ప్రమాదాలపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాలపై ఫోకస్‌

Published Mon, Apr 28 2025 1:01 AM | Last Updated on Mon, Apr 28 2025 1:09 AM

రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ ప్రత్యేక దృష్టి సారించి దిశానిర్ధేశం చేస్తున్నారు.

.. మృతదేహంతో ఆందోళన

గంగవరం మండలంలో విద్యార్థి మృతదేహంతో ఆదివారం కళాశాల ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

కుప్పం రూరల్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. 2024 నవంబర్‌ నుంచి ఖాళీగా ఉన్న కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికకు సమయం ఆసన్నమైంది. సోమవారం జరగనున్న ఈ ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు, అబ్జర్వర్‌గా జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరిని ప్రభుత్వం నియమించింది. చైర్మన్‌ అభ్యర్థి గెలుపునకు కావాల్సిన బలం వైఎస్సార్‌సీపీకి ఉన్నా.. అధికార బలంతో ఎలాగైనా చైర్మన్‌ కుర్చీని దక్కించుకోవాలని కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది.

సమాయత్తమైన ఇరుపార్టీలు

సంఖ్యా పరంగా చూసుకుంటే వైఎస్సార్‌సీపీనే గెలవాలి. కానీ అధికార పార్టీ కుతంత్రాలకు దిగింది. 2021లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 19 మంది కౌన్సిలర్లతో విజయఢంకా మోగించింది. టీడీపీ ఆరుగురు కౌన్సిలర్లకే పరిమితమైంది. కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌గా డాక్టర్‌ సుధీర్‌ కొనసాగారు. కుటమి ప్రభుత్వం రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అలాగే మరో నలుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. దీంతో కౌన్సిల్లో టీడీపీ బలం పదికి పెరిగింది. ప్రస్తుతం గెలవాలంటే మరో నలుగురు అభ్యర్థులు అవసరం. బలం లేకపోయినా టీడీపీ బరితెగిస్తోంది. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను అంగడి సరుకులా కొనేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వీరి వలలో నలుగురు కౌన్సిలర్లు చిక్కుకోగా, మరో ఇద్దరు ఓటింగ్‌లో పాల్గొనకుండా భయపెట్టినట్టు తెలిసింది. ఇలా జరిగితే టీడీపీ గెలుపు ఖాయమనిపిస్తోంది. వైఎస్సార్‌ సీపీ మాత్రం ప్రజాస్వామ్యపై నమ్మకంతో ఎన్నికల బరిలో దిగుతోంది.

సంప్రదాయాన్ని పాటించరా?

వైఎస్సార్‌ సీపీ 2019లో అధికారం చేపట్టగానే టీడీపీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వైఎస్సార్‌ సీపీలోకి వచ్చేందుకు సుముఖత చూపారు. అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాత్రం వారిని తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేసి రావాలని షరతు విధించారు. ఇదే సంప్రదాయాన్ని కుప్పం మున్సిపల్‌ కౌన్సిలర్ల విషయంలోనూ టీడీపీ అధిష్టానం పాటించాలని కుప్పం జనం సూచిస్తున్నారు. తమ వైపునకు తిప్పుకున్న కౌన్సిలర్ల చేత రాజీనామాలు చేయించి, గెలిచిన తరువాత చైర్మన్‌ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కుప్పం పట్టణం ఏరియల్‌ వ్యూ

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

నేడు పోలీసు గ్రీవెన్స్‌

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు వన్‌టౌన్‌ పక్కన ఉన్న ఆర్మ్‌డు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

నేడు పలమనేరులో గ్రీవెన్స్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం పలమనేరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

30న డీఆర్‌సీ వాయిదా

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈనెల 30వ తేదీన నిర్వహించాల్సిన డీఆర్‌సీ (జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం)వాయిదా వేశారు. ఈ సమావేశాన్ని పలు కారణాల చేత వాయిదా వేసినట్లు కలెక్టరేట్‌ అధికారులు చెప్పారు.

ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌

– మరొకరిపై కేసు నమోదుకు ఆదేశం

చిత్తూరు కార్పొరేషన్‌ : వి.కోట పంచాయతీలో రూ.50 లక్షలు నిధులు దుర్వినియోగమయ్యా యి. అందుకు కారకులైన ఇద్దరు పంచాయతీ సి బ్బందిని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశాల మేరకు డీపీఓ సుధాకర్‌రావు సస్పెండ్‌ చేశారు. ప్రస్తుత పొలకల పంచాయతీ జూనియర్‌ అసిస్టెంట్‌ యా దవపతి గతంలో డిప్యూటేషన్‌పై వి.కోట పంచా యతీ ఇన్‌చార్జి ఈఓగా విధులు నిర్వహించారు. అ తడితో పాటు ఆ పంచాయతీ బిల్లు కలెక్టర్‌ ఫృథ్వీ, మరొక కాంట్రాక్ట్‌ ఉద్యోగితో కలిసి ప్రజలు చెల్లించిన పన్నులు, పన్నేతర నిధులను పంచాయతీ ఖాతాకు జమ చేయకుండా రూ.1.50 కోట్లు దుర్వినియోగం చేసినట్లు స్థానికులు అధికారులకు ఫి ర్యాదు చేశారు. దీనిపై డీఎల్‌పీఓ స్థాయి అధికారి విచారణ చేయించారు. రూ.50 లక్షలు పక్కదారి పట్టినట్లు నిర్ధారించారు. ఇందులో యాదవపతి రూ.16 లక్షలు, ఫృథ్వీ రూ.34 లక్షలు వారి సొంతానికి వాడుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ని ధుల దుర్వినియోగానికి పాల్పడిన కారణంగా వా రిని సస్పెండ్‌ చేసినట్లు డీపీఓ తెలిపారు. ఈ విషయంలో బాధ్యుడిగా గుర్తించిన కాంట్రాక్ట్‌ ఉద్యోగి పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శికి డీపీఓ ఆదేశించారు.

నేడు కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక

సంపూర్ణ మెజారిటీతో ఊపుమీదున్న వైఎస్సార్‌సీపీ

బలం లేకపోయినా బరితెగించేందుకు సిద్ధమైన టీడీపీ

వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఓటింగ్‌కు రానీయకుండా కుయుక్తులు

ఇప్పటికే ఆరుగురిని తమవైపు తిప్పకున్న కూటమి

ఎలాగైనా చైర్మన్‌ గిరి దక్కించుకోవాలని కుట్రలు

ఎన్నికకు సర్వం సిద్ధం చేసిన అధికారులు

కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో ప్రజానీకం మొత్తం కుప్పం వైపే చూస్తోంది. పట్టు నిలుపుకునేందుకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుండగా.. బలం లేకపోయినా బరితెగించేందుకు టీడీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలకు తెరలేపుతోంది. నేడు జరగనున్న చైర్మన్‌ గిరి ఎన్నికలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను పాల్గొనకుండా అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది.

వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా హఫీజ్‌

వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా అధిష్టానం 9వ వార్డు కౌన్సిలర్‌ ఎస్‌డీ.హఫీజ్‌ను ఎంపిక చేసింది. ప్రత్యామ్నాయంగా 2వ వార్డు కౌన్సిలర్‌ ఆర్‌.మునిరాజును కూడా నియమించింది. ఇందుకు సంబంధించిన విప్‌ను అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డికి అందజేశారు. ఆయన కౌన్సిల్లోని 2వ వార్డు కౌన్సిలర్‌ ఆర్‌.మునిరాజుకు విప్‌ జారీ అధికారాన్ని కట్టబెట్టారు. రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

సర్వం సిద్ధం

కుప్పం చైర్మన్‌ ఎన్నిక సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించన్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కోరం ప్రకారం 14 మంది సభ్యులు హాజరైతే అధికారులు ఎన్నిక జరిపే అవకాశం ఉంది. కోరం లేని పక్షంలో అధికారులు చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేయొచ్చని సమాచారం. రామకుప్పం ఎంపీపీ ఎన్నిక తరహాలో ప్రత్యేక జీఓ పాచిక ప్రయోగిస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది.

బలం లేకపోయినా బరితెగింపే!

5 నవంబర్‌, 2024 వరకు మున్సిపల్‌ చైర్మన్‌గా కొనసాగిన 16వ వార్డు కౌన్సిలర్‌ డాక్టర్‌ సుధీర్‌ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. అప్పటి నుంచి చైర్మన్‌ కుర్చీ ఖాళీగా ఉంది. ఎన్నికల సంఘం ఏప్రిల్‌ 28న మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక తేదీని ప్రకటించింది. 25 వార్డులు ఉన్న కుప్పం మున్సిపాలిటీలో డాక్టర్‌ సుధీర్‌ రాజీనామాతో ఆ సంఖ్య 24కు చేరింది. వీరికి ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు, ఎమ్మెల్సీలు కంచెర్ల శ్రీకాంత్‌, భరత్‌కు ఓటు హక్కు ఉంది. దీంతో సభ్యుల సంఖ్యా బలం 27కు చే రింది. ఇందులో చంద్రబాబు వచ్చే అవకాశాలు త క్కువగా ఉండడంతో 26 మంది సభ్యులతోనే ఎన్నిక నిర్వహించనుంది. 14 మంది అభ్యర్థులు ఎవరికి మ ద్దతు ఇస్తే వారే చైర్మన్‌ గిరిని దక్కించుకునే అవకాశం ఉంది. ఈ మేరకు కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు పూర్తి చేశారు.

చైర్మన్‌ గిరి కోసం కుమ్ములాట!

కుప్పం: ‘ఆలూలేదు.. శూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టు తయారైంది కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి. వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ బలం ఉండడంతో ఆ పార్టీకి విజయావకాశాలు నల్లేరుపై నడకేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బలం లేకపోయినా.. బరితెగించి కుప్పం చైర్మన్‌ గిరిని తన్నుకుపోవాలని టీడీపీ కాచుకు కూర్చొంది. ఈ క్రమంలోనే 19, 20, 5 వార్డుల కౌన్సిలర్లు దామోదరం, సోమశేఖర్‌, సెల్వరాజు చైర్మన్‌ కుర్చీ కోసం పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి హొసూరు సమీపంలో క్యాంప్‌లో ఉన్న టీడీపీ మద్దతుదారుల మధ్య వివాదం రేగి, కుమ్ములాటలకు దారితీసినట్టు సమాచారం.

ప్రమాదాలపై ఫోకస్‌
1
1/2

ప్రమాదాలపై ఫోకస్‌

ప్రమాదాలపై ఫోకస్‌
2
2/2

ప్రమాదాలపై ఫోకస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement