
ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖర్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖర్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.అనంతరం విజయశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు.
పులివెందుల ప్రముఖ పారిశ్రామికవేత్త చవ్వా విజయశేఖర్‌రెడ్డి అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ప్రజల సందర్శనార్ధం ఆయన పార్థివదేహాన్ని పాల్‌రెడ్డి ఫంక్షన్ హాలులో ఉంచారు. విజయశేఖర్‌రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్‌కి దగ్గరి బంధువు.
