త్వరలో కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు! | Cabinet Reshuffle Likely After Amit Shah's Re-election As BJP Chief: Sources | Sakshi
Sakshi News home page

త్వరలో కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు!

Published Wed, Jan 13 2016 12:42 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

త్వరలో కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు! - Sakshi

త్వరలో కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు!

త్వరలో కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

న్యూఢిల్లీ : త్వరలో కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా రెండోసారి ఎన్నిక తర్వాత ఈ మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే కేంద్ర మంత్రివర్గంలోకి కొత్త ముఖాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా తీసుకు వెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావిస్తున్నారు.  ఈ మేరకు కేబినెట్లో మార్పులు జరగనున్నట్లు సమాచారం. మరోవైపు హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ శాఖలను ఈ మార్పు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అలాగే పనితీరులో వెనకబడ్డ మంత్రులపై వేటుకు రంగం సిద్ధం కాగా, మరికొందరి మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక బిహార్ నుంచి కేంద్ర మంత్రుల సంఖ్యను కుదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అమిత్ షా పదవీ కాలం ముగియనుండటంతో, ఆయనను తప్పించడానికి సీనియర్ నేతలు కొందరు అసమ్మతి గళాన్ని వినిపించారు. అయితే మెజార్టీ పార్టీ నేతలు మరోసారి అధ్యక్షుడిగా అమిత్ షా వైపే మొగ్గు చూపుతుండటంతో రెండో టరమ్ కూడా ఆయన ఎన్నిక తధ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement