
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మొదలైన పారాలింపిక్స్ 2024లో పాల్గొనే టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫోటో షేర్ చేశారు. దీనికోసం చాట్‌జీపీటీ 4oను ఉపయోగించారు.
ఆనంద్ మహీంద్రా ఫోటో షేర్ చేస్తూ.. టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఒక గ్రాఫిక్‌ను రూపొందించమని చాట్‌జీపీటీ-4oని కోరాను. అది వెంటనే ఒక చిత్రాన్ని డిజైన్ చేసింది. ఈ ఫోటో నా మనోభావాలకు చాలా దగ్గరగా ఉందని, నన్ను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.
పారిస్ పారాలింపిక్స్ 2024 గేమ్స్ ఆగష్టు 28 నుంచి సెప్టెంబర్ 8వరకు జరుగుతాయి. ఇందులో ఇండియా తరపున 84మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. పారా సైక్లింగ్, పారా రోయింగ్, బ్లింక్ జూడో వంటి కొత్త క్రీడల్లో భారతీయ క్రీడాకారులు మొదటిసారి పాల్గొంటున్నారు.
I asked ChatGPT 4o to create a graphic for wishing the Indian #Paralympics2024 Team Good Luck.
This outcome isn’t bad at all!
It adequately showcases my sentiments—my excitement about our Team’s potential.
🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/LYMZoCGsVL— anand mahindra (@anandmahindra) August 28, 2024