
ముంబై: ఫిట్‌నెస్ సర్వీసుల సంస్థ క్యూర్‌ఫిట్ హెల్త్‌కేర్‌లో టాటా డిజిటల్ సంస్థ వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 75 మిలియన్ డాలర్లు (సుమారు 545 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. దీనికి సంబంధించి క్యూర్‌ఫిట్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా డిజిటల్ తెలిపింది. అయితే, ఎంత మేర వాటాలు తీసుకుంటున్నదీ మాత్రం వెల్లడించలేదు. ఈ డీల్ ప్రకారం క్యూర్‌ఫిట్ వ్యవస్థాపకుడు, సీఈవో ముకేశ్ బన్సల్.. టాటా డిజిటల్‌లో ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడతారు. సంస్థకు ఆయన అనుభవం గణనీయంగా తోడ్పడగలదని టాటా డిజిటల్ మాతృ సంస్థ టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. టాటా డిజిటల్‌లో భాగం కావడం వల్ల దేశవ్యాప్తంగా కస్టమర్లకు మరింతగా చేరువయ్యేందుకు తోడ్పాటు లభించగలదని బన్సల్ తెలిపారు. దేశీయంగా ఫిట్‌నెస్, వెల్‌నెస్ మార్కెట్ ఏటా 20 శాతం వృద్ధి చెందుతోందని, 2025 నాటికి 12 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదన్న అంచనాలు ఉన్నాయని టాటా డిజిటల్ పేర్కొంది.
చదవండి : డివిడెండ్ ప్రకటించిన ఎంఆర్‌ఎఫ్