
విచారణ చేస్తున్నట్టు ప్రకటించిన కంపెనీ
న్యూఢిల్లీ: నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సైబర్ ముప్పును ఎదుర్కొన్నట్టు ప్రకటించింది. కంపెనీ కస్టమర్ల డేటాబేస్‌ను హ్యాక్ చేసినట్టు ఓ గుర్తు తెలియని సంస్థ నుంచి బెదిరింపు ఈ–మెయిల్ వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం అందించింది.
డేటా లీక్ అయిన విషయంలో తాము దర్యాప్తు చేస్తున్నట్టు, రిస్క్‌ను అధిగమించే చర్యలు అమలు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. 2024 డిసెంబర్ 31 నాటికి నివాబూపాకు 1.98 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. గతేడాది మరో సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సైతం డేటా చోరీ ఘటనను ఎదుర్కోవడం తెలిసిందే.