extramarital affair
-
పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
బాపట్ల టౌన్ : అతడికి 64 ఏళ్లు. ఆమెకు 54. ఇద్దరికీ వేర్వేరు కుటుంబాలున్నాయి. పెళ్లీడుకొచ్చిన సంతానం ఉన్నారు. ఆర్థికంగా స్థిరపడినవారే. పిల్లలు ఉన్నత విద్యావంతులు. అయినా వారి వల్లమాలిన వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ పెద్దాయన తన మాట వినలేదనే ఆవేశంలో ఆమె అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ ఘటన బాపట్లలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు...రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తులాబందుల లక్ష్మీనారాయణ బాపట్ల రైల్వేస్టేషన్ ఎదుట ఐఆర్సీటీసీ సెంటర్ నిర్వహిస్తున్నారు. పట్టణానికి చెందిన నల్లమోతు మాధవితో కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఇదిలాఉండగా లక్ష్మీనారాయణ భార్య అరుణాదేవి కళ్ళకు ఆపరేషన్ చేయించే నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న మాధవి లక్ష్మీనారాయణను వెళ్ళటానికి వీల్లేదంటూ అడ్డగించింది. కుటుంబ సభ్యులతో కలిసి అరుణాదేవిని పంపించాలంటూ హెచ్చరించింది. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో శుక్రవారం ఉదయం తన వెంట తెచ్చుకున్న పెట్రోలును ముందు తనపై పోసుకొని ఆ తర్వాత లక్ష్మీనారాయణపై పోసి నిప్పంటించింది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఐఆర్సీటీసీ బుకింగ్ కౌంటర్ నుంచి పొగలు రావడంతో స్థానికులు మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అప్పటికే మాధవి 80 శాతం, లక్ష్మీనారాయణ 60 శాతం కాలిపోయారు. వెంటనే స్థానికులు ఇద్దరినీ చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బాపట్ల సీనియర్ సివిల్‌జడ్జి పరామర్శించి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఇరువురినీ గుంటూరు తరలించారు. ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/cwB2QDewFD— Kumaruuu💙 (@CalmnessSoull) April 11, 2025 -
భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య..!
యశవంతపుర(కర్ణాటక): వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినఘటన బెంగళూరుని హెబ్బాళ కనకనగరలో సోమవారం సాయంత్రం జరిగింది. బషీర్ ఉల్లా, బాహర్ అస్మా(29) దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్త మరో మహిళతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు అస్మా అనుమానించింది. ఇదే విషయంపై తీవ్ర మనో వేదనకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో అస్మా ఉరివేసుకున్న స్థితిలో విగతజీవిగా మారింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు వచ్చి పరిశీలించారు. అస్మాను చంపి ఉరివేసినట్లు ఆరోపించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి బషీర్ ఉల్లాను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. -
వివాహేతర సంబంధం.. చిన్నారిపై తల్లి పైశాచికం
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): మూడేళ్ల చిన్నారిపై తల్లి పైశాచికంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విజయవాడ పరిధిలోని జక్కంపూడి కాలనీలో నివసించే వందనకు (23) అమ్ములు అనే మూడేళ్ల పాప ఉంది. కొన్ని నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. శ్రీరాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో వందన, శ్రీరాములు హైదరాబాద్‌కు మకాం మార్చారు. తమ ఆనందానికి పాప అడ్డుగా ఉందని భావించిన వారు.. ఆ చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. వంటిపై, వీపుపై ఇష్టానుసారంగా వాతలు పెట్టడంతో ఆ చిన్నారి కేకలు వేసేది. కేకలు బయటకు రాకుండా నోరు మూసి ఈ అకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం విజయవాడ వచ్చిన వందన, శ్రీరాములు పాపను రైల్వే స్టేషన్లో వదిలేశారు. విషయం తెలుసుకున్న శ్రీరాములు తల్లి సుమలత రైల్వేస్టేషన్‌కు వెళ్లి అమ్ములును ఇంటికి తీసుకొచ్చింది. కాగా, ఈ అకృత్యాలు తెలుసుకున్న స్థానికులు విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్మేట్ శివతో వివాహేతర సంబంధం
సంగారెడ్డి జోన్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లలను ఊపిరి ఆడకుండా చేసి అతి కిరాతకంగా తల్లే హత్య చేసిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమీన్పూర్ మండలం బీరంగూడ గ్రామం రాఘవేంద్రనగర్‌లో ఇటీవల జరిగిన ముగ్గురు పిల్లల మృతి ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. పిల్లల తల్లి రజిత ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా.. ఆరు నెలల క్రితం పదో తరగతి పూర్వ విద్యార్థులు అంతా కలసి పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ పార్టీ సందర్భంగా తన క్లాస్ మేట్ అయిన శివతో రజిత స్నేహం ఏర్పరుచుకుంది.రోజూ చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడేవారు. అంతే కాకుండా పలు మార్లు రహస్యంగా కలుసుకున్నారు. కాగా, రజిత భర్త చెన్నయ్య.. ఆమె కంటే వయసులో ఇరవై సంవత్సరాలు పెద్దవాడు కావడంతో మొదటి నుంచీ ఆమెకు చెన్నయ్య అంటే ఇష్టం ఉండేది కాదు. తరచూ గొడవలు పడేవారు. ఈ క్రమంలో తన పదోతరగతి క్లాస్మేట్ శివను కలసుకోవడం, అతనికి పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతడిని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని భావించింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోమని రజిత, శివను అడగ్గా.. పిల్లలు లేకుండా ఒంటరిగా తనతో వస్తా అంటే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. దీంతో శివను పెళ్లి చేసుకోవాలంటే పిల్లలను అడ్డు తొలగించుకోవాల్సిందేనని రజిత నిర్ణయించుకుంది. మార్చి 28న సాయంత్రం ఆరు గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పగా, త్వరగా ఆ పని పూర్తి చేయమని చెప్పాడు. అదే రోజు రాత్రి భర్త భోజ నం చేసి 10 గంటలకు ట్యాంకర్ తీసుకొని చందానగర్ వెళ్లగా, ఇదే అదనుగా భావించి మొదట పెద్ద కొడుకు సాయికృష్ణ (12)ను, తర్వాత కూతురు మధుప్రియ (10)ను, ఆ తర్వాత చిన్న కొడుకు గౌతమ్ (8)ను.. ఇలా ముగ్గురిని ఒకరి తరువాత ఒకరిని ముక్కు, మూతిపై టవల్ వేసి, చేతితో గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి చంపింది. పిల్లలను అడ్డు తొలగించుకోవాలని రజితను శివ ప్రోత్సహించగా ఆమె కిరాతకంగా వారిని చంపివేసిందని ఎస్పీ వెల్లడించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశామన్నారు. ఈ సమావేశంలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, అమీన్పూర్ ఇన్స్పెక్టర్ నరేశ్, డీఐ రాజు, ఎస్ఐ సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
తమిళనాడు: పల్లావరం సమీపంలో ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలితీసుకుంది. ప్రియురాలు మరొకరితో సంబంధం కలిగి ఉందనే కారణంతో ప్రియుడు ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశాడు. లొంగిపోయిన కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై శివారు పల్లావరం సమీపంలోని అనకాపుత్తూరు గౌరీ ఎవెన్యూ 2వ వీధికి చెందిన జ్ఞానసిద్ధన్ (40). నితను తాంబరం కార్పొరేషన్లో లారీ డ్రైవర్. ఇతను అవివాహితుడు. అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అనకాపుత్తూరు అరుల్ నగర్ 3వ వీధికి చెందిన భాగ్యలక్ష్మి(33)తో ఇతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భాగ్యలక్ష్మి అప్పటికే భర్తకు విడాకులు ఇచ్చి, తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. ఇద్దరూ తరచూ కలుసుకుని సరదాగా గడుపుతూ వచ్చారు. ఈక్రమంలో భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని జ్ఞానసిద్ధన్ నిర్ణయించుకున్నాడు. భాగ్యలక్ష్మికి జ్ఞానసిద్ధన్‌తో పాటు మరొకరితో సంబంధం ఉందని తెలిసింది. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ బుధవారం ఉదయం భాగ్యలక్ష్మితో గొడవపడ్డాడు. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ పెద్ద బండరాయితో భాగ్యలక్ష్మి తలపై వేశాడు. భాగ్యలక్ష్మి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. జ్ఞానసిద్ధన్ శంకర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇల్లరికం వచ్చిన భర్తను హత్య చేయించిన భార్య
నిజామాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను భార్య అంతమొందించింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం నాగారం గ్రా మానికి చెందిన అమృతం విఠల్ (38) అనే వ్యక్తి 20 ఏళ్ల కిత్రం సోమేశ్వర్ గ్రామంలోని మేనమామ కూతురు కాశవ్వను పెళ్లి చేసుకొని ఇల్లరికం వచ్చాడు. మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా, ఒక్కరికి పెళ్లి అయింది. విఠల్ భార్య కాశవ్వ నాగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. విఠల్‌ను అంతమొందిస్తే ఏ గొడవా ఉండదని భావించిన కాశవ్వ అదే గ్రామానికి చెందిన అమృతం విఠల్(నిందితుడు), పుల్కంటి విఠల్‌కు విషయం తెలిపింది. శుక్రవారం రాత్రి విఠల్(మృతుడు)ను పొలం వద్దకు తీసుకెళ్లిన అమృతం విఠల్, పుల్కంటి విఠల్ అతిగా మద్యం తాగించి మెడకు టవల్‌తో గట్టిగా బిగించి, పైపులతో కొట్టి చంపారు. అనంతరం విఠల్ మృతదేహాన్ని కొల్లూర్ సబ్‌స్టేషన్ సమీపంలో బాన్సువాడ–బీర్కూర్ ప్రధాన రహదారిపై పడేసి వెళ్లారు. ఉదయం అటుగా వెళ్తున్న కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి అన్న బింగి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి భార్య కాశవ్వ, అమృతం విఠల్, పుల్కంటి విఠల్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, విఠల్‌ను తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని సీఐ అశోక్ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపనున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం...
తమిళనాడు: తనకు వివాహమైనప్పటికీ స్నేహితుడి భార్యను తీసుకెళ్లి గుట్టుగా కాపురం చేస్తున్న వ్యక్తి చివరకు అనుమానాస్పద స్థితిలో శవమై వెలుగులోకి వచ్చాడు. అతడితో సహజీవనం చేస్తున్న స్నేహితుడి భార్య అదృశ్యం కావడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని కటైమేడు గ్రామానికి చెందిన గోకుల్(25) వెల్డింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఇతడు ఆంబూరుకు చెందిన తన స్నేహితుడి భార్యను నాగర్‌కోయిల్‌కు తీసుకెళ్లి అక్కడే ఒక అద్దె ఇంట ఉంటూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ వ్యవహారం గోకుల్ భార్య తులసికి తెలియడంతో ఆమె ఎన్నోసార్లు అతడికి ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ అని వస్తూండడంతో అప్పట్లో పోలీసులకు సైతం ఆమె ఫిర్యాదు చేసింది.ఈ నేపథ్యంలో గోకుల్ నివసిస్తున్న ఇంటి నుంచి గురువారం సాయంత్రం దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తాళం వేసి ఉండడంతో దానిని పగలగొట్టి లోనికి వెళ్లి పరిశీలించారు. గోకుల్ విగతజీవిగా ఉండటం గుర్తించారు. దీంతో వేలూరులోని అతని భార్యకు సమాచారమిచ్చారు. అయితే గోకుల్‌తో ఉన్న మహిళ ఏమైంది? గోకుల్ హత్యకు గురయ్యాడా, ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త సంపాదన ప్రియుడిపాలు!
కాకినాడ: భార్య వివాహేతర సంబంధంతో జీవితంపై విరక్తి చెంది కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడి కేసులో ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన చల్లా దుర్గారావు (29) ఈ నెల 25 వ తేదీన పెరవలి లాకుల వద్ద మోటార్ సైకిల్ వదలి కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి 26వ తేదీన ఇరగవరం మండలం రాపాక వద్ద శవమై తేలిన విషయం తెలిసిందే. అతడు రాసిన సూసైడ్ నోట్ ప్రకారం తన చావుకు కారణమైన ఖండవల్లి గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్, మోత్రపు శివ ప్రసాద్, మృతుడి భార్య చల్లా దివ్య కుమారి కారణమని పేర్కొన్నాడు.ఫిర్యాదుదారు చల్లా వెంకట సుబ్బారావు ఇచ్చిన వివరాలు, గ్రామ పెద్దల సమాచారం, సాంకేతిక ఆధారాల మేరకు వారి ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచినట్టు తెలిపారు. తన భార్య అదే గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయాన్ని దుర్గారావు, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు అమోఘ్‌ను ఇంటికి వెళ్లి నిలదీశారు. దీంతో అతడితో పాటు తండ్రి శివప్రసాద్‌లు దుర్గారావును దుర్భాషలాడి అవమానించారు.దీంతో అతడు మనస్తాపం చెంది తన చావుకు వారు ముగ్గురే కారణమని, తాను దుబాయి వెళ్లి సంపాదించినదంతా దివ్యకుమారి ప్రియుడికి దోచిపెట్టిందని, దీంతో తాను ఆర్థికంగా చితికిపోయానని, వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్తాపం చెందానని సూసైడ్ నోట్ రాసి కాల్వలోకి దూకాడు. నిందితులను రిమాండ్ నిమిత్తం తణుకు కోర్టులో శుక్రవారం హాజరు పరిచినట్టు ఎస్సై తెలిపారు. -
నా భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంటావా బుజ్జమ్మ..!
నారాయణపేట రూరల్: తన భర్తతో మరో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో రాయితో మోది హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జలాల్పూర్ గ్రామానికి చెందిన బుజ్జమ్మ అలియాస్ వెంకటమ్మ(36)కు 15 ఏళ్ల క్రి తం కర్ణాటక రాష్ట్రం నస్లైకి చెందిన రాజుతో వివాహమైంది. పెళ్లయిన రెండేళ్లకే భర్త నుంచి విడిపోయి తల్లి వారింట్లో ఉంటోంది. జీవనోపాధి కోసం పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీళ్లు పోసే పనిచేస్తుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మొగులప్పతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఇరువురి ప్రవర్తనపై అను మానం వచ్చిన మొగులప్ప భార్య లక్ష్మి గతంలో పలుమార్లు బుజ్జమ్మతో గొడవ పడింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సర్దిచెప్పారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇరువురి మధ్య ఎన్నోసార్లు గొడవలు, దాడులు జరిగాయి. ఈ క్రమంలో మంగళవారం నర్సరీలో పనిచేస్తున్న బుజ్జమ్మ దగ్గరకు లక్ష్మి ఆవేశంగా వెళ్లింది. ఇది గమనించిన బుజ్జమ్మ తనపై దాడి చేయడానికి వస్తుందని ఉపాధి హామీ మేటికి ఫోన్ ద్వారా సమాచారం అందించి, నర్సరీ గేటుకు తాళం వేసుకుంది. అయినప్పటికీ లక్ష్మి ముళ్లపొదలను దాటు కుంటూ లోపలికి వెళ్లి రాయితో బలంగా బుజ్జమ్మ తలపై మోదడంతో రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న సీఐ శివకుమార్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బుజ్జమ్మ సోదరుడు నందిపాటి రామచంద్రప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అత్తతో అల్లుడి అనైతిక బంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మామ
జడ్చర్ల(మహబూబ్‌నగర్): వావివరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు. విషయం బయటకు తెలుస్తుందనే భయంతో ఆ ఇద్దరు కలిసి భర్తను హత్య చేసి ఆకస్మికంగా మరణంగా చిత్రీకరించారు. తన పెదనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఊపిరి ఆడకుండా చేయడంతోనే చనిపోయాడంటూ పోస్టుమార్టం రిపోర్టులో బయటపడటంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ కమలాకర్ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. కావేరమ్మపేట శివారు రాజీవ్‌నగర్‌కాలనీలో మీనుగ కోటయ్య, మీనుగ అలివేలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు.అదే కాలనీలో ఉండే అల్లుడు వరుస అయ్యే మీనుగ రాజ్‌కుమార్‌తో అలివేలు వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా విషయం తెలిసిన భర్త కోటయ్య ఇద్దరిని మందలించాడు. ఈ ఏడాది జనవరి 23న రాత్రి మీనుగ కోటయ్య కులస్తులతో కలిసి షాద్‌నగర్‌లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి రాగా అలివేలు, రాజ్‌కుమార్ కాలనీలోని తమ పాత ఇంట్లో కలిసి ఉండడాన్ని చూసి నిలదీశాడు. దీంతో విషయం అందరికి చెప్పి రచ్చ చేస్తాడని భావించిన నిందితులు మద్యం మత్తులో ఉన్న కోటయ్యను కింద పడేసి గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం అక్కడే పడుకోబెట్టి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. మరుసటి రోజు తన భర్త రాత్రి ఫంక్షన్‌కు వెళ్లి తిరిగిరాలేడంటూ అలివేలు పిల్లలను నిద్రలేపి బంధువులు, చుట్టుపక్కల వారిని వెంటపెట్టుకొని పాత ఇంటికి వచ్చింది. చలనం లేకుండా పడి ఉన్న భర్తను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ పెద్దనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు మీనుగ నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా పోస్టుమార్టం రిపోర్టులో ఊపిరి ఆడకుండా చేయడంతోనే చనిపోయినట్లు బయటపడింది. ఆదివారం అలివేలును అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిదింతులు అలివేలు, రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. -
ప్రియుడితో కలిసి తల్లి, సోదరి హత్య
అడ్డగుట్ట/జవహర్‌నగర్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారనే కారణంగా ఓ మహిళ తన ప్రియుడితో కలిసి తల్లిని, సోదరిని దారుణంగా హత్య చేసింది. ఆ మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న జవహర్‌నగర్ పోలీసులు.. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ చేస్తున్న క్రమంలో తన అక్కను సైతం హత్య చేసినట్లు ఆమె అంగీకరించడంతో లాలాగూడ రైల్వే క్వార్టర్స్ నుంచి ఆ మృతదేహాన్నీ రికవరీ చేశారు. పరారీలో ఉన్న ప్రియుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడు చిక్కితేనే ఈ హత్యలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. నార్త్ లాలాగూడ ప్రాంతానికి చెందిన వడుగుల నాగయ్య, సుశీల (60)కు జ్ఞానేశ్వరి (45), లక్ష్మి (40), ఉమామహేశ్వరితో పాటు శివకైలాష్ సంతానం. ముగ్గురు కుమార్తెలూ అవివాహితులే. వివాహితుడైన శివ ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. అతడి భార్య స్రవంతి అత్తింట్లోనే ఉంటున్నారు. వివాహేతర సంబంధంపై నిత్యం గొడవలు.. సుశీల పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరికి మానసిక సమస్యలు ఉన్నాయి. చిన్న కుమార్తె ఉమామహేశ్వరి లాల్ బజార్‌లోని ఓ కాల్ సెంటర్లో పని చేస్తున్నారు. రైల్వేలో పని చేసిన సుశీల భర్త నాగయ్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. దీంతో కారుణ్య నియామకం కింద ఆ ఉద్యోగం వారి రెండో కుమార్తె లక్ష్మికి వచ్చింది. 2018 నుంచి ఈ కుటుంబం లాలాగూడలోని రైల్వే క్వార్టర్స్‌లోనే ఉంది. ఆ తర్వాత జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్‌నగర్‌లో ఇల్లు కట్టుకోవడంతో సుశీల, ఉమామహేశ్వరి, స్రవంతి అక్కడికి మారారు. లక్ష్మి లాలాగూడలోని రైల్వే వర్క్‌షాప్‌లో ఉద్యోగం చేస్తుండడంతో ఆమెతో పాటు అక్క జ్ఞానేశ్వరితో కలిసి ఉంటోంది. సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన తాపీమేస్తీ బిల్డర్ అరవింద్ కుమార్‌తో (45) ఈ కుటుంబానికి 2010 నుంచి పరిచయం ఉంది. భరత్‌నగర్‌లో ఇల్లు కూడా అతడే కట్టడంతో లక్ష్మితో పరిచయం మరింత పెరిగింది. ఈ క్రమంలో వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. నిత్యం వీరిద్దరూ కలుస్తుండటంతో విషయం లక్ష్మి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీని పై పలుమార్లు ఇంట్లో గొడవలు కూడా జరిగాయి. సుశీల మెడకు చీరతో ఉరి బిగించి.. గురువారం ఉదయం 9.30 గంటలకు ఉమా మహేశ్వరి, స్రవంతి తన ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లిపోగా సుశీల ఒక్కరే ఇంట్లో ఉన్నారు. రాత్రి 7.17 గంటలకు ఆ ఇంట్లో నుంచి శబ్ధాలు వస్తుండటం గమనించిన పక్కింట్లో ఉండే వెంకటేష్ విషయాన్ని ఫోన్ ద్వారా ఉమా మహేశ్వరికి తెలిపారు. ఆమె తన తల్లి సుశీలకు ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో మళ్లీ వెంకటేష్ కు ఫోన్ చేసిన ఆమె ఇంట్లోకి వెళ్లి చూడాల్సిందిగా కోరారు. ఆయన సమీపంలో ఉండే సారంగపాణితో కలిసి సుశీల ఇంటి వద్దకు వెళ్లారు. బెడ్రూంలో విగతజీవిగా పడి ఉన్న సుశీలను చూసి ఉమామహేశ్వరికి సమాచారం ఇచ్చారు. అదే సమయంలో అరవింద్ ఆమె ఇంటి మొదటి అంతస్తు నుంచి పక్కింటి పైకి దూకి పారిపోవడాన్నీ గమనించారు. 8 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చిన ఉమామహేశ్వరి తన తల్లి నోట్లో వ్రస్తాలు కుక్కి, చీరతో మెడకు ఉరి బిగించి చంపినట్లు గుర్తించింది. అరవింద్ కుమార్ తన తల్లిని చంపాడని, ఆమె ఒంటిపై ఉన్న మూడున్నర తులాల బంగారం దోచుకుపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తరచూ తమ ఇంటికి వచ్చే అరవింద్ బుధవారం సాయంత్రం కూడా వచి్చవెళ్లినట్లు పేర్కొంది. అక్క జ్ఞానేశ్వరిని కూడా హతమార్చినట్లు.. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న జవహర్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుశీల మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు లక్ష్మి, అరవింద్ మధ్య ఉన్న వివాహేతర సంబం«ధాన్ని గుర్తించారు. సుశీల హత్యలో లక్ష్మి పాత్ర ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలో తాను అరవింద్‌తో కలిసి అక్క జ్ఞానేశ్వరి చంపామని ఆమె బయటపెట్టింది. బుధవారమే ఆమెను చంపి, మృతదేహాన్ని మూటకట్టి సమీపంలో రైల్వే క్వార్టర్స్‌లో ఉన్న పాడుబడిన బావిలో పడేసినట్లు అంగీకరించింది. దీంతో లక్ష్మిని తీసుకుని లాలాగూడ వచ్చిన జవహర్‌నగర్ పోలీసుల జ్ఞానేశ్వరి మృతదేహాన్నీ రికవరీ చేశారు. కుళ్లిన స్థితిలో ఉన్న ఈ మృతదేహాన్ని సైతం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు హత్యలు ఒకేసారి, ఒకే ప్రాంతంలో చేశారా? లేక వేర్వేరుగా చేశారా? అనే దానిపై లక్ష్మి నోరు విప్పట్లేదు. పరారీలో ఉన్న అరవింద్ కోసం గాలిస్తున్న అధికారులు అతడు చిక్కితే పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. -
తాళి కట్టమంటే పాడె కట్టిండు
వర్గల్(గజ్వేల్): వారిది ఒకే గ్రామం.. ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం.. గుట్టుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం.. పెండ్లి చేసుకోవాలని మహిళ ఒత్తిడి జీర్ణించుకోలేక పథకం ప్రకారం హత్య చేసి ఆమెను కాటికి పంపాడు. దర్యాప్తులో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. పది రోజుల కిందట జాడ తెలియకుండా పోయిన వర్గల్ మండలం మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం కోమటిబండ అడవిలో మృతదేహాన్ని గుర్తించి హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను బుధవారం గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి వెల్లడించారు.వర్గల్ మండలం అనంతగిరిపల్లికి చెందిన దార యాదమ్మ(40) 15వ తేదీన బ్యాంక్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. ఆమె కుమారుడు దార సాయికుమార్ ఫిర్యాదు మేరకు గౌరారం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదుచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పోలీసులు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజీలు, లోకేషన్లు, కాల్‌డేటాలు విశ్లేషించారు. దర్యాప్తులో భాగంగా అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన బండ్ల చిన్న లస్మయ్య(39)ను మంగళవారం విచారించారు. ఏడాదిన్నర నుంచి అతడికి యాదమ్మతో వివాహేతర సంబంధమున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆరునెలల నుంచి పెండ్లి చేసుకోవాలని యాదమ్మ ఒత్తిడి చేస్తుండటంతో ఎలాగైనా అడ్డు తొలిగించుకోవాలనుకున్నాడు. 15న మధ్యాహ్నం పథకం ప్రకారం యాదమ్మను బైక్ మీద గజ్వేల్ సమీప కోమటిబండ అడవిలోకి తీసుకెళ్లాడు. తమ వెంట తెచ్చుకున్న కల్లును ఇద్దరు తాగే సమయంలో ఆమెకు తెలియకుండా పురుగుల మందు కలిపాడు. యాదమ్మ తాగిన తర్వాత కింద పడేసి మెడచుట్టూ చీర బిగించి హతమార్చాడు. నిందితుడిపై హత్య నేరంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. గ్రామంలో ఉద్రిక్తత యాదమ్మ హత్యోదంతం నేపథ్యంలో బుధవారం ఆమె కుటుంబీకులు, బంధువులు ఆగ్రహంతో అనంతగిరిపల్లిలోని నిందితుడి ఇంటి ఎదుట బైఠాయించారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా ఏసీపీ పురుషోత్తంరెడ్డి, రూరల్‌సీఐ మహేందర్‌రెడ్డి, గౌరారం ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని వారికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. -
ఏడు అడుగులు.. ఏడేళ్ల వివాహేతర సంబంధం?
వరంగల్ క్రైం/ఖిలావరంగల్: వైద్యుడితో ఆమె ఏడడుగులు నడిచింది.. కానీ ఏడేళ్లనుంచి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఆ వివాహేతర సంబంధమే వారి కుటుంబంలో చిచ్చురేపింది. చివరికి భర్తను చంపేయాలన్న నిర్ణయానికి వచ్చింది. వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 20వ తేదీ రాత్రి జరిగిన యువ వైద్యుడు గాదె సుమంత్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును విచారిస్తున్న పో లీసులకు కేసు పూర్వాపరాలు ఓ సినిమా స్టోరీని తలపించినట్లు తెలిసింది. భార్య, ప్రియుడు సూత్రధారులుగా తేల్చి అదుపులోకి తీసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రేమ వివాహం..ఆపై వివాహేతర సంబంధం కాజీపేట మండలం ఫాతిమానగర్‌లోని ఓ చర్చిలో గాదె సుమంత్‌రెడ్డి, ఫ్లోరింజాలకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటై ఏడడుగులు వేసి జీవితాన్ని ప్రారంభించిన ఆ జంట మధ్య వివాహేతర సంబంధం సమస్యలను తెచ్చిపెట్టింది. ఫోరింజ 2019లో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించింది. దానికంటే ముందు సంగారెడ్డిలో డాక్టర్ సుమంత్‌రెడ్డి ఆస్పత్రి నిర్వహించే క్రమంలో జిమ్‌కు వెళ్లిన ఆమెకు అందులో ఉద్యోగం చేసే సామేల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఆ తర్వాత ఆస్పత్రిని కాజీపేటకు మార్చారు. అయినా ఏడేళ్లుగా ఫోరింజ, సామేల్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇటీవల విషయం సుమంత్‌రెడ్డికి తెలియడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో సామేల్ .. ఫ్లోరింజలు కలిసి డాక్టర్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. దీనికి సంగారెడ్డిలో ప్లాన్ చేసి, భట్టుపల్లి దగ్గరలోని అమ్మవారిపేట వద్ద అమలు చేశారు. దాడి అనంతరం పారిపోయిన నిందితులను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. కాగా, వీరు అనేకసార్లు డాక్టర్‌పై దాడి ప్రయత్నాలు చేసి విఫలమైనట్లు తెలిసింది. ఓసారి డాక్టర్‌ను నేరుగా బెదిరించి వదిలేసినట్లు తెలుస్తోంది. స్నేహితుడి కోసం వచ్చి..ప్రియురాలు ఫ్లోరింజ కోసం హత్య చేయడానికి సిద్ధమైన సామేల్ వెంట వచ్చిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అడ్డంగా బుక్ అయ్యాడు. సుమంత్‌పై దాడి అనంతరం ఏఆర్ కానిస్టేబుల్‌ను హైదరాబాద్‌లో వదిలేసి సామేల్ బెంగళూరు పారిపోయాడు. కాల్ డేటా అధారంగా పోలీసులు నిందితులను త్వరగా పట్టుకోగలిగారు. ప్రాణాపాయ స్థితిలో వైద్యుడు సుమంత్ వైద్యుడు సుమంత్‌రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెడ, తలకు బలమైన గాయాలు కాగా, ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. కోడలిపై అనుమానం.. ఫిర్యాదు..డాక్టర్ సుమంత్‌రెడ్డిపై దాడి జరిగిన వెంటనే తల్లిదండ్రులు కోడలు ఫ్లోరింజాపై అనుమా నం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కాల్ డేటా వివరాలను పరిశీలించారు. అందులో కొన్ని నెలలుగా గంటల తరబడి మాట్లాడుతున్న ఫోన్ నంబర్, హత్యాయత్నం జరిగిన రోజు ఎక్కడ ఉంది అని చూశారు. హత్యాయత్నం జరిగిన సంఘటన స్థలానికి మ్యాచ్ అయినట్లు సమాచారం. దీంతో సూత్రధారి అయిన భార్యను అరెస్టు చేయకుండా ఫోన్‌నంబర్ అధారంగా పోలీసులు రెండు రోజులు బెంగళూర్‌లో గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకొని వరంగల్‌కు తీసుకువచ్చారు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించడంతో అసలు నిందితురాలిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో అరెస్టు చూపే అవకాశం ఉంది. -
నీ భార్యతో ఉన్నా.. ఏం చేస్తావో చేయ్!
ఇంద్రవెల్లి (మంచిర్యాల): ఓ వివాహిత ఓ యువకుడితో సంబంధం పెట్టుకుంది. ఆ ప్రియుడు ఆ భర్తను రెచ్చగొట్టాడు. రగిలిపోయిన ఆ భర్త.. భార్యతోపాటు అత్త, వాళ్ల తరఫు బంధువులపై కూడా కత్తులతో దాడికి పాల్పడ్డాడు. మండలకేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన సంజీవాణికి దనోరా(బి) గ్రామానికి చెందిన గుట్టె అంకుష్‌తో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. భర్త అంకుష్ గత కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమెతో గొడవ పడేవాడు. దీంతో.. వారం క్రితం సంజీవాణి పుట్టింటికి వెళ్లిపోయింది.అయితే.. మంగళవారం మధ్యాహ్నం సంజీవాణి ప్రియుడు రాహుల్ అంకుష్‌కు ఫోన్ చేశాడు. ‘‘నీ భార్యతో ఆమె ఇంట్లోనే ఉన్నా.. ఏం చేస్తావో చేయ్..అంటూ సవాల్ విసిరాడు. అంకుష్ కోపంతో అత్తగారింటికి వచ్చాడు. భార్యపై కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటించిన తల్లి అనిత, అమ్మమ్మ రాధాబాయిలపై దాడి చేయగా వారికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన సంజీవాణితోపాటు ఇద్దరిని స్థానికులు మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై సునీల్ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.భర్త స్నేహితునితో భార్య అనైతిక సంబంధం.. భర్త ప్రాణత్యాగం -
కట్టుకున్న భర్తను కాదని ప్రియుడితో ..
మేడ్చల్ రూరల్: కట్టుకున్న భర్తను కాదని ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ.. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. వివరాల్లోకి వెళ్తే..ఈ నెల 10న ఉదయం మేడ్చల్ పట్టణంలోని కిందిబస్తీలో ఓ ఖాళీ ప్రదేశంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెంది పడిఉన్నట్లు స్థానికుల సమాచారంతో తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి స్వస్థలం మెదక్ జిల్లా ఎస్ కొండాపూర్ తండాకు చెందిన నునావత్ రమేశ్(30)గా గుర్తించారు. గత కొంతకాలంగా మేడ్చల్‌లో నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, భార్య లలిత(28)ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా వికారాబాద్ జిల్లా నీటూరు నర్సాపూర్‌కు చెందిన నర్సింహ్మ మేడ్చల్‌లో నివాసం ఉంటూ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతను లలితతో సన్నిహితంగా మెలిగాడు. లలిత తరచూ నర్సింహతో ఫోన్లో మాట్లాడడం, కలుస్తుండడం చూసిన భర్త రమేశ్ పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు సాగుతున్నాయి. ఈ క్రమంలో భార్య లలిత ఎలాగైనా భర్త అడ్డు తొలగించికోవాలని భావించి ప్రియుడు నర్సింహతో కలిసి చంపేందుకు ప్లాన్ వేసింది.ఈ నెల 9న రమేశ్ మద్యం మత్తులో గొడవకు దిగగా..లలిత పథకం ప్రకారం ప్రియుడిని ఇంటికి పిలుచుకుంది. రాత్రి 10.30 గంటల సమయంలో వచ్చిన నర్సింహ్మ 11 గంటల సమయంలో రమేష్ మెడకు టవల్ చుట్టి గొంతు నులిమి లలిత సాయంతో అంతమొందించాడు. రమేశ్ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న ఇద్దరు తెల్లవారుజామున కిందిబస్తీలోని ఓ ఖాళీ ప్రదేశంలో పడేసి వెళ్లి ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. 10న ఉదయం సంఘటన స్థలిని, మృతుడి ఒంటిపై గాయాలను గుర్తించిన పోలీసులు మొదట భార్య లలితను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం వెల్లడైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని బుధవారం వారిని రిమాండ్‌కు తరలించారు. -
అనుమానంతో.. భార్యను వెంటాడి మరీ..
దొడ్డబళ్లాపురం,కర్ణాటక: అక్రమ సంబంధం అనుమానంతో భార్యను కడతేర్చాడో కిరాతక భర్త. ఈ సంఘటన బెంగళూరు ఆనేకల్ తాలూకా హెబ్బగోడిలోని వినాయకనగరలో చోటుచేసుకుంది. శ్రీగంగ (27), భర్త మోహన్‌రాజు(30). వీరు చిరుద్యోగులు. శ్రీగంగ అక్కడే డిమార్ట్‌లో పనిచేసేది. పృథ్విక్ (6) అనే కుమారుడు ఉన్నాడు.శ్రీగంగ సోషల్ మీడియాలో చురుగ్గా పోస్టులు పెట్టేది. గత 7 నెలలుగా మోహన్‌రాజు పనికి వెళ్లకుండా మద్యం తాగుతూ కాలం గడుపుతున్నాడు. దీంతో నిత్యం ఇద్దరికీ గొడవ జరిగేది. అంతేకాకుండా శ్రీగంగ ప్రవర్తనపై మోహన్ అనుమానంతో పీడించేవాడు. బుధవారం ఉదయం ఇద్దరూ గొడవపడ్డారు. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో మోహన్ కత్తితో భార్యపై దాడి చేశాడు. ఆమె రోడ్డు మీదకు పరుగులు తీయగా వెంటాడి ఎనిమిది సార్లు పొడిచాడు. చావు బతుకుల్లో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించింది. హెబ్బగోడి పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మోహన్‌రాజుని అరెస్టు చేశారు. కాగా, గత కొన్ని నెలలుగా దంపతులు ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని, అతడు అప్పుడప్పుడు కొడుకును చూడాలని వచ్చి వెళ్లేవాడని స్థానికులు తెలిపారు. అలా వచ్చినప్పుడు గొడవపడి హత్య చేశాడని తెలిపారు. -
వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
కరీంనగర్‌రూరల్: వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో కరీంనగర్ శివారు బొమ్మకల్‌లో ఆదివారం రాత్రి ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం.. బొమ్మకల్‌కు చెందిన బెజ్జంకి మహేశ్(22) ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. కొంతకాలం నుంచి కాల్వ సతీశ్‌కు ఓ మహిళతో ఉన్న సంబంధం వ్యవహారంలో మహేశ్‌తో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కొత్త గ్రామ పంచాయతీ భవనం సమీపంలో సతీశ్‌తో ఉన్న వివాదాన్ని పరిష్కరించాలని మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ వ్యక్తిని మహేశ్ కోరాడు. దీంతో సదరు వ్యక్తి వెంటనే కాల్వ సతీశ్‌ను అక్కడికి పిలిపించారు. ముగ్గురు కలిసి మద్యం తాగుతుండగా.. కాల్వ సతీశ్, బెజ్జంకి మహేశ్‌ల మధ్య వివాదమేర్పడింది. ఈక్రమంలో సతీశ్ బీరు సీసాను పగలగొట్టి మహేశ్ గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారమందుకున్న రూరల్ ఏఎస్పీ శివం ప్రకాశ్, సీఐ ప్రదీప్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. స్థానికులను వివరాలడిగి తెలుసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం మహేశ్ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
చంపుతారనే భయంతో భార్య హత్య
రెంజల్(బోధన్): భార్యపై అనుమానం.. ప్రియుడితో కలిసి తనను హత్య చేస్తుందనే భయంతో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. ఈ ఘటన రెంజల్ మండలం బోర్గాం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. బోర్గాం గ్రామానికి చెందిన చిరడి పోతన్న, నీరడి స్వప్న(35) భార్యాభర్తలు. స్వప్న మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని పోతన్న అనుమానించేవాడు. అంతేగాక ప్రియుడితో కలిసి తనను చంపుతుందేమోనని భయపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం పొలం వద్ద భార్యను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశాడు. అదేరోజు రాత్రి భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మళ్లీ తానే బుధవారం ఉదయం స్టేషన్‌కు వెళ్లి తన భార్యను చంపినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకొని జాలార్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ రూరల్ సీఐ విజయ్ తెలిపారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
హత్నూర(సంగారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తనే హత్య చేసింది భార్య. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్‌లో చోటు చేసుకుంది. సోమవారం ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ(42) మూడేళ్ల కిందట ఉపాధి నిమిత్తం హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రామానికొచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. గ్రామంలోనే ఎఫ్‌పీఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) కార్యాలయంలో సీఈవోగా పని చేస్తున్నాడు. భార్య లక్ష్మీ సొంత మల్లుపల్లి గ్రామంలోనే ఉండేది. నాలుగు రోజుల కిందట భర్త వద్దకు రెడ్డి ఖానాపూర్ గ్రామానికి వచ్చింది . లక్ష్మీకి బిక్నూర్ మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కడారి రాకేశ్‌తో వివాహేత సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం తెలిసి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఎలాగైన భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. పథకం ప్రకారం శుక్రవారం రాత్రి ప్రియుడు రాకేశ్, బిక్నూర్ గ్రామానికి చెందిన సాగర్ రమేశ్, డప్పు శ్రీకాంత్, కడారి శ్రీకాంత్‌తో కలిసి భర్త నారాయణను రెడ్డి ఖానాపూర్ గ్రామ శివారులోని సొసైటీ కార్యాలయం వద్ద హత్య చేసి మృతదేహాన్ని పల్పనూరు గ్రామ శివారులో పడి వేశారు. మరుసటి రోజు (శనివారం) ఏమీ తెలియనట్లు భర్త కనిపించడం లేదని హత్నూర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం గ్రామ ఉదయం శివారులో మృతదేహం ఉందనే సమాచారం మేరకు ఘటన స్థలాన్ని పటాన్ చెరువు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ నదిముద్దీన్ పరిశీలించారు. అనుమానితురాలుగా ఉన్న భార్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకుంది. లక్ష్మీ, రాకేశ్‌తోపాటు వీరికి సహకరించిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సుభాష్ తెలిపారు. లక్ష్మీ సైతం బీజేపీ బీసీ మహిళా మండలాధ్యక్షురాలు పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.హత్య కేసులో నిందితుల రిమాండ్హత్నూర(సంగారెడ్డి): భర్తను హత్య చేయించిన భార్యతోపాటు ఇందుకు సహకరించిన నలుగురిని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు జిన్నారం సీఐ ఎండీ నయీముద్దీన్ తెలిపారు. హత్నూర పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుభాష్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ (42) వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య లక్ష్మీనర్సవ్వ, ప్రియుడు కడారి రాకేష్, చెట్లపల్లి సాగర్, కడారి శ్రీకాంత్, డప్పు శ్రీకాంత్ కలిసి హత్య చేయించిన విషయం తెలిసిందే. పథకం ప్రకారం తన ప్రియుడైన రాకేశ్‌కు రూ.40 వేలు సుపారీ ఇచ్చింది. లక్ష్మీ నర్సవ్వ ఖానాపూర్‌లో ఉండే భర్త దగ్గరకు మూడు రోజుల కిందట వచ్చింది. అతడు ఆఫీసులో ఉండగానే తాగడానికి కల్లు తెమ్మని చెప్పింది. అతడు వచ్చే లోపు పథకం ప్రకారం నలుగురు నిందితులు వచ్చి ఆఫీసులోని ఓ గదిలో దాక్కున్నారు. నారాయణ కల్లు తీసుకొని రాగానే వారి వెంట తెచ్చుకున్న కత్తి, కట్టే ఇనుప రాడుతో ఒక్కసారిగా దాడి చేసి నరికి చంపేశారు. ఈ హత్యపై ఎస్సై సుభాష్ తనదైన శైలిలో విచారణ చేయగా భార్య లక్ష్మీతోపాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కారు, కత్తి కట్టే ఇనుప రాడును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. -
సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..
మహబూబ్‌నగర్: తమ సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడిపై నలుగురు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన నవాబుపేట మండలం మరికల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మరికల్‌కు చెందిన బైండ్ల నర్సింహులు (32) అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న నెపంతో పలుమార్లు గొడవ చోటు చేసుకుంది. ఏడాది క్రితం నర్సింహులుపై వివాహిత సోదరులు దాడికి పాల్పడ్డారు. ఆరునెలల క్రితం అతడి ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టారు. మంగళవారం వ్యవసాయ పొలంలో ఒంటరిగా ఉన్న నర్సింహులుపై నలుగురు మూకుమ్మడిగా దాడిచేసి, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం అతడిని ద్విచక్ర వాహనంపై గ్రామానికి తీసుకువచ్చి మరోసారి దాడిచేశారు. ఈ క్రమంలో నర్సింహులు భార్యతో పాటు చుట్టుపక్కల వారు వారించి, అతడిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు నర్సింహులు మృతికి కారణమైన జోగు యాదయ్య, అతడి సోదరులు శ్రీను, నర్సింహులు, బాల్రాజ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. కాగా, ఈ ఘటనకు ప్రధాన కారకురాలైన వివాహితపై సైతం పలువురు దాడికి పాల్పడటంతో తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
వివాహేతర సంబంధంతో హత్య
కర్ణాటక: వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి హతయ్యాడు. నిందితులు శవాన్ని జాతీయ రహదారిపై పడేసి ప్రమాదంలో మరణించినట్లుగా చిత్రీకరించాలని చూశారు. ముళబాగిలు పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన ముళబాగిలు పట్టణ సమీపంలోని దొడ్డగుర్కి రహదారిలో చోటు చేసుకుంది. బీహార్‌కు చెందిన ఉమేష్‌కుమార్ సింగ్ (39) పట్టణ సమీపంలోని జల్లి క్రషర్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే క్రషర్లో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన శివాని అనే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని శివాని భర్త కౌశల్ పసిగట్టాడు. ఉమేష్‌కుమార్ సింగ్‌ను హత్య చేయాలని కల్బుర్గికి చెందిన రమేష్, సోమశేఖర్‌తో కలిసి పథకం రచించాడు. ఉమేష్‌కుమార్‌ను శుక్రవారం రాత్రి 7 గంటలకు శివాని సహాయంతో బయటకు రప్పించారు. కౌశిల్, రమేష్, సోమశేఖర్లు ఇనుప రాడ్లతో ఉమేష్‌కుమార్ తలపై బాదారు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇతను ప్రమాదంలో మరణించినట్లుగా చిత్రీకరించడం కోసం శవాన్ని జాతీయ రహదారిపై పడేసి వెళ్లారు. ముళబాగిలు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టి కౌశిల్, రమేష్, సోమశేఖర్, శివానిని అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధంతోనే హత్య జరిగినట్లు తేలింది. దీంతో ఆ నలుగురినీ అరెస్ట్ చేశారు. నిందితులను బంధించిన పోలీసులను ఎస్పీ నిఖిల్, అడిషనల్ ఎస్పీ రశిశంకర్లు అభినందించారు. -
మహిళా సెక్యూరిటీ గార్డును హత్య చేసిన ప్రియుడు..
అన్నానగర్: చెన్నై పక్కనే ఉన్న మామల్లపురంలో బుధవారం వివాహేతర ప్రియుడితో లాడ్జికి వెళ్లిన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో వివాహేతర ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై చెంగల్పట్టు జిల్లా మధురాంతకం పక్కన చిత్రవాడి గ్రామానికి చెందిన జయరాజ్(28)కు భార్య, ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. మేళవలంపేటలోని ఓ పురుగు మందుల దుకాణంలో పనిచేస్తున్నాడు. పౌన్సూరులో నివాసముంటున్న సంగీత(32)కు 17 ఏళ్ల కుమార్తె, 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కాట్టంకొళత్తూరు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సంగీత సెక్యూరిటీ గార్డుగా పని చేస్తోంది. ఉద్యోగానికి వెళుతున్న సమయంలో సంగీతకు జయరాజుతో అక్రమ సంబంధం ఏర్పడినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం సంగీత భర్తకు తెలియడంతో ఆమెను ఖండించాడు. ఐదేళ్ల క్రితం భర్తను విడిచిపెట్టిన సంగీత గూడువాంచేరిలోని తన తల్లి ఇంట్లో ఉంటూ జయరాజ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుస్తుంది. బుధవారం సంగీత బైకులో జయరాజుతో కలిసి మామల్లపురం వెళ్లింది. వీరిద్దరూ అక్కడే ఒత్తవాడై వీధిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు. అప్పుడు జయరాజ్ సంగీతను ఇంత మందితో సెల్ ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నావని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆహారం కొనుక్కోవడానికి జయరాజ్ బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి సంగీత ఉరి వేసుకుని చనిపోయి ఉండడాన్ని చూసి షాక్‌కు గురైన జయరాజ్ ఈ విషయాన్ని హోటల్ సిబ్బందికి తెలిపాడు. దీనిపై మామల్లపురం డిప్యూటీ సూపరింటెండెంట్ రవి అభిరామ్, మామల్లపురం పోలీసులు అక్కడికి చేరుకుని సంగీత మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జయరాజ్‌ను పోలీసులు తీవ్ర విచారణ చేస్తున్నారు. ఈ స్థితిలో సంగీతను కొట్టి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. తనతోపాటు వచ్చిన జయరాజ్‌ను పోలీసులు విచారించగా.. పలువురితో సన్నిహితంగా ఉండడంతోనే సంగీతను గొంతు నులిమి హత్య చేశానని తెలిపాడు. తర్వాత ఏం చేయాలో తెలియక హత్యను కప్పిపుచ్చాలని సంగీత దుపట్టా చించి ఆమె శరీరాన్ని విద్యుత్ ఫ్యాన్‌కి వేలాడదీశానని తెలిపాడు. అప్పుడు సంగీత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని డ్రామా ఆడినట్టు ఒప్పుకున్నాడు. కానీ సంగీత గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఈ విషయాన్ని అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన జయరాజ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
భర్త వివాహేతర సంబంధం..
తిరువొత్తియూరు: చూళగిరి సమీపంలో భర్త వివాహేతర సంబంధం కారణంగా భార్య, ఆమె కుమారుడు మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. వివరాలు.. క్రిష్ణగిరి జిల్ల చూళగిరి తాలూకా పెరిగై పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన మీనం తొట్టి గ్రామానికి చెందిన బసవరాజ్ కట్టడ తాపీ మేస్త్రి. ఇతని భార్య రాణియమ్మ. వీరి కుమారుడు వెంకటరాజు బీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బసవరాజుకు అదే గ్రామానికి చెందిన రాతమ్మతో గత 4 సంవత్సరములగా వివాహేతర సంబంధం ఉంది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 7 గంటలకు మద్యం మత్తులో బసవరాజు ఇంటికి వచ్చాడు ఆ సమయంలో ఏర్పడిన గొడవలో రాణియమ్మపై బసవరాజు దాడి చేశాడు. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేసిన కుమారుడు వెంకట్రాజ్తోనూ బసవరాజు ఘర్షణ చేశాడు. దీంతో విరక్తి చెందిన వెంకట్రాజ్ ఇంటి మిద్దె పైకి వెళ్లి అక్కడ ఉన్న గదిలో తల్లి చీరకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన రాణియమ్మ ఆవేదన చెంది దుఃఖం తట్టుకోలేక అదే ప్రాంతంలో ఉన్న చింత చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో బసవరాజు అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఇద్దరు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం హోసూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న బసవరాజు కోసం గాలిస్తున్నారు. -
వెంటాడి మరీ.. పట్టపగలే హనుమకొండలో దారుణం
హనుమకొండ, సాక్షి: పట్టపగలే నగరంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం పోయేలా చేసింది. అందరూ చూస్తుండగా.. వెంటాడి మరీ అతన్ని కిరాతకంగా హత్య చేశారు. హనుమకొండలో బుధవారం దారుణం చోటు చేసుకుంది.ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు తమలో తాము గొడవ పడ్డారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగడంతో హత్యకు దారి తీసింది. మాచర్ల రాజ్‌కుమార్, ఏనుగు వెంకటేశ్వర్లు ఆటోడ్రైవర్లు. ఈ ఇద్దరికీ స్థానికంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.అయితే ఈ విషయమై ఇద్దరు నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోవెంకటేశ్వర్లు రాజ్‌కుమార్‌ను వెంబడించాడు. సుబేదారి డీమార్ట్ ఎదురుగా దొరకబుచ్చుకుని దారుణంగా చంపాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాన్ని.. ఎంజీఎంకు తరలించారు. ఆపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ప్రియుడితో కొన్నాళ్లు సహజీవనం.. భర్తను నమ్మించి..
పలమనేరు: పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన దళిత నేత శివకుమార్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంవాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్‌ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్‌ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు షామీర్(30) పథకం ప్రకారం శివకుమార్‌ను హత్య చేసినట్టు తేల్చారు. ఈ క్రమంలో నిందితుడు షామీర్‌ను అరెస్ట్ చేశారు. పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పలమనేరు మండలంలోని ముసలిమొడుగుకు చెందిన శివకుమార్ భార్య ఉషారాణి గత 8 నెలల నుంచి పలమనేరులోని షామీర్ బిరియాని హోటల్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు షామీర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న భర్త శివకుమార్ పలుమార్లు భార్యను ప్రశ్నించాడు. ఆమె కొన్నాళ్లు ప్రియుడితో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది. దీంతో శివకుమార్ తన భార్య కనిపించలేదని వేలూరులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇకపై తాను భర్తతోనే కాపురం చేస్తానని ఉషారాణి అందరినీ నమ్మించింది. షామీర్ కూడా తాను ఉషారాణి విషయంలో జోక్యం చేసుకోనని చెప్పాడు. స్నేహితులుగా ఉందామని శివకుమార్‌ను నమ్మించి ఈ నెల 13న పలమనేరు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకు పక్కనున్న వెంచర్లోకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగించి చాతీపై బండరాయితో కొట్టి హత్య చేశారు. ఈ కేసును మూడు రోజుల్లో ఛేదించిన సీఐ నరసింహరాజు, ఎస్ఐ స్వర్ణతేజను డీఎస్పీ అభినందించారు. -
వివాహేతర సంబంధం: క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య
మేడిపల్లి: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ క్యాబ్ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. పీర్జాదిగూడలోని మల్లికార్జున నగర్లో పద్మ(40) అనే మహిళ అనురాగ్ రెడ్డి బాయిస్ హాస్టల్ నిర్వహిస్తోంది. ఈ హాస్టల్లో జనగామ జిల్లా బండ్లగూడెం గ్రామానికి చెందిన క్యాబ్ డ్రైవర్ మహేందర్ రెడ్డి (38) ఉండేవాడు. ఈ క్రమంలో ఇద్దరి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతుండటంతో మహేందర్ రెడ్డి హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. అయితే అప్పుడప్పుడు హాస్టల్‌కు వచ్చేవాడు. ఈ క్రమంలో శుక్రవారం హాస్టల్‌కు రావాలని పద్మ పిలువగా శనివారం రాత్రి వెళ్లాడు. ఆ సమయంలో హాస్టల్ గదిలో సూర్యాపేటకు చెందిన కిరణ్ రెడ్డి(35),పద్మ కలిసి ఉన్నారు. దీంతో ముగ్గురికీ మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ గొడవలో కిరణ్ రెడ్డి, పద్మలు వంటకు ఉపయోగించే గంటె, కూరగాయలు కోసే కత్తితో మహేందర్ రెడ్డి పై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ మహేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
చిలుకలూరిపేట: సహజీవనానికి ప్రియుడు బలి
చిలకలూరిపేటటౌన్: వారిద్దరిలో ఒకరికి పెళ్లీడుకొచ్చిన పిల్లలుంటే, మరొకరికి అల్లుళ్లు సైతం ఉన్నారు. అయినా వారి వివాహేతర బంధం వీడలేదు. పలుమార్లు ఎందరో నచ్చజెప్పినా వినలేదు. చివరకు ఆ సంబంధం ఒకరి ప్రాణాలను బలిగొంది. చిలకలూరిపేట పట్టణంలో గురువారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక శాంతినగర్ వాసి, మినీ ఆటో డ్రైవర్ పాలపర్తి నాగరాజు అలియాస్ తిమ్మిరి(45) డైక్మెన్ నగర్‌కు చెందిన ఓ పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న అక్కల చెంచయ్య భార్య నన్నీతో మూడేళ్ల కిందట వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పలుమార్లు ఇద్దరూ తమ కుటుంబాలను విడిచి వెళ్లిపోయిన ఘటనలు ఉన్నాయి. నన్నీకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అల్లుళ్లూ వచ్చారు. నాగరాజుకు పెళ్లీడు కొచ్చిన పిల్లలు ఉన్నారు. అతడి భార్య నాగమ్మ ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. నన్నీ, నాగరాజుకు సంఘ పెద్దలు, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వారిలో ఎలాంటి మార్పూ రాలేదు. పైగా సుభాని నగర్ వాగు సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. దీంతో నాగరాజుపై నన్నీ భర్త చెంచయ్య కక్ష పెంచుకున్నాడు. తన అన్న కుమారుడు అక్కల ప్రభుదాసుతో కలిసి హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందించాడు. అక్కయ్య కుమారుడితో కలిసి నన్నీ, నాగరాజు ఉండే ప్రాంతానికి వెళ్లారు. అదే సమయంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో ఉన్న నన్నీ తమ్ముడికి భోజనం ఇచ్చేందుకు క్యారేజీ తీసుకుని నాగరాజు, నన్నీ బయలుదేరారు. దీంతో ప్రభుదాసు, చెంచయ్య వారిని అడ్డగించారు. నన్నీని అక్కడి నుంచి పంపివేశారు. వెంటనే నాగరాజును రేకుల షెడ్డులోకి లాక్కెళ్లి కూరగాయల చాకుతో గొంతుకోసి హత్యచేసి పరారయ్యారు. హత్య అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. నాగరాజు భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. -
వివాహేతర సంబంధం.. ఢిల్లీ నుంచి గుంటూరుకు వశీకరణ మాంత్రికుడు
పెదకాకాని: వివాహేతర సంబంధం కారణంగానే నంబూరు గ్రామంలో మహిళ హత్యకు గురైనట్లు మంగళగిరి డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ తెలిపారు. పెదకాకాని పోలీసుస్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. నంబూరు గ్రామానికి చెందిన షేక్ మల్లికతో అదే గ్రామానికి చెందిన షేక్ అక్బర్‌కు ప్రేమ వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. అక్బర్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అతడి ఆటోలో రోజూ రాకపోకలు సాగించే బోర్లు తీసే వారిలో ఒకరైన కారుమూరి ప్రేమ్‌కుమార్‌తో మల్లికకు పరిచయం ఏర్పడింది. దీంతో గొడవలు జరిగి దంపతులు విడిపోయారు. అనంతరం ప్రేమ్‌కుమార్‌ను ఆమె రెండో వివాహం చేసుకుని గుంటూరుకు వచ్చింది. 2021లో గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన బంగారు వ్యాపారి అబ్దుల్ రెహమాన్‌తో పరిచయం ఏర్పడింది. తర్వాత వివాహేతర సంబంధంగా మారడంతో మల్లికకు అతడు బంగారం, నగదు రూపంలో రూ.15 లక్షల వరకు ఇచ్చాడు. 9 నెలల క్రితం మల్లిక దంపతులు కాపురం నంబూరుకు మార్చారు. రెహమాన్‌ను కొంతకాలంగా దూరంగా పెడుతోంది. గ్రామానికి చెందిన నాగబాబుతో పరిచయం ఏర్పడిందని, అతనితోనే ఉంటానని హెచ్చరించింది. వారిద్దరూ శారీరకంగా కలిసి ఉన్న వీడియోను రెహమాన్‌కు వాట్సాప్ పెట్టింది.వికటించిన వశీకరణ ప్రయత్నంకక్ష పెంచుకున్న రెహమాన్ ఆమెను వశీకరణతో సొంతం చేసుకోవాలని, లేకుంటే కాళ్లు, చేతులు పడిపోయి మంచానికే పరిమితం చేయాలని గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్డులోని గాయత్రి అపార్ట్మెంట్లో ఉంటున్న షేక్ జనాబ్ అహ్మద్ మంత్రగాడిని ఆశ్రయించాడు. పదేళ్ల క్రితం ఢిల్లీ నుంచి గుంటూరుకు మంత్రగాడు వచ్చాడు. మల్లిక తల వెంట్రుకలు, దుస్తులను రెహమాన్ తెచ్చి షేక్ జనాబ్ అహ్మద్‌కు ఇచ్చాడు. పిండితో బొమ్మను చేసి వశీకరణ చేసినట్లు పేర్కొన్నాడు. అప్పటికీ ఆమె దక్కలేదు.చున్నీతో గొంతు బిగించి హత్యరూ.3 లక్షలు నగదు ఇచ్చి మల్లికను చంపేలా రెహమాన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. డిసెంబరు 28వ తేదీన షేక్ జనాబ్ అహ్మద్ తన అనుచరులైన ప్రకాశం జిల్లా పామూరు పడమట కట్టకింద పల్లి గ్రామానికి చెందిన ఎర్రబెల్లి కాజా రసూల్, గుంటూరుకు చెందిన మానిపాటి స్వప్నతో కలిసి నంబూరు చేరుకున్నాడు. స్వప్న స్కూటీ వద్ద నిలబడి ఉండగా అహ్మద్, కాజా రసూల్‌లు మల్లిక ఇంటిలోకి వెళ్లి ఒంటరిగా ఉన్న మల్లిక(29)ను నోరు మూసి చున్నీతో గొంతు బిగించి హతమార్చారు. నిందితులైన రెహమాన్, షేక్ జనాబ్ అహ్మద్, కాజా రసూల్, స్వప్నలను మంగళవారం ఆరెస్టు చేశారు. కోర్టుకు హాజరు పరచనున్నట్లు డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ తెలిపారు. మల్లిక దుస్తులు, రూ.40 వేల నగదు, స్కూటీ, సెల్ఫోన్లను నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ టి.పి. నారాయణస్వామి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
ఇద్దరితో పెళ్లి.. మరొకరితో వివాహేతర సంబంధం..చివరికిలా!
పెదకాకాని: వివాహేతర సంబంధం కారణంగానే నంబూరులో మహిళ హత్యకు గురైనట్లు తెలిసింది. స్థానికుల ద్వారా సేకరించిన విశ్వసనీయ సమాచారం మేరకు... పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయిన షేక్ మల్లికది హత్యేనని నిర్ధారణ అయింది. నంబూరుకు చెందిన షేక్ మల్లికను పది ఏళ్ల కిందట అదే గ్రామానికి చెందిన షేక్ అక్బర్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి పాప, బాబు సంతానం. మల్లిక ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో పిల్లలు పుట్టిన కొద్ది రోజులకే గొడవలు జరిగాయి. దీంతో ఆమె భర్త నుంచి విడిపోయింది. తరువాత గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్‌ను వివాహం చేసుకుంది. వీరు కొంతకాలంపాటు గుంటూరులో కాపురం పెట్టారు. ఆ సమయంలో బంగారం వ్యాపారం చేసే రెహమాన్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. మల్లికకు సంతానం కలగకుండా ఆపరేషన్ అయింది. దీంతో సుమారు రూ.5 లక్షలు ఖర్చు చేసి మల్లిక దంపతులు పెంచుకునేందుకు పాపను కూడా రెహమాన్ తీసుకొచ్చి ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల దంపతులు నంబూరుకు కాపురం మార్చారు. అప్పటి నుంచి రెహమాన్‌కు ఆమె దూరంగా ఉంటోంది. స్థానిక యువకుడితో వివాహేతర సంబంధం కారణమని రెహమాన్ గుర్తించాడు. దీంతో శనివారం ఆమెను హత్య చేసేందుకు ఇద్దర్ని నంబూరు పంపాడు. మల్లిక విషయాలను మరొక మహిళ ఫోన్ ద్వారా రెహమాన్‌కు చేరవేస్తూ వచ్చింది. ప్లాన్ ప్రకారం ముఖానికి మాస్క్‌లు ధరించిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను హతమార్చి తిరిగి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీనిపై పెదకాకాని సీఐ టి.పి. నారాయణ స్వామి మాట్లాడుతూ కేసు దర్యాప్తులో ఉందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
వివాహేతర సంబంధమే ప్రాణం తీసిందా?
వేములవాడ: యువకుడి హత్యతో వేములవాడ ఉలిక్కిపడింది. తెల్లవారుజామున వేటాడి.. వెంటపడి చంపేశారు. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధమే కారణమనే చర్చ సాగుతోంది. హత్య చేసిన వారితోపాటు ఓ మహిళ సైతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.స్థానికులు తెలిపిన వివరాలు. వేములవాడ పట్టణంలోని సాయినగర్‌లో నివసించే ఎండీ రషీద్(36) బుధవారం వేకువజామున 5.15 గంటల ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. స్థానిక అర్బన్‌కాలనీ నుంచి కోనాయపల్లిరోడ్లోని ఓ కాలనీ వరకు వెంటాడి హతమార్చినట్లు తెలుస్తోంది. మృతుడి శరీరంపై 30కి పైగా గాయాలు ఉన్నట్లు సమాచారం. మృతుడికి భార్య శిరీన్, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం పోలీసులు ఏరియా ఆస్పత్రి నుంచి నూకలమర్రికి తరలించారు. మృతదేహాన్ని తమకు అప్పగించకుండా నూకలమర్రికి ఎందుకు తీసుకెళ్లారంటూ మృతుడి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్బీ డీఎస్పీ మురళీకృష్ణ పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు, రక్తపు నమూనాలు సేకరించారు. హత్యకు పాల్ప డిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.సోదరునికి ఫోన్‌చేసి... ఆపై తుదిశ్వాస విడిచివేములవాడరూరల్ మండలం నూకలమర్రికి చెందిన ఎండీ రషీద్ ఐదేళ్లుగా పట్టణంలోని సాయినగర్‌లో ఉంటున్నారు. గంగాధర మండల కేంద్రంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. అదే కాలనీకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో గతంలో పంచాయితీలు జరిగాయి. ఈక్రమంలోనే గతంలో నమోదైన కేసులో రాజీపడ్డట్లు సమాచారం. బుధవారం వేకువజామున 5 గంటలకు మృతుడి రషీద్ సోదరుడు అజీమ్‌కు ఫోన్ చేసి చంపుతున్నారని, త్వరగా రావాలని చెప్పినట్లు పోలీసులకు వివరించారు. అడ్రస్ సరిగా తెలియక అజీమ్ తన మిత్రుడు శ్రీనివాస్‌ను తీసుకొని గాలించగా ఆలస్యంగా రషీద్ పడి ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికే కొనఊపిరితో ఉన్న రషీద్‌ను అంబులెన్స్‌లో తరలిస్తుండగానే చనిపోయినట్లు అజీమ్ తెలిపారు. తన సోదరి రబియా హైదరాబాద్‌కు వెళ్లగా.. రాత్రి వారి ఇంట్లో పడుకున్నాడని పోలీసులకు తెలిపారు.‘నా భార్యను అంతలా చూస్తున్నారు.. చంపేస్తా’ -
పరాయి వ్యక్తితో భార్య ఎఫైర్.. భర్త ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్ట రోడ్డులోని సిలువెపుర గ్రామంలో చోటుచేసుకుంది. బాలరాజ్ (41) ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. బాలరాజ్ 18 ఏళ్ల క్రితం కుమారి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆనాటి నుండి ఆమె భర్తను వేధింపులకు గురిచేసేదని, ఇటీవల ఆమె పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి మనస్తాపంతో బాలరాజు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ వివరాలు డెత్‌నోట్ రాసిన బాలరాజు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోలదేనమళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇది చదవండి: ‘డబ్బు కోసమే వేధించి ఉంటే.. అలా ఎందుకు చేస్తా!’: అతుల్ భార్య నిఖిత స్టేట్మెంట్ -
పీఎస్‌కు వచ్చిన వివాహితను ట్రాప్ చేసిన సీఐ.. ప్లాట్ కొనిస్తా అంటూ..
నల్లగొండ క్రైం: తన భార్యతో నల్లగొండ పట్టణ టూటౌన్ సీఐ డానియల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తి ఎస్పీ శరత్చంద్ర పవార్‌కు శనివారం ఫిర్యాదు చేశాడు. సదరు సీఐ తన భార్యతో కాపురం చేయనీయకుండా మనోవేధనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు విషయాన్ని బాధితుడు విలేకరులకు తెలిపాడు. వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన దంపతులు వారి సొంత ఇంటిని విక్రయించుకున్నారు. దానికి సంబంధించిన దస్తావేజులు తీసుకునేందుకు పట్టణంలో ఓ బ్యాంకు వెళ్లారు. ఆ తర్వాత భార్య పట్టణంలోని టూటౌన్ సీఐ వద్దకు వెళ్లి తనపై పలు ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీఐ డానియల్ ఆమెతో చనువు పెంచుకుని తన భార్యకు తరచూ ఫోన్, చాటింగ్ చేస్తూ.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బాధితుడు తెలిపాడు. తనను పదేపదే స్టేషన్‌కు పిలిపించి బెదిరించారని.. ఊళ్లో ఉన్న పొలం అమ్ముకుని వస్తే కేసులు తీసివేస్తామని, భార్యతో విడాకులు ఇప్పిస్తానని వేధించాడని పేర్కొన్నాడు.తన భార్యకు ప్లాటు కొనిస్తానని, డబ్బులు ఇస్తానని నమ్మబలికి లోబరుచుకున్నాడని ఆరోపించాడు. తన భార్య సెల్‌ఫోన్ తనిఖీ చేయగా సీఐతో చాటింగ్‌లు చేసిన విషయం తెలిసిందని.. ఈ చాటింగ్ తదితర ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. తన భార్య, సీఐతో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. కాగా.. ఈ ఘటనపై సీఐ డానియల్ స్పందిస్తూ తనపై చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని తెలిపారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా తనపై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు.ఫిర్యాదుపై విచారణ చేస్తున్నాం– ఎస్పీ శరత్చంద్ర పవార్సీఐపై వచ్చిన ఫిర్యాదుపై నల్లగొండ డీఎస్పీ విచారణ చేస్తున్నారని, ఫోన్ చాటింగ్ పరిశీలిస్తున్నామని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. డీఎస్పీ నివేదిక ఆధారంగా సీఐపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
వివాహేతర సంబంధం: భార్యా బిడ్డలపై భర్త దాడి
మైసూరు: వేరే మహిళతో కలిగిన తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన భార్య, కుమార్తెపై భర్త తన ప్రియురాలితో కలిసి దాడి చేసి హత్య బెదిరింపులకు పాల్పడిన ఘటన నగరంలోని ఎన్ఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన శ్వేత అనే మహిళ తన భర్త సంతోష్‌కుమార్, అతని ప్రియురాలు శిల్పలపై ఎన్ఆర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్వేత, సంతోష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వీరు బెంగళూరులోని కెంగేరి లింగదీరనహళ్లి బడావణెలో నివసిస్తున్నారు. వీరి అన్యోన్య దాంపత్య జీవితంలో సుడిగాలిలో శిల్ప ఎంట్రీ ఇచ్చింది. సుమారు ఆరు నెలల క్రితం సంతోష్ కుమార్ జీవితంలోకి శిల్ప ప్రవేశంతో శ్వేత దాంపత్య జీవితంలో కుదుపు ఏర్పడింది. తరచూ మొబైల్లో సంతోష్ కుమార్‌తో మాట్లాడుతూ అశ్లీల మెసేజ్‌లను పంపుతూ దగ్గరయిన శిల్ప క్రమంగా దంపతుల దాంపత్య జీవితానికి కంటకంగా మారారు. శిల్ప ప్రేరణతో సంతోష్ కుమార్ తరచు భార్య, పిల్లలపై దాడి జరిపి రగడ సృష్టించేవారు. ఈ విషయంపై గతంలో శ్వేత కెంగేరి పోలీసు స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ పరిణామం ఇద్దరు పిల్లలపై కూడా ప్రభావం చూపింది. చిన్న కుమార్తె మానసికంగా కుంగి మైసూరులో తల్లి ఇంటిలో ఉండిపోయింది. కుమార్తెను చూసేందుకు శ్వేత తన పెద్ద కుమార్తెతో కలిసి మైసూరుకు వచ్చినప్పుడు బన్నిమంటప ఎల్ఐసీ సర్కిల్ వద్ద సంతోష్ కుమార్, అతని ప్రియురాలు శిల్ప ఎదురై శ్వేత, ఆమె కుమార్తెపై దాడి చేసి హత్య చేస్తామని బెదిరించారు. దాడికి గురైన శ్వేత ఘటన నుంచి కోలుకున్న అనంతరం ఎన్ఆర్ పోలీసు స్టేషన్లో భర్త, ఆమె ప్రియురాలిపై ఫిర్యాదు చేసింది. -
రౌడీ షీటర్ భార్యతో వివాహేతర సంబంధం..
వాకాడు: వివాహేతర సంబంధం హత్యకు దారి తీసిన ఘటన వాకాడు మండలం, దుగ్గరాజపట్నం సమీపంలో ఈ నెల 17న చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. వాకాడు సీఐ హుస్సేబాషా విలేకరులతో మాట్లాడుతూ గూడూరు పట్టణం, శివాలయం ప్రాంతానికి చెందిన కొండా అనిత్కుమార్రెడ్డి (25)కు గూడూరులోని కనుపూరు శ్రీహరి అలియాస్ జెమిని అనే రౌడీ షీటర్ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం శ్రీహరి దృష్టికి రావడంతో అనిత్రెడ్డిపై పగ పెంచుకున్నాడు. పట్టణంలోని మరో రౌడీ షీటర్ బాసం నరేష్ అలియాస్ చిన్నప్రేమ్, కోట మండలం, విశ్వనాథ అగ్రహారానికి చెందిన పేనాటి అలియాస్ పేర్నాటి చందు, గూడూరు చవటపాళెంకు చెందిన షేక్ కాలేషా, గూడూరు గాంధీనగర్‌కు చెందిన జావీదులతో కలసి అనిత్‌రెడ్డిని హత్య చేసేందుకు పథకం రూపొందించారు. ఈ నేపథ్యంలో చిల్లకూరు చుట్టుగుంట సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న దాబాను కేంద్రంగా చేసుకున్నారు. అనిత్రెడ్డికి మద్యం పార్టీ ఉందని నమ్మించి గూడూరు హైవే రోడ్డు నుంచి దాబా వద్దకు తన స్నేహితులు స్కూటీపై తీసుకొచ్చారు. అక్కడ మద్యం సేవించిన అనంతరం ఐదుగురూ కలసి అనిత్‌రెడ్డిని కర్రలతో కొట్టి చంపేశారు. తర్వాత టిమ్మర్‌తో తల వెంట్రుకలు, మీసాలు తీసి ఆనవా ళ్లు గుర్తుపట్టని విధంగా చెరిపేశారు. ఆపై మృతదేహాన్ని కారు డిక్కీలో ఉంచుకుని దుగ్గరాజపట్నం సమీపంలోని పొలాల్లో పడేసి వెళ్లారు. స్థానికుల సమాచాంతో వాకాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో హత్య వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించినట్టు సీఐ తెలిపారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టి శ్రీహరి(జెమిని), నరేష్(చిన్నా ప్రేమ్)తోపాటు, పేనేటి చందు, షేక్ కాలేషా, షేక్ జావీదులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. వారిచ్చిన సమాచారం మేరకు గూడూరు నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలోని రోడ్డు వద్ద మిగిలిన ఇద్దర్నీ అరెస్టు చేశామన్నారు. అనంతరం ఐదుగురు నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు. మొదటి ముద్దాయి శ్రీహరిపై గూడూరు 1వ పట్టణ స్టేషన్లో, రెండో ముద్దాయి షేక్ కాలేషాపై రూరల్ పోలీస్టేషన్లో 5 క్రిమినల్ కేసులు, రౌడీ షీట్లు ఉన్నట్లు సీఐ తెలిపారు. త్వరితగతిన కేసును ఛేదించిన గూడూరు డీఎస్పీ రమణ్కుమార్ని అభినందించారు. ఎస్ఐలు నాగబాబు, పవన్‌కుమార్, చిన బలరామయ్య పాల్గొన్నారు. -
నల్గొండ డీఈవో లీలలు.. భార్య ఉండగానే మరో మహిళతో..
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండ డీఈవో భిక్షపతి లీలలు వెలుగులోకి వచ్చాయి. భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆ మహిళ ద్వారా ముగ్గురు పిల్లలకు భిక్షపతి తండ్రి అయినట్లు మొదటి భార్య ఆరోపిస్తోంది. ప్రియురాలితో ఉండగా డీఈవో భిక్షపతిని భార్య రెడ్ హ్యాండెడ్ పట్టుకుంది. పెళ్లైన నెలకే వదిలేశాడంటూ డీఈవో ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. గతంతోనూ డీఈవోపై అనేక ఆరోపణలు రాగా, గత కొన్నేళ్లుగా నల్లగొండ డీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. తనను మోసం చేసి వేరే కాపురం పెట్టాడంటూ డీఈవో భిక్షపతి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో మహిళతో ఉంటూ తనకు విడాకుల నోటీసులు పంపించారని.. ఈ వ్యవహారం ఏంటని ప్రశ్నిస్తే చంపుతానంటూ బెదిస్తున్నారని ఆమె తెలిపారు. -
చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను హత్య చేసిన భార్య
మడకశిర: నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన గుర్తు తెలియని శవం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్ వివరాలను తెలియజేశారు. 2023 జనవరి 12న మడకశిర మండలం కోడిగానిపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువకు ఏర్పాటు చేసిన బ్రిడ్జి కింద గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. వీఆర్ఓ హారతి స్థానిక పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.మిస్సింగ్ కేసుల ఆధారంగా ..మడకశిర పోలీసులు వివిధ ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మడకశిర సీఐ సురేష్‌బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆయన బదిలీపై వెళ్లిపోవడంతో ప్రస్తుత మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్, గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ కేసు దర్యాప్తు కొనసాగించారు. ఇందులో భాగంగా కర్ణాటకలోని తుమకూరు జయనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ మిస్సింగ్ కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. తుమకూరుకు చెందిన నాగరత్నమ్మ అనే మహిళ తన పెద్ద కుమారుడు మోహన్‌కుమార్ (52) తప్పిపోయినట్లు 2023 జనవరి 21న జయనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వివరాలను మడకశిర పోలీసులు సేకరించారు. ఆ తర్వాత శవం ఫొటోను నాగరత్నమ్మకు చూపించగా మృతుడు తన పెద్ద కుమారుడేనని గుర్తు పట్టింది. మృతుడి సోదరులైన అరుణ్‌కుమార్, కిరణ్‌కుమార్‌లను కూడా మడకశిర పోలీసులు విచారించారు. తప్పిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.విచారణలో పోలీసులకు దొరికిన క్లూమృతుడి తల్లి, సోదరుల విచారణలో ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడికి, అతని భార్య కవితకు మనస్పర్థలు ఉన్నాయి. దీంతో మృతుడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి తుమకూరులోనే శిరా గేట్లో వేరుగా తన కుమారుడు కౌశిక్, కుమార్తె దీక్షితతో కలిసి ఉంటోందని వారు పోలీసులకు వివరాలు అందించారు. ఈవివరాల మేరకు మడకశిర పోలీసులు మృతుడి భార్య కవితను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు.భార్య విచారణతో వీడిన మిస్టరీమృతుడి భార్య కవితను పోలీసులు విచారణ చేయడంతో మోహన్‌కుమార్‌ను హత్య చేసినట్లు తేలింది. కవితకు తుమకూరు జిల్లా గుబ్బిలో పనిచేసే విద్యుత్‌శాఖ జేఈగా పని చేసే అక్తర్‌పాషాతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అతనితో సహ జీవనం కూడా చేసేది. అక్తర్‌పాషాతో కవిత డబ్బులు ఇప్పించుకుని తుమకూరులోనే ఓ హోటల్ పెట్టింది. ఈ క్రమంలో మృతుడు మోహన్‌కుమార్ పలుసార్లు హోటల్ వద్దకు వెళ్లి భార్య కవిత, ప్రియుడు అక్తర్‌పాషా, హోటల్లో పని చేసే వంట మనిషి మోహన్‌ప్రసాద్, కుమారుడు కౌశిక్‌ను దూషించేవాడు. తన ఆస్తిని మీకు ఇవ్వనని, తన సోదరులకు ఇస్తానని భార్య, కుమారుడితో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్, ప్రియుడు అక్తర్‌పాషాలు మోహన్‌కుమార్‌ను చంపడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికి హోటల్ వంట మనిషి మోహన్‌ప్రసాద్‌తో సుపారీ మాట్లాడారు. రూ.లక్షకు ఒప్పందం చేసుకొని రూ.50 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారు.చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి హత్యపథకం ప్రకారం కుమార్తె దీక్షతకు ఆరోగ్యం బాగా లేదని మోహన్‌కుమార్‌ను భార్య కవిత 2023 జనవరి 11న రాత్రి 9 గంటల సమయంలో ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు వేసి మోహన్‌కుమార్‌కు పెట్టారు. భోజనం చేసిన తర్వాత మృతుడు మత్తులోకి పోయాడు. ఈక్రమంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్, వంట మనిషి మోహన్‌ప్రసాద్... మోహన్‌కుమార్ తలపై రోకలిబండతో కొట్టారు. మృతుడి భార్య ప్రియుడు అక్తర్‌పాషా కత్తితో గొంతుకోశారు. మోహన్‌కుమార్ మృతి చెందగా శవాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో కట్టి వంట మనిషి ఓ కారులో వేసుకుని మడకశిర మండలంలోని కోడిగానిపల్లి హంద్రీనీవా కాలువ బ్రిడ్జి కింది భాగాన పడేసి వెళ్లారు.నలుగురు నిందితుల అరెస్ట్పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్, గుడిబండ ఎస్ఐ మునిప్రతాప్ సిబ్బంది ఆదివారం నిందితులను తుమకూరులో అరెస్ట్ చేశారు. శవాన్ని తరలించడానికి ఉపయోగించిన కారు, మరణాయుధాలు కూడా సీజ్ చేశారు. నిందితులైన కవిత, అక్తర్‌పాషా, కౌశిక్, మోహన్‌ప్రసాద్‌లను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ రాజ్‌కుమార్, ఎస్ఐ మునిప్రతాప్ తదితర పోలీసులను ఎస్పీ రత్న అభినందించినట్లు పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. -
దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
శ్రీనివాసపురం: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం రాత్రి తాలూకాలోని పాళ్య గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి భార్య రూప (38) హత్యకు గురైంది. పాళ్య గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి భార్య రూప సోమవారం మధ్యాహ్నం పశువులు మేపడానికి ఇంటి నుంటి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ సమయంలో సంబందీకులకు గ్రామ సమీపంలోని చురువునహళ్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న కాలువ వద్ద రూప రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాసపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. హత్య జరిగిన రోజునే నిందితుడిని అరెస్టు చేశారు. ఇదే గ్రామానికి చెందిన ఆనందప్ప నాయక్‌ను హంతకుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆనందప్ప నాయక్‌కు హతురాలు రూపతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. హతురాలు రూప, ఆనందప్ప నాయక్‌ల మధ్య ఈ మధ్య వైషమ్యాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆనందప్ప నాయక్ రూపను గొంతుకోసి హత్య చేసినట్టు తెలిసింది. హత్యపై స్పందించిన భర్త శ్రీరామరెడ్డి తాను సాయంత్రం భార్య రూపకు ఫోన్ చేసిన సమయంలో మొబైల్ స్విఛాఫ్ వచ్చింది. తన భార్య రూప ఆనందప్ప నాయక్‌ల మధ్య డబ్బు లావాదేవీలు ఉండేవని హత్య ఎందుకు జరిగిందనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉందన్నారు. కోలారు ఎస్పీ బి నిఖిల్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ నందకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రచించి విచారణ చేస్తున్నారు. శ్రీనివాసపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
భార్య మీద అనుమానంతో దుబాయ్ నుంచి వచ్చి...
కరీంనగర్ (మల్లాపూర్): అనుమానం పెనుభూతమై భార్యను గొంతు నొక్కి అతికిరాతకంగా చంపేశాడోభర్త. ఈ దారుణం మండలంలోని వెంకట్రావ్‌పేటలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన వెల్మల రమేశ్‌కు రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన సునీతతో 2015లో వివాహం జరిపించారు. వీరికి కూతురు ఆద్య (8), కుమారుడు జయసూర్య(6) సంతానం. కొంతకాలంగా వెంకట్రావ్‌పేటలో ఉంటున్నారు. రమేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి వస్తున్నాడు. నెలక్రితం దుబాయ్ నుంచి వచ్చిన రమేశ్‌కు సునీత వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం కలిగింది. ఇదే విషయమై బుధవారం ఉదయం భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో రమేశ్ క్షణికావేశంలో సునీత ముఖంపై బలంగా కొట్టాడు. గొంతు నులిమి హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సునీత కుటుంబసభ్యులు ఘటనాస్థలికి వెళ్లి బోరున విలపించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్సై కిరణ్‌కుమార్ విచారణ చేపట్టారు. మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, కోరుట్ల సీఐ సురేష్‌బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు తండ్రి మందల గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అమేథీ హత్యలు.. ఆమె వివాహేతర సంబంధమే కొంప ముంచింది!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమేథీలో కుటుంబమంతా తుపాకీ కాల్పుల్లో మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలను ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. మృతులను టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సునీల్ కుమార్, ఆయన భార్య పూనమ్ భారతి, ఆరేళ్లు-ఏడాది వయసున్న ఇద్దరు కూతుర్లుగా గుర్తించారు. ఈ ఘటన గురువారం వెలుగుచూడగా.. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నిందితుడు చందన్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడి విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.నిందితుడు విచారణలో చేసిన నేరాన్ని అంగీకరించినట్లు అమేథీ ఎస్పీ అనూప్ సింగ్ వెల్లడించారు. ఈ హత్యల వెనక వివాహేతర సంబంధమే కారణమని తేలిందన్నారు. నిందితుడికి, మహిళకు గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తెలిపారు. ఒకటిన్నర సంవత్సరంగా పూనమ్‌తో అక్రమంగా సంబంధం కలిగి ఉన్నాడని అయితే ఇటీవల ఇద్దరి మధ్య రిలేషన్షిప్ దెబ్బతినడంతో అతడు ఒత్తిడికి గురైనట్లు తెలిపారు. ఆ కారణంగానే ఆవేశంలో.. ఇంట్లోకి చొరబడి నలుగురిని కాల్చిచంపినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. అతడు ఒక్కడే ఈ ఘోరాలకు పాల్పడ్డాడని, ఘటనాస్థలంలో లభించిన బుల్లెట్లన్నీ ఒకే పిస్టల్ నుంచి రావడం వల్లే తాము ఆ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. కాగా సునీల్ కుమార్, అతని భార్య పూనమ్, వారి ఇద్దరు కుమార్తెలు గురువారం అమేథీలోని భవానీ నగర్‌లోని వారి ఇంటిలో కాల్పుల్లో హత్యకు గురయ్యారు. నిందితుడు చందన్ వర్మ తుపాకీతో 10 రౌండ్ల కాల్పులు జరిపాడు. కుటుంబంలోని అందరినీ చంపిన తర్వాత తనను తాను కాల్చుకోవాలని ప్రయత్నించాడు. కానీ బుల్లెట్ మిస్ అయింది. మళ్లీ కాల్చుకునే ధైర్యం చేయలేక అక్కడి నుంచి పారిపోయాడు. ఇక తీవ్రగాయాలైన బాధితులను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఢిల్లీకి పారిపోతున్న నిందితుడిని నోయిడాలోని టోల్ ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ పోలీస్ అధికారి తుపాకీని లాక్కొని తప్పించుకునే ప్రయత్నంలో అతను కాల్పుల్లో గాయపడ్డాడు. తాజాగా ఆ ఘటన సమయంలో వాడిన ద్విచక్ర వాహనం, పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.అయితే ఈ హత్యల నేపథ్యంలో కొన్ని నెలల క్రితం పూనమ్ పెట్టిన పోలీసు కేసు విషయం వెలుగులోకి వచ్చింది. వర్మ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆమె అందులో ఫిర్యాదు చేశారు. దీని గురించి ఫిర్యాదు చేస్తే.. చంపేస్తానని బెదిరించాడని, తమ కుటుంబానికి ఏదైనా హాని తలపెడితే అందుకు అతడే కారణమని పేర్కొంది. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. -
ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య
ధారూరు: ఓ వివాహిత ఇద్దరు ప్రియులతో నెరపిన వివాహేతర సంబంధం ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలీ తాలూకా కుంచావరం పీఎస్ పరిధిలోని జడి మల్కాపూర్ జలపాతం వద్ద చోటు చేసుకుంది. ధారూరు సీఐ భీంకుమార్, కోట్‌పల్లి ఎస్ స్రవంతి శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. చేవెళ్ల మండలం కౌంకుట్ల గ్రామానికి చెందిన అనితకు 15 ఏళ్ల క్రితం కోట్‌పల్లి మండలం అన్నాసాగర్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. ఈమె వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న భర్త ఏడాది క్రితమే బలవన్మరణానికి పాల్పడ్డాడు. అన్నాసాగర్‌కు చెందిన శ్రీకాంత్(27), చౌట మల్లేశంతో ఒకరికి తెలియకుండా మరొకరితో అనిత వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇటీవల విషయం తెలుసుకున్న శ్రీకాంత్ ఇద్దరినీ చంపేస్తానంటూ ఆమెను బెదిరించాడు. వివాహితుడైన శ్రీకాంత్‌ను వదిలించుకోవాలని భావించిన అనిత మనల్ని చంపేస్తానంటున్నాడని మల్లేశంకు చెప్పింది. దీంతో మల్లేశం తన మిత్రులైన జిన్నారం గ్రామానికి చెందిన మొల్ల బందెళ్లి, బంటూ బందెళ్లి, కోట్‌పల్లికి చెందిన అంజప్పతో కలిసి శ్రీకాంత్ హత్యకు పథకం వేశారు. సెప్టెంబర్ 25న శ్రీకాంత్‌ను అనిత, మల్లేశం అతని మిత్రులు లింగంపల్లి చౌరస్తాకు రప్పించారు.తమ కారులో అందరూ కలిసి జడి మల్కాపూర్ జలపాతానికి చేరుకున్నారు. శ్రీకాంత్‌కు ఫుల్‌గా మద్యం తాగించి మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం శవాన్ని జలపాతంలో పడేసి వెళ్లిపోయారు. మృతుడి తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు ఎస్ స్రవంతి దర్యాప్తు చేపట్టారు. కోట్‌పల్లి బందయ్య సమాచారం మేరకు అనుమానితులైన మల్లేశం అతని మిత్రులు మొల్ల బందెళ్లి, బంటూ బందెళ్లి, అంజప్పలను విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను జలపాతం వద్దకు తీసుకెళ్లి శవం వెతికించినా వరద ప్రవహానికి లభ్యమవ్వలేదు. అనిత పరారీలో ఉండగా మిగిలిన నలుగురిని శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
సూర్యాపేట : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ కేసులో నిందితురాలుని స్థానిక పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం సూర్యాపేటరూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి కేసు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సూర్యాపేట మండలంలోని హనుమానాయక్తండాకు చెందిన ధరావత్ కౌసల్య అదే తండాకు చెందిన మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధానికి తన భర్త ధరావత్ సైదా అడ్డొస్తున్నాడని, అతడిని ఎలాగైనా తొలగించుకోవాలనే ఆలోచనతో ఆగస్టు 17న రాత్రి భర్త సైదాను కౌసల్య గొడ్డలితో కణతపై నరికి హత్య చేసింది. అనంతరం ఏమి తెలియనట్లు తన భర్త మద్యం సేవించి తూలి చెక్కబల్లపై పడి మృతి చెందినట్లు అందరిని నమ్మించింది. ఈ హత్యను కౌసల్య చిన్న కుమారుడు వినోద్ చూడడంతో అతడిని బతిమిలాడి హత్య విషయాన్ని బయట తెలిస్తే నేను జైలుకు వెళ్తానని, అప్పుడు మీరు బతకడం కష్టమవుతుందని, ఎవరికి ఈ విషయాన్ని చెప్పనివ్వలేదు. ఈనెల 22న కౌసల్య తన చిన్న కుమారుడు వినోద్‌తో గొడవ పెట్టుకోగా వినోద్ తన తండ్రిని తన తల్లి కౌసల్యే హత్య చేసిన విషయం అన్న సాయికుమార్‌కు చెప్పాడు. దీంతో సాయికుమార్ ఈనెల 23న రూరల్‌పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అదే విధంగా నిందితురాలు హత్యకు ఉపయోగించిన గొడ్డలిని సీజ్ చేసినట్టు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో సిబ్బంది పాల్గొన్నారు. -
దారుణం.. అనుమానంతో భార్యను చంపిన భర్త
సైదాపురం: క్షణికావేశంలో తాలికట్టిన భార్యపై అనుమానంతో కత్తితో దారుణంగా నరికి చంపేశాడు ఓ భర్త. అనంతరం బిడ్డలతో కలిసి పోలీసు స్టేషన్లో లొంగిపోయిన ఘటన సైదాపురం మండలంలో చోటు చేసుకుంది. రాపూరు సీఐ విజయకృష్ణ అందించిన వివరాల మేరకు.. మండలంలోని గంగదేవిపల్లికి చెందిన చింతలపూడి మహేంద్ర(33)కు అదే గ్రామానికి చెందిన లావణ్యకు 11 ఏళ్ల కిందట పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి వరుణ్(10), జయవర్ధన్(8) ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల కిందట నెల్లూరుకు కాపురం మార్చారు. అయితే వీరి మధ్య ఏడాది నుంచి వివాదం జరుగుతుండేది. ఈ క్రమంలో ఇటీవలే స్వగ్రామానికి వెళ్లారు. మహేంద్రకు తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోమవారం భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. దుస్తులు సర్దుకుని తన అమ్మవారి పుట్టినిల్లు అయిన చిట్వేల్‌కు చేరుకునేందుకు లావణ్య సిద్ధమైంది. ఇరుగు పొరుగు వారు సర్దిచెప్పారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మళ్లీ ఇంటి నుంచి వెళ్లేందుకు లావణ్య ప్రయత్నించడంతో మహేంద్ర క్షణికావేశంలో అక్కడే ఉన్న కత్తి తీసుకుని తలపై కొట్టి గొంతు కోశాడు. దీంతో లావణ్య చనిపోవడంతో ఇద్దరు బిడ్డలను తీసుకుని మహేంద్ర సైదాపురం పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన భార్యను చంపేసినట్లు లొంగిపోయాడు. ఎస్ఐ క్రాంతికుమార్, సీఐ విజయకృష్ణ ఘటనా స్థలికి చేరుకుని హత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టారు. కేసును నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారి రోదన చూసి స్థానికులు చలించిపోయారు. -
స్నేహితుడితో భార్య సంబంధం.. మోసం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, విశాపట్నం: విశాఖలో ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, తన స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని తట్టులేక హరి ప్రకాష్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆతహత్యకు ముందు ఆరు పేజీల సూసైడ్ లేఖ రాశాడు. అలాగే ఆత్మహత్యకు గల కారణాలపై సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.కాగా హరి ప్రకాశ్‌కు భవనేశ్వరితో వి2019లో వివాహమైంది. వీరిద్దరికి ఇది రెండో వివాహమే. ఈ జంటకు నాలుగేళ్ల పాప కూడా ఉంది. అయితే భువనేశ్వరికి, హరి ప్రకాశ్‌కు గత మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. తన భార్యకు ఇతరులతో సంబంధం పెట్టుకుందన్న ఈ క్రమంలోనే తన స్నేహితుడు రాజేష్‌కు మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తున్నట్లు హరి ప్రకాశ్ ఆరోపించాడు. వారిద్దరికి ఓ పాప కూడా ఉన్నట్లు తెలిపారు. భార్య వేధింపులు, ఇతరులతో ఆమె సంబంధాల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో చెప్పాడు.కుమారుడి ఆత్మహత్యపై పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ద్వారకా జోన్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం హరి ప్రకాష్ మృతదేహన్ని పోలీసులు మార్చరీకి తరలించారు. హరి ప్రకాష్ భార్యభువనేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడు రాజేష్ పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
భర్త ఇంట్లో ఉండగానే ప్రియుడ్ని పిలిచి మరీ..
తాడిపత్రి రూరల్: వివాహేతర సంబంధం మంచిది కాదన్నందుకు ఏకంగా ప్రియుడితో కలసి భర్తను ఓ భార్య చితకబాదింది. పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన శ్రీరంగడు పుట్టుకతోనే మూగ. ఆయన భార్య రేవతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బండల పాలీస్ యూనిట్లో పనిచేస్తూ కుటుంబాన్ని శ్రీరంగడు పోషించుకుంటున్నాడు. అదే యూనిట్లో పనిచేస్తున్న చిన్నపొలమడకు చెందిన ధర్మ తరచూ శ్రీరంగడు కోసం ఇంటికి వెళుతూ రేవతితో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న శ్రీరంగడు పలుమార్లు తన భార్యను మందలించాడు. అయినా ఆమె వినలేదు. సోమవారం రాత్రి భార్యాభర్తలు మరోసారి ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో ధర్మకు రేవతి ఫోన్ చేసి రప్పించుకుంది. అనంతరం ఇద్దరూ కలసి శ్రీరంగడుపై విచక్షణారహితంగా దాడి చేసి చితకబాది అక్కడి నుంచి ఉడాయించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమారుడిని చుట్టుపక్కల వారి సాయంతో తల్లి రంగమ్మ ఆస్పత్రికి తీసుకెళ్లింది. రంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. -
ప్రియుడి కోసం భర్తను అతి దారుణంగా..
ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఖలీల్ తనకు భార్య ఉన్నప్పటికీ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికి ఇది వరకే పెళ్లి జరిగినా ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. పదేళ్లలోనే వారి కాపురం కుప్పకూలింది. భార్యపై అనుమానంతో కర్రలతో దాడి చేసి హత్య చేశాడు. ఆమె మరణించగా, భర్త కటకటాల పాలయ్యాడు. మృతురాలి పిల్లలతో పాటు మొదటి భార్య, ఆమె పిల్లలు రోడ్డున పడ్డారు.ఈ నెల 12న నార్నూర్ మండలం నాగలకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్ హత్యకు గురయ్యాడు. రెండు రోజుల్లో ఆయన పదోన్నతి పొందనుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని హత్యకు పన్నాగం పన్నారు. నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. ఈక్రమంలో భార్య జైలు పాలు కాగా, కుమారుడు అనాథగా మిగిలాడు. జిల్లా వ్యాప్తంగా ఈ హత్య కలకలం రేపింది.గతేడాది ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్ కాలనీకి చెందిన ఓ వివాహిత భుక్తాపూర్‌కు చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. విషయం తెలిసిన భర్త పలుసార్లు మందలించాడు. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత ఆ యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన భర్త గుడిహత్నూర్ మండలం సీతాగోంది సమీపంలోని గర్కంపేట వద్ద తన బంధువులతో కలిసి హతమార్చాడు. భార్యతో పాటు యువకుడిని సైతం కర్రతో బాది హత్య చేశారు.ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఆయన ప్రేమ వివాహం చేసుకొని సంతోషంగా ఉంటున్న సమయంలో వరుసకు బంధువు అయిన ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కుటుంబీకులకు తెలియకుండా జిల్లా కేంద్రంలోని ఓ ఆలయంలో ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తరఫున వారు కోపోద్రిక్తులై గుడిహత్నూర్ మండలంలోని డంపింగ్ యార్డు సమీపంలోని అటవీ ప్రాంతంలో గతేడాది హతమార్చారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆమెను కాదని మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే హత్యకు దారి తీసింది. భార్యతో పాటు ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు.జిల్లాలో గతేడాది జరిగిన హత్యలు: 18ఈఏడాది (ఇప్పటివరకు) జరిగిన హత్యలు:06ఆదిలాబాద్‌టౌన్: వివాహేతర సంబంధాలతో బంధాలు తెగిపోతున్నాయి. భార్యపై అనుమానంతో భర్త హత్యకు పాల్పడుతుండగా, మరికొంత మంది మహిళలు ఇతర వ్యక్తులతో సంబంధాలు ఏర్పర్చుకొని విలువైన జీవితాలను బలిగొంటున్నారు. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కాటికి పంపుతున్న ఘటనలు జిల్లాలో అనేకం చోటుచేసుకుంటున్నాయి. జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసిన దంపతులు ఈ సంబంధాల కారణంగా లోకానికే దూరమవుతున్నారు. కుటుంబంతో సంతోషంగా ఉంటూ సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టాల్సిన కొంతమంది భార్యభర్తలు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. తమ జీవిత భాగస్వామిని మోసం చేస్తూ వివాహేతర సంబంధాలకు ఆకర్షితులవుతున్నారు. ఇందులో పురుషులతో పాటు మహిళలు ఉంటున్నారు. వీరి తప్పిదానికి కుటుంబ పరువు వీధిపాలు కావడంతో పాటు పిల్లల భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ క్రమంలోనే కొన్ని బంధాలు విడిపోతుండగా, మరికొందరు తప్పు చేసిన వారిని అంతమొందిస్తున్నారు. దారుణ హత్యలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. వీరే కాకుండా ప్రేమలో పడిన జంటలు సైతం ఆఘాయిత్యాలకు పాల్పడుతుండం గమనార్హం.హత్యలకు ఒడిగడుతున్నారు..వివాహేతర సంబంధాలతో జిల్లాలో హత్యలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఆరు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఇటీవల చోటు చేసుకున్న రెండు ఘటనలు జిల్లాలో సంచలనం రేపాయి. బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నింపాయి. ఒకరు రెండో భార్యపై అనుమానంతో హత్య చేయగా.. ఓ ఉపాధ్యాయుడి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకొని భర్తనే కడతేర్చింది. ఇంకొంత మంది ప్రేమికులు, కొంతమంది వివాహేతర సంబంధాల కారణంగా వారి కుటుంబీకులు, బంధువులు హత్యలకు పాల్పడుతుండగా, దంపతుల్లో ఎవరో ఒకరు అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా చెడుదారులకు ఆకర్షితులై ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయి. తరచూ ఫోన్లో మాట్లాడడాన్ని గ్రహించడంతో భార్య భర్తల మధ్య గొడవలు చోటుచేసుకొని కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇదిలా ఉండగా మద్యం, గంజాయి మత్తులో సైతం కొంత మంది హత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంతో విలువైన జీవితాలను గాలిలో కలుపుతున్నారు. దంపతుల్లో ఒకరు తప్పు చేస్తే వారిని హతమార్చడానికి పన్నాగం పన్నుతుండగా, ప్రేయసి ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చేందుకు సైతం వెనుకాడటం లేదు.ఇష్టం లేకుంటే విడిపోవాలిదంపతుల్లో చాలా వరకు అనుమానాలతోనే హత్యలు జరుగుతున్నాయి. ఇష్టం లేనప్పుడు విడిపోవడం మంచిది. పోలీస్స్టేషన్లలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్‌కు వచ్చి కౌన్సెలింగ్ తీసుకోవాలి. అవసరమైతే ఫిర్యాదు చేయాలి. చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి. కోర్టును ఆశ్రయించాలి. అంతే తప్పా విలువైన ప్రాణాలను తీయడం సరికాదు. రెండు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకుంటాయి. పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయంతో జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.– ఎల్.జీవన్‌రెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్ -
జిమ్ ట్రైనర్‌తో ప్రేమ.. భర్త అడ్డుగా ఉన్నాడని.. మూడేళ్ల తర్వాత!
చండీగఢ్: ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చేందుకు సిద్దమైంది. ఒకటి కాదు రెండు ప్లాన్లు వేసి అతడిని వదిలించుకోవాలనుకుంది. మొదటి ప్రయత్నంలో అతడు ప్రాణాలతో బయటపడగా.. రెండో సారి పక్కా ప్లాన్ ప్రకారం హత్య జరిపించింది. చివరికి అనుమానాస్పద ప్రవర్తనే ఆమె నేరాన్ని పోలీసులకు పట్టించింది. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు మూడేళ్ల తర్వాత ఆ మహిళను అరెస్ట్ చేశారు. హర్యానాలోని పానిపట్‌లో ఈ సంఘటన వెలుగుచూసింది.వివరాలు.. కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన వినోద్ బరారాకు నిధితో వివాహమైంది. ఆ దంపతులకు ఒక కుమార్తె ఉంది. వీరు పానిపట్‌లో నివాసం ఉంటున్నారు. నిధికి కొన్నేళ్ల క్రితం సుమిత్ అనే జిమ్ ట్రెయినర్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇది ప్రేమగా మారింది. ఈ విషయం వినోద్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో వినోద్‌ను ఎలాగైనా అడ్డుతొలగించుకొని సుమిత్తో జీవించాలని నిధి నిర్ణయించుకొంది.పంజాబ్‌కు చెందిన దేవ్ సునార్ అనే లారీ డ్రైవర్‌కు రూ. 10 లక్షలు సుపారీ ఇచ్చి.. తన భర్తను వాహనంతో ఢీకొట్టి చంపాలని సూచించింది. 2021 అక్టోబర్ 5న వినోద్‌ను ఇంటి సమీపంలోనే దేవ్ లారీతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కానీ, ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితుడైన లారీ డ్రైవర్ దేవ్ సునర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును వెనక్కి తీసుకోవాలని వినోద్‌ను సునర్ బెదిరించాడు. కానీ అతడు నిరాకరించాడు. దీంతో భర్తను ఎలాగైన సరే అడ్డు తొలగించుకోవాలన్న మహిళ మరో ప్లాన్ వేసింది. అదే ఏడాది డిసెంబర్ 15న దేవ్.. నిధి ఇంటికి వెళ్లి మంచానపడి ఉన్న వినోద్‌ను పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చి చంపాడు. పోలీసులు దేవ్‌ను హంతకుడిగా గుర్తించి అరెస్టు చేశారు. కోర్టులో కేసు వెనక్కి తీసుకోనందుకే వినోద్‌ను చంపినట్లు పోలీసులకు చెప్పాడు.ఈ ఘటన తర్వాత దేవ్ కుటుంబ అవసరాలను నిధి, జిమ్ ట్రైనర్ సుమిత్‌లే చూసుకొంటున్నారు. వినోద్ హత్య తర్వాత నిధి సైతం విలాసవంతంగా జీవించింది. కుమార్తెను ఆస్ట్రేలియాలోని బంధువు వద్దకు పంపింది. ఆమె విలాసవంతమైన జీవనశైలి వినోద్ కుటుంబీకుల్లో అనుమానాలను పెంచింది. దీంతో అతడి సోదరుడు ప్రమోద్ మూడేళ్ల తర్వాత పానిపట్ ఎస్పీ అజీత్ సింగ్‌కు విషయం చెప్పాడు.తన సోదరుడి భార్యపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసుల ప్రత్యేక బృందం నిందితుడు దేవ్ కాల్ డేటాను వెలికి తీసింది. తరచూ జిమ్ ట్రెయినర్ సుమిత్తో మాట్లాడుతున్నట్లు దానిలో గుర్తించారు. దీంతో పోలీసులు అతడి కాల్ డేటాను వెలికి తీయగా నిధితో సంబంధం బయటపడింది. దీంతో సుమిత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. -
వివాహేతర సంబంధం: 22 నెలల చిన్నారిని కొరికి.. నేలకేసికొట్టి!
చివ్వెంల(సూర్యాపేట): వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని చిన్నారిని నేలకేసి కొట్టి హత్యచేసిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామానికి చెందిన కటకట లక్ష్మణ్‌తో అదే జిల్లా రంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన రమ్య అలియాస్ నవ్యశ్రీ వివాహం ఆరేళ్లక్రితం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు అరుణ్య (04), మహన్వి (22 నెలలు). కాగా ఏడు నెలలుగా రమ్యశ్రీ అదే గ్రామానికి చెందిన బొల్లెం అరవిందరెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 20 రోజుల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రియుడితో కలిసి సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామానికి వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. అరవిందరెడ్డి ఇటుకబట్టీల వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చిన్నారి మహన్వి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించి మంగళవారం రాత్రి అరవిందరెడ్డి ఆమెను కొరికి, కొట్టి హింసించి నేలకేసి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు రమ్య అత్త కటికట గంగమణి ఫిర్యాదు మేరకు సూర్యాపేట రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి ఆదేశాలతో ఎస్ఐ వెంకట్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా చిన్నారికి చెండు చెంపలు, భుజాలు, రెండు చేతులు, పిరుదులపై, తలకు తీవ్ర గాయాలై ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. -
అల్లుడు హైడ్రామా..!
రఘునాథపాలెం: మండలంలోని హరియాతండా సమీపంలో మంచుకొండ – పంగడి ప్రధాన రహదారి పక్కన చెట్టును ఢీకొన్న కారు ప్రమాదంలో తల్లీ, ఇద్దరు కుమార్తెలు మృతిచెందిన విషయం విదితమే. కానీ, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పథకం ప్రచారం జరిగిన హత్యా? లేక నిజంగానే ప్రమాదం జరిగిందా? అనే అంశంపై పలువురు పలు రకాల వాదనలు వినిపిస్తున్నారు. మంగళవారం రాత్రి కారు ప్రమాదంలో దుర్మరణం చెందిన తల్లీకూతుర్ల అంత్యక్రియలు బుధవారం మండలంలోని బావోజీతండాలో పోలీసుల సమక్షంలో నిర్వహించారు. ఆది నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న మృతురాలి తండ్రి, హరిసింగ్, తల్లి పద్మ, సోదరుడు, సోదరితో పాటు కుటంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వద్ద బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేశారు. మృతురాలి భర్త, ఫిజియోథెరపిస్ట్ అయిన బోడా ప్రవీణ్ కారణమని, ఆయన్ను తీసుకొచ్చిన తర్వాతనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాలని భీష్మించారు. మరో యువతితో వివాహేతర సంబంధం నెరుపుతున్న ప్రవీణ్‌ను భార్య కుమారి ప్రశి్నస్తున్న నేపథ్యంలోనే తల్లీ కూతుర్లను హతమార్చి యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తున్నాడని వందలాది మంది ఆస్పత్రికి చేరుకుని నిరసన తెలిపారు. ప్రవీణ్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రఘునాథపాలెం సీఐ శ్రీహరి, ఎస్ఐలు, పోలీసులు జోక్యం చేసుకొని పోస్టుమార్టం నివేదిక అనంతరం విచారణ చేపట్టి చర్యలు చేపడుతామని మృతుల కుంటుంబ సభ్యులకు నచ్చజెప్పి పోస్టుమార్టం పూర్తి చేయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రవీణ్ తరఫు బంధువులు సైతం అక్కడికి వచ్చేందుకు భయపడ్డారు. సాయంత్రం 4 గంటల తర్వాత మూడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, బావోజీతండాకు తరలించేందుకు వాహ నం ఎక్కించారు. కాగా, పోస్టుమార్టంలో ఏం తేలిందనే విషయం డాక్టర్లు చెప్పకుండానే ఎలా వెళ్లారని, ఈ విషయం తేలేవరకు మృతదేహాలను తీసుకెళ్లమంటూ మళ్లీ అందోళన చేశారు. మృతదేహాలను దించి శవాల గదిలోకి తరలించారు. మళ్లీ పోలీసులు కలగజేసుకుని, సర్దిచెప్పి మృతదేహాలను పోలీసు బందోబస్తు నడుమ బావోజీతండాకు తరలించి ఇద్దరు చిన్నారులను పూడ్చిపెట్టారు. కుమారి మృతదేహాన్ని దహనం చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు విలపించిన తీరు చూసి అక్కడివారంతా కన్నీటిపర్యంతమయ్యారు. ముఖ్యంగా చిన్నారుల మృతదేహాలను చూసిన గ్రామస్తులంతా గుండెలవిసేలా రోదించారు. ఏం జరిగి ఉంటుంది? కారు ప్రమాదంలో డాక్టర్ ప్రవీణ్ గాయాలతో బయటపడటం, భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందడంపై కుమారి తల్లితండ్రులు అనుమానిస్తున్నారు. కొన్నేళ్లుగా అల్లుడు తమ కుమార్తెను సరిగా చూసుకోవడం లేదని, వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. కారుకు ప్రమాదం జరిగినప్పుడు తల్లీకూతుర్లు వెనుక సీట్లో చనిపోయి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత సమీపంలోని హరియాతండావాసులు అక్కడికి చేరుకునే సరికి ప్రవీణ్ ముందు సీట్లో, కుమారి, ఇద్దరు చిన్నారులు వెనుక సీట్లు మృతి చెంది ఉన్నారని గుర్తించారు. కారు ముందు భాగం చెట్టును ఢీకొడితే వెనుక ఉన్న వాళ్లు ఎలా మృతిచెందారనే చర్చ సాగుతోంది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే అసలు విషయం తెలుస్తుందని, కారులో ఎవరు ఎక్కడ కూర్చున్నారో ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. కాగా, కారు ప్రమాదంలో గాయపడిన బోడా ప్రవీణ్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
దారుణం: ప్రియుడిపై మోజు.. భర్తను అంతమొందించిన భార్య!
సబ్బవరం: సాలాపువానిపాలెంలో ఓ యువకుడు శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ప్రియుడిపై మోజులో మరో ఇద్దరితో కలిసి కోడలే కడతేర్చిందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటన మండలంలోని గోటివాడ శివారు సాలాపువానిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ పిన్నింటి రమణ శనివారం సాయంత్రం వెల్లడించిన వివరాల ప్రకారం... సాలాపు శ్రీనివాసరావు (32) దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం దువ్వాడ సమీపంలోని మంగళపాలెంకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మికి అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతోపాటు పెద్దలు వద్ద పంచాయతీ నిర్వహించడం... అనంతరం కలిసి జీవించడం జరిగేది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో సాలాపు శ్రీనివాసరావు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఇంటికి వస్తుండగా... అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరి (22) కలిసి శ్రీనివాసరావును అడ్డుకుని మంచం కోడితో తలపై దాడి చేశారు. దీంతో పెద్దగా కేకలు వేయడంతో శ్రీనివాసరావు తండ్రి అప్పారావుతోపాటు గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని చూడగా... శ్రీనివాసరావు తీవ్ర గాయాలతో పడి వున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు సబ్బవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే మృతి చెందినట్ల వైద్యులు నిర్ధారించారు. కోడలు భాగ్యలక్ష్మితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి తమ కుమారుడు శ్రీనివాసరావును హత్య చేశారని మృతుని తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీనివాసరావు తలపై మంచం కోడితో దాడి చేసిన తర్వాత... సుమారు 150 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యకు పాల్పడిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరిని(22) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భార్య భాగ్యలక్ష్మిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు. -
హత్య చేసింది ‘తమ్ముడే’
సాక్షి, పుట్టపర్తి: ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నేతలు శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో హత్య జరిగినా.. రాజకీయ రంగు పూసి సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. టీడీపీ కార్యకర్తలే హత్య చేసినా.. బురద మాత్రం అధికారపార్టీపై వేసి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. చివరకు అసలు విషయం తెలియడంతో ప్రజల్లో అభాసుపాలు అవుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కుటాలపల్లిలో జరిగిన హత్య విషయంలోనూ టీడీపీ నేతల దుష్ప్రచారం బట్టబయలైంది. కుటాలపల్లిలో ఈ నెల 24వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగినట్లు అదే రోజున పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అదేమీ పట్టించుకోకుండా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శవ రాజకీయానికి తెర లేపారు. దానిని రాజకీయ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పల్లె రఘునాథరెడ్డితో పాటు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సైతం అసత్య ప్రచారం చేశారు. ఈ హత్య ఘటనపై శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి.. నిందితులను అరెస్టు చేశాయి. వివాహేతర సంబంధం కారణంగానే దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి హత్య జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయమూ లేదని ఎస్పీ మాధవరెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. అమరనాథ్‌రెడ్డి సమీప బంధువైన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి ఈ హత్య చేశారని వెల్లడించారు. అతనితో పాటు నిందితులుగా ఉన్న గుండ్రా వీరారెడ్డి, మల్లెల వినోద్‌కుమార్, రమావత్ తిప్పేబాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని తెలిపారు. నిందితుడు టీడీపీ కార్యకర్త దుద్దుకుంట అమరనాథ్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి కొన్నేళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. గతంలో కూడా కుటాలపల్లిలో చిన్న చిన్న ఘర్షణల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. ఇవన్నీ తెలిసినా కూడా పల్లె రఘునాథరెడ్డి అధికార పార్టీ వైపు కేసును తోసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి పొందాలని టీడీపీ పెద్దలు చేసిన కుట్రలను చూసి స్థానికులు మండిపడుతున్నారు. హత్యకు కారణాలివీ.. కుటాలపల్లికి చెందిన తిప్పేబాయితో కొన్నేళ్లుగా దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవలి కాలంలో అమరనాథ్‌రెడ్డితో ఆమె సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని శ్రీనివాసరెడ్డి ఆమెను ప్రశ్నించాడు. తనకు ఆర్థిక సాయం చేశాడు కాబట్టి అతన్ని వదలలేనని తేల్చి చెప్పింది. దీంతో అమరనాథ్‌రెడ్డిని చంపేయడానికి శ్రీనివాసరెడ్డి పథకం రచించాడు. తనకు సన్నిహితంగా ఉండే వీరారెడ్డితో పాటు చైన్ స్నాచింగ్ కేసుల్లో జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చిన మల్లెల వినోద్‌కుమార్ సాయం కోరాడు. గత ఆదివారం రాత్రి అమరనాథ్‌రెడ్డి పొలం వద్దకు వెళ్లగా.. మల్బరీ ఆకులు కోసే కత్తితో మెడ, ముఖం, తలపై నరికి చంపేశారు. మరుసటి రోజు ఉదయమే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు ప్రాథమికంగా తేలింది. -
భర్త వివాహేతర సంబంధం.. అది తెలుసుకున్న భార్య..
కోవూరు: భర్తను భార్య రోకలి బండతో కొట్టి చంపిన ఘటన కోవూరులోని బండారుమాన్యంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పి.అయ్యప్ప (42) అనే వ్యక్తి ఫ్లెక్సీలు కడుతుంటాడు. చిన్నచిన్న పనులు చేస్తుంటాడు. అతడికి దుర్గ అనే మహిళతో వివాహమైంది. వారికి పదేళ్ల వయసున్న బాలుడు, ఐదేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. అయ్యప్ప రాజేశ్వరి అనే మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. సోమవారం రాత్రి ఆమె, అతను కలిసి మద్యం తాగారు. తర్వాత అయ్యప్ప ఇంటికి రాగా భార్యాభర్తలిద్దరూ తాగారు. అయ్యప్పకు రాజేశ్వరితో వివాహేతర సంబంధం ఉందని దుర్గకు అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవ జరిగింది. రాజేశ్వరిని ఇంటికి తీసుకురావాలని అయ్యప్ప అరిచి చెప్పడంతో దుర్గ వెళ్లి ఆమెను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా వారి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. కాసేపటికి రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అయ్యప్ప భార్యపై రోకలి బండతో దాడి చేయబోయాడు. ఆమె దానిని లాక్కొని భర్తను కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అయ్యప్ప సోదరుడు కోవూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, స్థానిక సీఐ శ్రీనివాసరావు, ఎస్సై రంగనాథ్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డీఎస్పీ చుట్టుపక్కల వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
భార్యతో సన్నిహితంగా ఉన్నందుకే హత్య
రాయికల్: తన భార్యతో సన్నిహితంగా ఉన్నందుకే నాగెల్లి భూమేశ్.. సురేశ్ అనే యువకుడిని హత్య చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శుక్రవారం జరిగిన హత్య నేరానికి సంబంధించిన వివరాలను సోమవారం రాయికల్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. రాయికల్ మండలం తాట్లవాయికి చెందిన నాగెల్లి సురేశ్, నాగెల్లి భూమేశ్ వరుసకు అన్నదమ్ముల్లు. భూమేశ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో సురేశ్ భూమేశ్ భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా సురేశ్ పట్టించుకోలేదు. 2023 అక్టోబర్‌లో దుబాయ్ నుంచి ఇంటికి వసూ్తనే సురేశ్‌ను చంపాలనే ఉద్దేశంతో వెంట కత్తి తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా భార్యతో సన్నిహితంగా మెలగడాన్ని గమనించాడు. దీంతో సురేశ్‌పై పగ పెంచుకుని, ఎలాగైనా చంపాలని అనుకుని ఈనెల 7న ఉదయం పొలం వద్దకు నీరు పెట్టడం కోసం సురేశ్ వెళ్లడాన్ని గమనించాడు. ప్లాన్ ప్రకారం కత్తిని తీసుకుని తన ద్విచక్రవాహనంపై పొలం వద్దకు వెళ్లాడు. పొలానికి కొద్దిదూరంలో ఉన్న చెరువు కట్టపై ద్విచక్ర వాహనాన్ని పెట్టాడు. తన పొలానికి నీరు పెట్టేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్న సురేశ్‌ను ఆపి తాను పొలానికి వస్తున్నానని చెప్పాడు. పొలం గట్టుదగ్గర ద్విచక్ర వాహనాన్ని ఆపగానే భూమేశ్ వెంట తెచ్చుకుని కత్తితో సురేశ్ తల, మెడపై విచక్షణరహితంగా నరికాడు. కిందపడిన సురేశ్ ప్రాణభయంతో బావి వైపు పరుగెత్తుతుండగా మరోసారి నుదుటిపై, తలపై కత్తితో నరికాడు. దీంతో తీవ్రంగా గాయాలైన సురేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సురేశ్ మృతదేహాన్ని అదేబావిలోకి తోసేశాడు. కత్తిని కూడా అదే బావిలో పడేశాడు. రక్తం మరకలు శుభ్రం చేసుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికొచ్చి స్నానం చేసి అనంతరం వేములవాడ రాజన్న (శివరాత్రి జాతర) దర్శనానికి వెళ్లాడు. సురేశ్ ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే సురేశ్ బావిలో శవమై కనిపించాడు. హత్య విషయాన్ని తెలుసుకున్న రూరల్ సీఐ ఆరీఫ్ అలీఖాన్, ఎస్సై అజయ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సురేశ్ తల్లి నాగేల్లి లక్ష్మి భూమేశ్‌పై అనుమానం ఉందని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భూమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిచ్చిన సమాచారం మేరకు బావిలో పడేసిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే హత్య సమయంలో వినియోగించి రెండు మొబైల్స్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 48 గంటల్లో నిందితుడిని పట్టుకున్న సీఐ, రాయికల్ ఎస్సైలను డీఎస్పీ అభినందించారు. -
సురభి ఉసురు తీసిన భర్త వివాహేతర సంబంధం..
యశవంతపుర: వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హాసన జిల్లా చెన్నరాయపట్టణ తాలూకా నాగయ్యనకొప్పలు గ్రామంలో జరిగింది. అయితే ఆమెను భర్త హత్య చేసినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు అరోపిస్తున్నారు. హుణసూరుకు చెందిన సురభి(24)కి నాగయ్యనకొప్పలు గ్రామానికి చెందిన దర్శన్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఏడాది చిన్నారి ఉంది. దర్శన్ మరో మహిళతో ఆక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న విషయంపై దంపతుల మధ్య అప్పుడప్పడు గొడవ జరిగేది. ఈక్రమంలో లోబీపీతో సురభి చెందినట్లు ఆమె తల్లిదండ్రులకు దర్శన్ సమాచారం ఇచ్చాడు. గ్రామానికి చేరుకున్న తల్లిదండ్రులు వచ్చి కుమార్తె మృతదేహాన్ని పరిశీలించారు. గొంతువద్ద బలమైన గాయాలు ఉన్నాయని గుర్తించారు. దర్శన్ మరో మహిళతో ఆక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకే సురభికి ఉరివేసి హత్య చేశాడని ఆరోపిస్తూ శ్రావణబెళగోళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వివాహేతర సంబంధం ఓ పసికందు ప్రాణం తీసింది...
వివాహేతర సంబంధం ఓ పసికందు ప్రాణం తీసింది. పైశాచికంగా ఒకడు పిడిగుద్దులు కురిపిస్తే అల్లాడిన మూడేళ్ల చిన్నారి తనువు చాలించాడు. నవ మాసాలు మోసి పెంచిన తల్లి మానవత్వం మరచి ప్రియుడిపై మోజుతో తప్పుడు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొంది. నీటి తొట్టెలో పడి చనిపోయాడని ఫిర్యాదు చేయగా... విచారించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. మదనపల్లె : నీటి తొట్టెలో పడి బాలుడు మృతి చెందిన కేసును పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. తాలూకా సీఐ ఎన్.శేఖర్ వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం చెరుకువారిపల్లెకు చెందిన చిచ్చిలి శివశంకర్ రెడ్డి(33) స్థానిక బ్రాందీ షాపులో పనిచేస్తుండేవాడు. అదే గ్రామానికి చెందిన నాగరాజుతో స్నేహం ఏర్పడింది. తరచూ ఇంటికి వచ్చిన శివశంకర్‌రెడ్డి... కొద్ది రోజుల తర్వాత నాగరాజు భార్య మల్లకుంట్ల మయూరి(25)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. రెండేళ్ల తర్వాత తన ప్రియురాలు మయూరిని, ఆమె కుమారుడు హరన్సాకేత్(3)ను తీసుకుని గ్రామం వదలి ఉపాధి కోసం శివశంకర్‌రెడ్డి మదనపల్లెకు వచ్చారు. అక్కడే ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఇద్దరికీ ఉద్యోగాలు దొరకడంతో చిప్పిలిలో ఉంటూ పని చేసేవారు. వారు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు మూడేళ్ల చిన్నారిని ఇంట్లో ఉంచి సెల్‌ఫోన్ చేతికిచ్చి వెళ్లేవారు. సాయంత్రం వచ్చేటప్పటికి కుమారుడు మలమూత్రాలతో గలీజుగా ఉండడంతో ఇల్లును శుభ్రం చేసుకోవడం దినచర్యగా ఉండేది. పిడి గుద్దులు కురిపించి.... ఈ ఏడాది ఫిబ్రవరి 13న శివశంకర్ రెడ్డి ఇంటి వద్ద ఉండగా, మయూరి ఉద్యోగానికి వెళ్లింది. చిన్నారి సాకేత్‌ను ఇంట్లో ఉంచారు. ఇంటి నుంచి బయటికి వెళ్లి శివశంకర్‌రెడ్డి రాగానే సాకేత్ మలమూత్రాలతో గలీజు చేయడంతో, పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతూ కనికరం లేకుండా పైశాచయికంగా పిడిగుద్దులు గుద్దాడు. బాలుడు అపస్మారక స్థితికి చేరుకోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతిచెందాడని చెప్పడంతో... తనను కాపాడాలని ప్రియురాలు మయూరిని వేడుకున్నాడు. దీంతో ప్రియుడిపై ఉన్న మోజుతో, తల్లి ప్రేమను మరిచి బాలుడు ప్రమాదవశాత్తూ బకెట్లో పడి మృతిచెందినట్లు మయూరి తాలూకా పోలీసులో ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు అనుమానంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో బాలుడిని ఆవేశంలో చంపినట్లు శివశంకర్‌రెడ్డి నేరం అంగీకరించడంతో హత్య కేసుగా మార్పుచేసినేట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం, హెడ్‌కానిస్టేబుల్ ప్రభాకర్, కానిస్టేబుళ్లు రాఘవ, శశికళ, తదితరులు పాల్గొన్నారు. -
తాగుబోతు భార్యను హత్య చేసిన భర్త
కర్ణాటక: సిలికాన్ సిటీలో ఘోరం చోటుచేసుకుంది. భర్త, కొడుకు కలిసి మహిళను మట్టుబెట్టారు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ సంఘటన కేఆర్‌పుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు విచారణ చేపట్టగా భర్త, ఆమె కొడుకే సూత్రధారులని తెలిసి అందరూ నిర్ఘాంతపోయారు. కడ్డీపై వేలి ముద్రలు వివరాలు.. ఈ నెల 2న కేఆర్‌పుర పోలీసుస్టేషన్ పరిధిలో నేత్రావతి (40) అనే మహిళను ఎవరో ఇనుప రాడ్‌తో బాది హత్య చేశారు. మా అమ్మను చంపేశారంటూ ఆమె మైనర్ కొడుకు (17) కేఆర్ పుర పోలీసులకు ఫోన్ చేశాడు. ఇతడు డిప్లొమా విద్యార్థి అని తెలిసింది. పోలీసులు వచ్చి అనుమానంతో కుర్రవాన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పడి ఉన్న రాడ్‌పై ఉన్న రెండు వేలి ముద్రలను పరిశీలించారు. మరిన్ని ఆధారాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. దానిపై ఉన్న వేలిముద్రలు ఎవరివో కాదని, నేత్రావతి భర్త చంద్రప్ప, కొడుకువని నిర్ధారణ అయ్యింది. భర్త ఏమన్నాడంటే పోలీసుల విచారణలో చంద్రప్ప నోరు విప్పాడు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని, మద్యానికి కూడా అలవాటైందని, బయటకు వెళ్తే రెండు రోజులైనా ఇంటికి వచ్చేది కాదని చెప్పాడు. దీంతో తాను, కొడుకు అన్నం వండుకోలేక, హోటళ్లకు వెళ్లలేక ఉపవాసం ఉండేవాళ్లం. ప్రశ్నిస్తే తమతో పోట్లాడి రభస చేసేది, గత్యంతరం లేక ఆమెను కొడుకుతో కలిసి హత్య చేసినట్లు వివరించాడు. వీరికొక కూతురు ఉండగా, ఆమె జార్జియాలో వైద్య విద్య చదువుతోంది. తండ్రిని కాపాడాలని బాలుని తపన హత్య చేసిన తరువాత తానే ఇదంతా చేశానని, తండ్రికి ఏమీ తెలియదని బాలుడు తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించాడు. తల్లి తనను పట్టించుకోవడం లేదనే బాధతో చంపానని పోలీసులకు చెప్పాడు. జైలుకెళ్లిన తరువాతైనా మంచి చదువు దొరుకుతుందని, మైనర్ కావడం వల్ల శిక్ష తక్కువగా ఉంటుందని, తండ్రికి జైలు వాసం తప్పుతుందని అనుకున్నట్లు చెప్పాడు. చివరకు రాడ్ మీద వేలిముద్రలు నిజం చెప్పడంతో తండ్రీ కొడుకులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. -
సైకో గ్యాంగ్.. లవర్స్, వివాహేతర సంబంధ జంటే టార్గెట్
నల్లగొండ క్రైం: ప్రేమజంటలు సన్నిహితంగా ఉన్న సమయంలో ఓ సైకో గ్యాంగ్ సెల్ఫోన్లో రహస్యంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీడియోలు చూపించి వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నారు. అంతేకాకుండా మహిళలు, యువతులపై లైంగికదాడికి పాల్పడుతున్నారు. నల్లగొండ పట్టణంలోని నార్కట్‌పల్లి – అద్దంకి ప్రధాన రహదారి పానగల్ బైపాస్ సమీపంలోని నంద్యాల నరసింహారెడ్డి కాలనీ వద్ద ఈ గ్యాంగ్ వ్యవహారం బయటపడింది. వీరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నల్లగొండ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన ఆరుగురు యువకులు ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. నల్లగొండ పట్ట ణానికి చెందిన కొందరు ప్రేమ జంటలు, వివాహేతర సంబంధం ఉన్న వారు చెట్లపొదల మధ్య సన్ని హితంగా ఉండడాన్ని పసిగట్టి సెల్ఫోన్లో రహస్యంగా వీడియో తీసి ఆయా జంటలను బ్లాక్ మెయిల్ చేసి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకుంటున్నారు. ఎవరికై నా చెప్తే మీ ఇంట్లో వాళ్లకు ఈ వీడియోలు పంపుతామని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇస్తేనే వీడియోలను డిలీట్ చేస్తామని వారికి ఫోన్ కాల్స్ చేస్తున్నారు. దీంతో పరువు పోతుందని, వివాహేతర సంబంధం బయట పడుతుందనే ఉద్దేశంతో ఈ విషయాలను బాధితులు ఎవరికీ చెప్పడం లేదు. గత మూడేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెలుగులోకి ఇలా.. ఓ యువకుడు తన ప్రియురాలిని తీసుకొని నంధ్యాల నరసింహారెడ్డి కాలనీ సమీపంలోని నిర్మానుశ్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. వారు సన్నిహితంగా ఉన్న సమయంలో గ్యాంగ్‌లోని యువకులు యువతిని బలవంతంగా కొట్టి లైంగిక దాడికి పాల్పడి వీడియో తీశారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు లాక్కున్నారు. అదే సమయంలో వివాహేతర సంబంధం కలిగిన మరో జంట పై ఇదే తరహాలో దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి పోలీసుల దృష్టికి తీసుకురావడంతో ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. దోపిడీ చేసిన నగదు, బంగారు ఆభరణాలు రికవరీ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే.. అనేక మంది మహిళలు బాధితులుగా ఉన్నట్లు ఫోన్ కాల్‌డేటా ఆధారంగా తెలుస్తోంది. ఈ విషయంపై నల్లగొండ టూటౌన్ ఎస్సై నాగరాజును వివరణ కోరగా.. ఆ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసుల బృందం గాలిస్తున్నట్లు తెలిపారు. -
భర్తపై భార్య రాసిన క్రైం కథా చిత్రంలో మరో మహిళ బలి!
పెనమలూరు: భర్తపై భార్య రాసిన క్రైం కథా చిత్రంలో ఓ మహిళ బలైంది. ప్రియుడితో కలిసి భర్తను జైలుకు పంపుదామని స్కెచ్ వేసి.. అందుకు పరిచయం ఉన్న ఓ మహిళను సాయం కోరి.. చివరకు ఆ మహిళనే చంపేసి.. నేరం భర్తపై తోసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్ అయ్యింది. సినిమా కథకు ఏ మాత్రం తీసిపోని రీతిలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం సర్కిల్ డీఎస్పీ జయసూర్య మంగళవారం పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.. అసలు ఏమైంది? విజయవాడ కృష్ణలంక బాలాజీనగర్‌కు చెందిన గరిగల నాగమణి (30) కానూరు 100 అడుగుల రోడ్డులో ఈ నెల 14వ తేదీన శవమై కనిపించింది. సమాచారం తెలుసుకున్న సీఐ రామారావు ఘటనా స్థలం వద్దకు వెళ్లారు. మృతురాలు నాగమణి ఫొటోను సోషల్‌మీడియాలో పెట్టగా నాగమణి ఫొటోను గుర్తించిన ఆమె భర్త కిరణ్‌గోపాల్ పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారించేందుకు సీఐ రామారావుతో పాటు నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. సీన్ కట్ చేస్తే.. లవ్ స్టోరీ ఇలా.. ప్రసాదంపాడుకు చెందిన రిషేంద్ర, ఐతాబత్తుల మృధులాదేవి(40) 2007లో ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త ప్రైవేటు కంపెనీలో డెప్యూటీ మేనేజర్‌గా పని చేస్తుండగా, మృధులాదేవి బాడీకేర్ సెంటర్లో పని చేస్తుంది. మృధులాదేవి కృష్ణలంకు చెందిన పోలాసి సాయిప్రవీణ్ (30) అనే వ్యక్తి 2021లో కస్టమర్‌గా వచ్చి పరిచయం అవ్వటంతో అది కాస్త పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత మృధులాదేవీ భర్తను పిల్లలను విడిచిపెట్టి ప్రియుడు సాయిప్రవీణ్‌తో 2022లో వెళ్లిపోయింది. పోలీసుల సాయంతో తిరిగొచ్చినా.. మరలా వెళ్లిపోయింది. ఆ తర్వాత తానే మళ్లీ 2023 ఫిబ్రవరిలో భర్త రిషేంద్ర వద్దకు తిరిగి వచ్చి, తాను మారిపోయానని నమ్మించి, అతని పంచన చేరింది. అసలు కథ ఇక్కడే.. సాయిప్రవీణ్‌కు మృధులాదేవికి ఆమె భర్త రిషేంద్ర అడ్డుగా ఉండటంతో ఇద్దరూ కలిసి పథకం రచించారు. మృధులాదేవి తన భర్త రిషేంద్రను శాశ్వతంగా జైలుకు పంపితే అడ్డు తొలిగి పోతుందని ఆలోచన చేసింది. దీనిలో భాగంగా కృష్ణలంకలో గతంలో సాయిప్రవీణ్ ఇంట్లో అద్దెకు ఉన్న నాగమణిని పావుగా వాడారు. నాగమణికి ఆర్థికసాయం చేస్తానని సాయిప్రవీణ్ ఎరవేశాడు. నాగమణి భర్త 13వ తేదీ ఏలూరుకు వెళ్లిన తరువాత ఆమెను ఎనికేపాడుకు రప్పించాడు. ఆమెను ఆటోలో కానూరు 100 అడుగుల రోడ్డులోకి తీసుకు వచ్చాడు. నాగమణి ఫోన్లోనే ఆమె వాయిస్‌ను సాయిప్రవీణ్ రికార్డు చేశాడు. మృధులాదేవి భర్త రిషేంద్ర తనను శారీరకంగా వాడుకున్నాడని, బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడని, నాకు ఏదైనా జరిగితే రిషేంద్రే కారణమని నాగమణి వాయిస్ రికార్డు చేశాడు. ఆ తర్వాత నాగమణిపై దాడి చేసి చున్నీతో మెడకు బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి, ఆమె ఫోన్ మాత్రం తీసుకొని అక్కడి నుంచి కంకిపాడు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన తన మిత్రుడు ఎస్. మూర్తిబాబు(28) సహకారంతో వచ్చేశారు. రాత్రి 9.45 గంటలు దాటిన తరువాత నాగమణి వాయిస్ మెసేజ్‌తో పాటు కొన్ని టైప్ చేసిన మెసేజ్‌లు నాగమణి ఫోన్ నుంచే ఆమె భర్త కిరణ్‌గోపాల్‌కు అలాగే మృధులాదేవికి సాయిప్రవీణ్ పంపాడు. దీంతో ఈ హత్య మృధులాదేవి భర్త రిషేంద్ర చేశాడని పోలీసులు అతనిని అరెస్టు చేస్తారని, ఇక తమకు అడ్డుండదని సాయిప్రవీణ్, మృధులాదేవి భావించారు. ఎవిడెన్స్ సేకరణ.. ఈ హత్యకు సంబంధించిన పూర్తి టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ ఫుటేజీలు సేకరించామని డీఎస్పీ జయసూర్య చెప్పారు. నిందితులైన మృధులాదేవి, సాయిప్రవీణ్‌తో పాటు వీరికి సహకరించిన మూర్తిబాబును కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. విలేకరుల సమావేశంలో సీఐ టీవీవీ రామారావు, ఎస్ఐలు ఏసేబు, రమేష్, ఫిరోజ్, ఉషారాణి, సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ దొరికింది క్లూ.. నాగమణి భర్త కిరణ్‌గోపాల్‌కు వచ్చిన మెసేజ్‌లు పోలీసులు పరిశీలించారు. అస్సలు చదువుకోని నాగమణి ఇంగ్లిష్‌లో మెసేజ్ పంపడం, వాయిస్ మెసేజ్‌లో నాగరాణి చాలా కూల్‌గా మాట్లాడటంపై పోలీసులు అనుమానించి లోతుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో మృధులాదేవి భర్త రిషేంద్రను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. తన భార్య మృధులాదేవికి కూడా ఈ విధంగానే మెసేజ్‌లు వచ్చాయని రిషేంద్ర పోలీసుల దృష్టికి తీసుకువచ్చాడు. దీంతో అనుమానంతో పోలీసులు మృధులాదేవి గురించి విచారణ చేయగా సాయిప్రవీణ్‌తో ఉన్న వివాహేతర సంబంధం వెలుగు చూ సింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి తమ దైన శైలిలో విచారించగా హత్య కేసు వెలుగు చూసింది. వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తులకు సాయం చేసేందుకు వెళ్లిన నాగమణి హత్యకు గురైంది. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
త్రిపురారం: మండలంలోని బాబుసాయిపేటలో వివాహిత హత్య కేసులో ఆమె ప్రియుడే నిందితుడని పోలీసులు నిర్ధారించారు. వివాహేతర సంబంధం కారణంగానే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం త్రిపురారం పోలీస్ స్టేషన్లో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బాబుసాయిపేట గ్రామానికి చెందిన కొండమీది సైదులు కుమార్తె స్వాతికి ఏడేళ్ల క్రితం నిడమనూరు మండలంలోని ఇండ్లకోటయ్యగూడేనికి చెందిన ఉదయగిరి నారాయణతో వివాహం జరిగింది. స్వాతికి ఇండ్లకోటయ్యగూడేనికి చెందిన దోరెపల్లి శ్రీరాములుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం స్వాతి భర్తకు తెలియడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ క్రమంలో స్వాతి బాబుసాయిపేటలో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి అక్కడే ఉంటూ కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తుంది. శ్రీరాములు స్వాతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ తరచూ బాబుసాయిపేటకు వచ్చి వెళ్తుండేవాడు. అయితే స్వాతికి తెలియకుండా శ్రీరాములు గత సంవత్సరం మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయినప్పటికీ శ్రీరాములు తరచూ స్వాతితో ఫోన్లో మాట్లాడుతుండగా శ్రీరాములు భార్యకు అనుమానం వచ్చి అతడిని నిలదీసింది. తాను స్వాతికి డబ్బులు ఇవ్వాలని అందుకే తరచూ ఆమె ఫోన్ చేస్తుందని శ్రీరాములు తన భార్యకు చెప్పాడు. ఇదే విషయమై శ్రీరాములు అత్తమామలకు అనుమానం కలిగి గ్రామ పెద్దలను ఆశ్రయించారు. దీంతో గ్రామ పెద్దలకు తెలిస్తే తనకు భార్య, కుమారుడు దూరమవుతారని, అదేవిధంగా స్వాతి కూడా తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తుండడంతో ఎలాగైనా ఆమెను అంతమొందిచాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం శ్రీరాములు డిసెంబర్ 28వ తేదీ రాత్రి స్వాతికి ఫోన్ చేసి తన పల్సర్ బైక్‌పై బాబుసాయిపేటకు వచ్చాడు. అప్పటికే మేకల కొట్టంలో నిద్రిస్తున్న స్వాతితో మాట్లాడుతూ ఆమెను చంపాలని అనుకోగా ఏదో అలజడి రావడంతో స్వాతి తల్లిదండ్రులు ఎవరూ అని అడగడంతో స్వాతి తన భర్తే వచ్చాడని తల్లిదండ్రులకు చెప్పింది. తర్వాత శ్రీరాములు స్వాతిని పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి వెనుక నుంచి ఆమె గొంతును కుడి మోచేతితో గట్టిగా అదిమిపట్టి ఎడమ చేతితో ముక్క మూసి ఆమెకు ఊపిరి ఆడకుండా చేశాడు. దీంతో ఆమె మృతిచెందింది. అనంతరం స్వాతి మృతదేహాన్ని మేకల కొట్టంలోకి తీసుకొచ్చి ఎవరికి అనుమానం రాకుండా యథావిధిగా మంచంలో పడుకోబెట్టి ఆమె సెల్‌ఫోన్ తీసుకొని దుగ్గెపల్లి శివారులోని తన మామ సైదులు ఉంటున్న నంద్యాల సతీష్ తోట వద్దకు వెళ్లి అక్కడే ఉన్నాడు. డిసెంబర్ 29న త్రిపురారం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. విచారణలో భాగంగా మంగళవారం పోలీసులు శ్రీరాములు వద్దకు వెళ్లి ప్రశ్నించగా అతడు నేరాన్ని ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటగిరి తెలిపారు. ఈ హత్య కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన హాలియా సీఐ గాంధీనాయక్, త్రిపురారం ఎస్ఐ వీరశేఖర్, ఏఎస్ఐ రామయ్య, స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వివాహేతర సంబంధాలతోనే.. ఎక్కువగా వివాహితల హత్యల వెనుక వివాహేతర సంబంధాలే ప్రధాన కారణంగా ఉంటున్నాయని, వివాహేతర సంబంధాలతో కుటుంబాలను రోడ్డుపాలు చేసుకోవద్దని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి సూచించారు. మహిళలకు ఎలాంటి ఆపద ఉన్నా పోలీసులను ఆశ్రయించవచ్చన్నారు. -
ప్రకాశంలో సుపారీ హత్య: ప్రియుడి మోజులో భర్తను కిరాతకంగా..
ప్రకాశం: ప్రియుడి కోసం కట్టుకున్న వాడినే కడతేర్చేంది ఓ మహిళ. గుంటూరు నగరంపాలెం సీఐ కె.మల్లికార్జున కథనం మేరకు.. కురిచేడు మండలంలోని అలవలపాడు గ్రామానికి చెందిన చిన్నకత్తి రామచంద్రయ్య(40) గుంటూరులోని లక్ష్మీనగర్‌లో భార్యాబిడ్డలతో నివాసముంటూ కూలీనాలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రామచంద్రయ్య భార్య వెంకటరమణ గుంటూరుకు చెందిన చిన్నా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే తమ సంబంధానికి భర్త రామచంద్రయ్య అడ్డుగా ఉన్నాడని అంతమొందించాలని పథకం పన్నారు. ఇందుకు చిన్నా.. ఇద్దరు కిరాయి హంతకులతో రూ.లక్షకు సుపారీ కుదర్చుకున్నాడు. గత నెల 27వ తేదీ రాత్రి రామచంద్రయ్య పనులకు వెళ్లి నిద్రిస్తున్న సమయంలో వెంకటరమణ, చిన్నా, కిరాయి గూండాలు శ్యామ్, చిన్ను కలిసి కండువాను రామచంద్రయ్య గొంతుకు బిగించి హత్య చేశారు. రామచంద్రయ్య మెడలో ఉన్న బంగారు చైన్‌ను తాకట్టు పెట్టి సుపారీ కింద రూ.60 వేలు ఇచ్చారు. ఆ తరువాత మృతదేహాన్ని అలవలపాడు తీసుకొచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే సుపారీ ఒప్పందం ప్రకారం మిగిలిన నగదు ఇవ్వాలని శ్యామ్, చిన్నూ అడగడంతో వారి మధ్య వివాదం మొదలైంది. హత్య విషయం బయటకు పొక్కటంతో గుంటూరు నగరంపాలెం సీఐ కె. మల్లికార్జున సుమోటోగా కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించడంతో రామచంద్రయ్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. గుంటూరు నగరంపాలెం ఎస్సై బి.రవీంద్రనాయక్, గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోద్‌కుమార్, రుద్ర చారిటబుల్ ట్రస్టు సభ్యులు బుధవారం అలవలపాడు చేరుకున్నారు. తహసీల్దార్ ఎం.జ్వాలానరసింహం, వీఆర్వో కాశయ్య, గ్రామ పెద్దల సమక్షంలో రామచంద్రయ్య మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. -
ప్రియుడుతో వివాహేతర సంబంధం.. భర్తను కడతేర్చిన భార్య..
వీరులపాడు(నందిగామ): వివాహేతర సంబంధాన్ని చూసి, చేయిచేసుకున్న భర్తను ఓ మహిళ ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన వీరులపాడు గ్రామంలో జరిగింది. వీరులపాడు గ్రామానికి చెందిన యాదల శ్రీనివాసరావు (ఏలియా) (58) పాస్టర్‌గా జీవిస్తున్నాడు. ఎప్పటిలానే సోమ వారం ఉదయం వేరే గ్రామానికి వెళ్లి రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య వాణి వేరే వ్యక్తితో ఉండటాన్ని చూసి కోపంతో ఆమైపె చేయి చేసుకున్నాడు. వాణి తన ప్రియుడితో కలిసి కేబుల్ వైర్‌తో శ్రీనివాసరావు మెడకు ఉరిబిగించింది. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వాణి తన ప్రియుడిని అక్కడి నుంచి పంపించేసింది. మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో వాణి తన భర్త చనిపోయాడని, ఎలా మృతి చెందాడో తనకు తెలియదని, తామిద్దరం వేర్వేరు గదుల్లో నిద్రించామని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. స్థానికులకు వాణిపై అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఏసీపీ కె.జనార్దన్ నాయుడు, నందిగామ రూరల్ సీఐ నాగేంద్ర కుమార్, వీరులపాడు ఎస్ఐ మహాలక్ష్ముడు, కంచికచర్ల ఎస్ఐ సుబ్రహ్మణ్యం ఘటనాస్థలానికి చేరు కుని శ్రీనివాసరావు భౌతికకాయాన్ని పరిశీలించారు. వాణిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
లాడ్జిలో ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య
కర్నూలు(టౌన్)/నందికొట్కూరు: వివాహేతర సంబంధం ఇరువురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన శనివారం కర్నూలు నగరంలోని వుడ్‌ల్యాండ్స్ లాడ్జిలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న విజయకుమార్(35) వృత్తిరీత్యా అకౌంటెంట్. బీటెక్ పూర్తి చేసిన ఇతను పదేళ్ల క్రితం పట్టణానికి చెందిన ముస్లిం అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. మిడుతూరు మండలం నాగలూటికి చెందిన రుక్సానా(45)కు పట్టణానికి చెందిన కార్పెంటర్‌తో 2001లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఒకే కాలనీలో ఉంటున్న విజయకుమార్, రుక్సానా మధ్య ఏర్పడిన పరిచయం మూడేళ్లుగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరిగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా శుక్రవారం ప్రియుడు రుక్సానాకు ఫోన్ చేసి కర్నూలులోని వుడ్‌ల్యాండ్స్ లాడ్జిలో ఉన్నట్లు చెప్పాడు. దీంతో బాబుకి ఆరోగ్యం బాగోలేదని కర్నూలుకు వెళ్లి ఆస్పత్రిలో చూపిస్తానని భర్తకు చెప్పి రూ.5 వేలు తీసుకుని బయలుదేరింది. అయితే కుమారుడిని ప్రభుత్వాసుపత్రి వద్ద వదిలి ఆమె కనిపించకుండా పోయింది. రాత్రి అయినా రాకపోవడంతో కుమారుడు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఇదే సమయంలో ప్రియుడు విజయ్‌కుమార్ ఆమె కుమారుడికి ఫోన్ చేసి ఇద్దరం లాడ్జిలో ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. ఫోన్ పే ద్వారా రూ.300 అకౌంట్లో వేశాడు. అయితే ఏ లాడ్జి అనే సమాచారం లేకపోవడంతో కుమారుడు అన్ని చోట్ల వెతికాడు. చివరకు వుడ్‌ల్యాండ్స్ వద్ద పార్కు చేసిన ద్విచక్రవాహనాన్ని గుర్తు పట్టి లాడ్జిలో విచారించారు. విజయ్‌కుమార్ అక్కడే ఉన్నట్లు తెలుసుకుని రూమ్ వద్దకు వెళ్లి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తెరువ లేదు. రూమ్ సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శనివారం లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సైతం ఎంత ప్రయత్నించినా రూం తలుపులు తెరవకపోవడంతో బద్దలు కొట్టారు. ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు. ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు ఈ ఘటన వివాహేతర సంబంధం వల్లే జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాం. ఇరువురి మధ్య గొడవ జరిగి రుక్సానాను కత్తితో పొడిచి చంపాడు. ఆ తరువాత క్రిమి సంహారక మందు తాగి తనూ ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటనా స్థలంలో ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. హత్య, ఆత్మహత్యకు సంబంధించి కారణాలపై విచారణ చేస్తున్నాం. – మురళీధర్ రెడ్డి, మూడవ పట్టణ సీఐ -
చైనా విదేశాంగ మంత్రి అదృశ్యం.. హత్యా? ఆత్మహత్యా?
వాషింగ్టన్: ఒకప్పుడు అమెరికాలో చైనా రాయబారిగా పనిచేసి వెంటనే అత్యున్నత పదవి పొంది చైనా విదేశాంగ మంత్రిగా సేవలందించిన క్విన్ గాంగ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయంపై అంతర్జాతీయ మీడియా కొత్త అంశాలను మోసుకొచి్చంది. చివరిసారిగా జూన్ నెలలో కనిపించిన ఆయన ప్రస్తుతం జీవించి లేరని మీడియాలో వార్తలొచ్చాయి. ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని పత్రికల్లో, చైనా ప్రభుత్వమే హింసించి చంపిందని మరి కొన్నింటిలో భిన్న కథనాలు వెలువడ్డాయి. ఈ ఏడాది జూన్‌లో చివరిసారిగా కనిపించి అప్పటి నుంచి కనిపించకుండా పోయిన క్విన్‌గాంగ్ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జూలై నెలలో బీజింగ్‌లోని మిలటరీ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారని చైనా ప్రభుత్వంలోని ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు చెప్పినట్లు ‘పొలిటికో’ వార్తాసంస్థ ఒక కథనం వెలువరిచింది. క్విన్ అమెరికాలో చైనా రాయబారిగా కొనసాగిన కాలంలో ఆయన నెరిపిన ఒక వివాహేతర సంబంధమే ఈ అదృశ్యం ఘటనకు అసలు కారణమని గతంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ఈ విషయంలో చైనా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తునకు ఆయన సహకరించారట. ‘‘అమెరికా పౌరసత్వమున్న చైనా అధికారిక ఫీనిక్స్ టీవీ మహిళా రిపోర్టర్ ఫ్యూ గ్జియోíÙయాన్‌తో వివాహేతర సంబంధం కారణంగా చైనా జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని జిన్‌పింగ్ సర్కార్ బలంగా నమ్మింది. ఆ మహిళ సరోగసీ పద్ధతిలో ఒక బిడ్డకు జన్మనిచి్చంది. ఇప్పుడా తల్లీబిడ్డల ఆచూకీ సైతం గల్లంతైంది. క్విన్‌గాంగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని జిన్‌పింగ్ వెంటనే ఆయనను జూన్‌లో చైనా విదేశాంగ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మాజీ దౌత్యవేత్త వాంగ్ యీను పదవిలో కూర్చోబెట్టారు’’ అని ఆ కథనం పేర్కొంది. కేవలం ఆరునెలలు పదవిలో ఉన్న క్విన్‌గాంగ్ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. 2014–2018 కాలంలో దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌కు చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్‌గా పనిచేసి క్విన్ ఆయనకు అత్యంత ఆప్తుడయ్యాడు. అందుకే అత్యంత నమ్మకస్తులకు మాత్రమే దక్కే ‘అమెరికాలో చైనా రాయబారి’ పదవిని క్విన్‌కు జిన్‌పింగ్ కట్టబెట్టారు. వివాహేతర బంధమే క్విన్‌గాంగ్ మరణానికి కారణమన్న అంతర్జాతీయ మీడియా -
వివాహేతర సంబంధం మోజులో భార్యాపిల్లలను పట్టించుకోని భర్త
పుట్టపర్తి టౌన్: వివాహేతర సంబంధం మోజులో తమను రోడ్డు పాలు చేసిన భర్తపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ అదనపు ఎస్పీ విష్ణును పిల్లలతో కలసి ఓ వివాహిత వేడుకుంది. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయనకు వినతి పత్రం అందజేసి, మాట్లాడింది. వివరాలు.. నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన రమణమ్మకు అదే మండలం దొన్నికోటకు చెందిన అంజితో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో పరాయి సీ్త్ర తో అంజి వివాహేతర సంబంధం కొనసాగించడం గమనించిన రమణమ్మ నిలదీసింది. దీంతో భార్యను కొట్టి, ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆమె రోడ్డుపాలైంది. చివరకు భిక్షమెత్తుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. తన దుస్థితిని ఏఎస్పీ విష్ణుకు ఆమె వివరించి, తనకు న్యాయం చేయాలని విన్నవించింది. కాగా, పోలీసు స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 26 వినతులు అందాయి. పరిశీలించిన ఏఎస్పీ విష్ణు... ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఆమెకు ఆరు మంది సంతానం.. భర్తను కాదని మరొకరితో వివాహేతర సంబంధం
బొమ్మనహళ్లి: వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. భార్య మరొకరితో సన్నిహితంగా ఉండటంతో భర్త ఆమెను దుడ్డుకర్రతో బాది అంతమొందించాడు. ఈ ఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకా తమ్మనాయకనహళ్లిలో చోటు చేసుకుంది. ఆనేకల్ పోలీసుల కథనం మేరకు మహదేవయ్య ఆనేకల్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య లక్ష్మమ్మ(40) గారె పనికి వెళ్లేది. వీరికి ఆరు మంది సంతానం ఉన్నారు. లక్ష్మమ్మ తాను పనులు చేసే ప్రాంతంలో ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. ఇదే విషయంపై దంపతుల మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. లక్ష్మమ్మ వ్యవహారంపై స్థానికులు చర్చించుకుంటుండటంతో మహదేవ మనోవేదనకు గురయ్యాడు. శనివారం రాత్రి లక్ష్మమ్మ నిద్రిస్తున్న సమయంలో దుడ్డుకర్రతో తలపై బాదాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికకక్కడే మృతి చెందింది. ఆనేకల్లు పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి మహదేవయ్యను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఆమెకు ముగ్గురు... మొదటి భర్త ఆత్మహత్య!
చంద్రగిరి: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. భార్య వేరొకరితో సహజీవనం చేస్తూ, కాపురానికి రాలేదని మనస్తాపంతో ఒంటిపై సోమవారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వివరాలు.. విజయవాడలోని పాయకాపురానికి చెందిన మణికంఠ (32)కు పదేళ్ల కిత్రం వివాహమైంది. అయితే మనస్పర్థల కారణంగా భార్యతో విడిపోయాడు. అలాగే తిరుత్తణికి చెందిన దుర్గ అనే మహిళ తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఆమెతో మణికంఠకు పరిచయం ఏర్పడింది. ఇరువురూ ఇష్టపడి పెద్దల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల నుంచి మణికంఠ తరచూ దుర్గను వేధించేవాడు. దీంతో ఆమె భర్తను వదలి తిరుపతికి వచ్చేసింది. ఇక్కడ సోను అనే వ్యక్తి పరిచయం కావడంతో అతడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ భాకరాపేటలోని ఓ తోటలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లల కోసం అప్పుడప్పుడూ మణికంఠకు ఫోన్ చేస్తుండేది. అలా ఫోన్ చేసే సమయంలో తాను భాకరాపేటలో ఉంటున్నట్లు వెల్లడించింది. వెంటనే మణికంఠ భార్య కోసం వచ్చేశాడు. చంద్రగిరి పోలీసులను ఆశ్రయించాడు. అయితే భర్తతో వెళ్లడం ఇష్టం లేదని దుర్గ తేల్చి చెప్పడంతో శ్రీనివాసులు అనే కానిస్టేబుల్ ఇందులో జోక్యం చేసుకున్నాడు. ఆమె రానంటున్నప్పుడు ఎందుకు ఇబ్బంది పెడతావని మణికంఠను హెచ్చరించాడు. దీంతో మనస్తాపం చెందిన మణికంఠ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు వెంటనే అతడిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. కానిస్టేబుల్‌కు చుట్టుకుంటున్న కేసు! మణికంఠ ఆత్మహత్య కేసు కానిస్టేబుల్ శ్రీనివాసులు మెడకు చుట్టుకుంటోంది. దుర్గ, సోను పని కోసం ఆశ్రయిస్తే వారు భార్యాభర్తలనుకుని కూలి పని ఇప్పించానని శ్రీనివాసులు వెల్లడిస్తున్నాడు. మణికంఠతో ఆమెకు వివాహమైన విషయం తెలియగానే వారిని కలిపేందుకు యత్నించానని, అయితే దుర్గ ససేమిరా అనడంతో మణికంఠకు ఫోన్ చేసి విషయం తెలిపినట్లు వివరిస్తున్నాడు. ఇదే తనకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలో మృతుడు మణికంఠపై పలు చోరీ కేసులు నమోదైనట్లు పోలీసు విచారణ తేలింది. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాళెం పోలీసు స్టేషన్లలో చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. -
భర్తను వదిలేసి ప్రియుడితో కాపురం.. తమతో కలిసి ఉండాలని షరతు
సాక్షి, ఖమ్మం: కట్టుకున్న భార్య ఇంకొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని వేరు కాపురం పెట్టడమేకాక.. భర్తనూ తమతోపాటు కలిసి ఉండాలని షరతు విధించింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన గుండాల వంశీ (29)కి ఐదేళ్ల క్రితం మండలంలోని గోకినేపల్లికి చెందిన యువతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు జన్మించాక, సదరు మహిళ ఇంకో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని వేరుగా ఉంటోంది. పలుమార్లు హెచ్చరించినా ప్రియుడిని విడిచిపెట్టలేనని చెప్పిన ఆమె, భర్తనూ తమతో కలిసి ఉండాలని సూచించింది. దీంతో మనస్తాపానికి గురైన వంశీ, శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియోను వాట్సాప్‌లో పంపించడంతో విషయం ఆదివారం బయటపడింది. మృతుడి తండ్రి గుండాల శివయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ముదిగొండ ఎస్ఐ నరేశ్ తెలిపారు. చదవండి: కాటేసిన కరెంటు తీగ -
వివాహేతర సంబంధం..‘నిత్యా, నా భర్తను వదిలేయ్’
తిరువళ్లూరు: భర్తతో వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని కోరిన పాపానికి మహిళపై దాడి చేసి ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసిన వ్యవహరంలో మహిళ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ ప్రాంతానికి చెందిన సెంథిల్‌రాజ్(38). ఇతనికి కీళానూర్ గ్రామానికి చెందిన మదన్ భార్య నిత్య(34)తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం సెంథిల్‌రాజ్ భార్య తామరసెల్వికి తెలియడంతో పలుమార్లు భర్తను నిలదీసింది. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో నేరుగా నిత్యకు ఫోన్ చేసి తన భర్తతో వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని సూచించింది. అయితే నిత్య ఇందుకు ససేమిరా అనడంతో పాటు సెంథిల్‌రాజ్‌తో సన్నిహితంగా వున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్టు వైరల్‌గా మారిన నేపథ్యంలో తమ కుటుంబ పరువు పోతుందని భావించిన తామరసెల్వి మరోసారి నిత్యకు ఫోన్ చేసి ఘర్షణకు దిగింది. ఆగ్రహించిన నిత్య తన బంధువులైన వినోద్(22), గణేష్(24)తో వచ్చి తామరసెల్విపై దాడి చేసి ఆమె ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసింది. దాడిలో గాయపడిన తామరసెల్వి మనవాలనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
భార్యకు ఎఫైర్.. అతడిని చంపాకే ఇంట్లో అడుగుపెడతానని శపథం
కడప అర్బన్ : కడప నగరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం సముదాయంలోని ఓ గదిలో ఆదివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎల్ఐసీ వారి ఈడీఎంఎస్ డిజిటలైజేషన్ విభాగం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి.. తన వద్ద పార్ట్ టైంగా పని చేస్తున్న వ్యక్తిని హత్య చేశాడు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు, కుటుంబ సభ్యుల ప్రాథమిక సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి. కడప నగరంలోని నిరంజన్‌నగర్‌లో చిట్వేలి భవానీశంకర్(30) తన భార్య బాబాబీ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి జీవనం సాగించే వాడు. భవానీశంకర్ 14వ డివిజనల్లో వలంటీర్‌గా, అతని భార్య 13వ డివిజన్లో వలంటీర్‌గా పని చేస్తున్నారు. మరోవైపు భవానీశంకర్ ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎల్ఐసీలోని ఓ గదిలో ఎల్ఐసీ వారి ఈడిఎంఎస్ డిజిటలైజేషన్ విభాగం టీం లీడర్‌గా వున్న గుజ్జలి మల్లికార్జున దగ్గర పార్ట్‌టైం జాబ్ చేసేవాడు. వారిద్దరూ స్నేహితులు. ఈ విభాగంలో గతంలో భవానీశంకర్ భార్య బాబాబీ కూడా పని చేసేది. ప్రస్తుతం మల్లికార్జున దగ్గర భవానీశంకర్‌తోపాటు మల్లికార్జున భార్య శైలజ, మల్లికార్జున స్నేహితుడు, ఆటోడ్రైవర్ రంజిత్‌కుమార్ పని చేస్తున్నారు. మల్లికార్జునకు, కలసపాడుకు చెందిన తన అక్క కుమార్తె శైలజకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె సంతానంగా ఉంది. వివాహేతర సంబంధమే ప్రధాన కారణం భవానీశంకర్‌ను అతని స్నేహితుడు మల్లికార్జున, మరో వ్యక్తి వల్లూరు మండలం పాపాఘ్నినగర్కు చెందిన రంజిత్‌కుమార్ అనే ఆటోడ్రైవర్‌తో కలిసి దారుణంగా హత్య చేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ సంఘటనకు కేవలం వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. భవానీశంకర్, మల్లికార్జున భార్య శైలజతో వివాహేతర సంబంధం కలిగి వున్నాడని తెలుసుకున్నాడు. ఈనెల 11వ తేదీ రాత్రి నుంచి తన భార్య శైలజతో గొడవపడ్డాడు. ఈ నెల 12 తేదీన ఉదయం 7:30 గంటల సమయంలో తన భార్య శైలజతో భవానీశంకర్‌ను చంపిన తరువాతే ఇంటిలో అడుగుపెడతానని శపథం చేసి వెళ్లాడు. హత్య చేసేందుకు పథకం రచించాడు. తనతోపాటు వున్న రంజిత్కుమార్తో కలిసి ఆటోలో చింతకొమ్మదిన్నె మండలానికి వెళ్లాడు. అక్కడి నుంచి వైవీ స్ట్రీట్‌కు వచ్చి కత్తి, కొడవలిని తీసుకున్నాడు. తాను పని చేస్తున్న ఎల్ఐసీ ఆఫీసుకు వచ్చాడు. భవానీశంకర్‌కు ఫోన్ చేసి అత్యవసరంగా ఆఫీసుకు రావాలని పిలిచాడు. అతను గదిలోకి రాగానే గడియపెట్టి కత్తి, కొడవలితో దారుణంగా పొడిచాడు. అతను తేరుకునేలోపే మెడ, ఛాతీ, వీపు భాగాలపై కర్కశంగా నరికి చంపాడు. రక్తపు మడుగులో పడివుండగా.. రంజిత్కుమార్తోపాటు బయటకు వచ్చి పరారయ్యాడు. ఈ సంఘటన ఉదయం 9 గంటల నుంచి 10 గంటల సమయం మధ్యలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న హతుని భార్య బాబాబీ, తన బంధువులతో పాటు మృతదేహం వద్దకు చేరుకుని బోరున విలపించారు. సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్, సీఐ ఎన్.వి నాగరాజు, ఎస్ఐలు మధుసూదన్‌రెడ్డి, రంగస్వామి, సిద్దయ్యలు తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అదే రోజు సాయంత్రం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితులు పోలీసుల అదుపులో వున్నట్లు సమాచారం. -
వివాహేతర సంబంధం.. సీఐపై కానిస్టేబుల్ దాడి!
సాక్షి, మహబూబ్ నగర్: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్, సీఐపై దాడికి పాల్పడ్డాడు. మర్మాంగాలు కొసేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి అతని భార్య, తోటి కానిస్టేబుళ్లు సైతం సాయం చేయడం గమనార్హం. మహబూబ్ నగర్ జిల్లా సీసీఎస్(సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్) సీఐ ఇఫ్తేకార్ హమ్మద్‌పై గురువారం ఉదయం హత్యాయత్నం జరిగింది. జిల్లా కేంద్రంలో పని చేసే కానిస్టేబుల్ జగదీష్, సీఐకి దాడికి పాల్పడ్డాడు. కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన సీఐని స్థానికులు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. సీఐ పరిస్ధితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. తన భార్యతో సీఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణతోనే జగదీష్ ఈ దాడికి తెగబడినట్లు సమాచారం. ఘటనాస్థలానికి డీఐజీ చౌహన్, ఎస్పీ హర్షవర్ధన్ చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. సాయంత్రంకల్లా పూర్తి వివరాలు తెలియజేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
ఇద్దరితో వివాహేతర సంబంధం భర్తను చంపిన భార్య
అన్నమయ్య: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ఇద్దరు ప్రియుళ్లతో కలిసి పక్కా పథకంతో భర్తను, భార్య అంతమొందించింది. మంగళవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ మహబూబ్‌బాషాతో కలిసి డీఎస్పీ కేశప్ప మీడియాకు హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కలకడ మండలం సింగనొడ్డిపల్లెకు చెందిన దాదినేని వెంకటశివ(45), రమణమ్మ(40) భార్యాభర్తలు. వీరి కుమార్తెకు వివాహం చేసిన తర్వాత దంపతులిద్దరూ ఏడాది క్రితం మదనపల్లెకు వచ్చి నీరుగట్టువారిపల్లెలో అద్దె ఇంట్లో ఉంటూ టమాటా మార్కెట్‌యార్డులో పనిచేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భార్య రమణమ్మ టమాటా మార్కెట్లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న బసినికొండకు చెందిన షేక్ బషీర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడితో పాటుగా తమ ఇంటిపక్కన ఉన్న గంగాధర్ అలియాస్ గగన్(21)తోనూ వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఇంటి ముందు చెత్తవేస్తూ, పరిసరాలు అపరిశుభ్రంగా చేస్తున్నారని గగన్ అక్క ముంతల బిందుప్రియ(25) మృతుడు వెంకటశివతో కొంతకాలం క్రితం గొడవ పెట్టుకుంది. అప్పుడు వెంకటశివ పరుషంగా మాట్లాడటంతో అతడిపై వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రమణమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్న డ్రైవర్ షేక్‌బషీర్ ఇంటికి వచ్చివెళుతూ, వెంకటశివతో పక్కింటివారికున్న తగాదాను తెలుసుకున్నాడు. రమణమ్మతో తన సంబంధం సజావుగా సాగాలంటే వెంకటశివను అంతమొందించాలని భావించి పక్కింటి వారైన గగన్, బిందుప్రియతో కలిసి పథకం రచించాడు. వెంకటశివను చంపితే రూ.25,000 డబ్బులు ఇస్తానని వారికి ఆశ చూపాడు. దీంతో వారు వారం ముందే వెంకటశివను చంపేందుకు నిర్ణయించుకుని మద్యం తాగించారు. అయితే అనుకున్నట్లు జరగకపోవడంతో పథకం వాయిదావేశారు. ఈ క్రమంలో గత నెల 29న అతిగా మద్యం సేవించిన వెంకటశివ మత్తులో తూలుతూ ఇంటి ముందర పడిపోవడంతో తలకు గాయమైంది. భర్త తలకు గాయమై, స్పృహలో లేకపోవడాన్ని గమనించిన భార్య రమణమ్మ అప్పటికప్పుడు గగన్, బిందుప్రియలకు హత్య చేసేందుకు ఇదే సరైన సమయంగా చెప్పి రావాలని కోరింది. సింగనొడ్డుపల్లెలోని వెంకటశివ తల్లికి ఫోన్‌చేసి భర్త తాగి ఇంటి ముందు పడిపోవడంతో తలకు గాయమైనట్లు చెప్పింది. ఆమె మీ ఖర్మ. మీ బాధలు మీరే పడండని చెప్పడంతో రమణమ్మ రోకలిబడితో వెంకటశివకు తలపై గాయమైన చోట కొట్టగా, గగన్ ఉరితాడు తీసుకుని వెంకటశివ గొంతు కింద బలంగా పట్టుకున్నాడు. బిందుప్రియ నోరుమూసిపట్టుకుంది. రమణమ్మ తన భర్త కాళ్లు పట్టుకోవడంతో వెంకటశివ ఊపిరాడక చనిపోయాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా రమణమ్మ తమకు బంధువైన ఆటో డ్రైవర్ రవిని పిలిచి, మరణించిన తన భర్తను సింగనొడ్డుపల్లెకు తీసుకువెళ్లాల్సిందిగా కోరింది. అక్కడకు వెళ్లాక వెంకటశివ అన్న తన తమ్ముడు తాగి కిందపడి తలకు గాయమైతే, మెడపై తాడుతో ఉరివేసిన చారలు ఎందుకు ఉన్నాయని అనుమానంతో ప్రశ్నించాడు. రమణమ్మ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో కలకడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మదనపల్లె వన్‌టౌన్ పోలీసులకు తెలపడంతో రమణమ్మ, గగన్‌లను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు కథ బయటపడిందన్నారు. దీంతో హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, ప్రధాన సూత్రధారి అయిన లారీ డ్రైవర్ షేక్‌బషీర్ లోడు వేసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో, త్వరలో అతడిని అరెస్ట్ చేస్తామన్నారు. -
ఆమెకు 35.. అతనికి25: ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తను..
అన్నమయ్య: ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తను భార్య అంతమొందించిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి మదనపల్లె పట్టణంలో జరిగింది. కాగా అతిగా మద్యం తాగిన భర్త ఇంటి ముందు పడి చనిపోయాడని నమ్మించే యత్నం చేసింది. పాచిక పారకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చి ప్రియుడితో సహా భార్య పోలీసులకు చిక్కింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కలకడ మండలం ఎర్రకోటపల్లె పంచాయతీ సింగనొడ్డుపల్లెకు చెందిన రఘునాథ్, నారాయణమ్మ దంపతుల రెండో కుమారుడు డి.వెంకటశివ(42) రెండేళ్ల నుంచి తన భార్య రమణమ్మ(35)తో కలిసి మదనపల్లె రామిరెడ్డిలేఅవుట్ వినాయకుని గుడి వీధిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె కాగా ఆమెకు వివాహం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ స్థానిక టమాట మార్కెట్‌యార్డులో దినసరి కూలీలుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో రమణమ్మ స్థానికంగా ఉంటున్న మరో యువకుడు గగన్(26)తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్లిన వెంకటశివ భార్య రమణమ్మతో గొడవపడ్డాడు. దీంతో ఆమె ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని, ఇంట్లోని రోకలిబండతో తలపై మోదింది. దీంతో వెంకటశివ అపస్మారకస్థితిలోకి వెళ్లగా.. ప్రియుడు గగన్తో కలిసి వైర్ సాయంతో గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఏమీ తెలియనట్లుగా... భర్త తరఫు బంధువులకు ఫోన్ చేసి అతిగా మద్యం తాగి ఇంటి వద్దకు వచ్చి కిందపడి చనిపోయాడని సమాచారం అందించింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువస్తున్నట్లుగా తెలిపింది. రాత్రికి రాత్రి స్థానికుడైన ఆటోడ్రైవర్ రవిని పిలిచి చనిపోయిన విషయం దాచిపెట్టి, భర్త తాగిపడిపోయాడని, ఇంటికి తీసుకెళ్లేందుకు సాయం చేయాల్సిందిగా కోరింది. సింగనొడ్డుపల్లెకు మృతదేహాన్ని తీసుకెళ్లింది. అక్కడ వెంకటశివ మృతదేహాన్ని పరిశీలించిన అతడి కుటుంబ సభ్యులు తలపై, మెడపై గాయాలను గమనించి, భార్య రమణమ్మను నిలదీశారు. దీంతో ఆమె అసలు విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు కలకడ పోలీసులకు సమాచారం అందించారు. కలకడ పోలీసులు హత్య సమాచారాన్ని మదనపల్లె వన్‌టౌన్ పోలీసులకు తెలపడంతో వన్‌టౌన్ సీఐ మహబూబ్‌బాషా మృతుడి స్వగ్రామం సింగనొడ్డుపల్లెకు వెళ్లి మృతదేహాన్ని, శరీరంపై గాయాలను పరిశీలించి, హత్య జరిగినట్లుగా నిర్ధారించుకున్నారు. శవ పంచనామా పూర్తిచేసి, మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనకు కారకులైన నిందితులు రమణమ్మ, గగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి అన్న వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహబూబ్‌బాషా తెలిపారు. -
భర్త బెంగళూరులో మరొక వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం..
తమిళనాడు: వివాహేతర సంబంధం రెండు ప్రాణాలను బలిగొంది. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి ప్రాంతానికి చెందిన చంద్రశేఖరన్(35) కూలి పనులు చేసూకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. పనుల కోసం ఆరు నెలల క్రితం బెంగళూరుకు వెళ్లాడు. బెంగళూరులో ఆవలాంకుప్పం గ్రామానికి చెందిన దేవరాజ్ భార్య పూజ(26)తో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులకే వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం చంద్రశేఖరన్ పూజను వానియంబాడికి తీసుకొచ్చాడు. భార్యభర్తలమని చెప్పి అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న పూజ బంధువులు సోమవారం ఉదయం వానియంబాడికి వచ్చారు. పూజను కారులో బెంగళూరు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఇరువార్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన చంద్రశేఖరన్ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకాడు. గమనించిన పూజ మరో బావిలో దూకింది. ఇద్దరూ నీట మునిగి మృతి చెందారు. బంధువులు వానియంబాడి పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు విచారణ చేస్తున్నారు. వివాహేతర సంబంధాలు చివరకు విషాదాంతంతోనే ముగుస్తుందని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. -
కోమాలో భర్త, భార్య దారుణ హత్య.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చంపాపేట్‌లో వివాహిత స్వప్న హత్య కేసు తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, ఈ కేసులో పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. దర్యాప్తులో భాగంగా స్వప్న హత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. తెర మీదకు ప్రియుడు సతీష్ పేరు రావడంలో కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి వివరాల ప్రకారం.. మృతురాలు స్వప్న గతంలో సతీష్ అనే యువకుడిని ప్రేమించింది. కాగా, స్వప్నకు ప్రేమ్ అనే యువకుడితో వివాహం జరిగింది. అయితే స్వప్న వివాహం జరిగిన తరువాత కూడా మాజీ ప్రియుడు సతీష్‌తో కాంటాక్ట్‌లోనే ఉన్నది. సతీష్ చంపాపేట్‌లోని స్వప్న ఇంటికి తరుచూ వస్తూ పోతూ ఉండేవాడు. ఈ విషయం ప్రేమ్‌కు తెలియడంతో సతీష్‌తో ఇటీవల గొడవలు జరిగాయి. అయితే, నిన్న(శనివారం) ఉదయం 11:30 గంటలకు చంపాపేట్‌లోని స్వప్న ఇంటికి సతీష్ తన స్నేహితులతో కలిసి వచ్చాడు. ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్న సతీష్.. స్వప్నను దారుణంగా హత్య చేశాడు. అనంతరం, స్వప్న భర్త ప్రేమ్‌ను రెండవ అంతస్తు నుండి కిందకు నెట్టేసాడు. ఈ క్రమంలో ప్రేమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రేమ్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమ్ కుమార్ వాంగ్మూలాన్ని తీసుకుంటే కేసును ఛేదించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా అతను స్పృహలోకి ఎప్పుడు వస్తాడో తెలియరాలేదు. ఈ క్రమంలో స్వప్న తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం... భార్యా భర్తలు మృతి -
పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. యువతి హత్య
దేశ రాజధానిలో 24 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కోపంతో అతడి తమ్ముడు, మరో వ్యక్తి కలిసి యువతిని తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘోర ఘటన ఢిల్లీలోని జైత్పూర్లో శుక్రవారం వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన క్రిష్ణన్‌కు(37)కు పెళ్లై నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే తన సహోద్యోగి అయిన పూజా యాదవ్(24)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి సంబంధానికి క్రిష్ణన్ తమ్ముడు క్రిష్ణన్ తమ్ముడు రాకీ సంబంధానికి అభ్యంతరం చెప్పడంతో ఆమె ఉద్యోగం మానేసింది. అయినా పూజాపై రాకీ పగబట్టాడు. ఎలాగైనా యువతిని చంపాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా.. రాత్రి తొమ్మిది గంటల సమయంలో మరో వ్యక్తితో కలిసి రాకీ.. ముఖానికి మాస్కులు వేసుకొని పూజాను ఇంట్లోకి చొరబడ్డారు. యువతిని బలవంతంగా బంధించి ఆమెపై అయిదు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల శబ్ధం వినపడటంతో స్థానికులు పరుగెత్తుకు వచ్చి దుండగులను వెంబడించారు. వారిని చూసి ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న యువతిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని పూజా లవర్ క్రిషన్ సోదరుడు రాకీగా గుర్తించారు. చదవండి: ఏం కష్టం వచ్చిందో.. ముగ్గురు చిన్నారులు సహా కుటుంబం ఆత్మహత్య -
భర్తతో పాటు ప్రియుని గుడికి పిలిచిన భార్య..
ప్రొద్దుటూరు క్రైం : వివాహేతర సంబంధం భర్త ప్రాణాలను తీసింది. రాజుపాళెం మండలం అరకటవేముల గ్రామానికి చెందిన శివశంకర్‌రెడ్డి(33)కి కడపకు చెందిన ప్రేమలలితతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె సచివాలయంలో జీఎంఎస్కే ఉద్యోగం రావడంతో భార్యాభర్తలు అక్కడే నివాసం ఉంటున్నారు. ప్రేమలలిత ఏడాది నుంచి అదే ప్రాంతానికి చెందిన పబ్బతి శ్రీను అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు మందలించినా ఆమెలో మార్పు రాలేదు. ఈ క్రమంలో దసరా సందర్భంగా ఈనెల 23న రాత్రి దంపతులిద్దరూ శివాలయం వద్దకు వెళ్లారు. భార్య పక్క న పబ్బతి శ్రీను ఉండటాన్ని చూసిన శివశంకర్‌రెడ్డి అతన్ని వెంబడించాడు. అతన్ని పట్టుకొని సెల్‌ఫోన్ లాక్కున్నాడు. తర్వాత భార్య ప్రేమలలిత, పబ్బతి శ్రీను, తీట్ల రాజా అనే వ్యక్తులు అతనికి ఫోన్ చేసి సెల్‌ఫోన్ ఇవ్వకుంటే చంపుతామని బెదిరించారు. దీంతో భయపడిన అతను మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
భర్తను కాదని మరొకరితో భార్య వివాహేతర సంబంధం..
గుంటూరు రూరల్: అక్రమ సంబంధం నేపథ్యంలో భార్యపై భర్త దాడిచేసిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడిన సంఘటన వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో చోటు చేసుకుంది. వట్టిచెరుకూరు పోలీసుల కథనం ప్రకారం పుల్లడిగుంటకి చెందిన సల్మాకు ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన సుబానితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడేళ్ల క్రితం ఇరువురు విడిపోయి ప్రస్తుతం సల్మా పుల్లడిగుంటలో నివసిస్తోంది. ఈ క్రమంలో సల్మాకు అమీనాబాద్‌కు చెందిన సాహిదుల్లా అనే వ్యక్తితో పరిచయమై వివాహేతర సంబంధంగా మారింది. సోమ వారం సాయిదుల్లా, సల్మా లు నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటివద్ద ఉన్నారని తెలుసుకున్న భర్త సుబాని మరొక వ్యక్తితో కలిసి కత్తులతో దాడిచేశాడు. ఈ దాడిలో సాహిదుల్లా (40) అక్కడికక్కడే మృతి చెందగా సల్మాకు తీవ్రగాయాలయ్యాయి. ఇరువురు మృతి చెందారని భావించి సుబాని అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా సల్మాను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వట్టిచెరుకూరు పోలీసులు తెలిపారు. -
వివాహేతర సంబంధం.. భర్తను పాముతో కాటు వేయించి..
గోదావరిఖని: ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరపుతూ, సొమ్మంతా ఆమెకే వెచ్చిస్తున్నాడనే కోపంతో ఐదుగురితో కలిసి ఓ భార్య తన భర్తను హతమార్చిందని డీసీపీ వైభవ్‌గైక్వాడ్ వెల్లడించారు. గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన కొచ్చర ప్రవీణ్(42)ను అతడి భార్య కొచ్చెర లలిత(34), రామగుండం హౌసింగ్బోర్డ్కాలనీకి చెందిన మచ్చ సురేశ్(37), ఇందారపు సతీశ్(25), మందమర్రికి చెందిన నన్నపరాజు చంద్రశేఖర్(38), లారీ క్లీనర్ భీమ గణేశ్(23), లారీ డ్రైవర్ మాసు శ్రీనివాస్(33) ఈ హత్య కేసులో ప్రధాన నిందితులని వివరించారు. గోదావరిఖనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, బిల్డర్‌గా అతితక్కువ సమయంలో ఎదిగిన ప్రవీణ్‌ను పథకం ప్రకారం చంపారని తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. విలేకరిగా తన ప్రస్థానం ప్రారంభించిన ప్రవీణ్.. మందమర్రి ప్రాంతానికి చెందిన లలితను 15ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వ్యాపార రీత్యా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఇతడికి గోదావరిఖని ప్రాంతానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈక్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వీటిని మర్చిపోయేందుకు ప్రవీణ్ మద్యం తాగి ఇంటికి వెళ్లేవాడు. ఈపరిణామాలతో విసిగిపోయిన భార్య లలిత.. తన భర్తను వదిలించుకోవాలని పథకం రచించింది. ఈక్రమంలో సెంట్రింగ్ పనుల కోసం ఇంటివద్దకు వచ్చే సురేశ్‌కు తన సమస్య విన్నవించి, తన భర్తను చంపేందుకు సాయం చేయాలని కోరింది. హత్య కేసులో ఇరుక్కుంటే తన కుటుంబం ఇబ్బంది పాలవుతుందని సురేశ్ చెప్పడంతో ఒకఫ్లాట్ రాసి ఇస్తానని లలిత ఒప్పందం చేసుకుంది. తొలుత ఎవరికీ అనుమానం రాకుండా మద్యం మత్తులో నిద్రిస్తున్న ప్రవీణ్ ముఖంపై దిండు పెట్టి చంపాలని నిర్ణయించుకున్నారు. అయినా చనిపోకపోతే పాముతో కాటేసి చంపించి సహజ మరణంగా చిత్రీకరించాలని చూశారు. సొమ్ము చెల్లింపు కోసం అంగీకారం.. లలిత, మచ్చ సురేశ్ ఇద్దరూ కలిసి ప్రవీణ్‌ను అంతమెందించేందుకు నిర్ణయించుకున్నారు. సాయం కోసం ఇందారం సతీశ్‌ను సంప్రదించారు. మరోమిత్రుడు మందమర్రికి చెందిన మాస శ్రీనివాస్‌ను సంప్రదించి పాములు పట్టే వ్యక్తి కావాలని కోరారు. అందుకు శ్రీనివాస్ అంగీకరించి తనకు పరిచయం ఉన్న భీమ గణేశ్ ద్వారా మందమర్రి ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు నన్నపురాజు చంద్రశేఖర్‌ను సంప్రదించారు. ముందుగా తన పథకాన్ని అమలు చేసేందుకు కొంతడబ్బు కావాలని కోరగా తనవద్ద ఉన్న 34గ్రాముల బంగారు గొలుసు సురేశ్‌కు ఇచ్చి దాన్ని అమ్మిఖర్చులకు ఉపయోగించుకోవాలని లలిత సూచించింది. పాముతో కాటు వేయించి.. ఈనెల 9న పాము అందుబాటులో ఉందని చంద్రశేఖర్ ఫోన్‌ద్వారా మచ్చ సురేశ్‌కు సమాచారం ఇచ్చాడు. ఆరోజే కొచ్చెర ప్రవీణ్‌ను అంతమొందించేందుకు నిర్ణయించారు. ఈక్రమంలో అందరూ రామగుండంలో కలిసి మద్యం తాగుతూ లలితతో ప్రవీణ్ కదలికల గురించి తెలుసుకుంటూ ఉన్నారు. అతను నిద్రకు ఉపక్రమించిన తర్వాత లలిత ఈ విషయాన్ని నిందితులకు తెలియజేసింది. దీంతో మచ్చ సురేశ్, అతడి అనుచరులు రెండు బైక్‌లపై ప్రవీణ్ ఇంటికి చేరుకున్నారు. వారిరాకకోసం ఎదురుచూస్తున్న లలిత.. ఇంటిముందున్న ప్రధాన ద్వారాలు తెలిచి ఉంచి ఇంట్లోకి ఆహ్వానించింది. పడకగదిలో నిద్రిస్తున్న ప్రవీణ్‌ను చూపించింది. తాను మరో గదిలో కూర్చుంది. ఈక్రమంలో సురేశ్ చద్దరుతో ప్రవీణ్ముఖం, ముక్కుపై అదిమిపట్టి శ్వాసఆడకుండా చేయగా అతడి అనుచరులు ఇందారపు సతీశ్, భీమ గణేశ్, మాస శ్రీనివాసు.. ప్రవీణ్ కాళ్లు, చేతులు గట్టిగా అదిమిపట్టుకుని మచ్చ సురేశ్‌కు సహకరించారు. ఒకవేళ ఇలా చనిపోకపోతే పాము కాటుతో చంపేయాలని తన మిత్రుడు చంద్రశేఖర్ సాయంతో పాము కాటు వేయించాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మచ్చ సురేశ్, అతడి మిత్రులు అక్కడి నుంచి పరారయ్యారు. పామును గోదావరి బ్రిడ్జి దాటిన తర్వాత అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆ తర్వాత లలిత తన భర్త సాధారణంగానే మరణించినట్లు చిత్రీకరించేందుకు యత్నించింది. గుండెనొప్పితో చనిపోయినాడని ఇరుగుపొరుగువారికి చెప్పింది. శవాన్ని ప్రీజర్‌లో పెట్టి అంతిమసంస్కారాలకోసం ఉంచింది. తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి.. ప్రవీణ్ తల్లి ఫిర్యాదు చేయడంతో వన్‌టౌన్ సీఐ ప్రమోద్‌రావు రంగప్రవేశం చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. అనుమానం రావడంతో భార్యను విచారించడంతో వాస్తవాలు వెలుగులోకివచ్చాయి. తానే హత్య చేయించినట్లు ఆమె ఒప్పుకుంది. ఈమేరకు నిందితులను అరెస్ట్ చేసి, వారినుంచి మూడు ద్విచక్రవాహనాలు, ఆరు మొబైల్ఫోన్లు, 34గ్రాముల బంగారు చైన్‌స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వివరించారు. సమావేశంలో సీఐ ప్రమోద్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...
హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడేళ్ల చిన్నారిని చిత్ర హింసలకు గురి చేసి అతి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనిత మంగళవారం తీర్పు చెప్పారు. 2022 ఆగస్టులో ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోహన్‌నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకోగా ఇన్స్పెక్టర్ జహంగీర్‌యాదవ్ నేతృత్వంలో ఎస్సై సురేందర్ కేసు నమోదు చేసి కోర్టులో చార్జిట్ దాఖలు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... నిజామాబాద్ జిల్లా, బిచ్పల్లి మండలం, ధర్మారం గ్రామానికి చెందిన కొనగంటి శివకుమార్, నాగలక్ష్మి దంపతుతకు పవన్(7), భరత్‌కుమార్(3)లు అనే ఇద్దరు సంతానం. పెళ్లికి ముందేనాగలక్ష్మికి ఇదే జిల్లా మాధవనగర్ గ్రామానికి చెందిన ముస్తాల రవితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో రవి హైదరాబాద్ వచ్చి పార్సిగుట్ట మున్సిపల్ కాలనీలో ఉంటూ సెంట్రింగ్ వర్కర్‌గా పని చేసేవాడు. ఇదే సమయంలో నాగలక్ష్మి కూడా హైదరాబాద్ వెళ్లి ఏదో పని చేసుకుని బతుకుదామని భర్తకు నచ్చజెప్పి హైదరాబాద్ తీసుకువచి్చంది. ఇద్దరు పిల్లలతో కలిసి రవి నివాసానికి కొద్ది దూరంలోని మోహన్‌నగర్‌లో ఇళ్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. శివకుమార్‌కు రవి పెయింటర్‌గా పని ఇప్పించాడు. నాగలక్ష్మి పెద్ద కుమారుడు పవన్ స్కూల్‌కు వెళ్తుండగా చిన్న కుమారుడు భరత్(3) పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్‌కు వెళ్లేవాడు. భర్త పనికి వెళ్లిన సమయంలో రవి నాగలక్ష్మి ఇంటికి వచ్చి వివాహేతర సంబంధాన్ని కొనసాగించేవాడు. అయితే భరత్ తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి అతడి అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు కలిసి పథకం పన్నారు. ఇందులో భాగంగా నాగలక్ష్మి భర్త శివకుమార్‌తో రవికి ఫోన్ చేయించి అంగన్వాడీ సెంటర్లో ఉన్న తన చిన్న కుమారుడిని ఇంటికి తీసుకువెళ్లమని చెప్పించింది. దీంతో అతను భరత్‌ను ఇంటికి తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టడంతో గాయాలయ్యాయి. దీంతో అతడికి తీవ్ర రక్త విరోచనాలు అయ్యాయి. ఆ తర్వాత రవి శివకుమార్‌కు ఫోన్ చేసి భరత్ కురీ్చపై నుంచి కిందపడ్డాడని తీవ్ర గాయాలయ్యాయని చెప్పాడు. దీంతో శివకుమార్ చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎవరికీ అనుమానం రాకుండా నాగలక్ష్మి ఏడుస్తూ నటించింది. అయితే అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం చేయించగా బాలుడి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో రవిని అదుపులోకి తీసుకుని విచారించగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తల్లి నాగలక్షి్మతో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు నాగలక్ష్మి, రవిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. విచారణ అనంతరం న్యాయస్థానం రవిని దోషిగా నిర్ధారిస్తూ యావజీవ కారాగార శిక్ష విధించింది. -
వివాహిత హత్య కేసులో నిందితుడు అరెస్టు
నాగాయలంక(అవనిగడ్డ): వివాహిత హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 24 గంటల్లోనే కేసును ఛేదించి, నిందితుడిని అరెస్టు చేశామని అవనిగడ్డ సీఐ ఎల్.రమేష్ తెలిపారు. నాగాయలంక పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు వివరాలను మంగళవారం విలేకరులకు తెలిపారు. సీఐ కథనం మేరకు.. నాగాయలంక గ్రామానికి చెందిన నాగిడి దుర్గ (30), ఆదే గ్రామానికి చెందిన యతిరాజుల ప్రకాష్ ప్రేమించుకుని పదేళ్ల క్రితం పెద్దల సమక్షంలో కులాంతర వివాహం చేసుకున్నారు. వారికి తొమ్మిదేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. దుర్గ గ్రామంలోని భూషయ్య హోటల్లో పనిచేస్తోంది. గైడ్ స్వచ్ఛంద సంస్థ తరఫున దుర్గ పనిచేస్తూ హెచ్ఐవీ రోగులను బందరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ఆమెను అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం గ్రామానికి చెందిన హేమంత్ అనుసరించడం మొదలుపెట్టాడు. ప్రేమిస్తున్నానంటూ వేధించే వాడు. దుర్గ భర్త ప్రకాష్‌కు ఈ విషయం తెలియ డంతో హేమంత్‌ను మందలించాడు. అయినా ప్రవర్తన మార్చుకోని హేమంత్ ఈ నెల ఆరో తేదీన నాగాయలంక సెంటర్లోని భూషయ్య టిఫిన్ హోటల్ వద్దకు వెళ్లి తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కోరడంతో దుర్గ గట్టిగా మందలించింది. తనను తిట్టిన దుర్గ అంతు చూస్తానంటూ హేమంత్ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమెను చంపాలనే ఉద్దేశంతోనే ఎనిమిదో తేదీ రాత్రి భూషయ్య హోటల్లో వెనుక వైపు ఆమె పని చేసుకుంటున్న సమయంలో హేమంత్ గోడ దూకి వచ్చాడు. వెంట తెచ్చుకున్న చాకుతో దుర్గ ఎడమ వైపు ఛాతీ కింద పొడిచి హత్య చేశాడు. దుర్గ భర్త ప్రకాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అవనిగడ్డ సీఐ రమేష్ ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ ఎం.సుబ్రహ్మణ్యం, సిబ్బంది సహకారంతో నిందితుడు హేమంత్‌ను సోమవారం సాయంత్రం పులిగడ్డ బస్ స్టాప్ వద్ద అదుపులోనికి తీసుకుని, హత్యకు ఉపయోగించిన చాకును స్వాధీనం చేసుకున్నారు. సెక్షన్ 302 కింద కేసు నమోదైంది. నిందితుడిని మంగళవారం అనంతరం అవనిగడ్డ కోర్టులో హాజరుపరిచారు. -
బిల్డర్ ఆత్మహత్య.. డ్రైవర్‌తో భార్య వివాహేతర సంబంధమే కారణం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కుటుంబ విభేదాలు, ఆస్తి గొడవల నేపథ్యంలో కృష్ణలంకకు చెందిన ఓ బిల్డర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటరిగా బతకలేక అత్మహత్యకు పాల్పడుతున్నట్లు, తన చావుకు భార్య, ఆమెకు సహకరించిన మరికొంత మంది కారణమని సూసైడ్ నోట్ రాశాడు. ఘటన కృష్ణలంక పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణలంక నివాసి బిల్డర్ దాసరి హనుమంతరావు అలియాస్ అనిల్(60) అపార్ట్మెంట్స్ నిర్మించి విక్రయిస్తూ ఉంటాడు. ఇతనికి భార్య రాధాలక్ష్మి, కుమారుడు సిద్ధేష్కుమార్, కుమార్తె సౌజన్య ఉన్నారు. కుమారుడు, కుమార్తె ఇద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. అనిల్ కృష్ణలంకలోని శంకరమఠం సమీపంలో కుమార్తెకు చెందిన ఇంటిలోని నాలుగో అంతస్తులో ఒంటరిగా నివసిస్తున్నాడు. అతని భార్య రాధాలక్ష్మి కృష్ణలంక ఆర్చి రోడ్డులో తన సొంతింటిలో నివసిస్తోంది. దీంతో అనిల్ తరచూ మనస్తాపం చెందుతుండేవాడు. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో సౌజన్య తన తండ్రి అనిల్‌కు ఫోన్ చేసింది. అతను లిఫ్ట్ చేయకపోవడంతో వాచ్‌మెన్‌కు ఫోన్ చేసి తన తండ్రి వద్దకు వెళ్లాలని చెప్పింది. వెంటనే వాచ్మెన్ అనిల్ ఇంటిలోకి వెళ్లి చూడగా బెడ్రూమ్లోని ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతను ఇరుగుపొరుగు వారికి, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని, సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనిల్ రాసిన సూసైడ్ నోట్లో తనకు, తన భార్యకు విభేదాల కారణంగా కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నానని, తమ వద్ద పనిచేసిన డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా తనను మానసికంగా వేధించి ఆమె తన ఆస్తులన్నీ రాయించుకుందని తెలిపారు. తన చావుకు తన భార్య, ఆమెకు సహకరించిన బోనగిరి రాము, అరుణ అనే వారు కారణమని నోట్లో అనిల్ పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త మలేషియాలో భార్య మరొకరితో వివాహేతర సంబంధం
తమిళనాడు: వివాహేతర సంబంధం కొనసాగించడానికి అడ్డుచెప్పినందుకు సామాజిక మాధ్యమంలో అసభ్యకర వీడియోలు విడుదల చేస్తానని బ్లాక్మెయిల్ చేయడంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. నాగై జిల్లా వేదారణ్యం సమీపంలోని పుదుమాపిల్లై వీధికి చెందిన రవి (42), కార్తికేశ్వరి (39) దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రవి మలేషియాలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కార్తికేశ్వరికి అదే ప్రాంతానికి చెందిన రవిచంద్రన్ (52)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న కార్తికేశ్వరి కుమార్తె తల్లిని మందలించింది. తండ్రికి విషయం చెప్పింది. దీంతో కార్తికేశ్వరి, రవిచంద్రన్‌తో మాట్లాడడం మానేసింది. ఆగ్రహించిన రవిచంద్రన్ తనతో సన్నిహితంగా ఉన్న సామాజిక మాధ్యమంలో విడుదల చేస్తారని బెదిరింపులకు దిగాడు. ఈ వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన కార్తికేశ్వరి శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రవిచంద్రన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. -
తల్లితో వివాహేతర సంబంధం.. కూతురినిచ్చి పెళ్లి చేయాలని డిమాండ్
వైఎస్సార్: పట్టణంలోని ముస్లింకోటలో మంగళవారం రాత్రి ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పోలీసుల కథనం మేరకు.. షేక్ గౌసియాబేగం (38) స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ( ఔట్ సోర్సింగ్) కూలి పని చేసేది. ఆమె భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. ఇద్దరు ఆడపిల్లలతో ఆమె కూలి పని చేసుకుని జీవనం సాగిస్తోంది.ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన సుబహాని (24) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల సుబహాని కువైట్ వెళ్లి వచ్చాడు. ఆమెకు ఆర్థికంగా సహాయం కూడా చేశాడు. ఈ నేపథ్యంలో గౌసియాబేగం పెద్ద కూతురును తనకిచ్చి పెళ్లి చేయమని సుబహాని అడిగాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోగా ఇటీవల కూతురుకు గిద్దలూరులో సంబంధం ఖాయం చేసుకుంది. దీంతో ఆమైపె కక్ష పెంచుకున్న సుబహాని పథకం ప్రకారం మంగళవారం రాత్రి ఉర్దూ స్కూలుకు పిలిచి హత్య చేసి మృత దేహాన్ని బాత్రూమ్లో పడేసి వెళ్లాడు. హత్య అనంతరం నిందితుడు నేరుగా పోలీస్‌స్టేషన్ వెళ్లి హత్య విషయం చెప్పాడు. లేకపోతే బుధవారం ఉదయం పాఠశాల తెరిచేంతవరకు ఈ విషయం వెలుగు చూసేది కాదు. ఈ సంఘటనపై ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, ఏఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ బుధవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
భార్య పిల్లలను వదిలేసి రాకపోతే మీ ఇంటి దగ్గరకొచ్చి గొడవ చేస్తా..
కడప అర్బన్ : కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలో తాటిచెర్ల లక్ష్మి (48) అనే మహిళను ఈనెల 22వ తేదీన రాత్రి రోకలి బండతో దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు ఆవుల రామాంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు చిన్నచౌక్ సీఐ పి. నరసింహారెడ్డి మంగళవారం తమ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలో తాటిచెర్ల లక్ష్మీ (48) ఓ ఇంటిలో అద్దెకు ఉంటూ కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమె భర్త నారాయణ స్వామి గతంలోనే చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. వారికి తాము గతంలో నివాసం ఉండిన ముద్దనూరులోనే వివాహాలు చేసి, తన బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం కడపకు వచ్చింది. జమ్మలమడుగు టౌన్ కన్నెలూరులో నివాసం ఉంటున్న అనంతపురం జిల్లా పుట్లూరు మండలం, సంజీవపురానికి చెందిన ఆవుల రామాంజనేయులుతో తాటిచెర్ల లక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే అప్పటికే ఆవుల రామాంజనేయులుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధం విషయం రామాంజనేయులు భార్యకు తెలియడంతో ఎక్కడ తన భార్య, పిల్లలు దూరమవుతారోనని అతను కొంతకాలం తాటిచెర్ల లక్ష్మి ఇంటికి వెళ్లలేదు. దీంతో లక్ష్మి ఆవుల రామాంజనేయులుకు ఫోన్ చేసి, నీ భార్య పిల్లలను వదిలేసి తన దగ్గరకు రాకపోతే మీ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేస్తానని, పోలీసు కేసు పెడతానని బెదిరించింది. దీంతో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 22న కడపకు వచ్చి తాటిచెర్ల లక్ష్మి ఇంటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి సమయంలో ఇద్దరు భోజనం చేసి, పడుకున్న తరువాత అర్థరాత్రి సమయంలో పథకం ప్రకారం లక్ష్మిని రోకలిబండతో తలపై, ముఖంపై బలంగా కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన జరిగిన తరువాత రోజున పోలీసులకు సమాచారం వచ్చింది. హత్య సంఘటనను ఛేదించేందుకు కడప డీఎస్పీ ఎం.డి. షరీఫ్ పర్యవేక్షణలో చిన్నచౌక్ సీఐ పి. నరసింహారెడ్డి, ఎస్ఐలు పి. రవికుమార్, పి. తులసీనాగప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్ జె. రామసుబ్బారెడ్డి, కానిస్టేబుళ్లు పి.వి. శ్రీనివాసులు, ఏ. శివప్రసాద్, రంతుబాషాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా సమగ్రంగా దర్యాప్తు చేపట్టి ఈనెల 25వ తేదీ సోమవారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతను హత్యకు ఉపయోగించిన రోకలిబండను స్వాధీనం చేసుకున్నారు. -
మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం.. దూరం పెట్టడంతో!
తూర్పు గోదావరి: తనను తీసుకువెళ్తున్నది మేకవన్నె పులి అని.. అభం శుభం తెలియని ఆ చిన్నారి మనస్సుకు అర్థం కాలేదు.. నిలువెల్లా కాపట్యం నిండిన ఆ క్రూరుడు తనను కబళించేస్తాడని ఏ మాత్రం అనుకోలేదు.. బంధువే కదా అనుకుంటూ ఆ దుర్మార్గుడిని నమ్మింది.. మాయమాటలు విని, అతడితో వెళ్లింది.. చివరకు ఆ దౌర్భాగ్యుడి చేతుల్లో అత్యంత క్రూరంగా హతమారిపోయింది. పెద్దాపురం పట్టణంలో సంచలనం రేపిన బాలిక హత్యకు కారకుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన దంపతులు ద్రోణ వీర్రాజు, జ్యోతి కొన్నాళ్ల కిందట మనస్పర్థల కారణంగా విడిపోయారు. దీంతో జ్యోతి తన పదేళ్ల కుమార్తె ప్రవీణ కుమారి అలియాస్ మానస, తన తల్లి సునీతతో కలసి పట్టణ శివారులోని ఎన్టీఆర్ నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. రంగంపేట మండలం వడిశలేరుకు చెందిన బత్తిన నాని జ్యోతికి సమీప బంధువు. వరుసకు మేనల్లుడు అవుతాడు. ఐదేళ్లుగా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి, కొనసాగుతోంది. అయితే, తన కుమార్తె ఎదుగుతోందని, ఇంటికి రావడం సరికాదని అంటూ కొన్నాళ్లుగా నానిని జ్యోతి దూరం పెడుతోంది. అది తట్టుకోలేని నాని తమ సాన్నిహిత్యానికి అడ్డంగా ఉన్న మానసను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ప్రణాళిక సిద్ధం చేశాడు. అందులో భాగంగా బయటకు తీసుకువెళ్తానని ఈ నెల 19వ తేదీన మానసకు చెప్పాడు. బంధువే కావడంతో అతడి మాటల్ని ఆ బాలిక నమ్మింది. మానసను తన బైక్‌పై ఎక్కించుకున్న నాని, స్థానిక కట్టమూరు పుంత రోడ్డులోకి తీసుకువెళ్లి, ముందే వేసుకున్న పథకం ప్రకారం హతమార్చాడని పోలీసులు చెబుతున్నారు.బయటకు వెళ్లిన మానస ఎంతకూ ఇంటికి రాకపోవడంతో జ్యోతి ఈ నెల 20వ తేదీన పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు ఆరంభించిన పోలీసులు అనుమానితుడిగా ఉన్న నానిని అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టేందుకు ప్రయతి్నంచారు. చివరకు అతడు పరారీలో ఉన్నాడని గుర్తించారు. మరోవైపు బాలిక ఆచూకీ కోసం కూడా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కట్టమూరు పుంతలో బాలిక మృతదేహాన్ని ఆదివారం రాత్రి గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆ బాలిక మృతదేహం పూర్తిగా పాడైపోయింది. కుక్కలు ఈడ్చుకు రావడంతో గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. చివరకు దుస్తుల ఆధారంగా ఆ మృతదేహం మానసదేనని గుర్తించారు. చిన్నారి మృతదేహానికి పెద్దాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించి, సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మానస హత్యకు కారకుడైన నాని ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అతడిని పట్టించిన వారికి రూ.10 వేల పారితోíÙకం అందిస్తామని ప్రకటించారు. డీఎస్పీ లతాకుమారి నేతృత్వంలో సీఐ అబ్దుల్ నబీ, ఎస్సై సురే‹Ùలు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మా.. నాన్నను చంపుతున్నారు.. ‘నువ్వు పడుకో రా’
నల్గొండ: బొగ్గు బట్టీల వద్ద కాపలాగా భార్య, కుమారుడితో కలసి నిద్రిస్తున్న వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం నాణ్యతండా ఆవాసం పూర్యతండా సమీపంలో గుట్టల వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నూతనకల్ మండలం బక్కహేమ్లాతండాకు చెందిన గుగులోతు చాంప్ల(38) తండాలో వ్యవసాయంతోపాటు జాజిరెడ్డిగూడెం మండలం నాణ్యతండా ఆవాసం పూర్యతండా సమీపంలో గుట్టల వద్ద బొగ్గు బట్టీలు పెడుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకొని.. బక్కహేమ్లాతండాకు చెందిన గుగులోతు చాంప్ల 12ఏళ్ల కిందట అదే తండాకు చెందిన క్లాస్మేట్ అరుణను ప్రేమించాడు. పెద్దలు అంగీకరించకపోయినా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలకు నచ్చజెప్పి సంసారం సాఫీగా చేస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం . కుమార్తెలు ఝాన్సీ, రోహిత, కుమారుడు ధనుష్ ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు నకిరేకల్‌లోని గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. కుమారుడు తల్లిదండ్రులతో పాటే ఉంటున్నాడు. గొంతు నులిమి.. కాలు, చేయి విరగ్గొటి.. చాంప్ల ఆదివారం రాత్రి భార్య, కుమారుడితో కలసి ద్విచక్రవాహనంపై తన స్వగ్రామం బక్కహేమ్లాతండా నుంచి పూర్యతండాలోని బొగ్గుబట్టీల వద్దకు వచ్చాడు. కాపలాగా భార్యాకుమారుడు ఒక మంచంలో, చాంప్ల మరో మంచంలో నిద్రించారు. సోమవారం ఉదయం వరకు అందరూ నిద్రపోయి ఉండగా సమీపంలోని తండాకు చెందిన వారు వచ్చి వారిని లేపే క్రమంలో చాంప్ల విగతజీవిగా పడి ఉన్నాడు. దీంతో వారు కేకలు వేస్తూ తండా గిరిజనులకు సమాచారం ఇచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు అక్కడికి వచ్చి మంచంలో నిద్రిస్తున్న చాంప్లపై దాడి చేయడంతో కాలు, చేయి విరిగిపోయిన ఆనవాళ్లు ఉన్నాయి. అనంతరం అతడి గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. అరుణ బోరున విలపిస్తూ తన భర్తని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి పోయారని పేర్కొంటోంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతోనే కోడలు అరుణ తన ప్రియుడు, మరికొందరి సహకారంతో కుమారుడిని హత్య చేయించిందని చాంప్ల తల్లి గుగులోతు జక్కి ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలాన్ని నాగారం సీఐ శివశంకర్, స్థానిక ఎస్ఐ బి.అంజిరెడ్డి పరిశీలించారు. సూర్యాపేట నుంచి డాగ్‌స్క్వాడ్‌ను తీసుకువచ్చి ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ఆస్పత్రికి తరలించారు. అమ్మా.. నాన్నను చంపుతున్నారు అమ్మా.. నాన్నను చంపుతున్నారు.. అంటూ ఏడ్చినా తల్లి పట్టించుకోకుండా నువ్వు పడుకో అని చెప్పిందని హతుడు చాంప్ల ఏడేళ్ల కుమారుడు ధనుష్ గిరిజనుల వద్ద వీడియోలో చెప్పిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. చాంప్ల హత్యతో బక్కహేమ్లాతండా, పూర్యతండాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బక్కహేమ్లాతండాకు చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో సంఘటనాస్థలికి తరలివచ్చారు. తండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని నాగారం సీఐ శివశంకర్ తెలిపారు. హతుడి తల్లి ఫిర్యాదుతో పాటు ఏడేళ్ల కుమారుడు ధనుష్ వీడియో ఆధారంగా పోలీసులు అరుణను అనుమానిస్తూ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
నిండు ప్రాణాన్ని బలికొన్న వివాహేతర సంబంధం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్టణంలో దారుణం వెలుగుచూసింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టకున్నడనే కారణంతో ఓ యువకుడిని భర్త కిరాతకంగా హత్య చేశారు. వివరాలు.. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శివారెడ్డి అనే వ్యక్తి తన భార్యతో నివసిస్తున్నాడు. కొంతకాలంగా శివారెడ్డి భార్యతో కిషోర్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శివారెడ్డి పలుమార్లు ఇద్దరిని మందలించాడు. అయినా వీరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కిషోర్ అడ్డుతొలగించుకోవాలని పథకం రచించాడు. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి కిషోర్‌కు ఫోన్ చేసి బయటకు రావాలని చెప్పాడు. కిషోర్ రామ టాకిస్ వద్దకు చేరుకోగా అతన్ని శివారెడ్డి మేడపై నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన కిషోర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు -
నా కోడలు వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని..
నాయుడుపేటటౌన్: ‘నా కోడలు వేరొకరితో సంబంధం పెట్టుకుని, పథకం ప్రకారం నా కొడుకుని హత్య చేయించింది’ అని పశ్చిమబెంగాల్ ప్రాంతానికి చెందిన కార్తిక్ మండల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన స్థానిక పోలీసులను కలిసి వివరాలు వెల్లడించారు. వివరాలు.. ఈనెల 1వ తేదీ అర్ధరాత్రి మేనకూరు సెజ్ పరిధిలోని లాయల్ టెక్స్టైల్స్ పరిశ్రమలో పనిచేస్తున్న చరణ్‌జిత్ మండల్ (31) హాస్టల్ మిద్దైపె నుంచి పడి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ సంఘటనపై ఈనెల 2వ తేదీ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న మృతుడి తండ్రి కార్తిక్ మండల్ పశ్చిమబెంగాల్ నుంచి అతని కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం నాయుడుపేట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తన కుమారుడి మృతికి ప్రధాన కారకురాలు కోడలు, ఆమె కుటుంబ సభ్యులేనని ఎస్ఐ వేణుకు విన్నవించారు. మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ఆపై నగదు కోసం మానసికంగా తన కుమారుడిని వేధించి చంపించిందని తెలిపారు. -
మరుగుతున్న నీటిలో కారం కలిపి, భర్త ముఖంపై జల్లి...
అనంతపురం: భర్తపై భార్య దాష్టీకానికి పాల్పడింది. వేడినీటిలో కారం కలిపి ముఖంపై చల్లింది. ఈ ఘటన ఉడిపి పట్టణంలో జరిగింది. కటపాడియ శంకరపురలో మోహమ్మద్ ఆశ్రఫ్, అప్రీన్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈరికి గత ఏడాది వివాహమైంది. అయితే భర్త వివాహేతర సంబంధం నడుపుతున్నట్లు భార్య అనుమానపడుతోంది. దీనిపై ప్రశ్నించినందుకు అతను గొడవపడ్డాడు. ఈక్రమంలో భర్త బాత్రూమ్కు వెళ్లగా ఆఫ్రీన్ వేడి నీటిలో కారం పొడి కలిపింది. అతను బయటకు రాగానే ముఖం చల్లింది. ఈ విషయం ఏవరికై న చెబితే అంతుచూస్తానని బెదిరించింది. ఎట్టకేలకు బాధితుడు పోలీసులను ఆశ్రయించి భార్య దాష్టీకంపై ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
వివాహేతర సంబంధం.. భర్త చెంపపై భార్య కొట్టడంతో భర్త మృతి
తూర్పు గోదావరి: పండగ వేళ పాశర్లపూడి బాడవలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో భార్య చేతిలో భర్త హత్యకు గురయ్యాడు. వివరాలివీ.. పాశర్లపూడి బాడవ పల్లవపాలేనికి చెందిన కొల్లు సాయికుమార్ (24).. అదే గ్రామానికి చెందిన యువతిని ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. సాయికుమార్ ఇళ్ల సీలింగ్ పనులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అతడి భార్య.. అదే గ్రామానికి చెందిన కొల్లు వెంకటేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే విధంగా ఈ నెల 17వ తేదీ రాత్రి ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సాయికుమార్ చెంపపై భార్య గట్టిగా కొట్టడంతో అతడు మృతి చెందాడు. ఈ మేరకు హతుని తండ్రి కొల్లు వీరపండు నగరం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటనపై పి.గన్నవరం సీఐ ప్రశాంత్‌కుమార్ ఆధ్వర్యాన నగరం ఎస్సై పి.సురేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సాయికుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
భర్త సెక్యూరిటీ గార్డు.. భార్య దూరపు బంధువుతో వివాహేతర సంబంధం
వికారాబాద్: చాకలిగుట్ట తండాలో గురువారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందుతులైన దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం బాక్సర్ జిల్లా బాషీ గ్రామానికి చెందిన తరుణ్ చౌదరి(41) మేకగూడ శివారులోని ఓ గోదాంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ.. చాకలిగుట్ట తండాలో నివాసం ఉంటున్నాడు. బీహార్‌కు చెందిన అక్షయ్ బింద్ తన భార్య గుడియా దేవిలు సైతం స్థానికంగా ఓ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తూ ఇదే తండాలో ఉంటున్నారు. తరుణ్ చౌదరికి అక్షయ్ బింద్ దూరపు బంధువు కావడంతో తరుణ్ చౌదరి తరచుగా అక్షయ్ ఇంటికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో తరుణ్ చౌదరికి గుడియా దేవికి అక్రమ సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన అక్షయ్.. తన భార్యను పలుమార్లు మందలించాడు. మరోసారి అలా చేస్తే తరుణ్ చౌదరిని చంపేస్తానని భార్యను హెచ్చరించాడు. గొంతు నులిమి.. ఈ క్రమంలో మృతుడు తరుణ్ చౌదరి గురువారం రాత్రి మద్యం సీసాలను తీసుకొని అక్షయ్ ఇంటికి వచ్చాడు. ముగ్గురు కలిసి మద్యం సేవించిన అనంతరం తాగిన మైకంలో తరుణ్ చౌదరి గడియా దేవితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయాన్ని గమనించిన అక్షయ్.. తరుణ్‌పై దాడి చేశాడు. గడియా సైతం భర్తకు సహకరించంతో ఇద్దరు కలిసి పిడిగుద్దులు గుద్ది గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. అనంతరం ఏమి తెలియనట్లు చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌లోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. గమనించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని చెప్పారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలిసిన పోలీసులు ఆర్ఐ రోజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యప్తు చేపట్టారు. నిందితుల కోసం వెతుకుతుండగా శనివారం ఉదయం నందిగామ చౌరస్తాలో అనుమానాస్పదంగా కనపడటంతో అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారని ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. దీంతో నిందితులను కోర్టులో హాజరు పరిచి, అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు అయన తెలిపారు. -
ఎన్ఆర్ఐ భర్తకు విడాకులు.. ఆపై మరో పెళ్లి.. రెండో భర్త హత్యకు కుట్ర
పటమట(విజయవాడ తూర్పు): ప్రియుడితో కలిసి అంతమొందించడానికి కుట్ర పన్నిన భార్యపై భర్త ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురులో నివసించే భావన యామిని నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అకౌంటెంట్‌గా చేస్తోంది. ఆమె గతంలో ఎన్ఆర్ఐని వివాహమాడింది. ఆమెకు ఉన్న వివాహేతర సంబంధం అతనికి తెలియడంతో ప్రశ్నించాడు. ఆ తర్వాత నుంచి ఆమె భర్తను వేధించడమే కాకుండా అతనిపై కేసు పెట్టింది. ఆ కేసు నుంచి బయటపడటంతో పాటు యామినికి రూ.40 లక్షలు ఇచ్చి విడాకులు తీసుకున్నాడు. తర్వాత ఆమె కానూరి గౌరీశంకర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే యామిని.. స్కూల్లో పని చేస్తున్న గుణదలకు చెందిన చిన్నం రమేష్‌తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఇది తెలిసిన గౌరీశంకర్ భార్యను నిలదీశాడు. దీంతో ఆమె ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయడానికి పథక రచన చేసింది. దీన్ని పసిగట్టిన భర్త గౌరీశంకర్.. భార్య యామిని నుంచి తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని పటమట పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యకు చెప్పకుండా ఇండియాకు.. ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నోడిని చంపేసి దుబాయ్‌కు!
చందురి(వేములవాడ): పక్కా ప్లాన్.. పది రోజుల్లో పని పూర్తి.. హత్య చేసిన రోజే దుబాయికి పరారీ అయిన నిందితుడు. ఇదీ చందుర్తి మండలం మల్యాలలో వివాహేతర సంబంధంలో యువకుడిని హత్యకు ప్లాన్. గ్రామానికి చెందిన పడిగెల నరేశ్‌ను వివాహేతర సంబంధంలో హత్యకు గురైన విషయం తెలిసింది. నరేశ్ గత నెల 29న మల్యాల గ్రామానికి దుబాయ్ నుంచి చేరుకోగా.. ఆమె భర్త మల్లేశం ఈనెల 3న ఇండియాకు వచ్చాడు. ఈ విషయం భార్యకు తెలువకుండా జాగ్రత్తపడి బంధువుల ఇంట్లో ఉండి హత్యకు పథకం రచించాడు. పది రోజుల్లో పని పూర్తి చేసుకోవాలనుకున్న మల్లేశం అనుకున్నట్లే అన్ని అమలు చేశాడు. ఈనెల 13వ తేదీ రాత్రి 10.25 గంటల నుంచి 10.40 గంటల మధ్య భార్య వద్దకు వెళ్లిన నరేశ్‌ను హతమార్చి బైక్‌పై పరారయ్యాడు. హత్య విషయం ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే సమయానికే ప్రధాన నిందితుతు జిల్లా దాటిపోయినట్లు సమాచారం. పోలీసులు స్పందించి లుక్ఔట్ నోటీస్‌లు ఇచ్చేలోపే మల్లేశం దేశం దాటిపోయాడని తెలుస్తోంది. పోలీసుల ముమ్మర విచారణ మల్లేశంను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఎవరు తరలించారన్నది పోలీసులకు అంతుచిక్కడం లేదు. హత్య చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఏ వాహనంలో వెళ్లాడనే దానిపై ఆరా తీస్తున్నారు. అతనికి ఎవరెవరూ సహకరించారన్న కోణంలో పోలీసుల విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ హత్యతో నలుగురికి సంబంధం ఉందని భావించిన పోలీసులకు మల్లేశం దుబాయ్ చేరుకున్న విషయాన్ని సవాల్‌గా తీసుకున్నారు. ఈ కేసులో ప్రశ్నార్థకంగా మారిన చిక్కుముడులను విప్పేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే వీఆర్ఓ హత్య
రాయచోటిటౌన్ : తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో పాటు మరొక వ్యక్తి సాయం తీసుకుని భర్తను అంతమొందించింది. ఆ తర్వాత తన భర్త బాత్రూంలో పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. బుధవారం రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషా విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సంబేపల్లె మండలం శెట్టిపల్లెకు చెందిన అంజి అలియాస్ ఆంజనేయులు నాయుడు రాయచోటి పట్టణంలో నివాసం ఉంటూ వీరబల్లె మండల కేంద్రంలో వీఆర్ఓగా విధులు నిర్వర్తించేవాడు. ఆయనకు భార్య నందిని, ఇద్దరు మగపిల్లలు సంతానం ఉన్నారు. అయితే నందినికి గొర్లమొదివీడుకు చెందిన మహదేవపల్లె చిన్నప్పరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తన భర్తకు తెలియడంతో ఆమెను వారించేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకొనేవి. తన భర్త తనను వేధిస్తున్నాడని ఎలాగైనా అంతమొందించాలని చిన్నప్పరెడ్డికి చెప్పింది. వెంటనే పథకం రచించారు. ఈనెల 9వ తేదీ శనివారం రాత్రి ఇంటికి రాగానే భోజనం వడ్డించింది. మజ్జిగలో నిద్రమాత్రలు కలపడంతో అతను భోజనం చేసిన కాసేపటికి మత్తులోకి జారుకున్నాడు. ఇదే అదునుగా భావించిన నందిని అప్పటికే సిద్ధంగా ఉన్న చిన్నప్పరెడ్డి, అతని స్నేహితుడు గొర్లమొదివీడు గ్రామానికి చెందిన మహదేవపల్లె సురేంద్రారెడ్డితో పాటు తాను కూడా బెడ్రూంలోకి వెళ్లి ముఖంపై దిండు ఉంచి గట్టిగా అదిమి పట్టుకున్నారు. అయితే అంజి నిద్రమత్తు నుంచి లేచి తేరుకొని గట్టిగా కేకలు వేశాడు. ఆ సమయలో వారిమధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇక చేసేది లేక ముగ్గురు కలిసి బలవంతంగా అతని ముఖంపై దిండు వేసి గట్టిగా అదిమి పట్టుకున్నారు. కొద్దిసేపటి తరువాత ఊపిరి ఆగిపోయింది. మృతి చెందాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే హత్య కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో చిన్నప్పరెడ్డి తన చేతులకు గ్లౌజులు ధరించాడు. అలాగే పట్టణంలో సీసీ కెమెరాల కంటబడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మృతుడి భార్య నందిని తన భర్త బాత్ రూంలో పడి చనిపోయాడని చెప్పి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టడంతో నిజాలు వెలుగు చూశాయి. హత్యకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి, అర్బన్ ఎస్ఐ నరసింహారెడ్డిలకు రివార్డు కోసం జిల్లా ఎస్పీకి సిఫార్సు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ తులశీరాం పాల్గొన్నారు. -
తనకంటే ఐదేళ్ల చిన్నవాడితో మహిళ వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో..
నంద్యాల: వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో మహిళ దారి తప్పి చివరకు భర్తనే దారుణంగా హత్య చేయించింది. తండ్రి హత్యకు గురికావడం, తల్లి జైలుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. ఈనెల 4వ తేదీన నంద్యాల పట్టణ శివారులోని అయ్యలూరు మెట్ట వద్ద జరిగిన ప్రైవేటు ఉపాధ్యాయుడు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో దారుణానికి పాల్పడిన ఏడుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఎస్పీ రఘువీర్‌రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వివరాలు వెల్లడించారు. నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన సిందే నర్సోజీకి వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన జయశ్రీతో పదేళ్ల క్రితం వివాహమైంది. నర్సోజీ అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. జయశ్రీ(27) గ్రామంలో ఇంటి ఎదురుగా తనకంటే ఐదేళ్లు వయస్సు తక్కువగా ఉన్న రవీంద్ర (22) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రవీంద్ర కొబ్బరి తాళ్లు నేస్తున్నాడు. వీరి మధ్య ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే నెల క్రితం వీరిద్దరి వ్యవహారాన్ని తెలుసుకున్న నర్సోజీ పద్ధతి మార్చుకోవాలని భార్యను మందలించాడు. రవీంద్రను ఇకపై తన ఇంటి పరిసరలా వైపు రావద్దని హెచ్చరించాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించాలని ప్రియుడితో కలసి జయశ్రీ కుట్ర పన్నింది. స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా.. నర్సోజీని హత్యచేయాలని జయశ్రీ, ప్రియుడు రవీంద్ర పథకం వేశారు. రవీంద్ర స్నేహితులైన మహదేవాపురం గ్రామానికి చెందిన గుండపోగుల రాజేష్, బసాపురం గ్రామానికి చెందిన కాలె వెంకటరమణ, నక్క చిన్న నరసింహులు, నల్లబోతుల వెంకటేశ్వర్లు, పెద్దకొట్టాలకు చెందిన జజ్జం నాగేంద్రకు విషయం చెప్పి హత్యకు కుట్ర పన్నారు. ఈనెల 4వ తేదీ సాయంత్రం అయ్యలూరిమెట్ట సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్లో విధులు ముగించుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా నర్సోజీ తలపై వెనుక నుంచి గొడ్డలితో దాడి చేశారు. ప్రాణాలు దక్కించుకునేందుకు నర్సోజీ పారిపోతుండగా గొడ్డలితో తలపై నరికి హత్య చేసి నిందితులు పరారయ్యారు. మృతుడి తల్లి రామబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నంద్యాల తాలూకా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపెట్టింది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి వారి నుంచి గొడ్డలిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. అడిషనల్ ఎస్పీ వెంకటరాముడు పర్యవేక్షణలో డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సీఐ దస్తగిరిబాబు, ఎస్ఐ నాగరాజు, సిబ్బంది చాకచక్యంగా నిందితులను పట్టుకోవటంతో ఎస్పీ వారిని అభినందించారు. -
చెల్లెలితో వివాహేతర సంబంధం.. పరువు పోయిందని భావించి
పులివెందుల : వివాహేతర సంబంధంతోనే నాగరాజు హత్య జరిగిందని జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఆదివారం పులివెందులలోని పోలీస్‌స్టేషన్‌లో ఆయన నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన లింగాల మండలం అంబకపల్లె గ్రామంలో చింతకాయల నాగరాజు తన మోటారు సైకిల్లో ఇంటి వద్ద నుంచి టమాట తోట వద్దకు వెళ్లగా.. అక్కడ అతని కోసం కాపుకాచి ఉన్న వారు వేటకొడవళ్లు, గొడ్డలితో దాడి చేసి హతమార్చారని తెలిపారు. ఈ హత్యలో బొర్రా చెన్నకేశవులు, బొర్రా చందు, బొర్రా చెన్నకృష్ణ, బొర్రా చండ్రాయుడు, బొర్రా గంగన్న, బొర్రా గోపాల్‌లకు ప్రమేయం ఉందన్నారు. ఈ హత్యకు ముఖ్య కారణం గతంలోనే నాగరాజుకు వివాహమై భార్యతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారని, అయితే ఆయన 5 ఏళ్ల నుంచి బొర్రా చెన్నకేశవుల చెల్లెలితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడన్నారు. 2018లో నాగరాజు పులివెందులలో నివాసం ఉన్న సమయంలో బొర్రా చెన్నకేశవులు, అతని తమ్ముడు బొర్రా చందులు నాగరాజు ఇంటి వద్దకు వెళ్లి తమ చెల్లెలి విషయం అడుగగా ఆయన వారిపై వేటకొడవలితో దాడిచేయడం జరిగిందన్నారు. అప్పట్లో నాగరాజుపై ఆ విషయానికి సంబంధించి పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందన్నారు. ఆ కేసుకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన సాక్ష్యం చెప్పాలని హైదరాబాదులో ఉన్న తమ చెల్లెలిని అడుగగా, తాను నాగరాజును పెళ్లి చేసుకున్నానని, ప్రస్తుతం 8 నెలల గర్భవతినని నాగరాజుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు తిరస్కరించిందన్నారు. దీంతో కోపోద్రేక్తులైన బొర్రా చెన్నకేశవుల కుటుంబ సభ్యులు గ్రామంలో తమ పరువు పోయిందని, దీనికంతటికి కారణం నాగరాజుగా భావించి అతనిని చంపేందుకు నిర్ణయించుకున్నారన్నారు. అందులో భాగంగా ఈ నెల 8వ తేదీన టమాట తోట వద్దకు వచ్చిన నాగరాజును నరికి చంపారని తెలిపారు. కేవలం వివాహేతర సంబంధంతోనే ఈ హత్య జరిగిందని, దీనిలో ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేదని ఆయన వివరించారు. మీడియా సమావేశంలో సీఐ మద్దిలేటి, లింగాల, తొండూరు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్త చింతకాయల నాగరాజు హత్యపై ఈనాడు తప్పుడు కథనాలు రాసింది. చంద్రబాబు పర్యటనలో బాణాసంచ కాల్చడం వల్లనే టమాటా తోటలో కాపుకాసి వేట కోడవళ్లతో దాడికి పాల్పడినట్లు దుష్ప్రచారం చేసింది. అయితే పోలీసులు ఈ వాదనను తోసిపుచ్చారు. : వివాహేతర సంబంధంతోనే నాగరాజు హత్య జరిగిందని జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు తెలిపారు -
వివాహేతర సంబంధం.. ప్రియుడితో సుకన్య పరార్
తమిళనాడు: కళాశాల విద్యార్థితో యువతి పరారైంది. దీంతో విద్యార్థి తండ్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణగిరి జిల్లా రాయకోట సమీపం మొల్లంపట్టి గ్రామానికి చెందిన గోవిందన్(55)కు భార్య సాలమ్మాళ్ (48), కుమారుడు తమిళ్‌సెల్వన్ (21), కుమార్తె మంజుల ఉన్నారు. తమిళసెల్వన్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. ఇతను అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల ప్లస్–1 విద్యార్థిని ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు రెండు కుటుంబాలు వ్యతిరేకం తెలుపుతారని తెలిసి తమిళ్ సెల్వన్, అమ్మాయి కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాలిక తల్లిదండ్రులు డెంకణికోట్టైలోని ఆల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక బంధువులు గత 5వ తేదీన తమిళసెల్వన్ ఇంటికి వెళ్లి అతని తండ్రి గోవిందన్, తల్లి సాలమ్మల్పై దాడి చేసి చంపేస్తామని బెదిరించారు. ఇంటిని కూడా ధ్వంసం చేశారు. దీంతో భయాందోళనకు గురైన గోవిందన్, అతని భార్య సాలమ్మల్ గత 7వ తేదీన ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు. స్థానికులు వారిని కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గోవిందన్ ఆదివారం ఉదయం మృతి చెందాడు. అనంతరం బాలిక బంధువులు ముత్తు, కుమార్, పెరుమాళ్ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన అమ్మాయి, తమిళసెల్వన్ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు. ప్రియుడితో పరార్ ఇంటి పట్టా, నగలు తీసుకుని వివాహిత ప్రియుడితో కలిసి పరారైంది. తంజావూరు సమీపంలోని వాయలూరు సారపల్లం గ్రామానికి చెందిన రాజసెల్వం (45)కు భార్య సుకన్య (33), ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ స్థితిలో శనివారం రాజసెల్వం తంజావూరు ఎస్పీ ఆశిష్ రావతికి ఫిర్యాదు చేశాడు. అందులో తమ వీధికి చెందిన ఓ యువకుడు తన భార్య సుకన్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిపాడు. తాను వారిని చాలాసార్లు మందలించానని, వారు సంబంధాన్ని వదలలేదని వెల్లడించాడు. ఈ స్థితిలో 4వ తేదీన ఆ యువకుడు తన భార్యను, తన చివరి బిడ్డను తీసుకుని వెళ్లిపోయాడని తెలిపాడు. నగలు, ఇంటి పట్టాను తీసుకుని వెళ్లాడు. యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
ఖమ్మం: వివాహేతర సంబంధం విషయం బయటపడడంతో మందలిస్తున్న భర్తను అడ్డు తొలగించేందుకు ఓ మహిళ తన సన్నిహితుడితో హత్య చేయించింది. ఈ ఘటనలో సదరు మహిళతో పాటు నిందితుడు, వీరికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సత్తుపల్లి సీఐ మోహన్‌బాబు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం లింగగూడెంకు చెందిన చిమట కేశవరావు– సత్యవతి భార్యాభర్తలు. ఇందులో సత్యవతికి అదే గ్రామానికి చెందిన చిమట రాముతో ఏడాదిన్నర క్రితం ఏర్పడిన పరిచయం వివాహేతేర సంబంధానికి దారి తీసింది. వీరి నడుమ ఏలూరు జిల్లా చాట్రాయి మండలం మంకోలుకు చెందిన గంపా జోజిబాబు మధ్యవర్తిగా సహకరించేవాడు. కొన్నాళ్లకు ఈ విషయం బయటపడడంతో సత్యవతిని కేశవరావు మందలించాడు. ఇది జీర్ణించుకోలేని ఆమె రాముకు చెప్పి తన భర్తను హత్య చేయాలని కోరింది. ఇంతలోనే ఈనెల 1వ తేదీన రాముకు కేశవరావు ఫోన్ చేసి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని మందలించాడు. దీంతో రాము తనను క్షమించాలని కోరడంతో పాటు ఓసారి కలుద్దామని చెప్పాడు. ఈమేరకు లింగగూడెంలోని మర్రిచెట్టు వద్దకు కేశవరావు వచ్చాక తన మోటార్ సైకిల్‌పై తీసుకెళ్తూ ఆయిల్‌పామ్ తోటలో కత్తితో దాడి చేశాడు. అయితే, కేశవరావు ఇంకా ప్రాణాలతో ఉండడంతో ప్లాస్టిక్ కవర్‌ను మెడ, తల చుట్టూ కట్టి ఊపిరి ఆడకుండా చేయడంతో కన్నుమూశాడు. అనంతరం మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై సరిహద్దు సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం శివార్లకు తీసుకొచ్చి ఆయిల్‌పామ్ తోటలో వేసి వెళ్లిపోయాడు. కాగా, మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఎలాగైనా పట్టుబడతాననే భయంతో రాము గ్రామ పెద్దలకు చెప్పి సత్తుపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అనంతరం ఆయన ఇచ్చిన సమాచారంతో శనివారం లింగగూడెం వెళ్లి సత్యవతిని, మంకోలు వెళ్లి గంప జోజిబాబుని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మోహన్‌బాబు వెల్లడించారు. -
భార్యతో వివాహేతర సంబంధం.. కత్తితో నరికి..చెరువులో పడేసి..
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని శివునిపల్లికి చెందిన తీగల కరుణాకర్(35) దారుణహత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన చిక్కుడు నాగరాజు.. కరుణాకర్‌ను కత్తితో దారుణంగా చంపి శివునిపల్లి శివారు నమిలిగొండ చెరువులో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ శ్రీనివాసరావు కథనం ప్రకారం శివునిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన తీగల యోబు, మరియ దంపతుల రెండో కుమారుడు కరుణాకర్ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అదేవిధంగా శివునిపల్లికి చెందిన చిక్కుడు నాగరాజు హమాలీ పనిచేస్తుంటాడు. నమిలిగొండ శివారులో వారివురి వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. ఈ క్రమంలో కరుణాకర్‌కు, నాగరాజు భార్యకు మధ్య పరిచయం ఏర్పడింది. ఈనెల 25న హైదరాబాద్‌లో ఉన్న కరుణాకర్.. నాగరాజు భార్య ఫోన్‌కు ఫోన్ చేయగా ఇంట్లో ఉన్న ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఇదీ గమనించని కరుణాకర్ తాను సాయంత్రం వస్తున్నానని, కలుస్తామని చెప్పగా నాగరాజు కోపంతో రగిలిపోయాడు. ఈ విషయంపై ఏమి తెలియనట్లు బయటకు వెళ్లాడు. అనంతరం సాయంత్రం ఆమెకు మరోసారి ఫోన్ రావడంతో తమ వ్యవసాయ భూముల సమీపంలో ఉన్న మామిడితోట వద్దకు వెళ్లింది. గమనించిన నాగరాజు కత్తి తీసుకుని మామిడితోటకు వెళ్లాడు. అక్కడ తన భార్యతో కరుణాకర్ మాట్లాడుతున్న విషయం గుర్తించి ఒక్కసారిగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని కచ్చువల, సంచిలో కట్టి నమిలిగొండ చెరువులో పడేసి వెళ్లాడు. ఈనెల 25వ తేదీ రాత్రి నుంచి కరుణాకర్ కనిపించకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇళ్లలో వెతికారు. అతడి ఆచూకీ కోసం పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో నిందితుడు స్వయంగా మంగళవారం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి సీఐలు రాఘవేందర్, శ్రీనివాస్‌రెడ్డి.. చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటికి తీయించారు. దీంతో మృతుడి భార్య, సోదరులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాసరావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. దీనిపై మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేందర్ తెలిపారు. కాగా, హత్య ఒక్కరే చేశారా.. మరెవరైనా ఉన్నారా? హత్యకు వివాహేతర సంబంధమే కారణమా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే పోలీసులు కోణాల్లో విచారణ చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. చులకనగా చూస్తోందని
ఏలూరు టౌన్: ఏలూరు వన్‌టౌన్ దక్షిణపు వీధిలోని ఒక ఇంట్లో వివాహిత దారుణ హత్యకు గురైంది. మహిళను ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. అనంతరం అతను నూజివీడులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియురాలిని హత్యచేసి తరువాత రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మహిళ హత్య సమాచారం అందుకున్న ఏలూరు వన్‌టౌన్ ఎస్ఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు కూడా సంఽఘటనా స్థలానికి వెళ్ళి హత్య ఘటనపై ఆరా తీశారు. దిమ్మిట సత్యనారాయణ(35)కు కొంత కాలం క్రితం వివాహం కాగా, భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. అతను పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవించేవాడు. శనివారపుపేట గాలిగోపురం ప్రాంతానికి చెందిన ఉడత సుజాత (29)తో పరిచయం ఏర్పడింది. సుజాత భర్త లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సుజాత, సత్యనారాయణ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల సుజాత తనను సరిగా పట్టించుకోవటం లేదని, చులకనగా చూస్తుందంటూ సత్యనారాయణ కక్ష పెంచుకున్నాడు. సుజాతను తన ఇంటికి రప్పించుకుని.. చాకుతో గొంతుకోసి ఆదివారం రాత్రి హత్య చేసి ఉంటాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందని ఏలూరు డీఎస్పీ తెలిపారు. చులకనగా చూడడం వల్లే.. ముందుగా సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నూజివీడు రైల్వే బ్రిడ్జి వద్ద రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు అతడి ప్యాంట్ జేబును పరిశీలించగా తన అడ్రస్‌తో కూడిన ఉత్తరం, సూసైడ్ నోట్ లభించాయి. రైల్వే పోలీసులు ఏలూరులోని సత్యనారాయణ బంధువులకు ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం ఇచ్చారు. అనుమానంతో బంధువులు ఇంటికి వెళ్లి చూడగా తాళాలు వేసి ఉన్నాయి. తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడడంతో మహిళ హత్యకు విషయం బయటపడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్ళి విచారణ చేశారు. తనను చులకనగా చూడడం, సరిగ్గా పట్టించుకోకపోవటంతో హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో ఉందని తెలుస్తోంది. వన్‌టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ప్రభుత్వ ఉపాధ్యాయుడితో భార్యకు వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య
కరీంనగర్ రూరల్: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే మానసిక ఆందోళనగురైన ఓ భర్త పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌రూరల్ పోలీసుల కథనంమేరకు కరీంనగర్ మండలం చామనపల్లికి చెందిన భూసారపు అనిల్‌కుమార్(30)కు పదేళ్లక్రితం పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి మండలం కనగర్తికి చెందిన సౌజన్యతో వివాహమైంది. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. సౌజన్యకు వివాహానికి ముందునుంచే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడితో సంబంధం ఉందనే కారణంతో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. మంచిగా ఉంటానని పంచాయితీ పెద్దలకు సౌజన్య చెప్పినప్పటికీ.. వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఎన్నిసార్లు చెప్పిన తన భార్య వినకపోవడంతో మానసిక ఆందోళనకు గురైన అనిల్ ఈనెల 6న ఇంట్లో గడ్డి మందు తాగిపడిపోయాడు. గమనించిన తల్లి పుష్పలత, భార్య సౌజన్యలు వెంటనే ఆటోలో చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మరుసటి రోజు ఇంటికి వెళ్లిన అనిల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈనెల 9న కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే భార్య వివాహే తర సంబంధమే తన చావుకు కారణమని సెల్ఫీ వీడియో తీసి పెద్దబావ శ్రీనివాస్‌కు పంపించాడు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 2గంటలకు మృతిచెందాడు. తల్లి పుష్పలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. కృష్ణగిరి జిల్లా సూలగిరి సమీపం పెరిగై కులదాసపురం ప్రాంతానికి చెందిన జ్యోతి (36). ఈమె భర్త కేశవమూర్తి మృతిచెందాడు. జ్యోతి కుమార్తెతో కలిసి ఉంటోంది. జ్యోతి అంగన్వాడీ ఉద్యోగి. ఈ క్రమంలో మహారాజపురం ప్రాంతానికి చెందిన వెంకటేష్ (35)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం జ్యోతి అక్క కుమారుడు హరీష్‌కు తెలిసింది. దీంతో హరీష్ జ్యోతి, వెంకటేష్‌లను మందలించాడు. కానీ ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈక్రమంలో సోమవారం సాయంత్రం జ్యోతి ఇంటికి హరీష్ వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ జ్యోతి, వెంకటేష్ ఒంటిరిగా ఉండడం చూసి హరీష్ గొడవపడ్డాడు. వెంకటేష్, హరీష్ ఘర్షణ పడ్డారు. ఘర్షణలో గాయపడిన వెంకటేష్‌ను హొసూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పేరిగై పోలీసులు అక్కడికి వెళ్లి వెంకటేష్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హరీష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. -
ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. బోనాల పండుగకు రప్పించి..
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో ఇటీవల వెలుగుచూసిన ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన బోర్వెల్ డ్రిల్లర్ సల్ల సైదులు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సఖ్యతకు అడ్డొస్తున్నాడన్న కారణంతో హతుడి ఇల్లాలు, ఆమె ప్రియుడు, మరో పాత్రధారుడితో కలసి ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను సోమవారం డీసీపీ రాజేష్ చంద్ర భువనగిరిలో మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన సల్ల సైదులుకు శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన ధనలక్ష్మితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నాయి.సైదులు బోర్‌వెల్‌పై డ్రిల్లర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏడాది క్రితం గ్రామానికి వచ్చి కట్టెకోత పనికి వెళ్తున్నాడు. మూడేళ్లుగా వివాహేతర సంబంధం సైదులు బోర్వెల్ డ్రిల్లర్‌గా పనిచేస్తున్న క్రమంలో నెలల తరబడి విధి నిర్వహణలో ఉంటూ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. దీంతో ధనమ్మ తరచూ గురజాలలోని పుట్టింటి వద్దే ఎక్కువగా ఉంటుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎడ్ల నవీన్‌తో మూడేళ్ల క్రితం ధనలక్షి్మకి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ధనలక్ష్మి తరచూ పుట్టింటికి వెళ్తుండడంతో సైదులు అనుమానించాడు. దీంతో దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడి కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. విషయం పెద్దమనుషుల వద్దకు చేరడంతో సర్దిచెప్పగా ప్రస్తుతం సజావుగానే కాపురం సాగుతోంది. బోనాల పండుగకు రప్పించి.. ధనలక్షి్మని పుట్టింటికి వెళ్లనీయకుండా తమ సఖ్యతకు సైదులు అడ్డొస్తున్నాడని ఎడ్ల నవీన్ కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అంతమొందించాలని ప్రియురాలు ధనలక్షి్మతో కలసి పథకం రచించాడు. ఈ నేపథ్యంలోనే సైదులు, ధనలక్ష్మి, పిల్ల లను తీసుకుని ఈ నెల 10వ తేదీన గురజాలలోని పుట్టింటికి వచ్చారు. అనుకున్న పథకం ప్రకారం సైదులు హత్య చేసేందుకు నవీన్ తన సమీప బంధువు స్వామి సహాయం కోరాడు. అందుకు అతడు ఒప్పుకోవడంతో ఈ నెల 11వ తేదీన ఇద్దరూ కలసి ధనలక్ష్మి పుట్టింటికి వచ్చారు. అనంతరం మద్యం తాగేందుకు సైదులును వెంటబెట్టుకుని ఆటోలో అమ్మనబోలుకు వెళ్లారు. అక్కడ నవీన్, స్వామి, సైదులు మద్యం తాగారు. పూటుగా మద్యం తాగిన సైదులు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం నవీన్, స్వామి ఇద్దరూ కలసి ఆటో స్టార్ట్ చేసేందుకు ఉపయోగించే తాడుతో సైదులు మెడకు ఉరి బిగించారు. అనంతరం సైదులు ఆటోలో వేసుకుని మోత్కూరు మండలం పొడిచేడులోని మూసీ నది బ్రిడ్జి వద్ద మట్టిరోడ్డులోకి వెళ్లి చనిపోయాడో లేదోనని మరో సారి తాడుతో ఉరి బిగించి ఘాతుకానికి ఒడిగట్టారు. ఆపై మృతదేహాన్ని పొడిచేడు లోని మూసీ నది ఒడ్డున గంగదేవమ్మ ఆలయం సమీపంలో పడవేసి వెళ్లిపోయారు. నిందితుడిని గుర్తించిన డాగ్‌స్కా్వడ్ మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలోని మూసీ నది ఒడ్డున వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సైదులు మెడకు రెండు చోట్ల తాడుతో ఉరిబిగించినట్లు ఆనవాళ్లు ఉండడంతో హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అప్పటికే విష యం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన హ తుడి తల్లి గురజాలకు చెందిన నవీన్‌పై అనుమానం వ్యక్తం చేసింది. ఘటనా స్థలంలో ఆటో గుర్తులను గుర్తించిన పోలీసులు పోలీస్ డాగ్‌స్వా్కడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. అయితే, అప్పటికే నవీన్ తన ఆటోలో ధనలక్ష్మి తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఆటోలో ఘటనా స్థలానికి తీసుకువచ్చాడు. దీంతో పోలీస్ జాగిలం సైదులు మృతదేహాన్ని తీసుకువచ్చిన ఆటో చుట్టూ తిరగడంతో పాటు నవీన్‌ను గుర్తించింది. అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. మిగతా ఇద్దరు నిందితులు హైదరాబా ద్‌కు పారిపోతుండగా అనాజిపురం వద్ద పట్టుకున్నట్లు డీసీపీ వివరించారు. వారి వద్ద హత్యకు ఉపయోగించిన తాడు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో పోలీస్ డాగ్‌స్కా్వడ్ కీలకంగా వ్యవహరించిందని డీసీపీ చెప్పారు. సమావేశంలో అడిషినల్ డీసీపీ రవికుమార్, ఏసీపీ మొగులయ్య, రామన్నపేట సీఐ మోతీరాం, మోత్కూర్ ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. -
ప్రియున్ని వదులుకోలేని పావని.. చపాతీలో నిద్రమాత్రలు కలిపి
కర్ణాటక: ప్రేమికునితో సంతోషానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్యను చిక్కమగళూరు జిల్లా యగటి పోలీసులు అరెస్ట్ చేశారు. కడూరు తాలూకా హనుమనహళ్లికి చెందిన పావనికి నవీన్ (29)తో ఆరేళ్ల కిందట పెళ్లయింది. వీరికి నాలుగేళ్ల చిన్నారి ఉంది. ఇటీవల భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త గొడవ పడగా పెద్దలు రాజీ పంచాయతీ చేశారు. ప్రియున్ని వదులుకోలేని పావని.. చపాతీల్లో నిద్రమాత్రలు కలిపి భర్తకు వడ్డించింది. భర్త తిని నిద్రలోకి వెళ్లగానే ప్రియునితో కలిసి హత్య చేసి మూడు కిలోమీటర్ల దూరంలో పడేసింది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడింది. అయితే ఇది ఆత్మహత్య కాదని తెలిసి పావనిని విచారించగా నిజం చెప్పింది. ఇద్దరినీ అరెస్టు చేశారు. -
పని మనిషి ఆత్మహత్య.. పదేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం
హైదరాబాద్: ల్యాంకోహిల్స్‌లో 21వ అంతస్తు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి కృష్ణ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదుచేశారు. యువతి బలవన్మరణానికి వేధింపులే కారణమని నిర్ధారించారు. పోలీసుల దర్యాప్తులో వ్యాపారి, కన్నడ నటుడు అయిన ఓ వ్యక్తి సాగిస్తున్న చీకటి కార్యకలాపాలు, దారుణాలు బయటపడుతున్నాయి. స్థానికులు, పోలీసుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచంద్రావు కొన్ని కన్నడ సినిమాల్లో నటించాడు. పదేళ్ల క్రితం నగరానికి చేరి బంజారాహిల్స్ కేంద్రంగా హోం థియేటర్ల వ్యాపారం చేస్తున్నాడు. మణికొండ ల్యాంకోహిల్స్ అపార్ట్మెంట్స్ 15 ఎల్‌హెచ్ బ్లాక్‌లో భార్య, కుమార్తెతో ఉంటున్నాడు. కుమార్తె కేర్‌టేకర్‌గా పదేళ్లుగా కాకినాడకు చెందిన బిందుశ్రీ పనిచేస్తోంది. అక్కడే తనకు కేటాయించిన గదిలో ఉంటోంది. పదేళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం . కొద్దిరోజులుగా వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఐదురోజుల క్రితం పూర్ణచంద్రావు కుమార్తెను సాకేందుకు మరో యువతిని ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో శుక్రవారం రాత్రి గొడవలు తారాస్థాయికి చేరాయి. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ పరస్పరం వాదించుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. ఆ తరువాత బిందుశ్రీపై 21వఅంతస్తుపై నుంచి కిందకు దూకింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది రాయదుర్గం పోలీసులకు సమాచారమిచ్చారు. పనిమనిషి ఆత్మహత్య విషయం పూర్ణచంద్రావుకు తెలియజేసేందుకు అతడి ఫ్లాట్‌కు చేరగా.. అరగంట తర్వాత తలుపులు తీయటంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. వేధింపుల వల్లేనా? కన్నడ సినిమాల్లో నటించానంటూ పూర్ణచంద్రావు ప్రచారం చేసుకునేవాడు. సినీపరిశ్రమలో తన పరిచయాలతో అవకాశాలు ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు ఆశచూపేవాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. తరచూ ఇదే విధంగా కొంతమంది మహిళలు, యువతులు వచ్చిపోవటం, అనుమానాస్పదంగా తిరగటం గమనించినట్టు అదే అపార్ట్మెంట్లో ఉంటున్న కొందరు మీడియాకు తెలిపారు. ఘటన జరగడానికి మూడ్రోజుల ముందు నలుగురు యువతులు అతడి ఫ్లాట్‌కు వచ్చారని వివరించారు. అనుమానాస్పద మరణంగా తొలుత భావించిన పోలీసులు వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు నిర్ధారించారు. పూర్ణచంద్రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
దూరంగా భర్త.. మరో వ్యక్తితో రెండేళ్లుగా భార్య వివాహేతర సంబంధం..
తూర్పు గోదావరి: వివాహేతర సంబంధం నిండు ప్రాణాన్ని బలికొంది. మండలంలోని కొంతంగి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్తిపాడు సీఐ కె.కిషోర్‌బాబు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు మండలం రాచపల్లికి చెందిన పగడం దుర్గాప్రసాద్(21)కు, అదే గ్రామానికి చెందిన మహిళతో రెండేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉంది. ఉపాధి నిమిత్తం భర్త దూర ప్రాంతంలో ఉండటంతో ఆ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కొంతంగిలోని పుట్టింటికి వచ్చింది. ప్రసాద్ కూడా రాచపల్లి నుంచి ఆదివారం రాత్రి కొంతంగి వచ్చాడు. వివాహేతర సంబంధం విషయంలో అతడు అల్లరి చేయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రసాద్‌ను మేడ పైకి తీసుకువెళ్లి, కళ్లల్లో కారం కొట్టి, హతమార్చారని అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. సీఐ కిషోర్‌బాబు, అన్నవరం ఎస్సై వి.కిషోర్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హతుడికి తల్లి, పెళ్లి కావలసిన అన్న, చెల్లెలు ఉన్నారు. -
నా భార్యతో సమీర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అందుకే..
జగిత్యాల: రెండ్రోజుల క్రితం పట్టణ శివారులోని డీ–40 కాలువలో అనుమానాస్పదంగా మృతిచెందిన షేక్ సమీర్ (22) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆదివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ప్రవీణ్ కుమార్ నిందితుల వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బీముని దుబ్బలో నివసిస్తున్న షేక్ సమీర్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అంబేద్కర్ నగర్‌కు చెందిన కండ్లె ఈశ్వర్ (23), నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తన స్నేహితుడు ఉట్నూర్ బాలా శంకర్ ఈనెల 2న రాత్రి సమీర్‌ను డి–40 కాలువ వద్దకు పిలిపించుకొని ముగ్గురు మద్యం తాగారు. ఈ క్రమంలో కండ్లె ఈశ్వర్, సమీర్ గొడవపడగా అప్పటికే పథకం ప్రకారం తమతో తెచ్చుకున్న నైలాన్ తాడును ఉట్నూర్ బాలా శంకర్, ఈశ్వర్లు సమీర్ మెడకు చుట్టి హత్యచేశారు. మృతదేహంతో పాటు ద్విచక్రవాహనాన్ని కాలువలో పడేశారు. రెండ్రోజుల క్రితం డీ–40 కాలువలో సమీర్ మృతదేహం లభ్యంకాగా మృతుడి బావ అమీర్ కండ్లె ఈశ్వర్‌పై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కల్లూర్ రోడ్డులో ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తన భార్యతో సమీర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. అందుకు తన స్నేహితుడు బాలా శంకర్ సాయం తీసుకున్నాడని, రూ.40 వేలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈశ్వర్ తెలిపాడని సీఐ వెల్లడించారు. నిందితుల వద్ద రెండు సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలు, హత్యకు ఉపయోగించిన నైలాన్ తాడును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు చెప్పారు. ఎస్సై కిరణ్ కుమార్, కానిస్టేబుళ్లను సీఐ అభినందించారు. -
వివాహేతర సంబంధం: భర్తను వదిలి రమ్మంటే రాలేదని..
కామారెడ్డి: వివాహేతర సంబంధానికి ఒప్పుకోలేదని మహిళపై నీలేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఆదివారం నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. రెండో టౌన్ ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు.. నగరంలోని కసాబ్‌గల్లీకి చెందిన స్వాతి, భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. స్వాతికి నీలేష్ అనే వ్యక్తితో గతంలో వివాహేతర సంబంధం ఉండేది. వారి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. స్వాతిని భర్తను వదిలి తన వద్దకు రావాలని తరుచూ వేధించేవాడు. దీనికి మహిళ ఒప్పుకోకపోవడంతో, ఆదివారం ఉదయం కసాబ్‌గల్లీలో ఒంటరిగా ఉన్న స్వాతిపై, నీలేష్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తితో నాలుగు పోట్లు పొడిచాడు. స్థానికులు అక్కడికి చేరుకోగానే నీలేష్ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని స్థానికులు చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిలేష్ మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందినవాడని పోలీసులు తెలిపారు. -
పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం.. ప్రియుడి స్కూటీపై పరార్
ఏలూరు టౌన్ : ప్రియుడితో అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ఓ వివాహిత నిద్రిస్తున్న భర్తను చాకుతో మెడపై విచక్షణారహితంగా పొడిచి హత్యచేయించింది. ఈ హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటలలోపే ఛేదించి నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ మేరకు శనివారం ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ ఈ.శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కోటాల గ్రామానికి చెందిన కురిపాటి చంద్రశేఖర్‌కు 11 ఏళ్ల క్రితం భువనేశ్వరితో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు ఉంగుటూరు మండలం నారాయణపురం వైఎస్సార్ కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ నారాయణపురం టైల్స్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. తాడేపల్లిగూడెం కోతిబోమ్మసెంటర్ ప్రాంతానికి చెందిన గొర్ల సూర్యనారాయణ వీరు నివాసం ఉంటున్న ఇంటిపక్కన తాపీ పని నిమిత్తం వచ్చాడు. భువనేశ్వరికి తాపీ పనిచేస్తున్న గొర్ల సూర్యనారాయణతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది. వీరి విషయం భర్త చంద్రశేఖర్‌కు తెలియడంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో భర్త అడ్డు తొలగించుకునేందుకు హత్యకు పథక రచన చేశారు. సూర్యనారాయణ తాడేపల్లిగూడెంలో ఒక చాకును కొనుగోలు చేసి స్కూటీలో పెట్టుకుని, భువనేశ్వరి ఇంటికి వచ్చాడు. ఈనెల 3వ తేదీ రాత్రి చంద్రశేఖర్ ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో భువనేశ్వరి, సూర్యనారాయణ చాకుతో దాడి చేశారు. పీక, మెడమీద విచక్షణారహితంగా పొడవటంతో చంద్రశేఖర్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఇంటిలోనే నిద్రిస్త్తున్న పిల్లలను వదిలేసి భువనేశ్వరి, సూర్యనారాయణ స్కూటీపై పరారయ్యారు. ఈ హత్య కేసును క్రైమ్ నెంబర్ 168/2023 యూ/ఎస్ 302, 449, 120(బీ), రెడ్‌విత్ 34 ఐపీసీగా నమోదు చేశారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో నిడమర్రు సీఐ ఎంవీ సుభాష్, చేబ్రోలు ఎస్సై కె.స్వామి, నిడమర్రు ఎస్సై ఆర్.శ్రీను దర్యాప్తు చేపట్టారు. నిందితులను 24 గంటల్లోనే అరెస్టు చేసి న్యాయస్థానం ముందు ఉంచారు. హత్య కేసును చేధించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అభినందించారు. -
మై వైఫ్ .. శివాని గురించి రమేశ్ చివరిమాటలు
సాక్షి, క్రైమ్: విశాఖలో వివాహేతర సంబంధంతో భర్త రమేశ్‌ను ప్రియుడితోపాటు హత్య చేసిన ఉదంతంలో సంచలన వీడియోలు బయటకు వచ్చాయి. భర్తను హత్యకు ముందు శివాని చేసిన పనికి పోలీసులు సైతం షాక్ తిన్నారు. రమేశ్‌కు మద్యం తాగించి.. ఆ సమయంలో తన గురించి పొగిడినదంతా ఆమె వీడియోలు తీయించుకుంది. కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు లో కీలక వీడియోలు సాక్షి టివి చేతికి అందాయి. రమేశ్‌ని చంపే ముందూ.. తన మీద అనుమానం రాకుండా భర్తతో ప్రేమగా ఉన్నట్టు ఆమె వీడియోలు రికార్డు చేసింది. భర్తకి మటన్ వండి పెట్టీ.. మందు తాగించి.. ‘నా భార్య మంచిది’ అని రమేశ్‌తో చెప్పించింది శివాని. ఆపై మద్యం మత్తులో జోగుతున్న భర్తను మంచంపై పడుకోబెట్టినదంతా కూడా రికార్డు అయ్యింది. మా ఆవిడ చాలా తెలివైంది. గైడెన్స్ ఇస్తే ఏదైనా సాధిస్తుంది. నా వైఫ్.. మై లైఫ్. చాలా ధైర్యవంతురాలు. నేను ఉన్నంత వరకు ధైర్యం చూపిస్తుంది. నేను ఎప్పుడు ఉంటానో.. ఎప్పుడు పోతానో తెలియదు. నేను పోయాక కూడా అదే ధైర్యం చూపించాలి. నా వైఫ్ బెస్ట్ అంటూ మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి. భర్త హత్య తర్వాత గుండెపోటుతో చనిపోయాడని నాటకం ఆడే క్రమంలో.. తనపై ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ పని చేసింది శివాని. ఆమె ఫోన్ నుంచి వీడియోలు సేకరించిన పోలీసులు.. నేరస్తురాలి తెలివితేటలు చూసి షాక్ తిన్నారు. 2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ బర్రి రమేష్(35). 2012లో శివాని(జ్యోతి)తో వివాహం జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య శివాని(శివజ్యోతి) పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్‌తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్‌కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్‌ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ అఘాయిత్యంలో శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మకు కూడా భాగం అయ్యిందనే అనుమానాలు ఉన్నాయి. పైడమ్మ వల్లే తనకు రామారావు పరిచయం అయ్యాడని శివాని పోలీసులకు చెప్పింది. అంతేకాదు.. కాన్ఫరెన్స్ కాల్స్‌లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. అయితే తాను అమాయకురాలినని పైడమ్మ వాపోతోంది. -
వైజాగ్ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: కానిస్టేబుల్ రమేష్ మర్డర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పైడమ్మే.. రామారావుతో కలవడానికి కారణమని పోలీసులకు శివాని తెలిపింది. ఫోన్ కాల్ డేటా పరిశీలించిన ఎంవీపీ పోలీసులు.. వందల సార్లు కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. పైడమ్మ, శివాని, రామారావు ముగ్గురం కలిసే బయటకు వెళ్లే వాళ్లమని శివాని చెప్పింది. పైడమ్మాను ఏ4గా చేర్చే అవకాశం ఉంది. తనకు అసలు సంబంధం లేదంటున్నా శివాని అక్క పైడమ్మా.. కావాలనే ఇరికిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. శివాని.. రామారావు ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి పరిచయం చేసిందని పైడమ్మా తెలిపింది. కాన్ఫరెన్స్ కాల్స్‌లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు. పైడమ్మను విచారిస్తున్నారు. ఆమె ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీసుల అదుపులోనే A1 భార్య శివాని, A2 ప్రియుడు రామారావు, A3 నీలా ఉన్నారు. వారిని రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. చదవండి: తహసీల్దార్ వేధింపులు... మహిళా ఉద్యోగి ఆత్మహత్య కాగా, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ మృతి విషయంలో తొలి నుంచి అనుమానిస్తున్నదే జరిగింది. శివజ్యోతి అలియాస్ శివానీయే ఆమె ప్రియుడితో కలిసి తన భర్త రమేష్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. 2009 బ్యాచ్‌కు చెందిన బర్రి రమేష్(35) ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్‌పై విగతజీవిగా ఉన్న రమేష్ ను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్‌తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్‌కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్‌ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. తొలి నుంచి శివానీది నేర స్వభావమే.. రమేష్ భార్య శివానీది తొలి నుంచి నేర స్వభావమే అని సీపీ తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఆమె పలుమార్లు గొడవ పడినట్లు చెప్పారు. ప్రియుడి విషయంలో భార్యను పలుమార్లు రమేష్ మందలించాడని వెల్లడించారు. ఆమె తీరు కారణంగా విసిగిపోయి ఒక దశలో ఇద్దరు కుమార్తెలను తన వద్ద వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని కూడా ఆమెకు చెప్పాడన్నారు. అయితే పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనే ఉద్దేశంతో శివాని రమేష్ హత్యకు కుట్ర పన్నింది. ఈ హత్యలో సహకారానికి శివానీ, ప్రియుడు రామారావు అతని స్నేహితుడు నీలాకు రూ.లక్ష సుపారి కూడా ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. -
టాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం..
విశాఖపట్నం: వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ మృతి విషయంలో తొలి నుంచి అనుమానిస్తున్నదే జరిగింది. శివజ్యోతి అలియాస్ శివానీయే ఆమె ప్రియుడితో కలిసి తన భర్త రమేష్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. 2009 బ్యాచ్‌కు చెందిన బర్రి రమేష్(35) ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్‌పై విగతజీవిగా ఉన్న రమేష్ ను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్‌తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్‌కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్‌ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. తొలి నుంచి శివానీది నేర స్వభావమే.. రమేష్ భార్య శివానీది తొలి నుంచి నేర స్వభావమే అని సీపీ తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఆమె పలుమార్లు గొడవ పడినట్లు చెప్పారు. ప్రియుడి విషయంలో భార్యను పలుమార్లు రమేష్ మందలించాడని వెల్లడించారు. ఆమె తీరు కారణంగా విసిగిపోయి ఒక దశలో ఇద్దరు కుమార్తెలను తన వద్ద వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని కూడా ఆమెకు చెప్పాడన్నారు. అయితే పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనే ఉద్దేశంతో శివాని రమేష్ హత్యకు కుట్ర పన్నింది. ఈ హత్యలో సహకారానికి శివానీ, ప్రియుడు రామారావు అతని స్నేహితుడు నీలాకు రూ.లక్ష సుపారి కూడా ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. -
రమేష్ హత్య కేసును చేధించిన పోలీసులు.. సినిమాను మించిన ట్విస్ట్!
సాక్షి, విశాఖపట్నం: వన్‌టౌన్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ బర్రి రమేష్ మృతికేసును పోలీసులు చేధించారు. రమేష్ మృతి కేసులో అతడి భార్య శివజ్యోతి అలియాస్ శివానినే హంతకురాలిగా పోలీసులు తేల్చారు. ప్రియుడి మోజులో పడి శివాని.. రమేష్‌ను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు విశాఖ నగర కమిషనర్ త్రివిక్రమ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో సీపీ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కానిస్టేబుల్ రమేష్‌ను అతడి భార్య శివాని హత్య చేయించింది. మూడు రోజుల క్రితం రమేష్ అనుమానాస్పదంగా మృతిచెందాడని శివాని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రమేష్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో డెడ్‌బాడీని పోస్టుమార్టంకు పంపించాం. రిపోర్టులో రమేష్.. ఊపిరాడక చనిపోయినట్టు తేలింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో లోతుగా విచారణ చేపట్టాం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా భార్య శివానినే ప్రియుడి కోసం భర్త రమేష్‌ను చంపించింది. మూడు రోజుల క్రితం రమేష్‌తో మద్యం తాగించి వీడియో తీసింది. ఆ తర్వాత రమేష్ పడుకునే వరకు ప్రియుడు రామారావు బయటే ఉన్నాడు. అనంతరం, ఇంట్లోకి వెళ్లిన రామారావు, అతడి స్నేహితుడు రమేష్‌ను దిండుతో నొక్కి చంపాడు. ఆ సమయంలో రమేష్ కాళ్లు కదలకుండా భార్య శివానీ అతడిని పట్టుకుంది. కాగా, రమేష్‌ను చంపేందుకు నీలా అనే వ్యక్తికి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చారు. అయితే.. రమేష్, శివానీ ప్రేమ వ్యవహారంపై గతంలో అనేక గొడవలు జరిగాయి. పిల్లల్ని వదిలి ప్రియుడితో వెళ్లిపోవాలని రమేష్ కోరాడు. కాగా, తమ వ్యవహారానికి రమేష్ అడ్డుగా ఉన్నారని వారిని చంపేశారు. ఇక, శివాని.. రామారావుకు బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర ఇచ్చింది. శివానికి నేర స్వభావం ఉంది. ఆమె తల్లిదండ్రులతో సైతం గొడవలు ఉన్నాయి. ఈ కేసులో ఏ1గా భార్య శివాని, ఏ2గా ప్రియుడు రామారావు, ఏ3గా నీలాను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: యువతిని రూమ్‌కు తీసుకెళ్లి.. కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఫొటోలు.. ఆపై.. -
భార్య వేరొకరితో వివాహేతర సంబంధం.. భార్యను హత్య చేసిన భర్త
అనకాపల్లి: భార్యపై అనుమానంతో కోపోద్రిక్తుడైన భర్త ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఆపై పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన మంగళవారం మండలంలోని తోటాడలో చోటు చేసుకుంది. గ్రామంలో దళితవాడకు చెందిన కొత్తలంక నూకప్పారావు స్థానికంగా సీలింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి పదేళ్ల క్రితం గొలుగొండ మండలం గుండపాలకు చెందిన దీనమ్మ(26)తో వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. పిల్లలు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ విషయమై భార్యతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల్లో వేరే కాపురం ఉంటూ వచ్చారు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో అసహనానికి గురయ్యాడు. ఇంతలో ఇరువురి మధ్య గొడవలు పెరిగిపోవడంతో ఈ నెల 23న పెద్దల వద్ద పంచాయితీ పెట్టించారు. దీనిలో భాగంగా ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తమ పిల్లలు బడికి వెళ్లిపోయాక మరోసారి ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో భర్త కోపోద్రిక్తుడై భార్య మెడకు చున్నీ బిగించాడు. ఈ పెనుగులాటలో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. అతడు నేరుగా అనకాపల్లి దిశ పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న యలమంచిలి రూరల్ సీఐ గఫూర్ నూకప్పారావును అదుపులోకి తీసుకున్నారు. వీఆర్వో సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గఫూర్ తెలిపారు. నిందితుడి ఇంటిని క్లూస్ టీమ్ పరిశీలించింది. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఉదయం ఎంతో సరదాగా స్కూల్‌కు వెళ్లిన పిల్లలు తమ తల్లికి జరిగిన ఘోరాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి లేని పిల్లలు ఎలా బతుకుతారో అని స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Amalapuram Malleshwari Death Case: అక్రమ సంబంధం.. భర్తకు అనుమానం.. భార్య హతం
అమలాపురం టౌన్: స్థానిక వనచర్ల వీధికి చెందిన శ్రీపతి మల్లేశ్వరి (24)ది హత్యేనని పోలీసు దర్యాప్తులో తేలింది. రెండు వారాలుగా సాగుతున్న ఈ కేసు చిక్కుముడి చివరికి వీడింది. డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ డి.దుర్గాశేఖరరెడ్డి లోతుగా దర్యాప్తు చేసి హత్య కోణాన్ని వెలికి తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం డీఎస్పీ అంబికా ప్రసాద్ వివరించారు. ఆయన కథనం మేరకు.. నాగబాబు, మల్లేశ్వరిలకు గతంలో వేర్వేరుగా పెళ్లిళ్లు జరిగాయి. నాగబాబు భార్యను, మల్లేశ్వరి భర్తను వదిలేసి వీరిద్దరూ స్థానిక వనచర్ల వీధిలో సహ జీవనం సాగించారు. వీరికి రెండున్నరేళ్ల కుమార్తె కూడా ఉంది. మల్లేశ్వరి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో ఆమెను నాగబాబు తరచూ మద్యం తాగి వేధించేవాడు. ఐదేళ్ల కిందట అమలాపురంలో నాగబాబు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నప్పుడు అందులో పనిచేసే ఓ వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉందన్నది నాగబాబు అనుమానం. హత్య చేసిందిలా.. ఈ నెల 7వ తేదీ రాత్రి నుంచి మల్లేశ్వరి కనిపించకపోవడంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలుత అమలాపురం పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. తర్వాత 9వ తేదీ ఉదయం అమలాపురం బైపాస్ రోడ్డలో శ్మశానం వద్ద పంట కాలువ నీటి అంచున మల్లేశ్వరి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడాన్ని స్థానికులు, పోలీసులు గుర్తించారు. 7వ తేదీ రాత్రి వనచర్లవారి వీధిలోని వారున్న ఇంట్లోనే మల్లేశ్వరి మెడకు చీరను బిగించి నాగబాబు హత్య చేశాడు. అతనికి ఆ ఇంటి యాజమాని కుమారుడు కముజు నరసింహం సహకరించాడు. అప్పటికే చనిపోయిన మల్లేశ్వరికి ఒంట్లో బాగోలేదని.. ఆస్పత్రికి తీసుకు వెళుతున్నామని ఇరుగు పొరుగు వారికి చెప్పి నాగబాబు, నరసింహం ఇద్దరూ మోటారు సైకిల్‌పై ఆమె మృతదేహాన్ని తీసుకు వెళ్లారు. పంట కాలువ వద్దకు వెళ్లి మృతదేహాన్ని పడేశారు. మృతదేహం కాలువలో కొట్టుకుపోయి సముద్రంలో కలిసిపోతుందని వారు అంచనా వేశారు. అయితే ఆ మృతదేహం కాలువ నీటి అంచునే ఆగిపోవడంతో వారి పధకం నెరవేరక ఆనక వారి కుట్ర బయటపడింది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే గాని అది ఆత్మహత్యా... హత్యా అనేది ఇప్పుడే చెప్పలేమని అప్పట్లో పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో మల్లేశ్వరిది హత్యేనని తేలడంతో పోలీసులు ఈ కేసును హత్య కేసుగా మార్చి ఆ దిశగా దర్యాప్తు చేశారు. నిందితుడు నాగబాబు, సహకరించిన నరసింహంలను అరెస్ట్ చేసి ఆదివారం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు పట్టణ సీఐ దుర్గాశేఖరరెడ్డి తెలిపారు. -
సెక్యూరిటీ గార్డుతో వివాహేతర సంబంధం..
బనశంకరి: ప్రియుడు దూరంగా ఉండటాన్ని సహించలేక ప్రియురాలు అతడిపై చాకుతో దాడిచేసి హత్యకు ప్రయత్నించిన ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రియుడు జోగిశ్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. అసోంకు చెందిన జుంటిదాస్ (36) అనే మహిళ.. భర్తకు విడాకులు ఇచ్చి 18 ఏళ్లు కూతురితో కలిసి జిగణిలో నివాసముంటోంది. డే కేర్ సంస్థలో జుంటిదాస్ పనిచేసేది. గత కొద్దినెలల క్రితం అసోంకే చెందిన జోగిశ్ (27) పరిచయమై ప్రేమగా మారి సహజీవనం ప్రారంభించారు. జోగిశ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆమె తరచూ డబ్బుల కోసం వేధిస్తుండడంతో జోగిశ్ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ మహిళ అతనిపై చాకుతో ఇష్టానుసారం దాడిచేసి పరారైంది. వివేకనగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని మహిళను అరెస్ట్‌చేశారు. బాధితుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
వివాహేతర సంబంధం.. భర్త హత్యకు ప్లాన్.. వైన్స్‌లో మందు కొని..
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడిన భార్య.. భర్తను హత్య చేసింది. వృత్తిరీత్యా కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న కొట్టగొల్ల తుక్కప్ప(55) తన భార్యతో కలిసి సంగారెడ్డిలో జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య ఈశ్వరమ్మ ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. అనారోగ్యంతో ఉన్న తుక్కప్పను మెరుగైన వైద్యం అంటూ కౌకూర్ దర్గా వద్దకు ఈశ్వరమ్మ తీసుకొచ్చింది. అనంతరం ఘట్కేసర్లో డాక్టర్ వద్దకు వెళ్దామని మాయ మాటలు చెప్పి యంనంపేట చౌరస్తాకు తీసుకొచ్చిన భార్య.. డాక్టర్ అందుబాటులో లేడని చెప్పింది. రోజు మద్యం సేవించే అలవాటు ఉన్న భర్తకు పక్కనే ఉన్న వైన్ షాప్‌లో మద్యాన్ని ఈశ్వరమ్మ కొనుగోలు చేసింది. చదవండి: మీ అమ్మాయికి ధనపిశాచి పట్టిందని.. బెడ్రూంలో గుప్తనిధులు..! ఘట్కేసర్ బస్టాండ్ సమీపంలో ఫెర్టిలైజర్ షాప్‌లో ఈశ్వరమ్మ ప్రియుడు శ్రీనివాస్ పురుగుల మందు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. రహస్యంగా మద్యంలో పురుగుల మందు కలిపిన భార్య.. భర్తకు తాగించింది. భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లేసరికి ఏమీ తెలియనట్టుగా పక్కనున్న వారి సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించిన భార్య ఈశ్వరమ్మ తరలిచింది. పోస్టుమార్టం రిపోర్ట్ అనంతరం అసలు విషయం బయటకొచ్చింది. భార్య ఈశ్వరమ్మను, ప్రియుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
వివాహేతర సంబంధం.. ప్రియుడితో బిడ్డకు జన్మనిచ్చిన ప్రియురాలు
తమిళనాడు: వివాహేతర సంబంధంతో పుట్టిన బిడ్డను నీటి డ్రమ్ములో ముంచి చంపి తర్వాత తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అరియలూరు జిల్లా సెంతురై సమీపంలోని దిఖుర్ గ్రామానికి చెందిన రాజేశ్వరి (27). ఈమె భర్త చనిపోయాడు. రాజేశ్వరి తిరుపూర్‌లోని ఒక బనియన్ కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అక్కడ ఒకరితో రాజేశ్వరికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో రాజేశ్వరి గర్భం దాల్లి నాలుగు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ స్థితిలో చిన్నారి తండ్రి ఎవరని బంధువులు తరచూ అడగడంతో రాజేశ్వరి మనస్తాపం చెందింది. ఇంట్లో ఉన్న వాటర్ డ్రమ్ములో బిడ్డను ముంచి కడతేర్చింది. తర్వాత రాజేశ్వరి ఇంటి సమీపంలోని చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కువాగం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జయంగొండం ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డ్యూటీకి వెళ్లిన భర్త .. ప్రియుడిని ఇంటికి పిలిచి అడ్డంగా బుక్కైన భార్య
కర్ణాటక: వివాహేతర సంబంధం గురించి ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల మేరకు సూళగిరి సమీపంలోని కారుబల గ్రామానికి చెందిన డ్రైవర్ రామచంద్రన్ (38). అతని భార్య రూప (28). అదే ప్రాంతానికి చెందిన జావిద్ (21)కు రూపతో వివాహేతర సంబంధం ఉండేది. గత 17వ తేదీ డ్యూటీపై వెళ్లిన రామచంద్రన్ రాత్రి ఇంటికొచ్చేసరికి జావిద్ కనిపించాడు. దీంతో భార్యను, అతన్ని నిలదీశాడు. దీంతో ఆవేశానికి గురైన భార్య రూప, ప్రియుడు జావిద్‌లు కలిసి రామచంద్రన్‌పై దాడి చేశారు. తీవ్ర గాయాలేర్పడిన రామచంద్రన్‌ను స్థానికులు చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొమని జావిద్‌ను అరెస్ట్ చేశారు. -
వివాహేతర సంబంధం.. ఏకాంతంగా ఉండటం చూశాడని బాలుడి హత్య!
తమిళనాడు: వివాహేతర సంబంధం పెట్టుకున్న అబ్బాయితో ఒంటరిగా ఉండడాన్ని చూసిన ఓ బాలుడిని హత్య చేసి బావిలో పడేసిన ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటనలో బాలుడి చిన్నమ్మ కౌసల్యను ఏడాది తర్వాత అరెస్టు చేశారు. విరుదునగర్ జిల్లా వెంబకోట్ పక్కన ఎలాయి రాంపన్నాయ్ సమీపంలోని ఆర్.మడతుప్పట్టికి చెందిన గోపాల్ (45)కార్మికుడు. పరంధామన్ (9) మొదటి భార్య కుమారుడు. మొదటి భార్య చనిపోవడంతో గోపాల్ కౌసల్య(35)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ స్థితిలో ఏడాది క్రితం పరంధామన్ అదృశ్యమయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు మడత్తుపట్టిలోని బావిలో పరంధామన్ మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. పరంధామన్ ఆడుకుంటూ బావిలోకి జారిపడి ఉండవచ్చని పోలీసులు భావించారు. అయితే కౌసల్యపై పోలీసులకు అనుమానం వచ్చింది. అలాగే ఏలాయిరం పన్నైకి చెందిన సేతు కామేష్ (35)ని కూడా పోలీసులు విచారించారు. కౌశల్యకు కామేష్‌తో వివాహేతర సంబంధం ఉందని వెలుగులోకి వచ్చింది. సోమవారం కౌసల్యను పోలీసులు పట్టుకుని విచారించారు. ఇందులో బాలుడిని చంపినట్లు నేరం ఒప్పుకుంది. హత్యకు సహకరించిన సేతు కామేష్ కోసం గాలిస్తున్నారు. ఘటన జరిగిన రోజు కౌసల్య, సేతు కామేష్ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. బాలుడు పరంధామన్ ఇది చూశాడు. ఈ విషయం గోపాల్‌కి చెబుతాడేమోనని కౌసల్య భయపడి బాలుడు పరంధామ¯Œన్ను గొంతుకోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశారు. -
భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం... భర్త ఆత్మహత్య
కర్ణాటక: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన తాలూకాలోని గువ్వలకానహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన సురేష్(38) భార్య హేమావతి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు సంతానం.హేమావతి హునేగల్ గ్రామంలోని గంగాధర్‌తో సన్నిహితంగా ఉంటోందని భర్త సురేష్ గొడవ పడేవాడు. దీంతో హేమావతి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. హేమావతి శనివారం గంగాధర్‌తో కలిసి నగరంలో సంచరిస్తుండగా సురేష్ పసిగట్టి అంగన్వాడీ కేంద్రం వద్దకు వెళ్లి గొడవపడ్డాడు. దీంతో హేమావతి, గంగాధర్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సురేష్ ను పిలిపించి సర్దిచెప్పారు. అనంతరం సురేష్ తన ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో రికార్డు చేసి స్నేహితులకు పంపి ఉరివేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి హేమావతిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. -
భర్త వివాహేతర సంబంధం భార్యకు తెలియడంతో.. పెట్రోల్ పోసి
సంగారెడ్డి: దాంపత్య జీవితానికి అడ్డుగా మారిందని మహిళలపై పెట్రోల్ పోసి హత్య చేసిన సంఘటన నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం వెలుగు చూసింది. జిన్నారం సీఐ వేణు కుమార్, హత్నూర ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..హత్నూర మండలం బడంపేటకు చెందిన మల్లమ్మను (37)అదే మండలం పన్యాలకు చెందిన గొర్రెలకాడి మొగులయ్యతో గత 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 16ఏళ్ల కూతురు ఉంది. బతుకుదెరువు కోసం గతంలో దంపతులిద్దరూ గుమ్మడిదల మండలం మంబాపూర్లోని ఓ కోళ్ల ఫారంలో కొన్నినెలల పాటు పనిచేశారు. అనంతరం స్వగ్రామానికి వచ్చారు. అక్కడ పనిచేస్తున్న క్రమంలో శివంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామానికి చెందిన మహమ్మద్ ఖాజాతో మల్లమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది. స్వగ్రామానికి చేరుకున్న తరువాత కొన్ని రోజులకు మల్లమ్మ భర్త మొగులయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో మల్లమ్మ మహమ్మద్ ఖాజా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. మహమ్మద్ ఖాజా భార్యకు వివాహేతర సంబంధం గురించి తెలియడంతో భర్తను పలుమార్లు మందలించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మల్లమ్మను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఓ పథకం వేసుకున్నాడు. పథకంలో భాగంగా ఈ నెల 3న మహ్మద్ ఖాజా మల్లమ్మకు ఫోన్ చేసి నర్సాపూర్ పిలిపించుకున్నాడు. అక్కడికి చేరుకుదున్న ఆమెను స్కూటీపై నల్లవల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మల్లమ్మను చున్నీతో బిగించి హత్య చేసి ఆనవాళ్లు దొరక్కుండా వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి పరారయ్యాడు. తన కూతురు కనిపించకపోవడంతో మల్లమ్మ తల్లి అంజమ్మ ఈ నెల 4న హత్నూర పోలీస్టేషన్లో ఫిర్యా చేసింది. దర్యాప్తులో భాగంగా నల్లవల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి మొహమ్మద్ ఖాజాను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో తను హత్యానేరాన్ని ఒప్పుకోవడంతో నిందితుడు మహమ్మద్ ఖాజాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
వివాహేతర సంబంధం అనుమానంతో అత్తను చంపిన అల్లుడు
పిఠాపురం: భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్త కత్తితో దాడి చేయగా అడ్డుకున్న అత్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలైన ఘటన కొత్తపల్లి మండలం నాగులాపల్లి శివారు ఉప్పరగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగికి చెందిన దండ్రు శ్రీనుకు కొత్తపల్లి మండలం నాగులాపల్లి శివారు ఉప్పరగూడెంకు చెందిన దండ్రు సింహాచలంతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు ఆడపిల్లలు. మూడేళ్లుగా నిందితుడు శ్రీను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. దీంతో ఒమ్మంగి నుంచి ఉప్పరగూడెం వచ్చి అత్త గుర్రాల రాణి (55) ఇంటి వద్ద కాపురం పెట్టారు. అయినప్పటికి అనుమానంతో రోజూ భార్యతో గొడవ పడేవాడు. రెండు నెలల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన నిందితుడు ఇటీవల ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి భార్యను అనుమానిస్తూ వేధించాడు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దల వద్ద మాట్లాడినా ఉపయోగం లేక పోవడంతో రెండు పర్యాయాలు భార్య సింహాచలం కొత్తపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అర్ధరాత్రి చాటుగా కాపలా భార్యపై అనుమానంతో నిందితుడు బయటకు వెళుతున్నానని చెప్పి రాత్రుళ్లు తన ఇంటికి దగ్గర్లో మాటు వేసి కాపలా కాసేవాడు. ఇది చూసిన వారు ఎందుకు అలా చేస్తున్నావని అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్లి పోయేవాడు. ఇంట్లో అందరూ నిద్ర పోయాకా పని ఉందంటూ బయటకు వెళ్లి ఇంటి దగ్గర్లో ఉన్న పాకలో దాక్కునే వాడు. ఎవరు రాక పోయినా వచ్చి ఎవరో వచ్చారు అంటూ భార్యతో గొడవకు దిగేవాడు. అదను చూసి అంతమొందించాడు చివరకు ఎలాగైనా భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్న నిందితుడు శ్రీను వారం రోజుల క్రితం కత్తి తయారు చేయించి వెంట తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి రాత్రుళ్లు కత్తి దగ్గర పెట్టుకుని పడుకునే వాడు. ఆదివారం ఉదయం అతని అత్త రాణి పక్క ఇంటి వారితో మాట్లాడుతూ తన అల్లుడు అనుమానంతో ఇబ్బంది పెడుతున్నాడని, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడం నిందితుడు శ్రీను విన్నాడు. ఇంటికి వచ్చిన వెంటనే తన భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇతరుల వద్ద తన పరువు తీస్తోందని భార్యపై కోపోద్రిక్తుడయ్యాడు. భార్యపై కత్తితో దాడికి దిగాడు. ఆమెను పరుగులు పెట్టించి కత్తితో నరికే ప్రయత్నం చేయగా ఆమె చెయ్యి తెగిపోయింది. ఇది చూసిన అత్త రాణి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆమైపె విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను చంపే ప్రయత్నం చేయగా ఇరుగు పొరుగు వారు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. తన వద్ద ఉన్న కత్తిని చూపించి పట్టుకుంటే చంపేస్తానంటూ బెదిరించి అక్కడి నుంచి కత్తితో సహా నిందితుడు పరారయ్యాడు. గాయపడ్డ భార్యను పిఠాపురం ఆసుపత్రికి ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు. కాకినాడ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబీకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్టు వారు తెలిపారు. మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపల్లి ఎస్సై రామలింగేశ్వరరావు తెలిపారు. అమ్మమ్మను చంపి తండ్రి పరారవ్వగా తీవ్ర గాయాలతో తల్లి ఆస్పత్రి పాలవ్వడంతో వారి పిల్లలు రోదిస్తున్న తీరు చూపరులకు కంట తడి పెట్టించింది. -
సంచలనం... నాగేంద్రబాబు హత్యకు వివాహేతర సంబంధమే కారణం...
ప్రొద్దుటూరు క్రైం: వివాహేతర సంబంధం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ హత్య ఘటనలో సొంత బంధువే నిందితుడు. సంచలనం సృష్టించిన కానపల్లె హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రొద్దుటూరు మండలం కానపల్లె ఎస్సీ కాలనీలో శుక్రవారం వేకువ జామున మిద్దెపై నిద్రిస్తున్న ఆకుమల్ల నాగేంద్రబాబును గొంతు కోసి హత్య చేసిన విషయం తెలిసిందే. మృతుడి భార్య ఇమాంబీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులోని నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. అరెస్ట్ వివరాలను శనివారం సాయంత్రం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు మీడియాకు వెల్లడించారు. మృతుడు ఆకుమల్ల నాగేంద్రబాబుకు అతని సమీప బంధువు నగేష్‌లకు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. విషయం తెలియడంతో నగేష్‌ను దగ్గరికి రానివ్వద్దని నాగేంద్రబాబు మహిళను హెచ్చరించాడు. ఇంకోసారి అతన్ని రానిస్తే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో నాగేంద్రబాబును ఎలాగైనా చంపి తమకు అడ్డు లేకుండా తొలగించుకోవాలని నగేష్ మహిళతో కలిసి కుట్ర పన్నాడు. ఈ క్రమంలో కానపల్లెలోని ఎస్సీ కాలనీలో గంటా మరియమ్మ ఇంటిపై నిద్రపోతున్న ఆకుమల్ల నాగేంద్రబాబును శుక్రవారం వేకువ జామున 4.30 గంటల సమయంలో నగేష్ కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. టెక్నాలజీ సాయంతో నిందితుల గుర్తింపు.. హత్య జరిగిన తర్వాత దర్యాప్తు కోసం సీఐలు నారాయణయాదవ్, ఇబ్రహీం, ఎస్ఐలు చిరంజీవి, శివప్రసాద్లతో కూడిన ప్రత్యేక టీంను జిల్లా ఎస్పీ అన్బురాజన్ నియమించారు. ఈ క్రమంలో అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు టెక్నాలజీ ద్వారా హత్య కేసులో పురోగతి సాధించారు. ఈ కేసులోని నిందితులునగేష్ తో పాటు మహిళను శనివారం రూరల్ పోలీస్‌స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లతో పాటు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాదీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపించనున్నట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ కేసులో మంచి ప్రతిభ కనబరచిన పోలీసు బృందాన్ని ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. కాగా హత్య కేసులోని నిందితుడు డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. సొంత బంధువే హత్య చేశాడని నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు షాక్‌కు గురయ్యారు. -
భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్.. మరో అమ్మాయితో వివాహేతర సంబంధం
కామారెడ్డి: ప్రియురాలి మోజులో పడి భర్త తనను పట్టించుకోకపోవడం.. ప్రశ్నిస్తే వరకట్నం కోసం వేధించడంతో మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నవీపేటలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను నిజామాబాద్ ఏసీపీ కిరణ్‌కుమార్ గురువారం వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన రాజేందర్ కూతురు కావ్యరశ్రీ(26)కి నవీపేటకు చెందిన ఎర్ర మహేష్, అరుణల కుమారుడు ఎర్ర మనోజ్‌తో 2020లో వివాహం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే మనోజ్‌కు మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో కావ్యశ్రీని పట్టించుకోలేదు. కావ్యశ్రీ మానసికంగా కుంగిపోయి తన బాధను పెద్దల దృష్టికి తీసుకెళ్లగా ఇరువురికి సర్దిచెప్పారు. మనోజ్‌కు అప్పులు ఉండడంతో కావ్యశ్రీని అదనపు కట్నం కోసం మరింత వేధించాడు. భర్తతో పాటు అత్తమామలు అరుణ, మహేష్ కూడా కావ్యశ్రీని వేధించారు. మానసిక వేధనను భరించలేని కావ్యశ్రీ బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురును అదనపు కట్నం కోసం వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ కిరణ్‌కుమార్, ఎస్సై రాజారెడ్డి ఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త మనోజ్, అత్తమామలు అరుణ, మహేష్‌పై కేసు నమోదు చేశామని ఏసీపీ పేర్కొన్నారు. -
వివాహేతర సంబంధంతోనే హత్య
గుంటూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించేందుకు భార్య, ప్రియుడు ఏకమై పథకం రచించారు. హత్యకు సహకరించిన వ్యక్తితో పాటు ఈ కేసులో ముగ్గురిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేసినట్లు దక్షిణ సబ్ డివిజన్ డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. కలెక్టరేట్ రోడ్‌లోని దక్షిణ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఈనెల ఒకటో తేదీ రాత్రి గుంటూరు రూరల్ ఏటుకూరు పొలాల సమీపాన సాయి ఎస్టేట్స్ ఫ్లాట్స్ వద్ద కృష్ణబాబుకాలనీ మూడో వీధిలో ఉంటున్న షేక్ బాషా అలియాస్ అమీర్‌వలి (30) దారుణ హత్యకు గురయ్యాడు. భర్త మృతిపై భార్య షాహీనా నల్లపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్ ఆదేశాల మేరకు హత్యానేరం కింద కేసు నమోదు చేసి, సీఐ బత్తుల శ్రీనివాసరావు, ఎస్ఐ డి.అశోక్ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఘటనా స్థలంలో ఏమాత్రం ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు. మృతుని భార్య ప్రవర్తనపై అనుమానాలు వ్యక్త మవడం.. సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ వేగవంతం చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది... పథకం పన్నారిలా.. పదేళ్ల క్రితం షేక్ బాషా అలియాస్ అమీర్వలితో షాహీనకు పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త లారీలకు రంగులేసే పనులకు వెళ్లేవాడు. భార్య ఏటుకూరు పొలాల్లోని ఎస్టేట్స్ వద్ద ప్లాట్స్‌లో ఆయాగా పనిచేస్తుంది. అక్కడే ఆనందపేట ఎనిమిదో వీధిలో ఉంటున్న షేక్ షబ్బీర్ కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడి, దాదాపు ఆరు నెలలుగా నడుస్తోంది. అవివాహితుడైన షబ్బీర్ షాహీనాను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో అడ్డుగా ఉన్న భర్తను హతమార్చేందుకు ఇద్దరు కలిసి పథకం రచించారు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి బంధువైన నల్లచెరువు 25వ వీధి దర్గా వెనుక ఉంటున్న షేక్ రఫీ సహకారం తీసుకున్నారు. దీంతో రఫీ కొత్త సిమ్ నంబర్‌తో బాషా అలియాస్ అమీర్వలితో మాట్లాడేవాడు. తాను లారీల యాజమాని అని, పనులు ఇప్పిస్తానని పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో రఫీ, బాషా తరుచూ మద్యం తాగేవారు. ఈనెల ఒకటో తేదీన ముందస్తుగా రచించిన పథకం ప్రకారం బాషాను సాయి ఎస్టేట్స్ పొలాల వద్దకు పిలిచి అతిగా మద్యం తాగించారు. మత్తులో ఉండగా షేక్ షబ్బీర్, రఫీలు కలిసి బాషాను మోటారుసైకిల్ ఫోర్క్ రాడ్, కత్తితో అత్యంత క్రూరంగా హత్య చేసి పరారయ్యారు. మృతుడి భార్య ప్రవర్తనపై అనుమానం రావడం, మృతుడి సెల్‌ఫోన్ కాల్ లిస్ట్ బయటకు తీయడంతో అసలు కథ బయటపడింది. బుధవారం మృతుని భార్యతోపాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ద్విచక్ర వాహనం, ఫోర్క్రాడ్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. సీఐ బత్తుల శ్రీనివాసరావు, ఎస్ఐ డి.అశోక్, హెచ్‌సీ కె.సుబ్బారావు, కానిస్టేబుళ్లు షేక్ జాన్‌సైదా, డి.పోతురాజు, కె.వెంకటనారాయణ, షేక్ మస్తాన్ పాల్గొన్నారు. -
అత్తతో వివాహేతర సంబంధం
తమిళనాడు: తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్నేహితుడిని చంపిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నామక్కల్ జిల్లా వెలగౌండంపట్టిలోని అక్కలంపట్టి అరుంధతీ కాలనీకి చెందిన కందస్వామి కుమారుడు శీను (23), అదే పట్టణానికి చెందిన శక్తివేల్ కుమారుడు ప్రవీణ్‌కుమార్ (21) స్నేహితులు. ప్రవీణ్‌కుమార్ మేనమామ సత్య భార్య మీనా (29)తో కలిసి అదే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో శీనుకు ప్రవీణ్‌కుమార్ అత్త మీనాతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం సత్యకు తెలియడంతో భార్యను మందలించాడు. అయితే శీనుతో సంబంధాన్ని వదులుకోకపోవడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఇందులో వారిద్దరూ చర్చించుకుని మరోసారి కలవకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే మామ, అత్తకు చెడ్డపేరు తెచ్చిన శీనును చంపడానికి ప్రవీణ్ కుమార్ నిర్ణయించుకున్నాడు. సోమవారం రాత్రి శీను ఇంటికి వెళ్లి బయట నిద్రిస్తున్న అతని మెడ, ఛాతి, తొడలపై కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. శీను అరుపులు విని స్థానికులు అక్కడికి వచ్చారు. అయితే అప్పటికే అతను మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం నామక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. హత్య చేసి పరారైన ప్రవీణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. -
భర్త హోటల్లో పని చేసే సప్లయర్‌తో భార్య వివాహేతర సంబంధం
కర్ణాటక: భర్తను హత్య చేసిన కేసులో భార్య, ప్రియుడి సహా ఐదుగురిని తలఘట్టపుర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు...గతనెల 29న గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా నణ్ణూరుకు చెందిన అరుణ్‌కుమార్ (34) ఆర్‌ఆర్‌నగర ఉత్తరహళ్లి రోడ్డులో జేఎస్ఎస్ కళాశాల పక్కన హోటల్ నడిపిస్తున్నాడు. ఆ హోటల్‌కు గణేశ్ అనే వ్యక్తి నీటిని సరఫరా చేస్తున్నాడు. ఇతనితో అరుణ్‌కుమార్ భార్య రంజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనికి తోడు అరుణ్‌కుమార్, గణేశ్‌తో చేబదులుగా కొంత నగదు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే గణేశ్, రంజిత వివాహేతర సంబంధం గురించి అరుణ్ తెలుసుకుని భార్యను తీవ్రంగా మందలించాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది. గతనెల 28న పార్టీ చేసుకుందామని చెప్పి అరుణ్‌ను గణేశ్ అతని శివానంద, దీపు, శరత్‌లు పిలిపించారు. అరుణ్ రాగానే అతని కళ్లపై కారంపొడి చల్లి మారణాయుధాలతో చంపి హత్య చేశారు. మరుసటి రోజు తలఘట్టపుర పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. అనంతరం విచారణలో భాగంగా రంజిత మొబైల్ ఫోన్‌కాల్ డేటా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
వివాహేతర సంబంధం... ప్రసన్న తలపై రాడ్డుతో విచక్షణారహితంగా 8 సార్లు బాది...
ప్రకాశం: పట్టణంలో శుక్రవారం ఉదయం తల్లీకూతుళ్లపై జరిగిన హత్యాయత్నానికి వివాహేతర సంబంధమే కారణమని స్థానిక ఎస్సై రామకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. దర్శికి చెందిన పెద్దిశెట్టి సాయిరాం అలియాస్ వెంకటప్రభు శేషసాయి స్థానికంగా నివాసం ఉంటున్న గోవిందమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల నుంచి గోవిందమ్మతో పాటు ఆమె కుమార్తె ప్రసన్నను తిడుతూ కొడుతూ ఉన్నాడు. ఇంటికి రావద్దని వారు చెప్పినా వినకుండా వేధిస్తున్నాడు. తన తల్లిని బాధపెట్టడాన్ని భరించలేకపోయిన ప్రసన్న.. ఇంకోసారి ఇంటికి వచ్చి తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే పోలీస్‌స్టేషన్‌లో కేసు పెడతామని హెచ్చరించింది. గోవిందమ్మతో తన వివాహేతర సంబంధానికి ప్రసన్నను అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నిన సాయిరాం.. శుక్రవారం ఉదయం ఇంటి బయట మంచంపై పడుకుని ఉన్న ప్రసన్న తలపై రాడ్డుతో విచక్షణారహితంగా 8 సార్లు బాది చనిపోయిందని భావించి వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. -
భార్య,అత్తకు వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని..
వైఎస్సార్ : స్థానిక దర్గా వీధిలో ఈ నెల 17వ తేదీన జరిగిన షేక్ మహ్మద్ జహీర్ సాహెబ్ (27) హత్య కేసులో నిందితులైన భార్య షేక్ యాస్మిన్, అత్త షేక్ టప్పా ఖదీరున్నిసాలను అరెస్ట్ చేసినట్లు కమలాపురం సీఐ సత్యబాబు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. షేక్ మహ్మద్ జహీర్ భార్య, అత్తతో కలసి అత్త ఇంట్లోనే నివాసం ఉంటున్నాడని, అలాగే ఇతడికి మద్యం సేవించే అలవాటు ఉందన్నారు. భార్య, అత్త ఇద్దరు ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని, తరచూ వారితో గొడవ పడేవాడన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన రాత్రి 10.30 గంటల సమయంలో మద్యం సేవించి వచ్చిన మహ్మద్ జహీర్‌ను.. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం అత్త గొంతుకు ప్లాస్టిక్ తాడును గట్టిగా బిగించగా, భార్య తలదిండుతో ముఖంపై గట్టిగా అదిమి పట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా మద్యం తాగి తమతో గొడవ పడుతూ తనంతట తాను కిందపడి మృతి చెందాడని నమ్మబలికారన్నారు. అయితే పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా, అలాగే సాక్ష్యాల మేరకు వారే హత్య చేశారని నిర్ధారించామన్నారు. వారు చేసిన నేరం అంగీకరించడంతో సోమవారం రాత్రి అరెస్ట్ చేసి మంగళవారం కోర్టుకు హాజరు పరచగా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన ఎస్ఐ చిన్నపెద్దయ్యను సీఐ అభినందించారు. సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆటోడ్రైవర్‌తో వివాహేతర సంబంధం భర్తను చంపిన భార్య
వరంగల్: తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను గొంతునులిమి చంపిన భార్యను, ఆమెకు సహకరించిన ప్రియుడిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఏనుమాముల ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లి పరిధిలోని ఆర్ఎన్ఆర్నగర్కు చెందిన బట్టు వెంకన్నను తన భార్య స్వప్న.. ప్రియుడు ప్రశాంత్ సహకారంతో ఏప్రిల్ 21న చంపింది. తన అన్న వెంకన్న అనుమానాస్పదంగా మృతి చెందాడని తమ్ముడు లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. పోస్టుమార్టం నివేదికలో వెంకన్న గొంతు నులమడంతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో కేసును హత్యగా నమోదు చేశారు. వెంకన్న భార్య బట్టు స్వప్న పరారీలో ఉండడంతో ప్రత్యేక టీమును ఏర్పాటు చేయడంతో అమెను, సహకరించిన ప్రశాంత్‌లను మంగళవారం ఏనుమాములో పట్టుకున్నారు. వారిని విచారించగా స్వప్నకు అదే కాలనీలో నివాసం ఉండే ఆటోడ్రైవర్ లావుడ్య ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసిందని వెల్లడైంది. ఈక్రమంలో స్వప్న ప్రశాంత్‌లు సన్నిహితంగా ఉండడం కాలనీవాసుల ద్వారా భర్త వెంకన్నకు తెలిసింది. దీంతో స్వప్నను మందలించడంతో భార్యాభర్తల నడుమ పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. స్వప్న..ప్రియుడు ప్రశాంత్ దృష్టికి తీసుకెళ్లగా వెంకన్నను చంపేందుకు పథకం పన్నారు. ఏప్రిల్ 21న వెంకన్న మద్యం తాగి వచ్చి భార్య స్వప్నతో గొడవపడ్డాడు. ఆ తరువాత అన్నం తిని పడుకోగా, సుమారు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో స్వప్న.. ప్రశాంత్‌కు ఫోన్ చేసి చెప్పగా.. ఎన్ని రోజులు భరిస్తావు..నేను ఉన్నాను. ఎలాగైనా వాడిని అంతం చేయమ’ని చెప్పాడు. దీంతో స్వప్న పడుకున్న భర్త గొంతు నులిమి చంపింది. ఈ మేరకు స్వప్న, ప్రశాంత్లపైకేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
తరచూ కలవడం కుదరడం లేదని?
విజయనగరం: భర్తను హతమార్చిన కేసులో కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన ముద్దాయి అడ్డూరి విజయలక్ష్మికి జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.కల్యాణ చక్రవర్తి మంగళవారం తీర్పు చెప్పారు. అనాథలైన ఇద్దరు పిల్లలకు చెరో రూ.మూడు లక్షల పరిహారం ప్రభుత్వం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేలూరి రఘురాం అందించిన వివరాలిలా ఉన్నాయి, ముద్దాయి భర్త దే ముడు కొత్తవలస గ్యాస్ కంపెనీలో పనిచేసేవాడు. సుమా రు 14 ఏళ్ల క్రితం విజయలక్ష్మితో పెళ్లయింది. అనంతరం వారికి ఒక అమ్మాయి, అబ్బాయి పుట్టారు. ఇదిలా ఉండగా భార్య విజయలక్ష్మి పరాయి వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త తరచూ తగాదా పడుతుండేవాడు. దీంతో పాటు చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి విజయలక్ష్మి ఉదయం వెళ్లడం, సాయంత్రం ఇంటికి రావడం చేస్తుండేది. ఈ విషయమై భార్యను పలుమార్లు నిలదీశాడు. ఈ నేథ్యంలో భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న విజయలక్ష్మి 2019 సెప్టెంబర్ 2న రాత్రి భర్త పొట్టపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దేముడు చికిత్స పొందుతూ మరునాడు మృతిచెందాడు. మృతుడి సమీప బంధువు మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు కొత్తవలస ఎస్సై బి. మురళి కేసునమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి సీఐ జి.గోవిందరావు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ 18 మంది సాక్షులను కోర్టులో విచారణ చేసి అభియోగం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. విషయం తెలిసిన భార్య..
ఒడిశా: మండలంలోని పారాదిలో ఆదివారం ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలో భర్తే హంతకుడిగా పోలీసుల విచారణలో వెల్ల డైంది. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ పుల్లూరు శ్రీధర్, సీఐ ఎం నాగేశ్వరరావులు సోమవారం సాయంత్రం విలేకరులకు వివరించా రు. బాడంగి మండలం డొంకిన వలసకు చెందిన పూడి శంకరరావు కుమార్తె గౌరీశ్వరి అలియాస్ విజ యను పారాది గ్రామానికి చెందిన సూర్రెడ్డి రవికి ఇచ్చి 11 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరు టీ కొట్టు నడుపుతూ జీవిస్తున్నారు. వారికి 9, 10 సంవత్సరాల వయసు గల కుమారుడు, కుమార్తె ఉన్నా రు. కొన్నాళ్లుగా రవి వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై గౌరీ శ్వరి తరచూ భర్తతో గొడవ పడుతుండేది. ఆదివా రం కూడా వీరిద్దరూ వారి దుకాణం వద్దే తీవ్రంగా గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో గౌరీశ్వరి తండ్రి శంకరరావుకు ఫోన్ చేసి భర్తతో వేగలేకపోతున్నానని, పరిస్థితి బాగాలేదు రమ్మని సమాచారమిచ్చింది. తండ్రి కళ్లముందే మృతి చెందిన కుమార్తె వెంటనే శంకరరావు కుమార్తె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో భార్యాభర్తలు గొడవ పడుతుంటే శంకరరావు వారిని సముదాయిస్తూ, పరిష్కారం కోసం ప్రయత్నిస్తుండగానే రవి గౌరీశ్వరిని చెక్కపేడుతో మొఖం, మెడపై తీవ్రంగా కొట్టడంతో ఆమె పక్కనే ఉన్న మంచంపై రక్తం కక్కుకుంటూ ప్రాణా లు విడిచింది. అనంతరం ఆమె చనిపోయిందని తెలుసుకున్న రవికుమార్ గ్రామం పక్కనే ఉన్న హైస్కూల్లో దాక్కున్నాడు. గ్రామస్తుల సమాచా రం మేరకు పోలీసులు రవిని పట్టుకుని స్టేషన్‌కు తరలించి, గౌరీశ్వరి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీఐ ఎం.నాగేశ్వర రావు, సిబ్బంది విచారణలో గౌరరీశ్వరిని భర్త ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. నిందితుడు భర్త రవిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని. సోమవారం కోర్టులో హాజ రు పరిచినట్లు తెలిపారు. -
భార్యతో వివాహేతర సంబంధం... మిత్రుని గొంతు కోసి రక్తం తాగాడు
కర్ణాటక: తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తి పైశాచికంగా ప్రవర్తించాడు. మిత్రుడని చూడకుండా గొంతు కోసి రక్తం తాగిన ఘోర సంఘటన చింతామణి తాలూకా సిద్దేపల్లి దగ్గర జరిగింది. వివరాలు.. తాలూకాలోని బట్లపల్లి గ్రామానికి చెందిన విజయ్, చేలూరు తాలూకాలోని మారేష్ ఇద్దరు కూడా బట్టలు వ్యాపారం చేసుకొని జీవించేవారు. ఇరు కుటుంబాల వారు కలిసిమెలిసి ఉండేవారు. ఇరువురు చింతామణి పట్టణంలోని గాంధీనగరంలో అద్దె ఇళ్లలో జీవిస్తున్నారు. తన భార్య మాలాతో మారేష్ చాలా సన్నిహితంతో ఉన్నాడని విజయ్‌కు అనుమానాలు వచ్చాయి. ఈనెల 19వ తేదీన విజయ్, మిత్రుడు జాన్‌బాబు కలసి బైక్ మీద మారేష్‌ను సిద్దేపల్లి దగ్గర నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మారేష్‌ను విజయ్ చాకుతో గొంతుకోసి రక్తం తాగుతున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. ఇది తెలిసి కంచార్లపల్లి పోలీసులు విజయ్, జాన్‌బాబును అరెస్టు చేసి కేసునమోదు చేశారు, కాగా, వారి నుంచి తప్పించుకున్న మారేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
భర్త విదేశాలకు... ఇంటి పక్కన వ్యక్తితో మోనీషా వివాహేతర సంబంధం
తిరువొత్తియూరు: కన్యాకుమారి జిల్లాలో భర్త, ఇద్దరు పిల్లలను వదిలి వెళ్లిన వివాహిత ప్రియుడితో కలిసి మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. కన్యాకుమారి జిల్లా మార్తాండం సమీపం మెత్తనం ప్రాంతానికి చెందిన సునీల్ (29). ఇతను తాపీమేస్త్రి. కరుంగల్‌కు చెందిన తొలైవావట్టం ప్రాంతానికి చెందిన మోనీషా (25)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈక్రమంలో సునీల్ ఆరు నెలల క్రితం పని కోసం విదేశాలకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇంటికి సమీపంలో ఉన్న సునీల్ బంధువు అర్జున్ (27)తో మోనీషాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. సంఘటన జరిగిన రోజు మోనీషా ఇద్దరు పిల్లలు తొలైవావట్టంలో ఉన్న తల్లిదండ్రుల ఇంట్లో వదిలిపెట్టి బ్యాంకుకు వెళుతున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. మోనీషా తల్లిదండ్రులు మార్తాండం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో మోనిషా, అర్జున్ ఇద్దరూ కేరళలో ఉన్నట్లు తెలిసింది. వెంటనే పోలీసులు మోనీషాను సెల్ఫోన్లో సంప్రదించగా ఇద్దరు మార్తాండం వస్తున్నట్లు చెప్పారు. ఈక్రమంలో మోనీషా, అర్జున్ సోమవా రం మార్తాండం పోలీస్‌స్టేషన్‌లో ఆశ్రయం కోరారు. ఇద్దరి తరఫున తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. వివాహేతర సంబంధాన్ని వదిలిపెట్టాలని ఆమెకు పోలీసులు, బంధువులు హితవు పలికారు. కానీ మోనిషా అర్జున్‌తో వెళ్తున్నట్లు చెప్పింది. -
ప్రియురాలికి చీరను తీసుకెళ్లి శవమయ్యాడు!
కర్నూలు: స్థానిక భాస్కరాపురం వంతెన వద్ద ప్రాతకోట గ్రామానికి చెందిన రామకిషోర్ అలియాస్ రాము అలియాస్ వెంకటన్న(42) దారుణ హత్యకు గురయ్యాడు. ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకోగా.. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఓ మహిళకు చీరను తీసుకెళ్తున్న క్రమంలో చోటు చేసుకున్న ఘటన వివరాలు పోలీసులు, మృతుని భార్య మాధవి తెలిపిన మేరకు ఇలా.. పగిడ్యాల మండలం కిందిప్రాతకోట గ్రామానికి చెందిన రాము పైప్రాతకోట గ్రామంలోని లక్ష్మన్న మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య మాధవి, కొడుకు శరత్చంద్ర(9) ఉన్నారు. భార్య ఇంటివద్ద చీరల వ్యాపారం చేస్తుండగా.. మృతుడు మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఉదయం ఇంటివద్ద మెడికల్ దుకాణం నిర్వహిస్తూ.. రాత్రి లక్ష్మన్నకు చెందిన మరో మెడికల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో బయటకు వెళ్తున్నట్లు యజమాని లక్ష్మన్నకు చెప్పిన రాము నేరుగా ఇంటికి చేరుకున్నాడు. ఐదు చీరలు ప్యాక్ చేయించుకొని.. ఇంటికి చేరుకున్న రాము స్నానం చేసి కొనుగోలుకు చీరలు తెమ్మన్నారని, ఐదింటిని ప్యాక్ చేయాలని భార్యకు తెలిపాడు. చీరల ఫొటోలు వాట్సాప్‌లో పంపుతానని చెప్పినా వినిపించుకోకుండా ప్యాక్ చేయించుకున్నాడు. ఇంటి వద్ద చీరలు కొనటానికి ఎవరైనా వస్తే.. వాళ్ల ఇంటికి ఇవ్వొద్దని చెప్పే భర్త ఇలా చేస్తున్నాడేంటని అప్పుడే అనుమానపడినట్లు భార్య తెలిపింది. ఆ తర్వాత తన ద్విచక్ర వాహనం(ఏపీ21 పీ4560)పై సొంత మెడికల్ షాపుకు చేరుకున్నాడు. అక్కడ నాలుగు చీరలు పెట్టి మరో చీరను బైక్ ట్యాంకు కవర్లో పెట్టుకొని 8గంటల ప్రాంతంలో బయటకు వెళ్లాడు. 8.30గంటల ప్రాంతలో భార్య ఫోన్ చేయగా.. మెడికల్ షాపులోనే ఉన్నట్లు చెప్పాడు. 9.30గంటల ప్రాంతంలో మరోసారి ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వచ్చినట్లు భార్య చెబుతోంది. ఓ మహిళతో తరచూ ఫోన్ రాము తరచూ ఓ మహిళతో ఫోన్లో మాట్లడుతున్నట్లు భార్య చెబుతోంది. ఎవరని అడిగితే మందుల కోసం వచ్చిన వాళ్లని చెప్పేవాడంది. ఆ మహిళ ఫోన్ రాగానే ఇంట్లోంచి మిద్దైపెకి, లేదా బయటకు వెళ్లేవాడని వాపోయింది. తనను మాత్రం ఇంట్లోంచి బయటకు రానిచ్చేవాడు కాదని.. ఆర్థిక విషయాలను కూడా ఎప్పుడూ చెప్పలేదని తెలిపింది. అయితే భార్య చెప్పిన వివరాల మేరకు హత్యకు అక్రమ సంబంధం కూడా కారణం కావచ్చని పోలీసులు అనమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఎండగా ఆత్మకూరు డీఎస్సీ శ్రీనివాసరావు, నందికొట్కూరు రూరల్ సీఐ సుధాకర్‌రెడ్డి, జూపాడుబంగ్లా ఎస్ఐ వెంకటసుబ్బయ్య, ముచ్చుమర్రి ఎస్ఐ నాగార్జున, బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ ఓబులేసు ఘటనా స్థలిని పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పథకం ప్రకారమే జరిగిందా? చీరను తీసుకొని బైక్‌పై భాస్కరాపురం బ్రిడ్జి సమీపంలోకి రాగానే ఎవరో అతని ౖబైక్‌ను నిలువరించగా రోడ్డు పక్కన నిలిపినట్లు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే తెలుస్తోంది. పథకం ప్రకారం కొందరు వ్యక్తులు అక్కడ ఘర్షణ పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సమయంలోనే బైక్ క్లచ్ వైర్‌ను వెనుక నుంచి రాము మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడే ఉన్న రాళ్లతో ముఖం ఛిద్రం చేశారు. పెనుగులాటలో అతని బూట్లు సమీప కంపచెట్లలో పడినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు ఉపయోగించిన సెల్‌ఫోన్ కూడా లభించలేదని సమాచారం. -
వివాహేతర సంబంధం... వేరే వాళ్ళతో మాట్లాడొద్దు
కర్నూలు: వివాహేతర సంబంధం మహిళ ప్రాణాలను బలిగొంది. ఈనెల 17న పట్టణంలో మారుతీనగర్‌లో చోటుచేసుకున్న మహిళ హత్యలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్లో సీఐ విజయభాస్కర్‌తో కలిసి డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. కొత్తపల్లి మండలం ఎర్రమఠం గ్రామానికి చెందిన గుర్రం రాములమ్మకు 20 ఏళ్ల క్రితం పగిడ్యాలకు చెందిన బాలయ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మనస్పర్థల కారణంగా ఎనిమిదేళ్ల క్రితం భర్తతో విడిపోయి మారుతీనగర్‌లో నివాసముంటూ ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో మాధవరం వెంకటేశ్వర్లుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో అతడు తరచూ మారుతీనగర్‌లోని ఆమె ఇంటికి వచ్చిపోయేవాడు. కాగా ఈ మధ్య కాలంలో అతని ప్రవర్తన నచ్చక ఇంటికి రానివ్వకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఈనెల 17న ఉదయం 10 గంటలకు ఇంట్లోకి వెళ్లి దుస్తుల దుకాణంలో పని మానేయాలని, వేరే వాళ్లతో మాట్లాడొద్దని వాడనకు దిగాడు. ఈక్రమంలో మాటామాటా పెరిగి వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి మెడలోని బంగారు గొలుసు తీసుకుని పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాధవరం వెంకటేశ్వర్లు తరచూ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడని స్థానికుల నుంచి సమాచారం తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన కత్తి, బంగారు గొలుసు, దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్ఐ ఎన్వీ రమణ, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్
తమిళనాడు: తంజావూరులో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు జిల్లా తిరుపనందాల్ పక్కనే ఉన్న కిల్మందూర్ పాత వీధికి చెందిన భారతి (35) చెందిన చైన్నెలోని ఓ హోటల్లో టీ మాస్టర్‌గా పనిచేశాడు. అతనికి భార్య దివ్య (27) ఉంది. అతను మే 16న కీలుమందూరుకు వచ్చిన భారతి తిరిగి చైన్నె వెళ్లలేదు. బంధువులు, స్నేహితులు 10 రోజులుగా పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. భారతి సోదరి భర్త సెల్వమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతని మొబైల్ ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టారు. అతని భార్య దివ్య అదే పట్టణంలోని ఆర్జే నగర్‌కు చెందిన సతీష్‌కుమార్ అలియాస్ డేవిడ్ (38)తో తరచూ మాట్లాడుతున్నట్టు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సతీష్‌కుమార్‌తో దివ్యకు వివాహేతర సంబంధం ఉందని, వారికి భారతి అడ్డుగా ఉండడంతో గొంతుకోసి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని పట్టం గ్రామంలోని నది వంతెనపై నుంచి పడేసినట్టు తేలింది. దీంతో దివ్య, డేవిడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. -
అడ్డుగా ఉన్నాడని బిడ్డను కడతేర్చిన తల్లి
తిరువళ్లూరు: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని రెండున్నరేళ్ల కొడుకును కడతేర్చిన తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి సమీపంలోని కొరుక్కంబాక్కం గ్రామానికి చెందిన సెల్వప్రకాష్‌కు భార్య లావణ్య, రెండున్నరేళ్ల కొడుకు సర్వేశ్వరన్ ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో ఇద్దరూ విడిపోయి వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం సర్వేశ్వరన్ ప్రమాదవశాత్తు కిందపడడంతో గాయపడి మృతిచెందినట్టు లావణ్య వైద్యశాలకు తీసుకొచ్చింది. అనంతరం మృతదేహాన్ని అదే ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించింది. కుమారుడి మృతికి సంబంధించిన సమాచారాన్ని భర్త సెల్వప్రకాష్‌కు చేరవేయలేదు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సెల్వప్రకాష్ తన కుమారుడిని చూడడానికి వెళ్లగా స్థానికుల ద్వారా బాలుడు మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు. తన కుమారుడి మృతిలో అనుమానం ఉన్నట్టు మాంగాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో హత్యగా నిర్ధారణ కావడంతో లావణ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో లావణ్యకు అదే ప్రాంతానికి చెందిన మణిగండన్‌తో వివాహేతర సంబంధం వున్నట్టు తేలింది. తమ సంబంధానికి అడ్డుగా వున్న సర్వేశ్వరన్‌ను ఇద్దరూ కలిసి హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. లావణ్యతో పాటు ఆమె ప్రియుడు మణిగండన్‌ను అరెస్టు చేశారు. -
తాడిపత్రిలో దారుణం.. నిద్రిస్తున్న వారిపై పెట్రోలు పోసి..
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న వారిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టారు.. ఈ ఘటనలో దంపతులతో పాటు మరో యువతి తీవ్రంగా గాయపడింది. మద్యం, వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పారిశ్రామిక వాడలోని శ్రీనిధి నల్ల బండల పాలిష్ పరిశ్రమలో నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి పరిశ్రమ ఆవరణలో మంచంపై నిద్రిస్తున్నారు. అదే ఫ్యాక్టరీలో పని చేసే మల్లికార్జున కుమార్తె పూజిత కూడా వీరి పక్కనే మంచం వేసుకుని నిద్రిస్తోంది. రాత్రి 11.30 గంటల సమయంలో సరస్వతి మరిది రామేశ్వర్‌రెడ్డి నిద్రిస్తున్న నల్లపురెడ్డి, సరస్వతిపై పెట్రోల్ పోశాడు. మెలకువ వచ్చిన సరస్వతి ఏం చేస్తున్నావురా అని అరిచేలోగానే నిప్పంటించాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే నిద్రిస్తున్న పూజితకు కూడా మంటలు అంటుకుని చేతులు కాలాయి. తాగుడుకు బానిసైన రామేశ్వర్‌రెడ్డిని రెండు రోజుల క్రితం తాము పద్ధతి మార్చుకోవాలని దండించామని, అది మనసులో ఉంచుకుని ఇలా చేశాడని నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు రూరల్ ఎస్ఐ గౌస్ మహ్మద్‌కు వివరించారు. వారి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసుకున్నారు. సరస్వతి, నల్లపురెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పూజితకు తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: బంజారాహిల్స్: మసాజ్ చేస్తూ గొలుసు కొట్టేశారు.. -
భార్య సూత్రధారి.. కొడుకు పాత్రధారి
బూర్గంపాడు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య, మాదక ద్రవ్యాలకు బానిసైన తనను నిత్యం వేధిస్తున్నాడని కొడుకు.. ఇద్దరూ పక్కాగా ప్లాన్ వేసి దారుణానికి పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో నాలుగు రోజుల క్రితం సయ్యద్ రఫీ(38) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చేపట్టిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పాల్వంచ సీఐ నాగరాజు, బూర్గంపాడు ఎస్సై సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం.. సారపాక మసీద్రోడ్లో నివాసముంటున్న సయ్యద్ రఫీ అలియాస్ జాఫర్ ఈనెల 10న తెల్లవారుజామున ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు క్లూస్ టీమ్, పోలీసు జాగిలాల సాయంతో చేపట్టిన విచారణలో హత్యకు సంబంధించి కొన్ని క్లూస్ కనుగొన్నారు. రఫీ హత్యకు అతని కుమారుడు(15) కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు రఫీ భార్య జీనత్ ఫర్వీన్ పై కూడా పోలీసులు నిఘా పెట్టారు. విచారణలో రఫీ కుమారుడు వెల్లడించిన వివరాలతో జీనత్‌ను కూడా విచారణ చేశారు. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండటంతో అతనిని వదిలించుకునేందుకు పథకం ప్రకారమే హత్యకు పాల్పడినట్లు ఆమె అంగీకరించింది. మాదక ద్రవ్యాలకు అలవాటైన కొడుకును ఈ హత్యకు ఉసిగొల్పింది. కాళ్లను తల్లి పట్టుకోగా.. కొడుకు తండ్రి తలపై సుత్తితో బలంగా కొట్టి.. రఫీ భార్య జీనత్ ఫర్వీన్‌కు బూర్గంపాడు మండలం నకిరిపేటకు చెందిన కొర్ర జంపన్నతో ఆరు నెలల క్రితం పరిచయమైంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని రఫీ గమనించి భార్యపై అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. రఫీని వదిలించుకుంటే తమకు అడ్డుండదని జంపన్న జీనత్‌కు సలహా ఇచ్చాడు. ఇందుకోసం మూడునెలల క్రితమే పథకం వేశారు. జంపన్న తీసుకొచ్చిన మత్తుమాత్రలను జ్యూస్‌లో కలిపి ఇచ్చారు. అయితే రఫీకి మత్తు ఎక్కకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. కాగా, ఈ నెల 9న డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన రఫీ.. గంజాయి మత్తులో ఉన్న కొడుకును తిట్టాడు. అందుకు అడ్డుపడిన భార్యతో పాటు కుమారుడిని కూడా రెండు దెబ్బలు కొట్టాడు. దీంతో ఆ రాత్రే రఫీని చంపాలని భార్య, కొడుకు పథకం వేశారు. గాఢ నిద్రలో ఉన్న రఫీ కాళ్లను జీనత్ గట్టిగా పట్టుకోగా, కొడుకు పెద్దసుత్తితో కొట్టి తలమొత్తం ఛిద్రం చేశాడు. దీంతో రఫీ అక్కడికక్కడే మృతిచెందాడు. హత్యకు ఉపయోగించిన సుత్తి, రక్తపు మరకలున్న బట్టలను నిందితుడు మోతె గ్రామ సమీపంలో దాచిపెట్టాడు. పోలీసు జాగిలాలు సుత్తిని, దుస్తులను గుర్తించాయి. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
తూర్పు గోదావరి: యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే అతడి హత్యకు దారి తీసిందని నిర్ధారించారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. కోరుకొండ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్సై కట్టా శారదా సతీష్‌తో కలిసి సీఐ ఉమామహేశ్వరరావు ఈ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. హతుడు ముప్పిడిశెట్టి శ్రీను (34) స్వగ్రామం కోరుకొండ మండలం గాడాల. అతడు కోరుకొండలోని వెంకటగిరి లైటింగ్స్ అండ్ డెకరేటర్స్ సప్లై కంపెనీ యజమాని వెంకటగిరికి అల్లుడు. సప్లై కంపెనీ వ్యవహారాలను శ్రీనే చూసుకుంటున్నాడు. ఈ నెల 4వ తేదీ రాత్రి పశ్చిమ గోనగూడెం రోడ్డులోని ఎస్ఆర్ నగర్లో ఉన్న సప్లై కంపెనీ గోడౌన్ వద్ద గుర్తు తెలియని దుండగులు అతడి కళ్లల్లో కారం చల్లి, పొట్టలో కత్తులతో పొడిచి, పరారయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే శ్రీను మృతి చెందాడు. దీనిపై అతడి మామ వెంకటగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మూడు నెలలుగా రెక్కీ కర్నూలు జిల్లా దేవనకొండ గ్రామానికి చెందిన సబ్బు నాగార్జునరెడ్డి అలియాస్ అర్జున్‌రెడ్డి అలియాస్ అర్జున్ అలియాస్ నాగు కోరుకొండలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. ప్రస్తుతం రాజానగరంలో నివాసం ఉంటున్నాడు. నాగార్జునరెడ్డితో పాటు ముప్పిడిశెట్టి శ్రీనుకు కోరుకొండ గ్రామానికి చెందిన వివాహిత కాళ్ల నాగలక్ష్మితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో నాగార్జునరెడ్డితో వ్యవహారాన్ని బయట పెడతానంటూ శ్రీను ఆమెను హెచ్చరించాడు. దీంతో విషయం తన భర్తకు తెలుస్తుందని నాగలక్ష్మి భయపడింది. ఈ విషయాన్ని తన స్నేహితురాలు, కోరుకొండకు చెందిన ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకురాలు ముత్యాల పద్మావతికి చెప్పింది. శ్రీనును హతమారిస్తే తప్ప ఈ సమస్య నుంచి బయట పడలేమని భావించిన వీరిద్దరూ ఈ విషయాన్ని నాగార్జునరెడ్డికి చెప్పారు. దీంతో శ్రీను హత్యకు నాగార్జునరెడ్డి, అతడి మిత్రులు గొడ్డు దిలీప్ (రాజానగరం), చొప్పెల్ల వెంకటేశ్ (రాజానగరం), సయ్యద్ అహ్మద్ (రాజానగరం), ఇంజమూరి రాజేంద్రప్రసాద్ (అనంతపురం జిల్లా గుత్తి – ప్రస్తుతం రాజానగరంలో ఉంటున్నాడు), కొవ్వాడ విజయ్‌కృష్ణ (గుమ్ములూరు, కోరుకొండ మండలం) పథక రచన చేశారు. ఈ నేపథ్యంలో అమెజాన్ నుంచి ఆన్లైన్లో కత్తి తీసుకున్నారు. మూడు నెలలుగా అదను కోసం వేచి చూస్తున్నారు. రెక్కీ నిర్వహించారు. వెంబడించి.. హతమార్చి.. గ్రామ దేవత అంకాలమ్మ జాతర సందర్భంగా శ్రీను గత ఆదివారం రాత్రి పశ్చిమ గోనగూడెం రోడ్డులోని సప్లై కంపెనీ గోడౌన్‌కు ఒంటరిగా వెళ్తూ కనిపించాడు. అతడిని నాగార్జునరెడ్డి, గొడ్డు దిలీప్ మోటార్ సైకిల్‌పై వెంబడించారు. గోడౌన్ తలుపు కొట్టి, బయటకు వస్తున్న శ్రీను కళ్లల్లో కారం జల్లారు. నాగార్జునరెడ్డి, వెంకటేశ్‌లు శ్రీను చేతులు పట్టుకోగా దిలీప్ కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం నిందితులు పరారయ్యారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హతుడు శ్రీను గురించి ఆరా తీశారు. దీంతో వివాహేతర సంబంధం విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ తీగ లాగితే మొత్తం డొంకంతా కదిలింది. నిందితుల సెల్ఫోన్ల కాల్‌డేటా, సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా నిందితులు నాగార్జునరెడ్డి, దిలీప్, వెంకటేశ్, సయ్యద్ అహ్మద్, ఇంజమూరి రాజేంద్రప్రసాద్‌లను రాజానగరంలో అరెస్టు చేశారు. అలాగే కోరుకొండలో నాగలక్ష్మిని, పద్మావతిని, గుమ్ములూరులో కొవ్వాడ విజయ్‌కృష్ణను అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రెండు మోటార్ సైకిళ్లు, ఒక కారు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి సూచనల మేరకు, డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్సై కట్టా శారదా సతీష్, తన సిబ్బందితో వివిధ బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి, ఈ కేసు మిస్టరీని ఛేదించారు. సాంకేతిక నిపుణుల సహాయం తీసుకున్నారు. వీరిని ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులు అభినందించారు. -
HYD: వివాహేతర సంబంధం.. మహిళను హత్య చేసి..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ పరిధిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను ఓ పూజారి హత్య చేశాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పూజారి సాయికృష్ణ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇది వరకే అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు కాగా, అప్సర అనే మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. సరూర్ నగర్ నుంచి మహిళను కారులో ఎక్కించుకొని వచ్చిన సాయికృష్ణ.. శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోదీ హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కవర్లో కట్టి కారులో తీసుకెళ్లి మ్యాన్ హోల్లో పడేశాడు. ఆ తర్వాత ఏమి ఎరగనట్లు మహిళ కనిపించడం లేదని ఆర్జీఐ ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు పోలీసులు బయటపెట్టారు. నిందుతుడికి ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉందని, ఈనెల 3 తేదీన హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: హైదరాబాద్ యువతి హత్య కేసు.. అపార్ట్మెంట్లో ఆ రోజు ఏం జరిగింది? -
భర్తను వదిలేసి ఇద్దరిలతో ‘సంబంధం’.. రెండో ప్రియుడి మోజులో పడి.. మొదటి వాడిని!
హైదరాబాద్: పది రోజుల క్రితం వ్యక్తిని దారుణంగా హతమార్చి డ్రమ్ములో కుక్కి చెరువులో పడేసిన ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పహాడీషరీఫ్ పోలీసులు నిర్ధారించారు. రెండో ప్రియుడి మోజులో పడిన మహిళ అతనితో కలిసి మొదటి ప్రియుడిని హత్య చేసింది. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేశ్వరం ఏసీపీ సి.అంజయ్య, ఇన్స్పెక్టర్ ఎం.కాశీ విశ్వనాథ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పూరన్‌సింగ్ అలియాస్ దీపక్(30)కి వివాహానికి ముందే బంధువైన జయాదేవితో ప్రేమాయణం కొనసాగింది. అనివార్య కారణాలతో ఇద్దరూ వేర్వేరు సంబంధాలు చేసుకోవాల్సి వచ్చింది. వివాహానంతరం భార్య మమతతో కలిసి పూరన్‌సింగ్ చాంద్రాయణగుట్ట బండ్లగూడకు వలస వచ్చాడు. లాక్డౌన్ సమయంలో జయాదేవి తన భర్త, పిల్లలను వదిలేసి కాటేదాన్‌కు వచ్చింది. పూరన్‌సింగ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలోనే ఇంటి సమీపంలోనే ఉంటున్న హర్యానాకు చెందిన నజీం(31)తో కూడా వివాహేతర సంబంధాన్ని నెరపసాగింది. తుక్కుగూడలో వేరుగా గది తీసుకుని అతడితో సహజీవనం సాగించింది. పూరన్‌కు అనుమానం వచ్చిందని గ్రహించిన వారు ఎలాగైనా అత డిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. పథకంలో భాగంగా.. ముందస్తు పథకంలో భాగంగా జయాదేవి, నజీం కామన్ ఫ్రెండ్‌గా ఉన్న రాజేంద్రనగర్‌లో నివసించే తమిళనాడుకు చెందిన సుగుణా రాము(42)తో ఈ నెల 22న రాత్రి పూరన్‌సింగ్‌కు ఫోన్ చేయించి బాకీగా ఉన్న రూ.10 వేలు ఇస్తానంటూ తుక్కుగూడకు పిలిపించారు. నమ్మి వెళ్లిన పూరన్‌సింగ్‌ను నజీం, అతని స్నేహితుడు మబీన్, జయాదేవి, అసద్‌తో కలి సి దారుణంగా కత్తితో దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి జేసీబీ ముందుండే పారలో వేసుకొని సమీపంలోని సూరం చెరువులో పడేసి పరారయ్యారు. పోలీసులు నజీం, సుగుణా రామును అరెస్ట్ చేయగా..మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు. -
మేనమామ కుమారుడుతో వివాహేతర సంబంధం.. భర్తను చంపిన భార్య
కర్ణాటక: ప్రియుడితో కలిసి ఓ భార్య తన భర్తను హత్య చేయించిన ఘటన సోమవారం రాత్రి తాలూకాలోని జన్నగట్ట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు..జానపద కళాకారుడు జన్నఘట్ట కృష్ణమూర్తి(50) హత్యకు గురైన వ్యక్తి. ఘటనకు సంబంధించి కోలారు రూరల్ పోలీసులు కృష్ణమూర్తి భార్య సౌమ్య, ప్రియుడు శ్రీధర్, హత్యకు సహకరించిన మరో వ్యక్తి శ్రీధర్‌ను అరెస్టు చేశారు. తాలూకాలోని జన్నఘట్ట రైల్వే బ్రిడ్జి వద్ద జానపద కళాకారుడు జన్నఘట్ట కృష్ణమూర్తి ద్విచక్రవాహన రోడ్డు ప్రమాదంలో మరణించాడనే వార్తలు వెలువడ్డాయి. అయితే కృష్ణమూర్తి తలకు తగిలిన గాయాలపై పలు అనుమానాలు రేకెత్తాయి. పోలీసు విచారణలో గుట్టురట్టు అనంతరం పోలీసుల విచారణలో భార్య సౌమ్యే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన విషయం వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్లుగా కృష్ణమూర్తి కుటుంబంలో కలహాలు నెలకొన్నాయి. సౌమ్య తన మేనమామ కుమారుడు శ్రీధర్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో భర్త జన్నఘట్ట కృష్ణమూర్తి, సౌమ్యల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. పలుమార్లు పెద్దలు న్యాయ పంచాయతీ కూడా చేసినట్లు తెలిసింది. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు కొనసాగుతుండడంతో సౌమ్య భర్త కృష్ణమూర్తిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. పక్కా ప్రణాళికతో హత్య ప్రియుడితో కలిసి ప్రణాళికను సిద్ధం చేసి సోమవారం రాత్రి 8 గంటల సమయంలో జన్నఘట్ట రైల్వే బ్రిడ్జి వద్ద ద్విచక్రవాహనంలో వస్తున్న కృష్ణమూర్తిని డ్రాప్ అడిగే నెపంతో బైక్‌ను ఆపి సౌమ్య ప్రియుడు శ్రీధర్, అతని స్నేహితుడు శ్రీధర్ ఇనుప రాడ్‌తో దాడి చేసి తల వెనుక భాగాన గట్టిగా కొట్టడంతో కృష్ణమూర్తి రక్తగాయంతో అక్కడికక్కడే మరణించాడు. అనంతరం భార్య సౌమ్య దీనిని ద్విచక్రవాహన ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయట పడింది. రూరల్ పోలీసులు సౌమ్య, ప్రియుడు శ్రీధర్, హత్యకు సహకరించిన మరో వ్యక్తి శ్రీధర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకున్నారు. కృష్ణమూర్తి, సౌమ్య దంపతులకు ముగ్గురు పిల్లలు ఉండగా, వారు ప్రస్తుతం అనాథలయ్యారు. -
వివాహేతర సంబంధమే ప్రాణం తీసిందా?
హయత్‌నగర్: అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ యువకుడి మృతదేహం సోమవారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. యువకుడిని ఎవరైనా హత్య చేశారా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూర్‌లోని డాక్టర్స్ కాలనీ వెంచర్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం వద్ద లబించిన సెల్‌ఫోన్ ఆధారంగా అతని స్నేహితుడు చైతన్యపురికి చెందిన సాయి ప్రకాష్‌ను పిలిపించి చూపించగా.. మృతదేహం తన స్నేహితుడు అల్లెవుల రాజేష్(24)దిగా గుర్తించాడు. ఘటనా స్థలాన్ని ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు పరిశీలించి ఆధారాలు సేకరించారు. రాజేష్ నాలుగు రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్యచేసి ఇక్కడ మృతదేహాన్ని ఇక్కడ పడేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. రాజేష్‌కు ఓ ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆమె కుటుంబ సభ్యులు రాజేష్‌ను మందలించినట్లు తెలిసింది. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పోలీసులు అతని స్నేహితులను పిలిపించి విచారిస్తున్నారు. హాస్టల్ సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నాడు.. ములుగు జిల్లా పంచాక్తులపల్లికి చెందిన అల్లెవుల పరశురాం కుమారుడు రాజేష్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని శ్రీ హిందూ కళాశాలలో ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. పైచదువల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలనే ఉద్దేశంతో గత మార్చి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ.. దానికి సంబంధించిన పత్రాలను సమకూర్చుకునే పనిలో ఉన్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు చెప్పారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వెళతానని చెప్పిన రాజేష్ ఇలా శవమై కనిపించాడని వారు భోరున విలపించారు. ఇటీవలే నా వద్దకు వచ్చి వెళ్లాడు.. రాజేష్ ఇటీవల రెండు రోజులు తన దగ్గర ఉండి వెళ్లాడని స్నేహితుడు సాయిప్రకాష్ చెబుతున్నాడు. అనంతరం ఈ నెల 22న ఇబ్రహీంపట్నం వెళ్లాడని, మరునాడు ఇంటికి వెళతున్నాను డబ్బులు వేయమంటె వేశానని సాయిప్రకాష్ చెప్పాడు. ఈ నెల 26న ఫోన్ చేస్తే రింగయ్యింది కానీ లిఫ్ట్ చేయలేదని 27న ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చిందని తెలిపాడు. -
మహిళతో వివాహేతర సంబంధం.. ఆమె కూతురుపై పలుమార్లు..
కొల్చారం(నర్సాపూర్): మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారు హనుమాన్ మండల్ మంజీరా నదిలో ఈనెల 25వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం విదితమే. అయితే ఎస్పీ ఆదేశాల మేరకు హత్య కోణంలో ఎస్ఐ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం 36 గంటల్లోనే కేసును ఛేదించింది. హత్యకు సంబంధించి శనివారం మెదక్ డీఎస్పీ సైదులు పూర్తి వివరాలు వెల్లడించారు. లభ్యమైన వ్యక్తి మృతదేహంపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా పటాన్చెరు మండలం బీడీఎల్ భానుర్ పోలీస్‌స్టేషన్‌లో అవే ఆనవాళ్లతో మిస్సింగ్ కేసు నమోదైనట్టు తెలిపారు. హత్యకు గురైన వ్యక్తి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి ఘనపూర్‌కు చెందిన కావలి రాములు (35)గా గుర్తించామన్నారు. రాములు నందిగామకు చెందిన మ్యాదరి వీరమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు చెప్పారు. మృతుడి కుటుంబీకుల అనుమానంతో ఆమెను విచారించగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయన్నారు. వీరమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న రాములు, ఆమె కూతురు మైనర్‌పై కన్ను వేసినట్టు వివరించారు. తన కూతురుపై రాములు పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించడంతో వీరమణి రాములును దూరం పెట్టింది. అయినా అతడి వేధింపులు మాత్రం ఆగలేదన్నారు. ఈ విషయాన్ని ఆమె బంధువులకు చెప్పి హత్యకు పథకం వేసిందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 17న మెదక్‌లోని బంధువులకు ఇంటికి వచ్చిన వీరమణి పథకం ప్రకారం రాములును తన వద్దకు రావాలని సమాచారం అందించింది. అప్పటికే బంధువులు, స్నేహితులైన కౌడిపల్లికి చెందిన మ్యాదరి నర్సింలు, వీర్‌సింగ్, పట్నం మహేశ్, మహ్మద్ ఆరీఫ్, మెదక్ పట్టణం ఫతేనగర్‌కు చెందిన మ్యాదరి అనిరుధ్, స్వప్నల సహకారంతో రాములును అనిరుధ్ ఇంటికి తీసుకువచ్చి అందరూ కలిసి అప్పటికే సిద్ధం చేసుకున్న ఇనుపరాడుతో తలపై కొట్టి చంపేశారన్నారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి ఆటోలో మెదక్ నుంచి కొల్చారం మండల పరిధిలోని హనుమాన్ బండల్ నది సమీపంలో పడేసినట్టు తెలిపారు. హత్యకు కారణమైన ఏడుగురిని అదుపులోకి తీసుకొని.. వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుపరాడు, ఆటోను స్వాధీనం చేసుకొని సీజ్ చేశామన్నారు. నిందితులను రిమాండ్‌కు పంపినట్టు డీఎస్పీ వివరించారు. హత్య కేసును 36 గంటల్లో ఛేదించిన కొల్చారం పోలీసులను అభినందించడంతో పాటు ఎస్పీ ద్వారా రివార్డు అందజేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సమావేశంలో మెదక్ రూరల్ సీఐ విజయ్, సిబ్బంది పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం: భార్యపై వేడి సాంబార్ పోసిన భర్త
తిరువొత్తియూరు: విల్లుపురం సమీపంలోని తిరువెన్నె నల్లూరులో వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భార్యపై భర్త వేడి సాంబార్ పోశాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. విల్లుపురం జిల్లా తిరువైన్నె నల్లూరు సమీపంలోని తడుతొట్ట కొండూరు గ్రామానికి చెందిన ఆరోగ్యస్వామి (40) ప్రొక్లైన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా డు. ఇతనికి కడలూరు జిల్లాకు చెందిన పెరియనాయకి(30)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతనికి ఆరోగ్యసామికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిపై భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో శుక్రవారం వంట చేస్తున్నప్పుడు, భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఆగ్రహించిన ఆరోగ్యసామి వేడి సాంబార్‌ను పెరియనాయకిపై పోశాడు. తీవ్రంగా గాయపడిన పెరియనాయకిని ఇరుగుపొరుగు వారు అంబులెన్స్‌లో ముండియంబాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరువెన్నెనల్లూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం: నన్ను కాదని మరొకరితో సంబంధం
మహబూబ్‌నగర్: తాను అన్ని విధాలా చూసుకుంటున్నా తనను కాదని ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటుందన్న కోపంతో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకొన్నాడని జడ్చర్ల రూరల్ సీఐ జమ్ములప్ప తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మంగళవారం రాజాపూర్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. మండలంలోని పెద్దరేవల్లికి చెందిన మంజులకు మల్లేపల్లికి రాచమల్ల యాదయ్యతో వివాహమైంది. అయితే గతంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్తలు రావడంతో మంజుల తన తల్లిగారి గ్రామమైన పెద్దరేవల్లిలో ఇల్లు కట్టుకుని తన కొడుకు శ్రీశైలంతో కలిసి జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన యాట చెన్నయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ మధ్యకాలంలో మంజుల ఇతరులతో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటుందని అనుమానించిన చెన్నయ్య ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు మంజుల చెన్నయ్యకు ఫోన్ చేసి తనను బాలానగర్‌కు తీసుకెళ్లాలని కోరింది. ఇదే అదునుగా భావించి చెన్నయ్య బైక్‌పై మంజులను ఎక్కించుకుని బాలానగర్‌కు తీసుకువెళ్లి షాపింగ్ చేసిన అనంతరం ఊరుబయటికి వెళ్లి కల్లు తాగుదామని నమ్మంచి అగ్రహారంపొట్లపల్లి శివారులో పెరుమాళ్లగుండు సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగిన తర్వాత ముందస్తు ప్లాన్ ప్రకారం రాళ్లతో తలపై కొట్టి చంపాడు. ఈ మేరకు మంగళవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ జమ్ములప్ప తెలిపారు. సమావేశంలో రాజాపూర్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళతో వివాహేతర సంబంధం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో
జనగాం: వివాహేతర బంధం కొనసాగిస్తూ, వివాహితను పెళ్లి చేసుకుంటానంటే, తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో గార్లకు చెందిన బాణాల వెంకటేశ్(25) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గార్లలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం బజార్‌కు చెందిన వెంకటేశ్ తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఈక్రమంలో కొంతకాలంగా అదే బజారుకు చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఈక్రమంలో వెంకటేశ్ ఆమెనే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన వెంకటేశ్ ఇంట్లో ఎవరూ లేని సమయంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఇంటికి పెద్ద కొడుకువు.. మమ్ముల్ని సాకుతావని ఆశలు పెట్టుకుంటిమి కదరా కొడుకా.. గింతపని చేస్తవనుకోలేదు కొడుకా’ అంటూ తల్లితండ్రులు రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి శ్రీనివాసాచారి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసుకున్నట్లు గార్ల ఎస్సై బానోత్ వెంకన్న తెలిపారు. -
చిన్నాతో వివాహేతర సంబంధం.. భర్తపై పెట్రోల్ పోసి చంపిన భార్య
జగద్గిరిగుట్ట: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా, మట్టం గ్రామానికి చెందిన జయకృష్ణ(36), దుర్గా భవానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు నగరానికి వలసవచ్చి జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆల్విన్‌కాలనీ కమలాప్రసన్న నగర్లో నివాసం ఉంటున్నారు. జయకృష్ణ జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. అయితే దుర్గా భవానీ గత కొన్నేళ్లుగా జయకృష్ణ స్నేహితుడు చందానగర్‌కు చెందిన చిన్నాతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో 25 రోజుల క్రితం సొంత ఊరుకు వెళ్లిన జయకృష్ణ అక్కడే స్థిర పడాలని నిర్ణయించుకుని ఈ నెల 10న ఇంటిని ఖాళీ చేసి కుటుంబాన్ని తీసుకువెళ్లేందుకు నగరానికి వచ్చాడు. అయితే ఇది ఇష్టం లేని దుర్గాభవానీ ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని భావించి ప్రియుడు చిన్నాతో పథకం పన్నింది. ఇందులో భాగంగా జయకృష్ణకు ఫుల్లుగా మద్యం తాగించిన అనంతరం అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు చుట్టు పక్కల వాళ్లను నమ్మించారు. మృతుడి తండ్రి తిరుమణి వడ్డికాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుర్గాభవానీ, చిన్నాలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించారు. నిందితులపై కేసు నమోదు చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.