
స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 757.55 పాయింట్లు లేదా 0.97 శాతం నష్టంతో 77,259.64 వద్ద, నిఫ్టీ 204.10 పాయింట్లు లేదా 0.86 శాతం నష్టంతో 23,464.55 వద్ద నిలిచాయి.
టూరిజం ఫైనాన్స్ కార్ప్ ఆఫ్ ఇండియా, కాప్రి గ్లోబల్ క్యాపిటల్, జెనస్ పేపర్ & బోర్డ్, పిల్ ఇటాలికా లైఫ్‌స్టైల్, SMS లైఫ్ సైన్సెస్ ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. NDL వెంచర్స్, సలాసర్ టెక్నో ఇంజనీరింగ్, BLB షేర్, లోటస్ ఐ కేర్ హాస్పిటల్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)