నిర్మల ప్రమోషన్‌పై జైట్లీ ఏమన్నారంటే.... | Very significant landmark in this reshuffle is that we now have Nirmala Sitharaman as the new Defence Minister | Sakshi
Sakshi News home page

నిర్మల ప్రమోషన్‌పై జైట్లీ ఏమన్నారంటే....

Published Sun, Sep 3 2017 4:44 PM | Last Updated on Wed, Oct 17 2018 5:55 PM

నిర్మల ప్రమోషన్‌పై జైట్లీ ఏమన్నారంటే.... - Sakshi

నిర్మల ప్రమోషన్‌పై జైట్లీ ఏమన్నారంటే....

న్యూఢిల్లీః రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్‌కు మోదీ కేబినెట్‌లో అత్యంత కీలక శాఖ దక్కడంపై పలువురు ఆమెకు  అభినందనలు తెలిపారు. ఇప్పటివరకూ రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలనూ చూసిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నిర్మలకు శుభాకాంక్షలు తెలిపారు. రక్షణ మంత్రిగా సరైన వారసురాలు లభించారని వ్యాఖ్యానిస్తూ మంత్రిత్వ శాఖ ఆశయాల సాధనలో మున్ముందుకు వెళతారని ఆకాంక్షించారు. రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్‌ త్వరలో బాధ్యతలు చేపడతారని చెప్పారు.

మెరుగైన పనితీరుతోనే ఆమెకు అత్యున్నత బాధ్యతలు దక్కాయని జైట్లీ పేర్కొన్నారు. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో నిర్మలకు రక్షణ మంత్రిత్వ శాఖ దక్కడమే ప్రాధాన్యత కలిగిన అంశమని అన్నారు. ప్రతి మంత్రిత్వ శాఖ, మంత్రుల పనితీరును ప్రధాని నరేంద్ర మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారనేందుకు ఇది విస్పష్ట సంకేతమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement