మూడేళ్లలో రూ.52 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఎక్కడంటే.. | India expected to receive over 600 billion USD over the next three years to boost startup ecosystem | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో రూ.52 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఎక్కడంటే..

Published Thu, Mar 13 2025 9:24 AM | Last Updated on Thu, Mar 13 2025 9:27 AM

India expected to receive over 600 billion USD over the next three years to boost startup ecosystem

దేశీ అంకురాలు గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్టార్టప్‌ల వ్యవస్థలోకి భారీగా పెట్టుబడులు రానున్నాయనే అంచనాలు నెలకొన్నాయి. వచ్చే మూడేళ్లలో 600 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.52 లక్షల కోట్లు) మేర ప్రైవేట్‌ ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌లాంటి (పీఈ/వీసీ) ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్లు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. 

కొత్త ఆవిష్కరణలను, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడానికి, కొత్త వెంచర్లు మనుగడ సాగించేలా అనువైన పరిస్థితులు కల్పించడానికి ఇవి తోడ్పడనున్నాయి. 2027 ఆర్థిక సంవత్సరానికల్లా భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయిని సాధించాలంటే కావాల్సిన పెట్టుబడుల్లో (ప్రభుత్వ పెట్టుబడులు, కార్పొరేట్‌ డెట్, పీఈ/వీసీ ఫండింగ్‌ మొదలైనవి) ఇది 13 శాతమని ఐఎంటీ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ (సీఎఫ్‌ఎం) ప్రారంభ కార్యక్రమంలో నిపుణులు తెలిపారు.

ఇదీ చదవండి: స్టార్‌లింక్‌కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్‌.. కాసేపటికే డిలీట్‌

భారత అంకుర సంస్థల సామర్థ్యాలను ఇన్వెస్టర్లు గుర్తిస్తున్న నేపథ్యంలో స్టార్టప్‌ల వ్యాపారం తీరుతెన్నుల్లో గణనీయంగా మార్పులు రాగలవని ఐఎంటీ ఘాజియాబాద్‌ డైరెక్టర్‌ ఆతిష్‌ చటోపాధ్యాయ పేర్కొన్నారు. బీఎఫ్‌ఎస్‌ఐ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతుండటంతో సీఎఫ్‌ఎంలో కోర్సులకు మంచి ఆదరణ ఉంటుందని వివరించారు. పరిశ్రమ అవసరాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ రూపొందించిన సర్టిఫికేషన్లు, అనుభవపూర్వకమైన విధంగా ఉండే బోధన మొదలైన అంశాలు, విద్యార్థులు వివిధ నైపుణ్యాలను సాధించేందుకు ఉపయోగపడగలవని హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎండీ నవనీత్‌ మునోట్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement