
సాక్షి, న్యూఢిల్లీ: కేబినెట్ విస్తరణలో భాగంగా రాష్ట్రపతి భవన్‌లో కొత్త కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో కొత్త మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు చేశారు. తనకు హితులు, సన్నిహితులు లేరని తెలిపారు. పనితీరే పదవికి ప్రామాణికం అన్నారు. కష్టపడి పని చేయండి.. ప్రజల్లోకి వెళ్లండి అని సూచించారు. మరో ప్రక్షాళన ఉండబోదని అనకోవద్దని మోదీ కొత్త మంత్రులకు హెచ్చరిక జారీ చేశారు.
ఇప్పటి వరకు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కిరణ్ రిజిజు, కిషన్ రెడ్డి, మన్సుక్ మాండవ్య వంటి వారికి పదోన్నతి లభించగా.. మిగతవారంతా కొత్తవారు. గతంలో సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఈ సారి కేబినెట్ హోదా దక్కింది. దాంతో తెలంగాణ బీజేపీ శ్రేణులు సంబంరాలు జరుపుకుంటున్నారు.