
కేంద్ర మంత్రి 'ప్రహ్లాద్ జోషి' శుక్రవారం పిన్నాపురంలోని.. గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ను సందర్శించి, దాని వేగవంతమైన పురోగతిని ప్రశంసించారు.
గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు.. ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద జీడబ్ల్యు-స్కేల్ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్. ఇది 4000 మెగావాట్స్ సౌర విద్యుత్, 1000 మెగావాట్స్ పవన విద్యుత్, 1680 మెగావాట్స్ జలవిద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొత్తం మీద ఇది ఒక సైకిల్‌లో రోజుకు 10080 మెగావాట్స్ నిల్వ చేసే సామర్థ్యం చేసే కెపాసిటీ కలిగి ఉంది.

తన పర్యటన గురించి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్దదైన పిన్నాపురంలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను ఆచరణలో చూడటం గర్వకారణం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనం అని అన్నారు.
ఈ సందర్భంగా గ్రీన్‌కో గ్రూప్ సీఈఓ & ఎండీ అనిల్ చలమలశెట్టి మాట్లాడుతూ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని పెంచుతుందని, అనుబంధ పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని.. ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. అంతే కాకూండా.. ఈ ప్రాజెక్ట్ ఏటా 3.3 మిలియన్ టన్నుల CO₂ ఉద్గారాలను నివారించడానికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.