
న్యూఢిల్లీ: టెలికం యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5జీ సేవలు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఆగస్ట్–సెప్టెంబర్‌కల్లా 5జీ రంగ ప్రవేశం చేస్తుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం తెలిపారు. డిసెంబర్ కల్లా 20 నుంచి 25 నగరాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ‘‘దేశంలో డేటా ధరలు అంతర్జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయి. 5జీలోనూ ఇదే పంథా కొనసాగుతుంది.
నెట్‌వర్క్ ప్రొవైడర్ల విషయంలో నమ్మదగ్గ దేశంగా భారత్ టాప్‌లో నిలుస్తుంది. మన 4జీ, 5జీ ఉత్పత్తులు, సాంకేతికతలపై పలు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ఆయాచిత ఫోన్‌కాల్స్‌కు సంబంధించి కీలక నిబంధన రానుంది. కాల్ చేస్తున్న వారి వివరాలు కేవైసీ ఆధారంగా ఫోన్‌లోనే ప్రత్యక్షమవుతాయి’’ అని మంత్రి తెలిపారు. ఢిల్లీ సహా పలు నగరాల్లో మొబైల్ టవర్లపై ప్రజలు అభ్యంతరాల నేపథ్యంలో, రేడియేషన్‌పై ఆందోళన అవసరం లేదన్నారు.