
ఎడెల్‌వీజ్ మ్యూచువల్ ఫండ్ దేశంలో మొదటి ‘ఇంటర్నెట్ ఎకానమీ ఇండెక్స్ ఫండ్’ను ఆవిష్కరించింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ ఈ నెల 25న ప్రారంభమైంది. వచ్చే నెల 9వ తేదీ వరకు పెట్టుబడులను స్వీకరించనుంది.
బీఎస్‌ఈ ఇంటర్నెట్ ఎకానమీ టోటల్ రిటర్న్ ఇండెక్స్‌లో మొత్తం 20 స్టాక్స్ ఉన్నాయి. సూచీలో వెయిటేజీ ఆధారంగా ఆయా స్టాక్స్‌లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమైన కంపెనీల్లో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుంది. కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.