
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 472 పాయింట్లు పెరిగి 23,296కు చేరింది. సెన్సెక్స్(Sensex) 1564 పాయింట్లు పుంజుకొని 76,727 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.84 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.93 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.34 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.79 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.64 శాతం పుంజుకుంది.
ఇదీ చదవండి: డీజిల్‌కు తగ్గిన డిమాండ్.. ఎందుకంటే..
కంప్యూటర్ చిప్స్, మొబైల్స్, ల్యాప్‌టాప్‌సహా పలు ప్రొడక్టులపై ట్రంప్ టారిఫ్‌లను ఎత్తివేశారు. సుంకాల అమలును 90 రోజులపాటు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తెలిపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ సానుకూలంగా ట్రేడవుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే టారిఫ్‌ల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు కుదేలుకావచ్చన్న ఆందోళనలు అటు ముడిచమురు ధరలను.. ఇటు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరును దెబ్బతీస్తున్నట్లు వివరించారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
