కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. శివ సేన ఫైర్‌ | Shiv Sena and JDU respond on Cabinet Reshuffle | Sakshi
Sakshi News home page

కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. శివ సేన ఫైర్‌

Published Sun, Sep 3 2017 10:31 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. శివ సేన ఫైర్‌ - Sakshi

కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. శివ సేన ఫైర్‌

కేబినెట్‌లో చోటు కోసం మేం ఎవరినీ అడుక్కోం అంటూ శివ సేన పార్టీ బీజేపీపై...

సాక్షి, ముంబై: కేంద్ర మంత్రి పునర్వ్యవస్థీకరణపై శివ సేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కొత్త కేబినెట్‌లో మిత్రపక్షం శివ సేనకు ప్రధాని మోదీ మొండిచేయి ఇచ్చిన విషయం తెలిసిందే. మేం ఎవరినీ ఏం అడుక్కోం.. ఆ పరిస్థితి మాకు అక్కర్లేదంటూ పార్టీ అధిష్టానం వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇక కార్యక్రమానికి గైర్హాజరవుతున్నట్లు శివ సేన ప్రకటించింది.
 
ఇక ముందు నుంచి ఊహిస్తూ వస్తున్నట్లు మరో మిత్ర పక్షం జేడీ(యూ)కు కొత్త మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. రెండు స్థానాలు ఖాయమని రామ్‌నాథ్ ఠాకూర్‌, ఆర్‌సీపీ సింగ్‌లకు బెర్తులు దక్కవచ్చని ముందు నుంచి చెబుతున్నప్పటికీ, చివరి నిమిషంలో వారి పేర్లు చేర్చేలేదు. మంత్రి వర్గ విస్తరణపై మీడియా ద్వారానే సమాచారం తెలిసిందని ఆ పార్టీ అధినేత నితీశ్ కుమార్ వ్యాఖ్యానించటం కొసమెరుపు. మరోవైపు నాలుగో విస్తరణలో జేడీయూతోపాటు అన్నాడీఎంకేకు చోటుదక్కచని సమాచారం. 
 
మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement