వివాహేతర సంబంధం, భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని.. | Software Employee Relationship With Other Women | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం, భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని..

Published Sat, Apr 26 2025 1:25 PM | Last Updated on Sat, Apr 26 2025 3:34 PM

Software Employee Relationship With Other Women

హైదరాబాద్‌: ఇటీవల కుప్పలుతెప్పలుగా వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. అచ్చం అలాంటి పనిచేసే..ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. 

వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌కి చెందిన శివ అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం దీప్తి అనే మహిళతో పెళ్లి కాగా ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే పెళ్లై, పిల్లలున్న శివ కొంతకాలంగా తన భార్యతో దూరంగా ఉంటున్నాడు. కారణం మరో మహిళతో వివాహేతర సంబంధమే. ఆ విషయం అతడి భార్య దీప్తి కనిపెట్టింది. ఎలాగైనా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకోవాలని గట్టి నిఘా పెట్టింది.

చివరికి తన భర్త శివ, సుష్మా అనే ఆమెతో కలిసి కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో నివసిస్తున్నాడని తెలుసుకుని, కుటుంబసభ్యుల సాయంతో ఒకే గదిలో ఉన్న భర్త శివ, సుష్మలను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించింది. అంతేగాక తనను పట్టించుకోకుండా మరో మహిళతో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాట్లు ఫిర్యాదు కూడా చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement