
థార్ రాక్స్ 4x4 వేరియంట్ ధరలను మహీంద్రా కంపెనీ వెల్లడించింది. ఈ SUV ధరలు రూ. 14.79 లక్షల నుంచి రూ. 22.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఎడిషన్ ఎంఎక్స్5, ఏఎక్స్5 ఎల్, ఏఎక్స్7 ఎల్ అనే మూడు వేరియంట్లలో కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
మహీంద్రా థార్ రాక్స్ 4x4 ఎడిషన్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో 330 Nm టార్క్ 150 Bhp పవర్ అందిస్తుంది. అదే 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 172 Bhp పవర్, 370 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్నో, సాండ్, మడ్ అనే మూడు పవర్ మోడ్స్ పొందుతుంది.
ఇదీ చదవండి: పరిమాణం చిన్నది.. పనిమాత్రం పెద్దది: 'పవర్'ఫుల్ రియాక్టర్
థార్ రాక్స్ ఎంఎక్స్5 4x4 ఎడిషన్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, రివర్స్ కెమెరా, సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, ఆటో హెడ్‌లైట్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఏఎక్స్5 ఎల్ వేరియంట్ 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్, లెవల్ 2 ఏడీఏఎస్ టెక్ వంటివి పొందుతుంది. ఏఎక్స్7 ఎల్ పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటివి పొందుతాయి.