ట్విట్టర్‌లో నిన్న అదే హాట్ టాఫిక్
పలు సీనియర్ మంత్రిత్వ శాఖల్లో భారీగానే మార్పులు చేపడుతూ ఆదివారం ప్రధాని మోదీ ప్రభుత్వం చేపట్టిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ట్విట్టర్ మారుమోగిపోయింది.
సాక్షి, న్యూఢిల్లీ : పలు సీనియర్ మంత్రిత్వ శాఖల్లో భారీగానే మార్పులు చేపడుతూ ఆదివారం ప్రధాని మోదీ ప్రభుత్వం చేపట్టిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ట్విట్టర్ మారుమోగిపోయింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై 4 లక్షలకు పైగా సంభాషణలు ట్విట్టర్‌లో చోటుచేసుకున్నాయి. దేశంలో ఏదైనా ప్రజాసంబంధమైన వ్యవహారాలను చర్చించడానికి ట్విట్టర్ కీలక ప్లాట్‌ఫామ్‌గా ఉంటూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ నిన్న జరిగిన పునర్వ్యవస్థీకరణపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పాపులర్ హ్యాష్‌ట్యాగ్స్‌గా #కేబినెట్‌రీషఫుల్, #టీమ్‌మోడీ, #మోడీ2019 కేబినెట్, #మినిస్టరీ4న్యూఇండియాలు ఉన్నాయి.
ఆదివారం చేపట్టిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో తొమ్మిది మంది కొత్త మంత్రులు పదవి బాధ్యతలు చేపట్టారు. వారిలో కీలక రక్షణ శాఖను నిర్మలా సీతారామన్‌కు కేటాయించారు. అంతేకాక పీయూష్ గోయల్‌కు రైల్వేమంత్రిత్వ శాఖను, రైల్వే శాఖ నుంచి సురేష్ ప్రభును వాణిజ్య, పరిశ్రమల శాఖకు కేటాయించారు. తొలిసారి ఓ మహిళ ఫుల్‌టైమ్ రక్షణ శాఖ మంత్రిగా పదవి చేపట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు శుభకాంక్షల వెల్లువ కొనసాగింది.