
ఫోర్స్ మోటార్స్ లిమిటెడ్ భారత రక్షణ దళాల నుంచి ఏకంగా 2,978 ఫోర్స్ గూర్ఖా వాహనాల కోసం ఆర్డర్ పొందింది. త్వరలోనే ఈ వాహనాలు రక్షణ శాఖలోకి చేరనున్నాయి. కంపెనీ ఈ కార్లను సైనిక కార్యకలాపాలకు అనుగుణంగా తయారు చేయనుంది.
ఫోర్స్ గూర్ఖా కార్లు.. ఇండియన్ ఆర్మీ, వైమానిక దళాలలో చేరనున్నాయి. ఈ కార్లు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోగల సత్తా, మంచి ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కలిగి ఉండటం వల్లనే సైనిక దళాలకు ఉపయోగకరంగా ఉంటాయి. కంపెనీ లైట్ స్ట్రైక్ వెహికల్ (LSV) వేరియంట్ రక్షణ శాఖకు డెలివరీ చేయనున్నట్లు సమాచారం.
భారతదేశంలో ఫోర్స్ మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం ఫోర్స్ గూర్ఖా (3-డోర్, 5-డోర్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది), ఫోర్స్ ట్రావెలర్, ఫోర్స్ ట్రాక్స్, ఫోర్స్ అర్బానియా, ఫోర్స్ సిటీలైన్, ఫోర్స్ మోనోబస్ మొదలైనవి ఉన్నాయి. గూర్ఖా 2.6-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 138bhp, 320Nm ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.