ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి మంత్రివర్గాన్ని విస్తరిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తన మంత్రి వర్గాన్ని విస్తరించడం ఇదే తొలిసారి.
సార్వత్రిక ఎన్నికల అనంతరం మే నెలలో ఆయన అధికారాన్ని చేపట్టారు. ప్రస్తుతం కొంతమంది సీనియర్ మంత్రుల వద్ద రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాధాన్య శాఖలు ఉండటం, ఆ భారాన్ని వాళ్లు సరిగా నిర్వర్తించలేకపోతున్నట్లు ప్రధాని భావించడంతోను, మిత్ర పక్షాలకు అవకాశం కల్పించడానికి ఈ మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.