
సీతాపతి.. కరోడ్‌పతి!
శుక్రవారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
ఈ ఏడాది రూ.2.69 కోట్లు..
ఈ ఏడాది రామయ్యకు నవమి ఆదాయం భారీగా పెరిగింది. అన్ని విభాగాల్లో కలిపి రూ.2,69,09,390 సమకూరింది. ఇందులో అధికంగా సెక్టార్ల టికెట్ల విక్రయం ద్వారానే రూ.1,32,83,000 వచ్చింది. చిన్న లడ్డూల అమ్మకం ద్వారా రూ.49,07,775, మహా లడ్డూల ద్వారా రూ.2,89,000 సమకూరింది. ఇక తలంబ్రాల అమ్మకంలో పోస్టల్ ద్వారా రూ.6,64,225, ఆర్టీసీ కార్గో ద్వారా 41,09,200, ఆలయ వెబ్‌సైట్ ద్వారా 5,06,750, ఆలయ ప్రచార శాఖ ద్వారా 13,87,050 ఆదాయం వచ్చింది. ఆన్‌లైన్‌లో పరోక్ష సేవల ద్వారా 5,02,200, రూ.5 వేల పరోక్ష సేవల ద్వారా రూ. 3 లక్షల 45 వేల ఆదాయం చేకూరింది. పోస్టల్ శాఖ ద్వారా చేపట్టిన అంతరాలయ అర్చనకు భారీ స్పందన లభించింది. 2702 బుకింగ్‌లతో రూ.8,78,150 నిధులు సమకూరాయి.
గతేడాది కంటే రూ.80 లక్షలు అదనం
శ్రీరామనవమికి 2024లో వచ్చిన ఆదాయం కంటే ఈ ఏడాది ఆదాయం పెరగం విశేషం. గతేడాది సుమారు రూ. కోటి 89 వేల 61 వేలు రాగా ఈ ఏడాది అదనంగా సుమారు రూ. 80 లక్షల ఆదాయం పెరిగింది. ఇందులో సెక్టార్ల టికెట్ల విక్రయం ద్వారా సుమారు రూ.10 లక్షల ఆదాయం పెరిగింది. గతేడాది ముత్యాల తలంబ్రాల విక్రయం ద్వారా కేవలం రూ. 30 లక్షలు రాగా, ఈ ఏడాది రూ.66 లక్షల 67 వేల 225 ఆదాయం సమకూరింది. పోస్టల్ శాఖ ద్వారా బుకింగ్ చేసిన అంతరాలయ అర్చన ఆదాయం కూడా పెరిగింది. గతేడాది కేవలం రూ.91 వేలు ఉండగా ఈ ఏడాది రూ.8,78,150కు పెరిగింది. ఇందులో సీఎం, వీవీఐపీ సెక్టార్ల కోసం ఉభయదాతల టికెట్లను తగ్గించారు. దీనివల్ల సుమారు రూ.16 లక్షల ఆదాయానికి గండి పడింది. దీంతోపాటు మరికొన్ని పొదుపు చర్యలను పాటించి ఉంటే ఆదాయం సుమారు రూ. 3 కోట్లకు చేరేది.
న్యూస్‌రీల్
గణనీయంగా పెరిగిన శ్రీరామనవమి ఆదాయం
భద్రాచలం శ్రీసీతారామచంద్ర
స్వామివారికి రూ.2.69 కోట్ల రాబడి
ముత్యాల తలంబ్రాల విక్రయాలకు విశేష ఆదరణ
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి కల్యాణ మహోత్సవ ఆదాయం లెక్క తేలింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 6,7వ తేదీల్లో శ్రీ సీతారాముల కల్యాణం, పట్టాభిషేక ఉత్సవాలు నిర్వహించిన విషయం విదితమే. వేడుకల్లో టికెట్లు, తలంబ్రాలు, లడ్డూల అమ్మకాలు, పరోక్ష సేవల ద్వారా రామయ్యకు భారీగా ఆదాయం సమకూరింది. గతేడాది కంటే గణనీయంగా పెరిగింది. ఆ లెక్కలను ఆలయ అధికారులు గురువారం వెల్లడించారు.
–భద్రాచలం
పెరిగిన ముత్యాల తలంబ్రాల అమ్మకాలు..
ప్రతీ ఏడాది ముత్యాల తలంబ్రాలకు భక్తుల నుంచి ఆదరణ లభిస్తోంది. దేవస్థానం కౌంటర్లు, ప్రచార శాఖలతోపాటు ఆర్టీసీ కార్గో, పోస్టల్ శాఖల ద్వారా తలంబ్రాలు విక్రయిస్తున్నారు. దీంతో దేవస్థానంతోపాటు ఆర్టీసీ, పోస్టల్ శాఖలకు కూడా ఆదాయం సమకూరుతోంది. గతేడాది ఆర్టీసీ కార్గో ద్వారా 46,400 ఫ్యాకెట్లను అమ్మగా, ఈఏడాది లక్షా 64 వేల 368 ప్యాకెట్లను విక్రయించారు. సుమారు 80 వేల ప్యాకెట్ల అదనంగా అమ్మకం చేశారు. పోస్టల్ శాఖ ద్వారా గతేడాది 2,531 ప్యాకెట్లు విక్రయించగా, ఈ ఏడాది 26,569 ప్యాకెట్లను అమ్మారు. దేవస్థానం ప్రచార శాఖ ద్వారా గతేడాది 31,518 కాగా, ఈ ఏడాది 55,482 ప్యాకెట్లను విక్రయించారు. ముత్యాల తలంబ్రాలు, దేవస్థాన కేలండర్లు, డైరీలు, వివిధ పుస్తకాలను అన్ని శాఖల ద్వారా ఏడాదంతా భక్తులకు అందుబాటులో ఉంచితే మరింత ఆదరణ లభించే అవకాశం ఉంది.

సీతాపతి.. కరోడ్‌పతి!

సీతాపతి.. కరోడ్‌పతి!

సీతాపతి.. కరోడ్‌పతి!

సీతాపతి.. కరోడ్‌పతి!