
మృతుడు రాజేందర్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, నిర్మల్(ఆదిలాబాద్): నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏడురోజుల్లో వివాహం అనగా.. పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కుబీర్ మండలం దోడర్న తండా 4వ గ్రామానికి చందిన రాజేందర్ అనే యువకుడికి కొన్ని రోజుల క్రితం నల్గొండ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈనెల 21వ తేదిన రాజేందర్ వివాహం జరగాల్సి ఉంది.
ఈక్రమంలో ప్రస్తుతం రాజేందర్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అయితే, ఆ పెళ్లి ఇష్టంలేక రాజేందర్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుంటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.