భారత్‌కు నిజమైన బహుమతి!: అదానీ ట్వీట్ | Navi Mumbai Airport Set to Be Inaugurated in 2025 June | Sakshi
Sakshi News home page

భారత్‌కు నిజమైన బహుమతి!: అదానీ ట్వీట్

Published Mon, Mar 17 2025 11:42 AM | Last Updated on Mon, Mar 17 2025 3:25 PM

Navi Mumbai Airport Set to Be Inaugurated in 2025 June

నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూన్‌లో ప్రారంభించనున్నట్లు అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' (Gautam Adani) ప్రకటించారు. దీనిని ఏప్రిల్ 17న ప్రారంభించాలని మొదట అనుకున్నప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఈ కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ (AAHL), సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర (CIDCO) భాగస్వామ్యంతో జరుగుతోంది. 2018 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టుకు పునాదిరాయి వేసారు. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 16,700 కోట్లు అవుతుందని అంచనా.

ఇప్పటికే ముంబైలోని ప్రధాన విమానాశ్రయంలో రద్దీని తగ్గించడానికి.. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ విమానాశ్రయాన్ని సందర్శించిన సందర్భంగా.. ఈరోజు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ స్థలాన్ని సందర్శించాను. ప్రపంచ స్థాయి విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. ఇది జూన్‌లో ప్రారంభోత్సవానికి సిద్దమవుతుంది. అంతే కాకుండా ఇది భారతదేశానికి నిజమైన బహుమతి!. అని అదానీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌: వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

రెండు రన్‌వేలు, నాలుగు టెర్మినల్స్‌తో రూపొందించబడిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, ఐదు దశల్లో పూర్తయిన తర్వాత ఏటా 90 మిలియన్ల మంది ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయిన తరువాత ముంబైలోని ప్రధాన విమానాశ్రయంలో రద్దీ తగ్గుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement