
భారతదేశంలో అత్యంత సంపన్నులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల గురించి.. వారి పిల్లల గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే వారి కోడళ్ళు కూడా వ్యాపార సామ్రాజ్యంలో తమదైన గుర్తింపు తెచుకున్నవారే.. అని బహుశా కొంతమందికి మాత్రమే తెలుసుంటుంది. ఈ కథనంలో రిలయన్స్ గ్రూప్, అదానీ గ్రూప్ అధినేతల కోడళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
శ్లోకా మెహతా
ముఖేష్ & నీతా అంబానీల పెద్ద కోడలు, ఆకాశ్ అంబానీ భార్య శ్లోకా మెహతా ప్రఖ్యాత వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె. 2014 నుంచి తన కుటుంబ వ్యాపారమైన రోజీ బ్లూ డైమండ్స్ కంపెనీలో కీలక బాధ్యతలు చేపట్టారు. శ్లోకా రోజీ బ్లూ ఫౌండేషన్ డైరెక్టర్ కూడా. ఈమె నికర విలువ రూ.130 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది.
రాధిక మర్చంట్
ముఖేష్, నీతా అంబానీల చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య 'రాధిక మర్చంట్' ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌లో డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అంతే కాకుండా ఈమె ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌కు సీఈఓ & వైస్-చైర్మన్ కూడా. ఈమె నికర విలువ రూ. 10 కోట్ల కంటే ఎక్కువ.
ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..
పరిధి ష్రాఫ్
గౌతమ్ అదానీ కోడలు, కరణ్ అదానీ భార్య 'పరిధి ష్రాఫ్'.. వృత్తిరీత్యా న్యాయవాది. ఈమె న్యాయ దిగ్గజం సిరిల్ ష్రాఫ్ కుమార్తె. పరిధి ష్రాఫ్ భారతదేశంలోని అత్యంత చురుకైన చట్టపరమైన మనస్తత్వం కలిగిన వారిలో ఒకరు. సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్‌లో భాగస్వామిగా ఉన్న ఈమె ఎస్సార్-రోస్‌నెఫ్ట్ వంటి బిలియన్ డాలర్ల ఒప్పందాలపై పనిచేశారు.
దివా జైమిన్ షా
ఈ ఏడాది ఫిబ్రవరిలో గౌతమ్ అదానీ చిన్న కొడుకును వివాహం చేసుకున్న 'దివా జైమిన్ షా'.. ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఈమె చార్టర్డ్ ఫైనాన్స్ అనలిస్ట్.. గతంలో డెలాయిట్ ఇండియాలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా పనిచేశారని సమాచారం. ఈమె వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె మరియు ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ సి. దినేష్ అండ్ కో. ప్రైవేట్ లిమిటెడ్ సహ యజమాని.