పారిశుద్ధ్య శాఖ సహాయ మంత్రి స్థానంలో ముఖ్యమైన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను అప్పగించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆల్ఫోన్స్ కన్నథానం ఇకపై పర్యాటక శాఖ సహాయమంత్రిగా మాత్రమే కొనసాగుతారు. గత సంవత్సరం జూలైలో ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడంతో వెంకయ్య నాయుడు సమాచార ప్రసార శాఖ మంత్రిగా రాజీనామా చేశారు. దాంతో వెంకయ్య నాయుడు స్థానంలో స్మృతి ఇరానీ నియమించారు. కానీ పలు సందర్భాలలో ఇరానీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. తాజాగా, నకిలీ వార్తలు రాసే జర్నలిస్ట్‌లపై కేసులు నమోదు చేసి, శిక్షించాలనే నిబంధనలతో ఆమె జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. చివరకు ప్రధాని మోదీ ఆదేశాలతో ఆ ఉత్తర్వులను ఆమె వెనక్కు తీసుకున్నారు. -
జమ్మూకాశ్మీర్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ
-
ట్విట్టర్లో నిన్న అదే హాట్ టాఫిక్
సాక్షి, న్యూఢిల్లీ : పలు సీనియర్ మంత్రిత్వ శాఖల్లో భారీగానే మార్పులు చేపడుతూ ఆదివారం ప్రధాని మోదీ ప్రభుత్వం చేపట్టిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ట్విట్టర్ మారుమోగిపోయింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై 4 లక్షలకు పైగా సంభాషణలు ట్విట్టర్లో చోటుచేసుకున్నాయి. దేశంలో ఏదైనా ప్రజాసంబంధమైన వ్యవహారాలను చర్చించడానికి ట్విట్టర్ కీలక ప్లాట్‌ఫామ్‌గా ఉంటూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ నిన్న జరిగిన పునర్వ్యవస్థీకరణపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పాపులర్ హ్యాష్ట్యాగ్స్గా #కేబినెట్రీషఫుల్, #టీమ్మోడీ, #మోడీ2019 కేబినెట్, #మినిస్టరీ4న్యూఇండియాలు ఉన్నాయి. ఆదివారం చేపట్టిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో తొమ్మిది మంది కొత్త మంత్రులు పదవి బాధ్యతలు చేపట్టారు. వారిలో కీలక రక్షణ శాఖను నిర్మలా సీతారామన్‌కు కేటాయించారు. అంతేకాక పీయూష్ గోయల్‌కు రైల్వేమంత్రిత్వ శాఖను, రైల్వే శాఖ నుంచి సురేష్ ప్రభును వాణిజ్య, పరిశ్రమల శాఖకు కేటాయించారు. తొలిసారి ఓ మహిళ ఫుల్‌టైమ్ రక్షణ శాఖ మంత్రిగా పదవి చేపట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు శుభకాంక్షల వెల్లువ కొనసాగింది. -
అచ్ఛేదిన్ ఎప్పుడన్న శివసేన..
ముంబయిః కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పట్ల అసంతృప్తిగా ఉన్న బీజేపీ మిత్రపక్షం శివసేన మరోసారి బీజేపీపై మండిపడింది. మోడీ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు దాటినా ప్రయోగాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ప్రజలు మాత్రం మంచిరోజుల కోసం ఇంకా వేచిచూస్తూనే ఉన్నారని పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో శివసేన వ్యాఖ్యానించింది. మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ, శాఖల కేటాయింపు బీజేపీ అంతర్గత వ్యవహరమని, అయితే ఇది జాతీయ భద్రత, దేశ అభివృద్ధిపై ప్రభావం చూపితే తాము మౌనంగా ఉండబోమని హెచ్చరించింది. మోడీ, అమిత్ షాలు తమకు నచ్చిన వారికి మంత్రులుగా పట్టం కట్టారని వ్యాఖ్యానించింది. కొందరిని వయోభారం పేరుతో కేబినెట్ నుంచి తప్పించారని, అయితే వారి యువ మంత్రులు సైతం కొందరు సరైన పనితీరు కనబరచలేదని పెదవివిరిచింది. ‘నోట్ల రద్దు పూర్తిగా విఫలమైంది... ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రబలుతున్నాయి...ప్రజలకు మౌలిక వసతులూ అందుబాటులో లేకుండా పోయాయి' అని సంపాదకీయం మోడీ సర్కార్‌ను దుయ్యబట్టింది. -
నిర్మలా ఎంపిక.. అద్భుతం
సాక్షి, న్యూఢిల్లీ: వ్యూహాత్మకతను పాటిస్తూ కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. శాఖల కేటాయింపులో రాబోయే ఎన్నికలను పరిగణనలోకి తీసుకున్నారన్నది స్పష్టమౌతోంది. అన్నింటికి మించి రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్‌కు బాధ్యతలు అప్పగించటం మాత్రం చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే ఆ విషయంలో మోదీ చాలా అద్భుతమైన నిర్ణయం చేపట్టారని అంటున్నారు మాజీ సైన్యాధికారి పీకే సెహగల్. ‘నాకు తెలిసి ఇది చాలా తెలివైన ఎంపిక. కఠోర శ్రమ, పైగా గుర్తింపు ఉన్న నేతగా నిర్మలాకు పేరుంది. రక్షణ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తనను తాను ఆమె నిరూపించుకుంటారన్న నమ్మకం ఉంది’ అని సైన్య నిపుణులైన సెహగల్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తన పాలనలో అంతా తాత్కాలిక రక్షణ మంత్రులనే నియమించటం చూశాం. సమర్థవంతమైన మంత్రి లేకపోవటంతో కీలక నిర్ణయాలను తీసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ప్రపంచ యుద్ధాలను సైతం ఎదుర్కునేలా ఆ శాఖ పటిష్టంగా ఉండాలి. అయితే అధికారులకు, సైన్యానికి మధ్య సమన్వయం లోపిస్తే అది ఏళ్ల తరబడి ప్రభావం చూపే అవకాశం ఉందని సెహగల్ అభిప్రాయపడ్డారు. కాగా, ఆదివారం నిర్వహించిన కేబినెట్ పునర్వ్యస్థీకరణలో నిర్మలా సీతారామన్‌కు రక్షణ శాఖ పగ్గాలు కట్టబెట్టిన విషయం తెలిసిందే. కర్ణాటక తరపున రాజ్యసభ సభ్యురాలిగా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సెప్టెంబర్ 6న నిర్మలా సీతారామన్ జైట్లీ నుంచి రక్షణ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. -
నిర్మల ప్రమోషన్‌పై జైట్లీ ఏమన్నారంటే....
న్యూఢిల్లీః రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్‌కు మోదీ కేబినెట్లో అత్యంత కీలక శాఖ దక్కడంపై పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు. ఇప్పటివరకూ రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలనూ చూసిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్మలకు శుభాకాంక్షలు తెలిపారు. రక్షణ మంత్రిగా సరైన వారసురాలు లభించారని వ్యాఖ్యానిస్తూ మంత్రిత్వ శాఖ ఆశయాల సాధనలో మున్ముందుకు వెళతారని ఆకాంక్షించారు. రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్ త్వరలో బాధ్యతలు చేపడతారని చెప్పారు. మెరుగైన పనితీరుతోనే ఆమెకు అత్యున్నత బాధ్యతలు దక్కాయని జైట్లీ పేర్కొన్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో నిర్మలకు రక్షణ మంత్రిత్వ శాఖ దక్కడమే ప్రాధాన్యత కలిగిన అంశమని అన్నారు. ప్రతి మంత్రిత్వ శాఖ, మంత్రుల పనితీరును ప్రధాని నరేంద్ర మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారనేందుకు ఇది విస్పష్ట సంకేతమన్నారు. -
నితీశ్ తలరాత ఇంతే:లాలూ
సాక్షి, పట్నా: కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ బీజేపీ-మిత్రపక్షాల నడుమ చిచ్చుపెట్టిందా? లేదా? అన్నది తేలటానికి కాస్త సమయం పట్టేలా కనిపిస్తున్నప్పటికీ విపక్షాలు మాత్రం ఆ సందర్భాన్ని వాడేసుకుంటున్నాయి. ముఖ్యంగా తమతో దోస్తీ కటీఫ్ చేసుకుని మరీ మోదీ వెంట వెళ్లిన నితీశ్‌పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సెటైర్లు వేశారు. ‘కావాల్సిన వాళ్లను వదులుకుని ఆయన వారి వెంటపడ్డారు. కనీసం ప్రమాణ స్వీకారానికి కూడా ఆహ్వానించలేదు. అది నితీశ్ తలరాత’ అంటూ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాలూ పేర్కొన్నారు. రెండు బెర్తులు ఇచ్చేందుకు ఎన్డీయే కూటమి ముందుకు వచ్చినప్పటికీ నితీశ్ మూడు పదవులను డిమాండ్ చేశారని ఓ సమాచారం అందుతోంది. అందుకు బీజేపీ నిరాకరించటంతో నితీశ్ అలకబూనారని, అనవసరంగా ఎన్డీయే కూటమిలో చేరామని బాధపడుతున్నారంటూ రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. ఇక ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందకపోవటంపై జేడీ(యూ), శివసేనలు పునర్వ్యవస్థీకరణ బీజేపీకి సంబంధించిందేగానీ ఎన్డీయేది కాదంటూ ఆ పార్టీ నేతలు కేసీ త్యాగి, సంజయ్ రౌతులు పేర్కొనటం విశేషం. అయితే నాలుగో దశ విస్తరణలో జేడీ(యూ)తోపాటు అన్నాడీఎంకేకు చోటు దక్కవచ్చనే సంకేతాలు ఇప్పటికే అందుతున్నాయి. -
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. శివ సేన ఫైర్
సాక్షి, ముంబై: కేంద్ర మంత్రి పునర్వ్యవస్థీకరణపై శివ సేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కొత్త కేబినెట్లో మిత్రపక్షం శివ సేనకు ప్రధాని మోదీ మొండిచేయి ఇచ్చిన విషయం తెలిసిందే. మేం ఎవరినీ ఏం అడుక్కోం.. ఆ పరిస్థితి మాకు అక్కర్లేదంటూ పార్టీ అధిష్టానం వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇక కార్యక్రమానికి గైర్హాజరవుతున్నట్లు శివ సేన ప్రకటించింది. ఇక ముందు నుంచి ఊహిస్తూ వస్తున్నట్లు మరో మిత్ర పక్షం జేడీ(యూ)కు కొత్త మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. రెండు స్థానాలు ఖాయమని రామ్‌నాథ్ ఠాకూర్, ఆర్సీపీ సింగ్‌లకు బెర్తులు దక్కవచ్చని ముందు నుంచి చెబుతున్నప్పటికీ, చివరి నిమిషంలో వారి పేర్లు చేర్చేలేదు. మంత్రి వర్గ విస్తరణపై మీడియా ద్వారానే సమాచారం తెలిసిందని ఆ పార్టీ అధినేత నితీశ్ కుమార్ వ్యాఖ్యానించటం కొసమెరుపు. మరోవైపు నాలుగో విస్తరణలో జేడీయూతోపాటు అన్నాడీఎంకేకు చోటుదక్కచని సమాచారం. మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు. -
కొత్త మంత్రులు.. ఆ నలుగురు మాత్రం స్పెషల్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్లో కొత్తగా అడుగుపెట్టబోతున్న తొమ్మిది మందిలో నలుగురు వ్యక్తుల పేర్లు ప్రత్యేకంగా వినిపిస్తున్నాయి. సమర్థవంతమైన అధికారులుగా పేరున్న వీరి బయోడేటాను ఓసారి పరిశీలిస్తే... హర్దీప్ సింగ్ పూరి: ఇండియన్ ఫారిన్ సర్వీస్ మాజీ అధికారి. ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు 1974 బ్యాచ్‌కు చెందిన హర్దీప్ ఐక్యరాజ్యసమితిలో ఇండియా తరపున శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ థింక్ థాంక్‌కు చైర్మన్‌గా, న్యూయార్క్‌లోని అంతర్జాతీయ శాంతి సంస్థకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్ ఇండియా తరపు ప్రతినిధిగా, కౌంటర్ టెర్రరిజం కమిటీకి చైర్మన్‌గా కూడా ఆయన పని చేశారు. కేజే అల్ఫోన్స్: ‘విధ్వంసకార అధికారి’గా ఆయనకు పేరుంది. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్‌గా విధులు నిర్వహించిన సమయంలో అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపటంతో ఆయనకు ఆ పేరు వచ్చిపడింది. అటుపై కేరళ కొట్టాయంలో పలు అభివృద్ధి పనులను చేయటం ఆయన ట్రాక్ రికార్డులో నమోదయ్యింది. కేరళ 1979 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆల్ఫోన్స్ 2006 లో సర్వీస్‌కు గుడ్ బై చెప్పి సీపీఐ(ఎం) మద్ధతుదారుడిగా కంజిరాపల్లి నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే ఐదేళ్ల తర్వాత ఆయన బీజేపీలో చేరిపోయారు. ఆరెస్సెస్-క్రిస్టియన్ గ్రూపుల మధ్య సంధానకర్తగా ఆయన వ్యవహరించారు కూడా. రాజ్‌కుమార్ సింగ్(ఆర్కే సింగ్): 1975 ఐఏస్ బ్యాచ్‌కు చెందిన రాజ్‌కుమార్. హోం సెక్రటరీగా(2011-13) విధులు నిర్వహించారు. 2014 లో బీజేపీలో చేరిన ఆయన బిహార్‌లోని ఆర్రా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సిబ్బంది, పింఛన్లు, ప్రజా ఫిర్యాదులపై ఏర్పాటైన వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా పని చేశారు. మొదట్లో బీజేపీతో ఆయన సత్సంబంధాలు అంతగా లేవు. 1990లో సమస్తిపూర్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన సమయంలో అప్పటి బిహార్ ముఖ్యమంత్రి లాలూ ఆదేశాలతో.. అయోధ్య రథయాత్రను అడ్డుకుని మరీ అద్వానీని సింగ్ అరెస్ట్ చేశారు. అంతేకాదు 2015 బిహార్ ఎన్నికల సమయంలో క్రిమినల్స్ కు సీట్లు కేటాయించటంపై బహిరంగంగానే అసంతృప్తిని వెల్లగక్కి అధిష్ఠానం దృష్టిలో్ నిజాయితీపరుడిగా ముద్ర పడిపోయారు. సత్యపాల్ సింగ్: మహారాష్ట్ర కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి. పెద్ద గుండాగా తనని తాను అభివర్ణించుకుంటూ కమిషనర్‌గా ఆయన ముంబైని గడగడలాడించారు. సంచలనం సృష్టించిన ఇష్రాత్ జహన్ ఎన్కౌంటర్ కేసును 2011 జూన్‌లో ప్రభుత్వం సింగ్‌కు అప్పజెప్పింది. అయితే తోటి అధికారులతో విభేదాల మూలంగా ముందుకు సాగలేనని ముక్కుసూటిగా చెప్పేసి ఆయన విచార బృందం నుంచి బయటకు వచ్చేశారు. ఏపీ, మధ్యప్రదేశ్‌లలో నక్సలైట్ల నియంత్రణకు కృషిచేసినందుకు 1990లో ప్రత్యేక సేవా పతకాన్ని అందుకున్నారు. 2014లో బీజేపీలో చేరిన ఆయన ఉత్తర ప్రదేశ్ లోని బాగ్పత్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ పై ఆయన విజయం సాధించటం విశేషం. హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా, లాభదాయక పదవుల సంయుక్త కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ నలుగురికి ప్రమోషన్.. రక్షణశాఖ ఎవరికి? మోదీ కేబినెట్‌కు కొత్తరక్తం -
తెలుగు రాష్ట్రాలకు కేబినెట్లో చోటు దక్కలేదా!
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కే అవకాశాలు లేవా.. తాజా పరిణామాలు గమనిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ చోటు దక్కే అవకాశాలు లేవు. తాజా విస్తరణలో మొత్తం 9 మందికి అవకాశం కల్పించనున్నారు. అయితే ఈ దఫా కేబినెట్లోకి సీనియర్ మాజీ అధికారులకు అవకాశం కల్పించనున్నట్లు శనివారం రాత్రి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ అవకాశం కల్పించలేని పరిస్థితులలో ప్రస్తుతం సహాయ మంత్రి హోదాలో కొనసాగుతున్న నిర్మలా సీతారామన్‌కు తాజా మార్పు చేర్పులలో కేబినెట్ హోదా కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా భేటీలో కొత్త మంత్రుల పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే పార్టీ నుంచి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. కొత్త మంత్రులు వీరే.. కొత్తగా కేబినెట్లో చోటు దక్కించుకున్న వారిలో శివ ప్రతాప్ శుక్లా (యూపీ), అశ్వినికుమార్ చౌబే (బిహార్), వీరేంద్ర కుమార్ (మధ్యప్రదేశ్), అనంతకుమార్ హెగ్డే (కర్ణాటక), గజేంద్రసింగ్ షేఖావత్ (రాజస్థాన్), రాజ్ కుమార్ సింగ్ (మాజీ ఐఏఎస్), హర్దిప్ సింగ్ పూరి (మాజీ దౌత్యవేత్త), సత్యపాల్ సింగ్ (ముంబై మాజీ పోలీస్ కమిషనర్), అల్ఫాన్స్ (కేరళ) లు ఉన్నారు. వారికి ఏయే శాఖలు కేటాయిస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. తెలుగు రాష్ట్రాలకు నిరాశే..! తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి చోటు దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించినా చివరికి కేంద్రం మొండిచేయి చూపినట్లు తెలుస్తోంది. ఓవైపు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాజీనామా అనంతరం ఇద్దరు తెలుగు వారికి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) చోటు దక్కుతుందని ప్రచారం జరిగినా తాజా జాబితా విడుదలతో తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం కరువైంది. అన్యూహ్య పరిణామాలు జరిగితే తప్పా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికి కేబినెట్లో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. -
హుటాహుటిన ఢిల్లీకి బీజేపీ ఎంపీ..!
-
నాకేం సమాచారం అందలేదు: సీఎం
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినా.. ఎన్డీయే మిత్రపక్షాలు జేడీయూ, అన్నాడీఎంకే కేంద్ర మంత్రిమండలిలో చేరడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల బీజేపీతో చేతులు కలిపిన జేడీయూ, అన్నాడీఎంకేలకు కేంద్ర మంత్రిమండలిలో అవకాశం దక్కనుందని ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పటివరకు కొత్తగా కేబినెట్లో చేరే మంత్రులు ఎవరన్నది స్పష్టత రాలేదు. ఈ విషయమై జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మీడియా ప్రశ్నలకు బదులిచ్చారు. 'కేబినెట్ విస్తరణ గురించి మాకు ఎలాంటి సమాచారం అందలేదు. మీడియా ద్వారా మాకు తెలుస్తోంది' అని నితీశ్ మీడియాకు తెలిపారు. తమ పార్టీ ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా, తమ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం తమకు అందలేదని జేడీయూ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇక, అన్నాడీఎంకే కూడా కేంద్ర కేబినెట్లో చేరే అవకాశం కనిపించడం లేదు. సీఎం పళనిస్వామితో టీటీవీ దినకరన్ వర్గం తిరుగుబాటు చేయడంతో అన్నాడీఎంకేలో సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నేపథ్యంలో అన్నాడీఎంకేకు కేంద్ర కేబినెట్ విస్తరణలో అవకాశం ఉండకపోవచ్చునని వినిపిస్తోంది. ఇక మరో మిత్రపక్షం శివసేన కూడా కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో అసంతృప్తిగానే కనిపిస్తోంది. విస్తరణలో తమ సభ్యులకు చోటు కల్పించే విషయమై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. -
విస్తరణ: హుటాహుటిన ఢిల్లీకి బీజేపీ ఎంపీ..!
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ హరిబాబు హుటాహుటిన శనివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం గమనార్హం. కుటుంబసభ్యులతో కలిసి ఆయన విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర కేబినెట్ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనకు చోటు దక్కనుందని తాజా సమాచారం. బీజేపీ అధిష్టానవర్గం నుంచి అందని సమాచారం మేరకే హరిబాబు ఢిల్లీ విమానం ఎక్కినట్టు చెప్తున్నారు. ఆదివారం ఉదయం కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్నప్పటికీ ఇప్పటికీ కొత్తగా ఎవరూ కేబినెట్లో చేరనున్నారు? ఎవరెవరికి ఏ పదవులు దక్కనున్నాయి? అనేదానిపై స్పష్టత రాలేదు. ఇప్పటికే కేబినెట్ విస్తరణకు వీలు కల్పించేందుకు పలువురు కేంద్రమంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా ఎవరికి అవకాశం లభిస్తుందనే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీ నుంచి హరిబాబు లేదా గోకరాజు గంగరాజుకు అవకాశం కల్పించవచ్చునని వినిపించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ నుంచి వెదిరె శ్రీరామ్ లేదా మురళీధర్‌రావుకు అవకాశం లభించవచ్చునని సమాచారం. -
అవినీతిపై మోదీ ఆగ్రహం కేంద్రమంత్రి రాజీనామా!
-
ఆ కేంద్రమంత్రి రాజీనామా వెనుక కొత్త కోణం
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రిమండలి విస్తరణ నేపథ్యంలో పెద్దసంఖ్యలో పలువురు కేంద్రమంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ అధిష్టానం సూచన మేరకు మంత్రులంతా స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు ఇప్పటివరకు అంతా అనుకున్నారు. కానీ, ఓ కేంద్ర మంత్రి రాజీనామా వెనుక ఆసక్తికర కోణం ఉన్నట్టు తాజాగా తెలిసింది. అవినీతి ఆరోపణలతోనే సదరు మంత్రిపై వేటు వేసినట్టు సమాచారం. ఈ మధ్య అవినీతి కేసులో నలుగురు కేంద్ర ప్రభుత్వ అధికారులను సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టైన అధికారులను సీబీఐ విచారించగా.. సదరు మంత్రిగారి అవినీతి బాగోతం బయటపడింది. కాల్ డాటా, ఫోన్ సంభాషణలను పరిశీలించి మరీ సీబీఐ ఆయన అవినీతిని ధ్రువీకరించుకుంది. ఈ వ్యవహారం తన దృష్టికి చేరడంతో సదరు మంత్రిపై ప్రధాని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ బాగోతం బయటపడకముందే రాజీనామా చేయాలని ఆయనను ప్రధాని మోదీ ఆదేశించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారని కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆ మంత్రి అవినీతి వ్యవహారం పూర్తిగా బయటకు రాలేదు. అవినీతి రహిత పాలన విషయంలో ప్రధాని మోదీ దృఢనిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. తన కేబినెట్లో ఎవరూ అవినీతికి పాల్పడినా సహించేది లేదని ఆయన ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ కేంద్రమంత్రి రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో అమిత్ షా భేటీ!
న్యూఢిల్లీ: మరికొద్ది గంటల్లో మంత్రులుగా ప్రమాణం చేయనున్నవారి జాబితాకు సంఘ్ ఆమోదం కూడా లభించినట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గురువారం రాత్రి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిసి, ఈ మేరకు జాబితాను ఆయన ముందుంచినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ విషయాన్ని బీజేపీగానీ, ఆర్‌ఎస్‌ఎస్‌గానీ ధృవీకరించలేదు. ఆరెస్సెస్ సమన్వయ సమావేశాల నిమిత్తం యూపీలోని బృందావన్‌లో ఉన్న భగవత్ వద్దకు వెళ్లిన అమిత్ షా.. దాదాపు రెండు గంటలపాటు భేటీ అయ్యారని, ఆర్ఎస్ఎస్, బీజేపీ సీనియర్ నేతలైన రామ్‌లాల్, సురేశ్ సోనీ, కృష్ణ గోపాల్, భయ్యాజీ జోషి, దత్తాత్రేయ హోసబలే తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం.శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న అమిత్‌షా.. ఆర్ఎస్ఎస్ పెద్దలతో భేటీ వివరాలను వెల్లడించనున్నట్లు తెలిసింది. -
విస్తరణ వేళ: అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ
-
విస్తరణ వేళ: అరుణ్ జైట్లీతో కేసీఆర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. కేంద్ర కేబినెట్ విస్తరణ కోసం హస్తినలో చురుగ్గా అడుగులు పడుతున్న వేళ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీలో జైట్లీని కలువడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. టీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్ర కేబినెట్లో చేరే అవకాశముందని ఊహాగానాలు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు, కేంద్ర కేబినెట్ విస్తరణకు ఎలాంటి సంబంధం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం రక్షణశాఖ భూములు అప్పగించాలని కోరుతూ సీఎం కేసీఆర్ జైట్లీని కలిశారని, ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు, కేంద్ర కేబినెట్ విస్తరణ అంశాలు చర్చించలేదని సీఎంవో వర్గాలు స్పష్టం చేశాయి. ప్యాట్నీ-శామీర్‌పేట్, ప్యారడైజ్-బోయిన్పల్లి ఫ్లైఓవర్ కోసం రక్షణశాఖ భూములు ఇవ్వాలని, సికింద్రాబాద్‌లో నూతన సచివాలయ నిర్మాణానికి భూసేకరణలో సహకరించాలని సీఎం కేసీఆర్ జైట్లీతో భేటీ అయ్యారని ఆ వర్గాలు చెప్పాయి. మూడు రోజుల పర్యటన కోసం సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి దేశ రాజధానికి చేరుకున్న సంగతి తెలిసిందే. -
కేంద్ర కేబినెట్: రేసులోకి తెలుగు వ్యక్తి
న్యూఢిల్లీ: తాజాగా చేపట్టనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరిద్దరికి ప్రాతినిధ్యం లభించే అవకాశం కనిపిస్తోంది. తాజాగా రేసులోకి జలవనరుల నిపుణుడు వెదిరె శ్రీరామ్ రెడ్డి వచ్చినట్టు సమాచారం. భువనగిరికి చెందిన వెదిరె శ్రీరామ్‌రెడ్డి కేంద్ర జలవనరులశాఖ సలహాదారుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. పవిత్ర గంగానది పునరుజ్జీవనం కోసం పనిచేస్తున్నారు. 15 ఏళ్ల పాటు అమెరికాలోని బహుళజాతి కంపెనీ (ఎమ్మెన్సీ)లో పనిచేసిన ఆయన 2014లో బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రిపదవికి దత్తాత్రేయ రాజీనామా చేయడంతో సెంట్రల్ కేబినెట్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం లేనట్టయింది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత మురళీధర్‌రావు పేరు ప్రముఖంగా వినిపించినా.. తాజాగా రేసులోకి వెదిరె శ్రీరామ్ రెడ్డి కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హరిబాబుకు కేంద్ర కేబినెట్లో చాన్స్ ఇవ్వడంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. -
కేబినెట్లో కొత్త ముఖాలు ఎందుకు?!
►2018లో 5 రాష్ట్రాలకు ఎన్నికలు ►ఆయా రాష్ట్రాలకు పెద్ద పీట ►కులాల ఈక్వేషన్లు ప్రధానమే ►అన్నిప్రాంతాలకు ప్రాతినిధ్యం? న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మంత్రివర్గాన్ని 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో పునర్ వ్యవస్థీకరిస్తున్నారు. దాదాపు 12మందిని తొలగించి.. అదే స్థాయిలో కొత్తవారిని తీసుకోవడంతో పాటు ప్రస్తుత మంత్రివర్గ శాఖలలో మార్పులు, చేర్పులు చేయన్నారు. మంత్రివర్గంలోకి పెద్ద ఎత్తున కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకే ఇలా మోదీ-షా ఇలా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కొత్తవారిని కేబినెట్లో చేర్చుకునే దానిపై నాలుగు ప్రధాన కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాంతీయ అసమానతలు దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మరికొన్నింటికి ఇవ్వలేదు అనే వాదన చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు కొత్తవారికి మోదీ చోటు కల్పిస్తున్నారు. ప్రధానంగా యూపీ విషయానికి వస్తే ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు పూర్వాంచల్ వాసులే. పశ్చిమ యూపీ నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో పశ్చిమ యూపీకి ఈ విస్తరణలో అవకాశం కల్పించవచ్చు. ఇక తమిళనాడు ఏఐఏడీఎంకేకు ఉభయసభల్లో 50మంది సభ్యులున్నారు. వీరికి విస్తరణలో పదవులు లభించే అవకాశం ఉంది. రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. మోదీ ప్రభుత్వంలో ఇప్పటివరకూ రాజస్థాన్‌కు కేబినెట్ ర్యాంక్ లేదు.. కానీ ఈ రాష్ట్రం నుంచి బీజేపీ 25 స్థానాల్లో విజయం సాధించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఈ విస్తరణలో పెద్దపీట వేయనున్నారు. కులాల ఈక్వేషన్లు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో జాట్లు, సిక్కులు గెలుపోటములను తీవ్ర ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఢిల్లీలోని బవానా శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బీజేపీ ఓటమికి ప్రధాన కారణం జాట్లే. ఈ నేపథ్యంలో జాట్లకు తగిన ప్రాతినిథ్యం కల్పించే వీలుంది. మంత్రుల పనితీరు వరుస రైలు ప్రమాదాలకు బాధ్యత వహించిన సురేష్ ప్రభు తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన్ను రక్షణ లేదా పర్యావరణ శాఖకు మార్చే అవకాశం ఉంది. ఇక ఉపరితల రవాణా శాఖ మంత్రిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న నితిన్ గడ్కరికీ రైల్వే శాఖ అదనంగా కేటాయించవచ్చు. అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ, నరేంద్ర సింగ్ తోమర్ రెండుమూడు శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఇందులో అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖకే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. -
కేంద్ర కేబినెట్: రేసులోకి తెలుగు వ్యక్తి
-
వారికి ఎర్త్...వీరికి బెర్త్...
న్యూఢిల్లీ: రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రదాని నరేంద్ర మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై దృష్టిసారించారు. ఎన్నికలకు ముందు ఇదే చివరి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కావడంతో పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు నడిపించేలా సమర్థులైన టీమ్ కోసం మోదీ కసరత్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నగుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటకల నుంచి పలువురికి మోదీ కేబినెట్లో చోటు కల్పించవచ్చని, నిర్మలా సీతారామన్ వంటి వారిని పార్టీ కార్యకలాపాల కోసం కేటాయించవచ్చని భావిస్తున్నారు. ఇక పార్టీ సిద్ధాంతకర్త, ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన రామ్‌మాధవ్‌కు కేబినెట్ బెర్త్ దక్కేఅవ కాశం ఉంది. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో కుల, ప్రాంతీయ సమీకరణల కన్నా ప్రతిభ, సామర్థ్యానికే మోదీ పెద్దపీట వేస్తారని చెబుతున్నారు. ఎన్నికల్లోగా తక్షణ ఫలితాలు అందించగల సమర్థుల వైపు మోదీ మొగ్గుచూపారు. వ్యవసాయం, భారీ, మధ్యతరహా పరిశ్రమలు, నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధి వంటి శాఖలను పరిగెత్తించగల బలమైన నాయకులను మోదీ ఎంచుకున్నట్టు భావిస్తున్నారు. ఆదివారం కొలువు దీరే కేబినెట్లో కొత్త భాగస్వాములు జేడీ(యూ), ఏఐఏడీఎంకే నేతలకు చోటు దక్కనుంది. ఏఐఏడీఎంకే కేబినెట్లో చేరితే ఆ పార్టీ నుంచి తంబిదురై, కే వేణుగోపాల్‌కు అవకాశం లభించవచ్చు. జేడీ(యూ) నుంచి కనీసం ఇద్దరు మంత్రివర్గంలో చేరవచ్చు. -
ప్రధాని మోదీ చైనా వెళ్లడానికి ముందే...
-
మోదీ.. ‘పీ’ అండ్ ‘ఎన్’ ఫార్ములా..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కొద్ది రోజుల్లో మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరణ వార్తలు వచ్చాయి. అందులో భాగంగా శుక్రవారం ఉదయం ఐదుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రధానికి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. అయితే, మంత్రులను రాజీనామా చేయమరని కోరడానికి ప్రధాని ప్రత్యేక ఫార్ములాను వినియోగించినట్లు తెలిసింది. అదే పీ అండ్ ఎన్ ఫార్ములా. ఏంటీ ఫార్ములా..? ప్రధాని మోదీ తన మంత్రి వర్గాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్న అనంతరం.. ప్రత్యేకంగా ఒక ఎక్సెల్ షీట్ రూపొందించుకున్నారు. అందులో మంత్రివర్గంలోని ప్రతి మంత్రి పేరు పొందుపరిచారు. ప్రతి ఒక్కరి పనితీరుకు సంబంధించిన విశ్లేషణ చేసే సమయంలో.. పీ(P) లేదా ఎన్(N) అని మోదీ రాశారని తెలిసింది. పీ అక్షరం పడ్డ మంత్రులు మంత్రివర్గంలో కొనసాగుతారని, ఎన్ అనే అక్షరం పడ్డవారే ఇప్పుడు రాజీనామా చేశారని సమచారం. పీ అండ్ ఎన్ అంటే..! చాలామందికి అంతు పట్టని ఈ ఫార్ములా చాలా చిన్నదే.. ‘పీ’ అంటే.. పాజిటివ్.. ‘ఎన్’ అంటే నెగిటివ్ అని అర్థం. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో.. ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది. కేంద్రమంత్రుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఏడుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాజీనామా చేసిన వారిలో రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఉమా భారతి, కల్ రాజ్ మిశ్రా, ఫగ్గన్ సింగ్, సంజీవ్ బలియన్, మహేంద్ర పాండేలు ఉన్నారు. నిర్మలా సీతారామన్, మహేంద్ర పాండే, గిరిరాజ్ సింగ్‌లు కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. శనివారం కేబినెట్ విస్తరణ జరుగనుండగా.. జేడీయూ నుంచి ఒకరు లేదా ఇద్దరికి మంత్రి పదవులు లభించనున్నాయి. కాగా, రాజీనామా చేసిన మంత్రుల స్థానాన్ని జేడీయూ, అన్నాడీఎంకేకి చెందిన నేతలతో భర్తీ చేయాలని ఎన్డీఏ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత మంత్రుల్లో ఐదుగురికి పదోన్నతి లభించనుందని సమాచారం. పనితనం ఆధారంగా ఈ ప్రయోషన్లు దక్కనున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, సదానంద గౌడ, మేనకా గాంధీల శాఖలు మారే అవకాశముందని సమాచారం. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్‌లకు పదోన్నతి దక్కతుందని అంటున్నారు. గడ్కరీకి రైల్వే శాఖ అప్పగించి.. సురేష్ ప్రభుకు పర్యావరణ శాఖను అప్పజెప్పనున్నారని తెలుస్తోంది. అదనపు బాధ్యతలు మోస్తున్న పలువురు కేంద్రమంత్రులకు విస్తరణలో ఉపశమనం లభించనుంది. కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేసిన వాళ్లకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. రాజీవ్ ప్రతాప్ రూడీకి బిహార్ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. మహేంద్ర పాండేను ఇప్పటికే యూపీ బీజేపీ చీఫ్‌గా నియమించారు. కల్ రాజ్ మిశ్రా వయసు 75 ఏళ్లు దాటడంతో ఆయన్ను గవర్నర్‌గా పంపే అవకాశముంది. -
రాజీనామాపై ఉమాభారతి నో కామెంట్స్
సాక్షి, న్యూఢిల్లీ: రాజీనామా వార్తల నేపథ్యంలో కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతి స్పందించారు. ఆ అంశంపై తనకు ఎలాంటి సమాచారం లేదని, కామెంట్ కూడా చేయబోనని ఆమె చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదంటూ పేర్లతోసహా సంకేతాలు అందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా ఆయా మంత్రులను సంప్రదిస్తూ వస్తోంది. రాజీవ్ ప్రతాప్ రూడీ గురువారమే రాజీనామా చేయగా, తన నిర్ణయం కాదని.. అధిష్టానం ఆదేశాలమేరకే తాను రాజీనామా చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశ దక్కిందని, ఇప్పుడు పార్టీకి సేవలు చేస్తానని రూడీ తెలిపారు. మరో మంత్రి మహేంద్ర నాథ్ పాండేను యూపీ బీజేపీ అధ్యక్ష పదవి అప్పజెప్పగా, తదనంతరం ఆయన రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి పదవికి సంజీవ్ బల్యన్ కూడా రాజీనామా చేసినట్లు సమాచారం. వీరంతా అధిష్టానం ఒత్తిడి మూలంగానే రాజీనామా చేస్తున్నారా? అన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇక మంత్రి వర్గ విస్తరణలో కొత్తగా జేడీ(యూ) కు రెండు బెర్త్‌లు దక్కే అవకాశం ఉంది. మోదీ కొత్త టీంకు ముహుర్తం? -
రేపే విస్తరణ..?
-
రేపే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ!
రూడీ రాజీనామా, మరో ఐదుగురు కూడా.. న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ప్రధాని మోదీ చైనా పర్యటనకు ముందే సెప్టెంబర్ 2 సాయంత్రం కేబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. కేబినెట్లో మార్పులు చేర్పులకు వీలుగా గురువారం రాత్రి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పరిశ్రమల శాఖ(స్వతంత్ర హోదా) మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ రాజీనామా సమర్పించారు. రాజీనామా చేసిన వారిలో జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కల్రాజ్ మిశ్రా, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రులు సంజీవ్ బలియాన్, మహేంద్ర పాండే కూడా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరో 8 మంది కేంద్ర మంత్రుల్ని కలిసి కేబినెట్ విస్తరణపై చర్చించారు. అనంతరం ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బిహార్‌కు చెందిన జేడీయూకు కేబినెట్లో చోటు కల్పించేందుకే రూడీ రాజీనామా చేసినట్లు సమాచారం. రూడీకి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా కేబినెట్ విస్తరణలో జేడీయూతో పాటు అన్నాడీఎంకేకి కూడా చోటు కల్పించనున్నట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో ఉమాభారతి రాజీనామా సమర్పించినట్లు భావిస్తున్నారు. పాండే యూపీ బీజేపీ చీఫ్‌గా నియమితులవడంతో ఆయన కూడా రాజీనామా చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో రక్షణ, పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖ, పర్యావరణ శాఖలకు పూర్తి స్థాయి మంత్రులు లేరు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికవడం, అనిల్ దవే మరణం, మనోహర్ పరీకర్ గోవా సీఎంగా వెళ్లడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. పునర్వ్యవస్థీకరణలో భాగంగా విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌ల శాఖల మార్పు జరగొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కారీకి రైల్వే శాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. -
రేపే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ!
-
అమిత్ షా నివాసంలో కీలక భేటీ!
-
అమిత్ షా నివాసంలో కీలక భేటీ!
కేంద్ర కేబినెట్‌ను విస్తరించే అవకాశం న్యూఢిల్లీ: త్వరలోనే కేంద్ర మంత్రిమండలిని విస్తరించే అవకాశముందన్న ఊహాగానాల నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నివాసంలో కీలక సమావేశం జరిగింది. గురువారం జరిగిన ఈ భేటీకి కేంద్రమంత్రులు హాజరయ్యారు. రెండు, మూడు రోజుల్లో కేంద్ర కేబినెట్‌ను విస్తరించే అవకాశముందని ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. బిక్స్ సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనకు వెళుతున్నారు. చైనా నుంచి ఆయన నేరుగా మయన్మార్ వెళుతారు. సెప్టెంబర్ 7న మయన్మార్ పర్యటన ముగుస్తోంది. అనంతరం పితృ అమావాస్య వస్తుండటం.. ఇది మంచి ముహూర్తం కాదని భావిస్తుండటంతో ప్రధాని మోదీ చైనా పర్యటన లోపే కేంద్ర మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరించే అవకాశముందని వినిపిస్తోంది. సెప్టెంబర్ 1, 2వ తేదీల్లోపు విస్తరణ ఉండే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈసారి చేపట్టే మంత్రివర్గ విస్తరణ పెద్దస్థాయిలో ఉండే అవకాశముందని, పలువురు కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చునని అంటున్నారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు ఉండే అవకాశముందని సమాచారం. ఇక కొత్తగా ఎన్డీయే గూటిలో చేరిన అన్నాడీఎంకే, జేడీయూలకు కూడా కేంద్ర కేబినెట్లో బెర్తులు దక్కే అవకాశముంది. మహారాష్ట్రలో బీజేపీకి సన్నిహితమవుతున్న ఎన్సీపీ కూడా కేంద్ర కేబినెట్లో చేరొచ్చునని ఊహాగానాలు వస్తున్నాయి. -
సుష్మాకు రెస్ట్.. వసుంధరకు విదేశాంగం?
- ఆర్థిక మంత్రిగా పీయూష్ గోయల్! న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు ముగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో భారీ స్థాయిలోనే మార్పులు జరుగుతాయని తెలిసింది. ఇటీవలే కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న సుష్మా స్వరాజ్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తారని, ఆమె స్థానంలో విదేశాంగ మంత్రిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు అవకాశం కల్పిస్తారని ఢిల్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఏప్రిల్ 12తో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాతిరోజే కేబినెట్ విస్తరణ జరుగుతుందని సమాచారం. మనోహర్ పరీకర్ గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దరిమిలా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రక్షణ శాఖ అదనపు బాధ్యతలను కట్టబెట్టారు. కీలకమైన రక్షణ శాఖకు పూర్తిస్థాయి మంత్రి అవసరమైన నేపథ్యంలో.. వచ్చేవారం జరగబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో దీనిపై వచ్చే అవకాశంఉంది. రక్షణ శాఖను అరుణ్ జైట్లీకి అప్పగించి, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఆర్థిక శాఖ కేటాయిస్తారని తెలిసింది. ఇక యూపీ ముఖ్యమంత్రి పదివి బరిలో చివరిదాకా బరిలో నిలిచిన కేంద్ర సహాయ మంత్రి మనోజ్ సిన్హాకు ప్రమోషన్ దక్కనున్నట్లు, ఆయనను పూర్తిస్థాయి కేబినెట్ మంత్రిగా నియమించనున్నట్లు సమాచారం. అయితే అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతేగానీ శాఖల కేటాయింపులపై స్పష్టతరాదు. -
టీడీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి
► రాజీనామా చేస్తానంటూ బొండా ఉమా హడావుడి ► నీ చిట్టా నా వద్ద ఉందంటూ సీఎం సీరియస్ ► రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా : కాగిత రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి చిచ్చురేపింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఏకంగా సీఎంపై విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. ఎంపీలు బుజ్జగించినా మెట్టు దిగలేదు. అయితే సీఎం సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. మరోవైపు జిల్లాలో సీనియర్ అయిన పెడన ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అనుచరులు బంటుమిల్లిలో ఆందోళన నిర్వహించారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాగితపై ఒత్తిడి చేస్తున్నారు. కాపుల గొంతు కోశారు. రాజధానిలో ఉన్న నేను 13 జిల్లాల కాపు నాయకులకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాను. ఏ సమస్య అయినా అన్ని జిల్లాల కాపు నాయకులు నా వద్దకే వస్తున్నారు. అందరికీ పనిచేసి పెడుతున్నా. పార్టీ పెద్దలు నన్ను, కాపులను వాడుకుని ఇప్పుడు వదిలేస్తున్నారు. కాపులను నాశనం చేస్తున్నారు. – బొండా ఉమా, సెంట్రల్ ఎమ్మెల్యే మీకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాపులకు అన్యాయం జరిగినట్టేనా..? మీ భూకబ్జాల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. మీరు చేసేవన్నీ నాకు తెలుసు. గన్‌మన్‌పై దాడిచేసినా కేసులు పెట్టలేదు. కాపు సామాజికవర్గ అంశాన్ని వివాదంచేస్తే సహించను. పదవులు దక్కలేదని అందరూ ఇలాగే చేస్తున్నారా.. జాగ్రత్త. – ఇదీ బొండా ఉమాకు సీఎం వార్నింగ్ (విశ్వసనీయ సమాచారం ప్రకారం) శనివారం రాత్రి 9 గంటల వరకు జాబితాలో నా పేరు ఉంది. కొందరు కుట్రచేసి నా పేరును తొలగింపజేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న వారిని కొనసాగిస్తున్నారు. 30ఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్నా. ఇప్పటికీ మంత్రి పదవి రాకపోవడంతో కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా. – కాగిత వెంకట్రావు, పెడన ఎమ్మెల్యే సాక్షి, విజయవాడ/మచిలీపట్నం: సీనియారిటీకి చోటు లేదు. అధినేత అనుగ్రహం కోసం నిగ్రహం కోల్పోయి ప్రతిపక్ష నాయకులపై బండ బూతులు తిట్టినా ప్రయోజనం లేదు. పదవి కోసం విలువలకు తిలోదకాలిచ్చి పార్టీ ఫిరాయించినా ఫలితం దక్కలేదు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో జిల్లా నుంచి కొత్తగా ఎవరికీ అవకాశం కల్పించలేదు. దీంతో ఆశావహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మంత్రులుగా ఆదివారం ప్రమాణస్వీకారం చేసినవారే 2019 ఎన్నికల టీమ్‌గా ప్రచారం జరగడంతో అసంతృప్త నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక తమకు ఇప్పట్లో మంత్రి అయ్యే అవకాశం ఉండదని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఏకంగా సీఎం చంద్రబాబుపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అనుచరులు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. ఉమా ఇంటి వద్ద డ్రామా... విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఇంటి వద్ద ఆదివారం ఉదయం పెద్ద హైడ్రామా నడిచింది. మంత్రి పదవి లభించకపోవడంతో మనస్తాపానికి గురైన బొండా ఉమా టీడీపీకి రాజీనామా చేస్తారని ఆయన వర్గం ప్రచారం చేసింది. ఉమాకు మద్దతుగా 18 మంది కార్పొరేటర్లు, పలు డివిజన్ల పార్టీ అధ్యక్షులు కూడా రాజీనామా చేస్తారని కొందరు హడావుడి చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన కాపులంతా తన వద్దకే వస్తున్నారని, అందువల్ల రాజధానిలో ఉన్న తనకు మంత్రి పదవి ఇస్తే తమ సామాజికవర్గానికి ఉపయుక్తంగా ఉంటుందని బొండా ఉమా వాదిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన సెల్‌ఫోన్‌కు వచ్చిన ఒక కాల్‌కు బదులిస్తూ ‘రాష్ట్రంలో కాపుల గొంతు చంద్రబాబు కోశారు. కాపులను నాశనం చేశారు. కాపులను వాడుకుని వదిలేస్తున్నారు..’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారని సమాచారం. అప్పటికే ఉమా ఇంటికి వచ్చి బుజ్జగిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ వారించారు. కొద్దిసేపు వారు చర్చించుకున్న తర్వాత అందరూ ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. పెడన నియోజకవర్గంలో రగడ పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు నాగేశ్వరరావుపేటలోని కాగిత నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు. కృత్తివెన్ను ఎంపీపీ వలవల సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు ఒడుగు తులసీరావు, బంటుమిల్లి జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కరుణజ్యోతి, కృత్తివెన్ను డీసీ చైర్మన్ నెక్కంటి భాస్కరరావు, కౌతవరం డీసీ చైర్మన్ శలపాటి ప్రసాద్, గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు చిలుకోటి గోపాలకృష్ణ గోఖలే, ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు, నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు, కార్యకర్తలు, ఇతర టీడీపీ శ్రేణులు కాగితకు తమ పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్పారు. టీడీపీ గూడూరు మండల అధ్యక్షుడు పోతన స్వామి కార్యాలయంలో సమావేశమైన నాయకులు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. బంటుమిల్లి లక్ష్మీపురం సెంటరులో టీడీపీ నాయకులు ఆందోళన చేసి నిరసన తెలిపారు. కాగితకు మంత్రి పదవి వచ్చిందని... మంత్రి ఉమా అడ్డుకున్నారని కొందరు నాయకులు నినాదాలు చేశారు. అయితే కొందరు నాయకులు తమ పదవులకు రాజీనామా చేస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుకు లేఖలు కూడా పంపినట్లు తెలిపారు. నేరవేరని జలీల్‌ఖాన్ కల ముస్లిం మైనారిటీ కోటాలో మంత్రి పదవిని ఆశించి పార్టీ ఫిరాయించిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు నిరాశే మిగిలింది. తాను వైఎస్సార్ సీపీ తరఫున గెలిచినా... టీడీపీలో చేరే సమయంలో మంత్రి పదవి ఇస్తానని సీఎం హామీ ఇచ్చారని, ఇప్పుడు షాక్ ఇచ్చారని జలీల్‌ఖాన్ మథనపడుతున్నట్లు తెలిసింది. ఆయన సోమవారం సీఎంను కలిసే అవకాశం ఉంది. చంద్రబాబు సీరియస్ కాపుల గొంతు కోశారంటూ బొండా ఉమా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ‘మీకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాపులకు అన్యాయం జరిగినట్లేనా..’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. ‘మీ భూ కబ్జాల చిట్టా మొత్తం నా వద్ద ఉంది. మీరు చేసేవన్నీ నాకు తెలుసు. జాగ్రత్తగా ఉండండి. రవాణాశాఖ గన్‌మన్‌పై దాడికి ప్రయత్నించినా కేసు పెట్టనీయలేదు. కాపు అంశాన్ని వివాదం చేస్తే సహించబోను..’ అని తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. సీనియర్లకు పదవులు దక్కలేదని, అందరూ ఇలాగే చేస్తున్నారా... అని బొండాను ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ఉమా తోకముడిచి వెనక్కి వచ్చేశారని సమాచారం. కొందరు అడ్డుకున్నారు : కాగిత ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు విలేకరులతో మాట్లాడుతూ శనివారం రాత్రి 9 గంటల వరకూ మంత్రివర్గ జాబితాలో తన పేరు ఉందని, కొందరు నాయకులు కుట్రపూరితంగా వ్యవహరించి తొలగింపజేశారని చెప్పారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, అయితే అవినీతి ఆరోపణలు ఉన్న వారిని మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారని తెలిపారు. తాను ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే అప్పటికప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. గత 30 ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని పని చేస్తున్నానని, 2014లో మంత్రివర్గ కూర్పులోనూ తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తనను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నాయకులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. రెండు రోజుల్లో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటానని కాగిత ప్రకటించారు. రాజకీయ, కుల సమీకరణల వల్లే బొండాకు అన్యాయం : కేశినేని కొన్ని రాజకీయ, కుల సమీకరణల మూలంగానే ఎమ్మెల్యే బొండా ఉమాకు న్యాయం చేయలేకపోయామని సీఎం చంద్రబాబు చెప్పారని ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) ఒక ప్రకటనలో తెలిపారు. పది రోజుల్లో సరైన పదవితో బొండాకు న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. -
ఏపీలో చట్టం.. అపహాస్యం
- మంత్రివర్గ విస్తరణలో నలుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు చోటు - ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన గవర్నర్ - వైఎస్సార్సీపీ తరఫున గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని ఫిరాయింపుదారులు - అసెంబ్లీలో వారు ఇప్పటికీ వైఎస్సార్సీపీ సభ్యులుగానే కొనసాగుతున్నారని స్పీకర్ వెల్లడి - ఫిరాయింపులను ప్రోత్సహించటమే తప్పు.. ఆపైన వారికి మంత్రి పదవులా..! - చంద్రబాబు వైఖరిపై విమర్శల వెల్లువ.. మంత్రులుగా 11 మంది ప్రమాణం సాక్షి, అమరావతి చట్టం చట్టుబండలైంది. రాష్ట్ర గవర్నర్ సాక్షిగా పార్టీ ఫిరాయింపుల చట్టం అపహాస్యమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన నలుగురు శాసనసభ్యులతో ఆదివారం వెలగపూడి సచివాలయ ప్రాంగణం వద్ద తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ తీరు పట్ల టీడీపీయేతర పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏ విలువలకీ ప్రస్తానం అంటూ మేధావి వర్గం ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర చరిత్రలో ఇది బ్లాక్ డే అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఇది రాజ్యాంగానికి, రాష్ట్రానికి ఘోరమైన అవమానం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, ఆ పదవికి రాజీనామా చేయకుండానే మరో పార్టీలోకి ఫిరాయించిన వారికి మంత్రి పదవులెలా ఇస్తారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆక్షేపించారు. తెలంగాణాలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై లొల్లి చేసిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో ఆయనే ఆ తప్పు ఎందుకు చేశారని లోక్‌సత్తా ప్రశ్నించింది. సీఎం రాజ్యాంగ విలువలను మంట కలిపారని వైఎస్సార్సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో రావు వెంకట సుజయి కృష్ణ రంగారావు, చదిపిరాళ్ల ఆది నారాయణరెడ్డి, ఎన్ అమర్నాథ్రెడ్డి, భూమా అఖిలప్రియలు వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అసెంబ్లీలో వీరు ఇప్పటికీ వైఎస్సార్సీపీ సభ్యులుగానే కొనసాగుతున్నారు. అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు వైఎస్సార్సీపీ సభ్యులు 67 మంది అని ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. పార్టీ ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించి, తిరిగి ఎన్నికలు నిర్వహించకుండా ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని టీడీపీ నేతలు సైతం తప్పు పడుతున్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన గవర్నరే పార్టీ ఫిరాయింపుదారులతో మంత్రులుగా ప్రమాణం చేయించడం దారుణం అని జనం విస్తుపోతున్నారు. మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న 11 మంది ఆదివారం ఉదయం 9.22 గంటలకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వెలగపూడి సచివాలయ ప్రాంగణం వద్ద తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వారితో ప్రమాణం చేయించారు. కిమిడి కళా వెంకట్రావు, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్, పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రావు వెంకట సుజయకృష్ణ రంగారావు, కాల్వ శ్రీనివాసులు, చదిపిరాళ్ల ఆది నారాయణరెడ్డి, కొత్తపల్లి శామ్యూల్ జవహర్, ఎన్ అమర్నాథ్రెడ్డి, భూమా అఖిలప్రియ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదినారాయణరెడ్డి, జవహర్, అఖిలప్రియలు పవిత్ర హృదయంతో అని, మిగతా వారు దైవసాక్షిగా అంటూ ప్రమాణం చేశారు. ప్రమాణం సమయంలో పితాని సత్యనారాయణ, అఖిలప్రియ కొద్దిగా తడబడ్డారు. లోకేష్ ప్రమాణం చేసిన తర్వాత తన తండ్రి చంద్రబాబు, గవర్నర్‌కు పాదాభివందనం చేశారు. నక్కా ఆనంద్‌బాబు, కాల్వ శ్రీనివాసులు, జవహర్‌లు సైతం ముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించారు. కొత్త మంత్రుల్లో భూమా అఖిలప్రియ, జవహర్ మొదటిసారి ఎమ్మెల్యేలు కాగా, లోకేశ్ ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రవేశ ద్వారం వద్ద గందరగోళం ఉద్వాసనకు గురైన ఐదుగురు మంత్రుల్లో నలుగురు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిషోర్‌బాబు, కిమిడి మృణాళిని, పల్లె రఘునాథ్‌రెడ్డి ఈ కార్యక్రమానికి దూరంగా ఉండగా పీతల సుజాత హాజరయ్యారు. వేదిక ముందు ప్రత్యేకంగా వేసిన సీట్లలో ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, వియ్యంకుడు బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర కూర్చున్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వారి కుటుంబ సభ్యులు అక్కడికి రావాల్సి ఉన్నా రాలేకపోయారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం చూద్దామని వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు వెలగపూడి సచివాలయం వద్ద చుక్కలు కనిపించాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ప్రాంగణానికి చేరుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ప్రవేశ మార్గాలపై స్పష్టత లేక అందరూ ఒకవైపే రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒక దశలో తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. దీంతో పోలీసులు అందరినీ అడ్డుకున్నారు. చివరికి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్న వారు సైతం లోనికి వెళ్లడానికి ఇబ్బందిపడ్డారు. ఒక దశలో ప్రమాణ స్వీకారానికి వెళుతున్న జవహర్‌ను.. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వస్తున్నారంటూ పోలీసులు నిలిపివేశారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను సీట్లలో కూర్చోబెట్టిన తర్వాత ఆయన్ను వేదిక వద్దకు పంపారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వేదికకు దగ్గరగా వెళ్లే అవకాశం లేక జనంలోనే ఉండిపోయారు. డీజీపీ సాంబశివరావు, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌లు సైతం జనంలో చిక్కుకుని బయట పడడానికి ఇబ్బంది పడ్డారు. మీడియా సిబ్బంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మీడియా గ్యాలరీ లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి అందరికీ అల్పాహార విందు ఇచ్చారు. గవర్నర్, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు విందుకు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబ సభ్యులైన హరికృష్ణ, రామకృష్ణ, కళ్యాణ్‌రామ్, నారా రోహిత్ తదితరులు వచ్చారు. -
ఏపీ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దం
-
కేబినెట్ కూర్పు: టీడీపీలో రేగిన చిచ్చు
-
ఏపీ కేబినెట్ కూర్పు ఖరారు: ఐదుగురు ఔట్
-
టీడీపీలో రేగిన చిచ్చు
సాక్షి, అమరావతి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతోంది. పదవిపై ఆశ పెట్టుకున్నవారు తమను కాదని వేరే వారికి అవకాశం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులివ్వడంతో వారి ప్రత్యర్థులు నేరుగా ముఖ్యమంత్రినే నిలదీశారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసినా పట్టించుకోలేదని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసంతృప్తులు, అలకవహించిన వారిని బుజ్జగించేందుకు, తాయిలాలిచ్చి లాలించేందుకు ఎప్పటిమాదిరిగానే చంద్రబాబు సీనియర్లను రంగంలోకి దించారు. పలువురితో స్వయంగా మాట్లాడారు. వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి తన వర్గంతో విజయవాడ చేరుకున్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు ఆ జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. రామసుబ్బారెడ్డితోపాటు లింగారెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, సతీష్‌రెడ్డి, సుధాకర్ యాదవ్, రమేష్‌రెడ్డిలతో ఆయన సమావేశమై బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఆదినారాయణరెడ్డి మంత్రయినా పార్టీలో ప్రాధాన్యం ఉండేలా ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని, లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేందుకు సీఎంను ఒప్పిస్తానని గంటా చెప్పినా వారు వినలేదని సమాచారం. అసంతృప్తి... ఆవేదన... విజయనగరంలో జిల్లాలో వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన సుజయ కృష్ణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు మీసాల గీత, కేవీ నాయుడు, సంధ్యారాణి, జగదీష్‌లు సీఎంను కలిసినా ప్రయోజనం లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు సైతం ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రిని పట్టుబట్టినా ప్రయోజనం లేకపోవడంతో గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ్ల నరేంద్ర సీఎం నివాసం నుంచి బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు సైతం తన వర్గీయులను చంద్రబాబుకు వద్దకు పంపి మంత్రివర్గంలోకి చేర్చుకోవాలని డిమాండ్ చేయించినా ఆయన పట్టించుకోలేదు. డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు మంత్రి పదవి ఇప్పించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న ఎంపీ రాయపాటి వర్గం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. జీవీ ఆంజనేయులు, ఆలపాటి రాజా, శ్రావణ్‌కుమార్‌లు సీఎం వద్దే తమకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. యరపతినేని శ్రీనివాసరావును సీఎం అంతకు ముందే పిలిచి సర్దిచెప్పారు. మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించిన పయ్యావుల కేశవ్ తనకు మద్దతుగా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని చంద్రబాబుకు వద్దకు పంపినా సీఎం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దెందులూరు ఎమ్మెల్యే తన వర్గాన్ని పంపి మంత్రి పదవి అడిగించినా చంద్రబాబు పట్టించుకోకపోవడంతో నిరాశకు గురయ్యారు. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన భూమా అఖిలప్రియకు మంత్రివర్గంలో స్థానం కల్పించడంపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు బనగానపల్లె, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, జయనాగేశ్వరరెడ్డిలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హతాశులైన మంత్రులు, ఫిరాయింపుదారులు మృణాళిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథ్‌రెడ్డి, రావెల కిషోర్‌బాబు, పీతల సుజాతలను పిలిచి ఇక మంత్రివర్గంలోకి చోటు లేదని ముఖ్యమంత్రి పిలిచి చెప్పడంతో వారు హతాశుతులయ్యారు. తమను కొనసాగించాలని కోరినా ఆయన పట్టించుకోలేదు. మంత్రి పదవి వస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ), షరీఫ్‌లు తమను పార్టీ మోసం చేసిందని వాపోయారు. మంత్రి పదవి హామీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన జ్యోతుల నెహ్రూ, చాంద్‌బాషాలకు మొండిచేయి చూపడంతో వారు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. టీడీపీ తమను వాడుకుని వదిలేసిందని వాపోతున్నారు. శనివారం ఉదయం నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు తమకు మద్దతుగా ఉన్న వారిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. మంత్రి పదవులు ఇవ్వలేని వారికి మంచి కార్పొరేషన్లు ఇస్తానని, అవసరమైతే ఆర్థికంగానూ ఆదుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నట్లు తెలిసింది. అయినా పలువురు తమకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ కేబినెట్ కూర్పు ఖరారు: ఐదుగురు ఔట్
- నేడే విస్తరణ - ఫిరాయింపుదారులకు చంద్రబాబు పెద్దపీట - ఉదయం 9.22 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం - కొత్తగా 11 మందికి అవకాశం - వైఎస్సార్సీపీ నుంచి వచ్చినవారిలో నలుగురికి చాన్స్ - ఐదుగురు మంత్రులకు ఉద్వాసన సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. కేబినెట్లో కొత్తగా 11 మందికి అవకాశం దక్కింది. జిల్లాల్లో రాజకీయ, సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. మంత్రుల జాబితాను గవర్నర్ నరసింహన్‌కు పంపించినట్లు సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో 20 మంది సభ్యులున్నారు. వాస్తవంగా 26 మందికి అవకాశం ఉంది. 5గురి తొలగింపు, కొత్తగా 11 మంది చేరికతో సీఎంతో సహా మంత్రుల సంఖ్య 26కు చేరనుంది. కొత్త మంత్రులుగా 11 మందితో ఆదివారం ఉదయం 9.22 గంటలకు వెలగపూడి సచివాలయం వద్ద గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కిమిడి మృణాళిని, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, రావెల కిషోర్‌బాబు, పల్లె రఘునాథ్‌రెడ్డిలను కేబినెట్ నుంచి తొలగించారు. ప్రత్తిపాటి కొనసాగింపునకే బాబు మొగ్గు రావెల కిషోర్‌బాబు పలు వివాదాల్లో చిక్కుకోవడంతో మంత్రివర్గం నుంచి తప్పించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో చురుగ్గా పనిచేయలేకపోవ డంతో తొలగించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని పీతల సుజాతకు ఉద్వాసన పలికారు. కళా వెంకట్రావుకు అవకాశం ఇవ్వాల్సి రావడంతో అదే కుటుంబానికి చెందిన కిమిడి మృణాళినిని పక్కకు తప్పించారు. పనితీరు సరిగా లేదనే నెపంతో పల్లె రఘునాథ్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కూడా తొలగించాలని నిర్ణయించినా అగ్రిగోల్డ్ ఉదంతంతో ఆయన వేటు నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన కర్నూలు జిల్లాకు చెందిన భూమా అఖిలప్రియ(ఆళ్లగడ్డ), చిత్తూరు నుంచి అమర్నాథ్రెడ్డి(పలమనేరు), వైఎస్సార్ జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి(జమ్మలమడుగు), విజయనగరం జిల్లా నుంచి సుజయకృష్ణ రంగారావు(బొబ్బిలి)కు అవకాశం కల్పించారు. ఫిరాయింపుదారులను మంత్రివర్గంలోకి తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయనే అనుమానం ఉన్నప్ప టికీ న్యాయ నిపుణులతో చర్చించి, మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. కొత్తపల్లి జవహర్‌కు అనూహ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి జ్యోతుల నెహ్రూ, వేటుకూరి శివరామరాజు, షరీఫ్‌లకు మంత్రి పదవులు దక్కడం ఖాయమనుకున్నా సమీకరణల్లో అవకాశం లేకుండా పోయింది. పశ్చిమ గోదావరి నుంచి అనూహ్యంగా కొత్తపల్లి జవహర్‌కు చోటు కల్పించడంతో ఆ జిల్లా నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు. మైనారిటీ కోటాలో కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాకు మంత్రి పదవి ఖరారు చేసినా ఆఖరి నిమిషంలో ఆయనకు మొండిచేయి చూపారు. ప్రస్తుత మంత్రివర్గంలో ముగ్గురు మహిళలుండగా వారిలో పీతల సుజాత, మృణాళినికి ఉద్వాసన పలికారు. కొత్తగా అఖిల ప్రియకు చోటు కల్పించారు. మైనారిటీలు, గిరిజనులకు ఈసారి కూడా అవకాశం కల్పించలేదు. అనంతపురం జిల్లాలో పల్లె రఘునాథరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించారు. ఆయనను చీఫ్‌విప్‌గా నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. భారీగా శాఖల మార్పు: మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం ఒక్కరి దగ్గరే రెండు, మూడు కీలక శాఖలున్నాయి. ఈసారి అలాకాకుండా అందరికీ శాఖలు సమానంగా పంచాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు. తన కుమారుడు నారా లోకేశ్‌కు పంచాయతీరాజ్, ఐటీ శాఖలను అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఆ శాఖను నిర్వహిస్తున్న అయ్యన్నపాత్రుడికి మరో శాఖ ఇవ్వాల్సి ఉంది. ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప శాఖలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖ పనితీరు బాగాలేదని, అవినీతిమయంగా మారిందంటూ ఇప్పటికే పలుమార్లు కేఈ కృష్ణమూర్తిని సీఎం పలు సమావేశాల్లో మందలించారు. ఆ శాఖలో ఆయన మాట చెల్లుబాటుకాకుండా చేయడంతోపాటు అప్రాధాన్యంగా మార్చారు. ఈ నేపథ్యంలో ఆయన శాఖ మారుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హోంశాఖపై చినరాజప్ప అసలు పట్టుసాధించ లేదని పలుమార్లు చెప్పిన చంద్రబాబు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయనను వేరే శాఖలకు మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావును మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి మరో శాఖకు మార్చనున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను నిర్వహిస్తున్న నారాయణకు రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక శాఖ కేటాయించి అప్పగించనున్నట్లు సమాచారం. శాసనసభలో ప్రతిపక్షాన్ని దూషించి, బాబును మెప్పించిన అచ్చెన్నాయుడికి కీలక శాఖ దక్కనుంది. మంత్రులతో చంద్రబాబు భేటీ సీఎం చంద్రబాబు శనివారం రాత్రి తన నివాసంలో మంత్రులతో విడివిడిగా సమావేశమై తన నిర్ణయాలను వివరించారు. మంత్రి యనమల, ఉన్నతాధికారులతో కలిసి మంత్రుల జాబితాను రూపొందించి గవర్నర్‌కు పంపారు. ఉద్వాసన జాబితాలో ఉన్న వారిని రాజీనామా చేయాలని కోరారు. కొత్త మంత్రులు వీరే... 1. నారా లోకేశ్ (ఎమ్మెల్సీ) 2. కిమిడి కళావెంకట్రావు (ఎమ్మెల్సీ) 3. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (ఎమ్మెల్సీ) 4. నక్కా ఆనంద్‌బాబు (ఎమ్మెల్యే) 5. పితాని సత్యనారాయణ (ఎమ్మెల్యే) 6. కొత్తపల్లి జవహర్ (ఎమ్మెల్యే) 7. కాల్వ శ్రీనివాసులు (ఎమ్మెల్యే) మంత్రులవుతున్న ఫిరాయింపుదారులు 8. భూమా అఖిలప్రియ (ఎమ్మెల్యే) 9. అమర్నాథ్రెడ్డి (ఎమ్మెల్యే) 10 ఆదినారాయణరెడ్డి (ఎమ్మెల్యే) 11. సుజయకృష్ణ రంగారావు (ఎమ్మెల్యే) ఉద్వాసన వీరికే.. 1. కిమిడి మృణాళిని 2. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 3. పీతల సుజాత 4. రావెల కిషోర్‌బాబు 5. పల్లె రఘునాథ్‌రెడ్డి చీఫ్ విప్ మంత్రి అయ్యారు.. మంత్రి చీఫ్ విప్ అయ్యారు శనివారం రాత్రి ఖరారైన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఓ ఆసక్తికర పరిణామం. మూడేళ్లుగా టీడీపీ చీఫ్ విప్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాలువ శ్రీనివాసులుకు మంత్రిపదవి దక్కగా, మంత్రిగా కొనసాగుతున్న పల్లె రఘునాథరెడ్డిని కేబినెట్ నుంచి తప్పించి చీఫ్ విప్ పదవిని కట్టబెట్టారు. పల్లె నియామకానికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. రామసుబ్బారెడ్డికి తాయిలం వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టడంపై మొదటినుంచి తీవ్ర వ్యతిరేకత కనబర్చిన టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డిని చంద్రబాబు ఎట్టకేలకు బుజ్జగించారు. గవర్నర్‌కోటా ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డిని ఖరారుచేసి, ఆయనను మండలిలో విప్‌గా నియమించనున్నట్లు తెలిసింది. కొత్తమంత్రులను కలుపుకుంటే జిల్లాలవారీగా మంత్రుల జాబితా ఇలాఉంది.. శ్రీకాకుళం: అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు విజయనగరం: సంజయ్ కృష్ణ రంగారావు విశాఖపట్నం: గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు తూర్పుగోదావరి: యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప పశ్చిమగోదావరి: కేఎస్. జవహర్, పితాని సత్యనారాయణ, మాణిక్యాలరావు కృష్ణా: కామినేని శ్రీనివాసరావు, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర గుంటూరు: ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు ప్రకాశం: సిద్ధా రాఘవరావు నెల్లూరు: నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కడప: ఆదినారాయణరెడ్డి కర్నూలు: కేఈ కృష్ణమూర్తి, భూమా అఖిలప్రియ అనంతపురం: పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు చిత్తూరు: నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, అమర్నాథ్ రెడ్డి -
మళ్లీ మంత్రివర్గ విస్తరణ?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు మంత్రివర్గ పునఃవ్యవస్ధీకరణ చేయనున్నారా?. ఢిల్లీలో తాజా పరిణామాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో అధికారం చేపట్టడంతో కొత్త ముఖాలను కేబినేట్లోకి తీసుకునేందుకు మోదీ ఈ యోచన చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత(ఏప్రిల్ 12) మంత్రి వర్గాన్ని పునఃవ్యవస్ధీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కీలక పదవులు ఖాళీగా ఉండటం కూడా మంత్రి వర్గ పునఃవ్యవస్ధీకరణ అవసరాన్ని సూచిస్తున్నాయి. పారికర్ నుంచి రక్షణ మంత్రిగా కూడా అదనపు బాధ్యతలు అరుణ్ జైట్లీకి వెళ్లాయి. పునఃవ్యవస్ధీకరణలో కొత్త రక్షణ మంత్రిని మోదీ ఎంపిక చేయొచ్చు. ఈ మధ్యే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న సుష్మా స్వరాజ్ స్ధానంలో కొత్త వ్యక్తిని తీసుకునే చాన్స్ ఉందని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పురోగతి చూపించిన మంత్రులకు ప్రమోషన్లు కూడా కేబినేట్ పునఃవ్యవస్ధీకరణలో ఇస్తారని తెలిసింది. గతేడాది జూన్‌లో మోదీ కేబినేట్‌ను పనఃవ్యవస్ధీకరించిన విషయం తెలిసిందే. -
‘మినిమమ్ గవర్నమెంట్’ మాట మరిచారా మోదీ?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’ తన విధానమంటూ నినాదం ఇచ్చారు. అంటే అతి తక్కువ మంత్రులతో ఎక్కువ పరిపాలనను అందించడమే లక్ష్యమని చెప్పుకున్నారు కూడా. గత కొన్ని రోజులుగా తన మంత్రి వర్గాన్ని విస్తరిస్తానని చెబుతున్న ఆయన మంగళవారం నాడు తన మంత్రివర్గంలోకి ఏకంగా 19 మంది కొత్తవారిని కేబినెట్లోకి తీసుకున్నారు. దీంతో ఆయన మంత్రివర్గంలో మొత్తం సభ్యుల సంఖ్య 78కి చేరింది. మంది ఎక్కువై మజ్జిగ పలసనైనట్లు మంత్రులు, మంత్రివర్గ బృందాలు ఎక్కువైతే ప్రభుత్వ పాలనలో ఆటంకాలు పెరుగుతాయని ఆయన భావించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన సేవలను అందించడమే తన మంత్రివర్గ లక్ష్యం అవుతుందని చాటుకున్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాలనలో కాలయాపనను నివారించేందుకు వివిధ మంత్రివర్గ బృందాలను, వివిధ మంత్రివర్గ కమిటీలను రద్దు చేశారు. అయితే.. తర్వాత తక్కువ మంది మంత్రులతో ఎక్కువ పని రాబట్టడం కష్టమని భావించారో, ఏమో గానీ తన మంత్రివర్గంలో సభ్యుల సంఖ్యను మంగళవారం నాడు 78కి పెంచుకున్నారు. యూపీఏ 77 మంది మంత్రులను నియమిస్తే తన మంత్రివర్గం అంతకంటే ఒకటి ఎక్కువనే చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వం తన భాగస్వామ్య పక్షాలను మెప్పించడం కోసమే 77 మందిని చేర్చుకోవాల్సి వచ్చింది. కానీ మోదీ మాత్రం రానున్న అసెంబ్లీ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’ నినాదంతో రాజీ పడ్డారన్నది నిర్వివాదాంశం. అందులోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ ప్రాతినిధ్యం లభించడం కూడా గమనార్హం. ఆ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. -
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. మోడీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సరంభంలోనే కేంద్ర కేబినెట్లో మార్పులు-చేర్పులకు రంగం సిద్ధమైంది. గురువారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థికమత్రి అరుణ్ జైట్లీ బుధవారం సాయంత్రం భేటీ కానున్నారు. ఈసారి మార్పులు-చేర్పులు భారీగానే ఉంటాయని వినిపిస్తోంది. వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల బీజేపీ నేతలకు కెబినెట్ బెర్త్ లభించే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ నేతలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈసారి యూపీ నేతలు పలువురికి చాన్స్ లభించవచ్చునని సమాచారం. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై స్పష్టమైన సమాచారం లభించడంతో రాష్ట్రపతి భవన్ లోనూ ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. కేబినెట్ లో ప్రధాన శాఖలకు చెందిన మంత్రుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. ఇక రసాయనాలు ఎరువుల శాఖ సహాయమంత్రి నిహాల్ చంద్‌పై, మైనారిటీ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లాపై వేటు పడొచ్చని తెలుస్తోంది. అదేవిధంగా రాజస్థాన్ నేత అర్జున్ మేఘవాల్, జబల్పుర్ ఎంపీ రాకేశ్ సింగ్, అసోంకు చెందిన ఎంపీ రమణదేకాతోపాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధేలను కేబినెట్ లోకి కొత్తగా తీసుకోవచ్చునని సమాచారం. -
కర్ణాటక కాంగ్రెస్ లో 'కేబినెట్' చిచ్చు
బెంగళూరు: కర్ణాటకలో మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. 14 మంత్రులపై సీఎం సిద్ధరామయ్య వేటు వేయడంతో హస్తం పార్టీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు సంబంధించి గత రెండు రోజులుగా ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి 14 మందిని మంత్రి మండలి నుంచి తప్పించాలని నిర్ణయించారు. రాజీనామాలు సమర్పించాలని సదరు మంత్రులను కోరినట్టు తెలుస్తోంది. మంత్రి పదవులను కోల్పోనున్న కొంత మంది తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ తనను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఎమ్మెల్యే స్థానానికి సైతం రాజీనామా చేసి వెళ్లిపోతానని హెచ్చరించారు. శ్యామనూరు శివశంకరప్పను బుజ్జగించేందుకు ఆయన కుమారుడు ఎస్.ఎస్.మల్లికార్జున్ (దావణగెరె ఉత్తర)కు కేబినెట్ లో చోటు కల్పించారు. సతీశ్ స్థానంలో రమేశ్ కుమార్ ను తీసుకున్నారు. 14 మంత్రులు ఈ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై పార్టీ ఇమేజ్ పెరుగుతుందని సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర విశ్వాసంతో ఉన్నారు. మరోవైపు తమ నేతకు మంత్రి పదవి ఇవ్వలేదన్న సమాచారంతో ఎమ్మెల్యే ఎం.క్రిష్ణప్ప మద్దతు దారులు బెంగళూరులో ఆందోళనకు దిగారు. -
త్యాగాలు చేయాలి
ఏ క్షణంలోనైనా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ మూడేళ్లు పనిచేసినందుకు ధన్యవాదాలు మంత్రుల సమావేశంలో సీఎం సిద్ధరామయ్య బెంగళూరు:మంత్రివర్గ ప్రక్షాళనపై సీఎం సిద్ధరామయ్య స్పష్టమైన సందేశాన్ని అందించారు. ‘మూడేళ్లు మంత్రులుగా పనిచేసినందుకు మీకు ధన్యవాదాలు. హై కమాండ్ ఆదేశాలను అనుసరించి రాబోయే శాసనసభ ఎన్నికలకు ఇప్పటి నుంచే తయారు కావాలి. ఇందు కోసం ఏ క్షణంలోనైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. మీరు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. మంత్రి వర్గంనుంచి తొలగింపునకు గురయ్యేవారు పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలి.’ అని పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో చాలా ఏళ్ల తర్వాత 2013న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికార వ్యవధి మరో రెండేళ్లలో ముగియనున్నా ఇప్పటికీ చాలా మందికి సరైన పదవులు దక్కలేదని హస్తం నాయకులే పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని హై కమాండ్ నిర్ధారణకు వచ్చింది. దీంతో చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రిమండలి వ్యవస్థీకరణకు పచ్చజండా ఊపాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం బుధవారం విధానసౌధలో మంత్రి పరిషత్‌ను ఏర్పాటు చేశారు. మొదట మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసిఅభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. అటుపై అధికారులందరినీ బయటికి పంపించి మంత్రులతో మాత్రం ప్రత్యేకంగా సమావేశమై మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ ఆవశ్యకతను వివరించినట్లు సమాచారం. మంత్రి మండలి ప్రక్షాళనలో తన పాత్ర ఏమీ లేదని, అంతా హై కమాండ్ నిర్ణయం మేరకు జరుగుతోందని సిద్ధరామయ్య మంత్రులకు తెలిపారు. ఇప్పటికే మంత్రులందరి పనితీరుకు సంబంధించి హై కమాండ్‌కు నివేదిక వెళ్లిందన్నారు. అందువల్ల ఎవరెవరిని మంత్రి మండలి నుంచి తొలగించాలన్న విషయంపై హై కమాండ్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. మంత్రి మండలి నుంచి తొలగించిన వారికి పార్టీలో మంచి పదవులు దక్కుతాయని, రానున్న ఎన్నికల్లోపు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. అటుపై మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణపై అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా సిద్ధరామయ్య మంత్రులకు సూచించారు. ఇందుకు 11 మంది మంత్రులు మాత్రమే తమ సమ్మతిని తెలియజేయగా మిగిలిన వారు ‘ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ వల్ల అసమ్మతి పెరిగి పార్టీ పటిష్టత దెబ్బతింటుందని, అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడుతాం.’ అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మంత్రి పరిషత్‌లో వెల్లడైన అభిప్రాయలతో కూడిన నివేదికతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌తో కలిసి గురువారం ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యి ప్రక్షాళనకు తుది అనుమతి పొందనున్నారు. దీంతో మరో మూడు రోజుల్లో మంత్రి వర్గంలో ఉండేది ఎవరూ, తొలగించబడేది ఎవరనే విషయం తేలిపోనుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలోని మరోవర్గం నాయకులు మాత్రం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈనెల 17 వరకూ మాత్రమే ఢిల్లీలో ఉంటారని, అటుపై పదిహేను రోజుల పాటు వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లనున్నారని చెబుతున్నారు. దీంతో ఈసారి కూడా మంత్రి వర్గ వ్యవస్థీకరణ వాయిదాపడే అవకాశం ఉందనేది వారి భావన. ఏది ఏమైనా మంత్రి మండలి ప్రక్షాళనలో భాగంగా మంత్రి మండలిలో స్థానాలను ఆశిస్తున్న వారిలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప, బసవరాజరాయరెడ్డి, రిజ్వాన్ అర్షద్, మాలికయ్య గుత్తేదార్లు ముందువరుసలో ఉన్నారు. -
ఇద్దరు మంత్రులకు ఉద్వాసన?
తన మంత్రివర్గంలో మార్పుచేర్పులు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఈనెలాఖరుతో ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి కాబట్టి, ఆ తర్వాత కనీసం ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలకాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా లాంటివాళ్లు తప్ప మిగిలినవారి విషయంలో భారీ మార్పులే ఉంటాయని, కొనసాగించే మంత్రుల శాఖల్లో కూడా మార్పులు తప్పకపోవచ్చని అంటున్నారు. ప్రభుత్వంలో ఏకైక మహిళ, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న వందనా కుమారిని మారుస్తారని, అలాగే స్పీకర్ రామ్ నివాస్ గోయల్‌కు మంత్రిపదవి ఇస్తారని చెబుతున్నారు. మంత్రివర్గంలో మార్పుచేర్పులు ఎటూ తప్పవని, అయితే ఇప్పటివరకు శాఖల మార్పుపై తుది నిర్ణయం ఏమీ తీసుకోలేదని పార్టీ సీనియర్ సభ్యుడొకరు చెప్పారు. గత ఏడాది కాలంలో మంత్రుల పనితీరును పార్టీ మదింపు చేసిందని, వాళ్లలో కొంతమంది అటు మంత్రులుగాను, ఇటు రాజకీయంగాను కూడా పెద్దగా ప్రభావం ఏమీ చూపించలేకపోతున్నట్లు తెలిసిందని అన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సందీప్ కుమార్ మీద వేటు పడటం దాదాపు ఖాయమని తెలుస్తోంది. శిలాఫలకం మీద తన భార్య పేరు లేదన్న కారణంతో ఒక స్కూలు ప్రిన్సిపాల్‌ను తీవ్రంగా అవమానించిన ఆరోపణలు ఆయనపై ఇటీవల గట్టిగా వచ్చాయి. ఇలాంటి ఒకరిద్దరికి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. -
'షా'కు పట్టం.. 'మంత్రుల'కు కష్టం
గతేడాది బిహార్ లో ఘోర పరాజయానికి కారకులపై వేటు, ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. మరోవైపు కొరవడిన సుపరిపాలన, శాఖల అజమాయిషీలో మంత్రుల వైఫల్యం.. ఇన్ని విభిన్న అంశాల నడుమ అధికార బీజేపీలో జాతీయ అధ్యక్షుడి నియామకం కీలకంగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన అమిత్.. ఏడాదిన్నరకే మళ్లీ ఎన్నికను ఎదుర్కోవాల్సివచ్చింది. నిజానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవీకాలం మూడేళ్లు. అయితే నాటి అధ్యక్షుడు రాజ్ నాథ్ రాజీనామాచేసి మంత్రివర్గంలో చేరిపోవటంతో ఏడాదిన్నర కాలానికిగానూ అమిత్ షా అధ్యక్షుడయ్యారు. ఈ సారి పూర్తి(మూడేళ్ల) కాలానికి ఎంపిక జరగనుంది. గుజరాత్ కే చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుంగుడిగా పేరుపొందిన అమిత్ షాను మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా (ఏకగ్రీవంగా) ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. అమిత్ బాధ్యతలు చేపట్టడమే తరువాయి.. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పుచేర్పులు ఉంటాయని విశ్వసనీయ సమాచారం. హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలు తప్పిస్తే, ఇతర ప్రధాన శాఖల్లో భారీ మర్పులు ఖాయమంటున్నాయి పార్టీ వర్గాలు. కొన్ని ముఖ్య శాఖలకు మంత్రులుగా కొనసాగుతున్న సీనియర్ల పదవీకాలం త్వరలో ముగియనుండటం కూడా మార్పుల అనివార్యతకు కారణమైనట్లు తెలుస్తోంది. రాజ్యసభ పదవీకాలం ముగియనున్న కేంద్ర మంత్రుల్లో ఏపీకి చెందిన వెంకయ్యనాయుడు, సుజనా చౌదరిలు కూడా ఉన్నారు. ఇప్పటివరకు అందిన సమాచారంమేరకు ఆయా పార్టీలు ఈ ఇద్దరు నాయకులను మరోసారి కొనసాగించలేని స్థితిలో లేవు. ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానిక బాధ్యులుగా ఒకరిద్దరు మంత్రులపై వేటుపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ రాష్ట్రం నుచి ఐదుగురు కేంద్ర మంత్రులున్నారు. వారిలో రవి శంకర్ ప్రసాద్ (కమ్యూనికేషన్స్, ఐటీ), రాధా మోహన్ సింగ్(వ్యవసాయ శాఖ), ధర్మేంద్ర ప్రధాన్ (పెట్రోలియం సహజవాయువుల శాఖ)లు బీజేపీకి చెందినవారుకాగా, రాంవిలాస్ పాశ్వాన్(ఆహారం, ప్రజాపంపిణీల శాఖ మంత్రి) ఎల్జేపీ తరఫున, ఉపేంద్ర కుష్వాహా (గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి) రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ నుంచి ఎంపికయ్యారు. రవిశంకర్ రాజ్యసభ పదవీకాలం మరో రెండేళ్లు (2018 వరకు) ఉండటంతో రాధా మోహన్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్ లపై వేటు పడే అవకాశాలున్నాయి. మిగతా ఇద్దరు ఎన్డీఏ భాగస్వాములు కాబట్టి వారికి మినహాయింపు ఉండొచ్చని వినికిడి. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రవైన ఉత్తరప్రదేశ్ లో వచ్చేఏడాది ఎన్నికలు జరుగుతాయి. ఈ ఆరింటిలో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అడ్రస్ లేదు. మిగిలిన అసోం, యూపీల్లో మాత్రం సత్తాచాటాలని గట్టిగా భావిస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నూతన మంత్రివర్గంలోకి యూపీ నుంచి ఒకరిద్దర్ని ఎంపికచేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ రాష్ట్రం నుంచి అత్యధికంగా 9 మంది కేంద్ర మంత్రులున్న సంగతి తెలిసిందే. -
త్వరలో కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు!
-
త్వరలో కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు!
న్యూఢిల్లీ : త్వరలో కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా రెండోసారి ఎన్నిక తర్వాత ఈ మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే కేంద్ర మంత్రివర్గంలోకి కొత్త ముఖాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా తీసుకు వెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావిస్తున్నారు. ఈ మేరకు కేబినెట్లో మార్పులు జరగనున్నట్లు సమాచారం. మరోవైపు హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ శాఖలను ఈ మార్పు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పనితీరులో వెనకబడ్డ మంత్రులపై వేటుకు రంగం సిద్ధం కాగా, మరికొందరి మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక బిహార్ నుంచి కేంద్ర మంత్రుల సంఖ్యను కుదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అమిత్ షా పదవీ కాలం ముగియనుండటంతో, ఆయనను తప్పించడానికి సీనియర్ నేతలు కొందరు అసమ్మతి గళాన్ని వినిపించారు. అయితే మెజార్టీ పార్టీ నేతలు మరోసారి అధ్యక్షుడిగా అమిత్ షా వైపే మొగ్గు చూపుతుండటంతో రెండో టరమ్ కూడా ఆయన ఎన్నిక తధ్యం. -
తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు?
రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కలవనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత తన మంత్రివర్గంలో ఆయన మార్పుచేర్పులు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్‌తో కేసీఆర్ వరుస భేటీలతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేబినెట్లో మార్పులు ఉండటం ఖాయమని అటు ప్రభుత్వంలోను, ఇటు పార్టీలో కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కేబినెట్లో మహిళలకు స్థానం కల్పించడంతో పాటు, సామాజిక వర్గాల ప్రకారం కూడా చోటు కల్పిస్తారని చర్చలు నడుస్తున్నాయి. -
మోదీ కేబినెట్లోకి కొత్త మొహాలు?
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని రెండోసారి విస్తరించనున్నారు. వచ్చేవారం ఆయన యూరప్, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. దాంతో విదేశీ పర్యటనకు ముందే మంత్రి వర్గంలో కొన్ని మార్పులు చేయాలని మోదీ భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు శనివారం ఉదయం తెలిపారు. కేంద్ర సహాయ మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, మనోజ్ సిన్హాలను కేబినెట్ లోకి తీసుకొనున్నట్లు తెలుస్తోంది. తన కేబినెట్ లోకి బీజేపీతో పాటు మిత్రపక్షాలు శివసేన, పీపుల్స్ డెమక్రటిక్ పార్టీల నేతలకు చోటు కల్పించాలని యోచిస్తున్నట్లు పార్టీ నేత ఒకరు చెప్పారు. శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ కి చోటు దక్కుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాలలో కీలకమైన భూసేకరణ సవరణ బిల్లు ప్రవేశపెట్టగా రాజ్యసభలో ఇబ్బందులు తలెత్తాయి. కాగా, రెండో విడత బడ్టెట్ సమావేశాలు యునైటెడ్ నేషనల్ డెమోక్రటిక్ కూటమిగా జరగాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. గత డిసెంబర్ లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సహా 21 మంది కొత్త వాళ్లకు మంత్రివర్గంలో చోటుకల్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుత మంత్రివర్గంలో మోదీతో సహా 27 మంది కేబినెట్, 26 మంది స్వతంత్ర, 13 మంది సహాయ హోదా మంత్రులున్నారు. -
అవమానాలు ఇంకెంత కాలం!
బీజేపీపై శివసేన ఆగ్రహం మహారాష్ట్రలో ఎన్సీపీ మద్దతు స్వీకరిస్తే.. ప్రతిపక్షంలో కూర్చుంటామని వెల్లడి 2 రోజుల్లో స్పష్టతనివ్వాలి సురేశ్‌ప్రభును బీజేపీలో చేర్చుకోవడంపై ఆగ్రహం న్యూఢిల్లీ/ముంబై: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో.. బీజేపీ, శివసేన అనుబంధానికి సంబంధించి ఆదివారం పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, తదనంతర పరిణామాలతో ఇప్పటికే ఈ రెండు సైద్ధాంతిక సారూప్య పార్టీల మధ్య విభేదాలు ప్రస్ఫుటమయ్యాయి. తాజాగా కేంద్ర మంత్రివర్గంలో మరో రెండు కేబినెట్ స్థానాలు కావాలన్న సేన అభ్యర్థనను పట్టించుకోకుండా.. ఒక సహాయ మంత్రిపదవి మాత్రమే ఇస్తామనడం, దాంతోపాటు, తమ పార్టీకి చెందిన సురేశ్‌ప్రభును బీజేపీలో చేర్చుకుని, కేబినెట్ మంత్రి పదవి ఇవ్వడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. మరోవైపు, మహారాష్ట్రలో విశ్వాసపరీక్ష సందర్భంగా బీజేపీ ప్రభుత్వం ఎన్సీపీ మద్దతును తీసుకోనుందనే వార్తలు శివసేనకు పుండు మీద కారంలా మారాయి. ‘ఇంకెంతకాలం ఈ అవమానాలను భరించాలి?’ అని శివసేన ఎంపీ చంద్రకాంత్ ఖైరే మండిపడ్డారు. మంత్రిగా ప్రమాణం చేయాల్సి ఉన్న సేన ఎంపీ అనిల్ దేశాయ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనకుండానే ఖైరేతో కలిసి ఢిల్లీ నుంచి ముంబైకి వెనుతిరిగారు. ప్రస్తుతం మోదీ కేబినెట్లో ఉన్న ఏకైక మంత్రి అనంత్ గీతే కూడా మంత్రిపదవికి రాజీనామా చేస్తారని, ఎన్డీఏ సంకీర్ణం నుంచి శివసేన వైదొలగనుందని వార్తలొవచ్చాయి. ప్రమాణ కార్యక్రమంలో శివసేన పాల్గొనకపోవడంపై బీజేపీ స్పందిస్తూ.. కార్యక్రమానికి శివసేనను ఆహ్వానించామని, ఎందుకు హాజరు కావొద్దనుకున్నారో వారే చెప్పాలని పేర్కొంది. ఇప్పుడే కాదు.. అయితే, బీజేపీతో పొత్తు విషయంలో ఇంకా తమ ద్వారాలు తెరిచే ఉన్నాయని, ఎన్సీపీ మద్దతు స్వీకరణపై రెండు రోజుల్లోగా బీజేపీ స్పష్టతనివ్వాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అల్టిమేటం ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలతో భేటీలో సీనియర్ నేత ఏక్నాథ్ షిండేను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న అనంతరం ముంబైలో విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా ఎన్సీపీ మద్దతును బీజేపీ అంగీకరిస్తే.. ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ‘హిందూత్వ శక్తుల్లో చీలిక రాకూడదని మా ఉద్దేశం. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తామంటున్నారు. కాషాయ ఉగ్రవాదం అనే పదాన్ని సృష్టించినవాడాయన. వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులకే కూలిపోవడానికి కారణం ఎన్సీపీ. అలాంటి ఎన్సీపీ మద్ధతును బీజేపీ అంగీకరిస్తే.. మా దారులు వేరవుతాయి’ అని చెప్పారు. ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి అధికారం కోసం అర్రులు చాచబోమన్నారు. కేంద్రమంత్రిగా ప్రమాణం చేయకుండానే సేన ఎంపీ అనిల్ ముంబై తిరిగిరావడంపై స్పందిస్తూ.. ‘కేంద్రంలో ఒక పద్దతి, రాష్ట్రంలో మరో పద్దతి ఉండకూడదు. కేంద్రంలో మేం కావాలంటున్నారు. కానీ రాష్ట్రంలో పొత్తుపై స్పష్టతనివ్వడం లేదు. దీన్నే వారికి చెప్పాం’ అన్నారు. అనంత్ గీతే విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. హిందూ వ్యతిరేక శక్తులు తలెత్తాయి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లు గెలుచుకున్న ఎంఐఎంను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. హిందువులకు ప్రమాదకరమైన కొన్ని శక్తులు మహారాష్ట్రలో తలలెత్తాయని ఠాక్రే అన్నారు. ఈ పరిస్థితుల్లో కాషాయ ఉగ్రవాదం గురించి మాట్లాడిన పవార్ మద్దతు తీసుకోవాలనిబీజేపీ కోరుకుంటోందన్నారు. దీనిపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ స్పందించారు. సేన అంగీకారంతోనే అనిల్ పేరును కొత్త మంత్రుల జాబితాలో చేర్చామన్నారు. ‘పొత్తు విలువల ప్రాతిపదికన ఉండాలే కానీ మంత్రిత్వ శాఖల ప్రాతిపదికన కాదు’ అని వ్యాఖ్యానించారు. నేటినుంచి ‘మహా’ అసెంబ్లీ నేటినుంచి 3 రోజుల పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. నవంబర్ 12న సీఎం ఫడ్నవిస్ విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. మెజారిటీకి 24 స్థానాల దూరంలో ఉన్న ప్రభుత్వానికి.. శివసేన మద్దతివ్వకపోయినా ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్యేం లేదు. బీజేపీ ప్రభుత్వానికి బయటనుంచి మద్ధతిస్తామని 41 మంది సభ్యులున్న ఎన్సీపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీలోకి సురేశ్ ప్రభు న్యూఢిల్లీ: శివసేన నేత, వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక శాఖలను సమర్థంగా నిర్వహించిన సురేశ్ ప్రభు ఆదివారం బీజేపీలో చేరారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న కాసేపటికే.. ఆయనను మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాలో త్వరలో జరగనున్న జీ 20 సదస్సులో పాల్గొంటున్న మోదీకి సహకరించే బాధ్యతలను ప్రభుకు అప్పగించారు. 1998-2004 మధ్య కేంద్ర భారీ పరిశ్రమలు, అటవీ, ఎరువులు, విద్యుత్ శాఖలను ఆయన నిర్వహించారు. 2013లో వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరమ్‌లో మోదీ కీలక ప్రసంగాన్ని నిర్వాహకులు రద్దు చేసినందుకు నిరసనగా, తన వార్టన్ స్కూల్ పర్యటనను సురేశ్ ప్రభు రద్దు చేసుకోవడాన్ని అప్పట్లో బీజేపీ వర్గాలు ప్రశంసించాయి. కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్ సింగ్ కుమారుడు అజాతశత్రు సింగ్, నాటి జమ్మూ మహారాజు హరిసింగ్ మనవడు కూడా ఆదివారం బీజేపీలో చేరారు. -
కేంద్ర మంత్రిగా సురేష్ ప్రభాకర్ ప్రమాణం
-
కేంద్ర మంత్రిగా మనోహర్ పరికర్ ప్రమాణం
-
కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
-
కేబినెట్ ముహూర్తం: ఆదివారం మధ్యాహ్నం 1గంట
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి మంత్రివర్గాన్ని విస్తరిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తన మంత్రి వర్గాన్ని విస్తరించడం ఇదే తొలిసారి. సార్వత్రిక ఎన్నికల అనంతరం మే నెలలో ఆయన అధికారాన్ని చేపట్టారు. ప్రస్తుతం కొంతమంది సీనియర్ మంత్రుల వద్ద రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాధాన్య శాఖలు ఉండటం, ఆ భారాన్ని వాళ్లు సరిగా నిర్వర్తించలేకపోతున్నట్లు ప్రధాని భావించడంతోను, మిత్ర పక్షాలకు అవకాశం కల్పించడానికి ఈ మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.