
సాక్షి,షాద్‌నగర్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్ పోలీసులపై కేసు నమోదైంది. ఇటీవల ఒక దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. షాద్‌నగర్ పీఎస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ (డీఐ) రామ్‌రెడ్డి సహా నలుగురు కానిస్టేబుళ్లపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వారిపై ఎఫ్‌ఐఆర్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల షాద్‌నగర్ పోలీసులు దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి విచారించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.
