
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అగ్ని ప్రమాదాలపై
అప్రమత్తంగా ఉండాలి
కొత్తగూడెంటౌన్: అగ్ని ప్రమాదాలపై ప్రతీ ఒక్కరు ఆప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అఽధికారి పి.పుల్యయ్య తదితరులు పాల్గొన్నారు.
బొగ్గు ఉత్పత్తికి
అంతరాయం
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లిలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సింగరేణి గనుల్లో నీరు చేరింది. జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల్లో వరద నీరు నిలవడంతో సోమవారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కిష్టారం ఓపెన్‌కాస్ట్‌లో 5వేల టన్నులు, జేవీఆర్ ఓసీలో 20వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.

ముత్తంగి అలంకరణలో రామయ్య