
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 831 పాయింట్లు తగ్గి 22,072కు చేరింది. సెన్సెక్స్(Sensex) 2,542 పాయింట్లు దిగజారి 72,795 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్లు మొదలైన పావుగంటలోనే బీఎస్‌ఈలో దాదాపు రూ.12 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.09 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 63.86 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.93 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో భారీ నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 5.97 శాతం నష్టోయింది. నాస్‌డాక్ 5.82 శాతం దిగజారింది.
ఇదీ చదవండి: అన్ని కాలాలకూ అనుకూలం
గత వారాంతాన యూఎస్ స్టాక్స్ అత్యంత భారీ పతనాన్ని చవిచూశాయి. నేడు(7న) యూఎస్ స్టాక్ మార్కెట్లకు ‘బ్లాక్‌మండే’ ఎదురుకావచ్చని అక్కడి నిపుణులు అంచనా వేశారు.
భారత్‌సహా చైనా, జపాన్ తదితర ప్రధాన దేశాలపై ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లను ప్రకటించడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినవచ్చని, మాంద్యంలోకి జారుకోవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లలో సైతం అమ్మకాలకు తెరలేచే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020 తరువాత గత వారం యూఎస్ మార్కెట్లు 6 శాతం పడిపోయాయి. 5 లక్షల కోట్ల డాలర్లకుపైగా మార్కెట్ విలువ ఆవిరైంది.
ఈ వారం దేశీ మార్కెట్లు పతన బాటలో సాగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కాగా.. గురువారం(10న) శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది.


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
