
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 67 పాయింట్లు పెరిగి 24,311కు చేరింది. సెన్సెక్స్(Sensex) 162 పాయింట్లు పుంజుకుని 79,952 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.61 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 66.95 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 2.03 శాతం లాభపడింది. నాస్‌డాక్ 2.74 శాతం ఎగబాకింది.
భారత స్టాక్ మార్కెట్లో ఇటీవలి ర్యాలీకి అనేక అంశాలు కారణమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయి మార్చిలో 3.34 శాతానికి చేరుకుంది. దీంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకుల పనితీరుపై పెట్టుబడిదారులు సానుకూలంగా ఉన్నారు. బ్రెంట్ క్రూడ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇది ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గిస్తుంది.


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
