సాక్షి, ఢిల్లీ: త్వరలో కేబినెట్ విస్తరణకు కేంద్రం సన్నద్ధమవుతోంది. పునర్వ్యవస్థీకరణ, విస్తరణ చర్చలు జోరందుకున్న క్రమంలో పార్లమెంట్ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశముంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. దీంతో పార్టీ సంస్థాగతంగానూ పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు 2024లో లోక్‌సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంలో, పార్టీలో భారీ మార్పులుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా, తెలంగాణపై కమలదళం ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ విస్తరణలో ఇక్కడి నుంచి మరొకరికి మంత్రి పదవి వరించనుందనే ప్రచారం సాగుతోంది. ఆ దిశగా ప్రధాని మోదీ యోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ నుంచి లోక్‌సభకు, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.
చదవండి: యూపీ సీఎం కాషాయ దుస్తులపై కాంగ్రెస్ మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment