
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతన కేబినెట్ ఏర్పాటుపై కసరత్తు కొనసాగుతుందని.. అన్ని అంశాలను సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లు సజ్జల తెలిపారు. పాత, కొత్త కలయికతో కేబినెట్ ఉంటుందని స్పష్టం చేశారు. రేపు(ఆదివారం) మధ్యాహ్నం వరకు కసరత్తు కొనసాగుతుందని తెలిపారు.
చదవండి: (పాత, కొత్త మంత్రులతో సీఎం జగన్ తేనీటి విందు)
కాబోయే మంత్రులకు ఆదివారం ఫోన్ ద్వారా సమాచారం తెలియజేస్తామన్నారు. కేబినెట్‌లో బీసీలకు, మహిళలకు సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. రాజీనామాలు అందరివీ గవర్నర్ వద్దకు వెళ్తాయని, మళ్లీ కొత్తగా ప్రమాణ స్వీకారం ఉంటుందని సజ్జల తెలిపారు. ఇదిలా ఉండగా, శుక్రవారం రాత్రి సుమారు రెండు గంటల పాటు సీఎం జగన్తోతో సమావేశమైన సజ్జల.. శనివారం మరోసారి భేటీ అయ్యారు.