ఆ కేంద్రమంత్రి రాజీనామా వెనుక కొత్త కోణం | cabinet reshuffle: central minister resigned over corruption allegations | Sakshi
Sakshi News home page

అవినీతిపై మోదీ ఆగ్రహం: కేంద్రమంత్రి రాజీనామా!

Published Sat, Sep 2 2017 3:48 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ఆ కేంద్రమంత్రి రాజీనామా వెనుక కొత్త కోణం - Sakshi

ఆ కేంద్రమంత్రి రాజీనామా వెనుక కొత్త కోణం

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రిమండలి విస్తరణ నేపథ్యంలో పెద్దసంఖ్యలో పలువురు కేంద్రమంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ అధిష్టానం సూచన మేరకు మంత్రులంతా స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు ఇప్పటివరకు అంతా అనుకున్నారు. కానీ, ఓ కేంద్ర మంత్రి రాజీనామా వెనుక ఆసక్తికర కోణం ఉన్నట్టు తాజాగా తెలిసింది. అవినీతి ఆరోపణలతోనే సదరు మంత్రిపై వేటు వేసినట్టు సమాచారం. ఈ మధ్య అవినీతి కేసులో నలుగురు కేంద్ర ప్రభుత్వ అధికారులను సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టైన అధికారులను సీబీఐ విచారించగా.. సదరు మంత్రిగారి అవినీతి బాగోతం బయటపడింది.

కాల్‌ డాటా, ఫోన్‌ సంభాషణలను పరిశీలించి మరీ సీబీఐ ఆయన అవినీతిని ధ్రువీకరించుకుంది. ఈ వ్యవహారం తన దృష్టికి చేరడంతో సదరు మంత్రిపై ప్రధాని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ బాగోతం బయటపడకముందే రాజీనామా చేయాలని ఆయనను ప్రధాని మోదీ ఆదేశించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారని కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆ మంత్రి అవినీతి వ్యవహారం పూర్తిగా బయటకు రాలేదు. అవినీతి రహిత పాలన విషయంలో ప్రధాని మోదీ దృఢనిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. తన కేబినెట్‌లో ఎవరూ అవినీతికి పాల్పడినా సహించేది లేదని ఆయన ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ కేంద్రమంత్రి రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement