ఆనంద్ మహీంద్రా భావోద్వేగ పోస్ట్ | Anand Mahindra Gets Emotional As Japanese And Korean Auto Enthusiast Click Photos Of Brand SUV, Post Goes Viral | Sakshi
Sakshi News home page

ఆనంద్ మహీంద్రా భావోద్వేగ పోస్ట్: దశాబ్దాల క్రితం..

Published Fri, Feb 7 2025 9:13 PM | Last Updated on Sat, Feb 8 2025 1:13 PM

Anand Mahindra Gets Emotional as Japanese and Korean auto Enthusiast Click Photos of Brand SUV

జనవరిలో ఢిల్లీలో జరిగిన 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025''లో.. భారతీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించింది. కంపెనీ ప్రదర్శించిన బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ కార్లు భారతీయులను మాత్రమే కాకుండా.. విదేశీయులను సైతం ఫిదా చేశాయి. జపాన్, కొరియా నుంచి వచ్చిన ప్రతినిధులు ఆ కార్లను ఫోటోలు తీస్తూ కనిపించారు. ఇది మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)ను భావోద్వేగానికి గురిచేసింది.

దశాబ్దాల క్రితం, నేను ఆటో పరిశ్రమలో నా కెరీర్‌ను ప్రారంభించినప్పుడు, విదేశాలలో తయారైన అధునాతన కార్లను ఫోటో తీయడానికి, వాటి గురించి తెలుసుకోవడానికి భారతీయ ప్రతినిధులు అంతర్జాతీయ ఆటో షోలకు వెళ్లేవారు. అయితే ఇప్పుడు దేశీయ వాహనాలను విదేశీయులను ఆకట్టుకుంటున్నాయని.. తన ఎక్స్ ఖాతాలో ఆనంద్ మహీంద్రా భవోద్వేగ పోస్ట్ చేసారు.

మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ
భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ కార్లలో మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ కూడా ఉన్నాయి. ఇవి సాధారణ ఎలక్ట్రిక్ కార్లకు భిన్నంగా ఉన్నాయి. ఈ రెండూ తమ భవిష్యత్ డిజైన్లు, అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉండటం వల్ల హాజరైన వారిని ఆకట్టుకున్నాయి.

స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉన్న BE 6.. సొగసైన  కూపే లుక్‌ను స్వీకరించే XEV 9e రెండూ 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్‌లను పొందుతాయి. ఇవి 170kW, 210kW మోటార్ ద్వారా పవర్ డెలివరీ చేస్తాయి. పూర్తి ఛార్జ్‌పై 683 కిమీ (BE 6) మరియు 656 కిమీ (XEV 9e) వరకు పరిధిని అందిస్తాయి.

ఎక్స్ఈవీ 9ఈ, బీఈ6 బుకింగ్స్ & డెలివరీ
మహీంద్రా కంపెనీ దేశీయ విఫణిలో లాంచ్ చేసిన ఎక్స్ఈవీ 9ఈ (XEV 9e), బీఈ 6 (BE 6) ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడానికి సన్నద్దమైంది. కంపెనీ ఫిబ్రవరి 14 నుంచి బుకింగ్స్ ప్రారంభించనుంది. డెలివరీకి సంబంధించిన వివరాలను కూడా సంస్థ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement